వరి కోతల్లో జాగ్రత్తలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

వరి కోతల్లో జాగ్రత్తలు తప్పనిసరి

Published Mon, Apr 21 2025 12:55 AM | Last Updated on Mon, Apr 21 2025 1:01 AM

కోస్గి: యాసంగి వరి పంటలు కోత దశకు చేరుకోగా.. ముందుగా సాగుచేసిన పంటల కోతలు ప్రారంభమయ్యాయి. వరి కోతలు, కోతల అనంతరం కొన్ని మెళకువలు పాటిస్తే నాణ్యమైన దిగుబడి పొందవచ్చని నారాయణపేట జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్‌ సుధాకర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు, జాగ్రత్తలు వివరించారు.

● పొలంలో 80 నుంచి 90 శాతం వరి వెన్నులు పసుపురంగుకు మారుతున్న సమయంలో పంట కోయాలి. పూర్తిగా ఎండిపోయే వరకు ఉంచరాదు. ఈ దశలో గింజల్లో 18 నుంచి 20 శాతం తేమ ఉంటుంది.

● కోత ఆలస్యమైతే గింజ పగుళ్లు వచ్చి ధాన్యం నూకలయ్యే ప్రమాదం ఉంది.

● గింజల్లో తేమశాతాన్ని తగ్గించడానికి 2 నుంచి 3 రోజులు మెదను ఎండనివ్వాలి. ఒకవేళ వర్షం కురిసి తడిస్తే 5 శాతం ఉప్పు ద్రావణాన్ని వరిపై పిచికారీ చేయాలి.

● వరి కోత యాంతాలతో కోతలు చేస్తే దుమ్ము, మట్టిపెడ్డలు ధాన్యంలో కలవకుండా జాగ్రత్త పడాలి. రెండు వేర్వేరు రకాల ధాన్యం కలవకుండా చూసుకోవాలి.

పంట కోతల తర్వాత..

● ధాన్యాన్ని తుర్పారబట్టి చెత్త, మట్టి, రాళ్లు వేరు చేయాలి.

● తుర్పారబట్టిన ధాన్యంలో తేమశాతం 12 నుంచి 14 వరకు తగ్గే వరకు ఆరబెట్టాలి. ఈ విధంగా చేయడంతో ధాన్యం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

● చౌడు నేలల్లో పండించిన ధాన్యాన్ని మంచి ధాన్యంతో కలపరాదు.

● చీడపీడలు ఆశించినా, రంగు మారినా జాగ్రత్తలు తీసుకోవాలి. ధాన్యంలో కలుపు మొక్కల గింజలు లేకుండా చూడాలి.

నిల్వలో జాగ్రత్తలు..

● ధాన్యాన్ని నిల్వ చేసేటప్పుడు అధిక తేమశాతం లేకుండా చూసుకోవడం మంచిది.

●ఽ ధాన్యాన్ని ఆశించే కీటకాల నుంచి రక్షణ కోసం పరిసరాల్లో పొగబెట్టాలి.

● శుభ్రమైన గోనె సంచులు, గుమ్ముల్లో ధాన్యం నిల్వ చేయాలి. అదేవిధంగా ఎలుకలు, సూక్ష్మ జీవులు ఆశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

● ధాన్యం నిల్వ చేసే ప్రదేశం తడి లేకుండా, బస్తాలకు చిల్లులు లేకుండా చూసుకోవాలి.

పాడి–పంట

చిన్నపాటి మెళకువలతో

నాణ్యమైన దిగుబడి

వరి కోతల్లో జాగ్రత్తలు తప్పనిసరి 1
1/1

వరి కోతల్లో జాగ్రత్తలు తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement