ప్రభుత్వం మత్స్యకారుల కోసం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేపపిల్లలను నాణ్యతగా సరఫ రా చేయాలి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తీవ్రంగా నష్టపోతున్నాం. గత సంవత్సరం పంపిణీ చేసిన చేప విత్తనా ల సైజు రాలేదు. పావు కేజీ నుంచి అర కేజీ మాత్రమే వచ్చింది. చేపపిల్లలను ఎ ప్పటికప్పుడు పరిశీలించిన తర్వాత పంపిణీ చేస్తే బాగుంటుంది. – జిల్లెల శేఖర్,
మత్స్యకారుడు, పెద్దదర్పల్లి, హన్వాడ
నాణ్యతపరిశీలించేపంపిణీ చేశాం
చెరువుల్లో పంపిణీ చేసే సమయంలో పరిశీలించి తీసుకోమని చెబుతున్నాం. నాణ్యత చూసుకొని సంతృప్తి చెందాకే చేప పిల్లలు పంపిణీ చేశాం. టెండర్ ప్రక్రియ ద్వారా చేపపిల్లలు పంపిణీ చేశాం.
– రాధారోహిణి, జిల్లా మత్స్యశాఖ అధికారి
అర కేజీ కూడా పెరగలేదు..
గత సంవత్సరం చెరువుల్లో ప్రభుత్వం వదిలిన ఉచిత చేపపిల్లలు పెరగలేదు. సైజు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా చెరువులో పావు కేజీ నుంచి అర కేజీ లోపే చేపల సైజులో వృద్ధి వచ్చింది. చేప పిల్లలు నాణ్యతపై అనుమానాలున్నాయి. ప్రభుత్వం అందజేస్తున్న చేపపిల్లలను నాణ్యతగా సరఫరా చేయాలి.
– వెంకటయ్య, కొత్తపేట మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు
తీవ్రంగా నష్టపోతున్నాం..
చెరువుల్లో ప్రతి సంవత్సరం ఉచితంగా వదిలే చేప విత్తనాల నాణ్యతపై నిర్లక్ష్యం వహించడం సరికాదు. బాధ్యత కలిగిన ప్రభుత్వ యంత్రాంగం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. గత సంవత్సరం వదిలిన చేప విత్తనాలు సైజు రాకపోవడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు.
– శ్రీకాంత్, హజిలాపూర్, నవాబ్‌పేట మండలం
నాణ్యతగా ఉన్నవిసరఫరా చేయాలి
నాణ్యతగా ఉన్నవిసరఫరా చేయాలి