
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కొత్త ప్రయాణం ప్రారంభించారు. దాదాపు నలభై ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న బోనీ ఇప్పుడు నటుడిగా మారారు. లవ్ రంజన్ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ ఓ సినిమా చేస్తున్నారు. శ్రద్ధా కపూర్ కథానాయిక. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ తండ్రి పాత్రలో కనిపించనున్నారు బోనీ కపూర్. ఈ పాత్రకు బోనీ కపూరే సరిగ్గా సరిపోతారని దర్శకుడు భావించి, ఆయన్ను ఒప్పించారట. త్వరలోనే ఈ సినిమా సెట్లో జాయిన్ అవుతారు బోనీ. ఇటీవలే అనిల్ కపూర్ ముఖ్య పాత్రలో వచ్చిన ‘ఏకే వర్సెస్ ఏకే’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు బోనీ. ఇప్పుడు రణ్‌బీర్ సినిమాలో పూర్తి స్థాయి పాత్రలో కనిపిస్తారు.