
అందరూ ఊహించినట్టుగానే ఈసారి కూడా యాంకర్ శివకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. బాడీ షేమింగ్ ఇష్యూతో ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న అరియానా వైబ్ డిస్టర్బ్ అయిందంటూ సరయును నామినేట్ చేసింది. దీంతో సరయు.. ఇప్పుడు అరియానా ఎలా ఆడుతుందో అర్థమైపోయిందని కౌంటరిచ్చింది.
బిగ్‌బాస్ షోలో నామినేషన్స్ కోసం వెయిట్ చేసేవాళ్లున్నారు, నామినేషన్స్ అంటే భయపడేవాళ్లూ ఉన్నారు. కానీ ఏదేమైనా ప్రతివారం నామినేషన్స్ తప్పనిసరి. దీన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. తాజాగా నాలుగోవారం నామినేషన్స్ షురూ అయ్యాయి. ఈసారి లారీ, హారన్ టాస్క్ ద్వారా నామినేషన్ ప్రక్రియ నిర్వహించాలన్నాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా లారీ హారన్ సౌండ్ మోగినప్పుడు ఎవరైతే ముందుగా బజర్ నొక్కుతారో వారికి ఇద్దరిని నామినేషన్ చేసే ఛాన్స్ లభిస్తుంది.
అయితే ఈ ఇద్దరిలో ఎవరిని ఫైనల్‌గా నామినేట్ చేయాలన్నది మాత్రం ఇంటిసభ్యులు నిర్ణయిస్తారు. అందరూ ఊహించినట్టుగానే ఈసారి కూడా యాంకర్ శివకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. బాడీ షేమింగ్ ఇష్యూతో ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న అరియానా వైబ్ డిస్టర్బ్ అయిందంటూ సరయును నామినేట్ చేసింది. దీంతో సరయు.. ఇప్పుడు అరియానా ఎలా ఆడుతుందో అర్థమైపోయిందని కౌంటరిచ్చింది.
మహేశ్ విట్టా తనను నామినేట్ చేయడంతో విసిగిపోయిన అరియానా తానసలు బాడీ షేమింగ్ చేయలేదని చెప్పింది. ఇక ఈ వారం యాంకర్ శివ, బిందుమాధవి, అనిల్, అజయ్, సరయు, అరియానా, మిత్ర శర్మ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: రోడ్డు ప్రమాదంలో బిగ్‌బాస్ ఫణికి తీవ్ర గాయాలు, చివరి పోస్ట్ వైరల్