
ఈ మూవీ షూటింగ్‌ని త్వరగా ముగించాలని తీవ్రంగా కృషి చేస్తున్న చిత్ర యూనిట్‌కి డార్లింగ్ ప్రభాస్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడట
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ మూవీ షూటింగ్‌ని త్వరగా ముగించాలని తీవ్రంగా కృషి చేస్తున్న చిత్ర యూనిట్‌కి డార్లింగ్ ప్రభాస్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడట. సినిమా కోసం పని చేస్తున్న వారందరికీ చేతి వాచ్‌లు ఇచ్చాడు.
ప్రస్తుతం ఈ వాచ్‌లకు సంబంధించిన ఫొటోలను ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇక రాధేశ్యామ్ సినిమా ఈ ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం.. ఆదిపురుష్, రాధేశ్యామ్, నాగ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా, కేజీఎఫ్ దర్శకుడితో సలార్ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. శుక్రవారం ఈరోజు 'సలార్' షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది.
#Prabhas Gift To RadheShyam Team Members 💥🤩
Darling For A Reason ❤️🙏#RadheShyam#SalaarLaunch pic.twitter.com/HGxQyalVpO
— Fukkard (@fukkarddd) January 14, 2021
Super 🥳#Prabhas gifted watches to #RadheShyam Team members ❤️ pic.twitter.com/XVda4Fx5iB
— Sai Prasad (@Saiprasad_drlng) January 14, 2021