Karnataka News
-
ప్రజ్వల్ కేసు కొట్టివేతకు నో
యశవంతపుర: జేడీఎస్ నేత, హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు నిరాశే ఎదురైంది. మహిళపై అత్యాచారం, నగ్న వీడియోల కేసులో అతడు కొన్ని నెలలుగా పరప్పన అగ్రహార కేంద్ర జైలులో ఖైదులో ఉండడం తెలిసిందే. అత్యాచారం కేసును కొట్టివేయాలని ప్రజ్వల్ దాఖలు చేసిన పిటిషన్‌ను బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. గురువారం పిటిషన్‌పై వాదనలు జరిగాయి. కేసు నుంచి విముక్తి కలిగించడం సాధ్యం కాదంటూ ఈ నెల 9కి వాయిదా వేశారు. ఈ కేసుల్లో గతేడాది మే నెలాఖరులో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి విచారణ సాగుతోంది. అర్ధరాత్రి ఘోరం.. యువతిపై అత్యాచారం కృష్ణరాజపురం: యువతిపై ఇద్దరు ఆటోడ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాలు.. బెంగళూరులోని కృష్ణరాజపురం రైల్వే స్టేషన్ సమీపంలో బిహార్‌కు చెందిన యువతి తన సోదరునితో కలిసి కేఆర్‌పురం రైల్వేస్టేషన్లో దిగి నడిచి వెళుతుండగా ఇద్దరు ఆటోడ్రైవర్లు నిర్జన ప్రదేశానికి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. యువతి సోదరునిపై దాడి చేశారు. బుధవారం అర్ధరాత్రి 1.13 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. యువతి కేకలను విని అక్కడికి చేరుకున్న జనం ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణ జరిపి నిందితుడు ఆసిఫ్‌ను, మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వ్యాన్ పల్టీ,13 మంది కూలీలకు గాయాలు మైసూరు: వేగంగా వెళుతున్న గూడ్స్ వ్యాన్ పల్టీలు కొట్టిన ప్రమాదంలో 13 మంది కూలీలు గాయపడ్డారు. జిల్లాలోని హుణసూరు తాలూకాలోని సంజీవనగర వద్ద చోటుచేసుకుంది. హుణసూరుకు చెందిన కూలీలు పొలంలో పనిచేసుకుని గూడ్స్ వ్యాన్‌లో వస్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో బోల్తా పడింది. దీంతో చిక్కన్న, పార్థ, కుముద, మంజుల, పార్వతి, చిన్న ముత్తమ్మ, తరికల్ వళ్ళియమ్మ, రాణి, మహదేవమ్మ, మంగళ తదితరు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఐదుమందిని హుణసూరు కావేరి ఆస్పత్రిలో ఐసీయూలో చేర్చారు. మిగతావారు మైసూరు కెఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంట్లోకి దూరిన చిరుత● గొళ్లెం వేసిన దంపతులు ● జిగణిలో కలకలం దొడ్డబళ్లాపురం: ఓ చిరుతపులి ఏకంగా ఇంట్లోకి దూరి హల్చల్ చేసింది. ఈ సంఘట బెంగళూరు శివార్లలో ఆనేకల్ తాలూకా జిగణిలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం 8 గంటలప్పుడు వెంకటేశ్ దంపతులు వ్యక్తి ఇంట్లో ఉండగా ఓ చిరుత ప్రవేశించింది. అయితే ఏ మాత్రం బెదరని దంపతులు మెల్లగా లేచి బయటకు వచ్చి తలుపులు గడియ పెట్టేశారు. దీంతో చిరుత లోపల బందీ అయ్యింది. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు చేరుకున్నారు. చిరుత ఇంట్లోకి దూరిందని తెలిసి వందలాది మంది జనం గుమిగూడి ఏం జరుగుతుందా? అని చూడసాగారు. అటవీ సిబ్బంది సుమారు 6గంటల పాటు శ్రమించి చిరుతకు మత్తుమందు ఇచ్చి బోనులో బంధించారు. -
రంగస్థల కళాకారులకు సన్మానం
బళ్లారిటౌన్: నాడోజ బెళగల్ ఈరణ్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా గురువారం సీనియర్ రంగస్థల కళాకారులను సన్మానించారు. సంగనకల్లు గ్రామంలోని ఆదర్శ వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా బెళగల్ ఈరణ్ణ కుమారుడు మల్లికార్జున నేతృత్వంలో కళాకారుల బృందం నగరంలోని సీనియర్ కళాకారిణులు సుజాతమ్మ, కణేకల్ రంగమ్మ, కళాకారుడు చెన్నబసప్పల ఇళ్లకు వెళ్లి సన్మానించారు. సీనియర్ కళాకారులు హెచ్ఎన్ చంద్రశేఖర్, మోకా రామేశ్వర్, కే.జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతల స్వీకారంహొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె తాలూకా నూతన ఇన్చార్జి బీఈఓగా శేఖర్ హొరపేటె గురువారం అధికార బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు బీఈఓగా ఉన్న చిన్నబసప్ప రిటైర్డ్ కావడంతో ఆయన స్థానంలో ఇన్చార్జి బీఈఓగా శేఖర్ హొరపేటెను నియమిస్తూ జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. నూతన అధికారిని ఉపాధ్యాయ సంఘం నేతలు సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు సుధాదేవి, కార్యదర్శి మల్లయ్య, వరప్రసాద్, విజయకుమారి, కుబేరాచారి, మార్గదప్ప, ప్రకాష్, హేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ తీగ తెగి పడి ఉపాధ్యాయిని మృతిహొసపేటె: స్కూల్‌కి వెళ్తుండగా విద్యుత్ తీగ తెగి మీద పడటంతో పాఠశాల ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని జంగమర కల్గుడిలో పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తెగి ఆమైపె పడటంతో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందింది. మరణించిన ఉపాధ్యాయురాలిని జంగమర కల్గుడి గ్రామం హొసకేర రోడ్డుకు చెందిన హరిత శ్రీనివాస్(26)గా గుర్తించారు. ఆమె విద్యానగర్‌లోని శ్రీగొట్టిపాటి వెంకటరత్నం మెమోరియల్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి పనులకు భూమిపూజ రాయచూరు రూరల్: నగరాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం దేవదుర్గలో బాబూ జగ్జీవన్ రాం భవనంలో మౌలిక సౌకర్యాలకు రూ.52 లక్షలతో రక్షణ గోడ, మరుగుదొడ్డి, స్నానపు గదుల నిర్మాణ పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. జగీజవన్రాం భవన్‌ను సుందరంగా తీర్చిదిద్దడానికి పాటు పడతామన్నారు. ఈ సందర్భంగా జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్, అజీజ్, అస్లాంపాషా, సత్యనాథ్లున్నారు. పేదల స్థలం కబ్జాపై చర్యలేవీ? బళ్లారి అర్బన్: బళ్లారి గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 32వ వార్డు బండిహట్టిలో పురాతన దళితుల బావిని, చుట్టు పక్కల స్థలాన్ని అక్రమంగా కబ్జాకు పాల్పడిన వారి నుంచి ఆ స్థలాన్ని రక్షించాలని కోరుతూ బండిహట్టి నుంచి జిల్లాధికారి కార్యాలయం వరకు కర్ణాటక ఏకీకరణ రక్షణ సేన సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పీ.శేఖర్ నేతృత్వంలో భారీ ఆందోళన ర్యాలీ చేపట్టారు. ఆ సంఘం జిల్లాధ్యక్షుడు కృష్ణ వాల్మీకి, మహిళా జిల్లాధ్యక్షురాలు లక్ష్మిదేవి, పద్మావతి, ఆ వార్డు శాఖ పదాధికారులు పేదలకు అండగా పాదయాత్రతో అదనపు జిల్లాధికారికి వినతిపత్రం అందజేసి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సంఘం ప్రముఖురాలు రోహిణి, ఈరమ్మ, మల్లికార్జున, రమేష్, బసవరాజ్, నీలప్ప, విరుపాక్షిరెడ్డి, గోవింద, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్లు లేని ఊళ్లు, రోగమొస్తే దిగులు
మైసూరు: దేశం ఇప్పటికే అంతరిక్ష రంగంలో ఎన్నో విజయాలు సాధిస్తోంది. డిజిటల్ రంగంలో రాణిస్తోంది, కానీ మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజలు ఇంకా ఎలాంటి సౌకర్యాలు లేకుండా బతుకీడుస్తున్నారు. దీనికి ఉదాహరణే చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలేమహదేశ్వర బెట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని తుళసికెరె గ్రామం. ఈ గ్రామానికి సరైన రోడ్డు నిర్మాణ వ్యవస్థ లేకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని కట్టెకు మూటలో కట్టుకుని సమీపంలోని ఆస్పత్రికి చికిత్స కోసం 4 కిలోమీటర్లు మోసుకెళ్లారు. ఏమైందంటే... గ్రామ నివాసి పుట్ట అనే వ్యక్తికి వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఉన్నాడు. గ్రామానికి రోడ్డు లేనందున ఆటో, అంబులెన్సు రాలేవు. దీంతో బంధువుల సహాయంతో డోలిలో మలే మహదేశ్వర బెట్టకు తీసుకొచ్చి అక్కడి నుంచి దగ్గరలో ఉండే తమిళనాడు కొళత్తూరు ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. బెట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని చాలా గ్రామాలకు సరైన రోడ్డు వ్యవస్థ, మౌలిక వసతులు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు ఆయా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా కూడా మలే మహదేశ్వరబెట్ట , తుళసికెరె గ్రామం మధ్యలో ధర్నా చేశారు. డోలిలో 4 కిలోమీటర్లు మోసుకెళ్లారు చామరాజనగర జిల్లాలో దైన్యం -
సీఎం ఇంటి ముట్టడి భగ్నం
శివాజీనగర: నిత్యావసరాల ధరల పెంపును వ్యతిరేకిస్తూ బుధవారం బెంగళూరు ఫ్రీడం పార్కులో అహోరాత్రి ధర్నా చేసిన బీజేపీ నాయకులు గురువారం సీఎం సిద్దరామయ్య అధికార నివాసం కావేరికి ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు బారికేడ్లతో అడ్డుకోగా గందరగోళం చెలరేగింది. మధ్యాహ్నం ధర్నాలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు కావేరి ఇంటికి బయల్దేరారు. అక్కడే పోలీసులు అడ్డుకున్నారు. బ్యారికేడ్లను తోసి ముఖ్యమంత్రి ఇంటి వైపు వెళ్లబోయారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, ప్రతిపక్ష నాయకులు ఆర్.అశోక్, చలవాది నారాయణస్వామితో పాటుగా పలువురు ఎమ్మెల్యేలను పోలీసులు వ్యాన్‌లోకి ఎక్కించారు. గుణపాఠం తప్పదు అంతకుముందు విజయేంద్ర విలేకరులతో మాట్లాడుతూ అహోరాత్రి ధర్నా కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల ముందుకు తీసుకెళతామన్నారు. ఈ ప్రభుత్వానికి పేదలపై శ్రద్ధ లేదని, నిత్యావసర వస్తువుల ధరలతో పాటు విద్యుత్, బస్సు, డీజిల్ ధరలను పెంచిందని ఆరోపించారు. 40 శాతం కమీషన్ల గురించి కాంగ్రెస్ చేసిన ప్రచారానికి సాక్ష్యాలు లేవని రుజువైందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. వక్ఫ్ బోర్డు పేరు చెప్పుకొని పలువురు నాయకులు ఆస్తులను కబ్జా చేశారని, అందుకే వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. కాగా పోలీసులు సీనియర్ నాయకులను వాహనాల్లో తరలించి తరువాత విడుదల చేశారు. బీజేపీ నేతల ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు -
కారు, బస్సు ఢీ.. నలుగురు బలి
మండ్య: బంధువు చనిపోవడంతో అంత్యక్రియలకు వెళుతున్న కుటుంబం కూడా విషాదంలో చిక్కుకుంది. కారును బస్సు ఢీకొనడంతో నలుగురు మరణించారు. మృతులు రెండు జంటలు. ఈ సంఘటన గురువారం బెంగళూరు– మైసూరు ఎక్స్‌ప్రెస్ హై వేలో మండ్య తాలూకాలోని తూబినకెరె వద్ద చోటు చేసుకుంది. మృతులు బెంగళూరులోని జేపీ నగరకు చెందిన బెస్కాం జూనియర్ ఇంజినీర్ సత్యానందరాజే అరస్ (51), భార్య నిశ్చిత (45), రిటైర్డు ఇంజినీర్ చంద్రరాజె అరసు (62) ఇతని భార్య సువేదిని రాణి (50). సర్వీసు రోడ్డు మలుపులో... సత్యానంద రాజె అరసు మేనమామ పిరియా పట్టణంలో చనిపోయాడు, కడసారి చూసి రావాలని కారులో బయలుదేరారు. చంద్రరాజే అరసు కూడా వారికి సమీప బంధువు అవుతారు. చంద్రరాజె అరసు కారు నడుపుతున్నారు. ఘటనాస్థలి వద్ద ఎక్స్‌ప్రెస్ హైవే నుంచి సర్వీస్ రోడ్డులోకి తిరుగుతున్న సమయంలో బెంగళూరు నుంచి మైసూరుకు వెళుతున్న ఆర్టీసీ ఐరావత బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. నలుగురూ కారులో తీవ్రగాయాలతో చిక్కుకున్నారు. క్షణాల్లోనే ముగ్గురు చనిపోగా, స్థానికులు నిశ్చితను బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. ఐజీ బోరలింగయ్య, ఎస్పీ మల్లికార్జున వచ్చి పరిశీలించారు. కారు బస్సులోకి ఇరుక్కుపోవడంతో క్రేన్‌తో లాగి బయటకు తీశారు. మృతదేహాలను మండ్య మిమ్స్ మార్చురీకి తరలించారు. మండ్య గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. మండ్య వద్ద ఎక్స్‌ప్రెస్ వేలో దుర్ఘటన మృతులు బెస్కాం ఇంజినీరు, మాజీ ఇంజినీరు దంపతులు అంత్యక్రియలకు వెళ్తుండగా ఘోరం -
పాస్టర్ మృతిపై సీబీఐ విచారణకు డిమాండ్
రాయచూరు రూరల్: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐతో విచారణ జరపాలని కల్వరి పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జాన్‌వెస్లీ వెల్లడించారు. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్‌ను హత్య చేయించి దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి సువార్త స్వస్థత కూటమి సమావేశాలకు పాస్టర్ వెళుతుండగా కోవ్వూరు టోల్గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగిందన్నారు. పాస్టర్ వాహనానికి ఎలాంటి ముప్పు వాటిల్లకపోయినా పాస్టర్ తలకు బలంగా దెబ్బలు తగిలాయన్నారు. తలకు ఉన్న హెల్మెట్‌కు ఏమీ కాలేదన్నారు. పాస్టర్‌ను రాజకీయ కక్షతో హత్య చేశారని, అతని మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానంద ద్వారా వినతిపత్రం సమర్పించారు. -
రాజధానిని ముంచెత్తిన భారీ వాన
బనశంకరి: రాజధాని బెంగళూరును వేసవి వర్షాలు ముంచెత్తాయి. గురువారం మధ్యాహ్నం గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం రాకతో వేసవి వేడి కాస్త తగ్గి వాతావరణం చల్లబడింది. గత రెండురోజులుగా నగరంలో మబ్బులతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ వర్షం పడలేదు. గురువారం ఉదయం నుంచి మేఘావృతమైంది, మధ్యాహ్నం 2 గంటలకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షం ఆరంభమైంది. ఈ ప్రాంతాలలో అధికం హెబ్బాళ, ఆర్టీ.నగర, యలహంక, సదాశివనగర, శివానంద సర్కిల్ తో పాటు అనేక ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. నగర కేంద్రభాగాలైన మెజస్టిక్, ఎంజీ.రోడ్డు, కబ్బన్‌పార్కు, బసవనగుడి, శ్రీనగర, మైసూరురోడ్డు, బనశంకరి, జేపీ.నగర, పుట్టేనహళ్లి, హలసూరు. హెచ్ఏఎల్ విమానాశ్రయం, యశవంతపుర, పీణ్యా, తుమకూరు రోడ్డు, విజయనగర, రాజాజీనగర తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. వాహనదారులు గంటలకొద్దీ రోడ్లపై చిక్కుకుపోయారు. సాయంత్రం ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనాలపై కూలిన చెట్టు రాజాజీనగరలో గాలీ వానకు పెద్ద చెట్టు కూలి స్కార్పియో, స్విఫ్ట్ కారుతో పాటు పక్కన నిలిపిన బైక్‌లపై పడడంతో దెబ్బతిన్నాయి. ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాలికె, కేఈబీ సిబ్బంది చేరుకుని చెట్టును తొలగించారు. ఈజీపుర మెయిన్‌రోడ్డులో కట్టడంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లోకి నీరు చేరింది. లోపల ఉన్న కార్లు, బైకులు పాక్షికంగా మునిగిపోయాయి. బీటీఎం లేఔట్లో రోడ్లు జలమయం అయ్యాయి. లులు మాల్ ఎదురుగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. బెంగళూరు నుంచి తుమకూరుకు వెళుతున్న కేఎస్ఆర్టీసీ బస్‌కు యాక్సిల్ కట్ కావడంతో వర్షంలో రోడ్డుపై నిలిచిపోయింది. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి పోలీసులు, స్థానికులు బస్‌ను ముందుకు తోసి రోడ్డు పక్కకు చేర్చారు. వర్షంలో వాహనదారులు, ప్రయాణికులు సతమతమయ్యారు. ఎండల నుంచి ఉపశమనం రాష్ట్రంలో మండుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తిన తరుణంలో నైరుతి రుతుపవన వర్షాలకు ముందే బెంగళూరుతో సహా కొన్ని జిల్లాలలో వానలు పడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో రానున్న నాలుగురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. కరావళి, దక్షిణ ఒళనాడులోని కొన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, శివమొగ్గ, చిక్కమగళూరు, మైసూరు, బెంగళూరు, హాసన, కొడగు, చామరాజనగర తో పాటు అనేకచోట్ల వర్షాలకు ఆస్కారం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ ఎల్లో అలర్ట్‌ని జారీ చేసింది. హంపీలో విజయ విఠల ఆలయం సౌందర్యంరాతి రథం, ఇతర స్మారకాల ప్రతిబింబాలువర్షంలో హంపీ అందం రాయల రాజధాని హంపీలో జోరువాన కురిసింది. చారిత్రక శిల్ప కళా కట్టడాలు వాననీటిలో సుందర ప్రతిబింబాలయ్యాయి. పర్యాటకులు ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. కోలారు, బెళగావి తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురిసి ఎండ నుంచి ఉపశమనం ఇచ్చింది. ఆకస్మిక వర్షంతో రోడ్లు జలమయం పలుచోట్ల ట్రాఫిక్ అస్తవ్యస్తం ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం -
జిల్లాను తట్టు రహితంగా మారుద్దాం
హొసపేటె: ఈ ఏడాది చివరి కల్లా జిల్లాను మీజిల్స్ రుబెల్లా(తట్టు) రహితంగా మార్చడానికి ఆరోగ్య శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, వైద్యులు సమన్వయంతో పని చేయాలని జిల్లాధికారి దివాకర్ తెలిపారు. గురువారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయం ఆడిటోరియంలో జరిగిన తట్టు నిర్మూలన కార్యక్రమం అంతర్ విభాగ సమన్వయ కమిటీ సమావేశం, మాతా శిశు మరణాలపై సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యులు మీజిల్స్ రుబెల్లా రోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ ఏడాది చివరి నాటికి జిల్లాను తట్టు రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుని, క్రమశిక్షణతో పని చేయాలన్నారు. ఆరోగ్య శాఖ అధికారులు అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సంఘాలు, ఆశా కార్యకర్తల సహకారంతో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఆయుష్ శాఖ గర్భిణులు, పాలిచ్చే మహిళలకు పరీక్ష నిర్వహించాలన్నారు. సురక్షితమైన ప్రసవం, పోషకాహారంపై కౌన్సెలింగ్ అందించాలన్నారు. ఆయుష్ కేంద్రాల్లో గర్భిణులకు క్రమం తప్పకుండా పరీక్షలు చేసి టీకాలు వేయాలన్నారు. గర్భిణులకు మొబైల్ ఫోన్ల ద్వారా విద్యను అందించడానికి కేంద్ర ప్రభుత్వంఇటీవల కిల్కారి యాప్ ద్వారా ప్రచారాన్ని ప్రారంభించిందన్నారు. యాప్ ద్వారా గర్భిణుల పేర్లను నమోదు చేసుకోవడానికి ప్రతి గర్భిణి సంరక్షణ కోసం సకాలంలో సలహాలతో పాటు వైద్య చికిత్సలు, ఫాలోఅప్లపై ప్రత్యక్ష సమాచారాన్ని అందించడానికి ఇది కృషి చేస్తుందన్నారు. జిల్లా వైద్యాధికారి శంకర్‌నాయక్, ఆర్సీహెచ్ అధికారి జంబయ్యనాయక్, వైద్యులు హరిప్రసాద్, భాస్కర్, రాధిక, సతీష్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఎయిమ్స్‌కు కేంద్రంపై ఒత్తిడి తెండి
రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటు విషయంలో రాజకీయాలు చేయకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎయిమ్స్ పోరాట సమితి ప్రధాన సంచాలకుడు బసవరాజ్ కళస డిమాండ్ చేశారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎంపీలు, రాజ్యసభ సభ్యుల పూర్తి మద్దతు లభించినా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొండి చెయ్యి చూపడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్, దేశంలో బీజేపీ సర్కార్ కలిసి రాయచూరులో మహాత్మగాంధీ మైదానంలో చేపట్టిన ఆందోళన 1057వ రోజుకు చేరిందన్నారు. రాజకీయ నాయకుల చిత్తశుద్ధి కొరతతో మంజూరుకు అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. అశోక్ కుమార్ జైన్, సంతోష్ కుమార్, వినయ్ కుమార్, శాంతనగౌడలున్నారు. -
రేణుకా యల్లమ్మ రథోత్సవం
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లాలోని ఆనేకల్ తాలూకాలోని సర్జాపురలో గ్రామ దేవత శ్రీరేణుకా యల్లమ్మ దేవి ఆలయ బ్రహ్మ రథోత్సవం గురువారం నేత్రపర్వంగా జరిగింది. తెల్లవారుజామునే అమ్మవారి మూల విరాట్‌తో పాటు ఉత్సవమూర్తికి ప్రత్యేక అలంకారం చేసి పూజలు నిర్వహించారు. రాజేశ్వర శివాచార్య స్వామి, తమిళనాడు శివానందశివాచార్య స్వామి విశేష పూజల్లో పాల్గొన్నారు. ఉత్సవమూర్తులను తేరులో ఆసీనుల్ని చేసి రథాన్ని లాగారు. ప్రముఖ వీధుల్లో కోలాహలం మధ్య తేరు ఊరేగింది. వివిధ జానపద కళాకారుల ప్రదర్శనలు, డప్పు వాయిద్యాలు అలరించాయి. సర్జాపురలో కోలాహలం -
పోలీసులతో సమాజంలో శాంతిభద్రతలు
హొసపేటె: సమాజంలో శాంతి భద్రతలు నెలకొన్నాయంటే అది పోలీసుల వల్లే సాధ్యమని, ఇది పోలీసుల సేవ, ధైర్యం, అంకితభావానికి ప్రతీక అని విజయనగర జిల్లా ఎస్పీ బీఎల్ శ్రీహరిబాబు పేర్కొన్నారు. ఆయన నగరంలోని జిల్లా సాయుధ పోలీసు మైదానంలో పోలీసు జెండా దినోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం పోలీసు జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. పోలీసు జెండా పంపిణీ అనేక సంవత్సరాలుగా శాఖలో సేవలందించి పదవీ విరమణ చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది సేవ, త్యాగాలను గుర్తు చేస్తుందన్నారు. 1984కి ముందు నవంబర్ 2వ తేదీని పోలీసు సంక్షేమ దినోత్సవంగా, ఏప్రిల్ 2వ తేదీని పోలీసు జెండా దినోత్సవంగా జరుపుకునేవారన్నారు. 1984 నుంచి ఈ జెండా దినోత్సవం, సంక్షేమ దినోత్సవాన్ని కలిపి ఏప్రిల్ 2న కర్ణాటక రాష్ట్ర పోలీసు జెండా, పోలీసు సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. 2024–25వ సంవత్సరానికి పోలీసు సంక్షేమ నిధి నుంచి పోలీసు అధికారులు, సిబ్బందికి ఆర్థిక సహాయంగా మొత్తం రూ.5,56,200 అందించామన్నారు. ఇందులో పోలీసు పిల్లల విద్య కోసం రూ.3,48,000, వారి కుటుంబాలకు కళ్లజోళ్ల కొనుగోలు కోసం రూ.33,200, మరణానంతర సహాయంగా రూ.45 వేలు, వివిధ హోదాల్లో పదవీ విరమణ చేసిన 26 మంది పోలీసు అధికారులకు సన్మానం కోసం రూ.1.30 లక్షలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు పదవీ విరమణ చేసిన 35 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఆరోగ్య భాగ్య కింద చికిత్స పొందారని తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీహరిబాబు వెల్లడి -
6న శ్రీరామ నవమి ఉత్సవాలు
హుబ్లీ: ధార్వాడ దక్షిణ భారత హిందీ ప్రచార సభ పురుషోత్తమ సభాభవనంలో ఈ నెల 6న సాయంత్రం 5 గంటలకు సంస్కార భారతి సారథ్యంలో శ్రీరామ నవమి ఉత్సవాలను జరుపుకోనున్నారు. ఈ ప్రచార సభ కార్యనిర్వాహక అధ్యక్షుడు వీరేష్ అంచటగేరి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. సంస్కార భారతీ ఉత్తర ప్రాంత ప్రధాన కార్యదర్శి డాక్టర్ శశిధర్ నరేంద్ర, రామాయణం ఆదర్శాల గురించి ప్రత్యేకంగా ప్రసంగించనున్నారు. అధ్యక్షురాలు సౌభాగ్య కులకర్ణి, మారుతీ ఉటగి, ప్రసాద్ మడివాళర్, భార్గవి గుడి కులకర్ణి, శిల్ప నవలిమఠ తదితరులు పాల్గొననున్నారు. సంగీత, నృత్య కార్యక్రమాలను ఏర్పాటు చేశారని, పలువురు ప్రముఖులు వీరణ్ణ పత్తార, డాక్టర్ శ్రీధర్ కులకర్ణి, హారతి దేవశిఖామణి తదితరులు కార్యక్రమంలో పాల్గొననున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఛత్రపతి శివాజీ జయంతి రాయచూరు రూరల్: నగరంలో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలను ఘనంగా ఆచరించారు. గురువారం మావినకెరె చెరువు వద్ద ఛత్రపతి శివాజీ చిత్రపటానికి లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు బంగి మునిరెడ్డి పూలమాల వేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు శివాజీ జయంతిని ఆచరించక పోవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. -
సవదత్తి పచ్చ గాజులు భళా.!
సాక్షి, బళ్లారి: మహిళలకు అందులోనూ ముత్తైదు మహిళలకు గాజులు అంటే ఎంతో భక్తి, ఇష్టంతో వేసుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. తమ అలంకరణలో భాగంగా ప్రతి మహిళ రంగు రంగుల గాజులు వేసుకుని వారు ధరించిన చీరకు తగ్గట్టుగా మ్యాచింగ్ గాజులు వేసుకుని మురిసిపోతుంటారు. కూలీ పనులు చేసుకుని జీవించే మహిళ నుంచి అపర కుబేరుల కుటుంబాలకు చెందిన మహిళలకు అందరి చేతుల్లో గాజుల సవ్వడి ఉంటే వారి ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి గాజులు ముఖ్యంగా సవదత్తి యల్లమ్మ ఆలయం వద్ద ధరిస్తే మహిళలకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందని, ముత్తైదువుగా ఉంటామని నమ్మకంతో మహిళలు సవదత్తికి వచ్చి గాజులు వేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. రంగు రంగుల గాజుల విక్రయాలు బెళగావి జిల్లా సవదత్తి యల్లమ్మ గుడ్డలో వెలసిన రేణుక యల్లమ్మ దేవస్థానం ఆలయ పరిసరాల్లో వైవిధ్యమయమైన రంగు రంగుల గాజుల విక్రయాలు విశేషంగా కనిపిస్తాయి. గతంలో గాజుల కట్ట అని పిలుచుకునే స్థలం ప్రస్తుతం గాజులపేటగా వర్ధిల్లుతోంది. వందలాది కుటుంబాలు దశాబ్దాలుగా గాజులు విక్రయమే జీవనాధార పరంపరను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో స్థలం తగినంత లేకపోవడంతో గుడ్డ పరిసరాల్లో ఎటు చూసినా గాజుల గలగలలు మహిళల సందడితో అలరారుతోంది. పౌర్ణమి, మంగళ, శుక్రవారాల్లో అన్ని అంగళ్లలో విద్యుత్ వెలుగు జిలుగులతో దేదీప్యమానంగా అలంకరణలతో కనిపిస్తాయి. గాజులను ఒక కుప్పగా అందంగా పేర్చడమే ఇక్కడ పెద్ద ముచ్చటగా చెప్పుకుంటారు. ఆలయ పశ్చిమ, ఉత్తర దిక్కుల్లో వ్యాపారులు ఏడాదంతా గాజులు విక్రయిస్తారు. మిగిలిన వారు జాతర వేళలో మాత్రమే వచ్చి వ్యాపారాలు చేసుకుని తిరిగి వెళ్లిపోతారు. గాజులు ఎక్కడ నుంచి వస్తాయంటే.. ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ నగరంలో ఓ ఫ్యాక్టరీలో తయారు చేసిన ఈ గాజులు సవదత్తి యల్లమ్మ ఆలయ పరిసరాల్లో సందడి చేస్తాయి. అక్కడ నుంచి సవదత్తి, బైలహొంగల, బాగలకోటె జిల్లా జమఖండికి వచ్చే గాజులను వ్యాపారుల నుంచి యల్లమ్మ గుడ్డ వ్యాపారులు కొనుగోలు చేస్తారు. 80 శాతానికి పైగా పచ్చ గాజులనే ఇక్కడ విక్రయిస్తారు. ఇక్కడ పచ్చ గాజులకే భారీ డిమాండ్. ప్రతి మంగళ, శుక్రవారాలు, పౌర్ణమి, నవరాత్రులు శుభ ఘడియల్లో అత్యధికంగా గాజుల విక్రయం జరుగుతాయని యల్లమ్మ ఆలయ ముఖ్యులు తెలిపారు. కొంగు బంగారంగా రేణుకా యల్లమ్మ గాజుల సవ్వడిలో మురుస్తున్న భక్తులు -
వణికించిన భారీ వర్షం
హొసపేటె: నగరంలో బుధవారం అర్ధ రాత్రి నుంచి గురువారం తెల్లవారు జాము వరకు కురిసిన భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా నగరంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి అర్ధ రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని జిల్లాధికారి కార్యాలయం ముందు ఉన్న ఇంటి ముంగిట వర్షం నీరు నిలబడి జలమయంగా మారింది. రాజీవ్ నగర్‌తో పాటు ఆర్టీఓ కార్యాలయం రోడ్లలో మోకాలి లోతు వరకు వర్షం నీరు నిలబడడంతో పాదచారులకు, వాహనదారులు, విద్యార్థులకు కష్టకరంగా మారింది. టీబీ డ్యాం ప్రధాన రహదారిలో చెట్టుతో పాటు విద్యుత్ స్తంభం విరిగి నేలవాలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గత కొద్ది వారాల నుంచి వేసవి ఎండలతో సతమతమవుతున్న నగరవాసులు వర్షంతో చల్లబడిన వాతావరణాన్ని ఆస్వాదించారు. తడిచి ముద్దయిన హొసపేటె నగరం విద్యుత్ సరఫరా నిలిచి జనం పాట్లు -
రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా
రాయచూరు రూరల్: కేంద్ర ప్రభఽుత్వం బీఎస్ఎన్ఎల్ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సవరించిన పెన్షన్‌ను పరిశీలించాలని కోరుతూ పదవీ విరమణ చేసిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. గురువారం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు బసవరాజ్ మాట్లాడారు. ప్రభుత్వం 1972 నుంచి అమలులో ఉన్న పెన్షన్‌ను సవరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలో కర్లి, ఆదెప్ప, సోమనరెడ్డి, సిద్దప్ప, గురురాజరావ్, ఉక్కలి, లాలప్పలున్నారు. రిమ్స్‌లో అన్ని సౌకర్యాలు సిద్ధం రాయచూరు రూరల్ : రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో రోగులకు అన్ని సౌకర్యాలు సిద్ధం చేసినట్లు జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. గురువారం ఆస్పత్రిని తనిఖీ చేసిన అనంతరం వైద్యులతో మాట్లాడారు. కళ్యాణ కర్ణాటక జిల్లాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి అధికంగా వచ్చే రోగులందరికీ సమానంగా వైద్యం అందిస్తారన్నారు. ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలతో కూడిన వైద్య పద్ధతులను ఏర్పాటు చేశామన్నారు. చిన్న పిల్లల చికిత్స కోసం ప్రత్యేకంగా 20 పడకలను పెంచాలన్నారు. రోగులకు ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందించాలన్నారు. రిమ్స్ వైద్యాధికారి డాక్టర్ రమేష్, విజయ శంకర్, జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు, ఆర్సీహెచ్ అధికారిణి నందిత, భాస్కర్, టీహెచ్ఓ ప్రజ్వల్ కుమార్‌లున్నారు. సమస్యలు తీర్చాలని ధర్నారాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి తాలూకా గోర్కకల్ పంచాయతీ పరిధిలోని గవిగట్టలో నెలకొన్న సమస్యలపై గ్రామ పంచాయతీ అధికారులు స్పందించడం లేదని రైతు సంఘం జిల్లా సంచాలకురాలు అనిత ఆరోపించారు. బుధవారం రాత్రి పంచాయతీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. గ్రామంలో గత 15 రోజుల నుంచి తాగునీరు, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. -
లాకప్‌డెత్‌పై న్యాయమూర్తి విచారణ
రాయచూరు రూరల్: నగరంలోని పశ్చిమ పోలీస్ స్టేషన్లో లాకప్‌డెత్ కేసులో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సిద్రామప్ప విచారణ చేపట్టారు. బుధవారం రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. రిమ్స్ మార్చురీని సందర్శించి అధికారులతో, మృతుడు వీరేష్ కుటుంబ సభ్యులు, బంధువులు, శవ పరీక్షకు సంబంధించి వైద్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వీరేష్‌ను చితక బాదడంతో మరణించినట్లు ఫిర్యాదు రావడంతో పరిశీలనకు వచ్చారు. జడ్జి వెంట తాలూకా ఆరోగ్య అధికారి ప్రజ్వల్ కుమార్, తహసీల్దార్ సురేష్ వర్మలున్నారు. ఇద్దరు అధికారుల సస్పెండ్ నగరంలోని పశ్చిమ పోలీస్ స్టేషన్లో జరిగిన లాకప్‌డెత్ కేసులో బాధ్యులైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశామని బళ్లారి రేంజ్ ఐజీపీ లోకేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ మేకా నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్ టీడీ మంజునాథ్‌లను సస్పెండ్ చేస్తూ వారిద్దరిపై ఎస్టీ క్రిమినల్ కేసులను నమోదు చేశామన్నారు. అధికారులు వీరేష్ అనే యువకుడిని చితక బాదడంతో మరణించినట్లు ఫిర్యాదు అందడంతో కేసును సీఐడీకి అప్పగించారన్నారు. ప్రజలు సైబర్ నేరాల విషయంలో డిజిటల్ అరెస్ట్‌లకు భయపడరాదన్నారు. సైబర్ నేరాల విషయంలో బళ్లారి రేంజ్ పరిధిలో బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాల్లో సైబర్ నేరాల కట్టడి కేంద్రాలను ప్రారంభించామన్నారు. రాయచూరులో డీఎస్పీ సత్యనారాయణ సైబర్ నేరాలను చూసుకుంటున్నారన్నారు. జింకలను వేటాడి ఊరేగించిన వారిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. విలేఖర్ల సమావేశంలో ఎస్పీ పుట్టమాదయ్య ఉన్నారు. ఇద్దరు అధికారులపై వేటు నగరంలోని పశ్చిమ పోలీస్ స్టేషన్లో జరిగిన లాకప్‌డెత్ కేసులో బాధ్యులైన ఇద్దరు అధికారులను బళ్లారి రేంజ్ ఐజీపీ లోకేష్ కుమార్ సూచనల మేరకు సస్పెండ్ చేస్తూ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ పుట్టమాదయ్య తెలిపారు. పశ్చిమ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ మేకా నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్ టీడీ మంజునాథ్‌లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో గబ్బూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ లోకాయుక్త వలలో చిక్కిన సబ్ ఇన్స్పెక్టర్ టీడీ మంజునాథ్ సస్పెండ్ కావడం గమనార్హం. -
శాంతిభద్రతల రక్షణలో పోలీసుల పాత్ర కీలకం
సాక్షి,బళ్లారి: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ శోభారాణి పేర్కొన్నారు. ఆమె బుధవారం నగరంలోని డీఏఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సమాజంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది పోలీసులేనన్నారు. అలాంటి ఉద్యోగం చేస్తుండటం మనందరికీ గర్వకారణమన్నారు. అయితే పోలీసు స్టేషన్లకు వచ్చే వారితో స్నేహ పూర్వకంగా మెలగాలన్నారు. పోలీసులు అంటే భయం చూపకూడదన్నారు. జనంలో మనం ఒకరిగా జీవిస్తూ ముందుకెళ్లాలన్నారు. ఎన్నో ఒత్తిళ్లను తట్టుకుని పని చేసే పోలీసులు ఆరోగ్యంపై కూడా జాగ్రత్తలు పాటించాలన్నారు. కుటుంబ సభ్యులకు కూడా సమయం కేటాయించాలన్నారు. పోలీసు ధ్వజం అమ్మకం ద్వారా సంగ్రహించిన నిధులను పోలీసు కుటుంబాల సంక్షేమానికి సమర్పిస్తున్నారని కొనియాడారు. జిల్లాలో 2024 ఏప్రిల్ నుంచి 2025 వరకు మొత్తం 37 మంది పోలీసు అధికారులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారన్నారు. వీరిలో పీఎస్ఐలు7 మంది, ఆర్ఎస్ఐలు 2, ఏఎస్ఐలు 13 మంది, ఏఆర్ఎస్ఐలు 9 మంది, సీడ్సీపీలు 3 తదితరులు పదవీ విరమణ పొందారన్నారు. జిల్లాలో ఉత్తమంగా పని చేసిన 178 పోలీసు అధికారులు, సిబ్బందికి రూ.లక్ష చొప్పున బహుమతి ఇచ్చామని గుర్తు చేశారు. పోలీసులు లేకుంటే సమాజంలో అశాంతి వాతావరణం, గొడవలు తలెత్తుతాయన్నారు. మిగిలిన శాఖల కన్నా పోలీసు వృత్తిలో పని చేయడం ఎంతో ఛాలెంజ్‌గా ఉంటుందన్నారు. సమాజం దృష్టి మనందరిపై ఉంటుందని, అలాంటి వృత్తిలో పని చేసే మనందరి అడుగులు ఆచితూచి మంచి నడతతో ముందుకెళ్లాలన్నారు. పలువురు పోలీసు అధికారులు కూడా తమ సందేశాన్ని వినిపించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రవికుమార్, జైలు సూపరింటెండెంట్ లత, పోలీసు అధికారి తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో సేవాభావం అవసరంరాయచూరు రూరల్: పోలీసులు విధి నిర్వహణలో సేవా మనోభావాన్ని పెంపొందించుకోవాలని రిటైర్డ్ సీఐ హసన్ సాబ్ పేర్కొన్నారు. బుధవారం ఎస్పీ క్రీడా మైదానంలో పోలీస్ ధ్వజ దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. పోలీస్ శాఖలో పేరు సంపాదించుకోవాలంటే ప్రజలకు సేవ చేయాలన్నారు. ప్రస్తుతం ప్రజల్లో శాఖపై నమ్మకం తగ్గిపోతోందన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. పోలీస్ సంక్షేమ నిధి నుంచి 2024–25లో 266 మందికి ఆరోగ్య భాగ్య పథకం కింద రూ.4 లక్షలు వ్యయం చేసినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో బళ్లారి రేంజ్ ఐజీ లోకేష్ కుమార్, ఎస్పీ పుట్టమాదయ్య, ఏఎస్పీ హరీష్, డీఎస్పీలు దత్తాత్రేయ కర్నాడ్, తళవార్, సీఐ ఉమేష్ కాంబ్లే, ఎస్ఐ వైశాలి, చంద్రప్ప, నారాయణ, లక్ష్మి, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ శోభారాణి వెల్లడి -
ఇకపై హావేరిలో వందే భారత్‌కు స్టాపింగ్
సాక్షి,బళ్లారి: ఏడాది క్రితం బెంగళూరు–ధార్వాడ మధ్య ప్రారంభించిన వందే భారత్ రైలుకు ఇక నుంచి హావేరిలో స్టాపింగ్ కల్పించారు. మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభ్యుడు బసవరాజ్ బొమ్మై కృషితో ఈ రైలు సేవలు వినియోగంలోకి రానున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఽబెంగళూరు నుంచి ధార్వాడ వరకు గతంలో చేరుకోవాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వందే భారత్ రైలు ఏర్పాటు చేయడంతో ఐదు గంటల్లో ప్రయాణం సాగనుండటంతో ఎంతో అనుకూలంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వందే భారత్ రైలు సేవలను కర్ణాటకలో పలు జిల్లాలకు విస్తరించేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హావేరి ఎంపీ కూడా హావేరికి వందే భారత్ రైలు సేవలను కల్పించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కోరడంతో ఆయన సూచనతో కేంద్ర రైల్వే శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రముఖ వాణిజ్య కేంద్రం హావేరికి వ్యాపారులు, రైతులు వచ్చి వెళ్లేందుకు ఎంతో ఇబ్బందులు పడేవారు. ప్రయాణికులకు సౌకర్యం కల్పించే దిశగా వందే భారత్ రైలు సేవలు అందించడంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ వ్యాపార కేంద్రం బ్యాడిగి జిల్లా వాసుల్లో పెల్లుబికిన హర్షాతిరేకాలు -
రేపు హంపీ కన్నడ వర్సిటీ స్నాతకోత్సవం
హొసపేటె: హంపీ కన్నడ విశ్వవిద్యాలయం 33వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 4న విశ్వవిద్యాలయ ఆవరణలోని నవరంగ బయలు ప్రదేశంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వీసీ డాక్టర్ పరశివమూర్తి తెలిపారు. బుధవారం విశ్వవిద్యాలయ మంటప సభాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్నాతకోత్సవం సందర్భంగా నాడోజ బిరుదులను ముగ్గురు ప్రముఖులకు అందజేస్తున్నట్లు తెలిపారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివరాజ్ వీ.పాటిల్, విజయనగర జిల్లా కొట్టూరుకు చెందిన ప్రముఖ రచయిత, ఆలోచనాపరుడు కుంబార వీరభద్రప్ప, ధార్వాడకు చెందిన ప్రముఖ హిందూస్థానీ గాయకుడు పద్మశ్రీ ఎం.వెంకటేష్ కుమార్‌కు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ చేతులు మీదుగా నాడోజ బిరుదులను ప్రదానం చేస్తారని తెలిపారు. అదే విధంగా పీహెచ్డీ, డీ.లిట్లతో పాటు వివిధ పట్టాలను రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి సుధాకర్ అందజేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ విజయ్ పూణచ్చ తంబండ తదితరులు పాల్గొన్నారు. -
దేవర దాసిమయ్య ఆదర్శాలు అనుసరణీయం
బళ్లారిటౌన్: ఆధ్యాత్మిక వచనకారులు, చేనేత సంతతి దేవర దాసిమయ్య ఆధ్యాత్మిక, మానవీయ గుణ గణాలు, ఆదర్శాలను అందరూ అలవరుచుకోవాలని జిల్లా శరణ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు కేబీ.సిద్దలింగప్ప పేర్కొన్నారు. బుధవారం కన్నడ సంస్కృతి శాఖ సముదాయ భవనంలో ఏర్పాటు చేసిన దేవర దాసిమయ్య జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బసవణ్ణ కాలంలో సమాజ అభివృద్ధి కోసం సీ్త్ర సమానతపై ఎక్కువగా ప్రజల్లో అవగాహన కల్పించిన వారిలో దేవర దాసిమయ్య కూడా ఒకరన్నారు. సమాజంలో మూఢనమ్మకాలను కఠినంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఆయన యాదగిరి జిల్లా సురపుర తాలూకాలో జన్మించారన్నారు. చేనేత వృత్తితో శివుడికి నేసిన దుస్తులను అలంకరించి అపూర్వ భక్తుడయ్యారన్నారు. జిల్లా చేనేత వర్గాల సమాఖ్య అధ్యక్షుడు సీ.దేవానంద మాట్లాడుతూ చేనేత వర్గాలకు మౌలిక సదుపాయాలు మరింతగా కల్పించాలని, విద్యా రంగంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు దేవర దాసిమయ్య చిత్రపటానికి పుష్పార్చన సమర్పించారు. కన్నడ సంస్కృతి ఏడీ నాగరాజు, సమాజ నేతలు శీలా బ్రహ్మయ్య, అవార్ మంజునాథ, రాజు, మంజుల, చంద్రశేఖర తదితరులు పాల్గొన్నారు. సరళంగా దేవర దాసిమయ్య జయంతి రాయచూరు రూరల్ : దేవర దాసిమయ్య తత్వాలు, ఆదర్శాలను అనుసరించాలని అదనపు జిల్లాధికారి శివానంద పిలుపునిచ్చారు. బుధవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, సాంఘీక సంక్షేమ శాఖ, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో జరిగిన దేవర దాసిమయ్య జయంతిలో చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. తన వచనాల ద్వారా జీవన మౌల్యాలను గురించి దాసిమయ్య వివరించారన్నారు. నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, తహసీల్దార్ సురేష్‌వర్మ, సురేంద్రబాబులున్నారు. -
నేటి నుంచి కార్యాలయాల పని వేళల్లో మార్పులు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక పరిధిలోని బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాల్లో గురువారం నుంచి ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు జరిగాయి. ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని ప్రభుత్వ అదనపు కార్యదర్శి విమలాక్షి ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.బళ్లారి సీఐకు సీఎం గోల్డ్ మెడల్బళ్లారి అర్బన్: తమ విధుల్లో ఉత్తమ సేవలు అందించినందుకు పోలీస్ శాఖలో ఈ సారి సీఎం బంగారు పతకానికి బళ్లారి ట్రాఫిక్ సీఐ అయ్యనగౌడ పాటిల్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డీఏఆర్ మైదానంలో బుధవారం ఏర్పాటు చేసిన పోలీస్ ధ్వజారోహణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శోభారాణి చేతుల మీదుగా అయ్యనగౌడ సీఎం బంగారు పతకాన్ని అందుకొన్నారు.ఎన్‌ఆర్‌బీసీకి ఏప్రిల్ వరకు నీరందివ్వాలిరాయచూరు రూరల్: నారాయణపుర కుడి కాలువ(ఎన్‌ఆర్‌బీసీ) ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీరందివ్వాలని యాదగిరిలో మాజీ మంత్రి రాజుగౌడ నేతృత్వంలో యాదగిరి బంద్ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. రాయచూరు జిల్లా గబ్బూరులోని నందీశ్వరాలయంలో దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మనాయక్ బుధవారం పూజలు చేసి పాదయాత్రను రాయచూరు వరకు చేపట్టారు. యాదగిరి జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన రాజుగౌడ మాట్లాడుతూ పంటలకు నీటి కొరత రాకుండా చూడాలని ఒత్తిడి చేశారు.స్నేహితుల మధ్య గొడవ.. ఒకరి మృతిశివమొగ్గ: స్నేహితుల మధ్య ఏర్పడిన గొడవ ఒకరి మృతికి దారి తీసింది. ఈ ఘటన శివమొగ్గ నగర శివార్లలోని త్యావరెకొప్పలో బుధవారం జరిగింది. వివరాలు.. దేవరాజ్(31)కు, అతని స్నేహితుడు వెంకటేష్ మధ్య చిన్న కారణానికి గొడవ మొదలైంది. ఓ దశలో ఇద్దరూ కొట్టుకున్నారు. వెంకటేష్ కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన దేవరాజ్ అక్కడికక్కడే మరణించాడు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
అనాథలకు అండ.. స్పూర్తిధామ
రాయచూరు రూరల్: సంతానం లేకపోయినా ఆ ఉపాధ్యాయ దంపతులు పేద పిల్లలకు అండగా నిలిచారు. జిల్లాలోని మస్కి తాలూకాలో పేద విద్యార్థులకు ఉచితంగా వసతి, భోజనం, దుస్తులు, విద్య వంటి సౌకర్యాలు కల్పించి సొంత బిడ్డలుగా 30 మందిని చూసుకుంటున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. మస్కి పట్టణానికి చెందిన రామణ్ణ, శ్రుతి దంపతులకు వివాహం జరిగి 15 ఏళ్లు నిండినా పిల్లలు కాలేదు. ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా రామణ్ణ, కంప్యూటర్ ఉపాధ్యాయినిగా శ్రుతి విధులు నిర్వహిస్తున్నారు. తమ చుట్టు పక్కల ఉన్న అనాథ, పేద విద్యార్థులను అక్కున చేర్చుకొని వారికి విద్యా బుద్ధులు నేర్పుతున్నారు. అభినందన్ స్పూర్తిధామ పేరుతో ఆరంభమైన పాఠశాలలో రోజు విద్యార్థులకు క్రీడలు, విజ్ఞానం, ఉప నిషత్తులు, గురువందనం, స్తోత్రాలు నేర్పుతారు. రామణ్ణ, శ్రుతి దంపతులు చేస్తున్న ఉదార సేవకు ఉడుతా భక్తిగా అందరి సహకారం లభిస్తోంది. దివ్యాంగుడు దేవరాజ్‌కు రాష్ట్ర స్ధాయి కబడ్డీ, క్రికెట్ క్రీడల్లో స్వంత డబ్బులతో తర్ఫీదు ఇప్పిస్తున్నారు. ప్రత్యేకంగా అభినందన్ విద్యా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పంచమసాలి సముదాయ భవనం, దాసోహ మంటప భవనాలను నిర్మించారు. ఆదరిస్తున్న ఉపాధ్యాయ దంపతులు స్వయంగా పాఠశాల నిర్వహిస్తున్న వైనం -
రేపు వృద్ధి మహిళా దినోత్సవం
హుబ్లీ: కర్ణాటక ఛాంబర్ ఆఫ్ కామర్స్ మహిళా పారిశ్రామికవేత్తల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వృద్ధి 2025 మహిళా దినోత్సవం, మహిళ సాధకులకు సన్మాన కార్యక్రమాన్ని ఇక్కడి జేసీ నగర్‌లోని కేసీసీఐ సభాభవనంలో ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ మహిళా శాఖ చైర్పర్సన్ నిషా మెహత తెలిపారు. ఆమె స్థానిక మీడియాతో మాట్లాడారు. సృజనశీలత నినాదంతో తర్వాత తరాల మహిళా పారిశ్రామికవేత్తలను, నాయకురాళ్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెస్కాం ఎండీ ఎంఎల్ వైశాలి, వాయువ్య కర్ణాటక ఆర్టీసీ ఎండీ ఎం.ప్రియాంకతో పాటు మహిళా సాధకురాలు బోయింగ్ 777 పైలట్ కెప్టెన్ జోయ్ అగర్వాల్, మిస్ ఇండియా 2013, కళాకారిణి సిమ్రాన్ అహుజ పాల్గొంటారన్నారు. వివిధ రంగాలలో సేవలు అందించిన సాధకురాలైన గిరిజక్క ధర్మారెడ్డి, జ్యోతి హిరేమఠ, డాక్టర్ కేఆర్ రాజేశ్వరిలను సన్మానిస్తామన్నారు. ప్రముఖులు ఎస్పీ సంశిమఠ, సందీప్, మహేంద్ర సింగి, పల్లకి మాలవి తదితరులు పాల్గొన్నారు. బస్సులో మహిళ ఆభరణాల చోరీహుబ్లీ: ఓ మహిళ బస్సులో ప్రయాణం చేస్తుండగా రూ.లక్షలాది విలువ చేసే బంగారు ఆభరణాలను ఎవరో చోరీ చేసినట్లు విద్యా నగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హుబ్లీ నుంచి శంసికి వెళ్లడానికి హోసూరు బస్టాండ్ నుంచి ఆ మహిళ బస్సు ఎక్కింది. దీంతో ఆమె వద్ద ఉన్న మంగళసూత్రం, ఇతర ఆభరణాలు చోరికి గురయ్యాయి. అక్రమ రీఫిల్లింగ్.. సిలిండర్లు స్వాధీనం మరో ఘటనలో ధార్వాడ తాలూకా జోగెళ్లపురలో అక్రమంగా వంట గ్యాస్ సిలిండర్లను రీఫిల్లింగ్ చేస్తున్న గోడౌన్‌పై తహసీల్దార్, అధికారులు దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 180 నిండు సిలిండర్లు, 461 ఖాళీ సిలిండర్లు, రెండు నాజిల్స్, రెండు రీఫిల్లింగ్ యంత్రాలతో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై ధార్వాడ తహసీల్దార్ దొడ్డప్ప పూజార కేసు నమోదు చేస్తానని తెలిపారు. ఏబీసీడీ వర్గీకరణ చేయాలి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి 9 నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని, సాంఘీక న్యాయం కల్పించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర సంచాలకుడు రవీంద్ర నాథ్ పట్టి డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 30 ఏళ్ల నుంచి మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలంటూ మాదిగ సముదాయాల సమీక్షకు సహకరించాలన్నారు. 45 రోజుల పాటు ఇంటింటికీ అధికారులు సర్వేకు వచ్చినప్పుడు కులం జాబితాలో తప్పని సరిగా కులం పేరును రాయించాలన్నారు. -
సర్కారు ధరాఘాతం.. సామాన్యుల బతుకు భారం
శివాజీనగర: రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలను పెంచి పేద, సామాన్య ప్రజలు జీవించకుండా చేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ ధ్వజమెత్తింది. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు బుధవారం బెంగళూరులోని ఫ్రీడం పార్కులో అహోరాత్రి ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో పాలు, విద్యుత్, బస్సు, మెట్రో చార్జీలను పెంచారు, ఇంధన సెస్సును పెంచారు. స్టాంప్ ఫీజును పెంచారు. ఇది ధరలను పెంచే ప్రభుత్వమని ఆరోపించారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, బీజేపీ పక్ష నేత అశోక్, మాజీ సీఎం యడియూరప్ప సహా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. తమ పోరాటం ఆగదని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు బీజేపీ విశ్రమించదని చెప్పారు. దరల పెరుగుదలతో ప్రజల బతుకు భారంగా మారిందని చెప్పారు. పెంచిన ధరలను తగ్గించేవరకు రాష్ట్రమంతటా ధర్నాలు చేస్తామని యడియూరప్ప తెలిపారు. ప్రభుత్వం అభివృద్ధి పనులను నిలిపివేసింది, అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. ఈ సందర్భంగా సీఎం సిద్దరామయ్య వేషధారితో వ్యంగ్య నాటకాన్ని ప్రదర్శించారు. మరోవైపు 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై విధానసభ స్పీకర్ ఖాదర్ విధించిన 6 నెలల ససెన్షన్ను రద్దు చేయాలని విధానసౌధ ఆవరణలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. ధర్నాకు పిలవలేదని జేడీఎస్ అసంతృప్తి బీజేపీ ఆందోళనలకు మిత్ర పక్షమైన జేడీఎస్‌ను ఆహ్వానించలేదని ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు సీ.బీ.సురేశ్‌బాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. బెంగళూరులో మాట్లాడిన ఆయన, జేడీఎస్‌ను బీజేపీ ధర్నాకు పిలవకపోవడం సరికాదు. మునుముందు సమస్యలకు కారణమవుతుందన్నారు. గతంలో ముడా పాదయాత్ర సందర్భంలో కూడా తమకు పిలుపు లేదని వాపోయారు. శాసనసభాలో తాము ఐకమత్యంగా పోరాటం చేశామని ఆయన తెలిపారు. మహిళా కాంగ్రెస్ ఆందోళన బీజేపీ నిరసనలకు పోటీగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ముందు మహిళా కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. బెంగళూరు ఫ్రీడంపార్క్‌లో బీజేపీ ధర్నా పాల్గొన్న ముఖ్య నేతలు -
సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం
బనశంకరి: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదలతో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని సీఎం సిద్దరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు పిలుపునిచ్చారు. బుధవారం కోరమంగలోని కేఎస్ఆర్పీ పరేడ్ మైదానంలో పోలీస్ పతకాలను సిబ్బందికి ప్రదానం చేసి ప్రసంగించారు. సాంకేతికతతో పాటు సైబర్ నేరాలు అధికమవుతున్నాయి. రాష్ట్రాన్ని డ్రగ్స్‌రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. పోలీసులు డ్రగ్స్ ముఠాను కూకటివేళ్లతో పెకలించాలని సూచించారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, మరింత తగ్గించాలని చెప్పారు. శాంతిభద్రతలు , పెట్టుబడులు పెట్టడం, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన ఒకదానికి ఒకటి నేరుగా సంబంధం ఉందన్నారు. నిరుద్యోగం చాలా పెద్ద సమస్యగా ఉందని దీనిని పరిష్కరించాలంటే శాంతిభద్రతలు ఉత్తమంగా ఉండాలని తెలిపారు. పతకాలు తీసుకున్న సిబ్బంది ఆదర్శవంతులుగా ఉండాలని సూచించారు. పోలీసుల సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మీరు మాత్రం విధుల్లో అలసత్వం చూపితే సహించేది లేదని, పోలీస్ గస్తీని మరింత పటిష్టంగా నిర్వహించాలని తెలిపారు. డ్రగ్స్ నివారణ, మహిళా భద్రత రాష్ట్రంలో నేరాలు, మాదక ద్రవ్యాలు కార్యకలాపాలను పూర్తిగా మట్టికరిపించడంతో పాటు మహిళలు సురక్షత కు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. బెంగళూరు నగరంలో శాంతి భద్రతలను కాపాడాలని, దీంతో రాష్ట్రానికి అధిక పెట్టుబడులు వస్తాయన్నారు. మతవిద్వేషాలకు పాల్పడే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశంలో సైబర్ క్రైం పెద్ద సవాల్‌గా మారింది. రాష్ట్రంలో ఏడాదికి 20 వేల కేసులు నమోదు అవుతున్నాయని, బెంగళూరు ఐటీ సిటీగా ఉండటం, ఇంటెర్నెట్ సౌకర్యం అధికంగా ఉండటంతో సైబర్ నేరాలు హెచ్చుమీరుతున్నాయని వీటికి అడ్డుకట్టవేసే దృష్టితో పనిచేయాలని మరింత కఠినంగా పనిచేయాలని తెలిపారు. నక్సల్స్ లొంగిపోవడంతో నక్సల్స్ రహిత కర్ణాటక గా మారిందన్నారు. బ్యాంకు దోపిడీ దొంగలను ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నారని అభినందించారు. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ నిర్వహణకు కేంద్రం అస్త్రం అప్లికేషన్ ప్రారంభమైందని తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి గృహాలను నిర్మిస్తున్నామని తెలిపారు. డీజీపీ అలోక్‌మోహన్, ఐపీఎస్‌లు పాల్గొన్నారు. పోలీసులకు సీఎం ఆదేశం ఘనంగా పోలీసు పతకాల ప్రదానోత్సవం శాంతిభద్రతలతోనే ఆర్థిక వికాసమని సూచన -
సైకో భర్త.. రక్తపాతం
యశవంతపుర: భార్య ఇంటి నుంచి వెళ్లిపోయి రెండేళ్లవుతోంది. పాఠశాలలో కూతురిని మీ అమ్మ ఎక్కడని అడుగుతున్నారు. ఈ పరిణామాలతో శాడిస్టుగా మారిన ఓ వ్యక్తి.. తుపాకీతో మారణహోమం సృష్టించాడు. భార్యను అంతమొందించాలని వెళ్లాడు, ఆమె లేకపోవడంతో తల్లి, మరదలుతో పాటు కూతురిని కూడా తూటాలకు బలి చేశాడు. ఈ కర్కశ సంఘటన చిక్కమగళూరు జిల్లా ఖాండ్యా సమీపంలోని మాగలు గ్రామంలో చోటుచేసుకొంది. సమాజంలో క్షీణించినపోతున్న కుటుంబ బాంధవ్యాలకు మరోసారి అద్దం పట్టింది. వివరాలు.. జిల్లాలోనే కడబగెరె సమీపంలో ఓ పాఠశాలలో డ్రైవర్‌గా పని చేస్తున్న రత్నాకర్ (35) ఈ రక్తపాతానికి పాల్పడ్డాడు. అతనికి మాగలుకు చెందిన యువతిలో సుమారు పదేళ్ల కిందట పెళ్లయింది. స్కూలు బస్సు డ్రైవర్‌గా పనిచేవాడు. వీరికి కూతురు మౌల్య ఉంది. అయితే కుటుంబ కలహాలతో భార్య రెండేళ్ల కిందట భర్తను వదిలేసి వెళ్లిపోయింది. బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. పాఠశాలలో తన స్నేహితులు మీ అమ్మ ఎక్కడని అడుగుతున్నట్లు కుతూరు మౌల్య రోజు తండ్రి వద్ద చెప్పుకునేది. దీంతో ఆక్రోశానికి గురైన రత్నాకర్ భార్యతో తాడేపేడో తేల్చుకోవాలనుకున్నాడు. ఉగాది పండుగ సందర్భంగా మౌల్య అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. భార్య కూడా వచ్చి ఉంటుందని రత్నాకర్ భావించాడు. విచ్చలవిడిగా కాల్పులు ఆమెతో మాట్లాడాలని, కుదరకపోతే హత్య చేయాలని ప్లాన్ వేసుకొని మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో మాగలులో అత్తవారింటికి వెళ్లాడు. భార్య లేదని తెలిసి అగ్గిమీద గుగ్గిలమయ్యాడు, సింగల్ బ్యారెల్ తుపాకీ తీసి అత్త జ్యోతి (50), మరదలు సింధు (26), కూతూరు మౌల్య (7)ను కాల్చిచంపాడు. అడ్డుకోబోయిన సింధు భర్త మీద కాల్పులు జరపగా స్వల్ప గాయాలు తగిలి తప్పించుకున్నాడు. తరువాత మృతదేహాలను ఇంటి నుంచి కొంతదూరం లాక్కువెళ్లి అక్కడ తుపాకీతో కాల్చుకుని హంతకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య కోసం వెళ్లి.. అత్త, మరదలు, కూతురి కాల్చివేత ఆపై హంతకుడు ఆత్మహత్య చిక్కమగళూరు జిల్లాలో మారణహోమం కుటుంబ కలహాలే కారణం మోసం చేసింది.. అందుకేనంటూ.. చంపడాటానికి ముందు రత్నాకర్ సెల్ఫీ వీడియోలో బాధలను చెప్పుకున్నారు. భార్య వదిలి వెళ్లిన తరువాత బాధతో ఈ అమానుషమైన ఘటనకు పాల్పడుతున్నట్లు తెలిపాడు. రెండేళ్ల క్రితం భార్య మోసం చేసి వెళ్లిపోయింది. కూతురి సంతోషం కోసం ఏమైనా చేస్తానన్నాడు. స్కూలులో స్నేహితులు మీ అమ్మ ఎక్కడ అని అడిగితే ఫోటోను చూపిస్తుంది అని వివరించాడు. ఘటనాస్థలిని చిక్కమగళూరు ఎస్పీ విక్రమ్ అమటె పరిశీలించారు. బాళెహొన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించారు. -
ప్రైవేటు బస్సు, బైక్‌లు బూడిద
చింతామణి: పట్టణంలోని బెంగళూరు కూడలి ప్రైవేటు బస్టాండులో ఓ ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. అలాగే పక్కన వున్న పది ద్విచక్రవాహనాలు మంటల్లో మాడిపోయాయి. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. మంగళవారం రాత్రి ఓ ప్రైవేటు బస్సు చింతామణి నుండి హోసకోట పారిశ్రామికవాడలోకి కంపెనీ ఉద్యోగులను తీసుకొని వెళ్లి తిరిగి చింతామణికి వచ్చి నిలబడింది. తెల్లవారుజామున బస్సులో మంటలు చెలరేగి కాలిపోతుండంతో ప్రాంతవాసులు పోలీసులకి తెలిపారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేసేటప్పటికి పూర్తిగా కాలిపోయింది. పక్కన పాత పోలీసు స్టేషన్లో సీజ్ చేసి ఉంచిన పది ద్విచక్రవాహనాలు నిప్పుపడి కాలి బూడిదయ్యాయి. సెలవు ఇవ్వలేదని.. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యశవంతపుర: అక్క కూతురి పెళ్లికి వెళ్లడానికి ఉన్నతాధికారులు సెలవు ఇవ్వలేదనే ఆవేదనతో కేఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సులోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెళగావిలో జరిగింది. పాత గాంధీనగరకు చెందిన డ్రైవర్ బాలచంద్ర శివప్ప హుక్కోజి (47) మృతుడు. శహపుర నాకా నుంచి వడగావికి వెళ్లే బస్సుకు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బాలచంద్ర ఇంటిలో అక్క కుమార్తె పెళ్లి జరుగుతోంది, ఇందుకు సెలవు కావాలని ఉన్నతాధికారులను అడిగాడు. సెలవు ఇవ్వడం కుదరదని వారు తేల్చిచెప్పారు. ఈ పరిణామాలతో మథనపడి ఆత్మహత్య చేసుకున్నాడని, అధికారులే కారణమని కుటుంబసభ్యులు అరోపించారు. బెళగావి నగర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. -
కర్ణాటక సంఘానికి నూతన భవనం నిర్మిస్తాం
రాయచూరు రూరల్ : కళ్యాణ కర్ణాటక, ఉత్తర కర్ణాటక ప్రజలకు సాంస్కృతిక పరంగా, కన్నడ భాషకు నూతన ఒరవడిని కల్పించిన కర్ణాటక సంఘం నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపడతామని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు వెల్లడించారు. మంగళవారం కర్ణాటక సంఘం పాత భవనాన్ని సందర్శించి ఆయన మాట్లాడారు. 98 ఏళ్లు పూర్తి చేసుకున్న భవనం శిథిలావస్థకు చేరుకుందని, మరో రెండేళ్లో వందేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. సంఘం అధ్యక్షుడు శాంతప్ప, జయన్న, రుద్రప్ప, శివమూర్తి, నరసింహులు, శ్రీనివాసరెడ్డి, మురళీధర్ కులకర్ణిలున్నారు. -
పాస్టర్ మృతిపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్
రాయచూరు రూరల్: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐతో విచారణ జరపాలని కల్వరి పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేయించి దానిని రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు చిత్రీకరిస్తోందన్నారు.హైదరాబాద్ నుంచి రాజమండ్రికి సువార్త స్వస్థత కూటమి సమావేశాలకు పాస్టర్ ప్రవీణ్ పగడాల వెళుతున్న సమయంలో కొవ్వూరు టోల్గేట్ వద్ద ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల వాహనానికి ఎలాంటి ముప్పు జరగక పోయినా పాస్టర్ తలకు బలమైన గాయాలయ్యాయన్నారు. తలకు పెట్టుకున్న హెల్మెట్ కూడా పగలకుండా ఉందన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలను రాజకీయ కక్షతో హత్య చేశారన్నారు. పాస్టర్ మరణంపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.వివాదాస్పద ఫోటో స్టేటస్‌పై ఘర్షణహుబ్లీ: ఓ యువకుడు వివాదాస్పద ఫోటో స్టేటస్ పెట్టుకున్నాడన్న విషయమై రెండు వర్గాల మధ్య వాగ్వాదానికి కారణమైంది. ధార్వాడ ఆంజనేయ నగర్‌కు చెందిన సలీం ఈ కేసులో నిందితుడు. ఈయన ధార్వాడ జకని బావి వద్ద ఈద్గాలో ఉన్నట్లు వదంతులు వెలువడ్డాయి. దీంతో భజరంగదళ్ కార్యకర్తలు అక్కడ గుమిగూడారు. అయితే పోలీసులు ముందుగానే నిందితుడిని విద్యాగిరి స్టేషన్‌కు తరలించారు. దీంతో స్టేషన్ ఎదుట గుమిగూడిన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సలీం కుటుంబ సభ్యులు కూడా విద్యాగిరి స్టేషన్‌కు రావడంతో స్టేషన్ ఎదుటే రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.12న హంపీలో జోడు బ్రహ్మరథోత్సవంహొసపేటె: చారిత్రక హంపీలోని విరుపాక్ష్వేర స్వామి, చంద్రమౌళేశ్వర స్వామి జంట బ్రహ్మరథోత్సవం ఈనెల 12న జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి హనుమంతప్ప తెలిపారు. హంపీ జాతర మహోత్సవం ఈనెల 6 నుంచి 14 వరకు హంపీ తాలూకాలో జరుగుతుంది. హంపీ ప్రాంత ప్రధాన పూజారి విద్యారణ్య భారతీ స్వామి మార్గదర్శకత్వంలో ఈనెల 12న జోడు బ్రహ్మరథోత్సవం జరుగుతుందన్నారు. శ్రీ కృష్ణదేవరాయలు సమర్పించిన బంగారు కిరీటాన్ని ఏప్రిల్ 10 నుంచి 14 వరకు అలంకరించనున్నారు. భక్తులందరికీ ఉచిత అన్న ప్రసాదం పంపిణీ చేస్తారు. జాతర మహోత్సవం, రథోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఓ ప్రకటనలో కోరారు.ఇస్పేట్ జూదరుల అరెస్టుహొసపేటె: గంగావతి తాలూకా ఉడుమకల్లో ఇస్పేట్ జూదం అడ్డాపై రూరల్ పోలీసులు దాడి చేసి, 9 మంది జూదరులను అరెస్టు చేసి, 26 బైకులు, రూ.39,000 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. గ్రామీణ ప్రాంతాలైన సిద్దికేరి రైల్వే ట్రాక్, పాపయ్య కెనాల్, ఆంజనేయ గుడి, విద్యానగర్, దేవఘట్ట, ఆనెగుంది, బెట్టగుడ్డ, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతం, గంగావతి గంజ్ ఏరియా, కొన్ని లాడ్జిల్లో పగలు, రాత్రి సాగుతున్న జూదాలను అరికట్టాలని ఆయా సంఘాలు ఎస్పీకి విన్నవించాయి. ఈ దాడిలో రూరల్ సీఐ రంగప్ప దొడ్డమని, సిబ్బంది బసవరాజు చిన్నూరు, రాఘవేంద్ర, మంజునాథ్, బసవరాజు, మురుడి ముత్తురాజు, డ్రైవర్ అమరేష్ పాల్గొన్నారు. -
గర్భిణులు ఎండల్లో తిరగరాదు
బళ్లారిటౌన్: ప్రస్తుతం జిల్లాలో ఎండలు తీవ్రం అవుతున్నందున గర్భిణులు మధ్యాహ్నం పూట బయట తిరగరాదని డీహెచ్ఓ యల్లా రమేష్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం కురుగోడు తాలూకా కోళూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ప్రజలతో ఆయన మాట్లాడారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఎండలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఆ సమయంలో గర్భిణులు ఇళ్లలోనే ఉండాలన్నారు. అదే విధంగా నీళ్లు ఎక్కువ తాగాలన్నారు. ఇక బాలింతలు కూడా శిశువులకు తల్లి పాలు ఎక్కువగా ఇవ్వాలన్నారు. ఇతర ఏ ఆహారాన్ని ఇవ్వరాదన్నారు. తల్లి పాలల్లో చాలా నీటి అంశం ఉంటుందన్నారు. రోజుకు 10 నుంచి 12 సార్లు తల్లి పాలు ఇవ్వాలని సూచించారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ కార్నర్ ఉంటుందన్నారు. ఆస్పత్రి తనిఖీ సందర్భంలో ఓఆర్ఎస్ ద్రావణం తాగడం ద్వారా దేహంలో నిర్జలీకరణ పొంది అపాయాన్ని తప్పించవచ్చన్నారు. తారానాథ ఆయుర్వేదిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్, వైద్యులు రాజశేఖర్ గాణిగేర్, మనీంద్ర, కళ్యాణి, ఈశ్వర్ హెచ్.దానప్ప, బసవరాజు, వీరేష్, శరణమ్మ, సిద్దమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అధిక లాభాలంటూ లక్షల్లో వంచన
హుబ్లీ: క్వాలిటీ సంస్థలో డబ్బులు పెట్టుబడి పెడితే 30 శాతం లాభాలు ఇస్తామని నమ్మించి నగర విద్యార్థి నుంచి రూ.10.30 లక్షలు వంచించారు. కే.హనుమంతను సంప్రదించిన కార్తీక్ అనే వ్యక్తి పెట్టుబడి పేరుతో దశల వారీగా రూ.10.30 లక్షలను బదలాయించుకొని మోసగించాడని బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కుట్టుమిషన్లు, కార్లు పంపిణీ హుబ్లీ: హుబ్లీ ధార్వాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దేవరాజ అరసు వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ, వడ్డర్ల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వావలంభి సారథి పథకం ద్వారా లబ్ధిదారులకు కార్లు, కుట్టు మిషన్లను ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే మహేష్ టెంగినకాయి పంపిణీ చేశారు. తమ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 36 మంది మహిళలకు కుట్టుమిషన్లు, ముగ్గురికి కార్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాల నుంచి వంచితులైన వారికి కూడా స్వయం ఉపాధి కల్పించేందుకు ఇలాంటి ఎన్నో పథకాల ద్వారా పేద, మధ్య తరగతి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి అనుకూలంగా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ వీణా భరద్వాజ్, కార్పొరేటర్ రూపా శెట్టి, ప్రముఖులు రాజు కాళె, ఆ సంస్థ జిల్లా మేనేజర్ కుశాల్ చౌగలె, హనుమంత వక్కుంద పాల్గొన్నారు. కారు బోల్తా.. ఇద్దరు మృతి● మృతులు తండ్రీకుమారులు ● ముగ్గురికి తీవ్ర గాయాలు ● చిత్రదుర్గ జిల్లాలో ఘోరం సాక్షి,బళ్లారి: డివైడర్‌ను కారు ఢీకొని బోల్తా పడటంతో తండ్రీ కుమారుడు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరు తాలూకా బొమ్మక్కనహళ్లి సమీపంలో జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో బెంగళూరు నుంచి యాదగిరికి కారులో వెళుతున్న మౌలా(35), రెహమాన్(15) అనే ఇద్దరు తండ్రీ కుమారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో ఫాతిమాబేగం, సలీమా, సమీర్ అనే ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, బళ్లారి బిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఘటనపై రాంపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 12 మంది గంజాయి విక్రయదారుల అరెస్ట్హుబ్లీ: గంజాయి విక్రయిస్తున్న 3 కేసుల్లో 12 మంది పెడ్లర్లను అరెస్ట్ చేసి వారి నుంచి 1.677 గ్రాముల గంజాయిని జప్తు చేశారు. కసబాపేట పోలీస్ స్టేషన్లో శ్రీకాంత్ అవరంగి, అభిషేక్, ఈరణ్ణ, విశాల్, విజయ్, ధార్వాడ విద్యాగిరి స్టేషన్ పరిధిలో మహమ్మద్, హనుమంత, ఆసిఫ్, మంజునాథ్, అనిల్‌లపై కేసు దాఖలైంది. నిందితుల నుంచి రూ.35,750 విలువ చేసే 11.75 గ్రాముల గంజాయి, 9 మొబైల్ ఫోన్లు, రెండు బైక్‌లు, రూ.1700 నగదుతో పాటు మొత్తం రూ.68,450 విలువ చేసే వస్తువులను జప్తు చేశారు. అలాగే బెండిగేరి పోలీస్ స్టేషన్ పరిధిలో సీఈఎన్ క్రైం స్టేషన్ పోలీసులు దాడి చేసి అభిషేక్, అనిల్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసి 5.2 గ్రాముల గంజాయిని జప్తు చేశారు. కొళగల్లు ఎర్రితాత రథోత్సవంపై నిషేధంబళ్లారిటౌన్: బళ్లారి తాలూకా కొళగల్లు గ్రామంలో ఈనెల 4న జరగాల్సిన ఎర్రితాత రథోత్సవాన్ని జరపకుండా నిషేధిస్తూ మంగళవారం జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రా ఆదేశాలను జారీ చేశారు. కొళగల్లు గ్రామంలో దేవస్థానం ఆస్తి విషయంలో గత ఏడాది ఫిబ్రవరి 24న మఠం ఆవరణలో కొత్తగా నిర్మించిన ఎర్రితాత గుడిలో ప్రతిష్టించిన విగ్రహం తొలగించాలని ధార్వాడ హైకోర్టు ఆదేశించింది. ఈ విగ్రహం తొలగింపులో ఈ ఏడాది ఫిబ్రవరి 7న గ్రామంలోని వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు పెరిగి వివాదం చోటు చేసుకోగా పోలీసులపై రాళ్లు రువ్విన సంగతి విదితమే. దేవస్థానం ఆస్తుల విషయంలో గొడవలు జరిగినందున గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసులు దాఖలు అయ్యాయి. దీంతో ఈ వివాదం కోర్టులో ఉన్నందున మళ్లీ రథోత్సవం జరిగితే గ్రామంలో అశాంతి తలెత్తవచ్చని అధికారులు భావించినందున శాంతిభద్రతలను కాపాడటం కోసం ఈ రథోత్సవాన్ని నిషేధిస్తూ ఆదేశించినట్లు తెలిపారు. జింకల వేటపై కేసు నమోదురాయచూరు రూరల్ : జింకలను వేటాడి కొడవలి తదితర మారణాయుధాలతో ఊరేగింపు జరిగిన ఉదంతం జిల్లాలోని మస్కి తాలూకాలో చోటు చేసుకుంది. సోమవారం తుర్విహాళలో శంకర లింగేశ్వర జాతర సందర్భంగా మస్కి శాసన సభ్యుడు బసనగౌడ సోదరుడు సిద్దనగౌడ, కుమారుడు సతీష్ గౌడ జింకలను పట్టుకొని ఊరేగిస్తూ వాటిని చంపారని ఆరోపిస్తూ అటవీ శాఖాధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య తెలిపారు. -
గ్యారెంటీలతో ధరలు పెంచి లూటీ
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో లీటరు పాల ధరను ఏకంగా రూ.9 పెంచారని, పాడి రైతులను మాత్రం నడ్డి విరుస్తూ దాదాపు రూ.663 కోట్ల మేర రైతులకు బాకీ ఉన్నారని, వినియోగదారులకు ధరలు పెంచి, రైతులకు అన్యాయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి మండిపడ్డారు. ఆయన మంగళవారం నగరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఒక్క పాల ధరే కాకుండా అన్ని విధాలైన నిత్యావసరాల ధరలు పెంచేశారన్నారు. దీంతో సామాన్యుడి జీవితం అష్టకష్టంగా మారిందన్నారు. గ్యారెంటీల పేరుతో రాష్ట్రంలో పాలకులు లూటీ చేసుకుని పబ్బం గడుపుతున్నారన్నారు. పేదలకు గ్యారెంటీలు సక్రమంగా అందడం లేదన్నారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ధరలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫీజులు, రిజిస్ట్రేషన్ ఫీజులు, వాహన రిజిస్ట్రేషన్లు, ల్యాబ్ పరీక్షలు, ఈసీజీ, రక్తపరీక్షలు, దత్తస్వీకార పత్రం, అఫిడవిట్, బస్సు టికెట్ ధరలు, బీర్లు, విద్యుత్ వాహనాలు, నిత్యావసర ధరలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దానిపై చాప కింద నీరులా ధరలు పెంచుకుంటూ గ్యారెంటీలు ఇస్తున్నామని పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు.ఽ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరల పెంపు పైనే దృష్టి సారిస్తూ సంపద సృష్టించుకుని, కొందరికి మోదం, మరికొందరికి ఖేదంగా పాలన సాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకే మేలు జరుగుతుందన్నారు. మిగిలిన వారు భారీగా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పెంచిన ధరలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. బీజేపీ నాయకులు డాక్టర్ బీ.కే.సుందర్, డాక్టర్ అరుణ కామినేని, గురులింగనగౌడ, ఓబుళేసు తదితరులు పాల్గొన్నారు. లీటరు పాలపై ఏకంగా రూ.9 పెంపు ధరల పెంపుపై పెద్ద ఎత్తున ఆందోళన మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి -
ఏబీసీడీ వర్గీకరణ చేయాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి నెలలు గడిచినా ప్రభుత్వం స్పందించడం లేదని సాంఘీక న్యాయంతో మాదిగ సముదాయాలకు 8 శాతం రిజర్వేషన్ జారీ చేయాలని మాదిగ దండోరా రాష్ట్ర సంచాలకుడు నరసప్ప డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 30 ఏళ్ల నుంచి మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలంటూ ఆందోళనలు చేపట్టినా, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్‌కు వర్గీకరణ చేయడంలో మౌనం వహించడాన్ని ఖండించారు. ప్రభుత్వం నాగ మెహన్ దాస్ నివేదిక ఆధారంగా వర్గీకరణ చేయాలన్నారు. ఇంటింటికీ అధికారులు సర్వేకు వచ్చినప్పుడు మాదిగ అని జాబితాలో రాయించాలన్నారు. -
పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్.. బాధ్యులపై చర్యలు చేపట్టాలని ధర్నా
రాయచూరు రూరల్ : నగరంలోని వెస్ట్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగినట్లు సమాచారం అందింది. మూడు రోజుల క్రితం ఆశాపూర్ రోడ్డులో నివాసం ఉంటున్న వీరేష్(28) అనే వ్యక్తి తన భార్యతో గొడవ పడ్డాడు. ఈ విషయంలో వెస్ట్ పోలీస్ స్టేషన్లో భార్య తరపున కుటుంబ పెద్దలు ఫిర్యాదు చేశారు. వెస్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసును సదర్ బజార్ మహిళా పోలీస్ స్టేషన్‌కు బదలాయించారు. రాజీ ప్రక్రియతో ఇరువురిని కలిపారు. కాగా మంగళవారం వెస్ట్ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు పిలిచి ఇష్టానుసారంగా చితకబాదారని వీరేష్ తండ్రి గోపి వారి బంధువు నారాయణ ఆరోపించారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు స్పృహ తప్పి ప్రాణాలు వదిలాడు. ఘటనపై కేసు నమోదుకు పోలీసులు నిరాకరించడంతో వీరేష్ కుటుంబ సభ్యులు ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు పూనుకున్నారు. కాగా వెస్ట్ పోలీస్ స్టేషన్ అధికారులపై చర్యలు చేపట్టాలని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు పూనుకొని మాట్లాడారు. అతని మరణానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేపట్టారు. కౌన్సిలర్లు నాగరాజ్, శఽశిరాజ్, నగర అధ్యక్షుడు రాఘవేంద్ర, బీజేపీ నేతలు ఆంజనేయ, రవీంద్ర జాలదార్, విజయ్ కుమార్ నాగరాజ్, యల్లప్ప, శ్రీనివాసరెడ్డిలున్నారు. -
పొంచి ఉన్న జలక్షామం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ప్రధాన జలాశయాలన్నీ నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. మార్చి నెలాఖరు నాటికి భారీ, మధ్య తరహా జల వనరులు ఎండిపోయాయి. ఈ ఏడాది వేసవి తాపం అధికంగా ఉంది. ఏప్రిల్, మే నెలలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. మలప్రభ, ఘటప్రభ, తుంగభద్ర, కృష్ణా నదుల్లో నీటి నిల్వలు కనీస స్థాయికి దిగజారాయి. ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటకలో జలక్షామంతో నీటి ఎద్దడి నెలకొనే పరిస్థితి ఏర్పడింది. విజయపుర జిల్లాలోని ఆల్మట్టి డ్యాంలో ఆశించినంత మేర నీరు అందుబాటులో లేదనే విషయం తేటతెల్లమైంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జలాశయంలో నీటి నిల్వ తక్కువగా ఉంది. పల్లెల్లో దాహాకారాలు డ్యాం గరిష్ట నీటిమట్టం 519.60 మీటర్లు, నీటి నిల్వ సామర్థ్యం 123.081 టీఎంసీలు కాగా ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 490.70 మీటర్లు, నీటి నిల్వ 32.400 టీఎంసీలు ఉంది. డెడ్ స్టోరేజీ 10.600 టీఎంసీలు పోను మిగిలిన 21.800 టీఎంసీల నీరు నిల్వ ఉన్నాయి. కళ్యాణ కర్ణాటకలోని కొప్పళ, బీదర్, యాదగిరి, కలబుర్గి, రాయచూరు, ఉత్తర కర్ణాటకలోని ధార్వాడ, బెళగావి, బాగల్కోటె, గదగ్ జిల్లాల్లో తాగునీటి పథకాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. గతంలో వానలు కురువక పోవడంతో కళ్యాణ కర్ణాటకలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. కలబుర్గి జిల్లాలో ఘటప్రభ, మలప్రభ, బెణ్ణెతోర, అమర్జా, భీమా నదులున్నా తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. రాయచూరు జిల్లాలోని లింగసూగూరు తాలూకా యరగుంటె, సింధనూరు తాలూకా మల్లనగుడ్డల్లో ట్యాంకర్లతో నీటి సరఫరా చేపడుతున్నారు. 15 జిల్లాలకు తప్పని నీటి గండం పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం మౌనం వహించిన ప్రజాప్రతినిధులు -
ధరల పెంపు పంచ గ్యారెంటీలకు వడ్డీనా?
రాయచూరు రూరల్: కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ ధరల పెంపుతో వచ్చే ఆదాయంతో గ్యారెంటీలను ప్రజలకు ఉచితంగా ఇచ్చి వారి నుంచి వడ్డీని వసూలు చేస్తోందని జిల్లా బీజేపీ అధ్యక్షుడు వీరనగౌడ ఆరోపించారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నఫళంగా విద్యుత్ బిల్లును యూనిట్‌కు 36 పైసలు, పాల ధరను లీటరుకు రూ.9, బస్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలు పెంచడం తగదని పేర్కొంటూ ఈ నెల 7 నుంచి జనాక్రోశ యాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. పాల రైతులకు రూ.662 కోట్ల మేర బకాయిలున్నట్లు తెలిపారు. జాతీయ కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక సర్కార్ ఏటీఎంగా మారిందని ధ్వజమెత్తారు. పంచ గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మంత్రులు, శాసన సభ్యులు కొల్లగొడుతున్నారని విమర్శించారు. మాజీ శాసన సభ్యులు బసన గౌడ, పాపారెడ్డి, శంకరప్ప, నగర అధ్యక్షుడు రాఘవేంద్ర, సభ్యులు శంకరరెడ్డి, రవీంద్ర జాలదార్, చంద్రశేఖర్, మల్లికార్జునలున్నారు. కాంగ్రెస్‌కు ఏటీఎంగా కర్ణాటక సర్కార్ 7 నుంచి జనాక్రోశ యాత్రకు శ్రీకారం జిల్లా బీజేపీ అధ్యక్షుడు వీరనగౌడ -
బీబీఎంపీ చెత్త లారీ బోల్తా
కృష్ణరాజపురం: నగరంలో పాలికె చెత్త లారీలు తరచూ ప్రమాదాలకు కారణమవుతూ ప్రజలకు బెదురు పుట్టిస్తున్నాయి. బీబీఎంపీ చెత్త లారీ డ్రైవర్ అజాగ్రత్తతో బోల్తా పడిన ఘటన బెంగళూరు పులకేశినగరలోని సింధి సర్కిల్ వద్ద జరిగింది. చెత్తను డంప్ యార్డుకు తరలిస్తుండగా లారీ డ్రైవర్ అతి వేగంగా మలుపు తిప్పడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో అక్కడ ఇతర వాహనాలు, జనం లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. లారీ డ్రైవర్ చింగారికి చిన్న గాయాలయ్యాయి. పులకేశినగర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.బీదర్ జిల్లాలో భూప్రకంపనలుసాక్షి, బళ్లారి: బర్మా, థాయ్‌లాండ్ దేశాల్లో భయంకరమైన భూకంపం వచ్చి అంతటా భయాందోళన నెలకొన్న సమయంలో, విజయపుర జిల్లాలో భూమి కంపించింది. మంగళవారం జిల్లాలోని తిక్కోటా తాలూకా పరిధిలో పలు గ్రామాల్లో భూ ప్రకంపనలు రావడంతో గ్రామస్తులు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. ఈ సంఘటనతో జిల్లావాసులు భయాందోళన చెందుతున్నారు. ఎవరికీ హాని కలగలేదు. ప్రకంపనల సమయంలో భూమి నుంచి పెద్దఎత్తున శబ్ధం రావడంతో ప్రజలు హడలిపోయారు. ఉత్తర కర్ణాటకలో తరచూ భూప్రకంపనలు వస్తున్నాయి. కలబురగి, బీదర్ జిల్లాల్లో స్వల్పస్థాయి భూకంపాలు నమోదవుతున్నాయి. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశోధనలు చేసి పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలిబనశంకరి: విధానసభలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ని వెనక్కి తీసుకోవాలని స్పీకర్ యుటీ ఖాదర్ కు మంగళవారం బీజేపీ నేత ఆర్.అశోక్ లేఖరాశారు. గత నెల 21 తేదీన శాసనసభలో హనీట్రాప్ గొడవ, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ చర్చ సమయంలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ధర్నాకు దిగామని 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. అంతేగాక పలు ఆంక్షలు కూడా విధించారని తెలిపారు. స్పీకర్ పీఠానికి అగౌరవం తీసుకువచ్చే ఉద్దేశం ఎమ్మెల్యేలకు లేదని చెప్పారు. పునఃపరిశీలించి సస్పెన్షన్‌ను రద్దు చేయాలని కోరారు.ఖైదీల వద్ద మొబైల్ఫోన్మైసూరు: నగరంలోని సెంట్రల్ జైలులో ఖైదీలు యథేచ్ఛగా మొబైల్ఫోను వాడుతున్న వైనం బయటపడింది. నేరాల్లో నిందితులుగా జైలుకు వచ్చిన శివమొగ్గకు చెందిన కార్తీక్, నితిన్‌లు చాటుగా మొబైళ్లు ఉపయోగిస్తున్నారు. జైలు అధికారి ఎం.దీపా ఖైదీల గదులను తనిఖీ చేస్తుండగా, 25వ గదిలో నితిన్, కార్తీక్‌ల వద్ద ఒక స్మార్ట్‌ఫోన్, సిమ్ కార్డు లభించాయి. స్థానిక మండి పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ చేపట్టారు. కాగా, జైలులోపలికి నిషిద్ధ వస్తువులు దొంగచాటుగా చేరిపోతుంటాయి. నిందితులతో కొందరు సిబ్బంది కుమ్మక్కు కావడమే కారణమని ఆరోపణలున్నాయి.కాంగ్రెస్‌పై యడ్డి ధ్వజంబనశంకరి: రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ధరల పెంపును వ్యతిరేకిస్తూ బుధవారం బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తుందని, అందులో తాను కూడా పాల్గొంటానని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప తెలిపారు. మంగళవారం డాలర్స్ కాలనీ నివాసంలో విలేకరులతో యడియూరప్ప మాట్లాడారు. ధరల పెంపుతో సామాన్య, మధ్య తరగతిపై పెనుభారం పడిందన్నారు. ఫ్రీడం పార్కులో ధర్నా చేస్తామని, అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. సీఎం కుర్చీకోసం కాంగ్రెస్‌లో కుమ్ములాటలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి ఎవరు కావాలనేది వారికి ముఖ్యమని, ప్రజలు కాదని హేళన చేశారు. ధర్నాలలో కేంద్రమంత్రులు కూడా పాల్గొంటారన్నారు.వృద్ధురాలు అనుమానాస్పద మృతికృష్ణరాజపురం: బెంగళూరులోని విజయనగర రైల్వే పైప్‌లైన్ రోడ్డు ఆర్పీసీ లేఔట్లో ఓ వృద్ధురాలు అనుమానాస్పద రీతిలో మరణించింది. సిద్దమ్మ (78) మృతురాలు. ఆమె సొంత ఇంటిలో ఒంటరిగా జీవిస్తోంది. మంగళవారం ఉదయం ఇంట్లోనే శవమై తేలింది. బంగారు చెవి కమ్మలు మాయమయ్యాయి. ఆమె మరణానంతరం ఎవరైనా వాటిని తీసుకెళ్లారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. హత్య జరిగినట్లుగా ఎలాంటి సాక్ష్యాలు పోలీసులకు లభించలేదు. చెవికమ్మలు పోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఓ నాన్నా.. అనాథవేనా?
దొడ్డబళ్లాపురం: కుటుంబ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఎన్నో కష్టానష్టాలకు ఓర్చి అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వయసు మీద పడగానే వదిలించుకోవాలని చూసే కొడుకులు ఎక్కువయ్యారు. బెళగావిలో అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని కన్న కొడుకు ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయాడు. తండ్రి చనిపోయి అనాథ శవమయ్యాడు. బిమ్స్ ఆస్పత్రిలో వెలుగు చూసింది. అనారోగ్యంతో బాధపడుతున్న సతీశ్వర్ అనే వృద్ధున్ని అతని కుమారుడు 15 రోజుల క్రితం బెళగావి జిల్లా ఆస్పత్రిలో చేర్చి వెళ్లిపోయాడు. అప్పటినుంచి వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు, మార్చి 31న ఆయన మరణించాడు. వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కుమారుని కోసం శోధించారు. అయితే జాడ దొరకలేదు. కుమార్తెచే అంత్యక్రియలు చివరకు గోవాలో జీవిస్తున్న కుమార్తెను తీసుకువచ్చి అంత్యక్రియలు జరిపించారు. కుమార్తె చెప్పిన ప్రకారం ఆమె సహోదరుడు కొన్ని రోజుల క్రితం గోవా నుంచి తండ్రిని తీసుకుని వచ్చేశాడు. తానే చూసుకుంటానని చెప్పి ఇలా చేసాడని ఆమె వాపోయింది. ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలియదని చెప్పింది. పిల్లలు వృద్ధ తల్లిదండ్రులను బెళగావి బిమ్స్‌లో అనారోగ్యమని చేర్పించి పత్తా లేకుండా పోతున్నారని, ఇలాంటి పిల్లలకు ఇచ్చిన ఆస్తిపాస్తులను రద్దు చేయాలని వైద్యవిద్యా మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ ఇటీవల డిమాండ్ చేయడం తెలిసిందే. తండ్రిని ఆస్పత్రిలో చేర్పించి పరారైన తనయుడు మృతిచెందిన వృద్ధుడు -
సిద్ధగంగ మఠం జన సాగరం
తుమకూరు: లక్షల మంది బాలలకు చదువు, అన్నం, విద్యా ఆశ్రయం కల్పించి నడిచే దేవునిగా కీర్తి పొందిన తుమకూరు సిద్ధగంగా మఠాధిపతి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత దివంగత శివకుమార స్వామి 118వ జయంతి వేడుకలు, గురువందన మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగాయి. సిద్ధగంగా మఠంలో వేలాది మంది భక్తులు, సాధుసంతులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెల్లవారుజామునుంచే మఠంలో స్వామీజీ సమాధి వద్ద వివిధ పూజలు చేపట్టారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేంద్ర మంత్రి వి.సోమన్న, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, మఠాధిపతి సిద్ధలింగస్వామి పాల్గొన్నారు. సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పల్లకీ ఊరేగింపు మైసూరు సుత్తూరు మఠం స్వామి శివరాత్రి దేశికేంద్ర స్వామి పూలు పండ్లు తీసుకువచ్చి సమాధికి సమర్పించి పూజలు గావించారు. తరువాత శివకుమారస్వామి విగ్రహాన్ని పల్లకీలో ఉంచి మఠంలో ఊరేగించారు. వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. జానపద కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా సేవా ట్రస్టు ఆధ్వర్యంలో 118 మంది చిన్నారులకు నామకరణోత్సవం, అక్షరాభ్యాసం చేయించారు. ఆ శిశువులకు ఉచితంగా ఉయ్యాలలు, ఇతర సామగ్రిని అందజేశారు. అశేష భక్తజనానికి మఠంలో భోజన వ్యవస్థ కల్పించారు. తుమకూరు నగరంలోనూ అనేకచోట్ల స్వామీజీ భక్తులు అన్నదానం చేశారు. వైభవంగా శివకుమారస్వామి 118వ జయంతి ఉత్సవాలు కేంద్ర రక్షణమంత్రి, మంత్రులు హాజరు -
బెయిల్ కోసం హైకోర్టుకు రన్య
బనశంకరి: కేజీల కొద్దీ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఫిబ్రవరి 3న బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో అరెస్టయి, రిమాండులో ఉన్న నటి రన్య రావు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. 64 వ సెషన్స్ కోర్టు బెయిల్‌ను తిరస్కరించడంతో ఆమె న్యాయవాది హైకోర్టులో మంగళవారం పిటిషన్ వేశారు. రన్యకు బెయిలు ఇవ్వరాదని డీఆర్ఐ వకీళ్లు గట్టిగా వాదిస్తున్నారు. యత్నాళ్ కేసు మీద స్టే జారీ నటి రన్య రావు పై అవహేళన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ పై నమోదైన క్రిమినల్ కేసు విచారణపై మంగళవారం హైకోర్టు స్టే విధించింది. రన్య శరీరమంతా బంగారం అంటించుకుని స్మగ్లింగ్ చేస్తోంని ఇటీవల యత్నాళ్ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రన్య బంధువు బెంగళూరు హైగ్రౌండ్స్ ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని యత్నాళ్ హైకోర్టులో అర్జీ వేశారు. విచారించిన జడ్జి ప్రదీప్‌సింగ్ యెరూర్.. స్టే జారీ చేయడంతో ఆయనకు ఊరట లభించింది. -
ఐస్‌క్రీంతో జర జాగ్రత్త
బనశంకరి: ఐస్‌క్రీం అనగానే పిల్లలైనా, పెద్దలైనా ఎవరికైనా నోరూరుతుంది. వేసవిలో ఎండలు తీవ్రరూపం దాల్చడంతో చల్లదనం కోసం, కాలక్షేపానికి ఐస్‌క్రీములు తినేవారు జాగ్రత్తగా ఉండాలి. ఐస్‌క్రీమ్ కేంద్రాలలో ఆహార సురక్షతా శాఖ అధికారులు సోదాలు చేసి శాంపిళ్లను ల్యాబ్‌కు తరలించారు. ప్లాస్టిక్ పేపర్లో ఇడ్లీ, కర్బూజా, కలర్ వేసిన కబాబ్, గోబిమంచూరి, పన్నీర్లలో ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలున్నాయని ఇప్పటివరకు తనిఖీలలో తేలింది. ఇప్పుడు చల్లని ఐస్‌క్రీమ్ వంతు వచ్చింది. ఆహార శాఖ అధికారులు ప్రతినెలా ఆహార పదార్థాలను తనిఖీ చేస్తారు. ఎండాకాలంలో ప్రజలు ఐస్‌క్రీములు ఎక్కువగా తింటున్నారు. ఐస్‌క్రీములకు రంగు రావడానికి కృత్రిమ రంగులను వాడతారు. ఈ రంగులు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అథణిలో బాగోతం ఇటీవల బెళగావి జిల్లాలోని అథణిలో అనుమతులు లేని ఓ ఫ్యాక్టరీలో రంగురంగుల ఐస్ క్యాండీలను తయారు చేయడం చూసి తనిఖీలు చేశారు. ఐస్క్రీంలను ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించగా వాటిలో హానికరమైన అంశాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. రంగు రావడానికి కెమికల్స్ వినియోగిస్తారని, అవి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. సన్‌సెట్ ఎల్లో, సన్‌సెట్ గ్రీన్ కలర్లు శరీరంలోకి వెళ్తే క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంటుందన్నారు. ఇదే కాకుండా గుండె రోగాలు, కిడ్నీ సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరించారు. ఐస్‌క్రీంలు, కేక్ ఉత్పత్తిలో కల్తీ రంగులు, రసాయనాలను వాడరాదని తెలిపారు. అందులో హానికారక రంగుల వాడకం ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు -
భలే.. సీతాకోకచిలుకలు
బనశంకరి: బెంగళూరు బిన్నిమిల్ మైదానంలో సీతాకోకచిలుకల ఉద్యానవనంలో రోబోటిక్ సీతాకోకచిలుకలు, కీటకాలు ఆకృతులతో జాగృతి ప్రదర్శన ఆకట్టుకుంటోంది. నేటి ఆధునిక యుగంలో సీతాకోకచిలుకలు కనుమరుగు అవుతున్నాయి. అవి లేకపోతే ప్రకృతికి ముప్పు అనే నినాదంతో ప్రజల్లో జాగృతం చేయడానికి రోబోటిక్ సీతాకోకచిలుకల ప్రదర్శన ఏర్పాటైంది. ఇంకా తూనీగలు, మిడతల బొమ్మలు బాలలు ఆకట్టుకుంటున్నాయి. రోజూ సాయంత్రం 4 గంటలనుంచి 9 వరకు జరుగుతుంఇ. జూన్ 1వ తేదీ వరకు కొనసాగుతుంది. ఊపిరి తీసిన సిగరెట్ మండ్య: ధూమపానం ఏరూపంలో ఉన్నా ప్రాణాలు తీస్తుందని అంటారు. అలాంటిదే ఈ ఉదంతం. సిగరెటు తాగుతూ బాటిల్లో తీసుకొని వచ్చిన పెట్రోల్ బైకు ట్యాంకులో పోస్తుండగా మంటలు అంటుకుని మృత్యువాత పడ్డాడో యువకుడు. జిల్లాలో కేఆర్ పేటె తాలూకాలోని కిక్కెరి వద్ద అన్నెజానకనహళ్ళి గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. రాకేష్ (25), మార్చి 26వ తేదీన సాయంత్రం బంక్ నుంచి పెట్రోల్‌ను ఓ సీసాలో తీసుకువచ్చి తన బైక్‌లో పోస్తున్నాడు. ఆ సమయంలో అతడు సిగరెట్ తాగుతున్నాడు. పెట్రోల్ ఒలికిపోయి కొంత అతని మీద పడింది. వెంటనే సిగరెట్ వేడికి మంటలు అంటుకున్నాయి. కాలిన గాయాలైన రాకేష్‌ని కొందరు కాపాడి ఆస్పత్రికి తరలించారు. కానీ అతని పరిస్థితి సీరియస్‌గా మారింది. ఆదివారం రాత్రి మరణించాడు. చిన్న అజాగ్రత్త నిండు ప్రాణాలను బలిగొందని గ్రామస్తులు వాపోయారు. -
కొరియర్ పార్శిల్ బట్వాడాపై గొడవ
కోలారు : కొరియర్ పార్శిల్ ఇచ్చే విషయంపై కొరియర్ డెలివరీ బాయ్, మరో యువకుడి మధ్య గొడవ ప్రారంభమై కత్తిపోట్లకు దారి తీసిన ఘటన సోమవారం వెలుగు చూసింది. అంతకు ముందు కొరియర్ బాయ్, యువకుడి మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన కొరియర్ బాయ్ నగరంలోని కీలుకోట నివాసి పవన్, అతని సోదరుడు మోహన్లతో బైక్‌లో తాలూకాలోని ముదువాడి హొసహళ్లి గ్రామానికి చేరుకుని గ్రామానికి చెందిన చేతన్, యువరాజ్‌లతో గొడవకు దిగారు. ఆగ్రహం కట్టలు తెంచుకుని పవన్, మోహన్‌లు తమ వద్ద ఉన్న కత్తితో చేతన్, యువరాజ్‌ల కడుపులో పొడిచారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన చేతన్, యువరాజ్‌లను గ్రామస్తులు వెంటనే కోలారు ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనతో ఉద్రిక్తులైన గ్రామస్తులు గుంపుగా చేరి పవన్, మోహన్ల దుస్తులు ఊడదీసి కరెంటు స్తంభానికి కట్టివేసి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న కోలారు రూరల్ పోలీసులు హూటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తుల నుంచి మోహన్, పవన్‌లను విడిపించి స్టేషన్‌కు తీసుకు వచ్చారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదుతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
లోక్‌సభలో ఎంపీలకు మాట్లాడే హక్కు లేదా?
రాయచూరు రూరల్: లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ లోక్‌సభ సభ్యులకు మాట్లాడే హక్కు లేదా? అని రాయచూరు లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్ ఆరోపించారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు మాట్లాడానికి వీలు లేకుండా స్పీకర్లకు మైక్ కట్ చేయడాన్ని ఖండించారు. బడె్జ్ట్ పద్దులపై ప్రతిపక్ష నేతలు ప్రసంగించడానికి మైక్రో ఫోన్లు అవకాశం కల్పించక పోవడంతో త్వరలో న్యూఢిల్లీలో ఆందోళన చేపట్టనున్నట్లు నాయక్ తెలిపారు. రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు చేయాలని బీజేపీ ఎంపీ మంజునాథ్ మద్దతు ఇవ్వడంపై అభినందనలు తెలిపారు. చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, శాసన సభ్యుడు బసన గౌడ, జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్, సభ్యులు అమరే గౌడ, శాంతప్ప, శివమూర్తి, జయన్నలున్నారు. -
ముగ్గురు పోలీసులకు ముఖ్యమంత్రి పతకం
హొసపేటె: విజయనగర డీఏఆర్ ఆర్పీఐ జి.శశికుమార్, హొసపేటె రూరల్ పోలీస్ స్టేషన్ పీఎస్ఐ హెచ్.నాగరత్న, కూడ్లిగి తాలూకాలోని గుడెకోటె పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కొట్రేష్ చిమ్మల్లి ముఖ్యమంత్రి పతకాలకు ఎంపికయ్యారు. 2024వ సంవత్సరానికి ముఖ్యమంత్రి పతకాల జాబితా ప్రకటించగా జిల్లా నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. విజయనగర జిల్లా సాయుధ రిజర్వ్ ఫోర్స్‌కు చెందిన డీఏఆర్ ఆర్పీఐగా ఉన్న శశికుమార్ ఇటీవలే చిత్రదుర్గకు బదిలీ అయ్యారు.భద్రా నుంచి తుంగభద్రకు 2 టీఎంసీల నీరు● ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటనహొసపేటె: తాగునీటి అవసరాల కోసం భద్రా డ్యాం నుంచి తుంగభద్ర డ్యాంకు రెండు టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఏప్రిల్ 1, 5వ తేదీల మధ్య కాలువలోకి నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం నిర్ణయించారు. దీని వల్ల కళ్యాణ కర్ణాటకలోని కొప్పళ, రాయచూరు, యాదగిరి తదితర జిల్లాల్లో పండించే పంటలకు, ఇక్కడి ప్రజలకు తాగునీటి లభ్యత లభిస్తుంది. మార్చి 30 నాటికి భద్ర జలాశయంలో 28 టీఎంసీల నీటి నిల్వ అందుబాటులో ఉంది. ఇందులో మే 8 వరకు 11 టీఎంసీలు సాగునీటికి, 14 టీఎంసీలు తాగునీటికి అవసరం కాగా, 3 టీఎంసీల నీటిని జలాశయంలో నిలుపుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 6 నుంచి కాలువలను తాగునీటి సరఫరాకు మాత్రమే ఉపయోగిస్తారు. రైతుల పంటలకు తాగునీరు అందించడానికి ప్రభుత్వం అన్ని స్థాయిల్లో కట్టుబడి ఉందని ఆయన అన్నారు.యత్నాళ్‌తో కాంగ్రెస్ నేత భేటీపై సర్వత్రా చర్చహుబ్లీ: బీజేపీ నుంచి బహిష్కృతుడైన విజయపుర ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్ కాంగ్రెస్‌లో చేరుతారు. కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందింది అన్న చర్చలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఓ కాంగ్రెస్ నేత యత్నాళ్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. ధార్వాడ గ్రామీణ శాఖ, జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ పాటిల్ సోమవారం ప్రైవేట్ హోటల్లో యత్నాళ్‌ను కలవడంతో తమ పార్టీలోకి ఆహ్వానించారా? అన్న విషయంపై స్పష్టత రాకున్న తీవ్రంగా చర్చకు దారి తీసింది. దీన్ని యత్నాళ్ కూడా తోసిపుచ్చినా దానికి దోహద పడేలా కాంగ్రెస్ నుంచి ప్రముఖుడు కలవడం కుతుహలం రేకెత్తిస్తోంది. బెంగళూరు నుంచి మార్గమధ్యంలో హుబ్లీకి వచ్చిన యత్నాళ్‌ను అనిల్‌కుమార్ కలిసి కొద్దిసేపు హోటల్లో చర్చించడం కాకతాళీయమా? లేక పనిగట్టుకొని కలిశారా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు.శ్రీశైలం భక్తులకు అన్నదానంరాయచూరు రూరల్ : శ్రీశైల మల్లికార్జునుని దర్శనార్థం బయలుదేరి వచ్చిన కళ్యాణ కర్ణాటక, ఉత్తర కర్ణాటక ప్రజలు భక్తులకు ఉచిత భోజనం అందించారు. సోమవారం బైపాస్ రహదారిలోని ముగుళకోడ ముక్తి మందిర మైదానంలో వీరశైవ సమాజం, బసవ సమితి ఆధ్వర్యంలో శాంతమల్ల శివాచార్యులు, చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు భక్తులకు భోజనం వడ్డించారు. లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్, వీరశైవ సమాజం అధ్యక్షుడు చంద్రశేఖర్ పాటిల్, అమరేగౌడ, జయన్న, కరియప్ప, శాంతప్ప, శివమూర్తి, జయంతిరావ్ పతంగిలున్నారు.స్వయంకృషితో ఎదగాలిరాయచూరు రూరల్ : విద్యార్థులు స్వయంకృషితో ముందుకు రావాలని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్ అన్నారు. సోమవారం హరిజనవాడ ఆవరణలో నవరత్న యువక సంఘం తరఫున విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు మానసికంగా, ఆర్థికంగా, సాంఘీకంగా అభివృద్ధి చెందడానికి వీలుంటుందన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, రవీంద్ర జాలదార్, విరుపాక్షి, నరసింహులు, మల్లేశప్ప, నాగరాజ్, శరణప్ప, ప్రతిభారెడ్డి, తిమ్మయ్య, తిమ్మప్ప, అంబణ్ణ, జనార్దన్, అనిల్కుమార్లున్నారు. -
కుటుంబానికి తల్లి వెలుగు వంటిది
హొసపేటె: ప్రతిఫలం ఏమీ ఆశించకుండా మనందరికి నిరంతరం సలహాలిచ్చే తల్లి మన కళ్ల ముందు ఉండాలని కూడ్లిగి సబ్ డివిజన్ డీఎస్పీ మల్లేష్ దొడ్డమని తెలిపారు. సోమవారం పట్టణంలోని పర్యాటక కేంద్రంలో కూడ్లిగి సబ్ డివిజన్ తరపున జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. దేవుని రూపంలో ఉన్న మన తల్లి 24 గంటలూ మనకు వెలుగుగా ఉంటూ కుటుంబాన్ని సక్రమంగా నడిపిస్తూ మహిళలు సమాజానికి ఆదర్శంగా నిలిచారన్నారు. మహామహి, ఒక నిస్వార్థ వ్యక్తి అని, ఆమె చేసిన పనికి ఎటువంటి ప్రతిఫలం లేకుండా ఆమె కుటుంబ శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ పని చేశారని తెలిపారు. ప్రతి విజయవంతమైన మహిళ వెనుక ఒక పురుషుడు ఉంటాడనేది నిజం. పురుషుడు మహిళలను ప్రోత్సహించకపోతే ఎవరూ ఏమీ సాధించలేరు. జ్యోతిబాపులే అక్షర సావిత్రి బాయి పూలేలు ఆ రోజుల్లో మహిళలు విద్యకు చేరువయ్యేలా చేశారన్నారు. పురుషులు, సీ్త్రలు ఓకే నాణేనికి రెండు వైపులా ముఖాలన్నారు. పితృస్వామ్య సమాజంలో కూడా నేడు మహిళలు అన్ని రంగాల్లో తమను తాము విజయవంతంగా నిరూపించుకున్నారన్నారు. అసమర్థులు కాదు, సమర్థులు, భారతదేశంలో మహిళలు తమ హక్కుల కోసం మాత్రమే కాకుండా మహిళా సమానత్వం కోసం కూడా పోరాడారు. రాజారామ్ మోహన్ రాయ్ సహా అనేక మంది మహానుభావులు స్వాతంత్య్రానికి ముందు సతీ ఆచారాన్ని వ్యతిరేకించి, సీ్త్రస్వేచ్ఛ కోసం పోరాడారనే వాస్తవం ఈ నేల సంస్కృతికి నిదర్శనమన్నారు. ఇతర దేశాల్లో మహిళలు తమ హక్కుల కోసం స్వయంగా పోరాడాల్సి వస్తోందన్నారు. అనంతరం వివిధ రంగాల్లో గణనీయమైన సేవలందించిన ప్రముఖులను సన్మానించారు. -
బ్యాంకు దొంగల అరెస్టు, 17 కేజీల బంగారం సీజ్
యశవంతపుర: దావణగెరె జిల్లా న్యామతి ఎస్బీఐ బ్యాంక్‌లో దోపిడీకేసులో ఆరుమంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.15 కోట్ల విలువగల 17 కేజీల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఐజీ రవికాంతేగౌడ వివరాలను వెల్లడించారు. సినిమా లెవెల్లో లూటీ తమిళనాడులో మదురై ప్రాంతానికి చెందిన విజయకుమార్ (30), అజయకుమార్ (28), పరమానంద (30), అభిషేక్ (23), చంద్రు (23), మంజునాథ్ (32)లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 2024 అక్టోబర్ 28న దావణగెరె న్యామతి ఎస్బీఐ బ్యాంక్‌లో గ్రిల్స్‌ను తొలగించి ప్రవేశించిన దొంగలు సీసీ కెమెరాల తీగలు, అలారం తీగలను కత్తిరించారు. ఆపై లాకర్లను పగలగొట్టి బంగారు నగలను దోచుకెళ్లారు. ఖాతాదారులు తాకట్టు పెట్టిన 17 కేజీల బంగారు ఆభరణాలు దొంగల పాలయ్యాయి. ఇది జిల్లాలోనే కాదు రాష్ట్రంలో సంచలనం కలిగించింది. మొబైల్ టవర్లలో దొరికిపోతామనే భయంతో దొంగలు మొబైల్ ఫోన్లను వాడలేదు. పోలీసులకు ఎలాంటి ఆధారం లభించకుండా ప్లాన్ చేశారు. లోతైన గుంతలో నగల పెట్టెలు జిల్లా పోలీసులు అప్పటినుంచి కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ముమ్మరంగా గాలించి దొంగలను పట్టుకున్నారు. దొంగలు తమిళనాడులోని మదురై వద్ద ఉసిలంపట్టి అనే ఊరిలో ఊరిబయట గుంత తవ్వి అందులో నగల పెట్టెలను దాచిఉంచారు. విజయకుమార్ ఈ కేసులో సూత్రధారిగా గుర్తించారు. అతడు బేకరీ నడుపుతూనే దొంగతనాలకు పాల్పడేవాడని గుర్తించారు. ఆభరణాలతో పాటు దోపిడీకి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీడిన న్యామతి బ్యాంకు రాబరీ కేసు గతేడాది అక్టోబరులో దావణగెరె జిల్లాలో ఘటన నిందితులు తమిళనాడువాసులు -
భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు
సాక్షి,బళ్లారి: నెల రోజుల పాటు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేపట్టి పవిత్రంగా రంజాన్ ఆచరించిన ముస్లిం సోదరులు తమ ఉపవాస దీక్షలు విరమించారు. సోమవారం రంజాన్ పర్వదినం సందర్భంగా నెల రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఆచరించిన ఉపవాసాన్ని విరమించి రంజాన్ పండుగను జరుపుకున్నారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో ముస్లిం సోదరులు ఇంటింటా ప్రతి ఒక్కరు కొత్త బట్టలు ధరించి మహిళలు ఇంట్లోనే ప్రార్థనలు చేయగా, పురుషులందరూ చిన్నా, పెద్దా, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన మసీదుల్లో ప్రార్థనలు చేశారు. నగరంలో ప్రముఖంగా ఈద్గా మైదానంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు చేరి సామూహిక ప్రార్థనలు చేశారు. ముస్లిం మత గురువు ముస్లిం సోదరులతో సామూహిక ప్రార్థనలు చేయించి ఉపవాస దీక్షలు విరమింపజేశారు. పవిత్ర రంజాన్ వేళ వేలాది మంది ముస్లిం సోదరులు ఒకే చోట చేరిన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆయా మసీదుల వద్దకు చేరుకుని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలో ప్రముఖ ఈద్గా మైదానం వద్దకు చేరుకుని లోక్‌సభ సభ్యుడు తుకారాం, రాజ్యసభ సభ్యుడు నాసిర్ హుస్సేన్, నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి తదితరులు ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మసీదులు, ఈద్గాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘనంగా రంజాన్ పండుగ హొసపేటె: రంజాన్ పండుగ వేడుకలు సోమవారం ముస్లిం సోదరులు విజయనగర జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆర్టీఓ కార్యాలయం వెనుక ఉన్న ఈద్గా మైదానంలో ఉదయం 7.30 గంటలకు, కేఆర్‌టీసీ బస్ డిపో సమీపంలోని కొత్త ఈద్గా మైదానంలో ఉదయం 8.30 గంటలకు, చిత్తవాడిగి, కారిగనూరు ఈద్గా మైదానాల్లో ఉదయం 9 గంటలకు, నాగేనహళ్లి ఈద్గా మైదానంలో ఉదయం 9.30 గంటలకు, టీబీ డ్యాం ఈద్గా మైదానంలో ఉదయం 10 గంటలకు సామూహిక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. ప్రతిచోటా శాంతియుత సామూహిక ప్రార్థనలు జరిగాయి. ముందుగా ఊరేగింపులో నడిచిన వ్యక్తులు ఒకరినొకరు పలకరించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. బంధువులు, స్నేహితులను ఇంటికి ఆహ్వానించి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం కూడా ఒక సాధారణ దృశ్యం. కొత్త బట్టలు ధరించి మండుతున్న ఎండలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులను కలిసి సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు ఎట్టకేలకు పవిత్ర ఉపవాస దీక్షల విరమణఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు రాయచూరు రూరల్: ముస్లిం సోదరులు ఈద్గా మైదానంలో సోమవారం ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేశారు. అత్యంత భక్తిశ్రద్ధలతో నమాజ్ చేశారు. చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు మాట్లాడుతూ జిల్లాలో హిందూ, ముస్లింలు అన్నదమ్ములుగా ఉన్నామన్నారు. మనమంతా ఒక్కటే అనే భావాలను చాటడానికి రంజాన్ పండుగ చేసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. జిల్లాధికారి నితీష్, ఎస్పీ పుట్టమాదయ్య, రవి, లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్‌లున్నారు. మాన్విలో శాసన సభ్యుడు హంపయ్య నాయక్, తలమారిలో గ్రామీణ శాసన సభ్యుడు బసన గౌడ ప్రార్థనల్లో పాల్గొన్నారు. -
మది నిండా రంజాన్ శోభ
తుమకూరు: నెల రోజుల పాటు కఠిన ఉపవాసాలు ఉండిన ముస్లిం సోదరులు సోమవారం రంజాన్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించారు. ఉదయమే మసీదులు, ఈద్గాలకు వెళ్లి విశేష ప్రార్థనలు చేశారు. రంజాన్ సందేశాన్ని మతగురువులు వినిపించారు. ఈ సందర్భంగా పిల్లలూ పెద్దలూ పరస్పరం ఈద్ ముబారక్ అని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బెంగళూరులోని ప్రఖ్యాత చామరాజపేట ఈద్గా మైదానంలో వేలాదిగా ప్రార్థనల్లో పాల్గొన్నారు. చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. అన్ని జిల్లాల్లోని ప్రధాన నగరాల్లో రంజాన్ శోభ కనిపించింది. బంధుమిత్రులతో విందు భోజనాలను ఆరగించారు. తుమకూరులో కుణిగల్ రోడ్డులోని ఈద్గా మైదానంలో ప్రార్థనాలు చేశారు. హోం మంత్రి జీ.పరమేశ్వర్, పెద్దసంఖ్యలో మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఎక్కడా అవాంఛనీయాలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ఈద్ ఆచరణ అంతటా సామూహిక ప్రార్థనలు -
ఒపెక్ ఆస్పత్రి ఉద్యోగులకు బకాయి వేతనాలేవీ?
రాయచూరు రూరల్: ఒపెక్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు బకాయి వేతనాలు చెల్లించాలని రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఒపెక్ ఆస్పత్రి ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం ఒపెక్ ఆస్పత్రి వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మానసయ్య మాట్లాడారు. 20 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న వారికి ఆరు నెలల నుంచి వేతనాలు లేవన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి పని భారం తగ్గించాలన్నారు. ఒపెక్ ఆస్పత్రి యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. అల్లమ ప్రభు జయంతి రాయచూరు రూరల్ : శతమాన శ్రేష్ట శరణ చింతకుడు అల్లమ ప్రభు జయంతి ఉత్సవాలను సోమవారం బసవ కేంద్రంలో ఆచరించారు. బసవ కేంద్రంలో అల్లమ ప్రభు చిత్రపటానికి కేంద్రం అధ్యక్షుడు రాచనగౌడ పుష్పాంజలి ఘటించి మాట్లాడారు. అల్లమ ప్రభు పేదల పాలిట దేవుడని, వారి ఆకలిని తీర్చిన అన్నదాతగా చిరస్మరణీయుడన్నారు. 1645 వచనాలను రాసిన మహా మేధావి అన్నారు. ఈ సందర్భంగా శివకుమార్, చెన్నబసవ, వెంకణ్ణ, మల్లికార్జున, రాఘవేంద్రలున్నారు. పోస్టర్ విడుదల హుబ్లీ: ఆకలి గొన్న వారికి అన్నం పెట్టడం కన్నా గొప్ప కార్యం మరొకటిది లేదు. తమకు చేత కాకున్నా ఉన్న వారి నుంచి అన్నాన్ని సేకరించి అవసరమైన వారికి పంపిణీ చేస్తున్న కరియప్ప, సునంద శిరహట్టి దంపతులు చేస్తున్నది పుణ్య సేవ అని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అరళి నాగరాజ్ గంగావతి తెలిపారు. సోమవారం ఆనంద నగర్లో కరియప్ప శిరహట్టి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హసిదవర అన్న జోళిగె పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఆ దంపతులు పేదలైన నిరాశ్రయులకు, నిర్భాగ్యులకు ఏమైనా సాయ పడాలన్న ఉద్దేశంతో అన్న జోళిగె కార్యక్రమాన్ని నిరంతరంగా చేపట్టడం ఆదర్శప్రాయం అన్నారు. ఈ సందర్భంగా కళ్యాణి, అశోక్ అణ్ణిగేరి తదితరులు పాల్గొన్నారు. -
శాంతికి చిహ్నం రంజాన్
చెళ్లకెరె రూరల్: ముస్లిం బాంధవులు నెలంతా భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు జరిపి పండుగను ఆచరించడం సంతోషదాయకం అని ఎమ్మెల్యే టి.రఘుమూర్తి తెలిపారు. ఆయన బెంగళూరు రోడ్డులోని ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనల్లో పాల్గొని మాట్లాడారు. ముస్లిం సమాజ గురువు నూర్ ఉద్దీన్ మౌలాన్ రంజాన్ పండుగ విశేషతను తెలిపారు. అనంతరం ముస్లిం బాంధవులు శుభాంకాక్షలు తెలుపుకున్నారు. నగరసభ అధ్యక్షురాలు మంజుల ప్రసన్నకుమార్, ఉపాధ్యక్షురాలు ఉమా భరమయ్య, నగరసభ సభ్యులు పాల్గొన్నారు. -
పనుల కేటాయింపులో పీడీఓ పక్షపాతం
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా మస్కి తాలూకా తోరణ దిన్ని పంచాయతీ పీడీఓపై చర్యలు చేపట్టాలని ఆ పంచాయతీ మాజీ అధ్యక్షురాలు చంద్రమ్మ డిమాండ్ చేశారు. శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడారు. నవంబర్‌లో గ్రామ పంచాయతీ సభలో తీసుకున్న నిర్ణయం మేరకు వార్డుల్లో పనుల చేపట్టడానికి రూ.35 లక్షలు మంజూరు కాగా పీడీఓ తిమ్మప్ప నాయక్ పంచాయతీ అధ్యక్షుడితో కుమ్మకై ్క పనులు కేటాయించడంలో పక్షపాతం చూపుతున్నారని ఆమె ఆరోపించారు. కార్యాలయం నుంచి బయటకు వెళ్లాలని పీడీఓ హుకుం జారీ చేశాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టెన్త్ పరీక్షలకు 463 మంది గైర్హాజరుహొసపేటె: ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు శనివారం కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా 71 పరీక్షా కేంద్రాలు ఉండగా 20246 మంది విద్యార్థులు హాజరైనట్లు, 463 మంది గైర్హాజరైనట్లు డీడీపీఐ వెంకటేష్ రామచంద్రప్ప తెలిపారు. హగరిబొమ్మనహళ్లిలోని 12 కేంద్రాల్లో 3012 మంది హాజరు కాగా, 53 మంది గైర్హాజరయ్యారన్నారు. హోస్పేటలోని 20 కేంద్రాలకు 5658 మంది హాజరు కాగా, 140 మంది గైర్హాజరయ్యారన్నారు. 9 కేంద్రాల్లో జరిగిన ఫ్లవర్ బోట్ పరీక్షకు 2757 మంది హాజరు కాగా, 33 మంది గైర్హాజరయ్యారన్నారు. కూడ్లిగిలోని 17 కేంద్రాల్లో 4811 మంది హాజరు కాగా, 122 మంది గైర్హాజరయ్యారన్నారు. హరపనహళ్లిలో 13 కేంద్రాల్లో4008 మంది హాజరు కాగా, 115 మంది గైర్హాజరయ్యారన్నారు. -
యత్నాళ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలి
రాయచూరు రూరల్: విజయపుర శాసనసభ్యుడు బసన గౌడ పాటిల్ యత్నాళ్‌పై బీజేపీ అధిష్టానం విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని హిందూపర సంఘటనలు ఉద్యమించాయి. ఈమేరకు నాయకులు శుక్రవారం రాత్రి విజయపుర నగరలోని సిద్దేశ్వర ఆలయం నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. మాజీ సీఎం యడియూరప్ప, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర దిష్టిబొమ్మలను దహనం చేశారు. స్వామి వివేకానంద సేన అధ్యక్షుడు రాఘవ మాట్లాడుతు తండ్రీకొడుకుల కుమ్మక్కుతో గౌడను బహిష్కరించారని ఆరోపించారు. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రుద్రగౌడ, పాటిల్, నాగరాజ్గురు గచ్చిన మనె, ప్రతాప్ పాల్గొన్నారు. లోకాయుక్త వలలో ఇద్దరు అధికారులు బళ్లారి రూరల్: లంచం తీసుకుంటూ ఇద్దరు బెస్కాం అధికారులు లోకాయుక్తకు చిక్కారు. దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా మల్లాపురానికి చెందిన రైతు సోమశేఖరప్ప పొలంలో విద్యుత్తు మీటర్ ఎడాది క్రితం కాలిపోయింది. కొత్తమీటరు ఏర్పాటుచేయాలని సంతెబెన్నూర్ జెస్కాం అసిస్టెంట్ ఇంజినీరు మోహన్‌కుమార్, సెక్షన్ అధికారిని సంప్రదించాడు. మీటర్ బిగించడానికి రూ.10వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో రైతు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. పథకం ప్రకారం శనివారం నగదు చెల్లిస్తుండగా లోకాయుక్త కమిషనర్ ఎం.ఎస్. కౌలా పూర, ఉపకమిషనర్ కళావతి ఆధ్వర్యంలో అధికారులు హెచ్.గురు బసవరాజ,సరళ దాడి చేశారు. జెస్కాం అసిస్టెంట్ ఇంజనీరు మోహన్ కుమార్, సెక్షన్ అధికారిని అదుపులోకి తీసుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు. కుట్టుమిషన్ల పంపిణీ హొసపేటె: దివంగత దేవరాజ అరస్ వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2022–23 సంవత్సరానికి సంబంధించి 26 మంది లబ్ధిదారులకు శనివారం నగరంలో గాంధీచౌక్ సమీపంలోని రీడింగ్ రూమ్ ఆవరణలో కుట్టు యంత్రాలను ఎమ్మెల్యే గవియప్ప పంపిణీ చేశారు. అదేవిధంగా పరిశ్రమలు, వాణిజ్య శాఖ, గ్రామీణ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 41 మందికి ఉచిత విద్యుత్ కుట్టు యంత్రాలను పంపిణీ చేశారు. టీబీ డ్యామ్ 19వ క్రస్ట్ గేట్ ఊడిపోవడం వల్ల నష్టపోయిన 80 మంది మత్స్యకారులకు రూ.30వేలు చొప్పున పరిహారం చెల్లించారు. రూ.10వేల విలువైన ఫిషింగ్ కిట్లను పంపిణీ చేశారు. ఉచిత పథకాలు ప్రమాదకరం హుబ్లీ: ఉచిత పథకాలు ప్రమాదకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే, రాష్ట్ర పాలన, సంస్కరణ పాలన అధ్యక్షుడు ఆర్వీ దేశ్‌పాండే అన్నారు. ఉత్తర కన్నడ జిల్లా దాండేలి అంబే వాడిలో నూతనంగా నిర్మించిన సహయ ప్రాంతీయ రవాణా శాఖఅధికారుల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు ఏమి కూడా ఉచితంగా ఇవ్వరాదన్నారు.మహిళలకు శక్తి పథకం కింద ఉచిత ప్రయాణ సౌలభ్యాన్ని కల్పించారని, ఈ పథకాన్ని పురుషులకు కూడా విస్తరించాలన్న డిమాండ్ వినిపించిందన్నారు. అన్నిటిని ఉచితంగా ఇస్తే ప్రభుత్వం రవాణా సంస్థలను ఎలా నడపగలదని ఆయన ప్రశ్నించారు. -
బైక్‌ను ఢీకొన్న బస్సు.. ఇద్దరి మృతి
● 40 మంది ప్రయాణికులకు గాయాలు సాక్షి,బళ్లారి: బస్సు బైక్‌ను ఢీకొని బోల్తా పడిన ఘటనలో ఇద్దరు దంపతులు దుర్మరణం చెందగా 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈఘటన ముధోళ తాలూకా ముగళకోడ గ్రామ సమీపం జరిగింది. గ్రామానికి చెందిన శంకరప్ప(55) శ్రీదేవి(45) దంపతులు ఉగాది పర్వదినం పురస్కరించుకొని ముందు రోజు అమావాస్య సందర్భంగా పొలంలో పూజలు చేసేందుకు బైక్‌లో వెళ్లారు. తిరిగి వస్తుండగా యాదగిరి జిల్లా చిక్కొడికి చెందిన బస్సు బైక్‌ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో దంపతులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా బస్సులో ఉన్న దాదాపు 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ముధోళ పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఆకట్టుకున్న బయలాట ప్రదర్శన
బళ్లారి అర్బన్: అభినయ కళా కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి సిరిగుప్ప తాలూకా బూదిగుప్ప గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామీణ కళా సౌరభ కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. కార్యక్రమాన్ని వీఎస్‌ఎస్‌ఎన్ అధ్యక్షుడు నాగిరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. కన్నడ సాంస్కృతిక శాఖ గ్రామీణ ప్రాంతంలో బయలాట కళకు ప్రోత్సహం అందించడం హర్షనీయమన్నారు. శ్రీ బసవేశ్వర రంగసజ్జ యజమాని విశ్వనాథ్ సౌకర వేదికను అద్భుతంగా తీర్చిదిద్దారు. సిడిగినమళే బలే సిద్దప్ప, రచించిన వీరఅభిమన్యు నాటకంలో కృష్ణార్జునల ఘట్టాలను కళాకారులు చక్కగా ప్రదర్శించారు. కళా కేంద్ర అధ్యక్షుడు సీనియర్ కళాకారుడు కే.జగదీశ్, సీనియర్ కళాకారులు ఈరప్ప సౌకర, రంగరెడ్డి మేస్టారు, ఎర్రిస్వామి మేస్టారు, వందవాగలి సిద్దప్ప, కవి సోమశేఖర్ పాల్గొన్నారు. జీవన్, చక్రవర్తి, హులూరు రమేష్, దొడ్డ హనుమంతలు తమ పాత్రలలో ప్రతిభ చాటి ప్రేక్షకుల మన్నన పొందారు. సీనియర్ సంగీత కళాకారుడు వీరాపుర రంగారెడ్డి, సిద్దప్ప, బూదిగుప్ప ఎర్రిస్వామి, ఆర్మోనియంతో తమదైన శైలిలో బైలాటను రక్తికట్టించారు. బసవరాజ్ తబళ, చిక్కన్న తదితరులు ఇతర సహయ సహకారాలు అందించారు. -
ఉద్యోగిని సేవలు మరువలేనివి
బళ్లారి రూరల్ :బీఎంసీఆర్‌సీలో మేట్రిన్ (నర్సింగ్ సూపరింటెండెంట్) కె.నాగరత్నమ్మ సేవలు మరవరానివని బీఎంసీఆర్‌సీ డీన్ డాక్టర్ గంగాధరగౌడ అన్నారు. కె.నాగరత్నమ్మ ఉద్యోగ విరమణ సదర్భంగా శనివారం ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్టాఫ్ నర్సుగా బళ్లారి మెడికల్ కళాశాలలో చేరి అనంతరం విమ్స్ హెడ్‌నర్సుగా, మేట్రిన్‌గా, బీఎంసీఆర్‌సీ మేట్రిన్‌గా రోగులకు విశేష సేవలు అందించారన్నారు. నాగరత్నమ్మ అందరిపట్ల సౌమ్యంగా మాట్లాడేవారని, ఆమెను తల్లిలా భావించేవాడినని తెలిపారు. అనంతరం కె.నాగరత్నమ్మ దంపతులను సన్మానించారు. ప్రిన్స్‌పాల్ డాక్టర్ మంజునాథ్ సూపరిన్టెండెంట్లు డాక్టర్ ఇందుమతి, డాక్టర్ శివనాయక్, నర్సులు సిబ్బంది పాల్గొన్నారు. -
పారువేటను హలాల్ రహితంగా నిర్వహించుకోవాలి
హుబ్లీ: ఉగాది అనంతరం పారువేటను హాలాల్ రహితంగా నిర్వహించుకోవాలని శ్రీరామ సేనా ముఖ్యస్తులు ప్రమోద్ ముతాలిక్ సూచించారు. ధార్వాడలో మీడియాతో మాట్లాడారు. హాలాల్ అన్నది ఇస్లాంకు సంబంధించింది. అది హిందూవులకు సంబంధించినది కాదన్నారు. బసవన్నగౌడ పాటిల్ యత్నాల్ బహిష్కరణ గురించి ఆయన మాట్లాడుతూ బీజేపీ హై కమాండ్ ఈ విషయంలో పునర్ పరిశీలించాలని సూచించారు. తండ్రి మృతి చెందిన దుఃఖంలోనూ పరీక్షకు హాజరు హొసపేటె: తండ్రి మరణించిన దుఃఖంలోనూ టెన్త్ విద్యార్థి పరీక్షకు హాజరయ్యాడు. హోస్పేట్లోని టీబీ డ్యామ్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థి హరిధరన్ తండ్రి సెల్వకుట్టి శుక్రవారం తమిళనాడులో అనారోగ్యంతో మరణించాడు. తండ్రి ఆరోగ్యం క్షీణించినప్పుడు హరిధరన్ తమిళనాడు వెళ్లి చూచి వచ్చాడు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో సెల్వకుట్టి మృతి చెందాడు. అయినా ఆ బాధను దిగమింగి హరిధరన్ పరీక్ష రాశాడు. నీటి వనరులను పరిరక్షించాలి హుబ్లీ: కేఎల్ఈ సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విశ్వజల దినోత్సవాన్ని ఘనంగా ఆచరించారు. జలవనురుల శాఖ, నీటిపారుదల కార్పొరేషన్ ధార్వాడ విభాగం చీఫ్ ఇంజినీర్ అశోక్ ఎల్ వాసన్ మాట్లాడుతూ నీటి పొదుపు పాటించి బావి తరాలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా నీటి పొదుపు వినియోగం పరకరాల ప్రదర్శణ ఏర్పాటు చేశారు -
ఉగాది వేడుకలకు సర్వం సిద్ధం
సాక్షి,బళ్లారి: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు తెలుగు ప్రజలు, కన్నడిగులు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఆదివారం ఉగాదిని పురస్కరించుకొని పండగు సరుకుల కోసం శనివారం ప్రజలు మార్కెట్లకు పోటెత్తారు. బళ్లారిలోని బెంగళూరు రోడ్డులోని దుకాణాలు కిటకిటలాడాయి. పూలు, పండ్లు, దుస్తుల దుకాణాలు కొనుగోలు దారులతో నిండిపోయాయి.మరో వైపు ఇళ్లను శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణాలతో అలంకరించుకున్నారు. ఉగాది పచ్చడి చేసుకునేందుకు వేపపూతను సేకరించుకున్నారు. ఖరీఫ్ సీజన్లో తుంగభద్ర ఆయకట్టు కింద సాగు చేసిన పంటలు చేతికందడంతో పండుగను ఉత్సాహంగా చేసుకునేందుకు రైతులు సిద్ధమయ్యారు. జంట నగరాల్లో ఉగాది వేడుకలు హుబ్లీ: జంట నగరాలలో ఉగాది ఉత్సవాలు శనివారం నుంచే ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో వేకువజాము నుంచే ప్రత్యేక పూజలతో పాటు విశేష కార్యక్రమాలను నిర్వహించారు. నవనగర్ సమీపంలోని పంచాక్షరిలోని కాళికాదేవి మహాభిషేకం నిర్వహించి నైవేద్యం సమర్పించి మహామంగళహారతి ఇచ్చారు. అలాగే ధనధాన్యాలను సమర్పించి సేవలు నెరవేర్చారు. ఆదివారం పాడ్యమి రోజు కాళిక దేవికి సందేశ పోతేదార కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నూతన పల్లకీ సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. పల్లకీని బన్ని మహంకాళి ఆలయం నుంచి పూర్ణకుంభాలు, వివిధ వాయిద్యాల ప్రదర్శనతో ఆలయానికి తీసుకువస్తారు. -
1 నుంచి ఉపాధి పథకం కూలీ పెంపు
బళ్లారిటౌన్: ఉపాధి హామీ పథకం కూలీలకు ఏప్రిల్ 1నుంచి కూలీ మొత్తం పెరగనుంది. రోజుకు రూ.370కు పెంచి ఎండకాలంలో నిరంతరం 100 రోజులు పని కల్పిస్తున్నట్లు జిల్లా పంచాయతీ సీఈఓ మహమ్మద్ హ్యరీష్ సుమైర తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రూ.349 ఉన్న కూలీని సవరించి రూ.370కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. కార్మికులు నమూన 6లో దరఖాస్తులను గ్రామ పంచాయతీలో సమర్పించి 100 రోజులు ఈ పనినిలో పాల్గొనవచ్చునన్నారు. మరిన్ని వివరాలకు ఆయా గ్రామ పంచాయతీలో తెలుసుకొవచ్చునని పేర్కొన్నారు. -
దుర్గామాతకు ఉగాది పూజలు
మాలూరు: ఉగాది అమావాస్య కావడంతో తాలూకాలోని లక్కూరు గ్రామంలో వెలసిన శ్రీ దుర్గాదేవి దేవాలయంలో శనివారం విశేష పూజలను నిర్వహించారు. మూల విగ్రహానికి మల్లెలు, కనకాంబరాలు తదితర పుష్పాలతో గండభేరుండ రూపంలో అలంకరించి మహా మంగళహారతి ఇచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు అమ్మవారికి కుంకుమ పసుపు, గాజులను సమర్పించారు. కంబీల మధ్య గజ యాతన మైసూరు: అడవిలో ఉన్న రైలు పట్టాలకు అటు ఇటు ఉన్న ఇనుప కంబీల మధ్యలో చిక్కి అడవి ఏనుగు తీవ్ర ఇబ్బందులు పడింది. మైసూరు జిల్లాలోని సరగూరు తాలూకాలోని బాడగ గ్రామానికి సమీపంలో ఈ సంఘటన జరిగింది. దగ్గరిలోని అడవిలో నుంచి ఆహారం వెతుక్కుంటూ ఓ ఏనుగు వస్తూ రైలు పట్టాలకు అటు ఇటు అడ్డుగా ఉన్న కంబీలను దాటడానికి ప్రయత్నించి వాటి కింద ఆ భారీకాయం చిక్కుకుపోయింది. ఘీంకారాలు చేస్తూ ఉండడంతో గ్రామస్తులు చూసి అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వచ్చి ఏనుగును కంబీలను తొలగించి ఏనుగును బయటకు తీయడంతో గండం తప్పింది. 1న గురువందనకు రాజ్‌నాథ్ తుమకూరు: సిద్ధగంగ మఠం దివంగత త్రివిధ దాసోహి శివకుమారస్వామి 118వ గురువందన వేడుకకు ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొంటారని కేంద్రమంత్రి వి.సోమన్న తెలిపారు. శనివారం తుమకూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. మఠంలో ఏప్రిల్ 1వ తేదీన వేడుకలు జరుగుతాయని, ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొంటారని తెలిపారు. -
బైక్‌ను చెత్త లారీ ఢీ, బాలుడు మృతి
● లారీకి జనం నిప్పు ● బెంగళూరులో దుర్ఘటన యశవంతపుర: బీబీఎంపీ చెత్త లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలుడు చనిపోయాడు, బెంగళూరు థణిసంద్ర రైల్వే ట్రాక్ వద్ద ఈ విషాదం జరిగింది. వివరాలు.. కొడుకు ఐమాన్ (10)ను తీసుకుని తండ్రి బైక్‌లో స్కూల్‌కి బయల్దేరాడు. వెనుక నుంచి వేగంగా వచ్చిన చెత్త లారీ ఢీకొనడంతో ఇద్దరూ కింద పడిపోయారు. ఐమాన్ తీవ్ర గాయాలతో అక్కడే మరణించగా, తండ్రి గాయపడి అంబేడ్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కళ్ల ముందే దుర్ఘటనతో ఆక్రోశానికి గురైన స్థానికులు చెత్త లారీకి నిప్పు పెట్టడంతో కాలిపోయింది. ధణిసంద్రలో చెత్త లారీలు ఢీకొని ఇప్పటికి నలుగురు మరణించడంపై స్థానికులు మండిపడ్డారు. యలహంక పోలీసులు పరిశీలించారు. మూడు నెలల క్రితం ధణిసంద్ర మెయిన్‌రోడ్డులో బీబీఎంపీ చెత్త లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోయారు. ఉడుపిలో లవ్ గొడవ ● తండ్రి వర్సెస్ కుమార్తె ఫిర్యాదులు యశవంతపుర: తన కూతురిని అన్య మతానికి చెందిన వ్యక్తి అపహరించాడని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఉడుపి నగరంలో జరిగింది. తమ కుమార్తె జీనా మెరీల్.. కాలేజీకి వెళ్లి వస్తుండగా మహ్మద్ అక్రం కిడ్నాప్ చేశాడని, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవడానికి దరఖాస్తు చేశాడని తండ్రి దేవదాస్ తెలిపారు. ఈ పెళ్లికి అనుమతి ఇవ్వవద్దని కోరారు. గతంలోను నిందితుడు తన కుమార్తె వెంట పడడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఇదిలా ఉంటే, సదరు యువతి, అక్రంలు దేవదాసుపైనే ఆరోపణలు చేయడం గమనార్హం. తమ ప్రేమ, పెళ్లికి దేవదాస్ అడ్డుపడుతున్నట్లు ఎస్పీకి, మల్పె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇద్దరు పరారీలో ఉన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు అక్రంపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
క్రిమినల్ చర్యలు చేపట్టాలి
రాయచూరురూరల్: నగరలోని మోథడిస్ట్ చర్చి, బాల్డ్విన్ విద్యాసంస్థ మాజీ చీఫ్ యనయల్, కర్కరేపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని మోథడిస్ట్ చర్చి ఇండియా నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద అందోళనకు దిగారు. జిల్లాద్యక్షుడు అబ్రహాం జో హన్ మాట్లాడారు. కర్కరే 2016 నుంచి ఆయా సంస్థలకు వ్యతిరేకంగా వ్యవహరించారన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అధికారికి వినతి పత్రం సమర్పించారు. ధర్నాలో డ్యానియల్, సురేంద్ర, అశీర్వాదం, నందకుమార్, ప్రమోద్, సిమోన్, రుబిన్, లక్ష్మయ్య, శాంతరాజ పాల్గొన్నారు. -
పశువుల స్నానం.. ముగ్గురికి మృత్యుపాశం
మైసూరు: ఉగాది పండుగ సందర్భంగా పశువులను కడగడానికి చెరువులోకి వెళ్ళిన ముగ్గురు అనుకోకుండా నీట మునిగి చనిపోయారు. జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని కామనహళ్ళిలో శనివారం ఈ విషాద సంఘటన జరిగింది. వినోద్ (17), బసవేగౌడ (45), ముద్దేగౌడ (48)లు పండుగ కావడంతో తమ పశువులకు స్నానం చేయించి అలంకరించాలని చెరువుకు తీసుకెళ్లారు. ఓ ఎద్దు బెదిరి చెరువులోకి పరుగులు తీసింది. తాడు పట్టుకుని ఉన్న వినోద్‌ను కూడా లాక్కెళ్లింది. మిగతా ఇద్దరు అతన్ని కాపాడాలని వెళ్లారు. కానీ నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి చెరువులో గాలించి మృతదేహాలను బయటకు తీశారు. కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామంలో విషాదం తాండవించింది. -
ఎయిమ్స్ ఏర్పాటుకు వినతి
రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎయిమ్స్ పోరాట సమితి ప్రధాన సంచాలకుడు బసవరాజ్ కళస డిమాండ్ చేశారు. శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాదజోషిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ గతంలో అనేక మార్లు సీఎం సిద్దరామయ్య, ప్రధాని మోదీకి వినతిపత్రాలు అందించామన్నారు. మరోసారి ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.బాలికపై కుక్కల గుంపు దాడిరాయచూరురూరల్: బాలికపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈఘటన రాయచూరు తాలూకా మర్చటాల్ గ్రామంలో జరిగింది. చైత్ర అనే తొమ్మిదేళ్ల బాలిక శనివారం ఉదయం తన ఇంటి వద్ద అడుకుంటుండగా కుక్కల గుంపు చుట్టుముట్టింది. బాలిక కేకలు వేస్తూ తప్పించుకునేందుకు యత్నించగా కుక్కలు వెంటాడి కరిచాయి. దీంతో బాలక ఒంటిపై పది చోట్ల గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు బాలికను రిమ్స్‌కు తరలించారు. కాగా కుక్కల బెడదను నివారించాలని గ్రామ పంచాయతీ అధికారులకు సూచించినా స్పందన లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలిరాయచూరు రూరల్: జిల్లాలోని తుంగభద్ర–కృష్ణా నదీ తీర ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణపై జిల్లా కలెక్టర్ నిఘా ఉంచాలని జన సంగ్రామ పరిషత్ అధ్యక్షుడు రాఘవేంద్ర కుిష్టిగి డిమాండ్ చేశారు. శనివారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రాజకీయ నాయకుల అనుచరులు ఇష్టానుసారంగా ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. తవ్వకాలకు కొంత అనుమతి పొంది ఎక్కువ విస్తీర్ణంలో తవ్వకాలు చేపడుతున్నారని, ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందన్నారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాపై కొరడా ఝుళిపించాలని డిమాండ్ చేశారు.విద్యుత్ చార్జీల పెంపు అన్యాయంరాయచూరురూరల్: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐఎం లిబరేషన్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం నగరంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద అందోళన చేపట్టారు. జిల్లాధ్యక్షుడు అజీజ్ జాగిర్దార్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థల సిబ్బంది వేతనాల కోసం చార్జీలు పెంచడం దారుణమన్నరు. యూనిట్‌కు 36 పైసలు పెంచడంతో పేద, మధ్య తరగతి ప్రజలపై పెను భారం పడుతుందన్నారు. పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అంజినేయ, రవిచంద్ర, హనీఫ్, జిలాని, మహేంద్ర, అనంద్ పాల్గొన్నారు.నీటి ఎద్దడి తలెత్తనివ్వంరాయచూరు రూరల్: కృష్ణానది తీర ప్రాంత గ్రామాల ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారం పాండ్వే అన్నారు. శనివారం ఆయన గుర్జాపూర్ అనకట్టను పరిశీలించారు. కృష్ణా నది నుంచి పంప్ సెట్ల ద్వారా గ్రామాలకు నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. మంచినీటి పథకాలకు మరమ్మతులు చేపట్టి నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. -
పండుగకు వస్తుండగా మృత్యు పంజా
సాక్షి,బళ్లారి: పొట్టకూటి కోసం సుదూర ప్రాంతానికి వెళ్లి ఉగాది పండుగను స్వగ్రామంలో కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా చేసుకోవాలని వస్తున్న వారిపై మృత్యువు పంజా విసిరింది. చిత్రదుర్గం జిల్లా చెళ్లకెర తాలూకా హెగ్గేరి ఫ్యాక్టరీ సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఏడుగురు గాయపడ్డారు. చెళ్లకెర తాలూకా తిమ్మననహళ్లి లంబాడిహట్టి గ్రామానికి చెందిన అన్నదమ్ములు కుమారనాయక్(46),శంకర్బాయ్(65)లు బతుకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లారు. టెంపో వాహనం, కారు కొనుగోలు చేసుకుని బాడుగులకు తిప్పుతూ జీవనం సాగిస్తున్నారు. ఉగాది పండుగను స్వగ్రామంలో చేసుకోవాలని భావించి రెండు కుటుంబాల వారు టెంపో వాహనంలో బయల్దేరారు. మరో గంటలో ఊరికి చేరుకోవాల్సి ఉండగా చెళ్లకెర తాలూకా హెగ్గేరి ఫ్యాక్టరీ సమీపంలో టిప్పర్ ఎదురైంది. రెండు వాహనాలు డీకొనడంతో కుమారనాయక్, శంకర్భాయ్తోపాటు శ్వేతా(38) అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందారు. లక్ష్మీబాయి, ప్రశాంత్, శైలజ, పుష్పావతి, ప్రీతమ్‌కుమార్, తిప్పేస్వామితోపాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చెళ్లకెర పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను, మృతదేహాలను చెళ్లకెర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు దర్యాప్తు చేపట్టారు. మిన్నంటిన రోదనలు ప్రమాదం విషయం తెలిసి బంధువులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. విగతజీవులుగా ఉన్న తమ వారి చూసి విలపించారు. గంటలోనే ఇంటికి వస్తామని చెప్పి కానరాని లోకాలకు వెళ్లారా అంటూ రోదించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని గొల్లరహట్టి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. రోడ్డు దాటుతుండగా బైక్‌ను కారు ఢీకొట్టింది. బైకర్‌తోపాటు మరొకరు తీవ్రంగా గాయపడగా హోస్పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ పరారయ్యాడు. హగరిబొమ్మనహళ్లి పోలీస్‌లు కేసు దర్యాప్తు చేపట్టారు. టెంపో ట్రావల్ వాహనం, టిప్పర్ ఢీ చిత్రదుర్గం జిల్లా చెళ్లకెర తాలూకాలో ఘటన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం బడుగుల కుటంబాల్లో మిన్నంటిన విషాదం -
మల్లెలు కేజీ రూ.2 వేలు
దొడ్డబళ్లాపురం: ఉగాది పండుగ అంటే తెలుగు, కన్నడ నూతన సంవత్సరాది, ఏడాది మొదటిరోజును ఆనందోత్సాహాలతో ఆచరించాలని అందరూ అనుకుంటారు. పండుగ వచ్చింది కదా అని పూలు పండ్ల వ్యాపారులు ఇష్టానుసారం ధరలను పెంచేశారు. అయినప్పటికీ శనివారం జనం మండే ఎండలను కూడా లెక్కచేయకుండా మార్కెట్లకు తరలివచ్చారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు నగరాలకు క్యూ కట్టారు. కొత్త బట్టలు, ఇతర వస్తువులు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు పండ్లు, కూరగాయలు, పూల ధరలు కాస్త అందుబాటులో ఉన్నా ఉగాది పేరుతో వ్యాపారులు ధరలను పెంచారు. బెంగళూరు బజార్లలో మల్లెపూలు కేజీ రూ.1800 నుంచి 2000 మధ్య పలికాయి. చామంతులు రూ.250, గులాబీలు రూ.200, చెండుపూలు రూ.80, కాగడాలు రూ.600, కనకాంబరాలు రూ.1000, తులసి మాల మూర రూ.100, వేప కొమ్మలు కట్ట రూ.25, మామిడి ఆకులు కట్ట రూ.25 కి విక్రయించారు. కేఆర్ మార్కెట్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. ఉగాది వేళ భగ్గుమన్న ధరలు నగరంలో మార్కెట్లు కిటకిట -
పాలికె బడ్జెట్లో చెత్త పన్ను బాదుడు
బనశంకరి: బృహత్ బెంగళూరు మహానగర పాలికె చరిత్రలో తొలిసారి రూ.19,927 కోట్లతో భారీ బడ్జెట్‌ను ప్రకటించారు. శనివారం టౌన్‌హాల్ సభాంగణంలో పాలికె 2025–26వ బడ్జెట్‌ను బీబీఎంపీ పాలనాధికారి ఆర్.ఉమాశంకర్, కమిషనర్ తుషార్ గిరినాథ్, ఆర్థిక విభాగం ప్రత్యేక కమిషనర్ హరీశ్‌కుమార్ సమర్పించారు. ఎప్పుడూ లేనివిధంగా చెత్త పన్నును బాదడంతో నగరవాసులపై భారం పడనుంది. ఈ బడ్జెట్లో కొత్త పన్ను రాయితీలు ఏవీ ఇవ్వలేదు. రోడ్ల వసతులు, వైట్ ట్యాపింగ్ ● ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చేలా ఆస్తి పన్నుతో కలిసి చెత్త సేకరణకు పన్ను విధించనున్నారు. ఒక్కో ఇల్లు, షాపులపై చెత్త పన్ను ఎంత మొత్తం అనేది ప్రకటించలేదు. ● బ్రాండ్ బెంగళూరుకు పెద్దపీట, చెత్త తరలింపులో సంస్కరణలు, ట్రాఫిక్ రద్దీ పరిష్కారానికి మౌలిక వసతులను పెంచుతామని పేర్కొన్నారు. ● సొరంగ మార్గాలు, ఎలివేటెడ్ కారిడార్, రాజకాలువల పక్కల్లో రోడ్ల నిర్మాణం, రహదారులకు వైట్‌టాపింగ్, స్కై–డెక్ నిర్మాణ పథకాలను చేపట్టాలని బడ్జెట్లో ప్రస్తావించారు. ● వీధులు, సందుల్లోని అర్టీరియల్, సబ్ అర్టీరియల్ రోడ్ల నిర్మాణంతో పాటు ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేస్తారు. సిల్క్బోర్డులో ఆధునిక రహదారి సెంట్రల్ సిల్క్‌బోర్డు, కృష్ణరాజపురం జంక్షన్, బైయప్పనహళ్లి మెట్రోస్టేషన్ వరకు ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్నందున అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మెట్రోతో కలిసి పాలికె రూ.400 కోట్లతో 22.7 కిలోమీటర్ల రోడ్డును ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దుతారు. బ్రాండ్ బెంగళూరు ప్రత్యేక ఎస్క్రో అకౌంట్ తెరిచి మూడేళ్లలో రూ.2828 కోట్లతో సొరంగ మార్గం, ట్రాఫిక్, ఆరోగ్యం, ఆధునిక రీతిలో మౌలిక సౌకర్యాలను ప్రజలకు కల్పిస్తామని ప్రకటించారు. నగరం నలుదిక్కుల్లో చెత్త సంస్కరణ కేంద్రాలను నెలకొల్పుతారు. పలు దశల్లో తడి, పొడి చెత్తను తరలించడం, సంస్కరణ కేంద్రాల్లో ఎరువులుగా మార్చడానికి పలు ప్రణాళికలను రూపొందించారు. ఇకపై పౌర కార్మికులకు తలా రూ.10 లక్షలుగా, మొత్తం రూ.107.70 కోట్లను బ్యాంకులో డిపాజిట్‌చేసి దీని ద్వారా వచ్చే వడ్డీని పింఛన్‌గా అందిస్తారు. రూ.19,927 కోట్ల బెంగళూరు పాలికె పద్దు ఆస్తిపన్నుతో కలిపి చెత్తపన్ను వసూలు మౌలిక వసతులకు నిధులు -
తప్పుడు సర్టిఫికెట్లపై చర్యకు డిమాండ్
హొసపేటె: 3ఏ కేటగిరి కులాల వారు 2ఏ సర్టిఫికెట్లు పొందకుండా నిరోధించాలని డిమాండ్ చేస్తూ వెనుకబడిన కులాల కూటమి ఆధ్వర్యంలో కూడ్లిగి తాలూకా కానాహొసహళ్లిలో నిరసన తెలిపారు. ఇప్పటికే వాటిని పొందిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఒత్తిడి చేశారు. వెనుకబడిన కులాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు బుడ్డి బసవరాజ్ మాట్లాడుతూ తప్పుడు పత్రాలు అందించి లింగాయత్, వీరశైవ వర్గాల కేటగిరి 2ఏ సర్టిఫికెట్లు పొందడం అన్యాయమని ఆయన అన్నారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దార్ ఎం.చంద్రమోహన్‌కు అందజేశారు. సంఘం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కాడు కురుబ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం రద్దు
రాయచూరు రూరల్ : రాయచూరులో సత్యనారాయణ అనే వ్యక్తి తన కూతురు, కుమారుడికి కాడు కురుబ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం తీసుకున్న అంశంలో రాయచూరు అసిస్టెంట్ కమిషనర్ గజానన రద్దు చేశారని హైదరాబాద్ కర్ణాటక వాల్మీకి నాయక్ సంఘం డివిజన్ కార్యదర్శి రఘువీర్ నాయక్ వెల్లడించారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పిల్లలకు పాఠశాలలో తండ్రి వారసత్వంతో కుల ప్రమాణపత్రం పొందకుండా తల్లి వారసత్వం ద్వారా కాడు కురుబ ఎస్టీ కుల ప్రమాణ పత్రాన్ని పొందడాన్ని వ్యతిరేకిస్తూ కురుబలు వెనుక బడిన వర్గాల పరిధిలోకి వస్తారని రుజువు కావడంతో తహసీల్దార్లు ఇచ్చిన కాడు కురుబ ఎస్టీ కుల ప్రమాణ పత్రాన్ని రద్దు చేశారన్నారు. పాఠశాలల్లో హెడ్మాస్టార్లు, టీసీ, ఇతర సర్టిఫికెట్లలో కాడు కురుబ ఎస్టీలను తొలగించి కురుబ వెనుక బడిన వర్గాల జాబితాలో చేర్చాలని నివేదికలను అందిస్తామన్నారు. -
నగరాభివృద్ధికి సహకరించండి
హొసపేటె: నగర సర్వతోముఖాభివృద్ధికి నగరసభ సభ్యులు సహకరించాలని విజయనగర ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప తెలిపారు. గురువారం నగరసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 2025–26వ సంవత్సర బడ్జెట్, నగరసభ సామాన్య సమావేశంలో మొదటి సారిగా ఆయన పాల్గొని మాట్లాడారు. నగరసభ వ్యాప్తిలో ప్రవహిస్తున్న మురుగు నీటిని నేరుగా కెనాల్లోకి సరఫరా చేస్తున్న వ్యవస్థను అరికట్టాలని సూచించారు. మురుగు నీటిని కెనాల్లోకి పంపించడం ద్వారా నీరు కలుషితం అవుతుందన్నారు. ఈ విషయంపై నగరసభ సభ్యులు, అధికారులు ప్రజల్లో అవగాహన తేవాలని కోరారు. ఇక మీదట వార్డు సభ్యులతో కలిసి వార్డుల అభివృద్ధిపై దృష్టి పెడతామన్నారు. అంతకు ముందు నగర అధ్యక్షులు రూపేష్ కుమార్ మాట్లాడుతూ నగరసభకు వివిధ శాఖల ద్వారా 2025–26వ సంవత్సరపు రూ.10, 81,496 పొదుపు బడ్జెట్‌ను సమర్పించారు. నగరసభ ఉపాధ్యక్షుడు రమేష్‌గుప్తా, స్థాయి సమితి అధ్యక్షులు కిరణ్, నగరసభ కమిషనర్ మనోహర్, వివిధ వార్డుల సభ్యులు పాల్గొన్నారు. -
క్రికెట్ బెట్టింగ్.. ఒకరు అరెస్ట్
హుబ్లీ: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఒకరిని ధార్వాడ టౌన్ పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. గామనగట్టి నివాసి పర్వత ప్రకాష్ శర్మ అరెస్ట్ అయిన నిందితుడు. ఇక్కడి రసూల్‌పుర వీధిలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వేళ సదరు స్టేషన్ ఎస్ఐ ఆర్‌హెచ్ నదాఫ్ తమ సిబ్బందితో దాడి చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.2080ల నగదుతో పాటు ఓ మొబైల్‌ను జప్తు చేశారు. ఘటనపై ధార్వాడ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్నారు. మహిళ అదృశ్యం హొసపేటె: సుమారు 55 ఏళ్ల వయస్సుగల ఉంకి హులిగమ్మ అనే మహిళ అదృశ్యం కావడంపై హగరిబొమ్మనహళ్లి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ శరీరాకృతి, 5.2 అడుగుల ఎత్తు కలిగిన మహిళ, నల్లటి కుర్తా, తెల్లటి పూల బొమ్మలతో కూడిన ఆకుపచ్చని చీర, ఎడమ కనుబొమ్మపై పాత మచ్చ కలిగి ఉంది. గత నెల 27న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈమె ఆచూకీ గురించి ఎవరికై నా సమాచారం తెలిస్తే పట్టణ పోలీస్ స్టేషన్‌కు లేదా 08397–238333, 9480805770 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. రైల్వే ఉద్యోగులకు సురక్షత ప్రశస్తుల ప్రదానం హుబ్లీ: నైరుతి రైల్వే జోన్ జీఎం ముకుల్ శరణ్ మాథుర్ తన విధుల్లో చూపించిన చొరవతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకున్న భద్రతా చర్యలతో రైల్వే కార్యకలాపాల్లో సమర్థవంతంగా భద్రత నిర్వహణ చేసినందుకు గాను 5 మంది ఉద్యోగులకు సురక్షత ప్రశస్తిని ప్రదానం చేశారు. గదగ్ రోడ్డులోని రైలు సౌధలోని జీఎం ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ ఐదుగురిని ఎంపిక చేసిన సన్మానించారు. శివాజీ ఎల్. పవార్, కై లాస్ ప్రసాద్ మీనా, హెచ్ఎస్ మహేష్, జేబీ లోహిత్, అబూ సాలియాలకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ విధి నిర్వహణలో సమయస్ఫూర్తితో తీసుకున్న నిర్ణయాలతో భద్రత, ప్రయాణికుల సురక్షతణకు ప్రాధాన్యం ఇచ్చామని, అదే నైరుతి రైల్వే లక్ష్యం అని అన్నారు. రైలు ఢీకొని వ్యక్తి మృతి హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరు తాలూకాలోని హారాళు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రైలు ఢీకొని మరణించిన ఘటన గ్రామ శివార్లలో జరిగింది. హారాళు గ్రామానికి చెందిన భంగి నాగరాజ్ (29) అనే వ్యక్తిని ఉదయం 8.30 గంటలకు రైలు ఢీకొన్నట్లు సమాచారం అందడంతో ఆయన మరణ వార్త విని కుటుంబ దిగ్భ్రాంతికి గురైంది. మరణానికి ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వారం క్రితం అదే గ్రామానికి చెందిన జాద్రి కొట్రప్ప అనే వ్యక్తి రైలు ఢీకొని మరణించాడు. ఒకే వారంలో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రైలు ఢీకొని మరణించిన ఘటనలపై రెండు కేసులు నమోదయ్యాయి. ఇలాంటి సంఘటన మళ్లీ జరగకుండా రైల్వే శాఖ ముందస్తు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తెలిపారు. లింగాయత్ ఎమ్మెల్యేలు బీజేపీని వీడాలి ●● కూడల సంగమ జయ మృత్యుంజయ స్వామీజీ పిలుపు హుబ్లీ: ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్‌ను పార్టీ నుంచి బీజేపీ అధిష్టానం బహిష్కరించడంపై పంచమశాలి సామాజిక వర్గంలో ఆక్రోశం వ్యక్తమవుతోంది. బహిష్కరణ అన్నది నీచమైన కృత్యం అని కూడల సంగమ జయ మృత్యుంజయ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరైతే తమ సమాజానికి రిజర్వేషన్లను కేటాయించడానికి వెనుకంజ వేశారో వారే నేడు బసవనగౌడ పాటిల్ యత్నాళ్‌ను పార్టీ నుంచి బహిష్కరించడంలో కృతకృత్యులయ్యారని మండిపడ్డారు. యత్నాళ్‌కు అండగా నిలబడేందుకు లింగాయత్ ఎమ్మెల్యేలు వెంటనే బీజేపీని వీడాలని స్వామీజీ పిలుపునిచ్చారు. అంతేగాక త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పంచమశాలి వర్గం ఒక రోజు పాటు ఆందోళన చేపడుతుందన్నారు. ట్రామా కేంద్రం ప్రారంభం రాయచూరు రూరల్ : రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ(ఒపెక్) ఆస్పత్రిలో రోగులకు ట్రామా కేంద్రాన్ని ప్రారంభించినట్లు జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. గురువారం ఒపెక్ ఆస్పత్రిని సందర్శించి ఆయన మాట్లాడారు. కళ్యాణ కర్ణాటక జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి అధికంగా వచ్చే రోగులందరికీ సమానంగా వైద్యం అందిస్తున్నారన్నారు. ఒపెక్ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలతో కూడిన వైద్య చికిత్సలకు శ్రీకారం చుట్టామన్నారు. క్యాన్సర్ చికిత్సకు కిద్వాయి ఆస్పత్రిలో మాదిరిగా రూ.52 కోట్లతో 2.5 ఎకరాల స్థలంలో క్యాన్సర్ ట్రామా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కార్డియాలజీ, యూరాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో సర్జికల్, మెడికల్ గ్యాస్ట్రో, పైకో మ్యాక్సిలరీ సర్జరీ సౌకర్యాలు కల్పించారన్నారు. ఒపెక్ ఆస్పత్రి ప్రత్యేక అధికారి డాక్టర్ రమేష్ సాగర్, డాక్టర్ రమేష్, విజయ శంకర్‌లున్నారు. అభివృద్ధి పనులకు భూమిపూజ రాయచూరు రూరల్: నగరాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని నగరసభ సభ్యుడు జయన్న పేర్కొన్నారు. గురువారం 2వ వార్డులో ఉద్యానవనాలను రూ.5 లక్షలతో నిర్మాణం, తాగునీటి ట్యాంకర్లకు భూమిపూజ చేసి మాట్లాడారు. భవిష్యత్తులో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి పాటు పడుతామన్నారు. ఈ సందర్భంగా భీమనగౌడ, నాగరాజ్, కులకర్ణి, ఆంజనేయ, తిమ్మారెడ్డి, రత్న, శారదమ్మ, విజయలక్ష్మి, నరసింహమూర్తిలున్నారు. -
కాడు కురుబ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం రద్దు
రాయచూరు రూరల్ : రాయచూరులో సత్యనారాయణ అనే వ్యక్తి తన కూతురు, కుమారుడికి కాడు కురుబ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం తీసుకున్న అంశంలో రాయచూరు అసిస్టెంట్ కమిషనర్ గజానన రద్దు చేశారని హైదరాబాద్ కర్ణాటక వాల్మీకి నాయక్ సంఘం డివిజన్ కార్యదర్శి రఘువీర్ నాయక్ వెల్లడించారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పిల్లలకు పాఠశాలలో తండ్రి వారసత్వంతో కుల ప్రమాణపత్రం పొందకుండా తల్లి వారసత్వం ద్వారా కాడు కురుబ ఎస్టీ కుల ప్రమాణ పత్రాన్ని పొందడాన్ని వ్యతిరేకిస్తూ కురుబలు వెనుక బడిన వర్గాల పరిధిలోకి వస్తారని రుజువు కావడంతో తహసీల్దార్లు ఇచ్చిన కాడు కురుబ ఎస్టీ కుల ప్రమాణ పత్రాన్ని రద్దు చేశారన్నారు. పాఠశాలల్లో హెడ్మాస్టార్లు, టీసీ, ఇతర సర్టిఫికెట్లలో కాడు కురుబ ఎస్టీలను తొలగించి కురుబ వెనుక బడిన వర్గాల జాబితాలో చేర్చాలని నివేదికలను అందిస్తామన్నారు. -
ఛేదిస్తున్న కేసులు స్వల్పమే
● వేలాదిగా సైబర్ మోసాలు జరుగుతుంటే పోలీసులు ఛేదిస్తున్నవి మాత్రం చాలా తక్కువ. ● వంచకులు వేల సంఖ్యలో నకిలీ బ్యాంక్ అకౌంట్ల కలిగి ఉండటం, క్రిప్టో కరెన్సీలోకి నగదు మార్చడం, అత్యాధునిక టెక్నాలజీ, వాయిస్ కాలింగ్ వ్యవస్థలను వాడడం వల్ల పోలీసులకు వారిని కనిపెట్టి నగదు స్వాధీనం చేసుకోవడం తలకు మించిన పనవుతోంది. ● బాధితుల ఖాతా నుంచి నేరగాళ్లు క్షణాల్లో వివిధ బ్యాంక్ అకౌంట్లకు నగదు బదిలీ చేస్తారు. బ్యాంకుల నుంచి సమాచారం రావడం ఆలస్యం కావడం పోలీసులకు ఆటంకంగా ఉంటోంది. ● దుబాయ్, కాంబోడియా, థాయ్‌లాండ్, హాంకాంగ్, చైనా దేశాల ద్వారా సైబర్ నేరగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో వారి మూలాలను కనిపెట్టడం కష్టసాధ్యమని పోలీసు అధికారులు తెలిపారు. -
ముంచేస్తున్న సైబర్ వల
బనశంకరి: నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాలు హెచ్చుమీరాయి. నిరక్షరాస్యులు కాకుండా విద్యావంతులు, ఉన్నత ఉద్యోగులు, ఐటీ బీటీ ఉద్యోగులు, యువతీ యువకులు, రిటైర్డు ఉద్యోగులు, మహిళలు సైబర్ వలలో చిక్కుకుని లక్షలాది రూపాయలను పోగొట్టుకుంటున్నారు. రాష్ట్రంలో 2024 లో 21,984 సైబర్‌నేరాలు నమోదు కాగా రూ.2,120 కోట్లను సైబర్ వంచకులు దోచేశారు. బెంగళూరులోనే 2023లో రూ.673 కోట్లు కాజేసిన సైబర్ దొంగలు, 2024లో రూ.1,998 కోట్లు నొక్కేశారు. నిత్యం సరాసరి 48 కేసులు నమోదు అవుతున్నాయి. పోలీస్స్టేషన్ల వరకు రాని కేసులు లెక్కకు అందవు. బెంగళూరులో మరీ అధికం సైబర్ మోసాలు, బాధితుల సంఖ్య ఏటేటా విస్తరిస్తోంది. నగరంలోనే మూడు రెట్లు పెరిగాయి. బెంగళూరులో నిత్యం కొత్త తరహాలో సైబర్ కేటుగాళ్లు వల వేస్తూ పోలీసులకు సవాల్‌గా మారారు. ప్రజలను జాగృతం చేసినప్పటికీ వలలో పడి నగదు కోల్పోతున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం, మీ ఓటీపీ చెప్పాలని, మోసపూరిత లింక్‌లను పంపి క్లిక్ చేయించడం, ఫోన్‌ని హ్యాక్ చేయడం ద్వారా డబ్బు కొట్టేస్తున్నారు. షేర్మార్కెట్లో పెట్టుబడితే వారంలో లక్షాధికారులు కావచ్చని నమ్మించి ఎక్కువగా దోచుకుంటున్నారని సైబర్ ఠాణా పోలీసులు తెలిపారు. మొబైల్లో రహస్యంగా కొన్ని యాప్‌లు ఇన్స్టాల్ చేసి సిమ్కార్డుని, మొబైల్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేయడం పెరిగింది. డబ్బు కట్ అయినప్పటికీ మొబైల్‌కు ఎస్ఎంఎస్, ఈమెయిల్ వెళ్లదు, దీనివల్ల బాధితులకు మోసం గురించి తెలియదు. సహాయవాణి 1930 సైబర్ నేరానికి గురైతే తక్షణం 1930 సహాయవాణి కి కాల్ చేసి వివరాలను అందిస్తే నగదు చేజారకుండా కాపాడుకోవచ్చని పోలీసులు తెలిపారు. ఆలస్యమయ్యేకొద్దీ వంచకుల ఆచూకీని కనిపెట్టడం సాధ్యం కాదన్నారు. చాలామంది డబ్బు కోల్పోయిన 2–3 రోజుల తరువాత ఫిర్యాదు చేస్తున్నారని నగర పోలీస్ కమిషనర్ బీ.దయానంద్ తెలిపారు. ఏటేటా ఆన్లైన్ మోసాల వృద్ధి సంపన్నులు, ఉద్యోగులే లక్ష్యం విదేశాల నుంచి సైబర్ ముఠాల దాడులు పట్టుకోలేకపోతున్న పోలీసులు క్లిక్ చేయగానే లక్షలు లాస్ మోసగాళ్లు పెట్టుబడి పేరుతో పంపించిన లింక్‌పై క్లిక్ చేయగానే ప్రైవేటు టీచరమ్మ రూ.15 లక్షలు పోగొట్టుకుంది. సాప్ట్వేర్ ఉద్యోగి ఇంటి విక్రయంతో వచ్చిన రూ.1.48 కోట్ల డబ్బును షేర్ల పేరుతో పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. పగలూ రాత్రి కష్టపడి సంపాదించిన డబ్బును పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, విశ్రాంత ఉద్యోగులు, అధికారులు కొన్ని గంటల్లో పోగొట్టుకుంటున్నారు. బ్యాంకు ఉద్యోగుల ముసుగులో సైబర్ వంచకులు ఐటీ ఇంజినీర్‌కు ఫోన్ చేసి గిప్టు ఓచర్ పంపించి ఫోన్‌ని హ్యాక్ చేశారు, అతని బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.2.80 కోట్లు నగదు దోచేశారు. -
భార్యను ముక్కలు చేసి.. సూట్‌కేసులో కుక్కి..
సాక్షి, బెంగళూరు: జీవిత భాగస్వామిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరకడం వంటి కిరాతక నేరాలు దేశంలో అక్కడక్కడా జరుగుతున్నాయి. అలాంటి ఘోరం బెంగళూరులోనూ చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి ముక్కలుగా ఖండించి సూట్‌కేసులో పెట్టి పారిపోయాడు. ఈ ఘటన బెంగళూరులోని హుళిమావు పరిధిలోని దొడ్డకమ్మనహళ్లిలో జరిగింది.రెండేళ్ల కిందటే పెళ్లి.. మహారాష్ట్రకు చెందిన రాకేశ్ (37) అనే వ్యక్తి తన భార్య గౌరి సాంబేకర్ (32)ను హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేసి సూట్‌కేసులో నింపేశాడు. రెండేళ్ల క్రితం రాకేశ్, గౌరికి వివాహం జరిగింది. నెల రోజుల క్రితమే దొడ్డకమ్మనహళ్లిలోని ఇంటికి మారారు. ఇద్దరు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగులు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం కింద ఇంట్లోనే ఉంటూ పని చేసుకుంటున్నారు... గురువారం ఏం జరిగిందో కానీ హత్య చేసి, మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన గౌరి తల్లిదండ్రులు తమ ఊళ్లోని సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సమాచారమిచ్చారు. ఆ పోలీసులు వెంటనే హుళిమావు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఇంటికి వెళ్లి తాళాలు బద్ధలు కొట్టి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బాత్రూంలో సూట్‌కేసులో గౌరి మృతదేహం ముక్కలై కనిపించడంతో కంగుతిన్నారు. ఆమె హత్యకు ఇంకా కారణాలు తెలియరాలేదు. నిందితుడు రాకేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆగ్నేయ డీసీపీ సారా ఫాతిమా, క్లూస్ టీం చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. -
యత్నాళ్ బహిష్కరణపై పునరాలోచించాలి
సాక్షి,బళ్లారి: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బసవనగౌడ పాటిల్ యత్నాళ్‌ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించడంపై బీజేపీ హైకమాండ్ పునరాలోచించాలని మాజీ మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలోని తన నివాసగృహంలో విలేకరులతో మాట్లాడారు. బసవనగౌడ పార్టీ పరంగా బ్యాటింగ్ చేశారన్నారు. అలా నేరుగా మాట్లాడటం మంచిది కాదని,పార్టీ నిబంధనలకు లోబడి పనిచేస్తే మంచిదని తాను ముందు నుంచి యత్నాళ్‌కు సూచించానన్నారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. యత్నాళ్ బహిష్కరణపై మరోసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. యత్నాళ్ బలమైన పంచమశాలి లింగాయత్ సమాజానికి చెందిన నాయకుడన్నారు. ఆ కులానికి చెందిన వారు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్నారన్నారు. బీజేపీకి నష్టం జరగకుండా ఉండాలనేదే తన తపన అన్నారు. బలమైన హిందూ వాదిగా, పంచమశాలి లింగాయత్ సమాజానికి గొప్పనాయకుడుగా కొనసాగుతున్న యత్నాళ్‌ను పార్టీ నుంచి తప్పించడంపై పునరాలోచించాలని తాను ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌షాలను కోరుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ దుష్పరిపాలన హొసపేటె: రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్పరిపాలన సాగిస్తోందని మాజీ మంత్రి బీ.శ్రీరాములు తెలిపారు. బుధవారం నగరంలోని అంబేడ్కర్ సర్కిల్లో బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పాలనలో జరిగిన హనీట్రాప్‌పై కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు సృష్టించిందన్నారు. ఈ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో దీని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు నిప్పంటించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిఖార్సయిన హిందుత్వవాది మాజీ మంత్రి శ్రీరాములు వెల్లడి -
కంటి ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం
బళ్లారిటౌన్: మనిషికి నయనం ప్రధానం అని, కళ్లు దెబ్బతినకుండా వాటి ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలని సిటీ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం గాంధీనగర్‌లోని రేణుకా కిచెన్ ఎదురుగా నూతనంగా నిర్మించిన అగర్వాల్ ఐ హాస్పిటల్ ప్రారంభ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేటి జీవన శైలిలో మనిషిపై ఒత్తిడి పెరుగుతున్నందున నేత్ర సమస్యలు ఎక్కువవుతున్నాయన్నారు. ఈ దిశలో రాష్ట్రంలో పేరుగాంచిన అగర్వాల్స్ ఐ హాస్పిటల్‌ను బళ్లారిలో కూడా ప్రారంభించడం శ్లాఘనీయం అన్నారు. ప్రభుత్వ పథకాల కింద మంజూరయ్యే కంటి ఆపరేషన్లను కూడా పేదలకు ఆస్పత్రిలో చేసేలా మున్ముందు ఆసక్తి చూపాలన్నారు. హాస్పిటల్ సీనియర్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ హాస్పిటల్ రాష్ట్రంలో బళ్లారితో కలిపి 28 కేంద్రాలను ప్రారంభించిందన్నారు. 220కి పైగా ప్రపంచ స్థాయి అన్ని సదుపాయాలు ఈ ఆస్పత్రిలో లభిస్తాయన్నారు. ల్యాబ్, ఆపరేషన్లు, కంటి అద్దాలు, ఇతర సదుపాయాలు కూడా ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రా, అడిషనల్ ఎస్పీ రవికుమార్, డీహెచ్ఓ వై.రమేష్‌బాబు, డాక్టర్ మహేష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నందిని పాలు, పెరుగు ధరలు భగ్గు
బనశంకరి: సిద్దరామయ్య సర్కారు ఉగాది కానుకను వినూత్నంగా ప్రకటించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నందిని పాలు, పెరుగు ధరను ప్రతి లీటరుపై రూ.4 పెంపు జరిగింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలవుతుంది. గురువారం విధానసౌధలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో పెంపును ఖరారు చేశారు. నిజానికి కేఎంఎఫ్ రూ.5 పెంచాలని కోరిందని, తామే ఒక్క రూపాయ తగ్గించామని సర్కారు వర్గాలు చెప్పడం గమనార్హం. రాష్ట్రంలో పాలు, పెరుగు ధర పెంపు ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఉగాది బహుమతి అని విమర్శలు వచ్చాయి. దీని వల్ల హోటళ్లలో కాఫీ, టీల ధరలు భగ్గుమంటాయని ఆక్రోశం వ్యక్తమౌతోంది. లీటర్‌కు రూ.4 పెంపు -
నగరాభివృద్ధికి సహకరించండి
హొసపేటె: నగర సర్వతోముఖాభివృద్ధికి నగరసభ సభ్యులు సహకరించాలని విజయనగర ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప తెలిపారు. గురువారం నగరసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 2025–26వ సంవత్సర బడ్జెట్, నగరసభ సామాన్య సమావేశంలో మొదటి సారిగా ఆయన పాల్గొని మాట్లాడారు. నగరసభ వ్యాప్తిలో ప్రవహిస్తున్న మురుగు నీటిని నేరుగా కెనాల్లోకి సరఫరా చేస్తున్న వ్యవస్థను అరికట్టాలని సూచించారు. మురుగు నీటిని కెనాల్లోకి పంపించడం ద్వారా నీరు కలుషితం అవుతుందన్నారు. ఈ విషయంపై నగరసభ సభ్యులు, అధికారులు ప్రజల్లో అవగాహన తేవాలని కోరారు. ఇక మీదట వార్డు సభ్యులతో కలిసి వార్డుల అభివృద్ధిపై దృష్టి పెడతామన్నారు. అంతకు ముందు నగర అధ్యక్షులు రూపేష్ కుమార్ మాట్లాడుతూ నగరసభకు వివిధ శాఖల ద్వారా 2025–26వ సంవత్సరపు రూ.10, 81,496 పొదుపు బడ్జెట్‌ను సమర్పించారు. నగరసభ ఉపాధ్యక్షుడు రమేష్‌గుప్తా, స్థాయి సమితి అధ్యక్షులు కిరణ్, నగరసభ కమిషనర్ మనోహర్, వివిధ వార్డుల సభ్యులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధిలో పత్రికల పాత్ర కీలకం
సాక్షి,బళ్లారి: దేశాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, న్యాయ శాఖతో (శాసకాంగ, కార్యాంగ, న్యాయాంగ)తో పాటు పత్రికల(మీడియా) పాత్ర కూడా ఎంతో కీలకమని జిల్లాధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలో పత్రికా భవన్లో కర్ణాటక కార్యనిరత పాత్రికేయుల సంఘం ఆధ్వర్యంలో రంగస్థల కళాకారుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫోటో జర్నలిస్ట్ పురుషోత్తం హంద్యాళకు సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మూడు పిల్లర్లతో ఏ భవనం నిర్మాణం సాధ్యం కాదన్నారు. అదే విధంగా దేశాభివృద్ధితో కాని, రాష్ట్రాభివృద్ధి, జిల్లాభివృద్ధిలో కాని ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజలకు చేరవేయడంలో, సమస్యలను అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలియజేసేందుకు నాలుగో స్తంభంగా మీడియా పాత్రను మరువలేనిదన్నారు. పాత్రికేయులు ఒత్తిడి నుంచి బయటపడేందుకు కళాకారులుగా అప్పుడప్పుడు మారడంతో ఉపశమనం పొందేందుకు వీలవుతుందన్నారు. మన సంస్కృతి వారసత్వాలను కాపాడుకునేందుకు కళాకారులు ఎంతో కృషి చేస్తారని గుర్తు చేశారు. సన్మానం అందుకున్న పురుషోత్తం మాట్లాడుతూ కళాకారుడుగా చేసిన సేవలను గుర్తించి తనను సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. డీపీఆర్ఓ గురురాజ్, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య నాలుగో స్తంభం మీడియా జిల్లాధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రా -
కరువు విలయం.. కబేళాలకు విక్రయం
రాయచూరు రూరల్ : ఈఏడాది కల్యాణ కర్ణాటక(క–క)లోని ఆరు జిల్లాల్లో తీవ్ర కరువు సంభవించినా కేంద్ర, రాష్ట్ర సర్కార్లు నిర్లక్ష్యం వహించాయి. సరైన వర్షాలు లేక పంటలు పండక పోవడంతో పశువులకు పశుగ్రాసం కూడా లభించని దుిస్థితి నెలకొంది. అనావృష్టితో ఆయా జిల్లాలో రైతులు పొలాల్లో వేసుకున్న పంటలు సరిగా పండక, పశుగ్రాసం లేక మూగజీవాలు తల్లడిల్లుతున్నా కనీసం పంట నష్టపరిహారం అందించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం వహిస్తున్నాయి. బాధితులు ఎలా జీవితం గడపాలనే ఆలోచనలో ఉన్న సందర్భంలో ఏదైనా పరిహారం వస్తుందన్న ఆశతో కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు తమకేమీ పట్టనట్లు ఉండటంపై రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కల్యాణ కర్ణాటకలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆలకించాల్సిన తహసీల్దార్లు లేకపోవడంపై రైతుల్లో విచారం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో పేదలు అన్నమో రామచంద్రా అంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు మౌనం వహించడాన్ని రైతులు తప్పుబడుతున్నారు. చెరువులు, కుంటలు, బావులు, వాగుల్లో నీరు లేకపోవడంతో పశువులను మేపడానికి పశుగ్రాసం లభించక రైతులు కబేళాలు, జాతరలు, సంతల్లో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1.55 లక్షలకు పైగా పశువులను విక్రయించినట్లు సమాచారం. జిల్లాలో 25 వేల క్వింటాళ్ల పశుగ్రాసం అవసరం ఉందని పశు సంవర్ధక శాఖ అధికారులు జిల్లాధికారికి మూడు నెలల క్రితమే ప్రతిపాదనలను పంపినట్లు తెలిపారు. తుంగభద్ర ఎడమ కాలువ కింద వరి పంటను తక్కువ ప్రమాణంలో పండించడంతో పశుగ్రాసం కొరత ఏర్పడిందని అధికారులు అంటున్నారు. సంతలు, జాతరల్లో తక్కువ ధరకు పశువుల అమ్మకం క–కలో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు -
ఏప్రిల్ ఆఖరు వరకు నీరివ్వాలని ర్యాలీ
రాయచూరు రూరల్: నారాయణపుర కుడి గట్టు కాలువ(ఎన్‌ఆర్‌బీసీ) ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీరందివ్వాలని మాజీ మంత్రి రాజుగౌడ డిమాండ్ చేశారు. గురువారం సురపుర తాలూకా హుణసగిలోని కృష్ణా భాగ్య జల మండలి కార్యాలయం వద్ద వంద ట్రాక్టర్లతో ఆందోళన చేపట్టి మాట్లాడారు. కాలువకు మార్చి 31 వరకు నీరు వదలడానికి అధికారులు సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నీటి గేజ్ నిర్వహణ సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు భూములకు నీరందేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాలువకు ఏప్రిల్ చివరి వరకు వారబందీ పద్ధతి ద్వారా నీరందించాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఎస్కాం డీఎస్పీగా శ్రీపాద జల్దే హుబ్లీ: 7 జిల్లాల పరిధిలోని ఎస్కాం జాగృత దళం డీఎస్పీగా శ్రీపాద జల్దే గురువారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. 2001వ బ్యాచ్‌కు చెందిన ఈయన డీఎస్పీగా పదోన్నతి పొందక ముందు హుబ్లీ– ధార్వాడ జంట నగరాల్లోని కసబాపేట, పాత హుబ్లీ, కేశ్వాపుర, ట్రాఫిక్ స్టేషన్లలో సీఐగా, అథణిలో డీఎస్పీగా రెండేళ్లు ఉత్తమ సేవలు అందించారు. పండుగలు శాంతియుతంగా జరుపుకోండి రాయచూరు రూరల్: జిల్లాలో ఉగాది, రంజాన్ పండుగలను హిందూ ముస్లిం సోదరులు శాంతియుతంగా జరుపుకోవాలని అదనపు ఎస్పీ హరీష్ సూచించారు. బుధవారం సదర్ బజార్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన శాంతి సమావేశంలో మాట్లాడారు. ఈనెల 30న జరిగే ఉగాది, 31న రంజాన్ పండుగలను శాంతియుతంగా ఆచరించాలన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో రోజాను పాటిస్తున్నారన్నారు. హిందూ సోదరులు శాంతితో ఎలాంటి ఘర్షణలకు తావు ఇవ్వకుండా పండుగను జరుపుకోవాలన్నారు. సమావేశంలో సీఐ మేకా నాగరాజ్, ఎస్ఐలు మంజునాఽథ్, చంద్రప్ప, అమిత్, నరసమ్మ, శ్రీనివాస్, అంబాజీ, మహావీర్, ఇస్మాయిల్లున్నారు. ఎల్ఎల్సీ నుంచి గుడదూరు వాగుకు నీరు వదలాలి సాక్షి,బళ్లారి: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్ఎల్సీ) నుంచి గుడదూరు వాగుకు నీరు వదలాలని తుంగభద్ర రైతు సంఽఘం జిల్లా అధ్యక్షుడు దరూరు పురుషోత్తం గౌడ మనవి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రాను కలిసి రైతు సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. కంప్లి, సిరుగుప్ప నియోజకవర్గాల్లో గుడదూరు, హంద్యాళు, డి.కగ్గల్, చానాళ్, మైలాపుర, బూదుగుప్ప, హెచ్.హొసళ్లి, హాగలూరు, దరూరు, కరూరు, కారిగనూరు తదితర గ్రామాల పరిధిలో రబీలో సాగు చేసిన పంటలకు పూర్తి స్థాయిలో నీరు అందాలంటే గుడదూరు వాగుకు ప్రతి రోజు 100 క్యూసెక్కుల నీరు వదిలితే రైతుల పంటలు చేతికందుతాయన్నారు. అంతేకాకుండా పశువులకు నీరు కూడా దొరుకుతుందన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. అక్రమ భూములపై విచారణ శూన్యం రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరు తాలూకాలో గత 45 ఏళ్లుగా అక్రమంగా సాగు చేసుకుంటున్న భూములపై విచారణ ఽశూన్యమైందని సీపీఐ(ఎంఎల్) రెడ్ ఫ్లాగ్, కర్ణాటక రైతు సంఘం సంచాలకుడు మానసయ్య ఆరోపించారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవరాజ్ అరసు తెచ్చిన భూ సంస్కరణల చట్టాన్ని జారీ చేస్తామని చెబుతున్న సర్కార్లు నేటికీ మిగులు భూముల పంపిణీలో మీనమేషాలు లెక్కిస్తున్నాయన్నారు. సింధనూరు తాలూకా జవళగేరలో 1981 నుంచి 1064 ఎకరాల భూములకు వారసుదారురాలు సిద్దలింగమ్మ మరణించడంతో మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ తనదే అంటూ కోర్టుల నుంచి కాలావకాశం కోరుతూ పెండింగ్‌లో ఉంచారన్నారు. ఈ విషయంలో 44 ఏళ్ల నుంచి భూ సంస్కరణల చట్టం జారీ చేయడంలో జిల్లాధికారులు భూస్వాధీనం చేసుకోవడంలో పూర్తిగా విఫలం కావడాన్ని తప్పుబట్టారు. -
మ్యాట్రిమొని మోసగాడు
యశవంతపుర: టీవీ సీరియల్ నటునిగా కనిపిస్తున్న ఇతడు ఓ మోసగాడు. ఐఏఎస్ ఆధికారినని చెప్పుకొంటూ యువతులు, మహిళలను మోసగిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. మ్యాట్రిమొని వెబ్సైట్లో జీవన్‌కుమార్ అనే వ్యక్తి వివరాలు నమోదు చేసుకున్నాడు. యువతులతో చాటింగ్ చేస్తూ తాను ఐఏఎస్‌నని, పెళ్లి చేసుకొంటానని చెబుతూ, తల్లికి క్యాన్సర్ వైద్యానికి అర్జంటుగా డబ్బులు కావాలని లక్షల రూపాయలు వసూలు చేసేవాడు. తరువాత వారితో సినిమాలు, షికార్లకు వెళ్లి సన్నిహితంగా ఫోటోలు, వీడియోలు తీసుకొనేవాడు. మొదట రూ.3 లక్షలు తీసుకొని, మరోదఫా రూ. 5 లక్షలు కావాలంటూ డిమాండ్ చేసేవాడు. డబ్బులు ఇవ్వని మహిళల ప్రైవేట్ ఫోటో, వీడియోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరించేవాడని పోలీసుల విచారణలో బయట పడింది. ఇచ్చిన డబ్బులను తిరిగి అడిగితే హత్య చేస్తానంటూ బెదిరించేవాడు. దేశవ్యాప్తంగా సుమారు 20 మంది మహిళలకు మోసం చేసిన్నట్లు తెలిసింది. ప్రస్తుతం బెంగళూరుకు చెందిన మహిళ మోసపోవటంతో జీవన్‌కుమార్‌పై హెబ్బాళ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఐఏఎస్‌నంటూ వసూళ్లు -
తప్పుడు సర్టిఫికెట్లపై చర్యకు డిమాండ్
హొసపేటె: 3ఏ కేటగిరి కులాల వారు 2ఏ సర్టిఫికెట్లు పొందకుండా నిరోధించాలని డిమాండ్ చేస్తూ వెనుకబడిన కులాల కూటమి ఆధ్వర్యంలో కూడ్లిగి తాలూకా కానాహొసహళ్లిలో నిరసన తెలిపారు. ఇప్పటికే వాటిని పొందిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఒత్తిడి చేశారు. వెనుకబడిన కులాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు బుడ్డి బసవరాజ్ మాట్లాడుతూ తప్పుడు పత్రాలు అందించి లింగాయత్, వీరశైవ వర్గాల కేటగిరి 2ఏ సర్టిఫికెట్లు పొందడం అన్యాయమని ఆయన అన్నారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దార్ ఎం.చంద్రమోహన్‌కు అందజేశారు. సంఘం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అన్ని రంగాల్లో దేశ ప్రగతి
మైసూరు: యువత నిరంతర ప్రయత్నాలతో దేశ ప్రగతి సాధ్యమని రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ పేర్కొన్నారు. గురువారం మైసూరులోని ముక్తగంగోత్రిలో కర్ణాటక రాష్ట్ర ఓపెన్ విశ్వవిద్యాలయం 20వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. గవర్నర్ పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్రానంతరం దేశంలోని అన్ని రంగాల్లో అనూహ్యమైన ప్రగతిని సాధించిందన్నారు. ప్రస్తుత దేశ ఆర్థికత ప్రబలంగా ఉండి ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉందన్నారు. స్నాతకోత్సవంలో సీఎం ఇర్ఫానుల్లా షరీఫ్, డాక్టర్ దాక్షాయణి ఎస్.అప్పాలకు గౌరవ డాక్టరేట్ పట్టాలు అందించి సత్కరించారు.వ్యాన్– గూడ్స్ టెంపో ఢీ, ముగ్గురు మృతి దొడ్డబళ్లాపురం: బెంగళూరు– మైసూరు రహదారిలో చెన్నపట్టణ తాలూకా తిట్టమారనహళ్లి వద్ద సర్వీస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోయారు. గూడ్స్ టెంపో, మారుతి వ్యాన్ ఢీకొన్నాయి. గురువారం ఉదయం చెన్నపట్టణ తాలూకా మంగాడహళ్లికి చెందిన శివప్రకాశ్ కుటుంబం మండ్యలో బంధువుల ఇంట్లో శుభ కార్యానికి మారుతి–800 వ్యాన్‌లో వెళ్తోంది. తిట్టమారనహళ్లి వద్ద సర్వీస్ రోడ్డులో ఎదురుగా వచ్చిన టెంపో వేగంగా ఢీకొంది. మారుతి వ్యాన్ నుజ్జునుజ్జు కాగా, అందులోని శివప్రకాశ్ (37), పుట్టగౌరమ్మ (72), శివరత్న (50) మరణించారు. నటరాజ్, సుమ, టెంపో డ్రైవర్ నాగేశ్ తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను, క్షతగాత్రులను చెన్నపట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లోకాయుక్త అదుపులో ఆర్టీఐ కమిషనర్ దొడ్డబళ్లాపురం: రాష్ట్ర ఆర్టీఐ కమిషన్ కమిషనర్ రవీంద్ర గురునాథ్ డాకప్ప లంచం తీసుకుంటూ లోకాయుక్తకు పట్టుబడ్డ సంఘటన కలబుర్గిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఎన్.సీ.బెనకనళ్లి అనే ఆర్టీఐ కార్యకర్త ఏకధాటిగా 117 దరఖాస్తులు చేయడంతో అతనిని బ్లాక్ లిస్టులో చేర్చారు. తన పేరు బ్లాక్ లిస్టు నుండి తొలగించాలని కోరగా గురునాథ్ రూ.3లక్షలు డిమాండు చేశాడు. దీంతో ఆర్టీఐ కార్యకర్త లోకాయుక్తను ఆశ్రయించాడు. లంచం తీసుకుంటూ ఉండగా లోకాయుక్త అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. గురునాథ్ ఏప్రిల్ నెలలో రిటైరు కానున్నారు. ఇంతలో పట్టుబడ్డాడు. ముగ్గురు పోలీసులపై కేసు● మూడేళ్ల కిందట ఖైదీ మృతి ఘటన.. యశవంతపుర: మూడేళ్ల కిందట వైద్య పరీక్షలకు తీసుకెళ్లిన నిందితుడు జిమ్స్ ఆస్పత్రి కట్టడంపై నుంచి దూకి చనిపోయిన ఘటనలో ఒక ఏఎస్ఐతో పాటు ముగ్గురు పోలీసులపై ఇప్పుడు కేసు నమోదు చేశారు. కలబురగి బ్రహ్మపుర పోలీసుస్టేషన్ ఎఎస్ఐ అబ్దుల్ ఖాదర్ (54), కానిస్టేబుల్స్ హుణచప్ప మల్లప్ప (56), కుమార రాథోడ్ (22)లపై కేసు నమోదైయింది. నిందితుడు సోహేబ్ (20)ను ఓ కేసులో బ్రహ్మపుర పోలీసులు 2022 అగస్ట్ 8న అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరచడానికి ముందు నిందితునికి కరోనా టెస్టుల కోసం జిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో బేడిలను విప్పేశారు. ఇదే అదనుగా అతడు తప్పించుకోవాలని పరుగులు తీసి ఆస్పత్రి మూడో అంతస్తు మీద నుంచి దూకాడు. తలకు బలమైన గాయలై అక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం కేసును సీఐడీ అప్పగించింది. సీఐడీ పోలీసులు పై ముగ్గురి మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నగల బ్యాగును వదిలి దొంగ పరారీ మైసూరు: పోలీసును చూసి దొంగ బ్యాగును అక్కడే వదిలి పరారైన ఘటన నగరంలో జరిగింది. అతని బ్యాగులో నుంచి రూ.7.20 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదును పోలీసులు స్వాధీనపరచుకున్నారు. వివరాలు.. నగరంలోని విజయనగర పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ ఎస్ఎం అనంత, హోంగార్డు రఘుకుమార్ గస్తీలో ఉండగా, గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో హూటగళ్లి సిగ్నల్ వద్ద ఓ వ్యక్తి నంబరుప్లేట్ లేని వాహనంతో నిలబడి ఉండటాన్ని గమనించారు. అతని వద్దకు వెళుతుండగా భయపడిన అతను బైక్‌ని, బ్యాగును వదిలి అక్కడి నుంచి సందులోకి పారిపోయాడు. పోలీసులు బ్యాగును తెరిచి చూడగా బంగారు ఆభరణాలు, నగదు, ఇనుప రాడ్డు లభించాయి. పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచారు. దొంగ ఎక్కడైనా చోరీ చేసి వస్తుంటాడని అనుమానాలున్నాయి. అతని కోసం గాలింపు చేపట్టారు. -
రూ. 2 లక్షల లంచం, సైబర్‌క్రైం ఠాణా ఏసీపీ అరెస్టు
యశవంతపుర: ప్రైవేట్ సంస్థకు చెందిన వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన కేసులో నేరగాళ్లను పట్టుకోవడానికి రూ.4 లక్షల లంచం డిమాండ్ చేశారు. ఇందులో రూ. రెండు లక్షలు తీసుకుంటూ బెంగళూరు ఈశాన్య విభాగం సైబర్ క్రైం పోలీసుస్టేషన్ ఏసీపీ తన్వీర్ ఎస్ఆర్, ఎఎస్ఐ కృష్ణమూర్తి లోకాయుక్త అధికారులకు పట్టుబడ్డారు. మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. వివరాలు... ఇటీవల సైబర్ నేరగాళ్లు ఓ సంస్థకు చెందిన వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు. సంస్థ యజమానులు సెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీపీ తన్వీర్ రంగంలోకి దిగారు. నిందితులను పట్టుకోవడానికీ రూ.4 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. మొదట సగం చెల్లిస్తే నిందితులు ఎక్కడున్నా పట్టుకొంటామని భరోసా ఇచ్చారు. ఇలా మొదటి విడత లంచం సొమ్ము తీసుకొంటుండగా లోకాయుక్త పోలీసులు దాడి చేసి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి లోకాయుక్త దాడి నగర పోలీసులను కలవరపెట్టింది. నిందితులను విచారణ చేపట్టారు. లోకాయుక్త వలలో పీడీఓ దొడ్డబళ్లాపురం: కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఒక పీడీఓ లోకాయుక్తకు చిక్కిన సంఘటన కనకపుర తాలూకా సోమదప్పనహళ్లి గ్రామపంచాయతీ ఆఫీసులో జరిగింది. పీడీఓ మునిరాజు, కాంట్రాక్టర్ వెంకటాచలయ్య పనులకు బిల్లులు పాస్ చేయడానికి రూ.20వేలు లంచం డిమాండు చేశాడు. దీంతో కాంట్రాక్టర్ లోకాయుక్తను ఆశ్రయించాడు. బుధవారంనాడు లంచం తీసుకుంటూ ఉండగా మునిరాజును లోకాయుక్త పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పన్నీర్లో బ్యాక్టీరియా
దొడ్డబళ్లాపురం: బెంగళూరులోను, రాష్ట్రంలో ఆహార తనిఖీలలో రోజుకొక ఆహారం బండారం బయటపడుతోంది. ఇప్పటివరకు బొంబై మిఠాయి, టమాటా సాస్, బేకరీలలో కేక్‌లు, పానీ పూరి, గోబీ, ఇడ్లీ, కళింగర పండ్లు తదితరాలలో కల్తీలు, కాలుష్య కారకాలు ఉన్నాయని ఆహార భద్రతా శాఖ ప్రకటించడం తెలిసిందే. ఇప్పుడు పన్నీర్ వంతు వచ్చింది. స్టార్ హోటళ్ల నుంచి తోపుడు బండ్ల వరకు పన్నీర్ వంటకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ ఆ పన్నీర్ ఎంత శుభ్రమైనది అనేది ఎవరూ పట్టించుకోవడం లేదు. మసాలాలు వేసి వండి వడ్డిస్తే ఆబగా తినేయడం కనిపిస్తుంది. ఆహారశాఖ అధికారులు బెంగళూరులో పలు చోట్ల పన్నీర్ శాంపిల్స్‌ను సేకరించి నాణ్యత పరీక్షకు పంపించారు. రిపోర్టుల్లో పన్నీర్లో ప్రమాదకర బాక్టీరియా ఉన్నట్టు పేర్కొన్నారు. 231 పన్నీర్ శాంపిల్స్‌లో 17 శాంపిల్స్ రిపోర్టు మాత్రం వచ్చింది. వాటిలో ప్రమాదకర బాక్టీరియా ఉన్నట్టు, దానివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. కల్తీ పదార్థాలతో పన్నీర్ తయారీ, అపరిశుభ్ర పరిస్థితుల్లో నిల్వ, దానిని వట్టి చేతులతో తాకడం వల్ల క లుషితం అవుతుంది. నివేదికల్లో వెల్లడి -
నకిలీ ఇన్‌స్టా పోస్టుపై ఐదు కేసులు
హుబ్లీ: డబ్బులిస్తే, ఫేజీ ఫాలో చేస్తే 10వ తరగతి ప్రశ్న పత్రిక ఇస్తామని నకిలీ పోస్టు పెట్టిన 5 ఇన్‌స్టా పేజీలకు వ్యతిరేకంగా ఇక్కడి కమరిపేట పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కేసులు దాఖలు అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంగా అభ్యర్థులను గందరగోళ పరిచే ప్రయత్నం ఇన్‌స్టా పేజ్‌తో పాటు సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నకిలీ ప్రశ్నపత్రికల లీకేజీకి సంబంధించి ఆరోపణలు వెలువడటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందినా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో అప్రమత్తమైన హుబ్లీ ధార్వాడ కమిషరేట్ పోలీసులు ఫేక్ పోస్టుల ద్వారా 10వ తరగతి విద్యార్థులను దారి తప్పిస్తున్న 5 ఇన్‌స్టా పేజీలకు వ్యతిరేకంగా ప్రత్యేక కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అంతేగాక స్వయంగా పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ స్పందిస్తూ ఇలాంటి ఫేక్ పోస్టుల వల్ల గందరగోళానికి గురి కాకుండా బాగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు ధైర్యం నూరిపోశారు. ఎన్‌ఆర్‌బీసీకి ఏప్రిల్ ఆఖరు వరకు నీరందించండి రాయచూరు రూరల్: నారాయణపుర కుడి గట్టు కాలువ(ఎన్‌ఆర్‌బీసీ) ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీరందించాలని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ డిమాండ్ చేశారు. బుధవారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్దరామయ్యను జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలందరితో కలసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాలువకు మార్చి 31 వరకు నీరు వదలడానికి ఇప్పటికే అధికారులు సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో చేతికొచ్చిన పంట నోటికి రాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. నీటి గేజ్ నిర్వహణలో సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు భూములకు నీరందేలా అధికారులు జాగ్రత్తలు పాటించడం లేదన్నారు. కాలువకు ఏప్రిల్ చివరి వరకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సాగునీటి కోసం ధర్నా రాయచూరు రూరల్: నారాయణపుర కుడి గట్టు కాలువ(ఎన్‌ఆర్‌బీసీ) ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీరందించాలని కర్ణాటక రైతు సంఘం జిల్లాధ్యక్షుడు శివపుత్ర పాటిల్ డిమాండ్ చేశారు. బుధవారం దేవదుర్గ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎండిన వరి దుబ్బులతో చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. కాలువకు మార్చి 31 వరకు నీరు వదిలితే రైతులకు రబీ పంట చేతికందకుండా పోతుందన్నారు. నీరందించడానికి శాశ్వత పరిష్కారం చేపట్టడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపడం లేదన్నారు. కాలువకు ఏప్రిల్ నెలాఖరు వరకు వారబందీ ద్వారా నీరు వదిలి చివరి భూములకు నీరందించాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. మంటల్లో ఫైబర్ కేబుల్ రోల్స్ దగ్ధం హొసపేటె: కొప్పళ జిల్లా బాణాపుర వద్ద ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో జియో ఫైబర్ కేబుల్ 4 రోల్స్ కాలిబూడిదయ్యాయి. కుకనూరు తాలూకా బాణాపుర గ్రామంలో జాతీయ రహదారి వెంట తళకల్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఉంచిన జియో ఫైబర్ కేబుల్ నాలుగు రోల్స్ ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకున్నాయి. దీంతో జియో ఫైబర్ కేబుల్ పూర్తిగా కాలిబూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. కానీ అప్పటికే అన్ని కేబుళ్లు కాలిబూడిదయ్యాయి. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. చెరువుల అభివృద్ధికి పెద్దపీట రాయచూరు రూరల్: యాదగిరిలో చెరువుల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని నగరసభ అధ్యక్షురాలు లలిత అనాపురె పేర్కొన్నారు. నగరంలోని లుంబిని చెరువులో మరబోట్ల కార్యాచరణకు శ్రీకారం చుట్టి ఆమె మాట్లాడారు. మరబోట్లతో వేసవి కాలంలో నగర ప్రజలకు ఆహ్లాదం పొందేడానికి, సేద తీరడానికి అవకాశం కల్పించామన్నారు. శాసన సభ్యుడు చెన్నారెడ్డి తన్నూరు మాట్లాడుతూ జిల్లా పాలక మండలి, జిల్లా పంచాయతీ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో జల క్రీడలకు ప్రాముఖ్యతనిచ్చామన్నారు. శహాపుర తాలూకా మావిన చెరువు, ఇబ్రహీంపుర, మినాజ్పూర్ చెరువులను ప్రజలను ఆకట్టుకొనే విధంగా పర్యాటక శాఖ అభివృద్ధి పరుస్తుందన్నారు. ఈ సందర్భంగా అదనపు జిల్లాధికారి శరణప్ప, పర్యాటక శాఖ అధికారి రామచంద్రలున్నారు. -
ఊపందుకున్న ఖాతా అభియాన్
సాక్షి,బళ్లారి: గత కొన్ని నెలలుగా ఆర్ఎస్, టీఎస్, ఎన్ఏ ఇంటి స్థలాలకు సంబంధించిన యజమానులకు పూర్తిగా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో పాటు, వారి ఇంటి స్థలాలకు సంబంధించి ఫాం–2 సర్టిఫికెట్ల పంపిణీ కూడా ఆపివేయడంతో ఆయా ఇళ్ల స్థలాలు కలిగిన యజమానులు తీవ్ర ఇబ్బందులు, సమస్యల్లో కూరుకుపోయిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది. ఏ ఖాతా, బీ ఖాతా చేయించుకుని వారి ఇంటి స్థలాలకు పూర్తిగా హక్కులతో పాటు రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు, అమ్ముకునేందుకు అవకాశం కల్పించడంతో జనం ఏ ఖాతా, బీ ఖాతాలు చేయించుకునేందుకు ఎగబడుతున్నారు. నగరంలోని దాదాపు 35 వేలకు పైగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఏ ఖాతా, బీ ఖాతాలు చేసి ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఏ ఖాతా, బీ ఖాతాలు చేసి ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 20 రోజుల క్రితం ప్రభుత్వం నుంచి జారీ అయిన ఈ తాజా ఆదేశాలతో ఆయా కార్యాలయాల వద్ద రద్దీ నెలకొంది. ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లాది ఆదాయం అటు ప్రభుత్వానికి కూడా కోట్లాది రూపాయల ఆదాయం కూడా వస్తున్న నేపథ్యంలో అధికారులు సిటీకార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆయా ఇంటి స్థలాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి ఏ ఖాతా, బీ ఖాతాలు అందజేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి నగరంలోని మూడు జోన్లలో ఉన్న కార్పొరేషన్ కార్యాలయాల వద్ద నిత్యం జన సందడి కనిపిస్తోంది. నగరంలోని గాఽంధీనగర్ సిటీ కార్పొరేషన్ కార్యాలయం జోన్ –1 కేంద్రం, పాత సిటీ కార్పొరేషన్ కార్యాలయం జోన్–2, కౌల్‌బజార్ జోన్–3 కేంద్రంగా తమ తమ వార్డులకు సంబంధించిన ఆర్ఎస్, టీఎస్, ఎన్ఏ ఇళ్ల స్థలాలకు సంబంధించిన రికార్డులు అందజేసిన వారికి ఏ ఖాతా ఇంటి స్థలాలకు ఫాం–2, బీ ఖాతా ఇంటి స్థలాలకు ఫాం–2ఎ సర్టిఫికెట్లు (హక్కుపత్రాలు) అందజేస్తున్నారు. దీంతో ఆయా కార్యాలయాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ ఇంటి స్థలాలకు పన్నులు చెల్లించి, హక్కు పత్రాలు పొందేందుకు జనం ముందుకు వస్తున్నారు. ఈ హక్కుపత్రాలు పొందితే ఆయా ఇళ్ల స్థలాల యజమానులు బ్యాంకు రుణాలు పొందడంతో పాటు అమ్ముకునేందుకు, రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు అవకాశం లభిస్తుండడంతో నగరంలో ఏ నలుగురు కలిసినా ఏ ఖాతా, బీ ఖాతా అభియాన్పైనే చర్చించుకుంటున్నారు. స్థలాల క్రయవిక్రయాలకు వెసులుబాటు ఆర్ఎస్, టీఎస్, ఎన్ఏ ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్లు గత ఏడాది నుంచి నిలిపివేసిన తరుణంలో ప్రస్తుతం వినూత్నంగా అభియాన్‌ను ప్రారంభించడంతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది. ఇంటి స్థలాల యజమానులకు కూడా వారి స్థలాలకు హక్కు పత్రాలు పొంది వారికి అవసరమైనప్పుడు అమ్ముకునేందుకు వెసులుబాటు లభిస్తోంది. దీంతో ఏ ఖాతా, బీ ఖాతాలు చేయించుకునేందుకు జనం ఎగబడుతున్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్ జోన్‌కు సంబంధించిన జోనల్ అధికారి గురురాజు సాక్షితో మాట్లాడుతూ ఈ అభియాన్ ప్రారంభించినప్పటి నుంచి జనంలో మంచి స్పందన లభిస్తోందన్నారు. వారి ఇంటి స్థలాలకు సంబంధించి ఏ ఖాతా లేదా బీ ఖాతాలు చేయించుకుని పూర్తి హక్కులు పొందుతున్నారన్నారు. భవిష్యత్తులో బ్యాంకు రుణాలతో పాటు అవసరమైతే వారి స్థలాలను అమ్ముకునేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. ఇప్పటి వరకు తమ జోన్ పరిధిలో దాదాపు 1500 ఏ ఖాతా ఫాం–2, బీ ఖాతాకు సంబంధించి ఫాం–2ఏలను ఆయా యజమానులకు పంపిణీ చేశామన్నారు. మిగిలిన రెండు జోన్లలో కూడా దాదాపు ఇదే తరహాలో జోరుగా ఫాం–2, ఫాం–2ఏ సర్టిఫికెట్లు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఏ ఖాతా అంటే ఫాం–2, బీ ఖాతా అంటే ఫాం–2ఏ మూడు జోన్లలో 35 వేలకు పైగా ఖాతాల పంపిణీకి చర్యలు గాంధీనగర్, పాత కార్పొరేషన్, కౌల్‌బజార్ కార్యాలయాల్లో రద్దీ -
రౌడీషీటర్‌పై పోలీసుల కాల్పులు
శివమొగ్గ: పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల పై దాడి చేసి పరారయ్యేందుకు ప్రయత్నించిన రౌ డీషీటర్పై కాల్పులు జరిపారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జిల్లాలోని భద్రావతి నగరంలో జరిగింది. వివరాలు.. శివమొగ్గ తుంగానగర స్టేషన్ పరిధిలో ప్రముఖ రౌడీషీటర్‌గా ఉన్న కడేకల్ హబీద్ గత నెల భద్రావతి పేపర్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తుండగా, అతను భద్రావతిలోనే తలదాచుకున్నట్లు తెలిసింది. పేపర్ టౌన్ ఠాణా ఇన్స్పెక్టర్ నాగమ్మ తమ సిబ్బందితో వెళ్లగా, హబీద్ పోలీసులపైనే దాడి చేసి పారిపోవాలని చూశాడు. దీంతో సీఐ నాగమ్మ అతని కాళ్లపైకి కాల్పులు జరపడంతో అక్కడే పడిపోగా బంధించారు. నిందితున్ని, అతని దాడిలో గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. హబీద్పై పలు పోలీసు స్టేషన్ల పరిధిలో హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు వంటి 20 కేసులు ఉన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఘాట్ రోడ్డులో బస్సు– లారీ ఢీ ● 15 మందికి గాయాలు శివమొగ్గ: కేఎస్ఆర్టీసీ బస్సు– ట్యాంకర్ లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో సుమారు 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. శివమొగ్గ జిల్లా హోసనగర తాలూకా మాస్తికట్టె వద్ద హులికల్ ఘాట్‌లో సోమవారం రాత్రి జరిగింది. బస్సు మంగళూరు నుంచి హొసపేట వైపు వెళుతోంది. ట్యాంకర్ లారీ ఎదురుగా వస్తోంది. ఈ సమయంలో ఢీ కొట్టుకున్నాయి. బస్సులోని 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చిమ్మచీకటిలో హాహాకారాలు చేశారు. వీరిని మెరుగైన చికిత్స కోసం శివమొగ్గ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఏడు మందికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక కాంగ్రెస్ నేత ఆర్ఎం మంజునాథ్‌గౌడ, స్నేహితులు చేరుకుని బాధితులను ఆస్పత్రిలో చేర్పించి భోజన వసతులను కల్పించారు. మోపెడ్‌పై లారీ పల్టీ ● వాహనదారు మృతి తుమకూరు: లోడ్‌తో వెళుతున్న లారీ అదుపుతప్పి టీవీఎస్ మోపెడ్‌పై బోల్తా పడింది. మోపెడ్ వాహనదారుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనతో కోపోద్రిక్తుడైన ప్రజలు జాతీయ రహదారి మధ్యలో షామియానా వేసి ఆందోళన చేశారు. తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా హుళియారు నాఫెడ్ కేంద్రం నుంచి రాగిధాన్యం లోడ్‌తో శిరా గోడోన్కు లారీ వెళుతోంది. యగచీహళ్లి వద్ద గాణదాళు సొసైటీ నుంచి టీవీఎస్‌లో వెళుతున్న అమీర్ (72) అనే వృద్ధుని మీద లారీ బోల్తా పడింది. అమీర్ అక్కడే మరణించాడు. లారీలోని రాగి మూటలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. అతి వేగం వల్ల ప్రమాదం జరిగిందని, ఇక్కడ వేగ నిరోధకాలను ఏర్పాటు చేయాలని ప్రజలు ధర్నా చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. చివరకు పోలీసులు వచ్చి నచ్చజెప్పారు. మైసూరు గొడవ.. ఎస్ఐ సస్పెండ్ మైసూరు: గతంలో నగరంలోని ఉదయగిరి పోలీసు స్టేషన్, సిబ్బందిపై ఓ వర్గం వారు దాడి చేసిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఒక ఎస్ఐ, ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్‌చేశారు. సామాజిక మాధ్యమంలో ఒక వ్యక్తి చేసిన పోస్టు వల్ల అల్లరి చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ పోస్టు చేసిన వ్యక్తిని అరెస్టు చేసి అదే ఠాణాకు తీసుకురావడం తప్పిదమని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. మరెక్కడికై నా తీసుకెళ్లి ఉండాల్సిందని, తద్వారా గొడవలు జరిగేవి కావని అంచనా వేశారు. పరిస్థితులను నియంత్రించడంలో విఫలం అయ్యారనే ఆరోపణలపై ఠాణా ఎస్ఐ రూపేశ్, ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను పోలీసు కమిషనర్ సీమా లాట్కర్ సస్పెండ్ చేశారు. -
డ్రింక్స్, డ్రగ్స్, మొబైల్సే శత్రువులు
హొసపేటె: విద్యార్థులు తమ జీవితాల్లో ఉజ్వల భవిష్యత్తును దూరం చేసే మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సమాచారం, కమ్యూనికేషన్ సాధనంగా మొబైల్ ఫోన్లను ఉపయోగించాలని జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ అభిప్రాయపడ్డారు. మంగళవారం నగరంలోని శంకర్ ఆనంద్‌సింగ్ ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కళాశాల ఆడిటోరియంలో సమాచార, ప్రజా సంబంధాల శాఖ, మద్యపాన నియంత్రణ బోర్డు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలు మద్యం మాదకద్రవ్యాలతో కలిగే దుష్ప్రభావాలపై నిర్వహించిన సదస్సు, అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మొబైల్ ఫోన్లను అధికంగా వాడటం వల్ల విద్యార్థుల మానసిక, మేధో వికాసంపై దుష్ప్రభావం పడుతుందని అన్నారు. విద్యార్థులు తమ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలంటే పట్టుదల చాలా ముఖ్యం, దీని కోసం మద్యం, మాదకద్రవ్యాల ఉచ్చులో పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదన్నారు. విద్యార్థి జీవితంలో యువత వీటిని అరికట్టడానికి ఏకై క మార్గం మానసిక నియంత్రణ. విద్యార్థులు తమ మనస్సును నియంత్రింకునే శక్తిని అర్థం చేసుకుంటే భవిష్యత్తులో వారి లక్ష్యాలను సాధించడం చాలా సులభం అవుతుందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల సంరక్షణ, సామాజిక బాధ్యతతో జీవించడానికి నిబద్ధత కలిగి ఉండాలి. యువకులు డ్రగ్స్ అమ్ముతున్నట్లు కనిపిస్తే జిల్లా యంత్రాంగం చర్యలకు సిద్ధంగా ఉందన్నారు. విద్యార్థుల వయస్సు పరిధిని బట్టి మూర్ఛలు ఎక్కువగా ఉండటంతో మద్యం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శ్రీహరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు సోమశేఖర్, ప్రిన్సిపాల్ నారాయణ హెబసూర్, వార్త అధికారి ధనుంజయ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులకు జిల్లాధికారి హితవు -
రంజాన్ ఉపవాసంతో ఆత్మశుద్ధి
బళ్లారిఅర్బన్: పవిత్ర రంజాన్ ఉపవాస రోజుల్లో సాయంత్రం ఇఫ్తార్ విందులో ఉపవాసం చేసిన వ్రతదారుల ప్రార్థనలు, కోరికలను అల్లా స్వీకరించి పరిష్కరిస్తారని, రంజాన్ ఉపవాస దీక్షల వల్ల ఆత్మశుద్ధి అవుతుందని నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి అన్నారు. బలిజ భవన్ పక్కన ఖాళీ స్థలంలో రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకొని ఎమ్మెల్యే అభిమానుల బృందం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని ముస్లిం బాంధవులకు స్వయంగా భోజనం వడ్డించి మాట్లాడారు. ఉపవాసం వల్ల ఆత్మశుద్ధితో పాటు పరోపకార గుణం తదితర మంచి అలవాట్లు అలవడతాయన్నారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యేకు జేసీబీతో భారీ గజమాలను వేసి స్వాగతించారు. రాము, రసూల్, దూనిద్, మెహబూబ్ పీరా, కోదండరాముడు, రాజన్న, ఖాదర్, అబ్దుల్, రజాక్, శివు, రాజా సాబ్, సుభాన్ షేక్ తదితరులు పాల్గొన్నారు. సలాం బళ్లారికి ఎమ్మెల్యే శ్రీకారం ప్రజా సమస్యలను ఆయా ప్రాంతాల్లో పర్యటించి స్వయంగా తెలుసుకొని వీలైనంత త్వరగా పరిష్కరించే దిశలో నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి నాంది పలికారు. ఆ మేరకు సలాం బళ్లారి పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం 6వ వార్డులో సలాం బళ్లారిని ప్రారంభించి ఆయన మాట్లాడుతూ సమస్యలు ఏవైనా కానీ వారి ఇంటి ముంగిటకు వెళ్లి అంతేకాకుండా వారింట్లోనే భోజనం చేసి సమస్యలను వింటాను. ఎవరూ ఇకపై ఖర్చు పెట్టుకొని తన కార్యాలయానికి రాకూడదని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని అన్ని వార్డుల్లో పర్యటించి అక్కడే ఏ సమస్యలనైనా తెలుసుకొని అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. -
హక్కుల కోసం నిరంతర పోరాటం
హొసపేటె: సమాజంలో మహిళలకు సమాన హక్కుల కోసం నిరంతరం పోరాటాలు జరగాలని సివిల్ కోర్టు న్యాయమూర్తి టి.అక్షత తెలిపారు. విజయనగర జిల్లా హూవినహడగలి రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ, లీగల్ సర్వీసెస్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. మహిళా దినోత్సవం 8వ తేదీకే పరిమితం కాకూడదని, ప్రతి రోజు దినోత్సవం జరుపుకోవాలన్నారు. ప్రతి రంగంలోనూ దోపిడీ జరుగుతున్నా సామాజిక, రాజకీయ, వృత్తి, విద్యా, ఇతర రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారు. కానీ ఆమెకు సమాన హక్కులు లేకుండా చేస్తున్నారు. కాబట్టి మహిళలు సంఘటితంగా ఉండాలన్నారు. వారి హక్కులను పొందేందుకు, వారిపై జరుగుతున్న దారుణాలను నిరోధించడానికి, అటువంటి సమాజంలో మహిళలు తమ సరైన హోదాను సాధించాలంటే చట్టపరమైన పరిజ్ఞానం చాలా అవసరమన్నారు. తాలూకా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జి.వసంత్‌కుమార్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. తాలూకా ఆరోగ్య అధికారిణి స్వప్న కత్తి, మహిళా శిశు సంక్షేమ అధికారిణి రామనగర గౌడ, సంఘం ప్రధాన కార్యదర్శి డి.సిద్దనగౌడ, కోశాధికారి ఎంపీఎం ప్రసన్నకుమార్, ఆటవలిగి కొట్రేష్, టీఎంపీ అసిస్టెంట్ డైరెక్టర్ హేమాద్రినాయక, గంగాధర, హెచ్.సుజాత, మహిళా శిశు అభివృద్ధి శాఖ సిబ్బంది, న్యాయవాదుల సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. -
కేజీఎఫ్ క్రైం స్టోరీ!
కెజీఎఫ్: కోలారు జిల్లా కేజీఎఫ్ పట్టణంలో రౌడీషీటర్ శివకుమార్ హత్య కేసు వెనుక ఉన్నది మైనర్ బాలిక, ఒక యువకుడు, ఇద్దరు బాలురు అని తెలిసి పోలీసులు, పట్టణవాసులు అవాక్కయ్యారు. కేజీఎఫ్ పేరును నిలబెట్టారని వ్యంగ్యంగా చెప్పుకొంటున్నారు. సినిమా కథను తలపించే ఈ కేసును పోలీసులు ఛేదించారు. శివకుమార్ (32) ప్రియురాలే హంతకురాలిగా పోలీసులు తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చదువుతూ.. జిల్లా ఎస్పీ కేఎం శాంతరాజు వివరాలను వెల్లడించారు. రాబర్ట్సన్ పేటలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేస్తున్న మైనర్ బాలిక (17)ను రౌడీ శివకుమార్ ప్రేమిస్తున్నాడు. తరచూ షికార్లకు తీసుకెళ్లేవాడు. త్వరలోనే పెళ్లి చేసుకుందామని బాలికను ఒత్తిడి చేయగా, ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దీంతో ఆమె తన కళాశాలలో చదువుతున్న దీపక్, మరో ఇద్దరు మైనర్లతో కలిసి శివకుమార్‌ను హత్య చేయడానికి పన్నాగం పన్నింది. చేపలు తిందాం రా అని శివకుమార్‌ను గత ఆదివారంనాడు బైక్‌లో లాంగ్ డ్రైవ్‌కు తీసుకు వెళ్లింది. సమీపంలోని కామసముద్రం అటవీప్రాంతంలోనికి వెళ్లిన తరువాత ముగ్గురు వెంబడించి కత్తులతో శివకుమార్‌పై దాడి జరిపారు. ప్లాన్ ప్రకారం బాలికను కూడా ఉత్తుత్తిగా బెదిరించారు. శివకుమార్ తీవ్ర గాయాలై పారిపోతూ ఓ చోట పడిపోయి చనిపోయాడు. తల్లిదండ్రులు లబోదిబో రౌడీ హత్యాకాండ పట్టణంలో కలకలం రేపింది. పోలీసులు బాలికను ప్రశ్నించగా ముసుగు వ్యక్తులు వచ్చి హత్య చేసి వెళ్లారని తెలిపింది. పోలీసులు మరింత లోతుగా దృష్టి సారించారు. ఫోన్ కాల్స్, సీసీ కెమెరాల చిత్రాలను బట్టి నిందితులను గుర్తించారు. వారిని పట్టుకుని విచారించగా, బాలిక సూచనలతో హత్య చేశామని ఒప్పుకున్నారు. మొత్తం నలుగురినీ జ్యుడిషియల్ కస్టడీకి పంపి విచారణ చేస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో తప్పు చేసి జీవితం నాశనం చేసుకున్నారని పిల్లల తల్లిదండ్రులు లబోదిబోమన్నారు. హతుడు శివ (ఫైల్) రౌడీషీటర్ హత్య వెనుక.. బాలిక, ఇద్దరు మైనర్లు విద్యార్థినితో రౌడీ ప్రేమాయణం పెళ్లికి ఒత్తిడి చేయడంతో హత్యకు ఆమె కుట్ర -
బైకుల చోరుని అరెస్ట్
● 6 ద్విచక్రవాహనాలు జప్తు హొసపేటె: ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఓ యువకుడిని హగరిబొమ్మనహళ్లి పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. నిందితుడిని హగరిబొమ్మనహళ్లి తాలూకా మల్లనాయకనహళ్లికి చెందిన యువకుడు ప్రశాంత్‌గా గుర్తించారు. అతని వద్ద నుంచి సుమారు రూ.3.20 లక్షల విలువ చేసే బైక్‌లను స్వాధీనపరచుకున్నారు. హగరిబొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అతనిని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. డీఎస్పీగా శాంతవీర రాయచూరు రూరల్: రాయచూరు డీఎస్పీగా శాంతవీర అధికార బాధ్యతలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ సత్యనారాయణ నుంచి బాధ్యతలు స్వీకరించారు. బాగల్కోటె జిల్లా జమఖండి డీసీఆర్బీలో విధులు నిర్వహిస్తున్న శాంతవీర రాయచూరుకు బదిలీ అయ్యారు. గతంలో ఉన్న డీఎస్పీ సత్యనారాయణను బళ్లారి ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు. గుర్తు తెలియని శవాలు లభ్యం రాయచూరు రూరల్: నగరంలో గుర్తు తెలియని రెండు మృతదేహాలు లభ్యమైనట్లు సదర్ బజార్ సీఐ ఉమేష్ కాంబ్లే వెల్లడించారు. మంగళవారం సాయంత్రం నగరంలోని మావినకెరె చెరువులో 45 ఏళ్ల లోపు వయస్సుగల మహిళ శఽవం లభించింది. మూడు రోజుల క్రితం ఆమె చెరువులో పడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. రాయచూరు కేఎస్ఆర్టీసీ బస్టాండ్‌లో 75 ఏళ్ల వయస్సుగల వృద్ధుడు నీరసంతో కళ్లు తిరిగి పడి మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వర్షాలకు గోడ కూలి ఇద్దరు మృతి హుబ్లీ: నిర్మాణ దశలోని ఫ్యాక్టరీ గోడ భారీ వాన, గాలులకు కూలి పడటంతో ఇద్దరు కూలి కార్మికులు అక్కడికక్కడే చనిపోగా మరొకరు గాయపడిన ఘటన ధార్వాడ జిల్లా కలఘటిగి తాలూకా కాడనకొప్ప గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పాత హుబ్లీ నివాసి దావూద్ సబనూరు(52) రఫీక్ సాబ్ చెన్నపుర (50) మరణించారు. గాయపడిన హుబ్లీ తాలూకా అంచటగేరి గ్రామానికి చెందిన మహంతేష్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిస్త్రికోటి రోడ్డులో నివసిస్తున్న మృతులు భవన నిర్మాణ పని చేస్తున్నారు. మధ్యాహ్నం భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు తీవ్రంగా వీయడంతో గోడ వద్ద నిలబడిన సమయంలో సుడిగాలికి గోడ కూలడంతో మృతి చెందారు. ఘటనపై కలఘటిగి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నగరసభ అధ్యక్షురాలిగా మంజుల చెళ్లకెరె రూరల్: చెళ్లకెరె నగరసభకు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మంజుల ప్రసన్నకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగరసభలోని 23 మంది సభ్యులు అందరూ మద్దతు తెలపడం ద్వారా ఏకగ్రీవంగా నగరసభకు నూతన అధ్యక్షురాలిగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి, జెడ్పీ ఉప విభాగాధికారి మహమ్మద్ జిలాన్ తెలిపారు. మానవ సేవే మాధవసేవగా భావించి అందరి మన్ననలు పొందిన మంజుల ప్రసన్నకుమార్‌ను నూతన నగరసభ అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం హర్షణీయమని ఎమ్మెల్యే టి.రఘుమూర్తి అభినందించారు. కాగా సహచర నగరసభ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు నూతన అధ్యక్షురాలితో పాటు ఎమ్మెల్యేని పూలమాలతో అభినందించారు. రోడ్ల వెడల్పునకు వినతి రాయచూరు రూరల్: నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టాలని ప్రగతిశీల సంఘాల వేదిక డిమాండ్ చేసింది. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద అధ్యక్షుడు సుదానంద మాట్లాడారు. నగరంలోని అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రాం సర్కిల్, సూపర్ మార్కెట్, తీన్ కందిల్, నవోదయ రహదారి, ఆశాపూర్ రహదారి, శెట్టిబావి సర్కిల్, నగరసభ, ఇతర రహదారులు చిన్నవిగా ఉన్నాయని, వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందన్నారు. నగరసభ అధికారులు చర్యలు చేపట్టి ఆక్రమించిన వాటిని తొలగించి, రహదారుల విస్తరణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. -
హంపీ ఘనత పెంపులో గైడ్ల పాత్ర కీలకం
హొసపేటె: హంపీ ప్రతిష్టను ప్రపంచ స్థాయికి పెంచడంలో హంపీలోని పర్యాటక గైడ్ల పాత్ర గణనీయమైనదని, పర్యాటకులకు నిజమైన చరిత్రను చెప్పడానికి కొత్త గైడ్లు ముందుకు వస్తున్నారని ఎమ్మెల్యే హెచ్ఆర్.గవియప్ప తెలిపారు. నగరంలోని మల్లిగె హోటల్ ఆడిటోరియంలో మంగళవారం టూరిస్ట్గైడ్ల కోసం ఏర్పాటు చేసిన ఒక రోజు పునరావాస శిక్షణ సదస్సు, సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. హంపీలో దాదాపు 1600 పురావస్తు భవనాలు ఉన్నాయి. విజయనగర సామ్రాజ్యం కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాదు, మతపరమైన ప్రదేశం కూడా. హంపీలో భువనేశ్వరి దేవి ఆలయం ప్రతిష్టించారు. శ్రీ పంపా విరుపాక్షేశ్వరుని చరిత్ర శివపురాణంలోని ఆనవాళ్ల ద్వారా వెల్లడవుతోంది. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న దక్షిణ కాశీ కాబట్టి ఇది ఒక ప్రత్యేక ప్రదేశం. స్వదేశం, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు గైడ్ల కొరతను నివారించడానికి 75 మంది మాన్యుమెంట్ గైడ్లు, 25 మంది నేచర్ గైడ్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చింది. మొత్తం 95 మంది టూరిస్ట్ గైడ్లకు గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్లు జారీ చేయడం గర్వకారణం. హంపీ పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి స్మారక చిహ్నం మధ్య రోడ్డు కనెక్టివిటీని కల్పించడానికి ఒక ప్రణాళికను రూపొందించాలని తెలిపారు. ఈ సందర్భంగా నగరసభ అధ్యక్షులు రూపేష్‌కుమార్, మల్లిగి హోటల్ యజమాని శ్రీపాద, అధికారి ప్రభులింగ తదితరులు పాల్గొన్నారు. -
ఓజీ కుప్పం దొంగల ముఠాకు సంకెళ్లు
తుమకూరు: కార్ల అద్దాలను పగలగొట్టి లోపల దొరికిన నగదు, నగలు, విలువైన వస్తువులను తస్కరించే ఓజీ కుప్పం దొంగల ముఠాను తుమకూరు జిల్లా గుబ్బి స్టేషన్ పోలీసులు పట్టుకన్నారు. రూ.16 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనపరచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఓజీ కుప్పానికి చెందిన జీ.శివ (44), సుబ్రమణ్యం (38) అనే ఇద్దరు అరెస్టు కాగా, అంకయ్య, కిరణ్, రాజశేఖరయ్యలు పరారీలో ఉన్నారు. క్షణాల్లో రూ.15 లక్షలు మాయం వివరాలు.. గుబ్బికి చెందిన శివరాజు గత నెల 27న ఓ బ్యాంకు నుంచి రూ.15 లక్షలు డ్రా చేసుకుని కారులో పెట్టుకుని, ఏపీఎంసీ ముందు భాగంలో కారు నిలిపి లోపలకు వెళ్లి పని ముగించుకుని వచ్చాడు. అంతలోనే కారులోని డబ్బు, దాఖలాలు మాయమయ్యాయి. బాధితుడు గుబ్బి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల చిత్రాలు, ఇతర ఆధారాలను సేకరించి నిందితులను అరెస్టు చేశారు. జిల్లాలోనే పలు దొంగతనాలు చేసినట్లు నోరు విప్పారు. శిరలో 2, చిక్కనాయకనహళ్లి, నొణవినకెరె, గుబ్బి స్టేషన్ల పరిధిలో 1 చొప్పున మొత్తం 5 చోరీలు చేశామని తెలిపారు. నిందితుల నుంచి కొంత నగదు, ఒక బంగారు బ్రాస్లెట్తో సహా రూ.16 లక్షల విలువ చేసే ఆభరణాలను జప్తు చేశారు. గుబ్బి ఇన్స్పెక్టర్ టీఆర్ రాఘవేంద్ర, పీఎస్ఐ జీకే సునీల్ కుమార్, సిబ్బంది నవీన్ కుమార్ పాల్గొన్నారు. తుమకూరు జిల్లాలో పలు చోరీలు రూ. 16 లక్షల సొత్తు సీజ్ -
క్యాంటర్ దూసుకెళ్లి బీటెక్ విద్యార్థిని మృతి
దొడ్డబళ్లాపురం: బైక్‌పై వెళ్తున్న విద్యార్థిని కిందపడగా వెనుక నుంచి వచ్చిన క్యాంటర్ ఆమె పైనుండి దూసుకెళ్లగా మరణించిన సంఘటన బెంగళూరు–మంగళూరు జాతీయ రహదారి మార్గంలో చోటుచేసుకుంది. మాగడి తాలూకా బ్యాడరహళ్లి గ్రామానికి చెందిన సిద్ధరాజు, జగదాంబ దంపతుల కుమార్తె ధనుశ్రీ (20) మృతురాలు. వివరాలు.. ఈమె మంగళూరు ఆళ్వాస్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది. గ్రామంలో జాతర ఉండడంతో వచ్చింది. తిరిగి మంగళూరు వెళ్లేందుకు తమ్ముడు రేణుకేశ్తో కలిసి బైక్‌పై కుణిగల్ రైల్వేస్టేషన్‌కు బయలుదేరింది. తాళెకెరె హ్యాండ్ పోస్టు వద్ద జాన్సన్ ఫ్యాక్టరీ ముందు ప్రమాదవశాత్తు బైక్ పైనుండి కిందపడింది. వెనుకనే వేగంగా వచ్చిన క్యాంటర్ ఆమైపె దూసుకుపోయింది. ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కుణిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గతంలోనూ హనీట్రాప్ ఉంది: యతీంద్ర మైసూరు: రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకే హనీట్రాప్ జరిగిందని అనడం సరికాదని, గతంలో బీజేపీ ప్రభుత్వంలోనూ హనీట్రాప్ జరిగిందని, తాజాగా అదే తరహా ప్రయత్నం జరిగిందని, దీనివెనుక పెద్ద కుట్ర ఉందని హస్తం ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య అన్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు ద్వారానే ఈ కుట్ర కోణం బయట పడుతుందన్నారు. బుధవారం మైసూరులో మీడియాతో యతీంద్ర మాట్లాడుతూ గత బీజేపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం బసవరాజు బొమ్మైతో పాటు సుమారు 17 మంది ఎమ్మెల్యేలు, మంత్రుల హనీట్రాప్ వీడియో ఉందని, మీడియాలో ప్రసారం కాకుండా కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుని రావడం వల్ల అది అప్పట్లో ఆగిపోయిందని చెప్పారు. ఈ విధమైన హనీట్రాప్‌ను బీజేపీ నేతలే చేస్తున్నారని, వారికి తమ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హతే లేదని అన్నారు. హనీట్రాప్ ద్వారా బ్లాక్మెయిల్ చేసే వారికి కఠిన శిక్షలు పడాలని డిమాండ్ చేశారు. గవర్నర్ నుంచి గ్రేటర్ బెంగళూరు బిల్లు వెనక్కి శివాజీనగర: బెంగళూరులో సప్త పాలికెను ఏర్పాటు చేసి, ఒక ప్రాధికారను నెలకొల్పి దానికి సీఎం అధ్యక్షత వహించాలని, ఇంకా పలు ముఖ్యాంశాలను చేర్చి రూపొందించిన గ్రేటర్ బెంగళూరు బిల్లును గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ వెనక్కి పంపించారు. దీంతో కాంగ్రెస్ సర్కారుకు మరోసారి ఇబ్బంది కలిగింది. గవర్నర్ కొన్ని స్పష్టతలను కోరుతూ వెనక్కి పంపించారు. స్పష్టీకరణతో బిల్లును మళ్లీ గవర్నర్‌కు పంపనున్నట్లు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హెచ్.కే.పాటిల్ తెలిపారు. 2023 ఆగస్టు నుంచి ఇప్పటివరకు 119 బిల్లులను రాజ్‌భవన్ ఆమోదించింది. ఇందులో 83 బిల్లులను చట్టంగా జారీ చేయడమైనది. నాలుగు బిల్లులు గవర్నర్ వద్ద ఉన్నాయి, 7 బిల్లుల గురించి గవర్నర్ స్పష్టీకరణను కోరారు. ఐదు బిల్లులను పరిశీలన కోసం రాష్ట్రపతికి పంపించారు అని తెలిపారు. ముగ్గురు ఆఫ్రికన్ల నిర్బంధం బనశంకరి: నగరంలో అక్రమంగా మకాం వేసిన ముగ్గురు విదేశీ పౌరులను సీసీబీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఆఫ్రికాలోని సూడాన్, నైజీరియా దేశానికి చెందిన మహమ్మద్ ఇబ్రహీం అహ్మద్, ఖలీద్ ఫక్రీ మహమ్మద్, నైజీరియా ఇమ్ముయల్ అనే ముగ్గురు పట్టుబడ్డారు. బాణసవాడి, రామమూర్తినగర పోలీస్స్టేషన్ల పరిధిలో అనధికారికంగా ముగ్గురు స్థిరపడ్డారని పోలీసులు తెలిపారు. చదువుల వీసా కింద వచ్చి నగరంలోని ప్రైవేటు కాలేజీలో చేరారు. వీసా అవధి ముగిసినప్పటికీ స్వదేశాలకు వెళ్లకుండా మకాం పెట్టారు. ఇది తెలిసి బుధవారం సీసీబీ పోలీసులు అరెస్ట్‌చేసి దొడ్డగుబ్బిలోని ఆశ్రయ కేంద్రంలో ఉంచారు. అల్లుని హత్యకు భారీ కుట్ర ● విచారణలో తల్లీకూతుళ్ల వెల్లడి యశవంతపుర: మాగడి రియల్టర్ లోకనాథసింగ్ (37) హత్య కేసులో భార్య, అత్తలను బెంగళూరు బీజీఎస్ లేఔట్ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. విచారణలో కొత్త కొత్త సంగతులు బయటకు వస్తున్నాయి. అల్లుడంటే సరిపడని అత్త హేమా, ఆమె కూతురు యశస్వి పుస్తకాలు చదివి, ఇంటర్నెట్లో శోధించి హత్యకు పథకం వేశారు. హౌ టు కిల్ పుస్తకం చదివిన హేమా భోజనంలో నిద్రమాత్రలను కలపాలని కూతురికి సూచించింది. గత ఆదివారం రాత్రి నిర్మాణంలో ఉన్న భవనంలో మద్యం తాగించి, మత్తు పదార్థం కలిపిన ఆహారం తినిపించిన తరువాత అతన్ని ఇద్దరూ గొంతు కోసి హతమార్చారు. భార్య యశస్వికి చెందిన ప్రైవేట్ వీడియోను పెట్టుకొని లోకనాథ్‌సింగ్ బెదిరించేవాడని, తాను మరో మహిళను పెళ్లి చేసుకొంటానని భార్య, అత్తకు చెప్పేవాడు. ఇది తట్టుకోలేక అంతమొందించినట్లు విచారణలో తెలిపారు. -
కలబుర్గిలో ఆటో డ్రైవర్ కిడ్నాప్
● రూ.20 లక్షల నగదు దోచిన దుండగులు రాయచూరు రూరల్: సినిమా ఫక్కీలో ఆటో డ్రైవర్‌ను కిడ్నాప్ చేసి బ్యాంక్ నుంచి భార్యతో రూ.20 లక్షలు డ్రా చేయించుకొని నగదుతో దొంగల ముఠా పరారైన ఘటన కలబుర్గిలో ఆలస్యంగా వెలుగు చూసింది. మార్చి 13న ఆటో డ్రైవర్ మల్లయ్య స్వామి నందికూరు నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చిన నలుగురు ముఠా సభ్యులు తమ వాహనంలో తీసుకెళ్లినట్లు బాధితుడు మల్లయ్యస్వామి వెెల్లడించారు. ఆటో డ్రైవర్ మల్లయ్య స్వామి ఆటో నడుపుతూ, భార్య లక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారమన్నారు. బ్యాంక్‌లో రూ.30 లక్షల డబ్బులు దాచుకున్న విషయం తెలుసుకున్న ముఠా సభ్యులు కిడ్నాప్ చేసి తనను నడవడానికి కూడా వీలు లేని విధంగా చితకబాదారన్నారు. కలబుర్గి బసవనగరలోని నివాసంలో ఉంచి బ్యాంక్ నుంచి రూ.30 లక్షలు డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని లేక పోతే ప్రాణాలతో దక్కవని బెదిరించారన్నారు. ఈ విషయంపై భార్యకు ఫోన్ చేసి జూదంలో ఓడిపోయానని రూ.20 లక్షలు కట్టాలని చెప్పానన్నారు. చివరికి భార్యను కూడా అపహరించి ఆమెను భయపెట్టి ఆమె చేతుల మీదుగా రూ.20 లక్షలు డ్రా చేయించుకొని పరారయ్యారన్నారు. గాయపడ్డ తనను చికిత్స కోసం భార్యతో పాటు వారు మహారాష్ట్రలోని షోలాపూర్ ఆస్పత్రుల చుట్టు తిప్పుతూ చివరకు కలబుర్గిలో దించి వెళ్లిపోయారన్నారు. ఈ ఘటనపై కలబుర్గి పోలీసులకు ఫిర్యాదు చేసినా మౌనంగా ఉన్నారని ఆరోపించారు. -
మత్తుకు యువత దూరంగా ఉండాలి
బళ్లారిటౌన్: మత్తు పదార్థాల వల్ల చెడు ప్రభావం కలుగుతున్నందున వాటికి యువత దూరంగా ఉండాలని ప్రభుత్వ సరళాదేవి కళాశాల ప్రిన్సిపాల్ ప్రహ్లాద చౌదరి పేర్కొన్నారు. ఆయన కర్ణాటక మద్యపాన సంయమ మండలి, వార్త సమాచార శాఖ, జాతీయ ఎన్ఎస్ఎస్ విభాగం మంగళవారం కళాశాలలో చేపట్టిన మత్తు పదార్థాలతో కలిగే చెడు ప్రభావం గురించి విద్యార్థులకు ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో పాల్గొని మాట్లాడారు. నేటి యువత మంచి అలవాట్లను అలవరుచుకొని జీవితం కొనసాగించాలన్నారు. మత్తు పదార్థాల వల్ల ఆరోగ్యాలు పాడవడమే కాక ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉందన్నారు. విద్యార్థి జీవితం సుందరమైన పుష్పం లాంటిదన్నారు. తమ జీవితాలను దురలవాట్లకు దూరంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో డీహెచ్ఓ యల్లా రమేష్ బాబు మాట్లాడుతూ 16 నుంచి 22 వయస్సు గల యువత మత్తు పదార్థాల వ్యసనాలకు బలి అవుతున్నారన్నారు. దాదాపు 55 శాతం వరకు యువత ఉన్నట్లు పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి చలనచిత్రాల మనోరంజక దృశ్యాలను అలవరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో కుష్టురోగ నిర్మూలన అధికారి వీరేంద్రకుమార్, బీ.రామస్వామి, ప్రవీణ్‌కుమార్, చెన్నబసవయ్య, నజియా ఖాజీ, ఈశ్వర్ దానప్ప, వీసీ గురురాజ్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా రాచోటి ఉత్సవాలు
రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా అత్తనూరులో మంగళవారం రాచోటి శివాచార్య 21వ పుణ్యారాధన ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఊరేగింపునకు సోమవారపేట హిరేమఠ బృహన్మఠాధిపతి అబినవ రాచోటి వీరశివాచార్యులు శ్రీకారం చుట్టి మాట్లాడారు. గ్రామంలో తాగునీటి కోసం బావి, చెరువు తవ్వించి దాహార్తిని తీర్చారన్నారు. హిందూ సామ్రాజ్య స్థాపనకు నడుం బిగించిన మహాస్వామి రాచోటి శివాచార్య అన్నారు. వేడుకగా వసంతోత్సవం రాయచూరు రూరల్: నగరంలోని నవోదయ కాలనీలో వెలసిన వేంకటేశ్వర ఆలయంలో కల్యాణ, పుష్పయాగ ఉత్సవాలు వేడుకగా నిర్వహించారు. మంగళవారం నవోదయ వైద్య సంస్థల ఆధ్వర్యంలో నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేంద్రరెడ్డి దంపతులు లక్ష్మీవేంకటేశ్వరాలయంలో లక్ష్మీ వేంకటేశ్వరుడికి, గోమాతకు పూజలు జరిపారు. పుష్పయాగంతో దేవుడిని ఊరేగించి వసంతోత్సవాలు జరుపుకున్నారు. సమస్యలపై స్పందించరూ రాయచూరు రూరల్: బాగల్కోటె జిల్లా ఇలకల్‌లో నెలకొన్న సమస్యలపై నగరసభ అధికారులు స్పందించడం లేదని మాజీ శాసన సభ్యుడు దొడ్డనగౌడ ఆరోపించారు. మంగళవారం నగరసభ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. పట్టణంలో తాగునీరు, విద్యుత్ సరఫరా, రోడ్లు, మరుగుదొడ్ల ఏర్పాటు, మట్కా జూదాలను కట్టడి చేయాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం రాయచూరు రూరల్: నగరంలోని బసవేశ్వర సర్కిల్ వద్ద మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతునికి సుమారు 40 ఏళ్ల లోపు వయస్సు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పశ్చిమ పోలీస్ స్టేషన్ సీఐ మేకా నాగరాజ్ వెల్లడించారు. మస్కి పురసభ ముఖ్యాధికారి సస్పెండ్ రాయచూరు రూరల్: లింగసూగూరు తాలూకా మస్కి పురసభ ముఖ్యాధికారి రెడ్డి రాయన గౌడ సస్పెండ్ అయ్యారు. సోమవారం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని అందిన ఫిర్యాదు మేరకు జిల్లాధికారి ఆయనను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మస్కిలో నూతన కార్యాలయ నిర్మాణానికి మంజూరైన రూ.57 లక్షల నిధులతో నియమాలను ఉల్లంఘించి పీఠోపకరణాలను కొనుగోలు చేశారని, అందులో కూడా అక్రమాలు జరిగాయని అందిన ఫిర్యాదులో వాస్తవాలు బయట పడడంతో విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు జిల్లాధికారి నితీష్ తెలిపారు. పచ్చదనంతో పర్యావరణ సంరక్షణ సిరుగుప్ప: ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున సామాజిక కార్యక్రమాలతో పాటు మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించుకుందామని కల్పవృక్ష సేవా బృంద సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శివశంకర్ క్లాత్ స్టోర్ యజమాని, కుటుంబ సభ్యులు, కల్పవృక్ష సేవా బృంద సభ్యులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం ఎన్నడో?
సాక్షి, బళ్లారి: మారుతున్న కాలం, పెరుగుతున్న జనాభాకు తోడు శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్తపుంతలు తొక్కుతున్న తరుణంలో ఆహారపు అలవాట్లు మారిపోయి ప్లాస్టిక్ వాడకం కూడా పెరిగిపోవడంతో ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్లాస్టిక్ కవర్లు, పేపర్లను కూరగాయలు లేదా ఇతర వస్తువుల ప్యాకింగ్‌కు మాత్రమే వాడతారనుకొంటే పొరపాటు. వేడి వేడి ఇడ్లీలు తయారు చేసే సమయంలో పాత్రల్లో కూడా ప్లాస్టిక్ కవర్లు వేస్తున్నారు. దీంతో ప్లాస్టిక్‌లో ఉన్న కెమికల్, ఇతరత్రా ఆరోగ్యానికి కీడు చేసేవి నేరుగా ఇడ్లీలోకి చేరుతున్నాయి. వేడి వేడి సాంబారు, అన్నం, పప్పు ఇతరత్రాల పార్శిల్లో కూడా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారు. ప్లాస్టిక్ వాడకంపై ఉక్కుపాదం మోపుతామని, ప్లాస్టిక్ రహిత బళ్లారి జిల్లాగా మారుస్తామని ఏళ్ల తరబడి అధికారులు, పాలకులు చెబుతున్నారే కాని ఆ దిశగా ఎలాంటి పురోగతి లేదు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నా అధికారులు, పాలకులు ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితం అవుతున్నారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా హోటళ్లు, అంగళ్లలో ప్లాస్టిక్ వాడకం జరుగుతోంది. పట్టించుకోని పాలికె, ఆహార శాఖల అధికారులు హోటళ్లలో ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడంలో మహానగర పాలికె సంబంధిత అధికారులు, ఆహార శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో పెద్ద పెద్ద హోటళ్లు మొదలుకొని పుట్‌పాత్ హోటళ్ల వరకు ప్లాస్టిక్ వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది. ప్లాస్టిక్ కవర్లలో వేడి పదార్ధాలు వేసి పార్శిల్ చేయడం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు తెలియజేస్తున్నారు. వాటిని నియంత్రించడంలో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. భగభగ మండే వేడిలో ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఇడ్లీ తయారు చేయడంతో మరింత అనారోగ్య సమస్య ఏర్పడుతుందని తెలిసినా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నగరంలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నియంత్రిస్తామని సంబంధిత అధికారులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుండటంతో పాటు తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. హోటళ్లలో ప్లాస్టిక్ వాడకంతో పాటు బేకరీల్లో కూడా ఇష్టారాజ్యంగా ప్లాస్టిక్ వాడుతున్నారు. చిన్న చిన్న బేకరీల నుంచి పేరుగాంచిన బేకరీల వరకు వేడి వేడి బ్రెడ్లు, సమోసాలు, ఆలూ బన్లు తదితరాలను, బేకరీల్లో తయారు చేసిన వేడి వేడి ఆహార పదార్ధాలు అన్ని కూడా ముందుగానే ప్లాస్టిక్ కవర్లలో సిద్ధంగా ఉంచి అమ్మకాలు చేస్తుంటారు. మామూళ్లు ముడితే చాలు అంతా ఓకే.. ఆహార శాఖ అధికారులు ప్రత్యక్షంగా చూసినా వారికి చేతులు తడిపితే చాలు అలా పరిశీలించి ఇలా వెళ్లిపోతారనే విమర్శ ఉంది. హోటళ్లతో పాటు బేకరీల్లో వేడివేడి పదార్ధాలు ఉంచి పార్శిల్ చేసే వారిపై ఉక్కుపాదం మోపకపోతే ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుందని, తక్షణం హోటళ్లలో వాడే ప్లాస్టిక్ వినియోగంపై ఉక్కుపాదం మోపేలా అధికారులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. మహానగర పాలికె పరిధిలో ప్లాస్టిక్ వాడకం నిషేధిస్తామని అధికారం చేపట్టిన ఏడాది నుంచి ప్రతి ఒక్క మేయర్ హామీలు గుప్పిస్తున్నారే కాని ఆచరణలో మాత్రం అమలు చేయకపోవడంతో నగరంలో షరా మామూలుగానే ప్లాస్టిక్ వాడకం చేస్తున్నారు. అధికారులకు అంతో ఇంతో మామూళ్లు ఇచ్చి వ్యాపారులు ప్లాస్టిక్ అమ్మకాలు చేస్తున్నారు. ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపే ప్లాస్టిక్ వాడకం పెద్ద ఎత్తున జరుగుతుండటంతో నగర ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నగరాల్లోనే ప్టాస్టిక్ నిషేధం కాకపోతే గ్రామాలు, పట్టణాల్లో ఏస్థాయిలో అమ్మకాలు సాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా సంబంధిత అధికారులు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని పక్కాగా నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మహమ్మారి రోజురోజుకు పెరుగుతున్న వైనం హోటళ్లు, బేకరీల్లో ప్లాస్టిక్ కవర్లలోనే ప్యాకింగ్ పాత్రలో కూడా ప్లాస్టిక్ కవర్ వేసి ఇడ్లీల తయారీ -
పిల్లుల్లో ఎఫ్‌పీవీ వ్యాధి
● 100 పిల్లుల మరణం ● రాష్ట్రానికి వ్యాపించిన నూతన వైరస్ రాయచూరు రూరల్: ఇళ్లలో పెంచుకునే పెంపుడు పిల్లుల్లో ఎఫ్‌పీవీ వ్యాధి సోకి జిల్లాలో 100కు పైగా పిల్లులు మరణించినట్లు సమాచారం. ఇప్పటికే కరోనా వ్యాధి బారి నుంచి కోలుకుంటున్న తరుణంలో పిల్లుల్లో ఎఫ్‌పీవీ వ్యాధి కనిపించడంతో రాష్ట్రానికి నూతన వైరస్ వ్యాపించిందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయంపై పశు సంవర్ధక శాఖాధికారి అశోక్ కోల్కర్ మాట్లాడారు. మనిషికి పోలియో వ్యాధి సోకినప్పుడు పోలియో చుక్కలు వేసుకోకపోతే దివ్యాంగులుగా మారుతారన్నారు. ఈ విషయంలో జిల్లాలో ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరిగినట్లు తమకేమీ సమాచారం లేదన్నారు. పిల్లులకు వ్యాక్సిన్ వేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వ్యాధి పిల్లులకు మాత్రమే సోకుతుందని, మనుషులకు సోకదని తెలిపారు. జొన్నల కొనుగోళ్లు ప్రారంభం హుబ్లీ: 2024–25వ ఏడాదికి కేంద్ర ప్రభుత్వ మద్దతుధర పథకం కింద నాణ్యమైన తెల్లజొన్నలను ప్రతి క్వింటాల్‌కు హైబ్రిడ్ రూ.3371, మాల్దండి రూ.3421 చొప్పున ధార్వాడ జిల్లా రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేస్తారు. రైతులు ఈ అవకాశం వినియోగించుకోవాలని జిల్లా టాస్క్‌ఫోర్స్ సమితి చైర్పర్సన్, జిల్లాధికారిణి దివ్యప్రభు తెలిపారు. మరిన్ని వివరాలకు ధార్వాడ, హుబ్లీ, నవలగుంద, కలఘటిగి, కుందగోళ ఏపీఎంసీ కార్యదర్శి, సహకార విక్రయ మహామండలి బ్రాంచ్ మేనేజర్ లేదా 0836–2004419లో సంప్రదించాలని ఆమె కోరారు. పీఎఫ్ సౌకర్యానికి వినతి రాయచూరు రూరల్: రాష్ట్రంలో 1995లో పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. మంగళవారం పీఎఫ్ జిల్లాధికారి కార్యాలయం వద్ద పెన్షనర్లు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం వల్ల ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. పెన్షన్ 95 భవిష్య నిధి పదవీ విరమణ సమన్వయ సమితి ఆధ్వర్యంలో పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు పీఎఫ్‌ను రూ.1000 నుంచి రూ.7,500 వరకు పెంచాలని కోరుతూ పీఎఫ్ అధికారికి వినతిపత్రం సమర్పించారు. రైతు భవన్ పనుల పరిశీలన హొసపేటె: విజయనగర జిల్లాలోని హొసపేటె తాలూకాలోని అంబేడ్కర్ భవన్ సమీపంలో చేపట్టిన కొత్త రైతు భవన్ నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే గవియప్ప పరిశీలించారు. రూ.5 కోట్ల వ్యయంతో అద్భుతంగా నిర్మిస్తున్న రైతు భవన్లో ప్రోగ్రామ్ హాల్, కళ్యాణ మండపంతో సహా మూడంతస్తుల భవన నిర్మాణ పనులు ఎంత వరకు పురోగతిలో ఉన్నాయో రైతు నాయకులు ఎమ్మెల్యే గవియప్పకు వివరించారు. నిర్మాణ పనుల పరిశీలనలో రైతు నాయకుడు కటికి జంబయ్య తదితరులు పాల్గొన్నారు. హక్కులను తెలుసుకోవాలి బళ్లారిటౌన్: ప్రతినిత్యం వ్యాపార వ్యవహారాలు చేస్తున్న వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోవాలని జిల్లాధికారి ప్రశాంత్ మిశ్రా పేర్కొన్నారు. జిల్లా పాలన, జిల్లా పంచాయతీ, ఆహార పౌర సరఫరాల శాఖ, తూనికలు కొలతల, జిల్లా ఫోరం, న్యాయసేవా ప్రాధికారం ఆధ్వర్యంలో మంగళవారం నూతన జిల్లా పాలన భవనంలో ఏర్పాటు చేసిన ప్రపంచ వినియోగదారుల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నేడు ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నందున దానికి అనుగుణంగా ముందుకు సాగాల్సిన అనివార్యత ఏర్పడిందన్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్లలో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యమైనదీ, కానిదీ తెలుసుకోవాలన్నారు. వినియోగదారులు అమ్మకందారుల నుంచి మోసపోతే కన్జూమర్ ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. సివిల్ న్యాయమూర్తి రాజేష్ ఎస్ హొసమని మాట్లాడుతూ వినియోగదారులు కొనే ప్రతి వస్తువు పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఫోరం అధ్యక్షుడు తిప్పేస్వామి, లాయర్ ప్రకాష్, అంకాలయ్య, శశికళ, తూనికలు కొలతల ఈడీ అమృత, షకీన పాల్గొన్నారు. పశువుల కొట్టం దగ్ధం హుబ్లీ: పశువుల కొట్టానికి నిప్పంటుకుని రెండు ఎద్దులు, రెండు ఆవులు, రెండు దూడలతో పాటు భారీగా ధాన్యం కాలి బూడిదైన ఘటన జిల్లాలోని కలఘటిగి తాలూకా గలగిహులకొప్ప గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామ నివాసులైన శివప్ప, బసప్పలకు చెందిన కొట్టానికి అగ్నిప్రమాదం వాటిల్లింది. 10 క్వింటాళ్ల వడ్లు, 10 క్వింటాళ్ల సోయాబీన్, 5 క్వింటాళ్ల ఉలువలు, 20 పైపులతో పాటు వ్యవసాయ పరికరాలు కాలిపోయాయి. తోటలోని పొలంలో కొట్టం ఉండటం వల్ల అక్కడ పశువులను కట్టివేశారు. అర్ధరాత్రి వేళ ఎవరూ లేని సమయంలో ప్రమాదం జరగటంతో పశువులు మృత్యువాత పడ్డాయి. -
వేతన బకాయిల కోసం రాస్తారోకో
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ టాస్క్‌వర్క్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల బకాయి వేతనాలను చెల్లించాలంటూ మంగళవారం ఏడో మైలు వద్ద రాస్తారోకో చేపట్టారు. తుంగభద్ర ఎడమ కాలువ టాస్క్‌వర్క్ కార్మికుల సంఘం గౌరవాధ్యక్షుడు మానసయ్య ఆందోళనలో పాల్గొని మాట్లాడారు. కర్ణాటక నీటిపారుదల మండలి పరిధిలో సిరవార, సింధనూరు, యరమరస్ డివిజన్లో 748 మంది గ్యాంగ్మెన్లకు ఆరు నెలల నుంచి వేతనాలు చెల్లించకుండా ఇంజినీర్ విజయలక్ష్మి పాటిల్ కార్మికుల పట్ల అనుచితంగా ప్రవర్తించారని, ఆమైపె చర్యలు చేపట్టాలని ఒత్తిడి చేశారు. రోజు 8 గంటల పని వ్యవధి కన్నా మించి పని చేయించుకున్నారన్నారు. అనంతరం రాస్తారోకో చేస్తున్న ఘటనా స్థలానికి ఇంజినీర్లు, తహసీల్దార్ సురేష్ వర్మ చేరుకుని కార్మిక నేతలతో చర్చలు జరిపి 15 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. రెండు గంటల పాటు రహదారి దిగ్బంధనం కావడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆందోళనలో అడవిరావు, గంగాధర, అమరేష్, బసవరాజ్, రుక్కప్ప, ఆంజనేయ, రాధాకృష్ణ, ముదుకప్ప, హన్మంతప్ప, అమరేగౌడలున్నారు. -
క్షయ నివారణకు పెద్దలకు బీసీజీ టీకా
శివాజీనగర: కర్ణాటక రాష్ట్రాన్ని క్షయ రోగ విముక్తి రాష్ట్రంగా చేసేందుకు ఆరోగ్య శాఖ బీసీజీ టీకాల కార్యక్రమాన్ని ముమ్మరం చేయనుంది. నగరంలో మంగళవారం ఆరోగ్య మంత్రి దినేశ్ గుండురావు ప్రారంభించారు. రాష్ట్రంలో 16 జిల్లాల్లో బీసీజీ టీకాలను చేపట్టినట్లు, క్షయ రోగ రాకుండా అరికట్టడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుందన్నారు. 1060 గ్రామ పంచాయతీలు క్షయ నుంచి విముక్తి పొందాయన్నారు. క్షయ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో బీసీజీ టీకా ముఖ్యమైనదన్నారు. ప్రజలు ఈ టీకాను తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ డైరెక్టర్ త్రివేణితో పాటుగా కొందరు వైద్యులు అక్కడే బీసీజీ టీకా తీసుకున్నారు. ఎమ్మెల్యేలూ.. ఆస్తులు చెప్పాలి దొడ్డబళ్లాపురం: ఎమ్మెల్యేలు తమ, కుటుంబ సభ్యుల ఆస్తి వివరాలను జూన్ 30లోపు ఇవ్వాలని లోకాయుక్త గడువు విధించింది. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యేలకు లేఖలు పంపింది. ఎమెల్యేలు ప్రతి ఏడాది జూన్ 30 లోపు తాము, కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తుల వివరాలను లోకాయుక్తకు సమర్పించాలని పేర్కొన్నారు. భార్యకు నరకం.. ఎస్ఐపై కేసు యశవంతపుర: తన బదిలీ కోసం డబ్బులు కట్టాలి, ఇందుకు పుట్టింటి నుంచి మరింత కట్నం తేవాలని వేధిస్తున్న ఎస్ఐపై బెంగళూరు చంద్రాలేఔట్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. నిందితుడు కిశోర్ ధర్మస్థళలో ఎస్ఐ, అతడు భార్య వర్షపై కట్నం వేధింపులకు పాల్పడడంతో పాటు మాట వినలేదని కొట్టేవాడు. వర్ష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2024లో మూడిగెరె ఎస్ఐగా పని చేస్తున్న సమయంలో కిశోర్‌తో వర్షకు పెళ్లయింది. కట్నం కింద రు.10 లక్షలు డబ్బులు, రూ.22 లక్షలు విలువగల కారు, 135 గ్రాముల బంగారం ఇచ్చి, లక్షల ఖర్చు చేసి వైభవంగా వివాహం చేశారు. కోరుకున్న చోటుకు బదిలీ కావాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని, ఈ డబ్బును తెచ్చివ్వాలని భార్యను పీడించసాగాడు. అత్తమామ, మరదలు కూడా వర్షపై దాడి చేశారు. వర్ష గాయాలతో ధర్మస్థళ ఆస్పత్రిలో చేరింది. మెరుగైన చికిత్స కోసం ఆమె తల్లిదండ్రులు బెంగళూరు ఆస్పత్రిలో చేర్పించారు. ఎస్ఐ మీద చంద్రాలేఔట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. లంచగొండి డీఎస్పీ ఆటకట్టు శివమొగ్గ: పోలీసు సిబ్బంది నుంచే లంచం తీసుకుంటూ రిజర్వ్ బలగాల డీఎఆర్ విభాగం డీఎస్పీ లోకాయుక్తకు పట్టుబడ్డారు. శివమొగ్గ నగరంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. సిబ్బంది ఏదో పని మీద డీఎస్పీ క్రిష్ణమూర్తిని కలిశారు. డబ్బులిస్తే పనవుతుందని ఆయన సూచించారు. దీంతో నివాసంలో ఆయనకు రూ. 5 వేలు ఇస్తుండగా, లోకాయుక్త అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అరెస్టు చేసి విచారణ చేపట్టారు. లోకాయుక్త ఎస్పీ మంజునాథ్ చౌదరితో పాటు సిబ్బంది దాడిలో పాల్గొన్నారు. బెంగళూరు టు కలబుర్గి ప్రత్యేక రైళ్లు గుంతకల్లు: ఉగాది పండుగ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 28, 29వ తేదీల్లో బెంగళూరు– కలబురిగి నగరాల మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 28న బెంగళూరు జంక్షన్ నుంచి రాత్రి 9.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.40 గంటలకు కలబురిగి జంక్షన్‌కు చేరుతుందన్నారు. తిరిగి ఈ రైలు 29వ తేదీ ఉదయం 9.35 గంటలకు కలబురిగి జంక్షన్ నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 8.00 గంటలకు బెంగళూరు జంక్షన్‌కు చేరుతుందన్నారు. యలహంక, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, కృష్ణ, యాదగిరి, షాహాబాద్ రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. -
దొంగల ముఠా పట్టివేత
దొడ్డబళ్లాపురం: దొంగలు, దొంగ సొత్తును కొంటున్న నలుగురిని అరెస్టు చేసిన బెంగళూరు తలఘట్టపుర పోలీసులు వారి నుంచి మొత్తం రూ.50 లక్షల విలువ చేసే వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. బాలాజీ లేఔట్లో ఒక ఇంట్లో 700 గ్రాముల బంగారు వజ్రాభరణాలు, వెండి వస్తువులు అపహరించారు. పోలీసులు సుబ్రమణ్యపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని హనుమగిరికొండ వద్ద దొంగను ఆభరణాలతోపాటు పట్టుకున్నారు. మరొకరితో కలిసి చోరీలు చేసినట్టు ఒప్పుకున్నాడు. గిరినగర పీఎస్ పరిధిలో ఒక బైక్‌ను ఎత్తుకెళ్లినట్లు చెప్పాడు. వీరు కొట్టుకొచ్చిన నగలను కొనే వ్యాపారిని, మధ్య దళారీని కూడా గాలించి పట్టుకున్నారు. వారి నుంచి కొంత మొత్తంలో బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. మరో కేసులో ఓ దొంగ.. తాళం వేసిన ఇళ్లను పగలు గుర్తించి రాత్రి వేళ చొరబడి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, కేజీ వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రూ.50 లక్షల సొత్తు సీజ్ -
కేజీ బంగారు నాణేలు రూ.7 లక్షలు
శివమొగ్గ: కేజీ బరువైన నకిలీ బంగారు నాణాలిచ్చి హాసన్‌లోని అమూల్ డైరీలో పని చేస్తున్న వ్యక్తికి రూ.7 లక్షల మేర టోకరా వేశారు. వివరాలు.. బాధితుడు గిరిగౌడ. సురేష్ అనే వ్యక్తి ఫోన్ చేసి తనది మలెమాదేశ్వర బెట్ట అని పరిచయం చేసుకున్నాడు. తమ ఊరిలో ఓ పేద వ్యక్తి పొలంలో పని చేస్తుండగా బంగారు నాణేల నిధి దొరికిందని, వారి కూతురి పెళ్లికి డబ్బు కావాలని, తక్కువ ధరకు అమ్ముతారు, కొనుక్కోండి అని కోరాడు. దీంతో గిరిగౌడలో ఆశ పుట్టింది. నాణేల పరిశీలనకు అంగీకరించాడు. హొళెహొన్నూరు పోలీసు స్టేషన్ పరిధిలోని మంగోటె గ్రామ వంతెన వద్దకు పిలిపించి ఒక అసలు బంగారు నాణెం ఇచ్చి పరీక్షించుకోమని చెప్పాడు. ఊరికి వచ్చిన గిరిగౌడ ఆ నాణేనికి పరిశీలించి, అసలైనదని సంతోషించాడు. కేజీ నాణేలను కొంటాననడంతో రూ.7 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. మళ్లీ మంగోటె వంతెన వద్దకు వెళ్లి డబ్బు ఇచ్చి నాణేలను తెచ్చుకున్నాడు. ఇంటికి తీసుకువచ్చి చూడగా నకిలీవని తేలడంతో లబోదిబోమంటూ హొళెహొన్నూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
ఉగాది ప్రయాణం.. ఎంతో ప్రియం
బనశంకరి: తెలుగు, కన్నడిగులకు నూతన సంవత్సరాది అయిన ఉగాది పర్వదినం త్వరలో రాబోతోంది. ప్రజలు సొంతూళ్లకు వెళ్లే పనిలో ఉన్నారు. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు గిరాకీ పెరిగింది, ఇదే అదనుగా బస్సుల యజమానులు నిలువు దోపిడీకి దిగారు. టికెట్ రేట్లను పెంచి దోచేస్తున్నారు. 29 నుంచి ఉగాది, రంజాన్ వరుస సెలవులు వస్తున్నాయి. 28వ తేదీ శుక్రవారం నుంచి రద్దీ ఆకాశాన్నంటుతోంది. రైళ్లు, ఆర్టీసీ బస్సులు దొరకనివారు ప్రైవేటు బస్సు టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల ప్రైవేటు బస్సులు సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు 30 నుంచి 50 శాతం చార్జీలను పెంచేశాయి. అంత చెల్లిస్తేనే టికెట్ దొరుకుతుంది. పిల్లాపాపలతో ఊరికివెళ్లేవారికి ఇది చాలా భారమైనా గత్యంతరం లేదని వాపోయారు. ఎక్కువ పెంచలేదు ఉగాది రద్దీ దృష్ట్యా ఈనెల 20 నుంచి 26 తేదీ వరకు బెంగళూరు నుంచి వివిధ ప్రాంతాలకు 2 వేల అదనపు బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రైవేటు బస్సులు యజమానుల సంఘం అధ్యక్షుడు నటరాజ్‌శర్మ మాట్లాడుతూ టికెట్ రేట్లను ఎక్కువగా పెంచలేదని చెప్పారు. భారీగా చార్జీలను పెంచిన ప్రైవేటు ట్రావెల్స్ ప్రైవేటు ట్రావెల్స్‌లో కొన్ని ప్రాంతాలకు చార్జీలు ఇలా ఉన్నాయిబెంగళూరు టు ధారవాడ మామూలు రూ.600–1100 పండుగ రూ.1069–5500 బెంగళూరు టు మంగళూరు మామూలు రూ.650–1300 పండుగ రూ.1200–4500 -
హావనూరు సేవలు మరువలేనివి
సాక్షి,బళ్లారి: సమాజాభివృద్ధికి, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ఎల్.జీ.హావనూరు చేసిన కృషి ఎన్నటికీ మరవలేనిదని అఖండ కర్ణాటక వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జోళదరాశి తిమ్మప్ప పేర్కొన్నారు. ఆయన మంగళవారం నగరంలోని గాంధీనగర్‌లోని అఖండ కర్ణాటక వాల్మీకి నాయకుల ఐక్యత కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి, సమాజసేవకుడు ఎల్.జీ.హావనూరు 98వ జయంత్యుత్సవంలో పాల్గొని మాట్లాడారు. కుల, మతాలకు అతీతంగా పేదల సంక్షేమం కోసం పాటుపడిన మహానుభావుడని కొనియాడారు. హావనూరు అడుగుజాడల్లో మనందరం నడవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన పోరాట యోధుడని, పేదలను ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో వాల్మీకి సంఘం ప్రముఖులు వై.రాజా(కేఎస్ఆర్టీసీ), ముదిమల్లప్ప, వీరాపుర -
ప్రతి ఒక్కరితో సఖ్యతగా మెలగాలి
రాయచూరు రూరల్: నగరంలో ఖురాన్ పఠనం అభియాన్‌కు మాజీ శాసన సభ్యుడు సయ్యద్ యాసిన్ శ్రీకారం చుట్టారు. సోమవారం రాత్రి మహిళా సమాజ్ ఆవరణలో 13వ ఏడాది ఖురాన్ పఠనం అభియాన్ ద్వారా ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరితో సఖ్యతతో మెలగాలని సూచించారు. రాయచూరులో హిందూ, ముస్లిం అనే భేదభావాలను మరిచి సోదరులుగా ఉంటున్న విషయాన్ని ప్రస్తావించారు. రంజాన్ మాసం సందర్భంగా నగరంలో ఇఫ్తార్ కూటమిని ఏర్పాటు చేశారు. ఏడు గంటలకు కాంట్రాక్టర్ సత్యనారాయణ ఏక్ మినార్ మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ను అందించారు. ఈ సందర్భంగా మసీదు నిర్వాహకులు లతీఫ్, రజాక్, రవి, మున్నా, రసూల్, ఫారూక్, సోహైల్, సలీంలున్నారు. ఖురాన్ పఠనం అభియాన్‌కు శ్రీకారం మసీదులో ముస్లింలకు ఇఫ్తార్ విందు -
టాటా ఏస్, బస్సు ఢీ, ఇద్దరి మృతి
మైసూరు: టాటా ఏస్, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, 13 మంది గాయపడిన ఘటన చామరాజనగర జిల్లా కొళ్లెగాల తాలూకా సిద్దయ్యనపుర గ్రామంలో జరిగింది. బాణూరు గ్రామ నివాసులు రాజమ్మ (53), శృతి (30) మృతులు. బైక్ చోదకుడు ప్రకాష్, బస్సు డ్రైవర్ రాజశేఖర్, టాటా ఏస్‌లో ఉన్న బాణూరు గ్రామానికి చెందిన వారితో కలిపి 13 మంది గాయపడ్డారు. వారికి కొళ్లెగాల ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం సిమ్స్, మైసూరు ఆస్పత్రులకు తరలించారు. కొళ్లెగాలలో తిథి కార్యాన్ని ముగించుకుని బాణూరుకు టాటా ఏస్ వాహనంలో కొందరు తిరిగి వెళుతుండగా ఓవర్ టేక్ చేసే సమయంలో టాటా ఏస్‌ను ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో స్థలంలోనే ఇద్దరు మరణించారు. టాటా ఏస్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఓ బైకిస్టు కూడా గాయపడ్డాడు. -
రూ.10 వేలకు నకిలీ మార్కుల జాబితా
బనశంకరి: క్లాసులకు వెళ్లాల్సిన పని లేదు. చదువుకోవడం, పరీక్షాలు రాయడం అవసరమే లేదు. కొంచెం డబ్బు ఇస్తే చాలు సర్టిఫికెట్ లభిస్తుంది. నకిలీ ఎస్ఎస్ఎల్సీ, పీయూసీ మార్కుల జాబితాలను అమ్ముతున్న ముఠాను సీసీబీ పోలీసులు పట్టుకున్నారు. ధారవాడవాసి ప్రశాంత్, బనశంకరివాసి మోనీశ్, గదగవాసి రాజశేఖర బళ్లారి అనే ముగ్గురు పట్టుబడ్డారని బెంగళూరు పోలీస్‌కమిషనర్ బీ దయానంద్ తెలిపారు. మంగళవారం వివరాలను వెల్లడించారు. నిందితులు కర్ణాటక రాష్ట్ర మాధ్యమిక, ఉన్నత విద్యా మండలి అనే పేరుతో మార్కుల జాబితాలను తయారు చేసేవారు. రూ.5 వేల నుంచి రూ.10 వేలు డబ్బు తీసుకుని టెన్త్, పీయూసీ సర్టిఫికెట్లను అమ్మేసేవారు. 350 మందికి పైగా నకిలీ మార్కుల జాబితాలను విక్రయించారు. విచారణలో గుట్టురట్టు వాటిని కొన్నవారు పలు ఉద్యోగాలు, సేవల కోసం ప్రభుత్వ శాఖలకు దరఖాస్తులు చేశారు. ఈ సర్టిఫికెట్లు అసలైనవా, కాదా అనేది పరిశీలించాలని రవాణాశాఖ, పాస్పోర్టుశాఖ, శిశుసంక్షేమ శాఖల నుంచి విజ్ఞప్తులు రావడంతో విచారణ చేపట్టామని చెప్పారు. పలువురు నకిలీ సర్టిఫికెట్లు అని గుర్తించి పోలీసులకు కూడా ఫిర్యాదులు చేశారు. దీంతో లోతుగా దర్యాప్తు చేపట్టగా ఈ నెట్వర్క్ బయటపడిందని తెలిపారు. బెళగావికి చెందిన మరో నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. 350 మందికి పైగా విక్రయం నగరంలో ముఠా అరెస్టు -
పుట్టగానే పసిగుడ్డు ఊపిరి తీశారు
● ప్రేమజంట దాష్టీకం యశవంతపుర: ప్రేమజంట ఎవరూ ఊహించని కిరాతకానికి పాల్పడింది. అప్పుడే పుట్టిన శిశువును హత్య చేసి వదిలించుకున్నారు. బెళగావి జిల్లా కిత్తూరు అంబడగట్టి గ్రామంలో ఈ ఘోరం జరిగింది. గ్రామానికి చెందిన మహబలేశ్ కామోజీ (31), సిమ్రాన్ మాణికాబాయ్ (22)లు ప్రేమించుకుని అప్పుడప్పుడు కలిసేవారు. యువతి గర్భం ధరించింది. మూడురోజుల కిందట నెలలు నిండి కాన్పయింది. సిమ్రాన్ యూట్యూబ్‌లో చూసి తన ప్రసవాన్ని తనే చేసుకుంది. శిశువును తీసుకుని ప్రియునికి ఇచ్చింది. ఇద్దరు కలిసి పసిగుడ్డును ప్లాస్టిక్ పేపర్లో చుట్టి చూపిరాడకుండా చంపేశారు. శిశువును నిర్మానుష్య ప్రదేశంలో పారవేశారు. శిశువు మృతదేహం కనిపించడంతో గ్రామంలో అలజడి రేగింది. పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో శిశువు తమదేనాని ప్రేమ జంట ఒప్పుకొంది. అరెస్ట్ చేసిన పోలీసులు ఇద్దరిని జైలుకు పంపారు. ప్రేమ పేరుతో ఇంత అఘాయిత్యానికి పాల్పడతారా? అని ప్రజలు కలవరానికి గురయ్యారు. -
డిప్యూటీ సీఎం.. క్షమాపణ చెప్పు బీజేపీ ధర్నా
మండ్య: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు వ్యతిరేకంగా మంగళవారం పలు కారణాలతో, పలు జిల్లాలలో నిరసనలు జరిగాయి. మండ్య ప్రజలు చత్రిగలు అని వర్ణించడం శివకుమార్‌కు తగదని, ఆయన మండ్యకు వచ్చి ప్రజల ముందు క్షమాపణలు అడగాలని రైతు సంఘం నేతలు, కార్యకర్తలు మండ్య నగరంలో గొడుగులు పట్టి నిరసన తెలిపారు. సర్ ఎం విశ్వేశ్వరయ్య విగ్రహం వద్ద నుంచి ర్యాలీ జరిపారు. రైతు నేతలు పచ్చె నంజుండస్వామి, ఇండువాళ చంద్రశేఖర్, కార్యకర్తలు శివకుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన దురహంకారంగా మాట్లాడారని, జిల్లాకు వచ్చి క్షమాపణలు కోరాలని అన్నారు. మరోవైపు డీకే రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడారని బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. కలబుర్గిలో కూడళ్లలో టైర్లు కాల్చి ధర్నా చేశారు.కాంగ్రెస్ నిరసనబనశంకరి: డిప్యూటీ సీఎం శివకుమార్‌పై కేంద్రమంత్రి జేపీ.నడ్డా, కిరణ్‌రిజిజు పార్లమెంటులో తప్పుడు ఆరోపణలు చేశారని కాంగ్రెస్నాయకులు మంగళవారం బెంగళూరులో ధర్నా చేశారు. రాజ్యాంగ రక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. కానీ బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని డీకే. శివకుమార్ మార్చాలన్నారని అబద్దపు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. -
ఎయిమ్స్ ఏర్పాటుకు ఒత్తిడి తెండి
రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటు విషయంలో రాజకీయాలు చేయకుండా ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎయిమ్స్ పోరాట సమితి ప్రధాన సంచాలకుడు బసవరాజ్ కళస డిమాండ్ చేశారు. సోమవారం న్యూఢిల్లీలో రైల్వే శాఖ సహాయ శాఖ మంత్రి సోమన్న, వ్యవసాయ శాఖ మంత్రి శోభా కరంద్లాజెలకు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాయచూరుకు మొండి చెయ్యి చూపారన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ హయాంలో రాయచూరులో ఆందోళన చేపట్టామని గుర్తు చేశారు. -
పరీక్షలకు అభ్యంతరంపై ధర్నా
రాయచూరు రూరల్: రాయచూరు విశ్వవిద్యాలయంలో విద్యార్థులను పరీక్షలకు అనుమతించకుండా అధ్యాపకులు అభ్యంతరం వ్యక్తం చేయడంపై విద్యార్థులు ధర్నాకు దిగారు. సోమవారం వర్సిటీలో జరుగుతున్న ఎంఏ సోషియాలజీ పరీక్ష రాయడానికి హాల్ టికెట్లను ఇవ్వకుండా వేధిస్తుండడంతో విద్యార్థులు పైఅంతస్తులోకి వెళ్లి ఆత్మహతాయత్నం చేస్తుండగా యరగేర పోలీసులు అడ్డుకున్నారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులను అధ్యాపకులు రాధ, శకుంతల తదితరులు అడ్డుకొని పరీక్షలు రాయడానికి అవకాశం కల్పించకుండా హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధించడం, గైర్హాజరైన విద్యార్థులను పిలిచి అపాలజీ లేఖ రాయించుకున్నారన్నారు. అధ్యాపకులు తమపై ద్వేషం పెంచుకున్నారని ఆరుగురు విద్యార్థులు ఆరోపించారు. -
ఎయిమ్స్ ఏర్పాటుకు ఒత్తిడి తెండి
రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటు విషయంలో రాజకీయాలు చేయకుండా ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎయిమ్స్ పోరాట సమితి ప్రధాన సంచాలకుడు బసవరాజ్ కళస డిమాండ్ చేశారు. సోమవారం న్యూఢిల్లీలో రైల్వే శాఖ సహాయ శాఖ మంత్రి సోమన్న, వ్యవసాయ శాఖ మంత్రి శోభా కరంద్లాజెలకు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాయచూరుకు మొండి చెయ్యి చూపారన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ హయాంలో రాయచూరులో ఆందోళన చేపట్టామని గుర్తు చేశారు. -
సర్కారు తీరుపై బీజేపీ శ్రేణుల కన్నెర్ర
సాక్షి, బళ్లారి: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్కారు తీరుపై, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీజేపీ నాయకులు ఆందోళన, ర్యాలీలు, సీఎం దిష్టిబొమ్మ దహనాలతో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ నేతృత్వంలో రాయల్ సర్కిల్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు మానవహారం నిర్మించారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా పోలీసులు, నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తున్నామన్నారు. మైనార్టీలకు సర్కారు 4 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం హేయమైన చర్య అన్నారు. ఎస్సీ నిధులను దుర్వినియోగం చేసి పక్కదారి పట్టించి గ్యారెంటీలకు మళ్లించి పేదల సంక్షేమాన్ని కాలరాస్తున్నారన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ అభివృద్ధి పనులను పక్కనపెట్టిన సర్కారుకు ప్రజలే బుద్ధిచెప్పే రోజులు త్వరలో వస్తాయన్నారు. అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి వినతిపత్రాన్ని సమర్పించారు. నాయకులు కేఎస్.దివాకర్, గురులింగనగౌడ, హనుమంతప్ప, శ్రీధరగడ్డ బసవలింగనగౌడ పాల్గొన్నారు, మైనార్టీలకు కాంట్రాక్ట్‌ల్లో రిజర్వేషన్ తగదు రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మైనార్టీలకు ప్రభుత్వ కాంట్రాక్ట్ పనుల్లో 4 శాతం రిజర్వేషన్ ప్రకటించడం తగదని బీజేపీ ఆరోపించింది. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టిన మాజీ జిల్లాధ్యక్షుడు, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ మాట్లాడారు. రాజ్యాంగంలో అంబేడ్కర్ ఎక్కడా కుల ప్రాతిపదికన పనుల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని పేర్కొనలేదన్నారు. సర్కార్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నారు. అసెంబ్లీలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రూ.39 వేల కోట్లను పంచ గ్యారెంటీలకు మళ్లించడం సరికాదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, ఇతరత్ర అంశాలపై పునః పరిశీలించాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానందకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో మాజీ శాసన సభ్యులు గంగాధర నాయక్, శంకరప్ప, మాజీ ఎంపీ బి.వి.నాయక్, నేతలు వీరనగౌడ, రాఘవేంద్ర, శంకర్‌రెడ్డి, శివ, లలిత, వీరయ్య, నాగరాజ్, నరసింహులు, యల్లప్ప, కరుణాకర్రెడ్డిలున్నారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై నిరసనహొసపేటె: 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ కార్యకలాపాల నుంచి ఆరు నెలల పాటు సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ విజయనగర జిల్లా బీజేపీ శాఖ స్పీకర్ ఆదేశాలకు వ్యతిరేకంగా సోమవారం నిరసన చేపట్టింది. పటేల్ నగర్‌లోని పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేసి స్పీకర్ ఆదేశంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్పీకర్ ఆదేశం ఎమ్మెల్యేల హక్కులను హరించేలా ఉందన్నారు. కనుక స్పీకర్ వెంటనే తన ఉత్తర్వును ఉపసంహరించుకోవాలన్నారు. ప్రభుత్వం తప్పులను బీజేపీ ఎమ్మెల్యేలు ఎత్తి చూపారన్నారు. అనంతరం తహసీల్దార్ శృతికి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం -
మహిళా సాధకులకు ఘన సన్మానం
హుబ్లీ: ఎప్పటికీ మరణం లేని కళలు, సాహిత్యం, సంగీతం, నృత్య కళలు మాత్రమే మనిషి మనస్సును వికసింపజేస్తాయని, ఈక్రమంలో ఫ్రెండ్స్ సోషల్ క్లబ్ సేవలు ప్రశంసనీయమని కర్ణాటక బాల వికాస అకాడమి అధ్యక్షులు సంగమేశ బబలేశ్వర అన్నారు. ఆలూరు వెంకటరావ్ భవన్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళా ప్రతిభోత్సవం, సాధకులకు సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. భారతీయ మాతృమూర్తి తన మొత్తం జీవితాన్ని పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువుల కోసం అంకితం చేసే త్యాగం ప్రపంచంలోని నోబుల్ బహుమతి కన్నా పెద్దదన్నారు. అలాంటి తల్లి స్వరూపమైన మహిళలను మనం విశ్వమహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించడం భారతీయ తల్లులకు ఇచ్చే గౌరవం అన్నారు. బీఆర్టీఎస్ ఎండీ సావిత్రి మాట్లాడుతూ భారత రాజ్యాంగం మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించిందన్నారు. మనం నేడు పిల్లలను పోషించడంలో సమాజం తీరు మారాలన్నారు. అనంతరం మహిళా సాధకులను ఘనంగా సన్మానించారు. సీనియర్ నటుడు, డైరెక్టర్ శశిధర్ నరేంద్ర, సవితా అమరశెట్టి, ప్రకాష్ బాళెకాయి, వినోద్ కుసుగల్, డాక్టర్ పూర్ణిమా ముక్కుంది తదితరులు పాల్గొన్నారు. ఘనంగా జగద్గురు చంద్రశేఖర జయంతి హుబ్లీ: నాగశెట్టికొప్పలోని శ్రీశాండిల్య ఆశ్రమంలో సద్గురు చంద్రశేఖర స్వామి 90వ జయంతి ఉత్సవాలు, బగళాంబ మహిళా మండలి 20వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇంచల సాధు సంస్థాన మఠం జగద్గురు డాక్టర్ శివానంద భారతీ సాన్నిధ్యం వహించారు. సవదత్తి తాలూకా హళకట్టి శివానంద మఠం నిజగుణ స్వామి మాట్లాడుతూ అనుపమాచల భక్తి భావన శంభులింగ అనే విషయంపై ప్రవచనం చేశారు. జగాపుర కమ్మలవ్వ హళేమని చంద్రశేఖర్ స్వామి మూర్తికి తులాభారం నెరవేర్చారు. బెనకట్టి మల్లమాంబ భజన మండలి బృందం భజన గీతాలు ఆలపించారు. నాగశెట్టి కొప్ప, బెంగేరి, గోపనకొప్ప తదితర గ్రామస్తులు, ప్రముఖులు పాల్గొన్నారు. 31న చదరంగం పోటీలు హుబ్లీ: విద్యానగర్ రోటరీ భవన్లో ఈ నెల 31న ఉదయం 9.30 గంటలకు జద్గురు స్మార్ట్ అండ్ మ్యూజిక్ అకాడమి, రోటరీ క్లబ్ హుబ్లీ నార్త్ సహకారంతో 17 ఏళ్ల లోపు వయస్సుగల పిల్లలకు చెస్ పోటీలు ఏర్పాటు చేశారు. పోటీలను రామకృష్ణ వివేకానంద ఆశ్రమం తేజసానంద స్వామీజీ ప్రారంభించనున్నారు. పోటీల విజేతలకు నగదు బహుమతులు, ఆకర్షక ట్రోఫిలు, మెడల్స్ ఇవ్వనున్నారు. సంస్థ అధ్యక్షురాలు అర్చన నాయక్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగేష్ రిత్తి తదితరులు పాల్గొననున్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 28 లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, 8431737265 నెంబర్లో సంప్రదించాలని నిర్వాహకులు ఓ ప్రకటనలో కోరారు. పెంచిన వేతనాలు చెల్లించాలిరాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు పెంచిన వేతనాలను త్వరగా చెల్లించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు ఈరమ్మ మాట్లాడారు. బెంగళూరు ఫ్రీడం పార్కులో గత జనవరి 7 నుంచి నిరవధిక దర్నాకు పూనుకోవడంతో ప్రభుత్వం స్పందించి ఆశా కార్యకర్తలకు రూ.10 వేల గౌరవ వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు. పెంచిన గౌరవ వేతనాలను ఏప్రిల్ 1 నుంచి అందించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. క్షయపై జాగృతి జాతాకు శ్రీకారంరాయచూరు రూరల్ : సభ్య సమాజంలో క్షయ వ్యాధిగ్రస్తులను ప్రజలు దూరంగా ఉంచుతారని, క్షయ నిర్మూలనకు చర్యలు చేపట్టాలని జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్రబాబు సూచించారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద జాతాకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. 2035 నాటికి దేశంలో క్షయ వ్యాధి పూర్తి నియంత్రణలోకి తేవాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నెరవేర్చాలన్నారు. ప్రపంచంలో ప్రతి మూడు నిమిషాలకు ఒక్కరూ క్షయ వ్యాధి నుంచి మరణిస్తున్నారన్నారు. వ్యాధి సోకిన మరుక్షణమే ఆరు నెలల పాటు చికిత్స పొందాలన్నారు. జాతాథాలో వైద్యాధికారులు గణేష్, షాకీర్, నందిత, ఉద్యోగులు పాలాక్షి, సంధ్య, లక్ష్మి, సరోజ తదితరులున్నారు. సజావుగా గణితం పరీక్షలు కోలారు: జిల్లాలో 65 పరీక్ష కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన గణితం పరీక్షకు 355 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 17,219 మంది విద్యార్థులకు గాను 16,864 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలు ఎలాంటి గందరగోళం లేకుండా నిర్వహించినట్లు డీఈఓ కృష్ణమూర్తి తెలిపారు. నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఈఓతో పాటు సీఈఓ ప్రవీణ్ బాగేవాడి తదితర అధికారులు తనిఖీ చేశారు. పరీక్షలను సక్రమంగా నిర్వహిస్తుండడంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. -
నేతల చిత్తశుద్ధి లోపం.. అభివృద్ధి శూన్యం
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధుల చిత్తశుద్ధి కొరతతో కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో అభివృద్ధి శూన్యమైందని హైదరాబాద్ కర్ణాటక పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజాక్ ఉస్తాద్ విచారం వ్యక్తం చేశారు. సోమవారం తారానాథ్ విద్యా సంస్థ ఆధ్వర్యంలో సోమ సుభద్రమ్మ రామనగౌడ మహిళా కళాశాలలో ఎల్‌వీడీ కళాశాల పాత విద్యార్థులతో ప్రాంతీయ అసమానతలు– సమస్యలు –సవాళ్లు అనే అంశంపై ఉపన్యసించి మాట్లాడారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతం గత 77 ఏళ్ల నుంచి అభివృద్ధికి నోచుకోలేక పోయిందన్నారు. విద్య, ఆరోగ్యం, మౌలిక సౌకర్యాలు, సార్వజనిక సేవలు, మానవ అభివృద్ధి గణాంకాలతో పోల్చితే ఇక్కడి ప్రజలు ఎన్నుకునే ప్రతినిధులు సమస్యలను వదిలి స్వార్థం వైపు ముందడుగు వేస్తున్నారన్నారు. డాక్టర్ వైజనాథ్ పాటిల్ ఆధ్వర్యంలో ఆర్టికల్–371(జె) 20 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో అమలైందన్నారు. నంజుండప్ప నివేదిక ప్రకారం 114 తాలూకాల్లో 29 తాలూకాలు వెనుకబడినట్లు నివేదిక ఇచ్చినా ఫలితం శూన్యమన్నారు. చెన్నమల్లికార్జున, ప్రిన్సిపాల్ సంజయ్ పవార్, త్రివేణి, ఆంజనేయ, ఓబులేష్లున్నారు. -
స్వాతంత్య్ర యోధులు ఆదర్శప్రాయులు
హొసపేటె: స్వాతంత్య్ర పోరాటంలో గొప్ప విప్లవకారులు, వీర అమరవీరులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఏఐడీఎస్ఓ కార్యకదర్శి పంపాపతి తెలిపారు. ఆదివారం భగత్‌సింగ్, సుఖ్‌దేవ్ నగరలో ఏఐడీఎస్ఓ, ఏఐడీవైఓ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా క్రీడామైదానం, బీసీఎం హాస్టళ్లలో ఏర్పాటు చేసిన భగత్‌సింగ్ దినోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. బ్రిటిష్ వారి అణిచివేతకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రం కోసం రాజీ పడకుండా పోరాడి నవ్వుతూ ఉరి కంబాన్ని ఎక్కిన గొప్ప విప్లవకారుడు భగత్‌సింగ్ అని తెలిపారు. ప్రజలకు స్వేచ్ఛను తెచ్చే విప్లవ సందేశాన్ని విద్యార్థులు, యువత దేశంలోని ప్రతి మూలకు తీసుకెళ్లాలని, దానిని కోట్లాది మంది పీడిత ప్రజలకు తెలియజేయాలన్నారు. పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాద దోపిడీని అంతం చేయడానికి సోషలిస్ట్ విప్లంవం అనివార్యమన్నారు. భగత్‌సింగ్ తన ప్రాణాలను అర్పించి 94 ఏళ్లు గడిచాయి. ఆయన సోషలిస్ట్ భారతదేశం కల ఇంకా నెరవేరలేదు. ప్రతి రోజూ, మన దేశంలో 7,000 మందికి పైగా పిల్లలు ఆకలితో చనిపోతున్నారన్నారు. విద్య, ఆరోగ్యం వ్యాపారమయం అయ్యాయన్నారు. నిరుద్యోగుల భారీ సైన్యం సృష్టి అవుతోందన్నారు. ప్రతి రోజూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి ఐదు నిమిషాలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతోంది. ఒక వైపు ఒక్క పూట భోజనానికి కూడా నోచుకోలేని పేదలున్నారు. మరో వైపు కొంత మంది పెట్టుబడిదారులు మొత్తం దేశంలోని 70 శాతం ఆస్తిని కలిగి ఉన్నారన్నారు. ఇంత తీవ్రమైన ఆర్థిక అసమానత ఉంది. ఈ సమస్యలన్నింటిని తొలగించడానికి, భగత్‌సింగ్ కలలు కన్న సోషలిస్ట్ భారతదేశ నిర్మాణానికి విద్యార్థులు, యువత ముందుకు వచ్చి భగత్‌సింగ్ కన్న కలను నిజం చేయాలన్నారు. సంఘం కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
సాంస్కృతిక కార్యక్రమాలతో కళల రక్షణ
హొసపేటె: భాష, సంస్కృతి, కళల రక్షణకు సమాజంలో నిరంతరంగా సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు ఎంతో అవసరమని ఎంపీ ఈ.తుకారాం తెలిపారు. ఆదివారం గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్లో గానగంగా కళాప్రతిష్టాన, కన్నడ, సంస్కృతి శాఖ బెంగళూరు సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీత, నృత్య కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కుల సంస్కృతి సాంస్కృతిక కార్యకలాపాల ద్వారా మనుగడ సాగిస్తూ పెరుగుతుందన్నారు. అయితే, నేటి యువతరం సాంస్కృతిక కార్యకలాపాలకు దూరం కావడం విచారకరమన్నారు. కర్ణాటక విద్యావర్థక సంఘానికి చెందిన డాక్టర్ పాటిల్ పుట్టప్ప సభా భవన్లో సమాన కళా అకాడమి, కన్నడ, సంస్కృతి శాఖ సహకారంతో నిర్వహించిన దసరా పండుగ వేడుకల్లో భాగంగా మహిళా సాంస్కృతిక ఉత్సవా ప్రారంభించి ఆయన మాట్లాడారు. నేటి కాలంలో విద్యార్థులు పాశ్చాత్య సంస్కృతికి బానిసలై స్వదేశీ సంస్కృతిని మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రతి పాఠశాలలో సాంస్కృతిక తరగతులు ప్రారంభించడం ఎంతో అవసరమన్నారు. వేదికపై ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకొన్నాయి. హుడా అధ్యక్షులు హెచ్ ఎన్ఎఫ్ ఇమామ్ నియాజీ, గానగంగా కళా ప్రతిష్టాన అధ్యక్షులు యల్లప్ప బండార్, సంగీత కళాకారుడు పండిట్ సదాశివ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
తొట్టెలతో పక్షుల దాహార్తికి చెక్
రాయచూరు రూరల్: నగరాల్లో ప్రాణులకు, పక్షులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని పచ్చని చెట్ల బళగ సంచాలకుడు కృష్ణమూర్తి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కృష్ణగిరి హిల్స్ చుట్టు పక్కల పరిసర ప్రాంతాల్లోని చెట్లు, కొండలు, గుట్టల్లో వేసవిలో దాహార్తి తీర్చడానికి నీటి తొట్టెలు ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్‌లో ఎండల వారి నుంచి రక్షణకు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు చెట్లు పెంచి పరిసరాలను సంరక్షించాలన్నారు. సమితి నేతలు నూతన్ రాజ్, రామమూర్తిలున్నారు. ట్రక్ టర్మినల్ పనుల పూర్తికి సూచనరాయచూరు రూరల్: నగరంలో ట్రక్ టర్మినల్ పనులు త్వరితిగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు సూచించారు. సోమవారం యరమరస్ వద్ద 25 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న దేవరాజ అరసు ట్రక్ టర్మినల్ పనులను పరిశీలించి ఉన్నతాధికారులను ఫోన్లో సంప్రదించి మాట్లాడారు. రాయచూరు జిల్లాలో పత్తి, మిరప, వరి తదితర వాణిజ్య పంటలు అధికంగా పండించే రైతుల సరుకులను రవాణా చేసే లారీల నిలుపుదలకు దేవరాజ అరసు ట్రక్ టర్మినల్‌ను పూర్తి చేయాలని ఒత్తిడి చేశారు. మంత్రి వెంట రుద్రప్ప, శాంతప్ప, శివమూర్తి, జయన్న, లక్ష్మిరెడ్డి, బసవరాజ్, నరసింహులున్నారు. కాగెకెరె వాసులకు ఇళ్ల పట్టాలివ్వరూ రాయచూరు రూరల్: నగరంలోని కాగెకెరె చెరువు ప్రాంతంలో నివాసముంటున్న వారికి ఇళ్ల పట్టాలివ్వాలని నగర బీజేపీ సంచాలకులు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. సిటీ కార్పొరేషన్లో 23వ వార్డు మడ్డిపేట కాగెకెరె చెరువు వద్ద 50 ఏళ్లుగా పేద కూలి కార్మికులు అధికంగా నివసిస్తున్నారన్నారు. అలాంటి 200 కుటుంబాలకు పట్టాలు ఇవ్వాలని, కర్ణాటక మురికి వాడల మండలి నుంచి వంద ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. రైల్వే డిమాండ్లు తీర్చాలని వినతి హొసపేటె: ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాల పెరుగుదల కోసం హొసపేటె నుంచి కొట్టూరు మీదుగా మంగళూరుకు ప్రత్యేక రైలు సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని, ప్రయాణికుల సౌకర్యం కోసం హొసపేటె రైల్వే స్టేషన్లో రెండు కొత్త ప్లాట్‌ఫాంల నిర్మాణం, రైల్వే స్టేషన్ ఆధునీకరణతో సహా పలు డిమాండ్లను తీర్చాలని నైరుతి రైల్వే జనరల్ మేనేజర్ ముకుల్ శరణ్ మాథుర్‌కు రైల్వే సమితి నేతలు వినతిపత్రాన్ని అందజేశారు. విజయనగర రైల్వే అభివృద్ధి కార్యాచరణ కమిటీ సీనియర్ సభ్యుడు బాబులాల్ జైన్ నేతృత్వంలోని ఆ కమిటీ ఆఫీస్ బేరర్లు ఈ ప్రతిపాదనలను సమర్పించారు. పుక్రాజ్ చోప్రా, ప్రభాకర్, మహేష్ కుడుతిని, రామకృష్ణ, ప్రౌమా మహేశ్వర్, నజీర్ సాబ్, విశ్వనాథ్ కెవటర్, అశోక్ జైన్, జబ్బార్, రాజ్ పురోహిత్, వరుణ్, రంగనాథ, రమేష్ లమాణి తదితరులు పాల్గొన్నారు. విమానయాన సంస్థ సేవలపై హర్షం హుబ్లీ: హుబ్లీ నుంచి మరో విమాన యాన సంస్థ సేవలు ప్రారంభించడంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సదరు విమాన సేవలతో రోజు మూడు విమానాలు బెంగళూరు– హుబ్లీల మధ్య సేవలు అందించనున్నాయన్నారు. గతంలో ఇండిగో అధికారులతో చర్చలు జరిపి మధ్యాహ్నం వేళ విమాన సేవ ప్రారంభించాలని సూచించానన్నారు. ఈ సేవ వల్ల హుబ్లీ– ధార్వాడ తదితర చుట్టు పక్కల జిల్లాల నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు ఎంతో అనుకూలం అన్నారు. ప్రస్తుతం తాజాగా మరో విమాన సేవ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇండిగో అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. హుబ్లీ నుంచి అహ్మదాబాద్ వరకు నూతన విమాన సేవను ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
చాలా ఎక్కువగా విద్యుత్ డిమాండ్
శివాజీనగర: రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యుత్ కొరత ఏర్పడలేదు. అయితే వేసవి నేపథ్యంలో మామూలు కంటే విద్యుత్‌ను అదనంగా ప్రజలు ఉపయోగించారని కేపీటీసీఎల్ ఎండీ కుమార్ పాండే తెలిపారు. సోమవారం నగరంలో బెస్కాం బెళకు భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులకు, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. గత 6 నెలల నుంచి విద్యుత్ వాడకం అధికమైంది. వేసవి కారణాన ఇళ్లు, ఆఫీసులు, పరిశ్రమల్లో ఏసీ వినియోగం పెరిగింది. డిమాండు నేపథ్యంలో పంజాబ్ , యూపీ ద్వారా విద్యుత్‌ను కొంటున్నట్లు చెప్పారు. ఇంతకు ముందు రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 17,220 మెగావాట్లు ఉండేది, ఈ ఏడాది 18,500 మెగావాట్లకు పెరిగిందని తెలిపారు. ఈసారి విద్యుత్ వాడకం 15 శాతం అధికమైందన్నారు. ఏప్రిల్, మేలో మరింత పెరుగుతుందని తెలిపారు. ఇళ్లు, పరిశ్రమల నుంచి ఎక్కువ ఒత్తిడి ఉందని చెప్పారు. సరఫరా కోసం చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇంధన శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా మాట్లాడుతూ విద్యుత్ డిమాండ్ చాలా ఉంది, సోలార్ కరెంటు వినియోగం పెరుగుతోంది, ప్రజలు విద్యుత్‌ను పొదుపుగా వాడాలని సూచించారు. రోజూ వేలాది మెగావాట్ల వినియోగం కొరత లేకుండా చర్యలు: ఇంధనశాఖ -
క్షయపై అవగాహన అవసరం
హొసపేటె: క్షయవ్యాధిపై అవగాహన అవసరమని విజయనగర జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ పేర్కొన్నారు. నగరంలోని ఇండోర్ స్టేడియంలో సోమవారం క్షయవ్యాధిపై ఏర్పాటు చేసిన ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. క్షయ మైకోబ్యాక్టోరియం ట్యూబక్యులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా కలిగే అంటువ్యాధి అన్నారు. శరీరంలోని ఏ అవయవానికై నా ఈ వ్యాధి సోకుతుందన్నారు. ఎక్కువగా ఊపిరితిత్తులకు సంక్రమిస్తుందన్నారు. క్షయ వ్యాధి లక్షణాలు ఉన్న వారు వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స పొందాలన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన వైద్యులను సన్మానించారు. హుడా అధ్యక్షుడు హెచ్ఎన్ఎఫ్ ఇమామ్ నియాజీ, జిల్లా వైద్యాధికారి శంకర్‌నాయక్, వైద్యులు సోమశేఖర్, వస్త్రద్ తదితరులు పాల్గొన్నారు. -
హనీట్రాప్‌పై విచారణ చేయాలి
● సుప్రీంకోర్టులో పిటిషన్ బనశంకరి: కర్ణాటకలో భారీ సంచలనం సృష్టించిన మంత్రులు, ఎమ్మెల్యేల హనీట్రాప్ వ్యవహారం మీద విచారణకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పిటిషన్ విచారణ కు తీసుకోవడానికి సుప్రీంకోర్టు సమ్మతించింది. ధన్‌బాద్ నివాసి వినయ్‌కుమార్‌సింగ్.. ఈ వ్యాజ్యం వేశారు. కర్ణాటకలో మంత్రి, న్యాయమూర్తితో పాటు పలువురిని హనీట్రాప్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై స్వతంత్ర విచారణ కు ఆదేశించాలని పిటిషన్లో విన్నవించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్‌ఖన్నా ధర్మాసనం.. ఒకటి రెండు రోజుల్లో పిటిషన్‌పై విచారణ జరుపుతామని తెలిపింది.ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వ్యక్తి, న్యాయమూర్తి తో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలను హనీట్రాప్ కు పాల్పడ్డారని మంత్రి ఒకరు ఆరోపించారని పిటిషన్లో ప్రస్తావించారు. మీడియాలో, సోషల్ మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయి. న్యాయవ్యవస్థ విశ్వాసం కాపాడేదృష్టితో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని అర్జీదారు పేర్కొన్నారు. వల విసిరిందెవరో సస్పెన్స్ -
పొలాల్లో నీటికుంటల తవ్వకాలు
మండ్య: వేసవిలో పంటల రక్షణ కోసం ప్రతి నియోజక వర్గం పరిధిలో నీటికుంటల పథకాన్ని అమలు చేస్తాము, రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఎన్.చలువరాయ స్వామి అన్నారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో వ్యవసాయ శాఖ పథకాలను ప్రారంభించారు. వేసవిలో నీటి కొరత ఉంటుంది, దీని వల్ల పంటలు దెబ్బతినకుండా ప్రతి పొలంలో నీటికుంటను తవ్వుకోవడానికి ప్రభుత్వం రైతులకు సహాయం చేస్తుందని తెలిపారు. 104 తాలూకాలలో పంటలకు నీటి కొరత ఉందని తెలిపారు. అక్కడ ఈ పథకం అమలు చేస్తామని చెప్పారు. అమ్మా.. పాము కాటేసింది ● బాలుడు చెప్పినా నమ్మని తల్లి ● ఆస్పత్రిలో చిన్నారి మృతి మండ్య: బహిర్భూమికి వెళ్లిన బాలున్ని పాము కాటు వేయడంతో చనిపోయిన సంఘటన జిల్లాలోని శ్రీరంగ పట్టణం తాలూకాలోని బాబురాయనకొప్పలు గ్రామంలో జరిగింది. పవిష్ (4) మృతబాలుడు. ఆరేళ్ల కిందట గాయత్రిని తమిళనాడుకు చెందిన రమేష్ కుమార్ ఇచ్చి వివాహం జరిపించారు. గాయత్రి రెండవ కాన్పు కోసం కొడుకుతో కలిసి పుట్టింటికి వచ్చింది. సోమవారం పవిష్ బహిర్భూమి కోసం ఇంటి పక్కన స్థలంలోకి వెళ్లాడు. ఆ సమయంలో ఏదో పాము చిన్నారిని కరిచింది. వెంటనే బాలుడు వచ్చి నన్ను పాము కొరికింది అని తల్లికి చెప్పాడు. కానీ వారు ఊరికే అలా చెబుతున్నాడని పట్టించుకోలేదు. అర్ధగంట తరువాత తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేస్తున్న సమయంలో చనిపోయాడు. కనువిందుగా రథోత్సవం చింతామణి: తాలూకాలోని కంగానపల్లి గ్రామంలో వెలసిన పురాతన శ్రీ సీతా రామాంజనేయస్వామి ఆలయ బ్రహ్మ రథోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలకరించిన మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు పండితులు పూజలు నిర్వహించారు. తేరులో ప్రతిష్టించి లాగారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పాల్గొన్నారు. కళా బృందాల ప్రదర్శనలు అలరించాయి. ధైర్యంగా ఎమ్మెల్యేలపై చర్య తీసుకున్నా ● విధాన సభాపతి ఖాదర్ యశవంతపుర: స్పీకర్ స్థానానికి అగౌరవం తెచ్చేలా ప్రవర్తించినందునే 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు విధానసభ స్పీకర్ యూటీ ఖాదర్ చెప్పారు. సోమవారం దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. సభ గౌరవ మర్యాదలను కాపాడాలంటే ఇలాంటి చర్యలు తప్పవన్నారు. సభలో స్పీకర్ శక్తిమంతుడు, గతంలోనే స్పీకర్లు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటివి మళ్లీ జరిగేవి కాదన్నారు. అప్పటి స్పీకర్లు దైర్యం చేయలేదు. నేను ధైర్యం చేసి 18 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశానని చెప్పారు. దీనిని శిక్షగా పరిగణించాల్సిన అవసరం లేదు. ఉత్తమమైన ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దుకునేందుకు అవకాశం కల్పించానన్నారు. ద్రవ్య వినిమయ బిల్ పాస్ కాకుండా గొడవ చేశారు, ఆ బిల్లు ఆమోదం పొందకుంటే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావన్నారు. ఇందుకు తాను అవకాశం ఇవ్వలేదని తెలిపారు. పెళ్లాడి.. పోలీస్‌స్టేషన్‌కు చిక్కబళ్లాపురం: మతాంతర ప్రేమ పెళ్లి చేసుకున్న యువ జంట భద్రత కావాలని పోలీసులను కోరింది. ఈ ఘటన చిక్క నగరంలో జరిగింది. తాలూకాలోని మైలప్పనహళ్లివాసి హసీనా (23), ఎదురింటిలో ఉండే నాగార్జున (24) రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకొంటున్నారు. పెళ్లి చేసుకుంటామని ఇళ్లలో చెప్పగా వారు తిరస్కరించారు. దీంతో చిక్కకు వచ్చి ఓ గుడిలో తాళి కట్టి పెళ్లి చేసుకుని పోలీసు స్టేషన్‌కు వచ్చారు. యువతి తల్లిదండ్రులు వచ్చి ఎంత వేడుకొన్నా, హసీనా భర్తతోనే ఉంటాను అని తెగేసి చెప్పింది. ఈ ప్రేమ వివాహం అందరినీ సంభ్రమానికి గురిచేసింది. -
దొడ్డహబ్బ వేడుకలు
మండ్య: మండ్య జిల్లాలోని మళవళ్లి తాలూకాలోని దేవిపుర గ్రామంలో వెలసిన హిరియమ్మ దేవి, దొడ్డహబ్బ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనేశ్వర స్వామి, శ్రీరామాంజనేయ స్వాములకు అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. స్వాములను అలంకరించి ఊరేగించారు. పెద్దసంఖ్యలో భక్తులు దర్శనాలు చేసుకున్నారు. తల్లీబిడ్డ మృతి, ఆస్పత్రిపై దాడి దొడ్డబళ్లాపురం: కలబుర్గిలోని ప్రైవేటు ఆస్పత్రిలో తల్లీ బిడ్డ మృతిచెందడంతో సిబ్బందే కారణంటూ బంధువులు దాడికి దిగారు. ఎంఎస్కే మిల్ కాలనీలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో సభా పర్వీన్ అనే గర్భిణికి ఆదివారం రాత్రి కాన్పు జరిగింది. కొన్ని గంటల్లోనే తల్లీ బిడ్డ కన్నుమూశారు. దీంతో భర్త, బంధువులు ఆగ్రహం పట్టలేక కిటికీల అద్దాలను పగలగొట్టారు. కుర్చీలు టేబుళ్లను ధ్వంసం చేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. వైద్యులు మాట్లాడుతూ గర్భంలోనే శిశువు చనిపోయిందని, లోబీపీ కారణంగా తల్లి కూడా మరణించిందని తెలిపారు. తిరుమలకు పాదయాత్ర బనశంకరి: రాజానుకుంటె చల్లహళ్లి కి చెందిన వెంకన్న భక్తులు తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధికి పాదయాత్ర చేపట్టారు. ప్రతి ఏడాది మాదిరిగా ఈ దఫా కూడా 14వ సారి పాదయాత్ర చేసి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు. 25 మంది పాదయాత్రలో పాల్గొన్నారు. నిత్యం ఉదయం 5 గంటలకు నడక ప్రారంభించి మధ్యలో ఏదైనా ఆలయం వద్ద విశ్రాంతి తీసుకుంటారు. తిరుమలకు చేరడానికి 6 రోజులు పట్టిందని తెలిపారు. మండుటెండను లెక్కచేయకుండా పాదయాత్ర చేశామని, మధ్యలో ప్రజలు ఎంతో సహకారం అందించారని భక్తుడు చేతన్ చెప్పారు. సీతారాముల కళ్యాణం మైసూరు: మైసూరు జిల్లాలోని సాలిగ్రామ తాలూకాలోని చరిత్ర ప్రసిద్ధ చుంచనకట్టె శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ధర్మస్థల ట్రస్టు ద్వారా సీతారాముల వారి కళ్యాణోత్సవం, అఖండ రామకోటి భజన నిర్వహించారు. సోమవారం తెల్లవారుజాము నుంచి మూలవిరాట్‌కు కొబ్బరినీళ్లు, వివిధ ద్రవ్యాలతో అభి షేకం నిర్వహించారు. వందలాది భక్తుల సమక్షంలో మహామంగళహారతి ఇచ్చి, స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనుల పండువగా జరిపారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సిటీ బస్సుల కోసం రిపేరీ వ్యాన్లు బనశంకరి: ఆర్టీసీ బస్సులు సజావుగా నడవడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని రవాణా మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. బెంగళూరులో బీఎంటీసీ బస్సులు రోడ్డుపై మొరాయిస్తే తక్షణం మరమ్మతులు చేయడానికి 5 మొబైల్ రిపేర్ వ్యాన్లను సోమవారం ఆయన ప్రారంభించారు. 6,835 బస్సులు బీఎంటీసీ నగర, ఉపనగరాలలో ప్రతిరోజు సరాసరి 5,875 ట్రిప్పులు సంచరిస్తాయన్నారు. ట్రాఫిక్ రద్దీలో బ్రేక్‌డౌన్ అవుతున్నాయి, దీంతో బస్ టెర్మినల్స్‌లో కనీసం ఒక మొబైల్ రిపేర్ వ్యాన్ ఉంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ వాహనంలో హెవీ టూల్‌బాక్స్‌లు, బ్యాటరీలు, టైర్లు, హైడ్రాలిక్ జాక్‌లు, కేబుల్స్, ఇతర మరమ్మత్తు పరికరాలు ఉంటాయని తెలిపారు. క్షయను నిర్మూలిద్దాం తుమకూరు: ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా సోమవారం తుమకూరు జిల్లా పాలనా యంత్రాంగం ద్వారా నగరంలో జన జాగృతి జాతాను నిర్వహించారు. ఎవరూ కూడ క్షయను తెచ్చుకోవద్దని, దానిని పూర్తిగా నిర్మూలించాలని నినాదాలు చేశారు. ప్రజలు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్ల వర్గీకరణపై మంతనాలు
బనశంకరి: రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ అమలు కోసం సీఎం సిద్దరామయ్య సోమవారం నివాస కార్యాలయం కృష్ణాలో దళిత నేతలు, మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. తరువాత విలేకరులతో మంత్రి హెచ్‌సీ మహదేవప్ప మాట్లాడుతూ మూడు గంటల పాటు సమావేశం జరిగింది. రిజర్వేషన్ అమలు కమిటీ అధ్యక్షుడు నాగమోహన్‌దాస్ కూడా పాల్గొన్నారు. రిజర్వేషన్ అమలుపై చర్చించామన్నారు. వారంలోగా నివేదిక అమలు చేస్తారని తెలిపారు. ఉద్యోగుల గురించి అన్ని శాఖలు వివరాలు అందించాయని చెప్పారు. హోంమంత్రి పరమేశ్వర్ మాట్లాడుతూ అంతర్గత రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మేనిఫెస్టోలో చెప్పామన్నారు. నాగమోహన్‌దాస్ కమిటి అందించే మధ్యంతర నివేదిక పై సీఎంతో చర్చించి త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతవరకు పోస్టుల భర్తీ, పదోన్నతులను నిలిపివేస్తామన్నారు. సీఎం నివాసంలో భేటీ -
చవగ్గా.. బంగారు ఇటుక మీదే
బనశంకరి: బంగారం రేట్లు అంబరాన్ని అంటడంతో ఆశ కూడా ఎక్కువైంది. దీంతో మోసగాళ్లు ఎక్కువైపోతున్నారు. రాజులు పాలించిన ప్రదేశంలో ఇంటి నిర్మాణానికి పునాది తీస్తుండగా నిధి లభించింది, ఆ బంగారు ఇటుకను అమ్ముతామని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని నగర సీసీబీ పోలీసులు అరెస్ట్‌చేశారు. బిహర్ కు చెందిన రబికుల్ఇస్లాం, ఇద్దీశ్ అలీ, అన్వర్‌హుసేన్ నిందితులు. మోసాల పర్వం ఇలా వీరు బెంగళూరుకు చేరుకుని పునాది తవ్వకంలో బంగారు ఇటుక దొరికిందని చెప్పి ఆశ పుట్టించేవారు. మొదట 10 గ్రాముల అసలైన బంగారం ముక్కను ఇచ్చి నమ్మకం కలిగించేవారు. చాలా తక్కువ రేటుకే బంగారం ఇస్తామని, ఈసారి డబ్బు తీసుకుని రావాలని చెప్పేవారు. ఇలా పలువురు బంగారం వ్యాపారులను సంప్రదించారు. బంగారం తీసుకోవడానికి మేము తెలిపిన స్థలానికి రావాలని తెలిపి పదేపదే లొకేషన్ మార్చేవారు. చివరికి నిర్మానుష్య ప్రదేశానికి వ్యాపారులను తీసుకెళ్లి డబ్బు తీసుకుని నకిలీ బంగారం ఇటుక ఇచ్చి పారిపోయేవారు. పలువురు బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోరమంగలలో మరో వ్యాపారికి టోపీ వేస్తూ దొరికిపోయారు. ముగ్గురిని అరెస్ట్‌చేసి కేజీ నకిలీ బంగారం, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు. పలువురికి శఠగోపం బెంగళూరులో బిహార్ ముఠా పట్టివేత -
నీటితొట్టెలో పాముల ఫ్యామిలీ
శివమొగ్గ: ఒక్క పామును చూస్తేనే హడలిపోతారు. ఇంకా ఎక్కువ పాములను చూస్తే ఎవరికై నా వణుకు పుట్టడం ఖాయం. ఇలాంటి ఘటనే శివమొగ్గ నగరంలో జరిగింది. కువెంపు లేఔట్లో ఈశ్వరయ్య అనే వ్యక్తి ఇంటిలో ఉన్న నీటి తొట్టిలో ఓ పాము గుడ్లను పెట్టి పొదిగింది. ఆదివారం తొట్టి బయట ఒక పాముపిల్లను చూసిన కుటుంబ సభ్యులు తొట్టెలో లైటు వేసి చూడగా పుట్టల కొద్దీ పాము పిల్లలు కనిపించడంతో భయపడిపోయారు. వెంటనే స్నేక్ కిరణ్‌కు సమాచారం ఇచ్చారు. స్నేక్ కిరణ్ అప్పటినుంచి పాము పిల్లలను సేకరించసాగారు. సోమవారం నాటికి 69 పిల్ల పాములను పట్టి బకెట్లో నిల్వ చేశారు. వాటిని తీసుకెళ్లి దూరంగా ఓ చెరువులో వేశారు. కాగా ఈ వీడియోలు వైరల్ అయ్యాయి 69 పిల్ల సర్పాల పట్టివేత -
ఆకస్మిక వర్షం.. బెంగళూరు సతమతం
కొమ్మ పడి చిన్నారి మృతి కమ్మనహళ్లికి చెందిన శక్తి అనే వ్యక్తి మూడేళ్ల కుమార్తె రక్ష తో పులకేశినగరలో బైకులో వెళుతుండగా ఒక్కసారిగా చెట్టు కూలిపోయింది. కొమ్మనేరుగా చిన్నారిపై పడింది. బలమైన గాయం కావడంతో తల నుంచి తీవ్రరక్తస్రావమై అక్కడే చనిపోయింది. బేకరి నుంచి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బీబీఎంపీ అటవీ విభాగం చీఫ్ స్వామి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బనశంకరి: వేసవి వర్షం ఊపేసింది. రాజధాని బెంగళూరు శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు మెరుపులు, పిడుగులు, వడగండ్ల వానతో తల్లడిల్లింది. పలుచోట్ల చెట్లు కొమ్మలు పడిపోయాయి. యలహంక ప్రాంతంలో ఇళ్లలోకి వాననీరు చొరబడగా కోగిలు క్రాస్తో పాటు ఇతర రోడ్లలో నీరు చేరి ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఏడాది మొదటివర్షమే భారీగా కురిసింది. బెంగళూరు ఉత్తర భాగంలో ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ఏడాదిలో నైరుతి రుతుపవనాల అవధిలో సైతం బెంగళూరు ఉత్తర భాగం, యలహంక, కోగిలు క్రాస్ తదితర ప్రదేశాలు ముంపునకు గురయ్యాయి. శనివారం ఉదయం నుంచి నగరంలో మేఘావృతమై సాయంత్రానికి ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. క్రమంగా నగరవ్యాప్తంగా విస్తరించి అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఇళ్లలోకి నీరు యలహంక ఓల్డ్‌టౌన్ ప్రాంతంలో 15 కు పైగా ఇళ్లలోకి వర్షంనీరు చొరబడింది. ఒక్కసారి నీరు చొరబడటంతో ఇళ్లలో నిత్యావసర వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి. రాజకాలువలో మట్టి నిండిపోవడంతో వర్షపు నీరు సజావుగా ప్రవహించడానికి అవకాశం లేకపోవడంతో ఇళ్లోకి నీరు చొరబడిందని స్దానికులు ఆరోపించారు. జక్కూరులో అత్యధిక వర్షం జక్కూరు, చౌడేశ్వరి నగరలో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హగదూరు, వీ.నాగేనహళ్లిలో 3.4 సెంటీమీటర్లు, విద్యారణ్యపురలో 3.2, హొరమావు, బిళేకహళ్లిలో తలా 2.1 బసవనపుర 1.9, గరుడాచార్పాళ్య 1.8, బీటీఎంలేఔట్ 1.7, రామమూర్తినగర , కొడిగేహళ్లిలో తలా 1.6, కాడుగోడిలో 1.5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. విమానాశ్రయంలో ఆటంకం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కుండపోత వర్షంతో విమానాలకు ఇబ్బందులు తలెత్తాయి. సాయంత్రం నుంచి ల్యాండింగ్‌కు వీలు కాకపోవడంతో 10 విమానాలను చైన్నెకి మళ్లించారు. వర్షం తగ్గిన తరువాత మళ్లీ పునరుద్ధరించారు. పలు విమానాలు ఆలస్యమై ప్రయాణికులు అసహనం చెందారు. సహాయవాణి 1533 వర్షం పడిన ప్రతిసారి పాలికె సిబ్బంది బయటకు రావాలి, రోడ్లలో నీరు నిలవడం, చెట్లు, కొమ్మలు పడిపోతే తక్షణం తొలగించాలని బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్ సూచించారు. ప్రజలకు సమస్య తలెత్తితే బీబీఎంపీ సహాయవాణి 1533 నంబరుకు ఫోన్ చేసి చెప్పాలని తెలిపారు. ఉరుములు మెరుపులు, గాలీవాన కూలిపోయిన చెట్లు పులకేశినగరలో బాలిక దుర్మరణం విమాన ప్రయాణాలకు ఆటంకం కొన్ని ఫ్లైట్లు చైన్నెకి మళ్లింపు వర్షసూచన చిక్కమగళూరు, బెంగళూరు, కోలారు, కొడగు, మండ్య, మైసూరు, చామరాజనగర, బీదర్ జిల్లా, కొడగు పాటు అనేక జిల్లాల్లో శనివారం వర్షం కురిసింది. ఆదివారం నుంచి వేసవి వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒళనాడులో వర్షాలు అధికంగా ఉండవచ్చు. విరిగిన చెట్లు, కొమ్మలు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ రోడ్డు కోగిలు క్రాస్‌లో ట్రాఫిక్‌కు తీవ్ర అడ్డంకి ఏర్పడింది. మాన్యతా టెక్ పార్కు వద్ద జలమయం అయ్యింది. బెంగళూరు తూర్పు, ఉత్తర భాగం, మహదేవపుర ప్రదేశాల్లో వర్షం, గాలులకు సుమారు 30 నుంచి 50 చెట్లు, చెట్లుకొమ్మలు కూలిపోయాయి. సదాశివనగర 10వ క్రాస్‌లో చెట్లు, కొమ్మలు విరిగిపడటంతో కొన్ని కార్లు దెబ్బతిన్నాయి. మేక్రీ సర్కిల్, సంజయనగర, భూపసంద్ర, యలహంక, హెబ్బాళతో పాటు పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. జేసీ రోడ్డులో పెద్ద చెట్టు పడిపోయింది. -
కేజీఎఫ్ వద్ద... వెంటాడి రౌడీ నరికివేత
కెజీఎఫ్: పట్టపగలే రౌడీషీటర్‌ను హత్య జరిగింది. హతుడు కేజీఎఫ్ నగరంలోని అండర్సన్ పేట పోలీస్ స్టేషన్ పరిధి వాసి. న్యూ మాడల్ నివాసి జయశీలన్ కుమారుడు రౌడీషీటర్ శివకుమార్ (28) హత్యకు గురైన వ్యక్తి. వివరాలు.. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో శివకుమార్ తన స్నేహితురాలితో కలిసి బైక్‌లో కామసముద్రం వైపు వెళుతున్నాడు. విరూపాక్ష పురం వద్ద వెనుకనుంచి వెంబడించి వచ్చిన నలుగురు దుండగులు మచ్చు కొడవళ్లతో అతన్ని నరికారు. తీవ్రంగా గాయపడిన శివకుమార్ తప్పించుకుని కామసముద్రం అటవీ ప్రదేశం వరకు పరిగెత్తుకు వచ్చి అక్కడే ప్రాణాలు వదిలాడు. అతని స్నేహితురాలు ఫోన్ చేయడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆచూకీ కోసం గాలించారు. చివరికి డ్రోన్ సహాయంతో అన్వేషించి మృతదేహాన్ని కనుగొన్నారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ శాంతరాజు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలన జరిపారు. అండర్సన్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పాతకక్షలే కారణమని తెలుస్తోంది. -
ఇక చాలు, తప్పుకొంటున్నా
● పరిషత్ సభాపతి రాజీనామా బనశంకరి: విధాన పరిషత్‌లో, అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తన ఏమాత్రం బాగా లేదు. ఇటువంటి సభకు అధ్యక్షత వహించాలో, లేదో కూడా తెలియడం లేదు అని బీజేపీ ఎమ్మెల్సీ, విధాన పరిషత్ సభాపతి బసవరాజ హొరట్టి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలలో జరుగుతున్న పరిణామాలు, హనీ ట్రాప్ వ్యవహారంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రవర్తన మీద ఆక్రోశం వ్యక్తం చేస్తూ సభాపతి పదవికి రాజీనామా ప్రకటించారు. లేఖను ఉపసభాపతి ప్రాణేశ్కు పంపించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాజీనామా అమలులోకి వస్తుందని, వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ పదవి నుంచి విముక్తి కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా హుబ్లీలో మీడియాతో బాధగా మాట్లాడారు. అసెంబ్లీలో సభ్యులు దిగజారి ప్రవర్తిస్తున్నారు. సభాపతి మాటలను పట్టించుకోవడం లేదని వాపోయారు. చర్చల్లో విలువలు పడిపోతున్నాయన్నారు. సాధారణ సమయాల్లో కూడా ప్రజాప్రతినిధుల తీరు ఏమాత్రం బాగా లేదని వాపోయారు. నలభై ఏళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్నానని, ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని చెప్పారు. రాజీనామా ఆమోదం తరువాత ఏం చేయాలనేది ఆలోచిస్తానని అన్నారు.ఘరానా ఎస్ఐ సస్పెన్షన్ శివాజీనగర: చోరీ కేసుల్లో దొంగల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని సొంతానికి వాడుకున్నాడు. ఆ బంగారం ఏమైందని ఉన్నతాధికారులు అడిగినప్పుడు మరో మోసానికి పాల్పడ్డాడు. వరుస వంచనలు బయటపడి సస్పెండ్ అయ్యాడో ఎస్ఐ. బెంగళూరులోని కాటన్‌పేట ఠాణా ఎస్ఐ సంతోష్ నిర్వాకమిది. వివరాలు.. గతంలో ఓ కేసులో కొంత బంగారాన్ని రికవరీ చేసి స్వాహా చేశాడు. రికవరీ చూపించడానికి మరో నాటకం ఆడాడు. ఓ బంగారు షాపు యజమానిని కలిసి రికవరీ కోసం బంగారం చూపించాలి, ఫోటో తీయించి వెనక్కి ఇస్తాను. నీ వద్ద ఉన్న బంగారు ముద్దను ఇవ్వాలని కోరారు. యజమాని సరేనని 950 గ్రాముల బంగారాన్ని ఎస్ఐకి ఇచ్చారు. ఎస్ఐ ఎన్నిరోజులైనా బంగారాన్ని తిరిగి ఇవ్వకపోవడంతో యజమాని ఒత్తిడి చేశాడు. చివరకు కొన్ని ఖాళీ చెక్కులను ఇచ్చాడు. వ్యాపారి వాటిని బ్యాంకులో వేయగా చెల్లలేదు. నా బంగారం ఇచ్చేయాలని వ్యాపారి గట్టిగా అడిగితే ఎస్ఐ బెదిరింపులకు దిగాడు. చివరకు బాధితుడు డీసీపీకి ఫిర్యాదు చేశాడు. ఏసీపీ ప్రాథమిక విచారణ జరిపి నివేదిక అందజేశారు. బాగోతం నిజమేని తేలడంతో పోలీస్ కమిషనర్ సస్పెన్షన్ ఆదేశాలిచ్చారు. హలసూరు గేట్ ఠాణాలో ఎస్ఐపై కేసు నమోదైంది.రాజణ్ణ ఫిర్యాదు చేయగానే దర్యాప్తు: హోంమంత్రిశివాజీనగర: హనీ ట్రాప్ కేసును తీవ్రంగా తీసుకొన్నాం. మంత్రి రాజణ్ణ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేసి ఉంటే ఎలాంటి విచారణ జరిపించాలో శనివారమే ప్రకటించేవాళ్లమని హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. ఆదివారం బెంగళూరు సదాశివనగర ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడిన ఆయన, రాజణ్ణ ఫిర్యాదు చేస్తే ఏ తనిఖీకి ఇవ్వాలనేది సీఎంతో చర్చిస్తాను. ఇంత పెద్ద ఆరోపణ వచ్చింది. తీవ్రంగా తీసుకోవాల్సిందే. బీజేపీవారు సీబీఐ, హైకోర్టు జడ్జిచే విచారణ అడుగుతున్నారు అని చెప్పారు. 48 మంది హనీ ట్రాప్‌లో పడ్డారా, ఈ సంఖ్య ఎంత అనేది ఊహించేందుకు సాధ్యపడదన్నారు. కాగా, రాజణ్ణ ఇంతవరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అనేది కుతూహలంగా మారింది. పిల్లల చేత టాయ్‌లెట్ పనులు ● హెచ్ఎం, టీచర్ సస్పెన్షన్ శివాజీనగర: పిల్లలు పారిశుధ్య కార్మికులయ్యారు. పాఠశాల పిల్లలచే మరుగుదొడ్ల గుంతను శుభ్రం చేయించిన ఇద్దరు ఉపాధ్యాయినులు సస్పెండ్ అయ్యారు. బెంగళూరు దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బేగూరు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం సాకమ్మ, పీఈటీ సుమిత్ర ఇటీవల పిల్లల చేత మరుగుదొడ్ల గుంతలను క్లీన్ చేయించిన వీడియోలు వైరల్ అయ్యాయి. చదువుకోవాల్సిన బాలల చేత ఇలాంటి పనులు చేయిస్తారా? అని తల్లిదండ్రులు భగ్గుమన్నారు. బాలల హక్కుల ఉల్లంఘన జరిగిందని ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చారు. నిజానికి మరుగుదొడ్లను శుభ్రం చేయడానికి కార్మికులను ఉపయోగించాలి. కానీ ఆ నిధులు రూ. 43 వేలను స్వాహా చేసి ఆ పనిని బాలలకు అప్పగించారని తేలింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ డీడీ కే.బీ.నింగరాజప్ప పై ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. బంగ్లాదేశ్ హిందువులపై హింస ● ఆ దేశంపై ఒత్తిడి తేవాలి ● ఆర్ఎస్ఎస్ నేతల డిమాండ్ బనశంకరి: బంగ్లాదేశ్ హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్ఎస్ఎస్.. ఇది మానవహక్కుల ఉల్లంఘన అని స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రపంచ సంస్థలతో కలిసి బంగ్లాదేశ్ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేసింది. బెంగళూరు చన్నేనహళ్లిలో రెండురోజుల సంఘం సమావేశాలు జరిగాయి. సంఘం అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. బంగ్లాదేశ్ హిందువులకు ప్రపంచంలోని అన్నిదేశాలు మద్దతుగా నిలవాలన్నారు. బంగ్లాదేశ్‌లో మతఛాందసవాదులతో హిందూ, ఇతర మైనారిటీ మతస్తులపై మితిమీరిన హింస జరుగుతోందని ఆరోపించారు. 1951లో 22 శాతం ఉన్న హిందువుల జనాభా ప్రస్తుతం 7 .95 శాతానికి క్షీణించిందని తెలిపారు. భారత సరిహద్దుల్లో అస్థిర వాతావరణం కల్పించడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ హిందువుల కోసం కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ వేదికల్లో మాట్లాడి మద్దతు పొందడం ముదావహమని అన్నారు. -
పళ్లు లేవని.. యువకుడు ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: ఓ యాక్సిడెంటు యువకుని ఆత్మహత్యకు కారణమైంది. ప్రమాదంలో 17 పళ్లు ఊడిపోయాయి, సమాజంలో తలెత్తుకుని ఎలా తిరగాలి అనే బాధతో ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన చిక్కమగళూరు జిల్లాలో చోటుచేసుకుంది. కొప్ప తాలూకా సాలుమర గ్రామంలో విఘ్నేష్ (18) అనే యువకుడు స్థానిక ఐటీఐలో ఫస్టియర్ చదివేవాడు. నాలుగేళ్ల క్రితం బైక్ ప్రమాదంలో 17 పళ్లు ఊడిపోయాయి. పళ్లు కట్టించుకోవాలని ఆ రోజు నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ చాలా ఖర్చు చేశాడు. నీకు పళ్లు లేవని అందరూ ఎగతాళి చేస్తుండడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ముత్యాలమ్మకు విశేష పూజలు మాలూరు: తాలూకాలోని లక్కూరు గ్రామంలోని పురాతన శ్రీ ముత్యాలమ్మ దేవి దేవాలయంలో ఆదివారం అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. ప్రధాన అర్చకుడు కోడూరు మదన్ నేతృత్వంలో మూల విగ్రహానికి అభిషేకం, పంచామృత అభిషేకం, వేద, మంత్ర పారాయణం, తదితరాలను చేపట్టారు. లక్కూరు ఫిర్కాతో పాటు తాలూకాలోని పలు గ్రామాల నుంచి భక్తులు వచ్చి దర్శనాలు చేసుకున్నారు. సిద్దు ఇంటికి ఖర్గే ● హనీ ట్రాప్‌పై చర్చ? శివాజీనగర: రాష్ట్రంలో కొందరు మంత్రులు, నాయకులపై హనీట్రాప్ ప్రయోగం జరుగుతోందనే హంగామా నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భేటీ ప్రాముఖ్యం సంతరించుకుంది. ఆదివారం బెంగళూరులోని కావేరి నివాసంలో సీఎం సిద్దరామయ్యను మల్లికార్జున ఖర్గే, మంత్రి ప్రియాంక ఖర్గే వచ్చి కలిశారు. పార్టీ అధ్యక్షుడే సీఎం ఇంటికి రావడం బట్టి విషయం చాలా సీరియస్‌గా ఉందని తెలుస్తోంది. హనీట్రాప్‌లో బాధితులు, సూత్రధారులు ఎవరు, ఎందుకు చేశారు, పార్టీ, ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకోవాలనేది చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇటీవలికాలంలో జరుగుతున్న అనేక పరిణామాల గురించి మాట్లాడుకున్నట్లు సమాచారం. హనీ ట్రాప్ కేసులో తమ పార్టీవారు, ప్రతిపక్ష పార్టీవారు ఎవరు పాల్గొన్నా కూడా వారి మీద చర్యలు తీసుకొంటాం. శాసనసభలో మంత్రే ఈ వ్యవహారం గురించి గళమెత్తినప్పుడు ప్రభుత్వం మౌనంగా ఉండదు. ఈ కేసు గురించి విచారణ చేపడతాం. ప్రతిపక్ష పార్టీల వారు న్యాయ విచారణను కోరారు. అన్నింటి గురించి హోం మంత్రితో సీనియర్ మంత్రులతో చర్చించి, ఈ విధమైన తనిఖీ చేపట్టాలనేది నిర్ధారిస్తామని సిద్దరామయ్య గతంలోనే తెలిపారు. సీఎంను ఎవరో కలిస్తే ఏమిటి? ● డీసీఎం శివకుమార్ రుసరుస శివాజీనగర: ముఖ్యమంత్రిని ఎవరైనా భేటీ చేయవచ్చు. ఆయనను ఎవరు కలిశారనేది నన్నెందుకు అడుగుతున్నారు? అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఆదివారం బెంగళూరు సదాశివనగర ఇంటి వద్ద మాట్లాడిన ఆయన, మంత్రి రాజణ్ణ సీఎంను కలవడంపై విలేకరులు ప్రశ్నించగా ఇలా స్పందించారు. నా శాఖ విషయాల గురించి మాత్రమే నన్ను అడగండి. శాసనసభలో హనీ ట్రాప్ గురించి మాట్లాడినందుకు మంత్రిపై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసిందా? అన్న ప్రశ్నకు అంతా బోగస్ అన్నారు. దక్షిణాది స్వాభిమానం కోసం పోరాటం శనివారం తమిళనాడు చైన్నెలో జరిగిన సీఎంల సభలో పాల్గొన్నాను, దక్షిణ భారత దేశంలో ఎంపీ నియోజకవర్గాలను తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పిన అన్ని విషయాలను సమావేశంలో ప్రస్తావించాను. కర్ణాటకలో 2 సీట్ల తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. దీని వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఇది మా రాష్ట్ర, దక్షిణ భారతదేశ స్వాభిమాన అంశమని తెలిపారు. వివాదంలో దర్శన్ దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయి ఇటీవల బెయిలుపొందిన ప్రముఖ నటుడు దర్శన్ కేరళలో ఆలయాలను దర్శించుకుంటున్నారు. కణ్ణూరు మాడాయికావు శ్రీ భగవతి దేవాలయంలో శత్రుసంహార పూజలు చేయించారు. అంతాబాగానే ఉంది కానీ, ప్రజ్వల్ రై అనే వ్యక్తి దర్శన్ వెంట ఉండడం చర్చనీయాంశమైంది. ప్రజ్వల్ రై 2017లో గ్రామపంచాయతీ సభ్యుడు కరోపాడి హత్య కేసులో ముఖ్య నిందితుడు. ఇప్పుడు దర్శన్ వెంట కనిపించడంతో విమర్శలకు తావిచ్చింది. పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు అలాంటి వ్యక్తితో పనేముందని కొందరు వ్యాఖ్యానించారు. -
ఆకాశ రథాలు.. అంతలోనే పతనం
బొమ్మనహళ్ళి: భక్తులు ఆనందోత్సాహాలతో నిర్వహిస్తున్న ఊరి జాతరలో విషాదం సంభవించింది. ఆకాశాన్నంటే రెండు తేర్లు పెనుగాలులకు కుప్పకూలిపోయాయి. ఈ సంఘటన శనివారం సాయంత్రం బెంగళూరు వద్ద ఆనేకల్ తాలూకాలో ఉన్న చరిత్ర ప్రసిద్ది చెందిన హుస్కూరు మద్దూరమ్మదేవి జాతరలో చోటుచేసుకుంది. ఇద్దరు చనిపోగా, మరికొందరు గాయపడ్డారు. దొడ్డనాగమంగల తేరు.. ఈ ఏడాది మద్దూరమ్మ జాతరకు పరిసర గ్రామాల నుంచి మొత్తం ఆరు తేరులు రావాల్సి ఉంది. తమ ఊరి రథమే బ్రహ్మాండంగా ఉండాలనే తపనతో గ్రామస్తులు పోటీ పడి చాలా ఎత్తుగా తేరును నిర్మిస్తూ ఉంటారు. దీనికోసం లక్షల రూపాయలను వెచ్చిస్తారు. ఇందులో దొడ్డనాగమంగల తేరు 150 అడుగుల ఎత్తు ఉంది. చిక్కనాగమంగళ వద్దకు చేరుకోగానే గాలి దుమారం లేచింది, ఓ వైపు కుప్పకూలిపోయింది. ఇందులో ఎవరికీ ఏమీ కాలేదు. రాయసంద్ర రథంలో విషాదం ఇక రాయసంద్ర నుంచి వస్తున్న 120 అడుగుల రథం కూడా ఇదే మాదిరిగా కుప్పకూలింది. రథం కింద కొందరు చిక్కుకుపోయారు. తమిళనాడులోని హోసూరుకు చెందిన రోహిత్ (26), బెంగళూరు కెంగేరికి చెందిన బాలిక జ్యోతి (14) చనిపోయారు. నలుగురుకి పైగా గాయపడ్డారు. రథం కళ్లముందే కూలిపోవడంతో భక్తుల హాహాకారాలు మిన్నంటాయి. ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. 2024 జాతరలోనూ రాయసంద్ర నుంచి వచ్చిన తేరు పడిపోయింది. భక్తులు, పరిసర గ్రామాలవాసులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఆనేకల్ హుస్కూరమ్మ జాతరలో అపశ్రుతి రెండు తేర్లు కూలి ఇద్దరు దుర్మరణం పలువురికి గాయాలు -
రాయచూరులో అధ్వానంగా పారిశుధ్యం
రాయచూరు రూరల్: రాయచూరు నగరంలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. ఎక్కడ చూసినా చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. మురుగు కాలువల్లో పూడిక పేరుకుపోయింది. నీరు ముందుకు సాగడం లేదు. దీంతో దుర్వాసన వెలువడుతోంది. నగరంలోని 35 వార్డుల్లోనూ ఇదే పరిస్థితి ఉందని ప్రజలు వాపోతున్నారు. చెత్తను తరలించేందుకు కొత్తగా ఆరు ట్రాక్టర్లను నగరసభ అధికారులు కొనుగోలు చేశారు. వాటిని దిష్టిబొమ్మల్లా కార్యాలయ ఆవరణలో నిలిపి ఉంచారు తప్పితే చెత్త తరలించడం లేదు. పేరుకు మాత్రమే జిల్లా కేంద్రమని, చిన్న చిన్న పట్టణాల్లో ఉన్న సదుపాయాలు లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్యం అధ్వానంగా మారినా అధికారులు, పాలకులు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలున్నాయి. చెత్త కుప్పల్లో పందులు సంచరిస్తుండటంతో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. మరో వైపు పౌర కార్మికుల కొరతతో పనులు జరగడం లేదు. నగరసభ కాంగ్రెస్ ఆధీనంలో ఉండగా నగరానికి బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆ ప్రభావం పారిశుధ్యంపై పడింది. ఇక నగరంలో రోడ్లు అధ్వానంగా మారాయి. ఏ వీధిలో చూసినా గుంతలు దర్శనమిస్తున్నాయి. పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. నేతలు నగర అభివృద్ధిపై దృష్టి సారించకుండా ఆరోపణలు చేసుకుంటున్నారు. పేరుకుపోయిన చెత్తకుప్పలు దుర్వాసన భరించలేకపోతున్న నగరవాసులు వేధిస్తున్న కార్మికుల కొరత -
స్వాతంత్య్ర పోరాట ఫలాలు పేదలకు అందడం లేదు
సాక్షి,బళ్లారి: ఎందరో మహనీయుల ప్రాణత్యాగాలతో దేశానికి స్వాతంత్య్రం లభించి దాదాపు ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా పేదలు ఇంకా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బళ్లారిలో జరిగిన అఖిల భారత యువజన ఫెడరేషన్ 11వ రాష్ట్ర సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భగత్‌సింగ్, సుఖదేవ్, రాజ్‌గురు చిత్ర పటాలకు నివాళులర్పించి మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీతోపాటు కమ్యూనిస్టులు ఎన్నో ప్రజా ఉద్యమాలు చేశారన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఉరికంబం ఎక్కిన భగత్‌సింగ్, సుఖదేవ్, రాజ్‌గురు అడుగు జాడల్లో మనందరం నడవాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రశేఖర్ అజాద్, అల్లూరి సీతారామరాజు, బాలగంగాధర తిలక్ లాంటి గొప్ప మహానుభావులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి స్వాతంత్య్రం తీసుకువచ్చారన్నారు. అయితే దేశానికి తామే స్వాతంత్య్రం తీసుకువచ్చినట్లు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు గొప్పలకు పోతున్నాయన్నారు. బీజేపీ, ఆర్ఎస్ నేతలు కుల, మతాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుకుంటున్నారన్నారు. హామీలు అమలులో చంద్రబాబు విఫలం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు గ్యారెంటీలను అంతో, ఇంతో అమలు చేస్తోందన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ఏపీ సీఎం చంద్రబాబు అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు. హామీలు అమలు చేయకపోతే చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని అన్నారు. అంతకు ముందు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతపురం సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్,కర్ణాటక సీపీఐ నాయకులు నాగభూషణ, ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు లెనిన్‌బాబు,గోపాల్ పాల్గొన్నారు. భగత్‌సింగ్, సుఖదేవ్, రాజ్‌గురు అడుగుజాడల్లో నడవాలి ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ -
భగత్‌సింగ్ ఆశయ సాధనకు కృషి
రాయచూరు రూరల్ : ఏఐడీవైఓ, ఏఐడీఎస్ఓ, ఏఐఎమ్ఎస్ఎస్ల ఆధ్వర్యంలో శనివారం భగత్‌సింగ్ ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించారు. భగత సింగ్ సర్కిల్ వద్ద ఆయన చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో అసువులుబాసిన భగత్‌సింగ్ నడిచిన బాట అందరికీ ఆదర్శమన్నారు. భగత్‌సింగ్ ఆశయాలను, ఆదర్శాలను అలవర్చుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు చిత్ర లేఖనం పోటీలు నిర్వహించారు. సరోజ, చెన్న బసవ పాల్గొన్నారు. బళ్లారిఅర్బన్: అమరులైన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుకదేవ్ ఆశయాలను కొనసాగించాలని వక్తలు అన్నారు. బీమ్స్ మైదానం, మున్సిపల్ మైదానం, సొంత లింగన్నపార్క్తో పాటు వివిధ హాస్టల్, గ్రామాలలో ఆదివారం ఏర్పాటు చేసిన భగత్‌సింగ్ వర్ధంతి కార్యక్రమంలో ఏఐడీఎస్ఓ నేత సుభాష్ పాల్గొని మాట్లాడారు. భగత్‌సింగ్ స్ఫూర్తితో సామాజిక అసమానతలపై పోరాటం చేయాలన్నారు. ఏఐడీఎస్ఓ నేతలు కే.ఈరణ్ణ, ఎం.శాంతి.ఉమా, నిహారిక, అయిషా, శివు, కంబలి మంజునాథ్, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ మేళా నిరుద్యోగులకు వరం
హొసపేటె: ఉద్యోగ మేళాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని హుడా అధ్యక్షుడు హెచ్ఎన్ ఇమామ్ సూచించారు. విజయనగరం జిల్లా వాణిజ్య, పరిశ్రమల మండలి, ఐ.క్యూ.ఎ సంయుక్త ఆధ్వర్యంలో విజయనగర కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉపాధి కోసం తిరుగుతూ అలసిపోయేవారికి ఇలాంటి మేళాలు ఊరట కల్పిస్తాయన్నారు. అదే విధంగా, దేశాన్ని పీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కరం లభిస్తుంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ప్రయోజనం చేకూర్చాలని ఆయన పిలుపునిచ్చారు. వీరశైవ సంఘం అధ్యక్షులు కణేకల్ మహంతేష్, అరవింద్ పాటిల్, మల్లికార్జున ప్రిన్సిపల్ ప్రభు గౌడ, సంఘం నేతలు అశ్విని కొత్తంబరి, ప్రహ్లాద,, సైయద్ నిజాముద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
చిన్న పరిశ్రమల స్థాపనకు సౌలభ్యాలు
రాయచూరు రూరల్: నగరంలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు రావాలని కార్పొరేషన్ కమిషనర్ జుబిన్ మహపాత్రో కోరారు. నగరం లోని ప్రైవేటు హోటల్లో జిల్లా స్థాయి క్లస్టర్ కార్యక్రమాలను ఆయన పార్రంభించి మాట్లాడారు. రాయచూరులో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకర్లు సహకారం అందించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు సౌలభ్యాలు కల్పించడానికి కార్పొరేషన్ అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర చిన్న పరిశ్రమల సంఘం అధ్యక్షుడు రాజగోపాల్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కమల్ కుమార్, ఏజీఎం కుషాల్, రమేష్, సురేష్, జంబన్న పాల్గొన్నారు. -
మెగా వైద్య శిబిరం విజయవంతం
హుబ్లీ: ౖవెద్య శిబిరాలు ప్రజలకు వరమని, వీటిని రోగులు వినియోగించుకోవాలని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ సూచించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో బెళగావి జిల్లా సౌదత్తి తాలూకా మైదానంలో ఏర్పాటు చేసిన బృహత్ ఆరోగ్య మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యా, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. సౌదత్తి ప్రాంత ప్రజలకు అనుకూలంగా ఉండాలన్న ఉద్దేశంతో మేళను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఎంతో దూరం నుంచి వచ్చిౖ వెద్య సేవలు పొందారన్నారు. వైద్య శిబిరం విజయవంతమైందన్నారు. షుగర్, బీపీ బాధితులు జీవనశైలి మార్చుకొని ఆరోగ్యకరమైన జీవనం సాగించాలన్నారు. సౌదత్తిలో రూ.46 కోట్లతో మల్టిస్పెషలిటీ ఆస్పత్రి నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. రామదుర్గ, కిత్తూరులో అత్యుధునిక ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు హాజరై రోగులకు వైద్య సేవలు అందించారు. -
ఆక్రమణల తొలగింపునకు చర్యలు
రాయచూరురూరల్: నగరంలో ఆక్రమణల తొలగించేందుకు చర్యలు చేపడుతామని కార్పొరేషన్ కమిషనర్ జుబిన్ మోహోపాత్రే తెలిపారు. శనివారం ఆయన ఎస్పీ పుట్ట మాదయ్యతో కలిసి నగరంలో పర్యటించారు. తీన్ కందిల్, మహవీర్ సర్కిల్, స్టేషన్ రహదారి, అంబేడ్కర్ సర్కిల్, షరాప్ బజార్, ఉస్మానియా మార్కెట్, పటేల్ రహదారి, సిటీ టాకీస్ రోడ్, టిప్పు సుల్తాన్ రహదారి, పబ్లిక్ ఉద్యానవనం ప్రాంతాల్లోని ఆక్రమణలను పరిశీలించారు. రంజాన్, ఉగాది అనంతరం ఆక్రమణలు తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. డీఎస్పీ సత్యనారాయణ, సీఐ ఉమేష్ కాంబ్లే పాల్గొన్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేయాలిరాయచూరు రూరల్: నగరంలోని ఈద్గా మైదానంలో అభివృద్ధి పనులు త్వరితిగతిన పూర్తి చేయాలని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ అధికారులకు సూచించారు. నగరంలోని యక్లాసపూర రహదారిలో 4 ఏకరాల స్థలంలో నిర్మాణాలు చేపట్టిన పనులను ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. కొనసాగుతున్న విచారణరాయచూరు రూరల్: గోకాక్ మహాలక్ష్మి సహకార బ్యాంకు లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై బాగల్ కోటె జిల్లా జమఖండి బబలాది మఠాధిపతి సదాశివ ముత్యాల స్వామిజీని అరెస్ట్ చేసిన ధార్వాడ సీఐడీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. స్వామీజీ కుమారుడు, భార్య పేరుపై బ్యాంకు గుమస్తా సాగర్ సబకాళే రూ.80 లక్షలు జమ చేఽశారు. అదేవిధంగా బ్యాంకు పాలకమండలి సభ్యులు కోట్లాది రూపాయలు రుణాలుగా తీసుకున్నట్లు విచారణలో వెలుగు చూసింది. బాగల్ కోటె ఎస్పీ భీమా శంకర్ గుళేద్ మాట్లాడుతూ సీఐడీ అధికారుల విచారణ కొనసాగుతోందన్నారు. ఎయిమ్స్ ఏర్పాటుకు ఒత్తిడి తేవాలిరాయచూరురూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎయిమ్స్ పోరాట సమితి ప్రధాన సంచాలకుడు బసవరాజ్ కళస డిమాండ్ చేశారు. అదివారం ఢిల్లీలో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, కేంద్ర మంత్రి కుమారస్వామిలను భేటీ చేసి ఎయిమ్స్ ఆవశ్యకతను వివరించారు. సీఎం సిద్దరామయ్య, ప్రధాని మోదీలు ఎయిమ్స్ మంజూరులో రాయచూరు జిల్లా వాసులకు మొండి చేయి చూపారన్నారు. మరోమారు ప్రధాని దృష్టికి తీసుకెళ్లి ఎయిమ్స్ మంజూరు చేయించాలని కోరారు. చిక్క తిరుపతి ఆలయంలో పూజలు మాలూరు: తాలూకాలోని ప్రసిద్ద యాత్రా స్థలమైన చిక్కతిరుపతి గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి దేవాలయంలో ఆదివారం లోకాయుక్త రిజిస్ట్రార్ అన్నుగౌడ వి పాటిల్ విశేష పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు రవిస్వామి, గోపాలకృష్ణ భరద్వాజ్,, ఎన్ శ్రీధర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. తరువాత ఆయన కేజీఎఫ్ కోటిలింగ దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పూజల్లో దేవాలయ ఈఓ టి సెల్వమణి, పేష్కార్ సి చెలువస్వామి దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు. బాలుడిపై లైంగిక వేధింపులుహుబ్లీ: బాలుడిపై లైంగిక వేదింపులకు పాల్పడిన ఘటన పాత హుబ్లీలోని హెగ్గేరిలో ఆదివారం జరిగింది. సిరాజ్ ఉద్దీన్ ఎస్ (58) అనే వ్యక్తి బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి ఉడాయించాడు. బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పాత హుబ్లీ పోలీసులు సిరాద్ ఉద్దీన్‌పై కేసునమోదు చేసి కొన్ని గంటల్లోనే అరెస్ట్ చేసి కోర్టులో హజరు పరిచారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కూడేరు: అనంతపురం జిల్లా కూడేరు మండలం అరవకూరు మలుపు సమీపాన అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బళ్లారికి చెందిన లింగన్న, వండ్రప్పలు గాయపడ్డారు. వీరిద్దరూ ద్విచక్ర వాహనంలో అనంతపురం నుంచి సొంతూరికి వెళుతుండగా కుక్క అడ్డు రావడంతో అదుపు తప్పి కింద పడ్డారు. క్షతగాత్రులను కూడేరు ఆస్పత్రికి తరలించారు. -
సమాజానికి కొంత తిరిగి ఇవ్వాలి
హొసపేటె: మనం సంపాదించిన ఆస్తి, హోదా శాశ్వతంగా ఉండదని, కానీ నేర్చుకున్న జ్ఞానం మాత్రమే చివరి వరకు మీతో ఉంటుందని కొట్టూరు సంస్థాన మఠం శ్రీ జగద్గురు కొట్టూరు బసవలింగ స్వామి అభిప్రాయపడ్డారు. నగరంలోని ఉన్న ప్రతిష్టత విజయనగర కళాశాల పాత విద్యార్థులు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గురువందన, స్నేహ సమ్మిళన, ప్రతిభా కనబరిచిన పూర్వ విద్యార్థులకు సన్మానం కార్యక్రమంను స్వామీజీ ప్రారంభించి మాట్లాడారు. జీవితంలో ఒక లక్ష్యం, దిశానిర్దేం, గురువు ఆశీస్సులు ఉంటేనే విద్య ద్వారా సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందగలరని అన్నారు. నేడు సమాజంలో మనం మంచి స్థానాన్ని సాధించామంటే, దాని వెనుక ఈ సమాజంలోని ప్రతి ఒక్కరి కృషి ఉంటుందన్నారు. ఈ సమాజం నుంచి మనం పొందిన దానిలో కనీసం కొంతైన సమాజానికి తిరిగి ఇవ్వాలన్నారు. దీని ద్వారా అక్షరాలు నేర్పిన గురువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీరుతుందన్నారు. ఎమ్మెల్యే గణేష్, అన్నపూర్ణ, పాత విద్యార్థుల సంఘం అధ్యక్షులు పీ ఎన్ శ్రీపాద, వీవీ సంఘం నేతలు కణేకల్ మహంతేష్, ప్రిన్సిపాల్ ప్రభుగౌడ, కళాశాల పాలక మండలి అధ్యక్షుడు మల్లికార్జున మట్రి, ఉపాధ్యక్షుడు గోగ్గచెన్నబసవ గౌడ, పాత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
నాటక కళను బతికించుకోవాలి
రాయచూరు రూరల్: నాటక రంగానికి ప్రాణం పోయాలని కిల్లేబృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు సూచించారు. నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో స్ఫూర్తి నాట్య అకాడమీ ఏర్పాటు చేసిన సాంస్కతిక, నృత్య, గాన, సంగీతోత్సవాలను స్వామీజీ ప్రారంభించి మాట్లాడారు. చిన్నప్పటినుంచే కళలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. నాటక రంగాన్ని ఆదరించి భావితరాలకు అందిచాలన్నారు. అనంతరం కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో చంద్రశేఖర్, రాజా శ్రీనివాస్, సంగమేష్, జంగ్లప్ప గౌడ, పరిమళరెడ్డి, రేఖ, పుష్పావతి, మల్లికార్జున, దండెప్ప పాల్గొన్నారు. ఇద్దరు నర్సింగ్ విద్యార్థుల దుర్మరణం సాక్షి,బళ్లారి: చిత్రదుర్గం నగరంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. యాసిన్(22),అల్తాఫ్(22) అనే నర్సింగ్ విద్యార్థులు బైక్‌పై వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కేఎస్ఆర్టీసీ బస్సు ఢీ కొంది. తీవ్ర గాయాలతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాఫిక్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. దళితుల్లో చైతన్యం నింపిన సిద్దలింగయ్యరాయచూరు రూరల్: రాజ్యాగ నిర్మాత అంబేడ్కర్ బాటలో నడిచిన దివంగత సాహితీవేత్త డాక్టర్ సిద్దలింగయ్య జీవన విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కవి బాబు బండారిగల్ అన్నారు. సిద్దలింగయ్య జీవన విధానంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమన్వయ సమితి ఆదివారం నగరంలోని ఎన్జీఓ సభా భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దళితుల సమస్యలను తన బాధలుగా భావించిన సిద్దలింగయ్య తన సాహిత్యం ద్వారా దళితుల్లో చైతన్యం నింపారన్నారు. ఆయన జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. సమన్యయ సమితి అధ్యక్షుడు జిందప్ప, కార్యదర్శి సంతోస్, ఈరణ్ణ, అణ్ణప్ప మేటి, బషీర్ అహ్మద్ పాల్గొన్నారు. దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.74 లక్షలు బళ్లారిఅర్బన్: బళ్లారి శ్రీ కనకదుర్గమ్మ హుండీని లెక్కించినట్లు ఈఓ హనుమంతప్ప తెలిపారు. గత ఈ ఏడాది అక్టోబర్ 19 నుంచి ఈ నెల 21 వరకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.74,21,390 ఆదాయం లభించినట్లు తెలిపారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల మధ్య హుండీ లెక్కింపు జరిగిందన్నారు. గతంలో పోల్చుకుంటే ఈ సారి హుండీ ఆదాయం భారీగా పెరిగిందన్నారు. అయ్యప్ప స్వామి సేవా సమాజం జిల్లా శాఖప్రారంబళ్లారిటౌన్: నగరంలోని విద్యానగర్ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ శబరిమలై అయ్యప్ప సేవా సమాజం జిల్లా శాఖను కమ్మరిచెడు కళ్యాణ స్వామి చేతులు మీదుగా ప్రారంభించారు. జిల్లా శాఖ అధ్యక్షుడిగా రాంబాబు గురుస్వామిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు జయప్రకాష్, ఉపాధ్యక్షుడు సంపత్‌కుమార్, స్థానిక ఆలయం ట్రస్ట్ అధ్యక్షుడు వై.భాస్కర్, ఉపాధ్యక్షుడు బోయపాటి విష్ణు, గురుస్వాములు సురేష, దత్త, మోహన్, రంగారెడ్డి, బీమ్‌రెడ్డి, నాగేష్, రామ్‌రెడ్డి, యోగి, మంజు, చల్లారమేష్, శ్రీనాథ్, సునిల్, ఆనందచౌదరి తదితరులు పాల్గొన్నారు. -
ఒపెక్ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు
రాయచూరురూరల్ : ఒపెక్ ఆస్పత్రిలో రోగులకు ఆధునిక వైద్య సేవలు అందించేలా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నీతిష్ తెలిపారు. ఒపెక్ అస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలిసిస్ యంత్రాలను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కళ్యాణ కర్ణాటకతోపాటు ఏపీలోని పలు జిల్లాల రోగులకు ఈ ఆస్పత్రిలో వైద్యం అందుతోందన్నారు. గతంలో ఒపెక్‌లో వైద్య సేవలు అందలేదని రోగులు అసంతృప్తికి గురయ్యే వారన్నారు. ప్రస్తుతం రోగులకు అన్ని సౌలభ్యాలు కల్పించి మెరుగైన వైద్యం అందజేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. క్యాన్సర్, కార్డియాలజీ, పీడియాట్రిక్, ప్లాస్టిక్ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, గ్యాస్టో సర్జికల్, మెడికల్ గ్యాస్ట్రో. పైకో మ్యాక్సిలరీ సర్జరీ సేవలను పునరుద్ధరించినట్లు తెలిపారు. వైద్య సేవలను రోగులు వినియోగించుకోవాలన్నారు. ఆస్పత్రి ప్రత్యేక అధికారి డాక్టర్ రమేష్ సాగర్, డాక్టర్ రమేష్, విజయ శంకర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎడమ కాలువకు ఏప్రిల్ 10 వరకు నీరు
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ 10 వరకు నీరందిస్తామని కొప్పళ జిల్లా ఇంచార్జి, కన్నడ సంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి వెల్లడించారు. శుక్రవారం బెంగళూరులోని వికాససౌధలో జరిగిన తుంగభద్ర ఐసీసీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడగారు. తాగు, సాగునీటి వినియోగంలో అదికారులు నియమాలను పాటించి రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ప్రస్తుతం జలాశయంలో 18 టీఎంసీల నీరు ఉండగా డెడ్ స్టోరేజీ 2 టీఎంసీలను మినహాయించాలన్నారు. కర్ణాటక రాష్ట్ర వాటా 11 టీఎంసీలు, ఆంధ్రపదేశ్ వాటా 4 టీఎంసీలుగా నిర్ణయించారన్నారు. ఎడమ కాలువలకు ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీ వరకు 3000 క్యూసెక్కులు, విజయనగర కాలువకు ఏప్రిల్ 11 నుంచి మే 10 వరకు 150 క్యూసెక్కులు, రాయ బసవణ్ణ కాలువకు ఏప్రిల్ 11 నుంచి మే 10 వరకు 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తారన్నారు. చెరువులను నీటితో నింపి వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో మంత్రులు జమీర్ అహ్మద్, శరణ ప్రకాష్ పాటిల్, శాసన సభ్యులు హంపనగౌడ బాదర్లి, నాగేంద్ర, గవియప్ప, నాగరాజ్, గణేష్, బసనగౌడ బాదర్లి, బసన గౌడ తుర్విహాళ, వసంత్ కుమారలున్నారు. రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలకు అధిక ప్రాధాన్యత కొప్పళ జిల్లా ఇంచార్జి, కన్నడ సంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి -
బబలాది సదాశివప్ప స్వామీజీ అరెస్ట్
రాయచూరు రూరల్: కాల జ్ఞానం చెప్పడంలో అందె వేసిన చెయ్యి, ఉత్త్తర, కళ్యాణ కర్ణాటకలో ప్రసిద్ది చెందిన బబలాది మఠాధిపతి సదాశివ ముత్యాల స్వామీజీని ధార్వాడ నుంచి వచ్చిన నలుగురు సీఐడీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. బాగల్కోటె జిల్లా జమఖండిలో నూతనంగా నిర్మించుకున్న మఠాధిపతి సదాశివ ముత్యా స్వామీజీకి ఆపద ఎదురైంది. గోకాక్ మహాలక్ష్మి సహకార బ్యాంక్‌లో లావాదేవీల విషయంలో స్వామీజీ ఖాతాలోకి రూ.60 లక్షల్లో వ్యవహారాలు సాగించారు. స్వామీజీ కుమారుడు, భార్య పేరు మీద సాగర్ సబకాళే వారి ఖాతాలోకి జమ చేఽశారు. గోకాక్ మహాలక్ష్మి సహకార బ్యాంక్‌లో సాగర్ సబకాళే ప్యూన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సాగర్ సబకాళేతో పాటు పాలక మండటి సభ్యులు మరి కొంత మంది కలసి బ్యాంక్ నుంచి రూ.కోట్లాది మేర నిధులను వాడుకున్నారు. బ్యాంకులో రూ.76 కోట్ల మేర అప్పులు తీసుకుని తిరిగి చెల్లించక పోవడంతో ఆర్బీఐ అధికారులు నివ్వెర పోయారు. మూడేళ్లుగా బ్యాంక్‌లో అవ్యవహారాలు మూడేళ్ల ఆడిట్‌ను పరిశీలించిన ఆర్బీఐ అధికారులు నాటి నుంచి బ్యాంక్‌లో అవ్యవహారాలు జరిగినట్లు నివేదిక ఇచ్చారు. బ్యాంక్ నిధుల నుంచి గోకాక్, హుబ్లీ, బెళగావిలో స్థలాలు కొనుగోలు చేశారు. దీనిపై కేసు నమోదు చేయడంతో అందరి జాతకాలు బయట పడ్డాయి. రాష్ట్రంలో పేరు గాంచిన పురాతన మఠం విజయపుర జిల్లా బబలాది సదాశివప్ప ముత్యాది ఒకటి కాగా రెండోది మూడు నెలల క్రితం బాగల్కోటె జిల్లా జమఖండిలో నూతనంగా నిర్మించుకున్న మఠాధిపతి సదాశివ ముత్యాది. ఈ స్వామీజీని పోలీసులు అరెస్టు చేశారు. గోకాక్ మహాలక్ష్మి సహకార బ్యాంక్‌లో రూ.35 వేల కోట్ల టర్నోవర్‌లో రూ.76 కోట్ల అవినీతికి పాల్పడిన వ్యవహారంలో సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 70 శాతం మందికి బ్యాంక్ యజమాని, శాసన సభ్యుడు సతీష్ జార్కిహోళి వినియోగదారులకు తిరిగి డబ్బులను వాపస్ ఇచ్చారు. రూ.76 కోట్ల నిధుల వంచన కేసు సీఐడీ అధికారుల సమగ్ర తనిఖీ సహకార బ్యాంక్‌లో లావాదేవీలు -
ఆకతాయిలపై చర్యకు డిమాండ్
సాక్షి,బళ్లారి: బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు తాగడం నేరమని ఆదేశాలు ఉన్నా కొందరు సిగరెట్లు తాగడం ఫ్యాషన్‌గా మార్చుకోవడంతో మహిళలు ఉన్న ప్రాంతాల్లో దగ్గరగా వెళ్లి సిగరెట్ తాగుతూ వారి ముఖం మీదకు కొందరు యువకులు పొగ వదలడం కొప్పళ జిల్లా గంగావతిలో కలకలం సృషించింది. అక్కడ వాయువిహారానికి వెళ్లిన మహిళల ముఖాలపైకి కొందరు ఆకతాయిలు సిగరెట్ తాగి పొగ వచ్చేలా చేయడంతో సదరు మహిళలు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తూ యువకులపై తీవ్రంగా మండిపడ్డారు. దీంతో సిగరెట్ తాగిన యువకులు తమ సిగరెట్ తమ ఇష్టమని, రోడ్లలో సిగరెట్ తాగితే తప్పేముందని బుకాయించడంతో పాటు మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటంతో మరింత ఆగ్రహానికి గురి చేసింది. దీంతో శుక్రవారం గంగావతిలోని కువెంపు నగర్, జయగనర్, మాళమల్లేశ్వర తదితర కాలనీలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కాలనీల్లో తాము వాకింగ్ చేస్తున్న సమయంలో సిగరెట్ తాగుతూ తమ మీదకు పొగ వచ్చేలా చేశారని, అడ్డు చెబితే అసభ్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. తమ డబ్బులతో తాము సిగరెట్లు తాగుతున్నామని బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీ కావడంతో పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు తాగకూడదని, మరొకరికి ఇబ్బంది కలిగించే విధంగా సిగరెట్ తాగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కుల మత తారతమ్యాలు వద్దురాయచూరు రూరల్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకు పోతున్న నేటి సమాజంలో కుల, మత తారతమ్యాలను వీడాలని సీనియర్ సాహితీవేత్త మూడ్నాకూడు చిన్నస్వామి అభిప్రాయ పడ్డారు. శనివారం కన్నడ భవన ంలో కీర్తన ప్రకాశన అనిల్ పొన్నరాజ్ ఆధ్వర్యంలో తలెమారు అనే కన్నడ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. శతాబ్దాల తరబడి అణగారిన వర్గాల వ్యక్తులు తమ జీవితాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి పుస్తకంలో నొక్కి వక్కాణించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న అంటరానితనం నిర్మూలనపై ముమ్మర ప్రచారం అవసరమన్నారు. సమావేశంలో వెంకటేష్ బేవినబెంచి, ఈరణ్ణలున్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలిహుబ్లీ: ప్రస్తుతం మారుతున్న సమాజంలో మహిళలకు లభించిన అన్ని అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకొని ముందంజలో సాగుతూ అన్ని రంగాలలో విశిష్ట సాధన చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా కౌశల్య అభివృద్ధి అధికారి దేవేంద్ర జబేరి తెలిపారు. జిల్లా కౌసల్య అభివృద్ధి శాఖ అళ్నావర పట్టణ పంచాయతీ దీనదయాళ్ అంత్యోదయ జాతీయ నగర జోవనోపాధి అభియాన్ పథకం ద్వారా స్వచ్ఛంద గ్రూప్‌ల సహకారంతో అళ్నావర వీరశైవ కళ్యాణమంటపంలో ఏర్పాటు చేసిన రెడీమేడ్ తయారీ ఎగుమతుల యూనిట్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ శిక్షణ ఉద్యోగమేళా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మహిళలకు ఉద్యోగాలు కల్పించే వ్యవస్థ ఏర్పడాలి. ధార్వాడ రాయాపుర వద్ద గార్మెంట్ యూనిట్లో ఈ ప్రాంతం నుంచి సుమారు 300 మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్వావలంబన సాధించాలన్నారు. సాహి ఎగుమతుల అధికారి దేవరెడ్డి హర్లాపుర, పట్టణ పంచాయతీ ముఖ్యాధికారి ప్రకాశ ముగ్ధం, మాజీ అధ్యక్షురాలు సువర్ణ, రేష్మి, రవి మునవళ్లి, సుమా, రవీంద్ర, శ్వేత పాల్గొన్నారు. విద్యాభివృద్ధికి సహకారం అవసరం రాయచూరు రూరల్: గ్రామాల్లో విద్యాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని బసవ పూర్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శరణ బసవ పాటిల్ పేర్కొన్నారు. శనివారం ఆశాపూర్లో విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడానికి, విద్యార్థులు ఉన్నత విద్యను పొందడానికి తమ వంతు పాటు పడాలన్నారు. ప్రతి ఒక్కరూ విద్యాభ్యాసంపై శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో అమరేష్ పాటిల్, తిమ్మప్ప, రవిలున్నారు. మహిళల పైకి సిగరెట్ పొగ వదిలిన యువకులు గంగావతిలో నిరసన, పోలీసులకు ఫిర్యాదు -
ఉపకార వేతనాల రద్దు తగదు
బళ్లారిఅర్బన్: పాలక మండలి కోటాలో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉన్నఫళంగా ఉపకార వేతనాలను రద్దు చేయడం తగదని విద్యార్థులు వాపోయారు. ఈ మేరకు జిల్లాధికారికి నగరంలో వినతిపత్రం సమర్పించి సమస్యను పరిష్కరించాలని సీఎంను కోరారు. 2018–19వ సంవత్సరం నుంచి పాలక మండలి కోటాలో ఎంపికై న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేయక పోవడంతో ఉన్నత విద్యాభ్యాసానికి ఆటంకం కలిగిందన్నారు. దీంతో అర్థంతరంగా చదువుకు దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రభుత్వం సదరు నిధులను ఇతర శాఖలకు మళ్లించడం తగదని ఏకలవ్య సేన జిల్లా శాఖ ఆరోపించింది. ఒక వేళ ఆ విషయంలో తమకు న్యాయం జరగకపోతే తీవ్రమైన పోరాటం చేస్తామని ఆ సంఘం నేతలు హెచ్చరించారు. మేకెదాటు కోసం కరవే పాదయాత్ర బళ్లారిఅర్బన్: రాష్ట్రంలోని తుమకూరు, చిక్కబళ్లాపుర, దొడ్డబళ్లాపుర, కోలారు, బెంగళూరు గ్రామీణ జిల్లాలకు తాగునీరు అందించే ప్రభుత్వ కీలక పథకం మేకెదాటు పథకాన్ని సత్వరం ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రామనగర నుంచి బెంగళూరు విధానసౌధకు నిర్వహించిన పాదయాత్రలో కర్ణాటక రక్షణ వేదిక(కరవే) ప్రవీణ్‌శెట్టి వర్గం పాదయాత్ర చేపట్టింది. వారికి మద్దతుగా కరవే బళ్లారి జిల్లా శాఖ హులుగప్ప సారథ్యంలో 500 మందికి పైగా కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వెంకటేష్, అసుండి సూరి, కే.ఆనంద్, వీ.వెంకటేష్, చంద్రారెడ్డి, వీరారెడ్డి, హనుమేష్ కే.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం హుబ్లీ: జైన్ అకాడమి 20వ వార్షికోత్సవం సందర్భంగా ఐఏఎస్, కేఏఎస్, గ్రూప్ సీ, ఎస్ఐ, బ్యాంకింగ్, రైల్వే ఉద్యోగాలకు సంబంధించి ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీనికి సాధారణ ప్రవేశం కల్పిస్తున్నామని ఆ మేరకు దరఖాస్తులను ఆహ్వానించారు. బెంగళూరు, ధార్వాడ కేంద్రాల్లో ఒక్కో కేంద్రంలో 100 మందికి చొప్పున శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 25 వరకు దరఖాస్తు స్వీకరణకు గడువు ఉంది. మరిన్ని వివరాలకు 7676167901 నంబరులో సంప్రదించాలని ఆ అకాడమి డైరెక్టర్ ఓ ప్రకటనలో కోరారు. బాల కార్మికులకు విముక్తిరాయచూరు రూరల్: జిల్లాలో బాల కార్మికుల నియంత్రణకు శనివారం పోలీస్, కార్మిక శాఖల ఆధ్వర్యంలో అధికారులు దాడి జరిపారు. దేవదుర్గ తాలూకాకు వివిధ ప్రాంతాల నుంచి పత్తి, వరి, ఇతర పంటల కోతకు ఐదు వాహనాల్లో బాల కార్మికులను వ్యవసాయ పనులకు తీసుకెళుతుండగా ఆ వాహనాలను అడ్డుకొని 15 మంది బాలలకు విముక్తి కల్గించారు. దాడిలో బాల కార్మిక శాఖ అధికారి మంజునాథరెడ్డి, అధికారులు రాకేష్, రాజనగౌడ, వెంకటేష్, శివకుమార్లున్నారు. శ్రీశైలం బస్సులు కిటకిటరాయచూరు రూరల్: ఉగాది పండుగ సమీపిస్తున్నందున రాయచూరు నుంచి శ్రీశైలం వెళ్లే బస్సులు కిటకిటలాడుతున్నాయి. సాధారణ రోజుల్లో కన్నా ప్రస్తుతం శ్రీశైలం వెళ్లే భక్తుల సంఖ్య క్రమంగా పెరగడంతో బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు వెంపర్లాడుతున్నారు. ఈనేపథ్యంలో రాయచూరు, మాన్వి, సింధనూరు, దేవదుర్గ, మస్కి, లింగసూగూరు డిపోల నుంచి ప్రతి గంటకు అదనపు బస్సులను నడుతుపున్నా భక్తులు సీట్ల కోసం ఎగబడుతున్నారు. కర్ణాటకలోని బాగల్కోటె, విజయపుర,బ బెళగావి తదితర జిల్లాల నుంచి వెళ్లే భక్త సమూహానికి అనుకూలం కోసం ఏప్రిల్ 1వ తేదీ వరకు 15 రోజుల పాటు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు కళ్యాణ కర్ణాటక ఆర్టీసీ అధికారులు తెలిపారు.