
మెగా హీరో రామ్ చరణ్ కొట్టిన సిక్సర్‌తో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నీ గల్లంతు అయ్యాయి. తాజాగా విడుదలైన 'పెద్ది' గ్లింప్స్‌కు షోషల్‌మీడియా షేక్ అయిపోయింది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీకపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుంది. ఫస్ట్ షాట్‌తోనే సినీ అభిమానులను రామ్‌చరణ్ ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల గ్లింప్స్‌కు వచ్చిన వ్యూస్ విషయంలో దేవర (26.17 మిలియన్లు) టాప్‌లో ఉంది. ఇప్పుడు పెద్ది సినిమా గ్లింప్స్ ఆ రికార్డ్‌ను దాటేసింది. 24గంటల్లోనే ఏకంగా 30.6 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపింది.
ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఉన్న అన్ని సినిమాల గ్లింప్స్ రికార్డ్స్‌ను పెద్ది దాటేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. తప్పకుండా పెద్ది సినిమాతో భారీ హిట్ కొడుతున్నామని వారు పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో పెద్ది గ్లింప్స్ టాప్-1లో ఉంటే.. ఇండియాలో టాక్సిక్ (36 మిలియన్లు)తో టాప్-1లో ఉంది.
'పెద్ది' హిందీ గ్లింప్స్ విడుదల.. డబ్బింగ్ ఎవరంటే..?
పెద్ది సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా హిందీ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. హందీ వర్షన్‌లో తన పాత్రకు డబ్బింగ్ స్వయంగా చెప్పుకున్నారు. ఈ గ్లింప్స్ నుంచి ఇప్పటికే మిలియన్ల కొద్ది రీల్స్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది.
టాలీవుడ్ టాప్ (గ్లింప్స్) చిత్రాలు
పెద్ది (30.6 మిలియన్లు)
దేవర (28.7 మిలియన్లు)
పుష్ప2 (27.11 మిలియన్లు)
ఓజీ (27 మిలియన్లు)
కల్కి (23.16 మిలియన్లు)
గుంటూరు కారం (21.12 మిలియన్లు)
ది ప్యారడైజ్ (17.12 మిలియన్లు)