Top Stories
ప్రధాన వార్తలు

వేదనలో రాజ్యం... వేడుకలో రాజధాని!
‘‘ఠండా మతలబ్ కోకాకోలా...’’ ఇండియాలో బాగా పాపులరయిన వాణిజ్య ప్రకటనల్లో ఒకటి. మరి కోకాకోలా మతలబు? రెండొందల మిల్లీలీటర్ల కోక్ తయారు చేయడానికి గరిష్ఠంగా యాభై పైసలు ఖర్చవుతాయని మార్కెట్ టాక్. పది పైసల కంటే ఎక్కువ కాదనే వాళ్లు కూడా ఉన్నారు. కానీ మనం గరిష్ఠాన్నే లెక్కేసుకుందాం. దానికి పదింతలు ఎక్కువ ఖర్చు పెట్టి మార్కెటింగ్ నైపుణ్యాన్ని జోడిస్తారు. వినియోగదారుకు ఇరవై రూపాయలకు అమ్ముతారు. రవాణా ఖర్చులు, కమీషన్లు తీసేసినా మినిమమ్ నూటా యాభై శాతం లాభాలు కంపెనీ గల్లా పెట్టెలో పడతాయి. దీన్నే బ్రాండ్ బిల్డింగ్, మార్కెటింగ్ టెక్నిక్ వంటి పేర్లతో ఘనంగా చెప్పుకుంటారు.ఈ ధోరణి రాజకీయాల్లోకి, ప్రభుత్వ పాలనలోకి కూడా దిగుమతయింది. ఇందులో ఉద్దండులైన ఇద్దరు అగ్ర నాయ కులు నిన్న ఉద్దండరాయునిపాలెం సమీపంలో అమరావతి బ్రాండ్ షూటింగ్‌ను పునఃపునఃప్రారంభించారు. ప్రధాని సంగతి తెలిసిందే. భారతీయ వ్యాపార రంగంలో ఆరితేరిన వారైన గుజరాతీల ముద్దుబిడ్డ. అంతటా దొరికే వస్తువుపై కూడా అరుదైన సరుకుగా ముద్రవేసి అమ్మగల నేర్పరులు వారు. లేకపోతే, ఓ పిడికెడు మంది మినహా సమస్త ప్రజల్లో ఉండే సహజ లక్షణాలైన దేశభక్తి, దైవభక్తి వంటి అంశాలపై కూడా తమకే పేటెంట్ హక్కులున్నాయని ఎలా ప్రకటించు కోగలరు?ఏపీ ముఖ్యమంత్రి కూడా ప్రధానికి దీటైనవారే. నిజం చెప్పాలంటే కొంచెం ఎక్కువ కూడా! మీడియా ప్రచారంతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదగవచ్చన్న కిటుకును ఆయన తొలి రోజుల్లోనే కనిపెట్టారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద, సెల్ఫోన్ల మీదా తనకే పేటెంట్ దక్కాలని చిరకాలంగా ఆయన పోరాటం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి అమరావతి షోలో పాల్గొని అమరా వతి బ్రాండ్ వ్యాల్యూ పెంచే ప్రయత్నాన్ని చేశారు. ఈ షో జరగడానికి ముందునుంచే అమరావతి ప్రమోషన్ కార్యక్రమాన్ని ఏకసూత్ర పథకంగా భావించి, పరిపాలన సైతం పక్కన పెట్టి చంద్రబాబు ప్రయాసపడుతున్నారు. అప్పిచ్చువాడి కోసం డప్పు కొడుతూనే ఉన్నారు. ప్రపంచబ్యాంకూ, మరో రెండు సంస్థలూ 31 వేల కోట్ల షరతులతో కూడిన అప్పును మంజూరు చేసిన వెంటనే 47 వేల కోట్లకు టెండర్లను పిలవనే పిలిచారు. ఇందులో భారీ కమీషన్ల కోసం అంచనాలను అసహజంగా పెంచేశారన్న విమర్శలు వినిపించాయి.ఇందులో చాలా పనులకు ఏడేళ్ల కింద కూడా టెండర్లను పిలిచారు. అప్పటి అంచనా వ్యయానికీ, ప్రస్తుతానికీ పోలికే లేదు. ఒక్క సెక్రటేరియట్ టవర్ల అంచనాయే నూరు శాతం పెరిగింది. 2018లో సెక్రటేరియట్ నాలుగు టవర్లూ, సీఎం కార్యాలయానికి కలిపి అంచనా వ్యయం 2,271 కోట్లుంటే ఇప్పుడది 4,688 కోట్లకు ఎగబాకింది. ఏడేళ్లలో నూరు శాతం ద్రవ్యోల్బణం పెరిగిందా? నిర్మాణ రంగంలో ప్రధాన పద్దులైన సిమెంటు, ఇనుము ధరలు పెరక్కపోగా అంతో ఇంతో తగ్గాయని మార్కెట్ సమాచారం. అమరావతి బ్రాండ్ బాజా మిరు మిట్లలో ఇటువంటి వాస్తవాలు మరుగున పడిపోవాలని పాల కుల ఉద్దేశం కావచ్చు.అమరావతి కాసుల వేటలో పడి ప్రజాపాలనను పడకేయించిన పర్యవసానం ఎలా ఉన్నదో మచ్చుకు ఒక సన్నివేశాన్ని పరిశీలిద్దాం. రైతు పండించిన పంటలకు మార్కెట్లో పలికిన ధరలేమిటో ఒకసారి గమనించండి. మిరపకు జగన్ పాలనలో పలికిన సగటు ధర 24 వేల రూపాయలైతే, ఇప్పుడు 6,500. పత్తికి నాడు 10,500 పలికితే నేటి సగటు ధర 4,900. కందులు నాడు 11 వేలు, నేడు 5,850. పసుపు, మినుము, పెసలు, శనగలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, పొగాకు, చీనీపండ్లు, అరటి, బొప్పాయి, టమాటా, ఉల్లి... ఇలా ఏ వ్యవసాయిక ఉత్పత్తినైనా తీసుకొని పరిశీలించండి. ఒకే రకమైన రాజధాని పనులకు ఏడేళ్ల కాలంలో కాంట్రాక్టర్లకు ఇస్తున్న సొమ్ము నూరు శాతం ఎట్లా పెరిగింది? ఆరుగాలం కష్టించిన రైతన్నకు లభిస్తున్న ధర ఏడాది కాలంలోనే నూరు శాతం ఎట్లా పడి పోయింది? ఇదేమి రాజ్యం? అదేమి రాజధాని? పైగా అది ప్రజా రాజధానట! జన జీవితాల మీద ఇంతకంటే క్రూరమైన పరిహాసం ఇంకొకటి ఉంటుందా?ఈ రాజధాని నిర్మాణానికి అర్జెంటుగా ఇంకో 47 వేల కోట్లు కావాలట! మరో 44 వేల ఎకరాలు సమీకరించాలట! అప్పుడు గానీ ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాదట! పనుల పునఃప్రారంభం నాటికే రాష్ట్ర వ్యవసాయ రంగం వెన్ను విరిగింది. ఆ పనులన్నీ కొలిక్కి వస్తే ఇంకెన్ని దారుణాలు చూడాలో! గిట్టుబాటు ధర లేకపోవడం ఒక్కటే కాదు. రైతు కుటుంబాల మీద ఏడాది పొడుగునా పిడుగులే కురుస్తున్నాయి. రైతు భరోసా లేదు. అప్పిచ్చువాడి గడప తొక్కక తప్పలేదు. పంటల బీమా లేదు. దేవుడి మీదే భారం. ఇన్పుట్ సబ్సిడీ, కరువు సాయం బకాయీల ఊసెత్తితే ఒట్టు. ఆర్బీకేలు అలంకార ప్రాయంగా మారి ఆసరా ఇవ్వడం లేదు. ఒక్క అమరావతి కలవరింత తప్ప, సాధారణ పరిపాలనపైన కూడా ఈ ప్రభుత్వం పట్టు కోల్పో యింది. విజయవాడ వరదలు, తిరుపతి తొక్కిసలాట, సింహా చలం దుర్ఘటన వగైరాలు పాలనా వైఫల్యానికి నిదర్శనాలు.అదే రాష్ట్రం, అవే వనరులు, అదే ఆదాయం. ఏ ఖర్చయినా అందులోంచే పెట్టాలి. ఏ అప్పయినా అందులోంచే చెల్లించాలి. లేదంటే మరిన్ని అప్పులు చేయాలి. ఎన్నికల ముందు చంద్ర బాబు హామీ ఇచ్చిన అద్భుతం ఆవిష్కృతం కాలేదు. సంపద సృష్టి జరగలేదు. ఎప్పుడు సృష్టిస్తారో కూడా చెప్పడం లేదు. రాజధాని మీద లక్ష కోట్ల దాకా ఖర్చు పెట్టాలని చెబుతున్నారు. ఆ ఖర్చుకు అప్పులే మార్గం. ఉన్న ఆదాయ వనరుల్లోంచే ఈ అప్పులు తీర్చాలి. అమరావతే తన అప్పుల్ని తీర్చుకుంటుందని మొదట్లో ఊదరగొట్టారు. ఎన్ని వేల ఎకరాలను అభివృద్ధి చేసి అమ్మితే అంత అప్పును తీర్చాలి? అన్ని వేల ఎకరాలను ఎగబడి కొనేందుకు ఎవరు ముందుకొస్తారు? ఇది జరగడానికి ఎన్ని పుష్కరాలు పడుతుంది? ఇటువంటి సందేహాలకు సమాధానా లేవీ ఇంతవరకు రాలేదు.ఈలోగా ఒక్క ఏడాదిలోనే వ్యవసాయ రంగం కుదేలైంది. రాజధాని కోసం భూములను ‘త్యాగం’ చేసిన 28 వేల మంది రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లయినా దక్కుతాయని చెబు తున్నారు. కానీ, అమరావతి పేరుతో ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్న రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతుల త్యాగానికి ఎవరు వెల కట్టాలి? వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న ఎం.ఎస్. ఎం.ఈ. రంగంలో ఈ సంవత్సరం 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారని పార్లమెంటుకిచ్చిన సమా ధానంలో కేంద్రం తెలియజేసింది. ఈ లెక్కన అమరావతి నిర్మాణం కోసం ఇంకెన్ని సెక్షన్లు బలవ్వాలి? ఎంత విధ్వంసం జరగాలి? ‘‘మా కండలు పిండిన నెత్తురు, మీ పెండ్లికి చిలికిన అత్తరు’’ అన్నాడు ఒక కవి. అమరావతి కోసం ఆంధ్రదేశమంతా ఈ పాట పాడుకోవాలేమో?శుభమా అని రాజధాని పనులు ప్రారంభిస్తుంటే ఈ కుశంకలేమిటనే వారు లేకపోలేదు. కుశంకలు కావు, వాస్తవాల పునా దులపై తలెత్తుతున్న సందేహాలు ఇవి. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, ఇల్లాలు ఏడ్చిన ఇల్లు బాగుపడవంటారు. రైతు ఇప్పుడు దుఃఖిస్తున్నాడు అన్నది ఒక వాస్తవం. రాష్ట్రంలోని మహిళలకు ‘సూపర్ సిక్స్’ పేరుతో పాలక కూటమి ఎన్నో ఆశలు పెట్టిందన్నది ఒక వాస్తవం. ఏడాది తర్వాత కూడా వారి ఆశలు అడియాసలుగానే మిగిలాయన్నది ఒక వాస్తవం. సంపద సృష్టి పేరు చెప్పి ఎడాపెడా అప్పులతో రాష్ట్రాన్ని ఊబి లోకి తోస్తున్న మాట వాస్తవం. ఈ అప్పుల ఊబి నుంచి బయట పడే మార్గం ఏమిటో ఇప్పటిదాకా ప్రభుత్వం విడమరచి చెప్ప లేకపోయిన మాట కూడా వాస్తవం.రమారమి 500 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిన్న అమరా వతిలో ‘పునరపి జననం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రిని తీసుకొచ్చి పొగడ్తల్లో ముంచారు. స్తోత్రకై వారాలు గావించారు. ఈ దేశ ప్రధానిని గౌరవించడం తప్పేమీ కాదు. గౌరవించాలి కూడా! అదే సందర్భంలో రాష్ట్ర ముఖ్య మంత్రి కూడా రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలబడాలి. తమ నాయకుడు సాగిలపడ్డంత పనిచేయడాన్ని, నంగి నంగి మాట్లాడటాన్ని ప్రజలు హర్షించరు. బిల్లు మంజూరు చేసే అధి కారి తనిఖీకి వచ్చినప్పుడు చిన్నపాటి కాంట్రాక్టర్లు వ్యవహరించినట్టుగా బాడీ లాంగ్వేజ్ ఉండకూడదు. బహిరంగ సభల్లో బీజేపీ నాయకులు జనం చేత మూడుసార్లు ‘వందేమాతరం’ అనిపించడం చాలాకాలంగా వస్తున్న సంప్రదాయం. ఆ దీక్షను కూడా చంద్రబాబు ఈ సభలో స్వీకరించారు. నిజానికి తెలుగు దేశం పార్టీలో ఈ ఆచారం లేదు.ఆరేళ్ల క్రింద నరేంద్ర మోదీని ఉద్దేశించి చంద్రబాబు చేసిన విపరీత విమర్శలు చాలామందికి ఇంకా గుర్తున్నాయి. కానీ, అటువంటిదేమీ జరగనట్టుగానే సభలో ఆయన ప్రవర్తన కనిపించింది. సాధారణంగా ఐటీ రంగానికి సంబంధించినంత వరకు ఘనత అంతా తనకే దక్కాలని కోరుకుంటారు. దాన్ని ఇంకెవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. కానీ ఆశ్చర్యకరంగా నిన్నటి సభలో ‘‘టెక్నాలజీ అంటే మోదీ, మోదీ అంటే టెక్నాలజీ’’ అని పొగిడేశారు. ఈ భజన కార్యక్రమం వెనుకనున్న ఉద్దేశం ఏమిటో గాని ప్రధాని మాట్లాడుతున్నప్పుడు అమరావతి కోసం అదనంగా తానేం చేస్తానన్నది మాత్రం చెప్పలేదు. చంద్రబాబు పొగడ్తలకు పొగడ్తలతోనే ఆయన సమాధానం చెప్పారు. మొదటి ప్రారంభానికి వచ్చినప్పుడు మట్టి–నీళ్లు తెచ్చిన ప్రధాని, ఈసారి పవన్ కల్యాణ్‌కు మాత్రమే ఒక చాక్లెట్ తీసుకువచ్చారు.ఏదో వ్యూహం ప్రకారమే లోకేశ్‌తో ఈ సభలో మాట్లాడించి నట్టుగా కనిపించింది. తన కుమారుడికి మోదీ ఆశీస్సులు లభించవలసిన సమయం ఆసన్నమైందని బాబు భావిస్తుండవచ్చు. ప్రసంగం ప్రారంభానికి ముందు లోకేశ్ ‘నమో నమః’ అంటూ మూడుసార్లు సంబోధించారు. ఆ నమస్కారం మోదీ కోసమే అనే సంగతి ఆయనకు అర్థమైందో లేదోనన్న అనుమానం కలిగి నట్టుంది. మోదీని గురించి చెప్పాల్సిన ప్రతి చోట ‘నమో గారు, నమో గారు’ అంటూనే మాట్లాడారు. ‘‘వంద పాకిస్తాన్‌లు దండెత్తి వచ్చినా నమో మిస్సైల్ ముందు బలాదూర్’’ అన్నారు. ప్రధాన మంత్రిని లోకేశ్ పొగుడుతున్నంతసేపు చంద్రబాబు ఉత్కంఠగా కనిపించారు. లోకేశ్ పొగడ్తలు ప్రధానికి అర్థమవుతున్నాయో లేదో తెలుసుకోవాలన్న కుతూహలం ఆయన మోములో కనిపించింది. అనూహ్యంగా ఆయన చాలాసార్లు చిరునవ్వులు చిందించారు. ఇటువంటి సైడ్ లైట్స్ తప్ప ఈ సభ గురించి చెప్పు కోవడానికి ఇంకో విశేషం లేదు. అమరావతికి బ్రాండ్ వ్యాల్యూ పెంచడానికి జరిగిన ఒక ఈవెంట్‌గా మాత్రమే ఇది చరిత్రలో మిగిలిపోతుంది. రాజ్యమంతటా ఆవేదన అలుముకుంటున్న వేళ వేడుకలు చేసుకున్న రాజధానిగా కూడా చరిత్రలో అమరా వతి స్థానం సంపాదించుకుంటుంది.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com

చంద్రబాబూ.. రైతుల గోడు వినిపించడం లేదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతుల ఆందోళనలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా? అని ప్రశ్నించారు. జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు.. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం ధర్మమేనా?మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారు. పైగా డ్రామాలతో ఆ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా?మిర్చి విషయంలో కూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా, నాఫెడ్ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. క్వింటాలు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కాని, ఒక్క ఎకరాకు సంబంధించి కాని, ఒక్క క్వింటాల్ గాని కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు. మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7, 796 కోట్లు ఖర్చుచేశాం. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నాం. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? పైగా ఈ ఏడాది బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించడం దారుణం కాదా? ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా?.ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో 60శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండిపడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలని, కనీస ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యంచేసుకుని, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు..@ncbn గారూ… కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం… pic.twitter.com/cW0REI1bV6— YS Jagan Mohan Reddy (@ysjagan) May 3, 2025

ఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్యలు
న్యూఢిల్లీ: భారత్, ఆఫ్రికన్ యూనియన్ ప్రగతిశీల భాగస్వామ్యపక్షాలు అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. గ్లోబల్ సౌత్‌కు ఇరుపక్షాలు మూలస్తంభాలని చెప్పారు. ఆయన శనివారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సోతో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సంప్రదాయ వైద్యం, వ్యవసాయం, సాంస్కృతిక సహకారం వంటి రంగాల్లో భారత్–అంగోలా మధ్య అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అనంతరం ఇరువురు నేతలు ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ మరోసారి తేల్చిచెప్పారు. పహల్గాంలో పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ముష్కరులను, వారి మద్దతుదారులను శిక్షించడం తథ్యమని స్పష్టంచేశారు. ఉగ్రవాదులపై దృఢమైన, నిర్ణయాత్మక చర్యలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, అంతరిక్ష సాంకేతికత వంటి అంశాల్లో ఇండియా శక్తిసామర్థ్యాలను అంగోలాతో పంచుకుంటామని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ, వజ్రాల ప్రాసెసింగ్, ఎరువులు, ఖనిజాల విషయంలో అంగోలాతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు అంగోలా అధ్యక్షుడు లోరెన్సోకు రాష్ట్రపతి భవన్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. అనంతరం రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి లారెన్సో ఘనంగా నివాళులర్పించారు. భారత్–అంగోలా మధ్య దౌత్య సంబంధాలు 1985లో ప్రారంభమయ్యాయి. ఆఫ్రియన్ యూనియన్‌కు ఈ ఏడాది అంగోలా దేశమే నేతృత్వం వహిస్తోంది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం లోరె న్సో గురువారం భారత్‌కు చేరుకున్నారు. అంగోలా సైనిక దళాల ఆధునీకరణకు రూ.1,691 కోట్ల రుణం అంగోలా సైనిక దళాల ఆధునీకరణకు తమ వంతు సహకారం కచ్చితంగా అందిస్తామని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఇందుకోసం 200 మిలియన్ డాలర్లు(రూ.1,691 కోట్లు) రుణంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అధ్యక్షుడు లోరెన్సో పర్యటన భారత్–అంగోలా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశను నిర్దేశిస్తుందని, భారత్–ఆఫ్రికా నడుమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

కరువు ఎరుగని 'కృషీవలురు'!
కొడిమ్యాల మండలం పూడూరు వాగుపై 7 చెక్ డ్యాంలు ఉన్నాయి. వాగుకు ఇరువైపులా మోటార్లు పెట్టుకుని రైతులు ఈ నీటితో పంటలు సాగు చేసేవారు. ఇటీవల వాగు పూర్తిగా ఎండిపోవటంతో ఆరెపల్లి, అప్పారావుపేట, పూడూరు గ్రామ రైతులు చందాలు వేసుకొని దాదాపు రూ. లక్ష జమచేసి 40 పైపులు కొనుగోలు చేసి, కొండాపూర్ మైసమ్మ చెరువు మత్తడి నుంచి సాగు నీటిని తరలించారు. దీంతో కొడిమ్యాల పెద్దవాగుతోపాటు పూడూరు వాగుపై ఉన్న ఏడు చెక్ డ్యాంలు నిండి పొంగిపోర్లుతున్నాయి. ఈ నీటితో ఆ చుట్టుపక్కల 500 ఎకరాల వరి పంట ఎండిపోకుండా రైతులు కాపాడుకున్నారు.సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వేసవికాలం వచ్చిందంటే చాలాచోట్ల ఎండిన పంటలు.. పశువుల మేతకు వదిలేసిన పొలాల చిత్రాలే కన్పిస్తాయి. ఎండిపోయిన వాగులు.. ఒట్టిపోయిన బావులు సర్వసాధారణం.. కానీ, కొన్నిచోట్ల ప్రభుత్వం వాగులు, వంకలపై నిర్మించిన చిన్నచిన్న చెక్‌డ్యాంలు అన్నదాతల తలరాతలను మార్చేశాయి. మండు వేసవిలోనూ నిండైన జలకళతో పచ్చని పంటలకు ప్రాణం పోస్తున్నాయి. మరికొన్నిచోట్ల అన్నదాతలు సరికొత్త ఆలోచనలతో సొంతంగానే నీటిని ఒడిసిపట్టి మండు వేసవిలో బంగారు పంటలు పండిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కన్నీటి జీవితాలను ప‘న్నీటి’గా మార్చుకున్న పలువురు రైతుల విజయగాథలివీ... ఐదేళ్లుగా కరువు ఎరగని వీణవంక పల్లె కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం.. ఆ ప్రాంతంలో కరువును దూరం చేసింది. ఒకప్పుడు తాగు, సాగు నీటికి అల్లాడిన అక్కడి ప్రజలు.. చెక్‌డ్యాం వల్ల గత ఐదేళ్లుగా నిశ్చింతగా బతుకుతున్నారు. మండల కేంద్రానికి అర కిలోమీటర్ దూరంలోనే ఉన్న వాగులో వృథాగా పోతున్న నీటిని నిల్వ చేసేందుకు 2018లో రూ.1.54 కోట్లతో 15 ఎకరాల విస్తీర్ణంతో చెక్‌డ్యాంను నిర్మించారు. ఈ చెక్‌డ్యాం వీణవంకతోపాటు, బ్రాహ్మణపల్లి, రెడ్డిపల్లి, రామక్రిష్ణాపూర్ గ్రామాల ప్రజలకు తాగు, సాగు నీరు అందిస్తోంది. సుమారు 220 ఎకరాల భూమి దీని కింద సాగవుతోంది. సొంత భూమిలో చెరువు తవ్వించి.. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ విలీన గ్రామం శ్రీనివాస్‌నగర్‌కు చెందిన పుట్ట బాబు తన పంట పొలంలో 2 ఎకరాల విస్తీరణంలో 15 ఏళ్ల క్రితమే చెరువును తవ్వించి నీటి సంరక్షణ చేపట్టారు. వర్షం నీటితో పాటు ఆరు బోరు బావులతో చెరువును నింపుతున్నాడు. ఈ చెరువు ద్వారా 12 ఎకరాల్లో వర్షాకాలం, యాసంగీ సీజన్లలో వరి పంట సాగుచేస్తున్నాడు. చెరువు గట్టు చుట్టూ కొబ్బరి, మామిడి, సీతాఫలంచెట్లు పెంచి అదనపు ఆదాయం పొందుతున్నాడు. వట్టిపోని వట్టివాగు.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని కాట్రపల్లి, వెంకటగిరి, అర్పణపల్లి, ఉప్పరపల్లి, పెనుగొండ గ్రామాల మీదుగా వెళ్లే వట్టివాగు ఇప్పుడు మండు వేసవిలోనూ నిండుకుండలా కనిపిస్తోంది. ఇటీవల యాసంగి పంటల కోసం కొంత ఆలస్యంగా ఎస్సారెస్పీ జలాలను వట్టి వాగులోకి మళ్లించటంతో వెంకటగిరి, అర్పణపల్లి, ఉప్పరపల్లి గ్రామాల పరిధిలో వాగుపై నిర్మించిన చెక్ డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో చుట్టుపక్కల వ్యవసాయ బావులు, బోర్లలో భూగర్భ జలాలు పెరిగాయి. 9 చెక్‌డ్యాంలతో నీటి సమస్య దూరం మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని ఊక చెట్టు వాగులో గతంలో నీరు ఉండక భూగర్భ జలాలు అడగంటేవి. గత ప్రభుత్వం ఈ వాగుపై 9 చెక్‌డ్యాంలు నిర్మించటంతో నీటి నిల్వ పెరిగి, చుట్టుపక్కల భూగర్భ జలాల పైపైకి వచ్చాయి. దీంతో సాగు, తాగు నీటి సమస్య దూరమైంది. సమీపంలోని బండ్రపల్లి, పల్లమరి, లాల్ కోట, నెల్లికొండి, పెద్ద వడ్డేమాన్, చిన్న వడ్డేమాన్, ఏదిలాపురం, చిన్న చింతకుంట, మద్దూరు, అల్లిపురం, కురుమూర్తి, అమ్మాపురం, గూడూరు, అప్పంపల్లి, ముచ్చింతల తదితర గ్రామాలలో 7,000 ఎకరాలలో రైతులు రెండు పంటలు పండిస్తున్నారు. వర్షపు నీటిని గుంతల్లో నిల్వ.. నల్లగొండ జిల్లా చండూరులో వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు రైతు పాల్వాయి సత్యనారాయణరెడ్డి తన భూమిలోనే కందకాలు తవ్వించాడు. ఆరేళ్ల క్రితం తనకున్న దాదాపు 100 ఎకరాలలో పలు చోట్ల కందకాలు తవ్వించాడు. గొల్లగూడకు వెళ్లే దారిలో గల 50 ఎకరాలలో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో వర్షపు నీటి గుంతలను తవ్వారు. ప్రస్తుతం ఎండలు మండుతున్నా ఈ గుంతల్లో నీరు పుష్కలంగా ఉండటం గమనార్హం. ఈ నీటివల్ల భూగర్భ జలాలు పెరిగి పంటకు నీటి కరువు తీరింది. వాననీటిని ఒడిసి పట్టి.. మెదక్ జిల్లా రత్నాపూర్ గ్రామానికి చెందిన నింబాద్రిరావు అనే రైతు వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు సరికొత్త ఆలోచన చేశారు. తన ఏడు ఎకరాల భూమి చుట్టూ స్ట్రెంచ్ కొట్టించి, వర్షాకాలంలో పడిన వర్షం నీరు భూమిలోకి ఇంకేలా ఏర్పాట్లు చేశాడు. దీనికి రాళ్లు, సిమెంట్ లైనింగ్ చేసి నీటిని నిలువ చేస్తున్నాడు. ఈ నీటి ద్వారా ఎండా కాలంలోనూ పంటలకు నీరందేలా ఏర్పాటు చేసుకున్నాడు. డ్రిప్ ద్వారా మామిడి పంటకు నీళ్లు పారిస్తున్నాడు. ఒకప్పుడు బీడుగా ఉన్న భూమిని ఇప్పుడు బంగారు పంటలు పండే సారవంతమైన భూమిగా తీర్చి దిద్దుకుని ఆదర్శంగా నిలుస్తున్నాడు. జహీరాబాద్ ప్రాంతంలో జలకళ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో గతంలో చేపట్టిన వాటర్‌షెడ్ పనులు ఇప్పుడు రైతులకు జల సిరులు పారిస్తున్నాయి. ప్రముఖ ఇంజనీర్ హన్మంత్‌రావు ఇక్కడ చతుర్విద జల ప్రక్రియను ఆవిష్కరించారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని గొట్టిగారిపల్లి గ్రామంలో 2001లో వాటర్‌షెడ్ పథకానికి శ్రీకారం చుట్టారు. ఫలితంగా నేడు 30 వేల ఎకరాలకు నీటి కొరత తీరింది. ఏడాది పొడువునా మూడు పంటలు పండుతున్నాయి.

దిగుమతులు బంద్
న్యూఢిల్లీ/శ్రీనగర్: పహల్గాం దుస్సాహసానికి ము ష్కరులను ప్రేరేపించిన దాయాదికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పాకిస్తాన్ నుంచి దిగుమతులను పూర్తిగా నిషేధిస్తూ భారత్ శనివారం నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులకూ ఇది వర్తిస్తుంది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పాక్‌లో ఉత్పత్తయ్యే, ఆ దేశం గుండా ఎగుమతయ్యే అన్ని రకాల వస్తువులు, ఉత్పత్తుల ప్రత్య క్ష, పరోక్ష దిగుమతులను పూర్తిగా నిషేధిస్తున్నట్టు పేర్కొంది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. అంతేగాక పాక్ నౌకలకు భారత్‌లోకి అనుమతి నిషేధించింది. ఆ దేశానికి సముద్ర రవాణా మార్గాలను పూర్తిగా మూసేసింది. దీని ప్రభావం కూడా పాక్‌పై తీవ్రంగా ఉండనుంది. ఇక పాక్‌కు అన్నిరకాల పార్సిల్, పోస్టల్ సేవలను కూడా సంపూర్ణంగా నిలిపేశారు. ఈ నిర్ణయాలన్నీ తక్షణం అమల్లోకి వచ్చినట్టు కేంద్రం ప్రకటించింది. పాక్‌కు మన గగనతలాన్ని ఇ ప్పటికే మూసేయడం తెలిసిందే. అంతేగాక సింధూ జల ఒప్పందం నిలిపివేత, పాక్ పౌరులకు వీసాల రద్దు వంటి పలు కఠిన చర్యలు కూడా కేంద్రం ఇప్పటికే తీసుకుంది. దివాలా ముంగిట ఉన్న పాక్‌కు ఆర్థికంగా ప్రాణాధారం వంటి 700 కోట్ల ఐఎంఎఫ్ రుణాన్ని అడ్డుకునే ప్రయత్నాలకు కూడా పదును పెట్టింది. ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాక్‌ను గ్రే లిస్టులో చేర్చి రుణాలు, ఆర్థిక సాయాలు పూర్తిగా నిలిపేయాలని అంతర్జాతీయ సంస్థలకు శుక్రవారం విజ్ఞప్తి చేయడం తెలిసిందే. తద్వారా దాయాది ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేలా కేంద్రం వ్యూహరచన చేస్తోంది. దీనిపై పాక్ శనివారం గగ్గోలు పెట్టింది. రాజకీయ దురుద్దేశాలతోనే ఐఎంఎఫ్ రుణానికి భారత్ మోకాలడ్డుతోందంటూ ఆక్రోశించింది. దిగుమతులు అంతంతే పాక్ నుంచి దిగుమతుల నిషేధం ప్రభావం మనపై ఏమీ ఉండదు. పుల్వామా దాడుల నేపథ్యంలో 2019 నుంచే ఆ దేశంతో వాణిజ్య కార్యకలాపాలను భారత్ దాదాపుగా తగ్గించుకుంది. గతేడాది దాయాది నుంచి మనం దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ కేవలం 4.2 లక్షల డాలర్లు! ప్రధానంగా సేంద్రియ లవణంతో పాటు ఫార్మా ఉత్పత్తులు, పళ్ల వంటివి వీటిలో ఉన్నాయి. అదే సమయంలో పాక్‌కు మన ఎగుమతుల విలువ ఏకంగా 44.8 కోట్ల డాలర్లుగా ఉంది. పాక్ ఉత్పత్తులపై భారత్ ఇప్పటికే 200 శాతం విధిస్తోంది. పహల్గాం దాడి నేపథ్యంలో పాక్‌కు అన్ని ఎగుమతులనూ భారత్ ఇప్పటికే నిలిపేయడం తెలిసిందే. తొమ్మిదో రోజూ కాల్పులు సరిహద్దుల వెంబడి పాక్ దుశ్చర్యలు వరుసగా తొమ్మిదో రోజూ కొనసాగాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం శనివారం కూడా కాల్పులకు తెగబడింది. వాటికి దీటుగా బదులిచి్చనట్టు సైన్యం ప్రకటించింది. పహల్గాంలో 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల కోసం వేట సాగుతోంది. కశీ్మర్‌ను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. శనివారం శ్రీనగర్‌లో ఐదుచోట్ల ముమ్మర తనిఖీలు కొనసాగాయి. రెచ్చగొట్టేలా పాక్ క్షిపణి పరీక్షలుఇస్లామాబాద్: పహల్గాం ఉగ్ర దాడితో అసలే దెబ్బ తిన్న పులిలా ఉన్న భారత్‌ను మరింత రెచ్చగొట్టేలా పాక్ వ్యవహరిస్తోంది. ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ క్షిపణి పరీక్షలకు దిగింది. 450 కి.మీ. రేంజ్‌తో కూడిన అబ్దాలీ సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను పరీక్షించినట్టు పాక్ సైన్యం శనివారం ప్రకటించుకుంది. పైగా, ఇది ‘సింధూ విన్యాసా’ల్లో భాగమంటూ గొప్పలకు పోయింది. ఇది అద్భుతమంటూ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షహబాజ్ షరీఫ్ సైన్యాన్ని అభినందనలతో ముంచెత్తారు. ఈ ఉదంతంపై భారత్ మండిపడింది. దీన్ని కచ్చితంగా రెచ్చగొట్టే చర్యగానే పరిగణిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ‘సింధూ’ నిర్మాణాలను పేల్చేస్తాం పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రేలాపనలు ఇస్లామాబాద్: సింధూ నదీ వ్యవస్థపై భారత్ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా పేల్చేస్తామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రేలాపనలకు దిగారు. వాటిని తమపై దురాక్రమణ చర్యగానే పరిగణిస్తామన్నారు. ‘‘నదీ జలాలను ఆపేస్తే మేం ఆకలిదప్పులతో అలమటిస్తాం. అందుకే అలాంటి పరిస్థితి రానివ్వబోం’’అని చెప్పుకొచ్చారు. సింధూ ఒప్పందం నిలిపివేతపై అంతర్జాతీయ వేదికలను ఆశ్రయిస్తున్నట్టు చెప్పారు.

ఆ్రస్టేలియాలో లేబర్ పార్టీ ఘన విజయం
మెల్బోర్న్: ఆ్రస్టేలియా ఫెడరల్ ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ మరోసారి విజయం దక్కించుకుంది. ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ చరిత్ర సృష్టించారు. ఆ్రస్టేలియాలో గత 21 ఏళ్లలో వరుసగా రెండోసారి ఎన్నికల్లో గెలిచిన తొలి ప్రధానిగా ఆయన రికార్డుకెక్కారు. అల్బనీస్ మరో మూడేళ్లపాటు ప్రధానిగా కొనసాగబోతున్నారు. ఆ్రస్టేలియా పార్లమెంట్లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో మొత్తం 150 సీట్లు ఉండగా, శనివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అల్బనీస్ నేతృత్వంలోని లేబర్ పార్టీ కడపటి వార్తలు అందేసరికి 83 సీట్లు గెలుచుకుంది. స్పష్టమైన మెజార్టీ సాధించింది. ప్రతిపక్ష లిబరల్ నేషనల్ పార్టీ 14 స్థానాలకే పరిమితమైంది. లిబరల్ పార్టీ 13, నేషనల్ పార్టీ 8 సీట్లు గెలుచుకున్నాయి. అలాగే ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు నెగ్గారు. కాటర్ పార్టీకి ఒక స్థానం, సెంట్రల్ అలయెన్స్‌కు ఒక స్థానం దక్కింది. మరికొన్ని స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రతిపక్ష లిబరల్ నేషనల్ పార్టీ అగ్రనేత పీటర్ క్రెయిగ్ డటన్ తమ ఓటమిని అంగీకరించారు. ఎన్నికల ప్రచారంలో తాము సరిగ్గా పని చేయలేకపోయామని అన్నారు. ఓటమికి బాధ్యతను తానే స్వీకరిస్తున్నానని చెప్పారు. ప్రధాని అల్బనీస్‌కు ఫోన్‌చేసి, అభినందనలు తెలియజేశానని పేర్కొన్నారు. లేబర్ పార్టీకి ఇది చరిత్రాత్మక సందర్భమని, దాన్ని తాము గుర్తిస్తున్నామని వెల్లడించారు. బ్రిస్బేన్ నియోజకవర్గంలో పీటర్ క్రెయిగ్ డటన్ ఓడిపోవడం గమనార్హం. ఇక్కడ ఆయనపై లేబర్ పార్టీ అభ్యర్థి అలీ ఫ్రాన్స్ విజయం సాధించారు. ఆస్ట్రేలియాలో ద్రవ్యోల్బణం, అధిక ధరలు, ఇంధనం విధానం, ఇళ్ల కొరత, వడ్డీ రేట్లలో పెరుగుదల వంటి అంశాలే ప్రతిపాదికగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. తాను ప్రధానమంత్రి అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దారిలో నడవనున్నట్లు పీటర్ క్రెయిగ్ డటన్ సంకేతాలిచ్చారు. ప్రభుత్వ ఖర్చులకు కళ్లెం వేస్తానని, ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తానని ప్రకటించారు. ఆయన విధానాల పట్ల ప్రజలు విముఖత చూపినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఆంథోనీ అల్బనీస్ మరోసారి నెగ్గే అవకాశం ఉందని ముందే అంచనాలు వెలువడ్డాయి. ఆంథోనీ నార్మన్ అల్బనీస్ 1963 మార్చి 2న ఆ్రస్టేలియాలోని సిడ్నీలో జన్మించారు. 1996లో తొలిసారిగా ఎంపీగా గెలిచారు. 2019 నుంచి లేబర్ పార్టీ అధినేతగా కొనసాగుతున్నారు. 2019 నుంచి 2022 దాకా ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2022లో ఆస్ట్రేలియా 31వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరో మూడేళ్లు పదవిలో కొనసాగబోతున్నారు. ‘‘ఆ్రస్టేలియా విలువలకు ప్రజలు మరోసారి పట్టంకట్టారు. వాటికి అనుగుణంగానే నూతన ప్రభుత్వ పాలన సాగుతుంది. అంతేతప్ప ఎవరినీ అనుసరించబోం. ఎన్నికల వాగ్దానాలన్నింటినీ వీలైనంత త్వరలో అమలు చేసి చూపిస్తా’’ – విజయోత్సవ ప్రసంగంలో అల్బనీస్ మోదీ అభినందనలు అల్బనీస్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. భారత్–ఆ్రస్టేలియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానంటూ శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అల్బనీస్ నాయకత్వ సామర్థ్యం పట్ల ఆస్ట్రేలియా ప్రజల తిరుగులేని విశ్వాసానికి ఈ విజయమే తార్కాణమని పేర్కొన్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సౌభాగ్యాన్ని భారత్–ఆ్రస్టేలియా బలంగా కోరుకుంటున్నాయని మోదీ స్పష్టంచేశారు.

గాజాలో ఆకలి కేకలు
గాజా: ఇజ్రాయెల్ ఆర్మీ రెండు నెలలుగా కొనసాగిస్తున్న దిగ్బంధం గాజాలోని పాలస్తీనియన్లను ఆకలి చావుల ప్రమాదపుటంచుకు చేర్చింది. ఆహారం, నీరు, మందులు, ఇంధనం వంటి అత్యవసరాలను సైతం సైన్యం అడ్డుకోవడంతో సరఫరాల తో వస్తున్న ట్రక్కులు వందలాదిగా సరి హద్దుల్లోనే నిలిచిపోయాయి. తమ వద్ద ఉన్న సరుకుల నిల్వలు మరో రెండు వారాలకు మాత్రమే సరిపోతాయని గాజా ప్రజలకు ఆహారం అందిస్తున్న సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ లోగా ఇజ్రాయెల్ నిర్ణయం మా ర్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అలాకాని పరిస్థితుల్లో ఇప్పటికే అర్ధాకలితో అలమటిస్తు న్న లక్షలాది మంది పాలస్తీనియన్లకు ఆకలి చావు లు తప్పవని హెచ్చరిస్తున్నాయి. తమ వద్ద ఉన్న నిత్యావసర సరుకుల నిల్వలు పూర్తిగా అడుగంటాయని ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం(యూఎన్ఆర్డబ్ల్యూఏ) తెలిపింది. మానవతా సాయం, పౌరుల ప్రాణాల విషయంలో బేరమాడటం సరైన విధానం కాదని ఐరాస మానవతా విభాగం చీఫ్ టామ్ ఫ్లెచర్ ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు.తీవ్రమైన పోషకాహార లోపం కారణంగా ఐదేళ్లలోపు వయస్సున్న 3.35 లక్షల మంది చిన్నారులు మరణం అంచున ఉన్నారని యునిసెఫ్ ఇప్పటికే హెచ్చరించింది. ఇది యుద్ధ నేరమేనని, ఇంతటితో ఆపాలని అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిడులు వస్తున్నటికీ ఇజ్రాయెల్ లక్ష్యపెట్టడం లేదు. బందీలందరినీ హమాస్ విడిచిపెట్టేదాకా దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేస్తోంది. ఇజ్రాయెల్ బలగాలు గాజా నుంచి పూర్తిగా వైదొలిగేదాకా వెనక్కి తగ్గేది లేదని హమాస్ సైతం భీష్మించుకుంది. మటన్ బదులు కొషారి అమెరికన్ నియర్ ఈస్ట్ రెఫ్యూజీ ఎయిడ్(అనెరా) గాజాలో రెండు సామాజిక వంటశాలలను నడుపుతోంది. ఖాన్‌యూనిస్‌లో ని కమ్యూనిటీ కిచెన్ రోజుకు 6 వేల మందికి సరిపడా ఆహారం వండుతోంది. ప్రస్తు తం ఆకుకూరలు, బియ్యం, టమాటా సాస్‌లతో కూడిన కొషారి అనే వంటకాన్ని వండి వడ్డిస్తున్నామని నిర్వాహకుడు సమీ మ తార్ చెప్పారు. ఆహార నాణ్యతను పరీక్షించాకే పార్శిల్ చేస్తామని, ఒక్కో పార్శిల్లోని ఆహారం నలుగురికి సరిపోతుందని వివరించారు.మిగిలిన ఆహారాన్ని శరణార్థి శిబిరాలున్న అల్ మవాసీకి తరలించి, డజన్ల సంఖ్యలో ఉన్న సూపర్ వైజర్ల సాయంతో పంపిణీ చేస్తున్నామన్నారు. ‘గతంలో వారానికి వంద చొప్పున ట్రక్కుల్లో ఆహారం, మందులు ఇక్కడికి చేరేవి. ఈ ఏడాది ఆరంభంలో కాల్పుల విరమణ సమయంలో వచి్చన ఆహార పదార్థాలు, నిత్యావసరాలను నిల్వ ఉంచాం. దిగ్బంధనం కారణంగా ఆ నిల్వలు కరిగిపోయాయి. సరఫరా నిలిచిపో వడంతో స్థానిక దుకాణాలు మూతబడ్డాయి. దీంతో, ఎలాంటి ఆదాయ వనరు లు లేని వారు మేమందించే ఆహారంపైనే పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నారు. వీరి కోసం గతంలో అన్నం, మాంసం వండే వాళ్లం. మాంసం దుకాణాలు మూతబడ్డాయి. బియ్యం, ఆకు కూరలు, పాస్టా, వంటనూనె, ఉప్పు వంటివి సైతం దొరక డం కనాకష్టంగా మారింది. గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వంట కోసం 700 కిలోల కట్టెలు కొంటున్నాం. వంట చెరుకు ధర సైతం పెరిగిపోయింది. సరుకుల కొరత కారణంగా వచ్చే రెండు వారాల్లోపే ప్రజలకు ఏకైక ప్రాణాధారమైన ఇక్కడి కిచెన్లన్నీ మూతబడే ప్రమాదముంది’అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతమున్న సరుకులు కూడా ఖర్చయిపోతే ఆ తర్వాత ఏం చేయాలో తెలియడం లేదని మతార్ నిర్వేదంతో అ న్నారు. మానవతా సాయం నిల్వలను హమాస్ శ్రే ణులు దోచుకుంటున్నాయంటూ ఇజ్రాయెల్ చేస్తున్న ఆరోపణలను మతార్ కొట్టిపారేశారు. ఇక్కడ ప్రతిదీ పారదర్శకంగా క్రమపద్ధతిలో జరుగుతోందని, బ యటి వ్యక్తుల ప్రమేయం ఉండదని పేర్కొన్నారు. చిన్నారి ఆకలి చావు గాజా సిటీలోని రంటిసి హాస్పిటల్లో శనివారం జనన్ సలెహ్ అల్–సకఫీ అనే చిన్నారి కన్నుమూసింది. పోషహాకాహార లోపం, డీహైడ్రేషన్ ఆమె ఉసురు తీశాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇదంతా ఇజ్రాయెల్ చేసిన పాపమేనని కుటుంబసభ్యులు దుమ్మె త్తి పోశారు. 63 రోజులుగా సాగుతున్న ఇజ్రా యెల్ దిగ్బంధనం ఫలితంగా కనీసం 57 మంది పాలస్తీనా బాలలు ఆకలి చావులకు గురయ్యారని గాజా ప్రభుత్వం తెలిపింది. రఫా సహా అన్ని సరిహద్దులను తెరిచి, గాజాలోని 24 లక్షల మంది పాలస్తీనవాసులకు మానవీయ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది.

పాకిస్తాన్ ‘నీడ’ను దాచిపెట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు!
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ నీడలు ఎక్కడున్నా పసిగట్టే పనిలో పడింది కేంద్రం. ఈ క్రమంలోనే ఒక భారత జవాన్ దొరికేశాడు. పాకిస్తాన్ మహిళను వివాహం చేసుకుని, ఆ విషయాన్ని తెలియకుండా గుట్టుగా ఉంచాడు. ప్రత్యేకంగా ద సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)కు తెలియకుండా అత్యంత జాగ్రత్త పడ్డాడు.ఇప్పుడు విషయం బయటపడటంతో సదరు జవాన్ ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చింది. సీఆర్పీఎఫ్ 41 బెటాలియన్ కు చెందిన మునీర్ అహ్మద్.. పాకిస్తాన్ మహిళను వివాహం చేసుకుని దాన్ని సీక్రెట్ గా ఉంచడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ ధృవీకరించింది. దేశ భద్రతకు సంబంధించి నియమావళిని అహ్మద్ అతిక్రమించడంతో చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఇలా చేయడం దేశ భద్రతకు అత్యంత హానికరం కావడంతోనే జవాన్ అహ్మద్ పై చర్యలు తీసుకోవాల్సినట్లు సీఆర్పీఎఫ్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.పాక్ పంజాబ్‌కు చెందిన మినాల్ ఖాన్‌కు జమ్ము కశ్మీర్లో డ్యూటీ చేసే సీఆర్పీఎఫ్ జవాన్ మునీర్ ఖాన్ కు కిందటి ఏడాది మేలో ఆన్లైన్లో వివాహం(నిఖా) జరిగింది. ఈ ఏడాది మార్చిలో షార్ట్ టర్మ్ వీసా మీద ఆమె భారత్‌కు వచ్చింది. మార్చి 22వ తేదీతో ముగిసినప్పటికీ ఇక్కడే ఉండిపోయింది. అయితే ఆమె ఎలా ఉండగలిగిందో ఇప్పటికీ అర్థం కావట్లేదని అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈలోపు పహల్గాం దాడి తర్వాత పాకిస్థానీలు భారత్ ను వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మినాల్ కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఏప్రిల్ 29వ తేదీలోపు పాక్ పౌరులు వెనక్కి వెల్లిపోవాలని కేంద్రం డెడ్ లైన్ విధించింది. ఈ క్రమంలో.. అట్టారీ వాఘా సరిహద్దుకు చేరుకుని బస్సులో కూర్చుందామె. అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది.పూర్తి కథనం కోసం కింద ఆర్టికల్‌ను క్లిక్ చేయండిభారత జవాన్‌కు భార్యగా పాకిస్తానీ మహిళా

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో మరో హాఫ్ సెంచరీని కోహ్లి తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో ఉన్నంతసేపు కింగ్ కోహ్లి బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి సాధించిన రికార్డులు ఇవే..👉ఐపీఎల్లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. కోహ్లి ఇప్పటివరకు సీఎస్కేపై 1146 పరుగలు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. వార్నర్ పంజాబ్ కింగ్స్‌పై 1134 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో వార్నర్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.👉అదేవిధంగా సీఎస్కేపై అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్‌గా కోహ్లి నిలిచాడు. కోహ్లి ఇప్పటివరకు సీఎస్కేపై 10 సార్లు ఏభైకి పైగా పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ధావన్ సీఎస్కేపై 9 సార్లు ఫిప్టీ ప్లస్ పరుగులు నమోదు చేశాడు.👉వరల్డ్ ఫ్రాంచైజీ క్రికెట్లో ఒకే జట్టు తరపున 300 సిక్సర్లు కొట్టిన ఏకైక ప్లేయర్‌గా విరాట్ నిలిచాడు. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున కోహ్లి 300 సిక్స్‌లు బాదాడు. కోహ్లి తర్వాతి స్దానంలో క్రిస్ గేల్(263) ఉన్నాడు.👉టీ20 క్రికెట్లో ఒకే వేదికలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కోహ్లి 154 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ కూడా చిన్నస్వామి స్టేడియంలో 151 కొట్టాడు.👉ఐపీఎల్లో 8500 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ప్లేయర్‌గా కోహ్లి రికార్డులెక్కాడు.చదవండి: #Kagiso Rabada: కగిసో రబాడపై సస్పెన్షన్ వేటు.. ఐపీఎల్‌కు దూరం?

భీమిలి వివాహిత కేసు.. బయటపడ్డ సంచలన నిజాలు
సాక్షి, విశాఖపట్నం: భీమిలి మండలం దాకమర్రి వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన క్రాంతి కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఆరు బృందాలు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కేసు వివరాలను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మీడియాకు వెల్లడించారు. దాకమర్రి పంచాయతీ శివారు 26వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఫార్చ్యూన్ హిల్స్ వుడా లేఅవుట్లో నిన్న(శుక్రవారం) ఉదయం సగం కాలిన మహిళ మృతదేహాన్ని భీమిలి పోలీసులు గుర్తించారు.ఆ మహిళను హంతకులు గొంతు కోసి తరువాత పెట్రోల్‌తో దహనం చేసినట్టు గుర్తించారు. మెడలో కాలిన నల్లపూసల గొలుసు ఉండటంతో మృతురాలు వివాహితగా గుర్తించారు. ఆరు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. మృతురాలు వెంకటలక్ష్మికి క్రాంతి కుమార్‌తో అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.క్రాంతి కుమార్‌కు ఇద్దరు భార్యలు ఉండగా, అతడు రెండో భార్యతో మృతురాలి ఇంటి పక్కన ఉండేవాడు. క్రాంతికుమార్, మృతురాలికి మధ్య స్నేహం కుదిరింది. అతనికి వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం ఏర్పడటంతో రెండో భార్యకు, వెంకటలక్ష్మికి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో రెండో భార్యను వేరే బ్లాక్‌కు మార్చాడు. అయినా వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం కొనసాగించాడు.ఈ విషయంలో మొదటి భార్య, రెండో భార్యతో తరచు గొడవలు జరుగుతున్నాయి. మరో వైపు వెంకటలక్ష్మి.. తనతోనే ఎక్కువసేపు గడపాలని తనతోనే ఉండాలంటూ క్రాంతికుమార్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఎలాగైన వెంకటలక్ష్మిని వదిలించుకోవాలని.. ప్లాన్ చేశాడు. వెంకటలక్ష్మిని బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరు ఐస్‌క్రీమ్ తిన్నారు. అనంతరం బైక్‌లో పెట్రోల్ కొట్టించి.. బాటిల్లో కూడా కొట్టించాడు. ఇంటి వద్ద పెట్రోల్ దొంగలు ఉన్నారని.. అందుకే బాటిల్లో పెట్రోల్ కొట్టించానంటూ వెంకటలక్ష్మితో చెప్పాడు.శారీరకంగా కలుద్దామని చెప్పి దాకమర్రి లేవట్‌కి తీసుకెళ్లి వెంకటలక్ష్మిని కత్తితో గొంతు కోసి చంపేశాడు. తరువాత ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకుని.. తరువాత పెట్రోల్ పోసి తగలుపెట్టాడు. కేసు విచారణలో మొదట వెంకటలక్ష్మిని గుర్తించాము. తర్వాత కాంత్రితో వెళ్తున్నట్లు తన తల్లి చెప్పిందని కొడుకు పోలీసులకు చెప్పారు. ఆ కోణంలో విచారణ చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.
ఒప్పందానికి ముందు అవకాశాల అన్వేషణ
ఎస్బీఐ లాభం రూ. 19,600 కోట్లు
బెడ్ వెట్టింగ్ కట్టడి..!
కుటుంబ ప్రేక్షకులు రావడం మాకు ఆశ్చర్యం: శైలేష్ కొలను
టెక్నాలజీతో కొత్త అవకాశాలు వస్తాయి: మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
సంకెళ్ళ నుంచి స్వేచ్ఛ వచ్చింది!
జన్మ జన్మల బంధం
ట్రైనింగ్ షురూ
ఇద్దరమ్మాయిలతో...
కరువు ఎరుగని 'కృషీవలురు'!
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
నా కొడుకును సంపేయండి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీ..
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్‌లైన్ ఆపరేటర్
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
బంగారం భారీగా పడిపోతుంది!
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
ఇంట్లో పాముల కలకలం
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
‘ఛీ’నా రాజకీయం...
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
కొందరికే ‘భరోసా’
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
శ్రీకృష్ణ లీలలు
హైదరాబాద్‌లో హై అలర్ట్
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
3 నిమిషాలకో మరణం
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
మూడో పంటగా సౌర విద్యుత్తు!
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
పాక్ నడ్డి విరిగేలా..
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఒకే ఇల్లు.. ఒకే వంట
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
మళ్లీ ఉగ్ర కాండ!
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్ విద్య
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
చిన్నప్పటి నుంచి చదువులో టాప్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
ఒప్పందానికి ముందు అవకాశాల అన్వేషణ
ఎస్బీఐ లాభం రూ. 19,600 కోట్లు
బెడ్ వెట్టింగ్ కట్టడి..!
కుటుంబ ప్రేక్షకులు రావడం మాకు ఆశ్చర్యం: శైలేష్ కొలను
టెక్నాలజీతో కొత్త అవకాశాలు వస్తాయి: మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
సంకెళ్ళ నుంచి స్వేచ్ఛ వచ్చింది!
జన్మ జన్మల బంధం
ట్రైనింగ్ షురూ
ఇద్దరమ్మాయిలతో...
కరువు ఎరుగని 'కృషీవలురు'!
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
నా కొడుకును సంపేయండి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీ..
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్‌లైన్ ఆపరేటర్
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
బంగారం భారీగా పడిపోతుంది!
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
ఇంట్లో పాముల కలకలం
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
‘ఛీ’నా రాజకీయం...
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
కొందరికే ‘భరోసా’
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
శ్రీకృష్ణ లీలలు
హైదరాబాద్‌లో హై అలర్ట్
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
3 నిమిషాలకో మరణం
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
మూడో పంటగా సౌర విద్యుత్తు!
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
పాక్ నడ్డి విరిగేలా..
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఒకే ఇల్లు.. ఒకే వంట
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
మళ్లీ ఉగ్ర కాండ!
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్ విద్య
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
చిన్నప్పటి నుంచి చదువులో టాప్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
సినిమా

సచిన్ కూతురితో హీరో డేటింగ్..!
బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది గతేడాది యుధ్రా మూవీలో కనిపించారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ బోల్తా కొట్టింది. ప్రస్తుతం సిద్ధాంత్ ధడక్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ కూడా హీరోయిన్గా నటించారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. త్వరలోనే రిలీజ్ తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. ఆ తర్వాత సిద్ధాంత్ చతుర్వేది దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్ మూవీలో కనిపించనున్నారు.అయితే ఇదంతా పక్కనపెడితే సిద్ధాంత్ గతంలో అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలితో డేటింగ్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ విషయంలో ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా హీరో సిద్ధాంత్ చతుర్వేది టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో డేటింగ్లో ఉన్నారంటూ బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని ఓ నివేదిక వెల్లడించింది. అయితే ఈ విషయంపై సిద్ధాంత్ కానీ.. సారా టెండూల్కర్ కానీ స్పందించలేదు. రిలేషన్‌పై ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ ఈ రూమర్స్ ఆగేలా కనిపించడం లేదు. కాగా.. సారా టెండూల్కర్ ప్రస్తుతం ఆస్ట్రేలియా వేకేషన్లో ఉన్నారు. అక్కడ ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.కాగా.. గతంలో సిద్ధాంత్ చతుర్వేది.. అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలితో ప్రేమలో ఉన్నారని రూమర్స్ వినిపించాయి. అంతే కాకుండా సారా టెండూల్కర్ సైతం క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో రిలేషన్లో ఉన్నారంటూ వార్తల్లో నిలిచింది. కానీ వీరిద్దరు కూడా తమ రిలేషన్‌ను ధృవీకరించలేదు. మరోవైపు శుభ్ మన్ గిల్.. సైఫ్ కూతురు సారా అలీ ఖాన్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. గతంలో కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ సందర్భంగా సారా అలీ ఖాన్ ఈ విషయంపై ప్రశ్నించగా.. అలాంటిదేం లేదని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar)

టాప్ ట్రెండింగ్ మీమ్స్.. చూస్తే పడిపడి నవ్వాల్సిందే
మహిళల దినోత్సవం, ప్రేమికుల దినోత్సవం, మదర్స్ డే.. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతిదానికి ఒకరోజు ఉంది. అలానే మనం మనసారా నవ్వే నవ్వుకు కూడా ప్రత్యేకంగా ఓ రోజు అంటూ ఉంది. ప్రతి ఏటా మే నెలలో తొలి ఆదివారాన్ని 'ప్రపంచ నవ్వుల దినోత్సవం'గా జరుపుకొంటారు. (ఇదీ చదవండి: కొత్త రికార్డ్.. మహేశ్ బాబు తర్వాత నానినే)అసలు విషయానికొస్తే గత కొన్నాళ్లలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా మీమ్స్.. ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. దాదాపు పదేళ్ల క్రితం ఈ ట్రెండ్ మొదలైంది. అప్పటినుంచి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి ముఖంపై నవ్వుకు కారణమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా మీమ్ కనిపించిందంటే అందులో కచ్చితంగా బ్రహ్మానందం ఉండాల్సిందే. అలా బ్రహ్మీ కనిపించిన కొన్ని ట్రెండింగ్ మీమ్స్.. వాటి డైలాగ్స్ మీకోసం. (ఇదీ చదవండి: టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా 'టూరిస్ట్ ఫ్యామిలీ') ఆ ఊహ ఎంత బాగుందో..ఛీ ఛీ మీరు సిగ్గుపడకండి.. చచ్చిపోవాలనిపిస్తోంది.ఏదో తేడాగా ఉందేంటి?ముసలోడే కానీ మహానుభావుడుఇది యాపారంఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమోనని భయమేస్తోంది.ఐ యామ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ.. కల అన్నాడు ఏం మారలేదేంటి?

వారి నటన, హావభావాలకు నవ్వకుండా ఉండలేరు.. ఆ ఘనత వారికే సొంతం!
నవ్వడం ఒక వరం. నవ్వు రావాలంటే కూడా అదృష్టం ఉండాలి. మన జీవితంలో ప్రతిరోజు నవ్వుతూ బతకాలంటే మనకు రాసి పెట్టుండాలి. అదేంటి నవ్వడానికి ఓక జోక్ వింటే చాలుగా.. ఇంత పెద్ద పెద్ద డైలాగ్స్ ఎందుకు అనుకుంటున్నారా? మీరు చెప్పింది కూడా కరెక్ట్ కానీ.. నవ్వడం అందరికీ సరదాగా ఉంటుంది. కానీ మనం ఒకరిని నవ్వించాలంటే మాత్రం మన వద్ద ఏదో ప్రత్యేకత ఉండాలి. అందరూ జోక్స్ చెబుతారు.. కానీ కొందరి చెబితేనే నవ్వు వస్తుంది. అలా మనం తెలుగు సినిమాల్లో ప్రేక్షకులను కడుప్పుబ్బా నవ్వించిన కమెడియన్స్ ఎంతమంది అలా వెళ్లమీదే లెక్క పెట్టేస్తారు. ఎందుకంటే అలా నవ్వించడం కొందరికీ మాత్రమే సాధ్యపడుతుంది. అలా మనల్ని వెండితెరపై దశాబ్దాల పాటు నవ్వించి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క బ్రహ్మనందం పేరే గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత బాబు మోహన్, ఎంఎస్ నారాయణ అలీ, వేణుమాధవ్, సునీల్ లాంటి కమెడియన్స్ కూడా మన టాలీవుడ్లో తమ హావభావాలతో మనల్ని నవ్వించారు. అంతకుముందు అల్లూరి రామలింగయ్య, పద్మనాభం, రాజా బాబు లాంటి ఎందరో మహానుభావులు సైతం వెండితెరపై నవ్వులు పూయించారు. ఆదివారం (మే 4వ తేదీ) ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా తన నటనతో, హావభావాలతో కడుపుబ్బా నవ్వించిన వారిని, నవ్విస్తోన్న వారిని ఓసారి గుర్తుకు తెచ్చుకుందాం.కడుపుబ్బా నవ్వించే కమెడియన్ పద్మనాభం..అప్పట్లో ప్రముఖ హాస్యనటుడు బసవరాజు పద్మనాభం బహుముఖ ప్రజ్ఞాశాలి. సింహాద్రిపురంలో జన్మించిన ఆయన వెండి తెరపై హాస్యాన్ని పండించి తెలుగు సినిమా రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్, సావిత్రిల కాంబినేషన్లో దేవత చిత్రాన్ని నిర్మించడంతోపాటు పొట్టి ప్లీడర్, శ్రీరామకథ సినిమాలకు దర్శకత్వం వహించారు. శాస్త్రిగా మెప్పించిన అల్లు రామలింగయ్య..తెలుగు సినిమా చరిత్రలో కమెడియన్ల విషయంలో వేళ్ల మీద లెక్క పెడితే అందులో మొదట వినిపించే పేరు అల్లు రామలింగయ్య. హాస్యంలోంచి విలనీ, విలనీ లోంచి హాస్యం సాధించిన విశిష్ట నటుడు ఆయనే. 1953లో తొలిచిత్రం పుట్టిల్లులో పోషించిన శాస్త్రులు, వద్దంటే డబ్బులో టీచరు, దొంగరాముడులో హాస్టలు వార్డెను పాత్రలతో ప్రేక్షకుల్లో నవ్వులు పూయించారు. ఆ తర్వాత భాగ్యరేఖ, మాయాబజార్ చిత్రాలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 2004 నాటికి దాదాపు 1,000కి పైగా చిత్రాల్లో విలక్షణ పాత్రలతో సినీ ప్రియులను అలరించారు. పుట్టిల్లు, ‘మాయాబజార్ సినిమ్లాల్లోనీ శాస్త్రులు పాత్ర అందరినీ ఆకట్టుకుంది. అందుకే ఆ తర్వాత అనేక చిత్రాల్లో శాస్త్రి పాత్ర ఆయన్నే వరిచింది.బక్కపలచని రాజా బాబు..అప్పట్లో తన హవా భావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హాస్యనటుల్లో రాజా బాబు ఒకరు. తనదైన నటనతో ప్రత్యేక అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అప్పట్లోనే హీరోలతో సమానంగా పారితోషికం తీసుకునేవారని చెబుతుంటారు. తెలుగు సినీ చరిత్రలో హాస్యనటుడిగా ప్రేక్షకుల గుండెల్లో ఆయన ముద్ర చిరస్థాయిగా నిలిచే ఉంటుంది.హాస్య బ్రహ్మ బ్రహ్మనందం..టాలీవుడ్ హాస్య బ్రహ్మగా పేరు సంపాదించుకున్న బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. కొన్ని వందల చిత్రాల్లో తెలుగు సినీ ప్రేక్షకులను తన హావభావాలతో కట్టిపడేశారు. ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో బ్రహ్మానందం జన్మించారు. టాలీవుడ్లో ఆయన చేసిన సినిమాలకు ఏకంగా గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కిన తొలి హాస్యనటుడిగా నిలిచారు. కేవలం తన హావభావాలతో నవ్వించే టాలెంట్ ఆయనకు మాత్రమే సొంతం. అందుకే అతన్ని హాస్య బ్రహ్మ అనే బిరుదు దక్కించుకున్నారు. బహ్మనందం సినీ ఇండస్ట్రీలో 31 ఏళ్ల పాటు కమెడియన్‌గా అభిమానులను అలరించారు. ఆయన దాదాపు 1200లకు పైగా సినిమాల్లో నటించారు. చివరిసారిగా తన కుమారుడితో కలిసి బ్రహ్మ ఆనందం మూవీలో కనిపించారు. ఆయనతో పాటు టాలీవుడ్లో అలీ, సునీల్, ఎంఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం, బాబు మోహన్, వేణు మాధవ్ సినీ ప్రియులను తమ నటన, కామెడీతో నవ్వులు పండించారు.

నాని నీకు హ్యాట్సాఫ్.. 'హిట్ 3'పై రామ్ చరణ్ ట్వీట్
నాని లేటెస్ట్ మూవీ హిట్ 3.. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. మరీ సూపర్ అని అనట్లేదు గానీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్స్ కూడా రెండు రోజుల్లో రూ.62 కోట్లకు పైనే వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగా హీరో రామ్ చరణ్.. ఈ సినిమా గురించి ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. హీరో నానికి హ్యాట్సాఫ్ కూడా చెప్పాడు. 'హిట్ 3కి అద్భుతమైన రివ్యూలు వచ్చాయని తెలిసింది. మై డియర్ బ్రదర్ నాని.. యూనిక్ స్క్రిప్ట్స్ ఎంపిక చేసి, హిట్స్ కొడుతున్నందుకు నీకు హ్యాట్సాఫ్. ఈ సినిమా తీసిన శైలేష్ కొలనుకి కూడా హ్యాట్సాఫ్. శ్రీనిధి శెట్టి, ప్రశాంతి త్రిపర్నేని, వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ సినిమా టీమ్ కు శుభాకాంక్షలు' అని చరణ్ రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా 'టూరిస్ట్ ఫ్యామిలీ') అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడీ స్థాయికి చేరిన నాని.. త్వరలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా ఓ సినిమాని నిర్మించబోతున్నాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్.. నాని కోసం, హిట్ 3 కోసం ట్వీట్ పెట్టినట్లు తెలుస్తోంది. అలానే వచ్చే ఏడాది మార్చి 26న నాని 'ద ప్యారడైజ్', మార్చి 27న చరణ్ 'పెద్ది' సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని అధికారికంగానే ప్రకటించారు. ఇప్పుడు హిట్ 3 కోసం చరణ్ ట్వీట్ పెట్టడం చూస్తుంటే చరణ్ కి పోటీగా వస్తాడా? తప్పుకొంటాడా అనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: కొత్త రికార్డ్.. మహేశ్ బాబు తర్వాత నానినే)
న్యూస్ పాడ్‌కాస్ట్

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!

పాక్ కాల్పుల పోరు.. బదులిచ్చిన భారత బలగాలు.

ఏపీ రాజధానిలో దోపిడీ ఐకానిక్.. 5 టవర్ల నిర్మాణ వ్యయం పెంపు

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు.. తీవ్రస్థాయికి ఉద్రిక్తతలు

పాకిస్తాన్‌కు భారత్ పంచ్.. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్
క్రీడలు

IPL 2025: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు..
ఐపీఎల్-2025లో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ఖాలీల్ అహ్మద్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఖాలీల్ అహ్మద్‌ను ఆర్సీబీ బ్యాటర్లు ఊతికారేశాడు. తొలుత అతడిని జాకబ్ బెతల్ టార్గెట్ చేయగా.. ఆఖరిలో రొమరియో షెపర్డ్ చుక్కలు చూపించాడు. 19 ఓవర్ వేసిన ఖాలీల్ అహ్మద్ బౌలింగ్‌లో షెఫర్డ్ 4 సిక్స్‌లు, 2 ఫోర్లు కొట్టి 33 పరుగులు పిండుకున్నాడు. ఖాలీల్ ఓవరాల్‌గా 3 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 65 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో ఖాలీల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌తో పాటు టీ20 క్రికెట్లో 3 ఓవర్లలోనే 65 పరుగులిచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు. అదేవిధంగా ఐపీఎల్-2025లో అత్యంత ఖరీదైన ఓవర్ వేసిన బౌలర్ కూడా అహ్మద్‌నే కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జాకబ్ బెతల్(55), రొమారియో షెపర్డ్(53) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. షెపర్డ్ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. సీఎస్కే బౌలర్లలో పతిరాన మూడు వికెట్లు పడగొట్టగా.. కుర్రాన్, నూర్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.

రొమారియో షెపర్డ్ విధ్వంసం.. సెకెండ్ ఫాస్టెస్ట్ ఫిప్టీ
ఐపీఎల్-2025లో చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ రొమారియో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు.సీఎస్కే బౌలర్లను ఊతికారేశాడు. ముఖ్యంగా సీఎస్కే బౌలర్ ఖాలీల్ అహ్మద్‌కు చుక్కలు చూపించాడు. 19వ ఓవర్ వేసిన ఖాలీల్ బౌలింగ్‌లో షెఫర్డ్ 4 సిక్స్‌లు, రెండు ఫోర్లతో ఏకంగా 33 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో అత్యంతవేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రెండో ప్లేయర్‌గా కేఎల్ రాహుల్, కమ్మిన్స్ సరసన షెపర్డ్ నిలిచాడు. రాహుల్, కమ్మిన్స్ కూడా 14 బంతుల్లోనే ఆర్ధ శతకం సాధించాడు.ఈ ఫీట్ సాధించిన జాబితాలో యశస్వి జైశ్వాల్(13 బంతులు) అగ్రస్దానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో షెపర్డ్ ఓవరాల్‌గా 6 సిక్స్‌లు, రెండు ఫోర్లతో 53 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అదేవిధంగా ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు బాదిన నాలుగో ప్లేయర్‌గా రొమారియో నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా UNREAL HITTING! 💪🔥#RomarioShepherd blitzkrieg hits Chinnaswamy! ⚡He smashes a jaw-dropping 53 off just 14 balls,equaling the 2nd fastest fifty in IPL history! Worthy of this epic clash #Kohli vs #Dhoni - one last time? 🙌🏻Watch the LIVE action in Haryanvi commentary ➡… pic.twitter.com/cOReV8qcPT— Star Sports (@StarSportsIndia) May 3, 2025

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో మరో హాఫ్ సెంచరీని కోహ్లి తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో ఉన్నంతసేపు కింగ్ కోహ్లి బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి సాధించిన రికార్డులు ఇవే..👉ఐపీఎల్లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. కోహ్లి ఇప్పటివరకు సీఎస్కేపై 1146 పరుగలు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. వార్నర్ పంజాబ్ కింగ్స్‌పై 1134 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో వార్నర్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.👉అదేవిధంగా సీఎస్కేపై అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్‌గా కోహ్లి నిలిచాడు. కోహ్లి ఇప్పటివరకు సీఎస్కేపై 10 సార్లు ఏభైకి పైగా పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ధావన్ సీఎస్కేపై 9 సార్లు ఫిప్టీ ప్లస్ పరుగులు నమోదు చేశాడు.👉వరల్డ్ ఫ్రాంచైజీ క్రికెట్లో ఒకే జట్టు తరపున 300 సిక్సర్లు కొట్టిన ఏకైక ప్లేయర్‌గా విరాట్ నిలిచాడు. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున కోహ్లి 300 సిక్స్‌లు బాదాడు. కోహ్లి తర్వాతి స్దానంలో క్రిస్ గేల్(263) ఉన్నాడు.👉టీ20 క్రికెట్లో ఒకే వేదికలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కోహ్లి 154 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ కూడా చిన్నస్వామి స్టేడియంలో 151 కొట్టాడు.👉ఐపీఎల్లో 8500 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ప్లేయర్‌గా కోహ్లి రికార్డులెక్కాడు.చదవండి: #Kagiso Rabada: కగిసో రబాడపై సస్పెన్షన్ వేటు.. ఐపీఎల్‌కు దూరం?

#Kagiso Rabada: కగిసో రబాడపై సస్పెన్షన్ వేటు.. ఐపీఎల్‌కు దూరం?
దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్, గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ ఐపీఎల్-2025 మధ్యలోనే తన స్వదేశానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో రబాడ సౌతాఫ్రికా వెళ్లినట్లు గుజరాత్ టైటాన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. దాదాపు 20 రోజులు అవుతున్నప్పటికి రబాడ తిరిగి భారత్‌కు మళ్లీ రాలేదు.ఈ క్రమంలో తన స్వదేశానికి వెళ్లిపోవడానికి అస్సలు కారణాన్ని రబాడ వెల్లడించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 సమయంలో నిషేదిత డ్రగ్ వాడడంతో తనపై తాత్కలిక సస్పెన్షన్ వేటు పడినట్లు రబాడ తెలిపాడు. అందుకే ఐపీఎల్ మధ్యలోనే వైదొలిగనట్లు ఈ స్పీడ్ స్టార్ స్పష్టం చేశాడు. దీంతో ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్‌లకు కూడా రబాడ దూరం కానున్నాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్లో దక్షిణాఫ్రికా తరపున కూడా రబాడ అడేది సందేహంగా మారింది.నేను ఐపీఎల్లో ఆడకుండా వ్యక్తిగత కారణాల వల్ల తిరిగి దక్షిణాఫ్రికాకు వచ్చానని ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ఓ ప్రకటన చేసింది. అయితే నిషేధిత డ్రగ్ వాడడంతో సౌతాఫ్రికా క్రికెట్ నాపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. అందుకే ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లాల్సి వచ్చింది. ఈ తప్పు చేసినందుకు అందరికి క్షమాపణలు తెలుపుతున్నాను. క్రికెట్ ఆడే అవకాశాన్ని ఎల్లప్పుడూ నేను అరుదైన గౌరవంగా భావిస్తాను. తిరిగి నాకు ఇష్టమైన ఆట ఆడేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఈ కఠిన సమయంలో సపోర్ట్‌గా నిలిచిన నా ఏజెంట్, సౌతాఫ్రికా క్రికెట్, గుజరాత్ టైటాన్స్‌కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను" అని ఓ ప్రకటనలో రబాడ పేర్కొన్నాడు.
బిజినెస్

లాంచ్‌కు సిద్దమవుతున్న కార్లు ఇవే.. వివరాలు
2025 ప్రారంభం నుంచి అనేక వాహన తయారీ సంస్థలు దేశీయ మార్కెట్లో కొత్త కార్లు, అప్డేటెడ్ కార్లను లాంచ్ చేస్తూనే ఉన్నాయి. కాగా ఈ నెలలో (2025 మే) వోక్స్వ్యాగన్, కియా, ఎంజీ మోటార్ వంటి కంపెనీలు తమ కార్లను పరిచయం చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ కథనంలో త్వరలో మార్కెట్లో లాంచ్ కానున్న కార్లను గురించి తెలుసుకుందాం.కియా క్లావిస్ఈ నెలలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానున్న కార్ల జాబితాలో కియా క్లావిస్ ఒకటి. ఇది అప్డేటెడ్ కియా కారెన్స్ అని తెలుస్తోంది. అయితే క్లావిస్ కొత్త డిజైన్, అప్డేటెడ్ ఇంటీరియర్ ఫీచర్స్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, డేటైమ్ రన్నింగ్ లైట్లు అన్నీ కూడా అప్డేట్ అయ్యాయని సమాచారం. రియర్ బంపర్లు, కొత్త అల్లాయ్ వీల్ డిజైన్ అన్నీ కూడా కారెన్స్ కంటే భిన్నంగా ఉంటాయి. ఇంటీరియర్ ఫీచర్స్ గురించి అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. అంతే కాకుండా ఇది మూడు ఇంజిన్ ఎంపికలతో రానున్నట్లు తెలుస్తోంది.ఎంజీ విండ్సర్ (50 కిలోవాట్ బ్యాటరీ)ప్రస్తుతం 39 కిలోవాట్ ప్యాక్ కలిగిన ఎంజీ విండ్సర్ కారు.. ఈ నెలలో 50 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో లాంచ్ కానుంది. ఇది 460 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 39 కిలోవాట్ ప్యాక్ 332 కిమీ రేంజ్ అందిస్తుంది. రాబోయే ఎంజీ విండ్సర్ డిజైన్, ఫీచర్స్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ మోటారు విషయంలో స్పష్టత రావడం లేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.ఇదీ చదవండి: ఏప్రిల్ 2025లో ఎక్కువమంది కొన్న కారు ఇదే..ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐగ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న.. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ ఈ నెలలోనే ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఇది సొగసైన ఎల్ఈడీ లైట్ సిగ్నేచర్, జీటీఐ బ్యాడ్జింగ్, హానీ కూంబ్ గ్రిల్, వెనుక భాగంలో డిఫ్యూజర్, రిఫ్రెష్డ్ టెయిల్‌లైట్ మొదలైనవి ఉన్నాయి. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్ సిస్టమ్, టెయిల్‌గేట్‌పై GTI బ్యాడ్జ్‌లు కనిపిస్తాయి. అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారులో 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 265 హార్స్ పవర్, 370 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్2020లో ప్రారంభమైన టాటా ఆల్ట్రోజ్ త్వరలో ఫేస్‌లిఫ్ట్ రూపంలో మార్కెట్లో లాంచ్ కానుంది. ఇది కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, రీపోజిషన్ డీఆర్ఎల్, అప్డేటెడ్ ఫ్రంట్ ఎండ్ వంటి వాటితో పాటు.. కొత్త అల్లాయ్ వీల్స్ కనిపిస్తాయి. ఈ కారులో ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే టాటా లోగోతో కూడిన రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్. ఇది కాకుండా.. పెద్ద టచ్‌స్క్రీన్, అప్డేటెడ్ డాష్‌బోర్డ్, ఏసీ కంట్రోల్స్,, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీల కెమెరా, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే కూడా ఇందులో ఉండనున్నాయి.

కొత్త రిసార్ట్‌లను ప్రారంభించిన క్లబ్ మహీంద్రా
మహీంద్రా హాలిడేస్ & రిసార్ట్స్ ఇండియా లిమిటెడ్ (MHRIL)లో ప్రధాన బ్రాండ్ అయిన 'క్లబ్ మహీంద్రా' దాని పోర్ట్‌ఫోలియోలో మూడు కొత్త రిసార్ట్‌లను జోడించినట్లు ప్రకటించింది. బ్రాండ్ విస్తరణలో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లోకి కూడా ప్రవేశించింది. అంతే కాకుండా.. బ్రాండ్ వియత్నాంలోని సైగాన్ ప్రాంతం.. అబుదాబిలో కూడా తన ఉనికిని బలోపేతం చేసుకుంది.ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరిలోని దిండి ఆర్వీఆర్.. అద్భుతమైన నదీతీర రిట్రీట్ గంభీరమైన గోదావరి నది వెంబడి ఉంది. పచ్చని కొబ్బరి తోటలు, సుందరమైన బ్యాక్ వాటర్‌లతో చుట్టుముట్టబడిన ఈ రిసార్ట్, కుటుంబం & స్నేహితులతో కాలం గడపడానికి అనువైన ప్రదేశం. ఈ రిసార్ట్‌లో 100 గదులు ఉన్నాయి. మొదటి దశలో 50 గదులు ప్రారంభమవుతాయి. మిగిలిన 50 గదులు ఈ ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నాటికి ప్రారంభమవుతాయని సమాచారం.

వంట గది ఆహ్లాదం.. చిమ్నీ పాత్ర కీలకం
సాక్షి, సిటీబ్యూరో: ఇంటిలో వంట గది ప్రత్యేకతే వేరు. కుటుంబ సభ్యుల ఆనందం, ఆరోగ్యంలో కిచెన్ కీలకమైంది. వంట ఏదైనా సరే ఘాటు వాసన, పొగ ఇళ్లంతా వ్యాపించి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అందుకే వంట గదిలో చిమ్నీల ఏర్పాటు అనివార్యమైపోయింది. దీంతో ఇంటిలో ఘాటు వాసనలు వ్యాపించకపోవడమే కాకుండా చమురు, జిడ్డు మరకలు గోడలు మసకబారకుండా శుభ్రంగా ఉంటాయి.చిమ్నీ రకాలు బోలెడువాల్ మౌంటెడ్: స్టౌ గోడకు ఆనుకొని ఉంటే వాల్‌మౌంటెడ్ చిమ్నీ ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిని గోడలకు అమర్చడం వల్ల నేరుగా పొగ, ఘాటు వాసనలను సంగ్రహించుకోవడంలో బాగా పనిచేస్తాయి.ఇన్‌బిల్ట్: కిచెన్ క్యాబినెట్ లేదా గోడలో ఇన్ బిల్ట్ చిమ్నీ కలిసిపోతుంది. ఘాటైన వాసనలు పీల్చే శక్తివంతమైన వ్యవస్థగా పనిచేస్తుంది. టెలిస్కోపిక్: ఈ రకం పైకప్పులలో ఇమిడిపోతాయి. వంట చేసేటప్పుడు చిమ్నీని పొడిగించుకోవచ్చు కూడా. చిన్న వంటగదిలో ఉపయోగపడతాయి. కార్నర్: స్థలం తక్కువగా ఉండే వంట గదిలో ఓ మూలన వినియోగిస్తారు. డక్ట్‌లెస్: గొట్టాలను అమర్చడానికి వీలులేని వంట గదిల్లో వినియోగిస్తారు. ఇవి గాలిని వెలుపలికి వదలకుండా వాటిలో ఉండే ఫిల్టర్స్ పొగ, ఆవిరి, చమురును పీల్చుకొని శుద్ధి చేస్తాయి. కన్వర్టబుల్: డక్టెడ్, డక్ట్‌లెస్ చిమ్నీలుగా మార్చుకునే అవకాశం ఉండేవే కన్వర్టబుల్. దీన్ని వంట గదికి అనుగుణంగా మార్చుకునే వీలుంటుంది. స్టాంటెండ్: కుక్‌టాప్ వద్ద వాలుగా ఉండే ఈ చిమ్నీ విలాసవంతంగా కనిపిస్తుంది. టెక్నీషియన్స్ ద్వారా శుభ్రం చేయించుకోవాల్సి ఉంటుంది. బయటకు కనిపించకుండా సీలింగ్ మౌంటెడ్లో అమరుస్తారు. ఐలాండ్: స్టౌ వేదిక ద్వీపంలా, కిటికీల చెంత స్టౌలు ఉంటే ఐలాండ్ లేదా సీలింగ్ మౌంటెడ్ చిమ్నీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇవి గోడల నుంచి దూరంగా ఉండటం వల్ల మరింతగా వాసనలు, పొగను సంగ్రహిస్తాయి.

'అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుంది': జాగ్రత్తగా ఉండండి
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తన 'ఎక్స్' ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ చేస్తూ.. నిరుద్యోగ భయం ప్రపంచవ్యాప్తంగా వైరస్ మాదిరిగా ఎలా వ్యాపిస్తుందో వివరించారు. జాగ్రత్తగా ఉండండి, అని చెబుతూనే.. నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని వాస్తవికతను వెల్లడించారు. అంతే కాకుండా తన పుస్తకాన్ని గురించి ప్రస్తావిస్తూ.. పుస్తకంలో తాను పేర్కొన్నట్లు జరగకపోతే మంచిదని అన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, మార్కెట్ క్రాష్ అవుతాయి. గుర్తుంచుకోండి. అయితే దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. దేనికైనా సిద్ధంగా ఉండండి. దీన్ని కూడా ఒక అవకాశంగా తీసుకోండని రాబర్ట్ కియోసాకి అన్నారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని తిప్పికొట్టడానికి, అభ్యాసంగా మార్చుకోవడానికి.. ఒక మార్గాన్ని కనుగొన్నానని ఆయన తెలిపారు.మార్కెట్ పతనమయ్యే సమయంలో.. చాలా తెలివిగా పెట్టుబడులు పెట్టాలనే తన ఆదర్శాన్ని రాబర్ట్ కియోసాకి పంచుకున్నారు. ఆ సమయంలోనే నిజమైన ఆస్తులు అమ్మకానికి వస్తాయంటూ పేర్కొన్నారు. అనేక కారణాల వల్ల మార్కెట్లలో అల్లకల్లోలం సంభవిస్తుంది. అలాంటి స్థితిలో కూడా వారెన్ బఫెట్ మాదిరిగా ఆలోచించి.. పెట్టుబడులు పెట్టాలని అన్నారు.ఇదీ చదవండి: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు: కారణం ఇదే..బిట్‌కాయిన్ విలువ 300 డాలర్లకు పడిపోతే.. బాధపడతారా?, సంతోషిస్తారా? అని రాబర్ట్ కియోసాకి ప్రశ్నించారు. ఇదే జరిగితే (బిట్‌కాయిన్ విలువ తగ్గితే) పెట్టుబడి పెట్టేందుకు ఒక చక్కటి అవకాశం అవుతుంది. ఆర్థిక మాంద్యం గురించి ప్రజలను సిద్ధంగా ఉంచాలని తాను ఈ పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా ఆర్థిక మాంద్యం పరిస్థితిపై సానుకూల దృక్పథాన్ని కలిగిస్తూ.. ఆందోళన చెందుతున్న పెట్టుబడిదారుల్లో ధైర్యం నింపేందుకు ఓప్రా విన్ఫ్రే, అబ్రహం లింకన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, జార్జ్ పటేర్నోల కోటేషన్స్‌ను కూడా రాబర్ట్ పోస్ట్‌కు జోడించారు.FEAR of UNPLOYMENT spreads like a virus across the world.Obviously, this fear is not good for the global economy.As warned in an earlier book, Rich Dads Prophecy, the biggest market crash, a crash that is leading to the recession we are in…. and possible New Great…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 30, 2025
ఫ్యామిలీ

నా డ్రీమ్స్.. కరియర్ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నా
మాతృత్వం ఒక వరమే.కానీ అంతకుమించిన బాధ్యతల భారం కూడా. కుటుంబ సభ్యులు, భర్త సహకారం ఉన్నపుడు నిజంగా ఏ మహిళకైనా గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం, పాలిచ్చి పోషించడం లాంటి వన్నీ జీవితాంతం పదిలపర్చుకునే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఇంత ముఖ్యమైన విషయాన్ని అటు కుటుంబ సభ్యులు, ఇటు సమాజమూ గుర్తించాలన్న స్పృహ ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. దీనికి తోడు చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ అంశంపై బహిరంగంగా చర్చిస్తుండటం మంచి పరిణామం. ఈ కోవలోకి తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే చేరింది.హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరు దీపికా పదుకొణే (Deepika Padukone). అందానికి తగ్గ అభినయం, అభిమానుల హృదయాలను దోచుకుంది. బాలీవుడ్లో అనేక బ్లాక్ బస్టర్ మూవీలను తన సొంతం చేసుకుంది. తనదైన నటనతో దర్శక నిర్మాతల ఫ్యావరేట్‌గా మారింది. హీరోయిన్గా కరియర్ కొనసాగిస్తూనే, బాలీవుడ్ హీరో,ప్రేమికుడు రణవీర్ సింగ్‌ను 2018లో వివాహం చేసుకుంది. 2024లో తొలి బిడ్డ దువాకు జన్మనిచ్చింది. వేవ్స్ సమ్మిట్ 2025లో దీపిక తన కూతురు దువాకుతో తనకున్న అనుబంధం, చిన్నారి వచ్చిన తరువాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడింది.ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన WAVES 2025 సమ్మిట్‌లో మాతృత్వం, బిడ్డ పెంపకం గురించి మాట్లాడినపుడు. దీపికా పదుకొనే మాతృత్వాన్ని స్వీకరించడం గురించి, దువా రాక తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది స్పష్టంగా,చాలా ఉత్సాహంగా చెప్పుకొచ్చింది. పాపాయి రక్షణ కోసం ఎలాంటి ఆయాను (నానీ)ని నియమించుకోలేదు దీపిక. స్వయంగా తానే ఆ బాధ్యతను తానే తీసుకుంది. తల్లినయ్యాక కొత్త జీవితాన్ని అనుభవిస్తున్నానని చెప్పింది. తల్లికాక ముందు, తన కలలు తన ఆశయాలు మాత్రమే ఉండేవి, కానీ ఇపుడంతా ఆమె గురించే. ఇదీ చదవండి: నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్ షూస్ : ఎవరీ అందాల రాణి?"అమ్మ అయిన తర్వాత కొత్త జీవితాన్ని చూస్తున్నాను. బిడ్డను కన్న క్షణంనుంచి మరో ప్రాణిని పోషించే బాధ్యత వహించాలి. ముఖ్యంగా నాలాంటి జీవనశైలి ఉన్నవారికి, ముఖ్యంగా ఇల్లు వదిలి వెళ్ళడం, నా ఆశయం, నా కెరీర్ ఇలా ప్రతిదీ నా జీవితం, ఇలా ప్రతిదాని గురించి ఆలోచించాను. ఇప్పుడు, అకస్మాత్తుగా, పాపాయి మీద శ్రద్ద వహించాలి. తల్లి కావాలని కోరుకున్నాను కనుక, ప్రతి అంశాన్ని ఆస్వాదిస్తున్నాను, " అని దీపికా పేర్కొన్నారు.మరోవైపు షారుఖ్ ఖాన్ దీపికా పదుకొణేను ప్రశంసల్లో ముంచెత్తారు. దువాకు తల్లి అయినందుకు షారుఖ్ దీపికను అభినందించారు. నటి పోషించగల ఉత్తమ పాత్ర నిజ జీవితంలోనే అని, ఇప్పుడు ఆమె తన పాప దువాకు తల్లి అని అన్నారు.చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్!

ఏసీతో పనిలేకుండానే హీట్‌ని బీట్ చేద్దాం ఇలా..!
సూర్యుడి ప్రతాపం రోజు రోజుకి ఎక్కువవుతోంది. పది దాటితో బయటికి రావడమే కష్టంగా ఉంది ఈ సమ్మర్లో. ఇక రాత్రిళ్లు ఉక్కపోతలు, తట్టుకోలేని ఉడుకుతో కంటిమీద కునుకు పడితే ఒట్టు అంటూ వాపోతుంటారు ప్రజలు. ఆరుబయట సేద తీరదామన్న..పక్కపక్కనే బిల్డింగ్లు ఉండటంతో గాల్పు కొడుతూ వేడిగా ఉంటుంది. రవ్వంత గాలి కూడా రాదు. ఏసీ లేనిదే పనికాదేమో అన్నంతగా సమ్మర్ తారెత్తిస్తుంటుంది. అలాంటప్పడు ఏసితో పనిలేకుండా తక్కువ ఖర్చుతోనే ఇంటిని చల్లగా మార్చుకుని హాయిగా నిద్రపోవచ్చు. అదెలాగా చూద్దామా..!.ఇంట్లోనే ఫ్యాన్‌తో..బయటి చల్లగాలి లోపలికి వచ్చేలా కిటికీ దగ్గర ఉండే ఫ్యాన్‌ను ఉంచండి లేదా గదిలోపల గాలిప్రసరణ మెరుగుపరుచుకునేలా సీలింగ్ లేదా స్టాండింగ్ ఫ్యాన్‌ను ఉపయోగించండి. రాత్రి సమయంలో వేడి గాలిని బయటకు నెట్టేలా కిటికీలో బయటకి ఎదురుగా ఫ్యాన్‌ను ఉంచండి. అలాగే ఇత ఓపెనింగ్‌ల నుంచి చల్లని గాలి లోపలకు వచ్చేలా చూసుకోండికర్టెన్లు లేదా బ్లైండ్‌లతో మూసి ఉంచడంనేరుగా సూర్యకాంతి గదిలో పడకుండా నిరోధించాలి. అంటే కిటికీలు మూసేయడం. కర్టెన్లు, బ్లైండ్‌లతో కవర్ చేయడం లేదా తడికల్లాంటివి ఏర్పాటు చేసుకోవడం. లేతరంగు లేదా ఇన్సులేటెడ్ కర్టెన్లు ఉపయోగించడం మంచిది.ఇవి 40% వరకు వేడిని తగ్గిస్తాయి.రాత్రిపూట గాలి ప్రసరణ కోసం కిటికీలు తెరవడంఫ్యాన్ ముందు మంచు నీరు లేదా మాములు నీళ్లు బకెట్ ఉంచడం..బాష్పీభవన శీతలీకరణను సృష్టించడానికి ఫ్యాన్ ముందు ఒక బకెట్ మంచుగడ్డ లేదా చల్లని నీటిని ఉంచండి. ఈ పద్ధతిఫ్యాన్ద్వారా వచ్చే గాలిని చల్లబరుస్తుంది. ఇది పొడి వాతావరణంలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది.నేలపై పడుకోవడం..వేడిగాలి పెరుగుతుంది కాబట్టి నేలపే కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల చల్లదనంగా అనిపిస్తుంది.తేలికైనా.. గాలి ఆడే దుస్తులు ధరించడంతేమను దూరం చేసి.. చర్మం శ్వాస తీసుకోవడానికి వీలు కల్పించే కాటన్ లాటి తేలికైన వదులు దుస్తులను ధరించాలి. ఇవి తేమను దూరం చేస్తాయి. చర్మం శ్వాస తీసుకోవడానికి అనుమతించడమే గాక శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయిపరుపు, దిండ్లు చల్లగా ఉండేలా చేయడం..పడుకునే ముందే..బెడ్షీట్లు, దిండ్లు, పరుపు చల్లగా ఉండేలా కేర్ తీసుకుంటే హాయిగా నిద్రపట్టేస్తుంది.తడి తువ్వాళ్లు లేదా స్ప్రే బాటిళ్లు..తడి తువ్వాళ్లు వేయడం లేదా చల్లటి నీటితో నిండిన స్ప్రే బాటిల్ రిఫ్రెషింగ్ చల్లదనాన్ని అందిస్తుంది. నిద్రించడానికి ముందు మంచం మీద తడిగా ఉన్న టవల్‌ను ఉంచండి తద్వారా పరుపు చల్లగా ఉంటుంది. వేడిని ఉత్పత్తి చేసే వాటిని నివారించడంఉపయోగంలో లేనప్పుడు ఇన్కాండిసెంట్ బల్బులు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌లను ఆపివేయండి. తక్కువ వేడిని విడుదల చేసి, శక్తిని ఆదా చేసే LED బల్బులను ఎంచుకోండి.తేలికగా తినండి, హైడ్రేటెడ్‌గా ఉండండిహైడ్రేటెడ్గా ఉండటానికి తగినంత నీరు తాగండి. ప్రోటీన్ అధికంగా ఉండే భోజనాలను నివారించి.. పండ్లు, స్మూతీస్ వంటి తాజా చల్లని ఆహారాలు తీసుకోవడం మంచిది.ఈ పద్ధతులన్ని ఎయిర్ కండిషనింగ్ ఖర్చు లేకుండా వేడి వాతావరణంలో సౌకర్యవంతంగా ఉండటానికి సహాయపడతాయి.(చదవండి: స్లిమ్‌గా బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!)

నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్ షూస్ : ఎవరీ అందాల రాణి?
ఫ్యాషన్ ఐకాన్, అందమైన రాణి. సాటిలేని అందగత్తె మాత్రమే కాదు అపర మేధావి కూడా. ఆమె పేరే కూచ్ బెహార్ మహారాణి ఇందిరా దేవి. అందానికి మించిన తెలివితేటలు, అంతకుమించిన ఐశ్వర్యంతో తులతూగిన మహిళ. బరోడాలోని విలాసవంతమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో యువరాణిగా పెరిగింది. పాఠశాల, కళాశాలకు వెళ్ళిన తొలి యువరాణి కూడా ఇందిర కావడం విశేషం. పదండి ఇందిరా దేవి జీవిత విశేషాలు, విలాసవంతమైన జీవన శైలి గురించి తెలుసుకుందాం.బరోడా మహారాజు సాయాజిరావు గైక్వాడ్ III , అతని రెండవ భార్య చిమ్నాబాయి II ల కుమార్తె ఇందిర. చాలా చిన్న వయస్సు నుండే చాలా తెలివిగా, సామాజిక స్పృహతో ఉంటూ, అనేక సామాజిక సమస్యలపై గొంతెత్తిన మహిళ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులకు విలాసవంతమైన పార్టీలను ఇచ్చేదట. ఫ్యాషన్‌కు పెట్టింది పేరైన ఇందిర ఖరీదైన దుస్తులను ధరించేదట. అంతేకాదు ఒకసారి ఆమె వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన 100 జతల ఫెర్రాగామో బూట్లు ఆర్డర్ చేసిందట. ఆమె ధరించే సాండిల్స్ కూడా చాలా ఖరీదైనవే.మహారాణి ఇందిరాదేవి విలాసవంతమైన ప్రతిదాన్ని ఇష్టపడేవారట. చరిత్రకారుడు అంగ్మా డే ఝాలా రాసిన ఒక పుస్తకం, రాయల్ ప్యాట్రనేజ్, పవర్, అండ్ ఈస్తటిక్స్ ఇన్ ప్రిన్స్లీ ఇండియా అనే పుస్తకంలో ఇందిరా దేవికి సంబంధించిన అనేక విశేషాలను పొందుపర్చారు. మహారాణి ఇందిరా దేవికి పాదరక్షలంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఆమె ధరించే బూట్ల బ్రాండ్ చాలా స్పెషల్ అనీ, నాణ్యమైన బూట్లకు ప్రసిద్ధి చెందిన ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ సాల్వటోర్ ఫెర్రాగామోను చాలా ఇష్టపడేదని రాసుకొచ్చారు.1938లో మహారాణి కెంపులు, వజ్రాలు, పచ్చలతో పొదిగిన కస్టమ్-మేడ్ సాల్వటోర్ ఫెర్రాగామో 100 జతల ఫెర్రాగామో బూట్లను ఆర్డర్ చేసింది. కప్పబడి ఉంది. ఇవి 20వ శతాబ్దపు ఇటలీలోని ఫ్లోరెన్స్‌లోని మ్యూజియో సాల్వటోర్ ఫెర్రాగామోలో ప్రదర్శించారని కూడా తెలిపారు.చదవండి: Good Health: వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా?అందమైన , షిపాన్ చీరలు షిఫాన్ చీరను ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనత ఆమెకు దక్కింది. పారిస్ నుండి 45-అంగుళాల వెడల్పులో నేసిన షిఫాన్ చీరలను ఆర్డర్ చేసేది. ఢిల్లీ , కలకత్తాలో ఆమె కొనుగోలు చీరలను కొనుగోలు చేసిన ఒక ఏడాది తరవాత మాత్రమే ఇతర కస్టమర్లకు అదే నమూనాను తయారు చేయడానికి అనుమతి ఉండేది అంటే ఆమె స్టేటస్‌ను అర్థం చేసుకోవచ్చు.ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ ప్రేమ వివాహం18 ఏళ్ళ వయసులో మహారాణి ఇందిరా దేవి గ్వాలియర్ మహారాజు మాధో రావు సింధియాతో నిశ్చితార్థం అయింది. 1911లో ఢిల్లీ పర్యటన సందర్భంగా మహారాజు తీరు, ముఖ్యంగా గ్వాలియర్ , బరోడా రాజ కుటుంబాల మధ్య సంబంధాలపై రాజకీయ పరిణామాలు కారణంగా ఆమె నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. దీని వల్ల తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిసినా సాహసమైన నిర్ణయం తీసుకుంది. తరువాత ఆమె అప్పటి కూచ్ బెహార్ మహారాజు తమ్ముడు యువరాజు జితేంద్ర నారాయణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఊహించినట్టుగానే ప్లేబాయ్‌గా పేరు తెచ్చుకున్న జితేంద్రతో వివాహాన్ని దీన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. కానీ లండన్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయంలో అతడిని పెళ్లాడింది.ఇదీ చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్!సోదరుడు మహారాజా రాజేంద్ర నారాయణ్ మరణించిన తర్వాత, జితేంద్ర కూచ్ బెహార్ మహారాజు అయ్యాడు. ఈ జంట జీవితం సంతోషంగాగడిచింది.కానీ జితేంద్ర మితిమీరిన మద్యపానం అతని అకాల మరణానికి దారితీసింది.వివాహమైన పదేళ్లకు జితేంద్ర మరణించడంతో ఐదుగురు పిల్లలతో ఇందిర ఒంటరిదై పోయింది. రాణి ఇందిరా దేవి తన ఐదుగురు పిల్లలతో కూచ్ బెహార్ వ్యవహారాలను నిర్వహించింది. ఆ కాలంలోనే అన్ని ఆంక్షలను తోసిపుచ్చి ఇందిర స్వతంత్ర జీవితాన్ని గడిపింది. ఇంగ్లాండ్ , ఫ్రాన్స్‌లలో ఉంటూ హాలీవుడ్ తారలు, సన్నిహితులతో లగ్జరీ పార్టీలతో ఉత్సాహవంతమైన జీవితాన్ని గడిపింది. ఆమె స్వేచ్ఛా జీవితం, తెలివితేటలు, ఆమెకు బలమైన మహిళగా ఖ్యాతిని తెచ్చిపెట్టాయి."అత్యంత అందమైన , ఉత్తేజకరమైన మహిళ అమ్మ. ఆమె తెలివితేటలు ఆమె ప్రేమ, వెచ్చదనం , సున్నితమైన చూపుల అసమానమైన కలయికగా నా జ్ఞాపకంలో ఉంది." తన తల్లి గురించి ఇందిరా దేవి కుమార్తె మహారాణి గాయత్రీ దేవి మాటలివి. 1892లో జన్మించిన రాణి ఇందిరా దేవి 1968లో 76 సంవత్సరాల వయసులో మరణించారు.

హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్!
పెళ్లి అంటే ఆ సందడే వేరుంటుంది. నిశ్చితార్థం దగ్గర్నుంచి, పసుపుకొట్టడం, పెళ్లి కూతుర్ని చేయడం, హల్దీ, సంగీత్, బారాత్ ఇలా ప్రతీదీ చాలా ఘనంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటారు. ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట అన్నట్టు సాగుతుంది ఈ సందడి. అలాగే బంధువులు, సన్నిహితులు, వధూవరుల ఫ్రెండ్స్ చేసే అల్లరి, అనుకోని సర్ప్రైజ్లు, సరదా సరదా సంఘటనలు చాలా కామన్. కానీ స్వయంగా పెళ్లి కూతురే అక్కడున్న వారందరికీ షాకిస్తే... పదండి అదేంటో చూద్దాం.న్యూఢిల్లీకి చెందిన ఓ జంట పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన హల్దీ వేడుక (haldi ceremony) నెట్టింట సందడిగా మారింది. వధువు చేసిన సర్ప్రైజ్ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. అక్కడంతా పెళ్ళికి వచ్చిన అతిథులతో అంతా హడావిడిగా ఉంది. హల్దీ వేడుకలో అందరూ పెళ్లికూతురి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనూ ఉన్నట్టుండి డైనోసార్ ఎంట్రీ ఇవ్వడంతో అతిథులంతా షాక్ అయ్యారు. అందర్నీ పలకరిస్తూ తెగ సందడి చేసింది. అందరితో కలిసి డ్యాన్స్ చేసింది. పెళ్లి కొడుకును కూడా కవ్వించి, సరదాగా ఆటపట్టిస్తూ కాసేను స్టెప్పులేసింది. ఆ తరువాత అసలు విషయం తెలిసాక వేదిక అంతా అందమైన నవ్వులు పూసాయి. అలా వచ్చింది మరెవ్వరో కాదు స్వయంగా వధువే. ఊహించని విధంగా విచిత్రమైన అలంకరణతో రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. View this post on Instagram A post shared by Malkeet Shergill | Anchor | Wedding Host (@malkeetshergill)తనకు కాబోయే భార్య చిలిపితనం, ఊహించని గెటప్ చూసి వరుడు కూడా నవ్వుతూ, సిగ్గుల మొగ్గయ్యాడు. ఆ తరువాత ముసి ముసి నవ్వులతో కాబోయే జంట స్టెప్పులేయడం విశేషం. ఇన్స్టాగ్రామ్ యూజర్ మల్కీత్ షెర్గిల్ అప్లోడ్ చేసిన వీడియోలో, "కభీ ఐసా కుచ్ దేఖా హై?" అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ అయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. మీ క్రియేటివిటీకి ఓ దండం రా బాబూ అని ఒకరంటే, ఇలా ఉన్నారేంట్రా బాబూ అని మరికొందరు కామెంట్ చేశారు. గాడ్జిల్లా కాదు బ్రైడ్జిల్లా అని కామెంట్ చేయడం విశేషం.
ఫొటోలు


చెన్నైలో గ్రాండ్‌గా నటి అభినయ రిసెప్షన్ వేడుక (ఫొటోలు)


కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ సింగర్ ఉష (ఫొటోలు)


శ్రీవిష్ణు #Single మూవీ ట్రైలర్ ఈవెంట్లో కేతిక శర్మ సందడి (ఫొటోలు)


హైదరాబాద్ : గోల్కొండ కోటలో పర్యాటకుల సందడి (ఫొటోలు)


యువరాణిలా ముస్తాబైన హీరోయిన్ నభా నటేష్ (ఫొటోలు)


వేవ్స్ సమ్మిట్ లో శోభిత.. ఎంత అందంగా ఉందో? (ఫొటోలు)


దిల్ రాజు కూతురి 10వ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)


పూర్ణ కుమారుడి సెకండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)


శిఖర్ ధావన్‌తో ప్రేమలో ఐరిష్ బ్యూటీ.. ఈమె గురించి తెలుసా? (ఫొటోలు)


స్టెప్పులేస్తే ఆ సంతోషమే వేరంటున్న నిక్కీ గల్రానీ (ఫోటోలు)
అంతర్జాతీయం

Air India: పాక్ గగనతలంపై ఆంక్షలు.. ఎయిరిండియాకు వేల కోట్ల నష్టం
ఢిల్లీ: కశ్మీర్‌లోని పహల్గాం భూతల స్వర్గం.. ఆ ప్రదేశంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడితో భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత్‌లోని ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియాకు వేలకోట్ల నష్టం వాటిల్లింది.పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. దీంతో పాక్ సైతం భారత్‌పై పలు ఆంక్షలు విధించింది. పాక్ గగన తలంపై భారత విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.ఆ నిర్ణయంతో ఎయిరిండియా సుమారు 600 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ గగనతలంపై భారత విమానాల రాకపోకలపై నిషేదం కారణంగా విమానాల దారి మళ్లింపు, పెరిగిన ప్రయాణ దూరం, అదనపు ఇంధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఫలితంగా ప్రతీ ఏడాది తమ సంస్థకు 591 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేసింది.ఈ నష్టం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని కోరుతూ విమానయాన శాఖకు ఎయిరిండియా యాజమాన్యం లేఖ రాసినట్లు సమాచారం. గగనం తలంపై పాక్ తీసుకున్న నిర్ణయంతో ఒక్క ఎయిరిండియా మాత్రమే కాదని టాటా గ్రూప్‌కు చెందిన ఇతర విమానాల సర్వీసులపై ప్రభావం పడనున్నట్లు ఆ లేఖలో పేర్కొంది.ఉదాహరణకు ఇండిగో గురువారం న్యూఢిల్లీ-బాకు (అజర్బైజాన్లో) విమానం ఐదు గంటల 43 నిమిషాలు ప్రయాణించింది. పాక్ గగన తలం నుంచి కాకుండా దారి మళ్లించిన కారణంగా 38 నిమిషాలు ఎక్కువ సమయం పట్టింది. ఆ సమయానికి అదనంగా ఇంధనం వెచ్చించాల్సి ఉంటుంది. ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అందించే ఇతర సర్వీసుల్లో సైతం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.అయితే, మిగితా విమానయాన సంస్థలతో పోలిస్తే ఎయిరిండియా పలు ప్రపంచ దేశాలకు విమానాల రాకపోకలన్నీ పాకిస్తాన్ గగన తలం నుంచే నిర్వహిస్తుంది. పాక్ తాజా నిర్ణయం ఎయిరిండియాపై కాస్త ప్రతికూల ప్రభావం పడనుంది. ఉదాహరణకు, ఢిల్లీ-మిడిల్ ఈస్ట్ విమానాలు ఇప్పుడు కనీసం ఒక గంట అదనంగా ప్రయాణించవలసి వస్తుంది, దీనికి ఎక్కువ ఇంధనం అవసరం అవుతుంది.ఎయిరిండియా దాని బడ్జెట్ సర్వీస్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగోలు గత నెలలో పదిహేను రోజుల్లో న్యూఢిల్లీ నుండి యూరప్, మిడిల్ ఈస్ట్, ఉత్తర అమెరికాలోని గమ్యస్థానాలకు 1,200 విమానాలు బయలుదేరాయని అంచనా.

ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు
జెరూసలేం: ఇజ్రాయెల్‌లోని జెరూసలేం సమీపంలో భారీ కార్చిచ్చు చెలరేగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 13 మంది గాయపడ్డారు. మంటలను ఆర్పేందుకు అగి్నమాపక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కార్చిచ్చు ఆందోళనతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రద్దు చేసిన ఇజ్రాయెల్.. మంటలు ఆర్పేందుకు అంతర్జాతీయ సాయం కోరుతోంది. జెరూసలేం నగర శివార్లలో చెలరేగుతున్న భారీ మంటల కారణంగా అధికారులు కేవలం 24 గంటల్లో వేలాది మంది నివాసితులను ఖాళీ చేయించారు. ఇజ్రాయెల్ అత్యవసర వైద్య సేవ ఇప్పటివరకు 23 మందికి చికిత్స అందించింది. వారిలో 13 మంది కాలిన గాయాలు, పొగ పీల్చడంతో ఆసుపత్రి పాలయ్యారు. జెరూసలేం నుంచి టెల్ అవీవ్ వెళ్లే ప్రధాన మార్గంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల కొండటలపై దట్టమైన పొగలు వ్యాపించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మంటల ధాటికి చాలా మంది తమ కార్లను వదిలేసి పరుగులు తీయడంతో గందరగోళం నెలకొంది. వందలాది మంది పౌరులు ఇప్పటికీ ప్రమాదంలో ఉన్నారని ఏజెన్సీ హెచ్చరించింది. కార్చిచ్చు కొనసాగుతున్న రూట్ 1 సహా పలు రహదారులను మూసివేశారు. 160 రెస్క్యూ, అగి్నమాపక బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. అలాగే డజన్ల కొద్దీ విమానాలు, హెలికాప్టర్లు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆ దేశ సైన్యం కూడా గాలింపు, సహాయక చర్యలకు సహకరిస్తోంది. అయితే పొడి వాతావరణం, అధిక గాలుల కారణంగా మంటలు మరింత తీవ్రమవ్వడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. ఈ కార్చిచ్చు ఈ దశాబ్దంలోనే అతి పెద్దదని ఇజ్రాయెల్ అగి్నమాపక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మంటలు చెలరేగుతున్న ప్రాంతాల్లోని జాతీయ ఉద్యానవనాలు, అడవుల వైపు ప్రజలు వెళ్లకుండా నిషేధించారు. ‘‘జెరూసలేం హిల్స్‌లో జరిగిన అగి్నప్రమాదం ఈ దేశంలోనే అతిపెద్దది కావచ్చు.మా యాక్టివిటీకి సంబంధించి. ఇది చాలా కాలం కొనసాగుతుంది. మేము నియంత్రించడానికి చాలా కష్టపడుతున్నాం.’’అని ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ జెరూసలేం జిల్లా కమాండర్ ష్ములిక్ ఫ్రీడ్మన్ చెప్పారు. గంటకు 90–100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో మంటలు మరింత తీవ్రమవుతున్నాయని తెలిపారు. ఇజ్రాయెల్ వైమానిక దళం 18,000 లీటర్ల అగి్నమాపక సామగ్రిని క్యారీ చేయగల సి –130 జె సూపర్ హెర్క్యులస్ భారీ రవాణా విమానాలను ఈ ఆపరేషన్లలో మోహరించింది. ఈ తరహా విమానాలు రెండు మంటలను ఆర్పే ందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే 3వేల ఎకరాల అడవి కాలిపోయింది. 2010 ఉత్తర ఇజ్రాయెల్‌లోని మౌంట్ కార్మెల్లో కార్చిచ్చు.. 12వేల ఎకరాలను దహనంచేసింది. 44 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ప్రస్తుత కార్చిచ్చు ఆ విపత్తు స్థాయి, ప్రభా వంలో అంతకు మించి ఉండవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు.స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రద్దు...కార్చిచ్చు చెలరేగడంతో ఇజ్రాయెల్‌లో జరగాల్సిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వం రద్దు చేసింది. జెరూసలేంలో జరగాల్సిన ప్రధాన ప్రభుత్వ కార్యక్రమం సహా అన్ని ప్రాంతాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు బుధవారం రద్దయ్యాయి. అనంతరం ఈ వేడుకను రికార్డు చేసి ఇజ్రాయెల్ ప్రజలకు ప్రదర్శించారు. కార్చిచ్చు జెరూసలేంను చేరే అవకాశం ఉందని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. పశి్చమంగా వీస్తున్న గాలి మంటలను జెరూసలేం శివార్ల వైపు, నగరంలోకి కూడా సులభంగా నెట్టేయగలదని, జెరూసలేంను రక్షించడమే ప్రస్తుత ప్రాధాన్యతని తెలిపారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కార్చిచ్చును ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ అంతర్జాతీయ సహాయం కోరింది. ఇజ్రాయెల్ విజ్ఞప్తి చేసిన కొద్దిసేపటికే ఉక్రెయిన్ స్పందించింది. మంటలను ఆర్పేందుకు విమానాన్ని పంపనున్నట్టు ప్రకటించింది. స్పెయిన్, ఫ్రాన్స్, రొమేనియా, క్రొయేíÙయా, ఇటలీ, ఉత్తర మాసిడోనియా కూడా విమానాలాను పంపుతామని తెలిపాయి. తోడైన ఇసుక తుఫాను... కార్చిచ్చుకు భారీ ఇసుక తుఫాను తోడయ్యింది. ఆకాశమంతా ఇసుక మేఘాలు నిండిపోవడంతో అసలేమీ కనిపించడం లేదు. నెగెవ్‌లోని ఇజ్రాయెల్ సైనిక స్థావరానికి ఇసుక తుఫాను చేరింది. గాలుల తీవ్రత కారణంగా సైనిక స్థావరం గేట్లను మూసివేయడానికి సైనికులు కష్టపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. పగటి పూట భారీ గాలులు వీస్తాయని, భారీ పొగమంచు ఏర్పడుతుందని, దక్షిణాదిన ఇసుక తుఫానులు కూడా వస్తాయని చెప్పారు. తీరం వెంబడి 98 నుంచి 100 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఖనిజ ఒప్పందం ఖరారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. ఉక్రెయిన్‌లోని అపారమైన అరుదైన ఖనిజ సంపదపై కన్నేసిన ఆయన దాన్ని చేజిక్కించుకోవడంలో అడుగు ముందుకేశారు. ఖనిజాలు తవ్వుకోడానికి అనుమతి ఇస్తేనే రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించడానికి, శాంతిని నెలకొల్పడానికి సహకరిస్తానంటూ మెలికపెట్టి ఉక్రెయిన్ను దారికి తెచ్చుకున్నారు. ట్రంప్ ఒత్తిడికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తలొగ్గక తప్పలేదు. ఖనిజాలను సొంతం చేసుకోవడానికి ట్రంప్‌కు అనుమతి ఇచ్చేశారు.ఈ మేరకు ఉక్రెయిన్–అమెరికా మధ్య కుదిరిన ఒప్పందంపై స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సంతకాలు జరిగాయి. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బీసెంట్, ఉక్రెయిన్ ఆర్థిక మంత్రి యూలియా సిర్దెంకో సంతకాలు చేశారు. ఉక్రెయిన్ భూభాగంలోని గ్రాఫైట్, టైటానియం, అల్యూమినియం వంటి 20కిపైగా ముడి ఖనిజాలు ఇక అమెరికా పరం కానున్నాయి. అలాగే ఖనిజేతర వనరులైన ముడి చమురు, సహజ వాయువు డ్రిల్లింగ్కు సైతం అనుమతి లభించింది. ఒప్పందానికి సంబంధించిన పూర్తివివరాలను ఇరు దేశాలు ప్రస్తుతానికి రహస్యంగానే ఉంచాయి.ఈ కొత్త ఒప్పందాన్ని ‘యూఎస్–ఉక్రెయిన్ రీఇన్వెస్ట్మెంట్ ఫండ్’ అని పిలుస్తున్నారు. ఖనిజాలు తవ్వుకోడానికి అనుమతులు ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఉక్రెయిన్ పునర్నిర్మాణ నిధిని ఏర్పాటు చేస్తారు. ఈ నిధికి ఉక్రెయిన్–అమెరికా సమానంగా డబ్బులు సమకూర్చాల్సి ఉంటుంది. వాస్తవానికి రెండు నెలల క్రితమే ఈ ఒప్పందంపై సంతకాలు జరగాల్సి ఉండగా అనూహ్యంగా ఆగిపోయింది. అప్పట్లో వైట్‌హౌస్‌లో ట్రంప్, జెలెన్స్కీ మధ్య మీడియా సమక్షంలో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. అప్పటి నుంచి జరిగిన ప్రయత్నాలు ఫలించి, ఒప్పందం కుదిరింది. అమెరికాతో ఈ ఒప్పందం పదేళ్లపాటు అమల్లో ఉంటుందని ఉక్రెయిన్ ప్రధానమంత్రి డెనిస్ షిమీహల్ చెప్పారు. ఖనిజాల తవ్వకం, ఆదాయంలో ఇరు దేశాలకు సమాన వాటా లభిస్తుందన్నారు. మూర్ఖుడిగా ఉండదల్చుకోలేదు: ట్రంప్ ఉక్రెయిన్‌కు తాము ఇప్పటిదాకా ఇచ్చిన దానికంటే అధికంగా తిరిగి పొందబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలం పొందలేని మూర్ఖుడిగా తాను ఉండదల్చుకోలేదని అన్నారు. ఒకచోట డబ్బు ఖర్చు పెట్టినప్పుడు లాభపడాల్సిందేనని పరోక్షంగా తేల్సిచెప్పారు. మరోవైపు ఒప్పందాన్ని ఉక్రెయిన్ ప్రభుత్వం స్వాగతించింది. ఇది సమానమైన, గొప్ప అంతర్జాతీయ ఒప్పందమని అభివర్ణించింది. భవిష్యత్తులో అమెరికా నుంచి సైనిక సాయం పొందడానికి ఇది కీలకంగా మారుతుందని ఆకాంక్షించింది. అమెరికాతో బంధం బలపడాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అమెరికాతో కలిసి ఒక నిధిని ఏర్పాటు చేయబోతున్నామని, తమ దేశంలోకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ నిధి దోహదపడుతుందని వెల్లడించింది. కీలకాంశాలు.. ఉక్రెయిన్–అమెరికా ఖనిజ ఒప్పందంలో కొన్ని కీలకాంశాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు 350 బిలియన్ డాలర్లు ఇచ్చామని, ఆ సొమ్ము తిరిగి ఇవ్వాలని ట్రంప్ గతంలో డిమాండ్ చేశారు. కొత్త ఒప్పందం ప్రకారం.. ఆ డబ్బును ఉక్రెయిన్ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. రష్యా పట్ల ఇన్నాళ్లూ సానుకూలంగా మాట్లాడిన అమెరికా స్వరంలో మార్పు వచ్చింది. యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచబోతోంది. రష్యాకు సహకరించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని అమెరికా సంకేతాలిచ్చింది. ఖనిజాలను తవ్వుకొనే అవకాశం అమెరికాకు ఇచ్చినప్పటికీ వాటిపై యాజమాన్య హక్కులు ఉక్రెయిన్‌కే దఖలు పరిచారు. యూ రోపియన్ యూనియన్(ఈయూ)లో చేరాలన్న ఉక్రె యిన్ ఆకాంక్షను అమెరికా ఇకపై అడ్డుకోదు. ఈయూతోపాటు ఇతర దేశాల నుంచి పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం స్వీకరించడానికి అమెరికా సహకరిస్తుంది. అమెరికా నుంచి సైనిక సాయం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. అయితే, ఉక్రెయిన్ భద్రతకు అమెరికా పూర్తి గ్యారంటీ ఇవ్వలేదు. ఆ ఖనిజాలకు ఎందుకంత ప్రాముఖ్యం?ఇతర దేశాల్లో లేని ఆరుదైన ఖనిజ నిల్వలకు ఉక్రెయిన్ కేంద్రంగా మారింది. లిథియం, గ్రాఫైట్, మాంగనీస్, టైటానియం వంటివి నిక్షిప్తమ య్యాయి. 34 కీలక ఖనిజాల్లో 23 రకాల ఖనిజాలు ఇక్కడ ఉన్నాయి. ఇది ఉక్రెయిన్ను ప్రపంచంలోనే విలువైన ఖనిజ వనరులు కలిగిన దేశంగా నిలబెట్టింది. ఆధునిక కాలానికి అవవసరమైన ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, సౌర ఫలకాలు, శక్తి నిల్వ వ్యవస్థలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆయుధాల తయారీకి అవసరమైన లిథియం, కోబాల్ట్ వంటివి ఉక్రెయిన్‌లో పుష్కలంగా ఉన్నా యి.ఇక ముడి ఇనుము, టైటానియం, మాంగనీస్, యురేనియం, నియోడిమియం, డిస్ప్రోసి యం, నియోబియం, టాంటాలమ్, బెరీలియం, కోబాల్ట్, మాంగనీస్, జిర్కోనియం వంటి ఖనిజా లకు లోటులేదు. ఈ ఖనిజాల కోసం అమెరికా ప్రధానంగా చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. అందుకే ఉక్రెయిన్‌లోని ఖనిజ వనరులను దక్కించుకోవడంపై దృష్టి పెట్టింది. ప్రపంచంలోని మొత్తం ఖనిజ వనరుల్లో 5 శాతానికిపైగా ఉక్రెయిన్‌లోనే ఉండడం గమనార్హం.

ఉద్రిక్తతలు ఆగిపోవాల్సిందే
న్యూయార్క్/వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం పట్ల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఇరు దేశాల మధ్య సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన బుధవారం రాత్రి భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పాకిస్తాన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్‌లతో వేర్వేరుగా ఫోన్లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాలపై చర్చించారు. భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం ఎవరికీ మేలు చేయదని అన్నారు.ఘర్షణ వాతావరణం సమసిపోయేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్.జైశంకర్‌తో మార్కో రూబియో మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఉగ్రవాదంపై జరిగే పోరాటంలో భారత్‌కు తమ సహకారం ఉంటుందని పునరుద్ఘాటించారు. మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదం అంతం కావాలని చెప్పారు. ఉద్రిక్తతలు తగ్గించుకొనే విషయంలో భారత్, పాక్ కలిసి పనిచేయాలని, పూర్తిస్థాయిలో సంయమనం పాటించాలని కోరారు. దక్షిణాసియాలో శాంతిభద్రతల పరిరక్షణకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్.జైశంకర్ స్పందిస్తూ.. పహల్గాంలో దాడికి పాల్పడిన ముష్కరులను, వారి వెనుక ఉన్న అసలైన కుట్రదారులను చట్టంముందు నిలబెట్టి, శిక్షించక తప్పదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్‌కు పాక్ సహకరించాలి పహల్గాం ఉగ్రదాడిపై జరుగుతున్న దర్యాప్తుకు పాకిస్తాన్ ప్రభుత్వం సహకరించాల్సిందేనని మార్కో రూబియో తేల్చిచెప్పారు. ఆయన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో మాట్లాడుతూ ఈ సంగతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇండియాతో నేరుగా సంప్రదింపులు జరుపుతూ ఉద్రిక్తతలు సడలిపోయేలా చర్యలు చేపట్టాలని హితవు పలికారు. పహల్గాంలో 26 మందిని పొట్టనపెట్టుకున్న ముష్కరులకు సరైన శిక్ష పడేలా భారత్‌కు సహకారం అందించాలని చెప్పారు. పాకిస్తాన్ నుంచి నిర్మాణాత్మక చర్యలను కోరుకుంటున్నామని రూబియో వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి పట్ల తమ వైఖరిని షెహబాజ్ షరీఫ్ అమెరికా విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఉగ్రవాదంపై పోరాటానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. పాకిస్తాన్ సైతం ఉగ్రవాద బాధిత దేశమేనని, 90 వేల మందికిపైగా ప్రజలు ఉగ్రదాడుల్లో మరణించారని తెలిపారు. ఉగ్రవాదం వల్ల తమకు 192 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేశారు. పహల్గాం దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడిపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఉద్రిక్తతలు పెంచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఇండియాను కట్టడి చేయాలని రూబియోను కోరారు. సింధూనది జలాల ఒప్పందాన్ని ఇండియా నిలిపివేయడాన్ని షెహబాజ్ షరీఫ్ తప్పుపట్టారు. ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేయడం చెల్లదని అన్నారు. భారత్ హక్కుకు మద్దతిస్తున్నాంతమను తాము రక్షించుకొనే హక్కు భారత్‌కు ఉందని, ఆ హక్కుకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు తమ సహకారం కచ్చితంగా ఉంటుందన్నారు. ఆయన గురువారం భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. ధూర్త దేశమైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని తాము ఎంతమాత్రం సహించడం లేదని హెగ్సెత్ బదులిచ్చారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించినవారికి సంతాపం ప్రకటించారు.
జాతీయం

భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. భార్య, ప్రియుడు సన్నిహితంగా ఉండగా చూసిన భర్త ఆగ్రహం పట్టలేక ఇద్దరినీ హతమార్చాడు. ఈ దారుణం కలబుర్గి జిల్లా ఆళంద తాలూకా మాదనహిప్పరగా గ్రామంలో చోటుచేసుకుంది. సృష్టి (22), ఖాజప్ప(23) హత్యకు గురైన వారు. శ్రీమంత నిందితుడు. శ్రీమంత, సృష్టి భార్యాభర్తలు. వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఆమెకు ఖాజప్పతో అనైతిక బంధం ఉన్నట్లు సమాచారం. శ్రీమంత గురువారం పని మీద పక్క ఊరికి వెళ్లి తిరిగి వచ్చాడు, ఈ సమయంలో ఇంట్లో బెడ్రూంలో సృష్టి, ఖాజప్ప కలిసి కనిపించడంతో శ్రీమంత కొడవలితో నరికి ఇద్దరినీ హత్య చేశాడు. తరువాత పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. హిప్పరగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వంట బాగా లేదని భార్య హత్య దొడ్డబళ్లాపురం: వంటను రుచిగా వండలేదని భార్యను భర్త హత్య చేసిన సంఘటన బాగలకోట జిల్లా ముధోళ తాలూకా ముగలఖోడ గ్రామంలో జరిగింది. భీరప్ప పూజారి అనే వ్యక్తి, భార్య సాక్షిత (27) ను గొంతు పిసికి హత్య చేశాడు. గురువారం రాత్రి సాక్షిత వండిన వంట బాగాలేదని, సాంబారు అసలు రుచిగా లేదని గొడవ చేశాడు. సాక్షిత కూడా ఎదురు తిరగడంతో పట్టలేని కోపంతో ఆమెను గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. ముధోళ పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు.

మోదీ.. నాకు ఆత్మాహుతి బాంబు ఇవ్వండి.. పాక్‌పై దాడి చేస్తా: కర్ణాటక మంత్రి
బెంగళూరు: పహల్గాం ఘటన నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పాకిస్తాన్‌పై యుద్ధం చేసేందుకు తనకొక సూసైడ్ బాంబ్ (Suicide Bomb) ఇవ్వాలన్నారు. తాను ఆ బాంబును పాకిస్తాన్‌పై వేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ నాయకుడు బీజడ్ జమీర్ అహ్మద్‌ఖాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అమాయక ప్రజలపై జరిగిన అమానవీయ చర్య ఇది. పాకిస్తాన్ (Pakistan) ఎప్పటికీ భారత్‌కు శత్రు దేశమే. ఆ దేశంతో మనకు ఎలాంటి సంబంధాలు లేవు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా అంగీకరిస్తే.. ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు నేను సిద్ధం. ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండి. బాంబ్ ఇస్తే దానిని తీసుకుని పాక్‌పై దాడి చేస్తాను. ఇలాంటి సమయంలో ప్రతీ భారతీయుడు ఐక్యంగా నిలబడాలని, జాతి భద్రతకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. అలాగే, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక, ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | Karnataka Minister BZ Zameer Ahmed Khan says, "...We are Indians, we are Hindustanis. Pakistan never had any relations with us. Pakistan has always been our enemy...If Modi, Amit Shah and the Central government let me, I am ready to go to battle. (02.05.2025) pic.twitter.com/HdYiZcYBIC— ANI (@ANI) May 3, 2025ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం నాటి పాకిస్తాన్ సైనిక విన్యాసాలకు భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. నడిరోడ్డుపైనా యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్ జరిపి వాయుసేన సత్తా చాటింది. అత్యంత అధునాతన శత్రు భీకర రఫేల్‌తో పాటు సుఖోయ్–30, ఎంకేఐ, మిరాజ్–2000, మిగ్–29, జాగ్వార్, సీ–130జే సూపర్ హెర్క్యులస్, ఏఎన్–32 విమానాలతో పాటు ఎంఐ–17 వీ5 హెలికాప్టర్లను కూడా ఈ అధునాతన ఎయిర్ర్‌స్టిప్‌పై ల్యాండింగ్, టేకాఫ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలోని గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఈ ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలకు వేదికైంది.📍Shahjahanpur: The Indian Air Force (IAF) is conducting take-off and landing exercises on the Ganga Expressway in Uttar Pradesh — even at night #GangaExpressway #aircraft #AirForce #IndiaPakistan #ind pic.twitter.com/nN8EyzpNQl— Geopolitics news (@rat92553) May 3, 2025పగటి పూటే గాక అవసరమైతే కారుచీకట్లోనూ నిర్భీతిగా యుద్ధవిమానాలను రోడ్లపై కూడా దింపగలమని వాయుసేన నిరూపించింది. 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్ వేలో జలాలాబాద్ సమీపంలోని పిరూ గ్రామం వద్ద నిర్మించిన 3.5 కిలోమీటర్ల పొడవైన ఎయిర్‌స్టిప్‌పై శుక్రవారం రాత్రి ఎయిర్‌ఫోర్స్ యుద్ధవిమానాలు ఇలా ల్యాండై అలా టేకాఫ్ తీసుకున్నాయి. తద్వారా దేశంలో పగలు, రాత్రి తేడా లేకుండా అన్నివేళలా ఫైటర్జెట్ల ల్యాండింగ్, టేకాఫ్‌కు అనువైన తొలి ఎక్స్‌ప్రెస్‌వే గా ఈ మార్గం నిలిచింది. అందుకు క్యాట్–2 ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ సాంకేతికతను వినియోగించారు. మంచు, వర్షం, పొగమంచు, తక్కువ దృగ్గోచరత వంటి సందర్భాల్లోనూ ల్యాండింగ్, టేకాఫ్ సాధ్యమయ్యేలా ఎక్స్‌ప్రెస్ వేలో ఎత్తయిన, అనువైన ప్రదేశంలోనే స్ట్రిప్‌ను నిర్మించారు. వరదలు, భూకంపం వంటి విపత్తుల వేళ సైన్యాన్ని వెంటనే రంగంలోకి దించడానికీ ఈ స్ట్రిప్ ఉపయోగపడనుంది. అత్యంత తక్కువ ఎత్తులో దూసుకొస్తూ ల్యాండింగ్‌నూ పరీక్షించారు.उत्तर प्रदेश: शाहजहांपुर (Indian Air Force)शाहजहांपुर Ganga Expressway पर भारत वायु सेना की Exercise जारी है।यहाँ राफेल जैसे युद्धक विमानों की भीड़ है। pic.twitter.com/khEHUDrCzD— Shubhangi Pandit (@Babymishra_) May 3, 2025

Goa: దేవాలయంలో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి
ఢిల్లీ: గోవాలో విషాదం చోటు చేసుకుంది. శిర్గావ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ విషాదంలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. 30 మందికి పైగా త్రీవ గాయాలయ్యాయి. గాయపడ్డ బాధితుల్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. Goa Congress is deeply saddened by the stampede at Jatrotsav of Shree Lairai Devi,Shirgao. We condemn this tragic incident and offer heartfelt condolences to the families who lost their loved ones. Wishing a speedy recovery to all those injured. 🙏@DrAnjaliTai @ViriatoFern pic.twitter.com/7kL6uNkBEi— Goa Congress (@INCGoa) May 3, 2025ఉత్తర గోవాలోని బిచ్లిమ్ జిల్లా తాలూకా శిర్గావ్ గ్రామంలో ప్రతీ ఏడాది మే 2న ఘనంగా నిర్వహించే పార్వతి దేవి(Shri Lairai Zatra) జాతర ఈ ఏడాది విషాదాన్ని నింపింది. ఈ శుక్రవారం (మే2) జాతర జరిగే సమయంలో తొక్కిసలాట ఆరుగు భక్తుల ప్రాణాల్ని తీసింది. పోలీసుల సమాచారం మేరకు శుక్రవారం జాతరను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో పాల్గొని, అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు సమారు 50వేల నుంచి 70 వేల మంది భక్తులు హాజరయ్యారు. జాతర ప్రారంభమైంది. సరిగ్గా జాతర జరిగే మార్గంలో ఎతైన ప్రదేశంలో ఉన్న భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు. అదుపు తప్పి భక్తులు ఒకరిపై ఒకరు మీద పడ్డారు. దీంతో ఊపిరాడక ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు గోవా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.(బాధితుల్ని పరామర్శిస్తున్న గోవా సీఎం ప్రమోద్ సావంత్)ప్రమాదంపై సమాచారం అందుకున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. ఘటన జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఢిల్లీ సహా ఉత్తరాదిన భారీ వర్షం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాలు శుక్రవారం ఉదయం ఈదురు గాలులు, వర్షాలతో అతలాకుతలమయ్యాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతోపాటు, పలు చోట్ల చెట్లు కూలడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. వర్షం సంబంధిత ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నజఫ్‌గఢ్ ప్రాంతంలోని ఖర్ఖారీలో ఇంటిపై చెట్టు కూలినపడినట్లు ఉదయం 5.30 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది.భారీ వర్షం, తీవ్ర ఈదురుగాలుల కారణంగా ఒకే గది ఉన్న చిన్న ఇంటిపై పక్కనే ఉన్న చెట్టు కూలి పడింది. ఘటనలో ఆ ఇంట్లోని ఐదుగురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది కలిసి వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఒక మహిళ(28), ఆమె ముగ్గురు చిన్నారులు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మహిళ భర్త గాయాలతో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. అదే సమయంలో చావ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో పాపారావత్ గ్రామంలో గోడ కూలి ఇద్దరు బాలురు సహా ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారని చెప్పారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, మధుర రోడ్లపై పెద్ద ఎత్తున వరద నిలిచిపోయింది. ఘజియాబాద్‌లో రోడ్లపై వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి కనిపించాయి. ఫరీదాబాద్‌లో వరదలో సగం వరకు మునిగిన కారును జనం బయటకు తీస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.200 విమానాలు ఆలస్యంఈదురు గాలుల ప్రభావం ఢిల్లీలో విమానాల రాకపోకలపైనా పడింది. మూడు విమానాలను దారి మళ్లించగా 200కు పైగా ఆలస్యంగా నడిచాయని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. కుండపోతతో ట్రాఫిక్ అంతరాయం, వరదలు, చెట్లు, ఇళ్లు కూలిన ఘటనలకు సంబంధించి 100 కాల్స్ అందాయని ఫైర్ విభాగం తెలిపింది.
ఎన్ఆర్ఐ

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఆస్టిన్: అమెరికా టెక్సాస్‌లో తెలుగు విద్యార్థిని హిట్ అండ్ రన్ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు.

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్‌తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు దుబాయి లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు అనిల్ తెలిపారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.
క్రైమ్

వైన్ షాపు పర్మిట్‌రూమ్‌లో గొడవ.. యువకుడి మృతి
మూసాపేట(హైదరాబాద్): వైన్ షాపు పర్మిట్ రూములో జరిగిన చిన్నపాటి గొడవ ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గాజులరామారానికి చెందిన ఆకుల ధనుష్ గౌడ్ (20) ఓ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పరీక్షలు ముగియటంతో ఏప్రిల్ 5న తన స్నేహితులు అభినవ్ గౌడ్ (22), నాగిరెడ్డి(21)లతో కూకట్‌పల్లిలోని దారువాలా వైన్ షాపులో మద్యం తాగడానికి వెళ్లారు. కావటి కేశవ్ (25) మూసాపేటలో ఉంటూ బ్లింకిట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కావటి కేశవ్ కూడా తన స్నేహితులతో పర్మిట్‌రూమ్‌లో మద్యం తాగుతున్నారు. అతడిని కొంచెం పక్కకు జరగాలని ధనుష్ గౌడ్ స్నేహితులు కోరారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి తారస్థాయికి వెళ్లింది. కావటి కేశవ్ ధనుష్ గౌడ్, అతని స్నేహితులను పిడిగుద్దులు గుద్దాడు. ధనుష్గౌడ్కు కడుపులో బలంగా తగలటంతో అక్కడి నుంచి బయటకు వెళ్లారు. మరుసటి రోజు ఉదయం కడుపు నొప్పిగా ఉందంటూ వాళ్ల అమ్మకు చెప్పటంతో వెంటనే కేపీహెచ్‌బీ కాలనీలోని రెమెడీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అత్యవసర చికిత్స నిమిత్తం నిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పెద్ద పేగు పగిలి ఇన్ఫెక్షన్ అయ్యిందని వైద్యులు తెలిపారు. సర్జరీ చేయగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా కావటి కేశవ్‌ను శుక్రవారం అరెస్టు చేశారు.

నాన్న చూపునకూ నోచుకోకుండానే..!
నిర్మల్/పెంబి: ‘నాన్న.. నువ్వేం ఫికర్ చేయకు. ఇటేం మనసు పెట్టుకోకు. అమ్మా మేము మంచిగనే ఉన్నం. మంచిగ చదువుకుంటున్నం. నువ్వు జాగ్రత్తగా ఉండు. తొందరలనే మనకు మంచి రోజులు వస్తయ్..’ అంటూ నిత్యం తమ తండ్రి మనసులో ఆశలు వెలిగించే ఆ ‘దీపాలు’ అవి నెరవేరకముందే అర్ధంతరంగా ఆరిపోయాయి. తన బిడ్డల చివరిచూపు కోసం ఆ తండ్రి దేశంకాని దేశంలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. రెక్కల కష్టంతో పెంచుకున్న బిడ్డలిద్దరూ అసువులు బాయడంతో ఆ తల్లి గుండె చెరువైంది. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ సమీపంలో ఎన్‌హెచ్ 44పై శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో నిర్మల్ జిల్లా పెంబి మండలం లోతొర్యతండాకు చెందిన అక్కాచెల్లెళ్లు అశ్విని(21), మంజుల(17) మృతిచెందారు. మారుమూల తండా నుంచి..గ్రామస్తులు, జక్రాన్‌పల్లి ఎస్సై ఎండీ మాలిక్ రహమాన్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమైన పెంబి మండలం లోతొర్య తండాలో మట్టిగోడలతో రేకుల ఇంట్లో ఉంటున్న బానావత్ సుగుణ, రెడ్డి దంపతులకు ముగ్గురు కూతుళ్లు కుమార్తెలు అశ్విని, మంజుల, నిహారికలతోపాటు కుమారుడు ఆకాశ్ ఉన్నారు. అందరూ చదువుకుంటున్నారు. ఎకరం భూమి మాత్రమే ఉండటంతో రోజువారీ వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. స్థానికంగా సరైన ఉపాధి లేకపోవడంతో మూడేళ్లక్రితం బానావత్ రెడ్డి దుబాయి వెళ్లాడు.ఎలాగైనా చదవాలని..తమకోసం తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూస్తూ పెరిగిన పిల్లలు బాగా చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెద్దకూతురు అశ్విని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇటీవల ఫైనలియర్ పూర్తిచేసింది. రెండోకూతురు మంజుల ఇచ్చోడలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసింది. మంజులకు ఈఏపీ ఎంట్రన్స్ టెస్ట్ ఉండటంతో అక్క అశ్విని సమీప బంధువు జాదవ్ హంసరాజుతో కలిసి గురువారం కారులో హైదరాబాద్ వెళ్లారు. అక్కడ పరీక్ష రాసి, శుక్రవారం తండాకు తిరిగి వస్తుండగా నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కాచెలెళ్లు అక్కడే చనిపోగా, బంధువు జాదవ్ హంసరాజు కాలు, చేయి విరిగాయి. అతడిని ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు.చివరిచూపునకూ నోచుకోలేక..మూడేళ్లక్రితం దుబాయి వెళ్లిన బాణావత్ రెడ్డి ఏడాదిపాటు ఓ కంపెనీలో పనిచేశాడు. ఆ ఏడాది పనిచేసినా కంపెనీ ఆయనకు డబ్బులు ఇవ్వలేదు. మోసపోయానని తెలుసుకున్న రెడ్డి బయటకు వచ్చి కలివెల్లి వీసాపై చిన్నచితకా పనులు చేసుకుంటున్నాడు. ఏడాదికాలంగా ఖర్చుల కోసం భార్య సుగుణనే ఇక్కడి నుంచి డబ్బులను పంపిస్తోంది. ప్రస్తుతం ఆయన స్వదేశానికి తిరిగి రావడానికీ డబ్బులు లేవు. తన కన్నబిడ్డలను చివరిచూపు కూడా చూడలేని దయనీయ పరిస్థితి. కనీసం విమాన చార్జీలకు డబ్బులు ఇస్తే.. తన బిడ్డల చివరిచూపైనా చూస్తానంటూ రెడ్డి విలపిస్తున్నాడు.

భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. భార్య, ప్రియుడు సన్నిహితంగా ఉండగా చూసిన భర్త ఆగ్రహం పట్టలేక ఇద్దరినీ హతమార్చాడు. ఈ దారుణం కలబుర్గి జిల్లా ఆళంద తాలూకా మాదనహిప్పరగా గ్రామంలో చోటుచేసుకుంది. సృష్టి (22), ఖాజప్ప(23) హత్యకు గురైన వారు. శ్రీమంత నిందితుడు. శ్రీమంత, సృష్టి భార్యాభర్తలు. వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఆమెకు ఖాజప్పతో అనైతిక బంధం ఉన్నట్లు సమాచారం. శ్రీమంత గురువారం పని మీద పక్క ఊరికి వెళ్లి తిరిగి వచ్చాడు, ఈ సమయంలో ఇంట్లో బెడ్రూంలో సృష్టి, ఖాజప్ప కలిసి కనిపించడంతో శ్రీమంత కొడవలితో నరికి ఇద్దరినీ హత్య చేశాడు. తరువాత పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. హిప్పరగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వంట బాగా లేదని భార్య హత్య దొడ్డబళ్లాపురం: వంటను రుచిగా వండలేదని భార్యను భర్త హత్య చేసిన సంఘటన బాగలకోట జిల్లా ముధోళ తాలూకా ముగలఖోడ గ్రామంలో జరిగింది. భీరప్ప పూజారి అనే వ్యక్తి, భార్య సాక్షిత (27) ను గొంతు పిసికి హత్య చేశాడు. గురువారం రాత్రి సాక్షిత వండిన వంట బాగాలేదని, సాంబారు అసలు రుచిగా లేదని గొడవ చేశాడు. సాక్షిత కూడా ఎదురు తిరగడంతో పట్టలేని కోపంతో ఆమెను గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. ముధోళ పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు.

విద్యుత్ తీగకు కేబుల్ వైరు తగిలి సాఫ్ట్వేర్ ఉద్యోగిని..
మర్రిపాలెం(విశాఖపట్నం): విద్యుత్ షాక్‌కు గురై ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని దుర్మరణం పాలైంది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి మురళీనగర్‌లోని అయ్యప్పనగర్‌లో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జి.వి.పద్మావతి (29) తన భర్త అజయ్‌తో కలిసి అయ్యప్పనగర్‌లో నివాసముంటున్నారు. ఆమె నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ, ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. రెండవ అంతస్తులో నివాసం ఉంటున్న వీరు పాల ప్యాకెట్లను కింద సెల్లార్ నుంచి తెచ్చుకోవడానికి ప్లాస్టిక్ డబ్బాకు కేబుల్ వైరు కట్టి ఉపయోగిస్తున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో పద్మావతి ఎప్పటిలాగే రెండవ అంతస్తు నుంచి కేబుల్ వైర్ సహాయంతో సెల్లార్‌లోని పాల ప్యాకెట్లను తీసుకుంటున్నారు. అయితే గురువారం రాత్రి కురిసిన వర్షం కారణంగా కేబుల్ వైరు విద్యుత్ తీగలకు తగిలింది. ఇది గమనించని పద్మావతి విద్యుత్ షాక్‌కు గురైన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. భర్త అజయ్ వెంటనే కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ షేక్ సమీర్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కూర్మన్నపాలేనికి చెందిన పద్మావతికి నాలుగేళ్ల కిందట అజయ్‌తో వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. అజయ్ మిలటరీ ఇంజినీరింగ్ సరీ్వస్ (ఎంఈసీ)లో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు.
వీడియోలు


సీఎంవా లేక ఈవెంట్ మేనేజర్ వా .. కాంగ్రెస్ నేత సంచలన కామెంట్స్


CHO: మా ఆవేదన ఒక్కటే... కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ధర్నా


Narayana: అమరావతి సభలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు


కొలంబో విమానాశ్రయంలో పహల్గామ్ ఉగ్రదాడి అనుమానితుల అరెస్టు


బుగ్గమఠం భూముల సర్వే పేరుతో ప్రభుత్వం కక్షసాధింపు


Rajendranagar: బిర్యానీ తిని భార్య మృతి, చికిత్స పొందుతున్న భర్త


అమ్మమ్మ ఇంటికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మధుమతి


అనంతపురం జిల్లా ఉరవకొండలో సైబర్ మోసగాడి అరెస్ట్


Ding Dong 2.0: డింగ్ డాంగ్ 2.0 కామిక్ షో


గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలకు మజ్జి శ్రీనివాసరావు కౌంటర్