బైక్‌తో ఢీ.. వ్యక్తి మృతి
మహబూబ్‌నగర్ క్రైం: రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనదారుడు వేగంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని షాషాబ్‌గుట్టకు చెందిన ముక్తార్ బేగ్(56) శనివారం రాత్రి 10.30గంటల ప్రాంతంలో పట్టణంలోని విద్యుత్ ఆఫీస్ ఎదుట రోడ్డు దాటుతున్న క్రమంలో టంకరకు చెందిన శ్రీరామ్ బైక్‌పై వేగంగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ముక్తార్‌బేగ్‌ను జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి భార్య నఫిస్ సుల్తానా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
సర్వీస్ వైరు సరిచేస్తుండగా..
విద్యుదాఘాతం
మహబూబ్‌నగర్ క్రైం: విద్యుత్ తీగలపై చెట్టు కొమ్మలు తొలగించే కూలీ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వన్‌టౌన్ సీఐ అప్పయ్య కథనం ప్రకారం..హన్వాడ మండల టంకర గ్రామానికి చెందిన వర్లదాసు(51)కొన్ని రోజుల నుంచి విద్యుత్ శాఖకు చెందిన విద్యుత్ తీగలకు చెట్లు ఉన్న ప్రాంతాల్లో వాటిని తొలగించడం కోసం కాంట్రాక్టర్ పవన్‌కుమార్ వద్ద దినసరి కూలీగా పని చేస్తున్నాడు. అయితే ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జిల్లాకేంద్రంలోని రాం మందిర్ చౌరస్తా ఏరియాలో చెట్లు విద్యుత్ తీగలకు సమీపంలో ఉండటంతో.. కొమ్మలు తొలగిస్తున్న క్రమంలో కొన్ని కొమ్మలు తీగలపై పడ్డాయి. దీంతో వర్లదాస్ విద్యుత్ సరఫరా బంద్ చేసి.. స్తంభం ఎక్కి తొలగిస్తున్న క్రమంలో ఓ సర్వీస్‌వైర్ తెగిపోయింది. దానిని తిరిగి అతికిస్తున్న సమయంలో ఒక ఇంటికి ఉన్న ఇన్వేటర్ ద్వారా సర్వీస్ వైర్ నుంచి విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తగిలి స్తంభంపైనే మృతి చెందాడు. మృతుడు భార్య వర్ల దానమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
● స్తంభంపైనే మృతి చెందిన దినసరి కూలీ


