gifts
-
లక్కీ డ్రా.. గిఫ్ట్‌లు అంటే ఆశపడ్డారో, ఖేల్ ఖతం!
ఎంత అప్రమత్తంగా ఉన్నా సైబర్ నేరగాళ్లు తమ చోర బుద్ధికి పని చెబుతూనే ఉంటారు. మరి అలాంటిది ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించక తప్పదు. తాజాగా ముంబైకి చెందిన ఓ మహిళ ఏకంగా రూ. 20 కోట్లు కోల్పోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. లక్కీ డ్రా తీసి గిఫ్ట్ ఇస్తాం..అంటే, ఫోన్ నెంబర్ ను ఇవ్వకండి , పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్.దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. సైబర్ మోసగాళ్ల వలలో పదవద్దని అధికారులు, పదే పదే హెచ్చరిస్తూ ఉన్నా సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల వ్యవహారాలు,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాశిల్దార్ కీలక సూచనలు చేశారు.సరదాగా సినిమాకు వెళ్ళినపుడో, .పెట్రోల్ బంకులోనో సార్..మీ ఫోన్ నెంబర్ ఇస్తారా..లక్కీ డ్రా తీసి గిఫ్ట్ ఇస్తాం. అని చెప్పే వాళ్ల మాటలను నమ్మి మోసపోవద్దు. వాళ్లకి ఫోన్ నెంబర్లు ఇవ్వద్దు అని వినియోగదారుల వ్యవహారాలు,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. ఇటీవల హైదారాబాద్ లో మాట్లాడుతూ.. కొన్ని వ్యాపార సంస్థలు తెలివిగా ,సార్వత్రిక ప్రదేశాల లో జనం వద్ద నుంచి ఫోన్ నెంబర్లను సేకరించి,ఆ తర్వాత మీ కు లక్కీ డ్రా లో గిఫ్ట్ వచ్చింది అంటూ పలు రకాల మోసాలకు పాల్పడే అవకాశం ఉందని రఘునందన్ హెచ్చరించారు. చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్ పెట్రోల్ బంకు యాజమాన్యాలు, సినిమా టాకీస్ ల వద్ద జనం జాగృతం గా ఉండి. తమ ఫొన్ నెంబర్ లను ఇవ్వకుండా జాగ్రత్త గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘునందన్ సూచించారు. డెక్కన్ రిసార్ట్స్ అనే సంస్థ ఇలాగే వేలాది మంది నుంచి ఫోన్ నెంబర్లను సేకరించి వారినుంచి కోట్ల రూపాయలు దోచుకుని మోసం చేసిందన్నారు.ఈ మేరకు సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినా ఫలితం లేదని రఘునందన్ వివరించారు.చదవండి: ఇన్నాళ్ళ బాధలు చాలు, రూ.5 కోట్ల సంగతి తేల్చండి : బాంబే హైకోర్టు -
మిజోరాం ‘వండర్ కిడ్’కు గిటార్
ఐజ్వాల్: ‘మా తుఝే సలాం’ పాటతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన మిజోరాం ‘వండర్ కిడ్’ ఎస్తేర్ లాల్దుహామి హ్నామ్టేకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గిటార్ బహుమతిగా ఇచ్చారు. 2021లో ఆమె పాడిన ‘మా తుఝే సలాం’ పాట వైరలై దేశమంతటి దృష్టినీ ఆకర్షించింది. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్న అమిత్ షా ఆదివారం ఐజ్వాల్‌లో ఆమెను రాజ్‌భవన్‌కు ఆహ్వనించారు. తనకు గిటార్ అందజేసిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదొక మైమరపించే అనుభవంగా ఆయన అభివర్ణించారు. ‘భారత్ పట్ల ప్రేమే మనందరినీ ఏకం చేస్తుంది.ఎస్తేర్ వందేమాతరం పాట విని చలించిపోయాను. దేశంపై ఆమెకున్న ప్రేమ పాటలో ప్రతిఫలించింది’ అంటూ ప్రశంసించారు. దీనిపై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణ మిజోరంలోని లుంగ్లీ పట్టణానికి చెందిన హ్నామ్టే 2016 జూన్ 9న జన్మించింది. మూడేళ్ల వయసులోనే పాడటం ప్రారంభించింది. ఆమె ‘మా తుఝే సలాం’ మ్యూజిక్ వీడియోను యూట్యూబ్‌లో వారం రోజుల్లోనే 30 లక్షల మంది చూశారు. ఈ సంఖ్య ప్రస్తుతం 4.7 కోట్లకు చేరింది. ఆమె జీవితంపై తీసిన ‘ఎ స్టార్ ఈజ్ బోర్న్’కు 2023లో ఈశాన్య చలన చిత్రోత్సవంలో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు వచి్చంది. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాల పర్వం
నూజివీడు/సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్రంలో జరుగుతున్న 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార తెలుగుదేశం పార్టీకి ఎదురు గాలి వీస్తుండటంతో ఆ పార్టీ నేతలు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఉమ్మడి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పెద్ద ఎత్తున వాల్ క్లాక్‌లు, గిఫ్ట్ బాక్స్‌లు, ఇతర వస్తువులు పంపిణీ చేసి, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గురువారం పోలింగ్ జరుగుతుండటంతో బుధవారం వీటిని పంపిణీ చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంవ్యాప్తంగా బుధవారం ఓటర్లకు వాల్‌క్లాక్‌లు పంపిణీ చేశారు. బత్తులవారిగూడెంలోని నగరవనంలో ఉదయం సమావేశం నిర్వహించి, మండలాల వారీగా వాల్‌క్లాక్‌లను నాయకులకు అప్పగించి, వారి ద్వారా ఓటర్లకు అందజేశారు. ఈ వాల్క్లాక్లపై సీఎం చంద్రబాబు, మంత్రి కొలుసు పార్థసారథి, అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ల ఫొటోలతో కూడిన స్టిక్కర్ అంటించి ఉంది. మిగతా నియోజకవర్గాల్లోనూ ఇదే విధంగా గిఫ్ట్‌లు పంపిణీ చేసినట్లు సమాచారం. విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి కుటుంబ సభ్యుల పర్యవేక్షణ ఉత్తరాంధ్ర టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకు క్షేత్ర స్థాయిలో ఎదురుగాలి వీస్తోంది. దీంతో టీడీపీ నేతలు టీచర్లకు గిఫ్ట్‌బాక్సులు అందజేస్తున్నారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబానికి చెందిన కొంతమంది వీటి పంపిణీ బాధ్యత తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గంట్యాడ మండల కేంద్రంలో మంత్రి కొండపల్లి కుటుంబానికి చెందిన రైస్ మిల్లు వద్ద నుంచే ఇతర ప్రాంతాలకు గిఫ్ట్‌బాక్స్‌లు పంపిస్తున్నారు. సీలేరులో మద్యం పట్టివేత సీలేరు (అల్లూరి జిల్లా): ఉత్తరాంధ్ర ఎన్నికలు వాడీవేడిగా జరుగుతున్న నేప«థ్యంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో బహిరంగంగా మద్యం అమ్మకాలు చేపడుతున్నారు. జీకే వీధి మండలం సీలేరులోని ఒక ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వ ఉంచారన్న సమాచారం మేరకు పోలీసులు దాడి జరిపారు. నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. -
ఈ–కామర్స్‌కు ‘ప్రేమోత్సవ్’!
సాక్షి, హైదరాబాద్: గులాబీలు, చాక్లెట్లు్ల, బంగారు ఆభరణాలు, టెడ్డీబేర్ బొమ్మలు, ప్రముఖులు రాసిన పుస్తకాలు.. ఇలా కాదేదీ ప్రేమ వ్యక్తీకరణకు అనర్హం అన్నట్లుగా సాగింది ఈసారి ప్రేమికుల రోజు. ఏటా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. గతంలో సమీపంలోని షాపునకు వెళ్లి పూలో, గ్రీటింగ్ కార్డులో కొని తమ మనసు గెలిచినవారికి ఇచ్చి శుభాకాంక్షలు తెలిపేవారు. కానీ, ఇప్పుడు ప్రతి వస్తువుకూ ఈ–కామర్స్ సైట్లవైపే చూస్తున్నాం కదా! ప్రేమికుల రోజున కూడా ప్రేమికులంతా ఈ సైట్లపైనే పడ్డారు. గులాబీలు, చాక్లెట్లు, అందమైన బొమ్మలు తదితర వస్తువులను ప్రేమికులరోజు (శుక్రవారం ) వివిధ ఈ–కామార్స్ సైట్లలో రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు. ఆఫర్ల జోరు ప్రేమికుల రోజున జొమాటో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి ప్లాట్‌ఫామ్స్‌తోపాటు రెస్టారెంట్లు, ట్రావెల్ కంపెనీలు కూడా జతకలిసి లిమిటెడ్ ఎడిషన్ ప్రొడక్టులు మొదలు వివిధ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఐజీపీ, ఫ్లవర్ ఆరా ఫ్లడ్ వంటి గిఫ్టింగ్ ప్లాట్‌ఫామ్స్ పర్సనలైజ్డ్ మగ్స్, హార్ట్ షేప్ కుషన్లు, ఇతర కానుకలను పరిచయం చేశాయి. దేశీయ స్టార్టప్‌లు సైతం వివిధ రంగాలు, సెక్టార్లవారీగా పలు వస్తువులను వ్యాప్తిలోకి తెస్తున్నాయి. చివరకు ఇండిగో స్పెషల్ వాలంటైన్స్ డే సేల్‌ను ప్రకటించి డిస్కౌంట్ రేట్లపై జంటలు విమానాల్లో ప్రయాణించే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అ‘ధర’హో ఈ కామర్స్ సంస్థలు ప్రేమికులరోజు రష్ను బాగా నే క్యాష్ చేసుకున్నట్లు ఫెర్ష్న్ ఎన్పెటల్స్ వెబ్సైట్ పేర్కొంది. ప్రేమికుల రోజు ప్రత్యేకం పేరుతో పలు వస్తువులను అధికధరలకు అమ్మినట్లు తెలిపింది. పలు గిఫ్ట్ హ్యాంపర్ల ధర రూ.90 వేల పైచిలుకు ఉన్నది. పలు సైట్లలో చాక్లెట్ల ధరలు రూ.499తో మొదలై రూ.82,999 (ఐఫోన్ సహితంగా) వరకు ఉన్నాయి. డైసన్ ఎయిర్‌వ్రాప్ ఫ్యాన్సీ ప్యాకింగ్ హ్యాంపర్‌కు రూ.46,999కు విక్రయించారు. 14న తమ ప్లాట్‌ఫామ్స్‌పై విక్రయాల రికార్డులను పలు ఈ కామర్స్ సంస్థలు ప్రకటించాయి. » ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి 24 ఆర్డర్ల ద్వారా 174 చాక్లెట్లను రూ,29,844కు కొనుగోలు చేశాడు. » 14న పీక్‌టైమ్‌లో నిమిషానికి 581 చాక్లెట్లు, 324 గులాబీలకు ఆర్డర్ వచ్చినట్టు స్విగ్గీ ప్రకటించింది. » ప్రేమికుల రోజున 4 లక్షల గులాబీలకు ఆర్డర్లు పొందినట్లు ఎఫ్ఎన్బీ తెలిపింది. ఈ నెల ప్రారంభం నుంచి 13వ తేదీ వరకు 15 లక్షల గులాబీలు విక్రయించినట్లు వెల్లడించింది. » ఫిబ్రవరిలో మొదటి 11 రోజుల్లోనే యూనీకామర్స్ యూనీవేర్ ప్లాట్‌ఫామ్ కోటికి పైగా బహుమతి వస్తువుల (గిఫ్టింగ్ ఐటమ్స్)ను విక్రయించింది. -
జేడీ వాన్స్ పిల్లలకు ‘మోదీ మార్క్’ గిఫ్ట్‌లు
ప్రధాని నరేంద్ర మోదీ ఏఐ యాక్షన్ సమ్మిట్ కోసం ఫ్రాన్స్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికాలో అడుగుబెట్టారు. అలాగే మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుమారుని పుట్టిన రోజు వేడుకలకు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్ పిల్లలకు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఇచ్చిన బహుమతులు హాట్‌టాపిక్‌గా మారాయి. మోదీ మన భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా, పర్యావరణ హితమైనవి బహుమతులగా వారికి ఇవ్వడం విశేషం. మరీ ఆ గిఫ్ట్‌ల విశిష్టత ఏంటో చూద్దామా..!.టాయ్ ట్రైన్, ఆల్ఫాబెట్ సెట్‌ని అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్ పిల్లలకు ఇచ్చారు మోదీ. ఇక ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు డోక్రా ఆర్ట్‌వర్క్ - రాతి పనితో కూడిన సంగీతకారులను బహుమతిగా ఇచ్చారు. మోదీ పర్యావరణ అనుకూలంగా.. చెక్కతో చేసిన వర్ణమాల సెట్‌ని జేడీ వ్యాన్స్ కుమార్తె మిరాబెల్ రోజ్ వాన్స్‌కు బహుమతిగా ఇచ్చారు. ఇది పిల్లలకు మంచిగా అక్షరాలను గుర్తుపట్టేలా చేసి తొందరగా నేర్చుకునేందుకు దోహదపడుతుంది. ఇది ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా, హానికరమైన రసాయనాలు లేని బహుమతి. అంతేగాదు పర్యావరణ పరిరక్షణకు తాము పెద్ద పీట వేస్తాం అనేలా పరోక్షంగా చెప్పినట్లుగా ఉన్నాయి ఆ బహుమతులు. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కి ఇచ్చిన డోక్రా ఆర్ట్ వర్క్‌ని గిఫ్ట్‌గా ఇచ్చి మా దేశ సంస్కృతి, హస్త కళా నైపుణ్యం ఎట్టిదో తెలియజేస్తున్నట్లుగా ఉంది. చేతల ద్వారా తామెంటన్నది చెప్పడమే మన నాయకులు గొప్పతనం కాబోలు. కాగా ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు మోదీ మూడు రోజులు ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఇక అక్కడ ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వాణిజ్యం, శక్తి, సాంస్కృతిక సంబంధాలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రపంచ నాయకులు, ప్రపంచ టెక్ CEOల సమావేశం అయిన AI యాక్షన్ సమ్మిట్‌కు ఆయన సహ అధ్యక్షత వహించారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం బుధవారం సాయంత్రం అమెరికాలో పర్యటించారు. డోనాల్డ్ ట్రంప్ రెండొవసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ అమెరికాలో చేసిన తొలి పర్యటన ఇది. అక్కడ మోదీకి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. ఈ నెల 12 నుంచి 13 వరకు మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. అక్కడ బ్లెయిర్ హౌస్‌లోనే బస చేయనున్నట్లు సమాచారం. (చదవండి: ప్రేమకు ప్రతిరూపమైన అమ్మను ప్రేమిద్దామిలా..!) -
తిరుమలలో ‘లక్ష్మణ’ లీలలు!
అమరావతి: తిరుమల తిరుపతి దేవ స్థానం (టీటీడీ)లో ప్రైవేట్ వ్యక్తుల హవాకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. 2014– 19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న వేమూరి హరికృష్ణ ఓ పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో దేవస్థానంలో చక్రం తిప్పుతుంటే మరోవైపు లోకేశ్ మనిషిగా ముద్రపడ్డ లక్ష్మణ్‌కుమార్ ఏకంగా ‘సూడో’ అదనపు ఈఓగా చెలరేగిపోతున్నారు. అదన ఈఓ వెంకయ్య చౌదరి పక్కనే ఈయనకు కుర్చీవేసి ప్రొటోకాల్ మర్యాదలు అందిస్తున్నారంటే ఈయన హవా ఏ స్థాయిలో నడుస్తోందో అర్థంచేసుకోవచ్చు.లక్ష్మణ్‌కుమార్‌కు ఛాంబర్, వాహనం, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఏ అధికారిక ఉత్తర్వులు లేకపోయినా టీటీడీలో తిష్టవేసి అందరినీ శాసిస్తున్న లక్ష్మణ్‌కుమార్ వ్యవహారం ఇప్పుడు టీటీడీలో హాట్ టాపిక్. టీటీడీలో ఎలాంటి ఉత్తర్వుల్లేకుండా అధికారిక సమావేశంలో పాలొ్గనడం, ఏఈఓతోపాటు సమీక్షల్లో ఉండడం.. నిఘా, ముఖ్యభద్రతాధికారి పాల్గొన్న సమావేశానికీ హాజరైన ఈ సూడో అడిషనల్ ఈఓ కథా కమామిషు ఇదీ..అంతటా ఆయనే..సీఎం కార్యాలయం నుంచి వచ్చే సిఫార్సు లేఖలతో పాటు, టీటీడీకి ప్రపంచం నలుమూలలు నుంచి వచ్చి దాతలిచ్చే విలువైన కానుక లపై ఈ సూడో ఏఈఓ ప్రత్యేక దృష్టిపెట్టినట్లు సమాచారం. కొందరు అజ్ఞాత భక్తులు స్వామివారికి కానుకలిచ్చే సమయంలో తమ పేరు చెప్పడానికి సైతం ఇష్టపడరు. అలాంటి వాటిపై సూడో ఏఈఓ అవతారమెత్తిన లక్ష్మణ్‌కుమార్ ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి నాడు విద్యుత్ దీపాలంకరణ బాధ్యతను దాత సహాయంతో అంతా లక్ష్మణ్‌కుమారే నడిపించినట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి.ఆయన చూస్తేనే అదనపు ఈఓ సిఫారసు..తిరుమలలో అదనపు ఈఓ కార్యాలయంలో ఏ పని జరగాలన్న లక్ష్మణ్‌కుమార్ కనుసన్నల్లోనే జరగాలని.. ఆ తర్వాతే ఏఈఓ వెంకయ్యచౌదరి సంతకాలు చేస్తారని టీటీడీ ఉద్యోగులు చెబుతున్నారు. అసలు ఏ అర్హతతో ఈయన్ను ఏఈఓ కార్యాలయంలో ప్రత్యేక చాంబర్ ఏర్పాటుచేయాల్సి వచ్చింది? స్పెషల్ టైప్–05 నెంబర్ గెస్ట్‌హౌస్‌ను ఆయనకు ఎందుకు నివాసంగా ఏర్పాటుచేశారని వారు చర్చించుకుంటున్నారు. పైగా.. ఈయన ఏఈఓ కార్యాలయంలోనే అపవిత్ర కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు.టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తామేంచేసినా చెల్లుబాటవుతుందనేలా వీరు రాజ్యాంగేతర శక్తులుగా అవతరిస్తున్నారు. వ్యవస్థల్ని శాసిస్తూ, దోచుకునేందుకు తిరుమల కొండపై తిష్టవేశారని ఉద్యోగులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇక తిరుమలను ప్రక్షాళన చేస్తానంటూ ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబునాయుడు.. అధికారంలోకి వచ్చాక టీటీడీని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పెట్ట డమే ప్రక్షాళనా అని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అదనపు ఈఓకు అనుభవంలేకపోవడంతో..నిజానికి.. టీటీడీ అదనపు ఈఓగా ఉన్న వెంకయ్యచౌదరికి పాలనా అనుభవంలేకపోవడం, నిత్యం కార్యాలయ పనులపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో లక్ష్మణ్‌కుమార్ సూడో అడిషనల్ ఈఓ చెలామణి అవుతున్నారు. అసలు కస్టమ్స్ ఆఫీసర్‌గా పనిచేసిన వ్యక్తిని టీటీడీ అదనపు ఈఓగా ఎలా నియమిస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. పైగా.. తిరుమలలో జేఈఓ కార్యాలయంలో పనిచేసేందుకు ఐఏఎస్ అధికారులు ఎవరూ లేన్నట్లు ఐఆర్ఎస్ అధికారిని అదనపు ఈఓగా తీసుకురావడం.. దీనికితోడు మరో సూడో అదనపు ఈఓకు పెత్తనం ఇవ్వడం పవిత్ర తిరుమల భ్రష్టుపట్టిపోవడానికి దారితీస్తోందని కార్యాలయ సిబ్బంది మండిపడుతున్నారు.తిరుమలను చెప్పుచేతల్లో పెట్టుకునేందుకే..టీటీడీకి సంబంధించిన ప్రతి విషయం ఎంతో గోప్యంగా, భద్రంగా ఉంటుంది. కానీ, చంద్రబాబు ఈ మొత్తం వ్యవస్థను తన చెప్పుచేతుల్లో పెట్టుకునేందుకే లక్ష్మణ్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన పరకామణి, పోటు, దాతలిచ్చే విరాళాలు, టీటీడీ ఈ– ఫైల్స్, టీటీడీ టెండర్లు తదితర వాటిపై పెత్తనం సాగిస్తున్నారు. రహస్య సమాచారం అంతా ఆయన చేతుల్లోకి తీసుకున్నారు. అలాగే, సిఫార్సు లేఖలు కూడా ఎవరికివ్వాలి, ఎవరికి ఇవ్వకూడదనే విషయాలనూ ఆయనే చూసుకుంటున్నారు. ఈయన చూసి ఓకే చేసిన తర్వాతే టీటీడీ ఏఈఓ, ఈఓ నిర్ణయం తీసుకునేలా వ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. ఇలా కీలక వ్యవహారాలన్నీ చంద్రబాబు ఓ ప్రైవేట్ వ్యక్తికి అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలో ఏ స్కాం జరిగినా బయటకు రాకుండా వ్యవస్థను ఏర్పరుచుకున్నారని టీటీడీ సిబ్బంది చర్చించుకుంటున్నారు. -
తాళి కట్టు శుభవేళ..బహుమతులపై పన్ను భారం ఉండదా?
అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక ఈ వారం విషయంలోకి వెళ్తే.. తాళి కట్టు శుభవేళ.. అంతా మంచే జరగాలని కోరుకుంటాం. వధూవరులను ఆశీర్వదిస్తాం. అంతా మంగళప్రదంగా జరగాలని.. కలకాలం కొత్త జంట చల్లగా ఉండాలని కోరుకుంటాం. పెళ్లి సందర్భంలో వధూవరులకు వచ్చే బహుమతులపై పన్ను భారం లేదు. అటువంటి వాటిని ఆదాయంగా పరిగణించరు. ఇప్పుడు ముందు రిసెప్షన్.. తర్వాత పెళ్లి... కాబోయే జంట పందిరిలో నిలబడటం.. మిగతా అందరూ లైన్లో వెళ్లి, వారికి బహుమతులివ్వడం.. తాళి కట్టిన తర్వాత కూడా కొందరు ఇస్తారు. ఏది ఏమైనా సందర్భం ‘పెళ్లి’ ఒక రోజు అటూ ఇటూ.. పెళ్లి పేరు చెప్పి ఎప్పుడు ఇచ్చినా ఏ ఇబ్బందీ లేదు.ఎటువంటి బహుమతులు ఇవ్వొచ్చు..నగదు ఇవ్వొచ్చు. దగ్గరి బంధువైతే ఎటువంటి ఆంక్షలు లేవు. బీరకాయ .. బెండకాయ సంబంధం కాదండి. బాదరాయణ సంబంధమూ కాదు. చట్టంలో పొందుపర్చిన నిర్వచనాన్ని గుర్తు పెట్టుకోండి. అలా అని రూ.2,00,000 దాటకండి. పేటీఎంలు, గూగుల్ పేమెంట్లు, చెక్కులు, డీడీలు, ఆర్టీజీఎస్, బదిలీలు, నగ, నట్రా, వెండి, బంగారం, ఆభరణాలు, కుక్కర్లు, వంట సామగ్రి, టీవీలు, ఫ్రిజ్జులు, భూములు, ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, స్థిరాస్తి, షేర్లు, బాండ్లు.. ఎలాగైనా మీ ప్రేమ, అభిమానాన్ని ప్రకటించుకోండి. పుచ్చుకున్న వారికి ఆదాయంగా పరిగణించరు. పన్నుభారం పడదు. పన్ను చెల్లించనక్కర్లేదు. అయితే, కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి.వధూవరులకు వచ్చే వాటిని ఆదాయంగా పరిగణించరు.అత్తగారి లాంఛనం, ఆడపడుచు కట్నం మొదలైన వాటి మీద ఎటువంటి మినహాయింపు లేదు. కొన్ని పెళ్లిళ్లలో ఈ లాంఛనాలు భారీగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త.పూర్వకాలంలో పురోహితుడు నలుగురికి వినపడేలా అరిచేవారు. ఫలానా వారింత కట్నం అని.. కొంత మంది తమ పేరు నలుగురికి వినబడేలా చదివించుకునే వారు.ఇప్పుడు బాహాటంగా చదివింపులు లేవు. కవర్లో ఎంతో కొంత పెట్టి.. అది వారి చేతిలో పెట్టి, ఫొటోగ్రాఫర్ వైపు మొగం చూపెట్టి.. భోజనం దిశగా అడుగెట్టి.. ఇంటి దారి పట్టి.. వెళ్లిపోతున్నారు.ఇవి చిన్న మొత్తాలయితేనేం.. అధిక విలువగలవైతేనేం.. పంతులు గారికి ఒక వెయ్యి నూటపదహార్లు ఇచ్చి ఒక పుస్తకం.. పెళ్లి పుస్తకం తెరిపించండి.ఆ పుస్తకానికి పసుపు, కుంకుమ బాగా దట్టించండి. తారీఖు, టైం వేసి.. అందరి పేర్లూ రాయండి. పింకీ, సుబ్బు, పక్కింటి ఆంటీ అని కాకుండా వీలైతే పూర్తి పేరు రాయండి. అలాగే ఫోన్ పేమెంట్లు, గూగుల్ పేమెంట్లు, బ్యాంకులో జమలు, ప్రత్యేక జాబితా రాయండి. బ్యాంకు స్టేట్మెంట్లో ఈ ‘జవాబు’ను హైలైట్ చేయండి. మీరు మీ పెళ్లి పుస్తకంలో వారి పేరు, వీలైతే, సెల్ నంబరు రాయండి. బ్యాంకు స్టేట్మెంట్లు భద్రపరచండి.ఇదీ చదవండి: ‘ఐదు శాతం’తో రూ.1.8 కోట్లు సంపాదననగదు చదివింపులను వీలైతే బ్యాంకులో జమ చేయండి. ఆ పేయింగ్ స్లిప్‌ను మీ పుస్తకంలో అతికించండి.ఇలా రాయటం వల్ల రెండు ప్రయోజనాలు. ఒకటి మున్ముందు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్ వారికి ‘సోర్స్’ వివరణ రెడీగా ఉంటుంది. రెండోది మీరు అటువంటి వారికి కట్నం ఇచ్చేటప్పుడు ఇదొక కొలబద్దగా ఉంటుంది.నగదు ఖర్చుపెట్టే అవసరం అయితే.. దేని నిమిత్తం ఖర్చు పెట్టారో రాయండి.భారీ కంచాలు, ప్లేట్లు, సీనరీలు, దేవుడి బొమ్మలు మొదలైనవి రాయకపోయినా ‘విలువైనవి’ అనిపించిన వస్తువుల జాబితా రాయండి.స్థిరాస్తులు మొదలైన అన్ని కాగితాలు తీసుకోండి. బదిలీ పత్రాలు తీసుకోండి. మరీ చాదస్తం అని కొట్టిపడేయకండి. దేనికైనా దస్త్రం కావాలి. అదీ మనమే సమకూర్చుకోవాలి. సకాలంలో సర్దుకోండి.-కే.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి-కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
ఉద్యోగులకు కార్లు, బైకులు గిఫ్ట్.. ఎక్కడో తెలుసా?
కొన్ని కంపెనీలు దసరాకు బోనస్‌లు ఇవ్వడం, దీపావళికి గిఫ్ట్స్ ఇవ్వడం వంటివి చేస్తుంటాయి. మరికొన్ని సంస్థలు బోనస్‌లు, బహుమతుల ఊసేలేకుండా మిన్నకుండిపోతాయి. అయితే ఇటీవల చెన్నైకి చెందిన సుర్‌మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ ఉద్యోగులకు బైకులు, కార్లను గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం నెట్టింట్లో ఇదే హాట్ టాపిక్‌గా మారిపోయింది.సుర్‌మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తమ ఉద్యోగులను ప్రోత్సహించడంలో భాగంగా 20 మందికి టాటా కార్లు, యాక్టివా స్కూటర్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను అందించింది.చెన్నైలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న సుర్‌మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాజిస్టిక్స్ రంగంలో సరుకుల రవాణా, పారదర్శకత, సరఫరాలలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరిస్తుంది. అన్ని వ్యాపారాల్లో లాజిస్టిక్స్‌ను మరింత సరళీకృతం చేయడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు దాని వ్యవస్థాపకుడు, ఎండీ డెంజిల్ రాయన్ పేర్కొన్నారు. -
మేనమామ సారె అదుర్స్
సేలం: తూత్తుకుడి సమీపం శంకరరాజపురం గ్రామానికి చెందిన ఆనంది కుమార్తె సబీష్టా (14)కు పుష్పవతి వేడుకలను గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా సబీష్టా మేనమామలు భవిత్కుమార్, సూర్య మేళతాళాల హోరు, బాణాసంచాల మోత, వెలుగుల మధ్య 350 పళ్లాలలో బంగారు నగలతోపాటు పూలు. పండ్లు, పలు రకాల స్వీట్లు, దుస్తులు, అలంకరణ సామగ్రి మొదలైనవి సారెగా ఇచ్చేందుకు కంటైనర్ లారీలో తీసుకురావడం స్థానికులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. -
ఉద్యోగులకు దీపావళి కానుకగా ఏకంగా బెంజ్‌కార్లు, అంతేనా?!
దీపావళి సందర్భంగా ఉద్యోగులకు బోనస్‌లు, గిప్ట్‌లు ఇవ్వడం చాలా కామన్. ఇటీవలి కాలంలో కంపెనీ లాభాలను బట్టి ఖరీదైన బహుమతులను ఇస్తున్న సందర్భాలను కూడా చూశాం. గతంలో డైమండ్ కంపెనీ యజమాని తన ఉద్యోగులకు ఇళ్లు, కార్లు బహుమతి ఇచ్చి వార్తల్లో నిలిచాడు. తాజాగా చెన్నైకి చెందిన ఒక కంపెనీ తన ఉద్యోగులకు ఏకంగా బెంజ్ కార్లను బహుమతిగా ఇచ్చింది. బెంజ్ సహా 28 ఇతర బ్రాండెడ్ కార్లను, 29 బైక్‌లను దివాలీ గిఫ్ట్ ఇచ్చింది.స్ట్రక్చరల్ స్టీల్ డిజైన్ అండ్ డిటైలింగ్ కంపెనీ, టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ తన ఉద్యోగులకుఅదిరిపోయే దీపావళి కానుక అందించింది. హ్యుందాయ్, టాటా, మారుతీ సుజుకీ , మెర్సిడెస్ బెంజ్ నుండి వివిధ రకాల బ్రాండ్ కొత్త కార్లను ఉద్యోగులకు అందించింది. కంపెనీ అభివృద్ధిలోనూ, విజయవంతంగా కంపెనీని నడిపించడంలోనూ ఉద్యోగుల కృషి , అంకితభావానికి ప్రశంసల చిహ్నంగా అందించినట్లు కంపెనీ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ కన్నన్ తెలిపారు. ఉద్యోగులే తమ గొప్ప ఆస్తి అని, ఈ విధంగా ఉద్యోగుల విజయాలను గుర్తించడం సంతోషంగా ఉందన్నారు. ఇది తమ ఉద్యోగుల్లో ధైర్యాన్ని, ప్రేరణనిచ్చి, ఉత్పాదకతను పెంచుతుందని ఆశిస్తున్నామన్నారు. అలాగే ఉద్యోగుల అభివృద్ధికి , కస్టమర్ సంతృప్తికి అధిక ప్రాధాన్యత భవిష్యత్తులో కొనసాగుతుందని కన్నన్ తెలిపారు. వివాహ సాయం లక్ష రూపాయలకు పెంపుకంపెనీలో సుమారు 180 మంది ఉద్యోగులుండగా, దాదాపు అందరూ నిరాడంబరమైన నేపథ్యంనుండి వచ్చినవారు, అత్యంత నైపుణ్యం ఉన్నవారేనని కంపెనీ కొనియాడింది. కార్లను బహుమతిగా ఇవ్వడంతో పాటు, వివాహ సహాయంగా ఉద్యోగులకు సహాయం కూడా చేస్తుందని కూడా వెల్లడించారు. వివాహ సహాయంగా గతంలో ఇచ్చే 50 వేల సాయాన్ని ఇపుడు లక్షరూపాయలకు పెంచారు.2022లో, ఇద్దరు సీనియర్ సిబ్బందికి మాత్రమే రెండు కార్లను ఇచ్చిన కంపెనీ,ఈ ఏడాది 28 కార్లతోపాటు, 28 బైక్‌లను కూడా కానుకంగా అందించడం విశేషం.కాగా సరిగ్గా జీతాలు ఇవ్వక ఉద్యోగులను, కార్మికులను దోపిడీ చేస్తున్నారంటూ కంపెనీలపై ఫిర్యాదులు పెరుగుతున్న తరుణంలో చెన్నైకంపెనీ నిర్ణయం విశేషంగా నిలిచింది. -
షిర్డీ సాయి ట్రస్టుకు పన్ను మినహాయింపు సబబే
ముంబై: షిర్డీ సాయి బాబా ట్రస్టుకు హుండీ కానుకల రూపంలో వస్తున్న నగదుకు ఆదాయపు పన్ను మినహాయింపు సబబేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు గతేడాది అక్టోబరు 25న ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఇచ్చిన తీర్పును సమర్థించింది. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు (షిర్డీ) ఒక ధార్మిక సంస్థ అని, ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు చేపట్టడం లేదని ముంబై ఐటీ కమిషనర్ (మినహాయింపులు) వాదించారు. హుండీ రూపంలో గుర్తుతెలియని భక్తులు సమర్పిస్తున్న కానుకలు.. మొత్తం విరాళాల్లో ఐదు శాతాన్ని దాటుతున్నాయి కాబట్టి.. పన్ను పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. 2015–16, 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో హుండీ కానుకల రూపంలో షిర్డీ ట్రస్టుకు రూ.400 కోట్లు అందాయని, అందులో కేవలం రూ. 2.3 కోట్లు మాత్రమే మతపరమైన కార్యక్రమాలకు వెచ్చించారని ఐటీ కమిషనర్ హైకోర్టుకు తెలిపారు. అధికభాగం నిధులను విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వైద్య సదుపాయాలకు మళ్లించారని పేర్కొన్నారు. జస్టిస్ జి.ఎస్.కులకర్ణి, జస్టిస్ సోమశేఖర్ సుందరేశన్‌లు ఈ వాదనతో విభేదించారు. షిర్డీ ట్రస్టు మతపరమైన, చారిటబుల్ ట్రస్టు అని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు కోరడం చట్టబద్ధంగా న్యాయమని, సబబని తీర్పునిచ్చారు. -
‘ప్రధాని బహమతుల’ వేలం నేటి నుంచే
న్యూఢిల్లీ: స్పోర్ట్స్ షూ, పారాలింపిక్ విజేతలకు చెందిన వస్తువులు, అయోధ్య రామాలయం ప్రతిరూపం, వెండి వీణ..ఇలా ప్రధాని మోదీ ఏడాది కాలంలో అందుకున్న బహమతుల వేలం ఈ నెల 17న మొదలై అక్టోబర్ 2 వరకు కొనసాగుతుందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. సుమారు రూ.1.5 కోట్లకు పైగా విలువైన 600 జ్ఞాపికలను వేలంలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో ప్రదర్శనను సోమవారం మంత్రి తిలకించారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వేలం రూ.600 నుంచి గరిష్టంగా రూ.8.26 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. -
అంబానీ పెళ్లి సందడి : జెఫ్ బెజోస్, ఇతర దిగ్గజాల కళ్లు చెదిరే కానుకలు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆకాశమంతపందిరి, భూదేవి అంత పీట అనే మాట వినడమే గానీ ఎపుడూ చూడని చాలామందికి ఇలా ఉంటుందా అనేట్టుగా కనీవినీ ఎరుగని రీతిలో మూడు రోజుల పాటు వేడుక జరిగింది. జూలై 12, 2024న గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా పద్నాలుగు వేల మంది హాజరయ్యారు. సుమారు రూ. 5వేల కోట్లు ఖర్చు చేసినట్టు పలు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే దేశ, విదేశాలనుంచి విచ్చేసిన అతిథులకు బహుమతులను అంతే ఘనంగా అందించారు. అయితే ఇపుడు తాజాగా అనంత్-రాధిక గ్రాండ్ వెడ్డింగ్‌కు విచ్చేసిన గ్గోబల్ దిగ్గజాలు నూతన వధూవరులకు ఇచ్చిన కానుకలపై తాజా చర్చ నడుస్తోంది.కొత్త జంట అనంత్ అంబానీ-రాధిక మర్చంట్లకు కొందరు హై-ప్రొఫైల్ అతిథులు ఖరీదైన విగ్రహాలు , పెయింటింగ్‌లను అందించారు. ఇంటర్నేషన్ గెస్ట్‌లు మాత్రం వీటన్నింటికీ మించిన కోట్ల విలువ చేసే కార్లను గిప్ట్‌లుగా అందించారట. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారం, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ వారికి బుగాట్టి కారును బహుమతిగా ఇచ్చారు. దీని రూ. 11.50 కోట్లు.అమెరికన్ నటుడు , ప్రొఫెషనల్ రెజ్లర్, జాన్ సెనా వారికి రూ. 3 కోట్ల విలువైన లంబోర్ఘిని బహుమతిగా ఇచ్చాడు. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వారికి రూ. రూ. 300 కోట్లు విలువైన కానుక ఇచ్చారట. ఇక బిల్ గేట్స్ రూ. 9 కోట్ల విలువైన డైమండ్ రింగ్ ఇచ్చారని తెలుస్తోంది. 9 కోట్లు. అంతేకాదు బిల్ గేట్స్ రూ. రూ. 180 కోట్ల విలువైన లగ్జరీ యాచ్‌ను ఇచ్చినట్టు మరో వీడియో ద్వారా తెలుస్తోంది. గూగుల్ , అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ 100 కోట్ల రూపాయల విలువైన హెలికాప్టర్‌ను బహుమతిగా ఇచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కొత్తగా పెళ్లయిన జంటకు అమెరికాలోని రూ. 80 కోట్ల విలువ జేసే లగ్జరీ భవనాన్ని కానుకగా ఇచ్చినట్టు తెలుస్తోంది. -
కుబేరుల బిడ్డలు : ఘనమైన బహుమతులు, వీటి విలువ తెలుసా?
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తన 4 నెలల మనవడు గ్రాహ్కు రూ. 240 కోట్ల విలువైన 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఏయే సెలబ్రీటీలు తమ వారసులకు ఏయే ఖరీదైన గిఫ్ట్‌లు వార్తల్లో నిలిచాయి. నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి , అపర్ణ కృష్ణన్‌ల కుమారుడైన ఏకగ్రాహ్కు సుధా,మూర్తి దంపతులకు మూడో మనవడు . యూకే ప్రధాని రిషి సునక్ భార్య అక్షతామూర్తి వీరి పెద్ద కుమార్తె. అక్షత, రిషీలకు కృష్ణ , అనౌష్క అనే ఇద్దరు పిల్లలున్నారు. అంబానీ పెద్ద కోడలి గిఫ్ట్ ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతాకు అంబానీ పెద్ద కోడలు కూడా ఖరీదైన బహుమతి దక్కించుకుని అప్పట్లో వార్తల్లో నిలిచారు. రూ. 451 కోట్ల విలువైన మౌవాద్ ఎల్' నెక్లెస్‌ను నీతా అంబానీ కోడిలికి పెళ్లి బహుమతిగా ఇచ్చారు. కుమారుడికి పుట్టినరోజుకి పూనావాలా గిఫ్ట్ ఏంటంటే.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా, DC కామిక్ పుస్తకాన్ని పోలిన బ్యాట్మొబైల్ను తన కుమారుడికి బహుమతిగా ఇచ్చారు. 2015లో తన కుమారుడి 6వ పుట్టినరోజు సందర్భంగా, అదార్ పూనావల్ల తన Mercedes-Benz S-క్లాస్‌ని బ్యాట్‌మొబైల్ మోడల్లో తీర్చిదిద్దేలా చేశారు.ఈ మార్పులు పూర్తి చేయడానికి ఆరు నెలలకు పైగా పట్టిందట. శివ నాడార్ కూడా ప్రముఖ టెక్ సంస్థ హెసీఎల్ ఫౌండర్ పౌండర్, ఛైర్మన్ శివ్ నాడార్ 2014లో తన ఏకైక కుమార్తె రోష్ని కోసం ఒక లగ్జరీ ఇంటిని కొనుగోలు చేశారు. తూర్పు ఢిల్లీలోని ఫ్రెండ్స్ కాలనీలోని ఈ బంగ్లా విలువ రూ. 115 కోట్లు. ఇషా అంబానీ ట్విన్స్ కోసం ఇషా అంబానీ వ్యాపారవేత్తగా సత్తా చాటుతున్న ఇషా అంబానీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ముఖేష్ అంబానీ , నీతా అంబానీ ఏకైక కుమార్తె, ఇషా అంబానీ 2018లో బిలియనీర్ ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుంది. ఈ పెళ్లి సందర్భంగానే అజయ్ పిరమల్ స్వాతి పిరమల్ దంపతులు ఇషా , ఆనంద్ పిరమల్లకు ముంబైలోని ‘గులిటా’ అనే ఒక విలాసవంతమైన ఇంటిని బహుమతిగా ఇచ్చారు. దీని విలువ రూ.450 కోట్లు అని సమాచారం. అలాగే ఇషా, ఆనంద్ దంపతులు ట్విన్స్ పుట్టిన సందర్భంగా అంబానీ ప్రత్యేకంగా తయారు చేసిన అల్మారాను బహుమతిగా ఇచ్చారు. 2022లో పుట్టిన కృష్ణ-ఆదియాలకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వడం విశేషం. బిల్‌గేట్స్ ముద్దుల బిడ్డ కోసం మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు , బిలియనీర్ బిల్ గేట్స్ తన కుమార్తె జెన్నిఫర్ గేట్స్ నాసర్‌పై తనకున్న ప్రేమను ఘనంగా చాటుకున్నాడు. బిల్ గేట్స్ తన కూతురికి 277 కోట్ల రూపాయల విలువైన 124 ఎకరాలగుర్రపు ఫారమ్‌ను బహుమతిగా ఇచ్చాడు. అమెరికాలోని ఫ్లోరిడాలోని వెల్లింగ్టన్లో ఉన్న ఈ గుర్రపు ఫారమ్‌ను ఎవర్గేట్ స్టేబుల్స్ అంటారు.ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తరువాత తన కుమార్తె రైడింగ్ కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ గిఫ్ట్ ఇచ్చారట. -
కాబోయే కోడలి కోసం ఖరీదైన కానుకలు.. ఎంతైనా అంబానీ రేంజే వేరు..
భారతదేశంలో అత్యంత ధనవంతులైన అంబానీ కుటుంబంలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ తరుణంలో కాబోయే కోడలు 'రాధిక మర్చంట్'కు ఖరీదైన గిఫ్ట్స్ అందించారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1 నుంచి 3 వరకు జరగనున్నాయి. అంతకంటే ముందు అత్తింటి వారు కాబోయే కోడలికి సుమారు రూ.4.5 కోట్ల విలువైన బెంట్లీ కారు, వెండి లక్ష్మి గణపతి విగ్రహం, డైమండ్ నెక్లెస్ వంటి వాటిని గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. రాధికా మర్చంట్ గతంలో ఓ పార్టీలో తన అత్తగారికి చెందిన డైమండ్ చౌకర్ ధరించి కనిపించింది. ఇది విలువైన ముత్యాలు, వజ్రాలతో పొడిగినట్లు తెలుస్తోంది. అంత కంటే ముందు సోనమ్ కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు నీతా అంబానీ అదే నెక్లెస్ ధరించడం గమనార్హం. ఇదీ చదవండి: అంబానీ ఇంట పెళ్లి సంబరాలు.. ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ఇండియాకు.. వచ్చే నెల ప్రారంభంలో జరగనున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అంతర్జాతీయ సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇందులో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సీఈవో టెడ్ పిక్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, డిస్నీ సీఈవో బాబ్ ఇగర్, బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్, అడ్నాక్ సీఈవో సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్ వంటి వాటితో పాటు ఇవాంకా ట్రంప్ కూడా ఉన్నట్లు సమాచారం. -
అంబానీ ఇంట పెళ్లి సందడి: అతిథులకు అదిరిపోయే గిఫ్ట్..?!
బిలియనీర్లు, బిజినెస్ దిగ్గజాల ఇంట్లో పెళ్లి అంటే ఆ సందడి మామూలుగా ఉండదుగా. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు, వ్యాపారవేత్త అనంత్అంబానీ, రాధిక మర్చంట్ మూడుముళ్ల వేడుక అంటే అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే అంబానీ చేతితో రాసారని చెబుతున్న ఇన్విటేషన్ కార్డ్ ఒకటి నెట్టింట హల్ చల్ చేసింది. అయితే, అంబానీ కుటుంబం ఈ వార్తలను ధృవీకరించలేదు అలాగని ఖండించనూ లేదు.దీంతో మరిన్ని ఊహాగానాలు, అంచనాలు వెలుగులోకి వస్తున్నాయి. జూలైలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ గ్రాండ్ వెడ్డింగ్ అంబానీ ఫ్యాన్ పేజీలలో ప్రకారం, అనంత్ ,రాధిక జూలై 2024లో ముంబైలో గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.జూలై 10, 11 , 12 తేదీల్లో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ పెళ్లికి VIP గెస్ట్ హౌస్‌లతో పాటు 1200 మంది అతిథులు రానున్నారు. సింగర్, దిల్జిత్ దోసాంజ్ వారి వివాహానికి ముందు ఉత్సవాల్లో అనేక మంది ప్రదర్శనకారులలో ఉంటారు. జామ్‌నగర్‌లోని రిలయన్స్ గ్రీన్స్‌లో ఈ ఏడాది మార్చిలో అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు షురూ అవుతాయి.దీంతో పాటు అనంత్ అంబానీ , రాధిక డిజైనర్ దుస్తులు, విందు, ఇలా పెళ్లికి సంబంధించి అనేక పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే పెళ్లి హడావిడి మొదలైందని కొన్ని ఫోటోలు షేర్ అవుతున్నాయి. ఇందులో వధువు తండ్రి, వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ రాధిక స్నేహితులతో కలిసి పోజులిచ్చాడు. ఎంబ్రాయిడరీ నెహ్రూ జాకెట్, బ్లాక్ కలర్ బంద్‌గాలా షేర్వాణిలో వీరేల్ హుందాగా కనిపించాడు. Anti Valentine Week 2024 : చెంప పగలగొట్టు...బ్రేకప్ చెప్పేయ్..! దివ్యాంగులు తయారు చేసిన స్పెషల్ క్యాండిల్స్ మరో ఇంట్రస్టింగ్ వార్త ఏంటంటే..పెళ్లికి వచ్చిన అతిథులకు మహాబలేశ్వర్‌లోని అంధ ళాకారుల తయారు చేసిన ప్రత్యేక కొవ్వొత్తులను బహుమతిగా ఇస్తారట. స్వదేశీ పురాతన హస్తకళ, అమూల్యమైన వారసత్వ సంపదకు ఇషా అంబానీ సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో వారికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అలంకరణకు కూడా వీటిని ఎక్కువగా వాడనున్నారట. ( ‘గో నిషా గో’ గేమ్ : వారి కోసమే, డౌన్లోడ్లతో దూసుకుపోతోంది) -
కల్యాణ మండపంలో రక్తదాన శిబిరం.. దాతలుగా బంధువులు!
మన దేశంలో జరిగే పెళ్లి వేడుకల్లో కానుకలు ఇచ్చిపుచ్చుకోవడమనేది సాధారణమే. అయితే బీహార్‌లో విచిత్రమైన కానుకల డిమాండ్‌తో ఒక వివాహం జరిగింది. స్థానికంగా ఇది చర్చకు దారితీయడంతోపాటు పదిమందికీ ఆదర్శంగానూ నిలిచింది. బీహార్‌లోని ఔరంగాబాద్‌లో ఓ వివాహ వేడుకలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. రక్తదానం చేస్తేనే.. ఊరేగింపుగా వధువు ఇంటికి వస్తానని వరుడు కండీషన్ పెట్టాడు. ఇది విన్నవెంటనే వధువు తరపువారు మొదట ఆలోచనలో పడ్డారు. తరువాత వరుని మాటను మన్నించి, ఆడపిల్ల తరపువారంతా రక్తదానం చేసి, పెళ్లి ఘనంగా జరిపించారు. ఈ ఘటన ఔరంగాబాద్ జిల్లాలోని హస్పురాలో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి హస్పురాకు చెందిన అనీష్, అర్రాకు చెందిన సిమ్రాన్‌కు వివాహం నిశ్చయమయ్యింది. కాగా అనీష్ ఈ ప్రాంతంలో అత్యధికంగా రక్తదానాలు చేయిస్తూ ‘రక్తవీర్’ అనే పేరు పొందాడు. తన పెళ్లి సందర్భంగా పదిమందితో రక్తదానం చేయించాలని అనుకున్నాడు. వెంటనే ఈ విషయాన్ని వధువు తరపు వారికి తెలియజేశారు. రక్తదానానికి సిద్ధమయితేనే ఈ పెళ్లి జరుగుతుందంటూ ఆడ పెళ్లివారికి కబురంపాడు. దీనికి ఆడపెళ్లివారంతా సమ్మతి తెలిపారు. పట్నాలోని నిరామయ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ రంజన్ వచ్చి పెళ్లివారింట రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 70 మందికి పైగా బంధువులు రక్తదానం చేశారు. తన జీవితంలో తొలిసారిగా ఇలాంటి రక్తదాన శిబిరాన్ని చూశానని డాక్టర్ రాకేష్ తెలిపారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్‌కు చెందిన గణేష్ కుమార్ భగత్, అతని బృందం మాట్లాడుతూ రక్తం కొరతతో ఎవరూ చనిపోకూడదనే లక్ష్యంతోనే ఈ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. వివాహ వేడుకల్లో ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. -
Ayodhya Ram Mandir: అతిథులకు అపూర్వ కానుక! ఏంటంటే..
అయోధ్య: ప్రపంచమంతా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట ఉత్సవం ఈ నెల 22న మధ్యాహ్నం జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకకు హాజరయ్యే ముఖ్య అతిథులకు ఒక అపూర్వమైన కానుకను టెంపుల్ యాజమాన్యం అందించనుంది. ఈ కానుకకు ప్రత్యేకంగా రామ్రాజ్ అని పేరు కూడా పెట్టారు. వీటితో పాటు అదనంగా అతిథులకు ప్రత్యేకంగా తయారు చేయించిన మోతీచూర్ లడ్డూలను కూడా ప్రసాదంగా ఇవ్వనున్నారు. ఇంతకీ రామ్రాజ్ కానుకలో ఏముంటుందంటే అయోధ్యలో రామ్మందిరం నిర్మాణం ప్రారంభించే ముందు మందిర పునాదిలోని పవిత్రమైన మట్టిని సేకరించారు. ప్రత్యేకమైన బాక్సుల్లో ఆ మట్టిని ప్యాక్ చేసి వాటిని గిఫ్ట్‌లుగా అలంకరించారు. కాగా, దేశం నలుమూలల నుంచి ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానాలు అందుకున్న మొత్తం 11 వేల మంది విశిష్ట అతిథులకు రామ్రాజ్ బాక్సులు అందించనుండటం విశేషం.ఈ అతిథుల్లో ఎవరైనా వేడుకకు రాకపోతే వారు తర్వాత తొలిసారి గుడికి వచ్చినపుడు రామ్రాజ్ కానుకను అందజేస్తారు. ప్రధాని మోదీకి 15 మీటర్ల పొడవున్న రాముని గుడి చిత్ర పటాన్ని జ్యూట్ బ్యాగులో ఉంచి గుడి యాజమాన్యం కానుకగా ఇవ్వనుంది. ఇదీచదవండి.. రూ.50 వేల కోట్ల వ్యాపారం.. అంతా రాముని దయ -
Ayodhya: 2,100 కిలోల గంట.. 108 అడుగుల అగరుబత్తి
న్యూఢిల్లీ: అయోధ్యలో నిర్మించిన భవ్యమందిరంలో కొలువుదీరబోతున్న బాల రాముడికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అరుదైన కానుకలు వెల్లువెత్తుతున్నాయి. 108 అడుగుల పొడవైన అగరుబత్తి, 2,100 కిలోల బరువైన గంట, 1,100 కిలోల బరువైన భారీ ప్రమిద, బంగారు పాదుకలు, 10 అడుగుల ఎత్తయిన తాళం, తాళంచెవి, ఒకేసారి ఎనిమిది దేశాల సమయాన్ని సూచించే గడియారం తదితర ప్రత్యేక కానుకలను అయోధ్య రాముడికి సమరి్పంచేందుకు భక్తులు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఈ నెల 22వ తేదీన రామ మందిరంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దేశ విదేశాల నుంచి బహుమతులు అందుతున్నాయి. సీతమ్మ పుట్టిన ఊరు జనక్‌పూర్ ప్రస్తుతం నేపాల్‌లో ఉంది. నేపాల్ నుంచి అయోధ్యకు వెండి చెప్పులు, బంగారు ఆభరణాల వంటి 3,000కుపైగా బహుమతులు వచ్చాయి. ఇక శ్రీలంకలోని అశోక్ వాటిక నుంచి తీసుకొచ్చిన ఒక అరుదైన రాయిని అక్కడి ప్రతినిధులు అయోధ్యలో అందజేశారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7,000 కిలోల ‘రామ్ హల్వా’ అయోధ్యలో ప్రాణప్రతిష్ట కోసం గుజరాత్ భక్తులు 44 అడుగుల పొడవైన ఇత్తడి జెండా స్తంభాన్ని పంపిస్తున్నారు. మహారాష్ట్రకు విష్ణు మనోహర్ అనే వంట మాస్టర్ 7,000 కిలోల ‘రామ్ హల్వా’ తయారు చేసి అయోధ్యలో భక్తులకు పంపిణీ చేస్తారు. శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ 200 కిలోల భారీ లడ్డూ తయారీలో నిమగ్నమైంది. అయోధ్యకు లక్ష లడ్డూలు పంపిస్తామని తిరుమతి తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించడం తెలిసిందే. సీతమ్మ కోసం సూరత్‌లో ప్రత్యేకంగా చీర తయారు చేస్తున్నారు. సూరత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి 2 కిలోల వెండి, 5,000 అమెరికన్ వజ్రాలతో కూడిన నెక్లెస్ రాముడికి బహూకరించబోతున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యాపురిలో నూతన రామాలయ వైభవమిదే.. -
ఈ క్రిస్మస్కి సింపుల్ అండ్ స్పెషల్ గిఫ్ట్స్ ఏవో తెలుసా..!?
'మరికొద్దిరోజుల్లో జరుపుకోనున్న క్రిస్మస్కు దాదాపు ప్రపంచమంతా ఆతృతగా రెడీ అయి΄ోతోంది. షాపింగ్ మాల్స్ నుంచి క్రిస్టియన్ లోగిళ్లు, చర్చ్‌లు.. క్రిస్మస్ స్టార్లు, ట్రీల అలంకరణతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. వీటితో΄ాటు తప్పనిసరిగా సందడి చేసేవి శాంతాక్లాజ్ ఇచ్చే బహుమతులు. శాంతాక్లాజ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కోసం పిల్లలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. పిల్లలేగాక, కొన్ని కంపెనీలు సైతం ఉద్యోగులకు, కొంతమంది బంధువులకు, స్నేహితులకు, సహోద్యోగులకు సర్ప్రైజ్గిప్ట్స్ను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి క్రిస్మస్కు తక్కువ బడ్జెట్లో ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా నిలిచే బహుమతులు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఇలా ప్రయత్నించి చూడండి..' మొక్కలు పర్యావరణం పచ్చగా ఉంటేనే అందరూ సంతోషంగా ఉంటారు. అందుకే పర్యావరణ స్నేహితం అయిన పచ్చని మొక్కలను క్రిస్మస్కు బహుమతిగా ఇవ్వొచ్చు. ఇప్పుడున్న ఇరుకు ఇళ్లకు ఇండోర్ ΄్లాంట్స్ అయితే మరింత మంచి గిఫ్ట్ అవుతాయి. గిఫ్ట్‌కార్డ్స్, స్పా వోచర్స్ మార్కెట్లో రకరకాల ఫ్యాషన్ బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏవైనా గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. స్పా వోచర్స్ కూడా మంచి గిఫ్ట్సే. మ్యాచింగ్ పీజేఎస్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి నప్పేలా మ్యాచింగ్ క్రిస్మస్ పైజమాలను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఇవి ప్రత్యేకంగానూ, ఫన్నీగా ఉండి పండుగ సందడిని మరింత పెంచుతాయి. బుక్స్.. మార్కెట్లో ΄ాపులర్గానూ, బాగా సేల్ అవుతున్న నవలలు, క్లాసిక్ సాహిత్యం, ప్రేరణ కలిగించే పుస్తకాలు, ఆర్ట్, ఫొటోగ్రఫీ, ట్రావెల్‌కు సంబంధించిన కాఫీ టేబుల్ బుక్స్కూడా మంచి బహుమతులు. ఈ గిఫ్ట్ ఎక్కువకాలం నిలిచి ఉంటుంది. పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ ఇమిటేషన్ జ్యూవెలరీ, ట్రెండీ అండ్ స్టైలిష్ ఫ్యాషన్ యాక్సరీస్ (వాచ్‌లు, సన్‌గ్లాసెస్, హ్యాండ్ బ్యాగ్స్), ఫొటో ఆల్బమ్స్, ఫ్రేమ్స్ కూడా క్రిస్మస్ గిఫ్ట్‌గా పనికొస్తాయి. ఇవి పండుగ సంతోషాన్ని రెట్టింపు చేస్తాయి. సెల్ఫ్‌కేర్ చలికాలంలో చర్మ సంరక్షణ చాలా అవసరం. ఎక్కువమంది వింటర్లో చర్మాన్ని కోమలంగా ఉంచుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. కాబట్టి వింటర్ స్కిన్ కేర్ ఉత్పత్తుల సెట్స్‌ను బహుమతిగా ఇవ్వొచ్చు. ఇవేగాక..సెంటెడ్ క్యాండిల్స్, ఫేస్‌మాస్క్‌లు, స్లీపింగ్ మాస్కులు, బాతింగ్ కిట్స్ మంచి గిఫ్ట్స్. పెర్ఫ్యూమ్స్.. పెర్ఫ్యూమ్స్ క్లాసిక్గానూ, అందుబాటు ధరలో దొరికే గిఫ్ట్ ఐటమ్స్. పెర్ఫ్యూమ్ వాడిన ప్రతిసారి .. ఆ సువాసన భరిత పరిమళాలు మీ గిఫ్ట్‌తో΄ాటు మిమ్మల్ని, మీ అభిమానాన్ని గుర్తుచేస్తాయి. మ్యూజిక్ బాక్స్ చార్మింగ్ లిటిల్ మ్యూజిక్ బాక్స్ కూడా ప్రత్యేకంగానూ ఫన్నీగా ఉంటుంది. ఇది కూడా క్రిస్మస్కు మంచి గిఫ్ట్. దీనినుంచి వచ్చే సంగీతం మనసుని ఆహ్లాద పరుస్తుంది. అందమైన మగ్స్ ఉద్యోగులకు లేదా కొలీగ్స్‌కు అందంగా ఉండే మగ్స్ మంచి గిఫ్ట్ ఐడియా. ఈ మగ్స్లో స్టేషనరీ ఐటమ్స్ పెట్టుకోవడం లేదా, ఇష్టమైన కాఫీ తాగడం లేదా తరచూ వాడే ఐటమ్స్, అందమైన వస్తువులను పెట్టుకుంటారు. ఇవి తక్కువ ధరలో మంచి మంచి డిజైన్స్‌లో కూడా దొరుకుతాయి. ఎయిర్ ప్యూరిఫైర్.. ఎంతవేగంగా అభివృద్ధి చెందుతున్నామో అంతేస్పీడుగా గాలి కలుషితమై΄ోతున్న ఈ రోజుల్లో.. ఎయిర్ ప్యూరిఫయర్స్, ఫిల్టర్స్ అవసరంగా మారి΄ోతున్నాయి. అందుకే మినీ ప్యూరిఫయర్స్‌ను గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. వీటిద్వారా మీ సన్నిహితులకు మంచి ఆక్సిజెన్‌ను అందించిన వారవుతారు. డెకరేషన్ ఐటమ్స్ అలంకరించేకొద్దీ ఇంటి అందం పెరగడంతో΄ాటు.. కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాఫీ, టీసెట్స్, కుకింగ్ గాడ్జెట్స్, కిచెన్ టూల్స్, సెంటెడ్ క్యాండిల్స్ ఆర్ట్ వర్క్ హోం డెకరేటివ్ ఐటమ్స్ కూడా మంచి గిఫ్ట్స్. చిన్న పరిమాణం నుంచి పెద్దసైజులో ఎంతో ఆకర్షణీయమైన, ఉపయోగకరమైనవి అందుబాటు ధరల్లో దొరుకుతున్నాయి. క్రాఫ్ట్స్ మేకింగ్ కిట్స్ జ్యూవెలరీ తయారీ, క్యాండిల్ తయారీ, సబ్బుల తయారీ కిట్స్, వెరైటీ దియా మేకింగ్ కిట్స్, ΄్లాంట్ టెర్రారియం, గార్డెనింగ్ సెట్స్ కూడా మంచి బహుమతులే. వీటిలో ఏది బహుమతిగా ఇచ్చినా మీరు మీ ఆత్మీయుల సంతోషాన్ని చూరగొంటారు. ఇవి కూడా చదవండి: ప్రపంచ చీరల దినోత్సవం! 'చీర' అందమే అందం! -
సిండా తరపున దీపావళి కానుకలను పంపిణీ చేసిన సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యులు సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ (సిండా) తరపున దీపావళి గూడీ బ్యాగ్‌లను సింగపూర్‌లో పంపిణీ చేయడం జరిగింది. భారత దేశ మూలాలు ఉన్న ఆర్థికంగా వెనుకబడిన సింగపూర్ పౌరులకు సిండా వారు ప్రతీ సంవత్సరం దీపావళి పండుగ జరుపుకోవడానికి సహాయం చేస్తుంది. ఇందులో బాగంగా ఈ ఏడాది దీపావళి అలంకరణకు సంబందించిన సామాగ్రి తో పాటు కొన్ని తినుబండారాలు 120 డాలర్లు పండుగ ఖర్చుల నిమిత్తం అందజేసింది. అయితే సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ (సిండా) పిలుపు మేరకు ఈ సంవత్సరం ఒక వారం రోజుల పాటు, 05 నవంబర్ నుండి 11 నవంబర్ వరకు దీపావళి సామాగ్రిని పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యులను సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు అభినందించారు. ఈ కార్యక్రమం లో స్వచ్ఛదంగా పాల్గొన్న సొసైటీ అధ్యక్షులు గడప రమేశ్ బాబు, ఇతర సభ్యులు రావుల సుగుణాకర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు వెంగళ విజయ మోహన్, పలిక ప్రణీష్, పెరుకు శివ రామ్ ప్రసాద్ మరియు ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్ మొదలగు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలుడు గడప కౌశల్ చంద్ర ఉత్సాహంగా పాల్గొనడం ఎంతో అభినందించదగిన విషయం అని సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు అన్నారు. (చదవండి: ఫైర్ డిటెక్షన్ పరికరాన్ని కనిపెట్టిన భారత సంతతి విద్యార్థి!) -
పులిటీషియన్లు.. కొంగబావలు
అడవిలో పులి వేటకు బయలుదేరింది. కొంతకాలంగా ఆ అడవిలో దానిదే రాజ్యం. ఎంత కావాలంటే అంత ఆహారం. రోజుకో జంతువు విందు. అందుకే తాపీగా లేచి ఒళ్లు విరుచుకుని అడవి మీద పడింది. మాంచి ఆకలి మీద ఉందేమో కాసింత పెద్ద జంతువునే వేటాడేసి.. ఆరగించడం మొదలుపెట్టింది. పులికైనా పొలిటీషియన్ కైనా ఎంత తిన్నా ఆకలి అలాగే ఉంటుందని.. ఓ పెద్ద రైటర్ ఏనాడో చెప్పాడు. దొరికిన జంతువును ఆబగా తింటూండేసరికి దాని ఎముకగొంతులో ఇరుక్కుంది. దీంతో విలవిల్లాడిన పులి దాన్ని బయటకు తీయాలని అన్ని జంతువులను బతిమాలింది. కొని పులి అరాచకంపై కోపంతో.. మరికొన్ని భయంతో మావల్ల కాదనేశాయి. ఇంతలో ఓ కొంగ దాని కంటపడింది. కొంగ బావను ఎలాగైనా ఒప్పించాలని.. దానితో మాటలు కలిపి..తన బాధను చెప్పింది. ముందు కొంగ కూడా ససేమిరా అంది. అయితే పులి కొంగకు ఆశలు పెట్టింది. తాయిలాలు చూపింది. అచ్చం ఎలక్షన్ టైమ్‌లో మన నాయకులలాగా.. ‘ ఇల్లు ఇస్తాం, పొలం ఇస్తాం, పింఛన్ పెంచుతాం. గ్యాస్‌ధర తగ్గిస్తాం.. ఈసారి ఓటేసి గట్టెక్కించండి...’’... అలా కొంగ బావకు రకరకాల ఆశలు పెట్టింది. దానితో కొంగ ఐసైపోయింది. మన ఓటరు లాగా. ‘ ఆహా.. చిన్న సాయానికే బతుకు మారిపోతుందే..’ అనుకుంది. తన పొడుగాటి ముక్కు పులి నోట్లో తల పెట్టి ఎముక చులాగ్గా లాగి పారేసింది. పులి ఊపిరి పీల్చుకుని కొంగకు «థ్యాంక్స్ చెప్పి బయలుదేరింది. అలా వెళుతున్న పులికి దాని బాసలు గుర్తుచేసింది. తొందరగా పని కానివ్వు అన్నట్టుగా. తర్వాత రెండు మూడు నెలలు గడిచాయి. పులి జాడలేదు. ఇచ్చిన మాట జాడలేదు. ఎలాగోలా పులిని వెతికి పట్టుకుని ‘..నీ మాటేమైంది..’ అని కొంగ అడిగింది. ‘ .. చూద్దాం అదే పనిలో ఉన్నా..’ అని పులి అక్కడ నుంచి జారుకుంది. అలా నెలలు గడుస్తున్నాయి. ఉలకదు పలకదు. అచ్చం మన ప్రజాప్రతినిధిలా. ఓసారి పులి ఎదురైతే కొంగ గాట్టిగా నిలేసింది. ‘..ఎంతో మేలు చేస్తానన్నావ్ నీ పని అయిపోయాక తప్పించుకు పోతున్నావ్....’ అని. దానికి పులి చిద్విలాసంగా..‘‘ నేను నీకు మేలు ఎప్పుడో చేసేసాను.. నా నోట్లో నీ తల పెట్టినప్పుడు వదిలేశా.. అంతకన్నా మేలు ఏముంటుంది..’ అని తాపీగా నడుచుకుంటూ పోయింది. కొంగబావ అవాక్కయ్యింది. ఎన్ని ప్రలోభాలు.. ఎన్ని మాటలు.. ఎన్ని మోసాలు అని తిట్టుకుంది. అది మనిషి కాదు కనుక దానికిది కొత్త.. మనకైతే ప్రతి ఐదేళ్లకోసారి అనుభవానికి వస్తూనే ఉంటుంది. ఎలక్షన్ వచ్చింది...పులిటీషియన్లను ఇప్పుడు ఓటర్లే కాపాడాలి. ఎవరు మనవాళ్లు, ఎవరు విపక్షం, కొంగబావలాగా ఎవరిని మచ్చిక చేసుకోవాలి, ఏమివ్వాలి? ఎంత ఇవ్వాలి? ఏమిస్తామని ప్రలోభ పెట్టాలి..ఇలా ఎన్నో లెక్కలు.. .. ఇస్తే ఓటేసేవారెవరు? తీసుకుని మరీ వేరేవాళ్లకు వేసేదెవరన్న ఈ అంశంపైనే అమెరికాకు చెందిన మిషిగన్, కాలిఫోర్నియా యూనివర్సిటీల పొలిటికల్ స్టడీస్ ప్రొఫెసర్లు.. ఆగ్నేయాసియా దేశాల్లో విస్తృతమైన అధ్యయనం చేశారు. ఓట్ల కొనుగోళ్ల విషయంలో ఉన్న కొన్నిరకాల అభిప్రాయాలు తప్పు అని తేల్చారు. అభ్యర్థులు, ఓటర్ల మనోభావాలు ఎలా ఉంటాయన్నది విశ్లేషించారు. ఇది క్లైంటెలిజమ్! ఓటర్లను ప్రలోభపెట్టడానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు డబ్బులు, వివిధ రకాల వస్తువులు, బహుమతులు పంచడమే క్లైంటెలిజమ్. పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది సాధారణమే. దీనివల్ల అధికారం కొందరు రాజకీయ నేతలకే పరిమితమైపోతుంది. సిద్ధాంతపరమైన, సామాజిక ప్రయోజనకర అంశాలు పక్కనపడి.. వ్యక్తిగత ప్రయోజనాలే ప్రధానమైపోతాయి. దానితో అభివృద్ధి కుంటుపడుతుంది. తాయిలాలకు ఓట్లు రాలుతాయా? డబ్బులు, బహుమతులు తీసుకున్నవారంతా ఓటేస్తారా? ఏదైనా తీసుకున్నప్పుడు, మరొకటి తిరిగిచ్చి రుణం తీర్చుకోవాలన్న సంప్రదాయం వర్కౌట్ అవుతుందన్న దానిపైనే తాయిలాలు తయారయ్యాయి... దీనిపై చేసిన సర్వేలో .. ఓటర్లు డబ్బులు, బహుమతులను తీసుకున్నా కూడా తమకు ఓటేయరేమోనని లేక ఓటేయడానికే రారేమోనని చాలా మంది అభ్యర్థులు భావిస్తున్నట్టు పేర్కొంది. కొందరు ఓటర్లు కూడా డబ్బు తీసుకున్నాక వేరేవారికి ఓటేయడం పట్ల పెద్దగా ఇబ్బంది పడాల్సిందేమీ లేదని భావిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇందుకోసమేనేమో.. డబ్బులు తీసుకున్న ఓటర్లతో ఒట్టు పెట్టించుకోవడం, గుళ్లకు తీసుకెళ్లి ప్రమాణాలు చేయించడం, కుల సంఘాలు, అసోసియేషన్లలో ప్రమాణాలు చేయించడం వంటివి మన నేతలు చేస్తుంటారు. ఓట్లు అమ్ముకోవడం తప్పా? ఓట్లు కొనడం, అమ్ముకోవడం తప్పు అనే ప్రచారం ఉన్నా.. ఆ భావన అటు నేతల్లో, ఇటు ఓటర్లలోనూ కనబడటం లేదని అధ్యయనం పేర్కొంది. గెలవడానికి ఎంతెంత ఇచ్చాం, ఏమేం పంచామనేది నేతలు బహిరంగంగానే చెప్తున్నారని.. ‘వాళ్లు ఇస్తున్నారు. మేం తీసుకుంటున్నాం..’ అని చెప్పడానికి ఓటర్లు కూడా పెద్దగా ఇబ్బంది పడటం లేదని వెల్లడించింది. అందుకే ఓటేయడా నికి డబ్బులు తీసుకోవద్దంటూ జరిగే ప్రచారానికి పెద్దగా ఫలితం ఉండటం లేదని స్పష్టం చేసింది. వ్యతిరేకులపై ప్రభావం అంతంతే.. తమపై వ్యతిరేకత ఉన్నవారికి డబ్బులు, బహుమతులు ఇచ్చినా తమకు అనుకూలంగా ఓటేయర న్న విషయం రాజకీయ నాయకులకు తెలుసని అద్యయనం పేర్కొంది. తమకు అనుకూలమైన వా రిని అలాగే కొనసాగించుకునేందుకు, త టస్థంగా ఉన్నవారిని తమవై పు తిప్పుకొనేందుకు మా త్ర మే డబ్బులు పంచుతారని తేల్చింది. తమ వెంట నిలిచిన కార్యకర్తలకు ఏదో ప్రయోజనం కల్పించామన్న భావన కోసం, తమను నాయకుడిగా గుర్తించేందుకు వారికి డబ్బు, బహుమతులు ఇస్తుంటారని వివరించింది. .. అనుచరులకు కాంట్రాక్టులు, పదవులు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడం, కొన్నిసార్లు నేరుగానే డబ్బు సాయం చేయడం వంటివీ ఇందుకే.. ఇక ఇప్పుడు రాజకీయంగా తటస్థంగా ఉండేవారు తక్కువే. కానీ ఆ కొద్దిశాతం ఓట్లతోనే గెలుపోటములు మారిపోయే పరిస్థితులు ఎక్కువ. ఇక్కడే ‘పంపకాల’ ప్రయోజనం మరింత ఎక్కువన్నమాట. ప్రలోభాలకు లొంగవద్దనే ప్రచారాలతో ప్రయోజనమెంత? డబ్బు తీసుకుని ఓటేయడాన్ని నిరుత్సాహ పరిచేందుకు ఎన్నికల కమిషన్, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తుంటాయి. ఇందులో ఓటేసేందుకు ఎలాంటి డబ్బు, బహుమతులు తీసుకోవద్దనేది ఒకటైతే.. డబ్బు తీసుకోండి, కానీ మీకు నచ్చినవారికే ఓటేయండి అన్నది రెండో రకం ప్రచారం. నిజానికి రెండో రకం ప్రచారం వల్ల ఓటర్లు డబ్బులు తీసుకున్నా.. తమకు నచ్చిన, సమర్థుడైన నేతకే ఓటేస్తారన్న అభిప్రాయం ఉంటుంది. కానీ ఇది తప్పు అని అధ్యయనం తేల్చింది. ఏమీ తీసుకోవద్దు, ఓటును అమ్ముకోవద్దన్న ప్రచారంతోనే కొంత ప్రయోజనం ఉంటోందని పేర్కొంది. ఏమీ తీసుకోనివారిలో ఎలాంటి బెరుకు ఉండదని, నచ్చినవారికి ఓటేస్తారని తెలిపింది. అయితే పంచే డబ్బు/బహుమతి విలువ ఎక్కువగా ఉన్నప్పుడు ఓటర్లు తీసుకోకుండా ఉండలేకపోతున్నారని స్పష్టం చేసింది. ఇక.. ‘డబ్బు తీసుకోండి. నచ్చినవారికే ఓటేయండి’ అన్న ప్రచారం.. ఓట్ల కొనుగోలు, ప్రలోభాలను మరింతగా పెంచుతోందని అధ్యయనం స్పష్టం చేసింది. దీనివల్ల ఓటర్లు డబ్బు/బహుమతులు తీసుకోవడంలో మొహమాటాన్ని పక్కన పెట్టేస్తున్నారని, ఓట్ల కొనుగోళ్లకు ప్రయత్నించే నేతలకు పని సులువు అవుతోందని పేర్కొంది. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లాక.. ‘డబ్బులు తీసుకున్నప్పుడు ఓటేయకపోతే ఎలా..?’ అన్న మీ మాంసతో డబ్బులిచ్చిన అభ్యర్థికే ఓటేస్తున్నారని తెలిపింది. -
ప్రపంచదేశాల నాయకులకు మోదీ బహుమతులు
ప్రపంచదేశాల నాయకులకు మోదీ బహుమతులు -
ప్రపంచ దేశాల నాయకులకు మోదీ అపురూప బహుమానాలు
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సుకు హాజరైన ప్రపంచ దేశాల అధినేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన కానుకలు వారి మనసుల్ని దోచుకున్నాయి. భారతీయ సాంస్కృతిక వైవిధ్యం, ఘనమైన వారసత్వం ఉట్టిపడే కళారూపాలు, సంప్రదాయ వస్తువుల్ని కానుకగా ఇచ్చారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాకు మన తెలంగాణలో తయారైన కళాకృతులైన కూజా ఆకారంలో ఉండే రెండు పింగాణి పాత్రలను (సురాహి) కానుకగా ఇచ్చారు. కర్ణాటకకు చెందిన బిద్రీ అనే లోహకళతో రూపొందించే ఈ పాత్రలపై వెండితో నగిషీలు చెక్కారు. సిరిల్ సతీమణికి నాగాలాండ్‌లో ఆదివాసీలు తయారు చేసిన శాలువాను బహుమానంగా ఇచ్చారు. ఇక బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాషియో లాలూ డా సిల్వాకు మధ్యప్రదేశ్‌కు చెందిన గోండ్ పెయింటింగ్స్‌ను కానుకగా ఇచ్చారు. గ్రీసు ప్రధాని కరియాకోస్కు ఛత్తీస్‌గఢ్ కళాకృతులైన ఇత్తడితో తయారు చేసిన డోక్రాను, ఆయన సతీమణికి మేఘాలయలో తయారైన శాలువాను కానుకగా ఇచ్చారు. -
ఉద్యోగులకు ఖరీదైన ఫ్లాట్స్: బిలియనీర్ గొప్పమనసు
Savji Dholakia ఉద్యోగులకు ఖరీదైన కార్లు, ఇళ్లు, బంగారం లాంటి భారీ బహుమతులుఇవ్వడంలో సూరత్‌లోని వ్యాపారుల తరువాతే ఎవరైనా. తాజాగా సూరత్‌కుచెందిన బిలియనీర్ కార్మికులకు ఫ్లాట్లను బహుమతిగా ఇవ్వడం విశేషంగా నిలిచింది. ప్రతి సంవత్సరం దీపావళికి తన ఉద్యోగులకు ఖరీదైన బహుమతుల వర్షం కురిపించడం వజ్రాల వ్యాపారికి అలవాటు. (లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించిన ముఖేష్ అంబానీ) సూరత్‌లో అత్యంత ధనవంతుడు హరికృష్ణ ఎక్స్ పోర్ట్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సావ్జీ ధోలాకియా ఏటా తన ఉద్యోగులకు రూ.50 కోట్లకు పైగా ప్రోత్సాహకాలను అందిస్తారు. ఒకసారి తన కార్మికులకు దీపావళి బోనస్‌గా 400 ఫ్లాట్లు , 1260 కార్లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రతీ ఏడాదిదీపావళి బోనస్‌గా ఉద్యోగులకు ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా బహుమతిగా ఇస్తారు. అత్యంత ప్రతిభ చూపించిన వారికి ఖరీదైన వస్తువులు, నగలు కూడా అందిస్తారు. జీవితంలో ఎవరికైనా తొలి కారు కొనుక్కోవడం అంటేచాలా గొప విషయం. తన ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేలా ఏటీ బహుమతులు ఇస్తూ ఉంటానని, తద్వారా పనితీరు, జీవనశైలి మెరుగుపడుతుంది,వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. అంతిమంగా అది కంపెనీకి కూడా ఉపయోగపడుతుంది అని ధోలాకియా ఒకసారి చెప్పారు. (కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్‌కు బంపర్ ఆఫర్) అంతేకాదు ఎనలేని సంపద ఉన్నప్పటికీ మనవడిని సామాన్య జీవనం గడిపేలా చేశాడు. సావ్టీ మనవడు రువిన్ ధోలాకియా, విద్యను పూర్తి చేసిన తర్వాత అమెరికా నుండి తిరిగి వచ్చాడు. రోజూ సామాన్య జనం పడుతున్న కష్టాలను నేర్చుకోవాలని, గొప్ప మేనేజ్మెంట్ స్కూల్‌తో పోలిస్తే మంచి ఉపాధ్యాయుడిచ్చే అనుభవాలు గొప్పవని సావ్జీ ధోలాకియా విశ్వాసం. ధోలాకియా అమెర్లీలోని ఒక రైతు కుటుంబంలో జన్మించారు. 13 ఏళ్లకే చదువు మానేశాడు. 1977లో స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులో తన జేబులో టిక్కెట్టు ఛార్జీగా కేవలం పన్నెండు రూపాయల యాభై పైసలతో సూరత్‌కు వచ్చారు. సూరత్‌లోని తన మామ వజ్రాల వ్యాపారంలో చేరాడు. అతని సోదరులు కూడా వ్యాపారంలో చేరారు. వీరిద్దరూ కలిసి 1984లో తమ సొంత వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించారు. సాధారణ కార్మికుడిగా, కూలిగా జీవనం సాగించి అంచెలంచెలుగా ఎదిగిన సావ్జీ ధోలాకియా ప్రస్తుత నికర విలువ దాదాపు రూ. 12000 కోట్లు. 2014 నాటికి, వారు 6500 మంది ఉద్యోగులను కలిగి ఉన్నారు.2022లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందించింది. అంతేకాతు కుటుంబం తనకు గిఫ్ట్‌గా ఇచ్చిన హెలికాప్టర్‌ను సూరత్‌లో వైద్యం ఇతర అత్యవసర పరిస్థితుల కోసం రూ. 50-కోట్ల బ్రాండ్-న్యూ ఛాపర్‌ని విరాళంగా అందించాలని(గతంలో) నిర్ణయించడం విశేషం. అలాగే సౌరాష్ట్రలోని అమ్రేలి జిల్లాలోని లాఠీ తాలూకాలోని తన స్వస్థలంలో ఇప్పటికే 75 చెరువులను నిర్మించడమేకాదు 20 లక్షలకుపైగామొక్కల్నినాటారు. మొదట్లో ధోలాకియా మొదట గార్మెంట్ షాపులో సేల్స్‌మెన్‌గా, హెటల్లో , వాచ్ అవుట్‌లెట్‌లో ఆఖరికి కూలీగా కూడా పనిచేశాడట.. రెండు రోజులు కూలి పని కూడా చేశాడు. చెన్నైలో రోజుకు అతని సంపాదన. కేవలం రూ.200 మాత్రమే. అందుకే జీవితంలో సగటుమనిషి కష్టాలు, కన్నీళ్లు తెలుసు. ఎంత ఎదిగినా. తాను నడిచి వచ్చిన త్రోవను మర్చిపోలేదు. అందుకే తన సంపాదనలో సింహ భాగం ఉద్యోగులకు ఇస్తూ తన గొప్పదనాన్ని చాటుకుంటున్నారు. -
యూట్యూబర్ నిర్వాకం.. రణరంగంగా మారిన న్యూయార్క్ వీధులు..
ఓ యూట్యూబర్ కారణంగా న్యూయార్క్ వీధులు శుక్రవారం సాయంత్రం రణరంగంగా మారాయి. లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రామ్‌లో ఫ్రీ గిఫ్ట్‌ల కోసం భారీగా గుమిగూడిన యువతతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో యూట్యూబర్‌తో సహా పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 21 ఏళ్ల కాయ్ సీనట్ ప్రముఖ యూట్యూబర్. యూట్యూబ్‌తో సహా ఇన్స్టాగ్రామ్, ట్వీచ్ వంటి సామాజిక మాధ్యమాల్లో లక్షల కొలది ఫాలోవర్లు ఉన్నారు. తనను కలవాలంటే మ్యాన్ హట్టన్‌కు రావాలని, అక్కడే లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రామ్‌లో ప్లే స్టేషన్ కన్సోల్‌తో సహా ఉచితంగా కానుకలు ఇస్తానని సీనట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. భారీగా ప్రజాదరణ ఉన్న సీనట్ పోస్టుకు స్పందించిన యువత శుక్రవారం సాయంత్రం దాదాపు 2000 మంది ఆ ప్రాంతానికి వచ్చేశారు. భారీ సంఖ్యలో వచ్చిన యువతతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఒకరినొకరు తోసుకున్నారు. కాలనీల్లో కార్లను ధ్వంసం చేశారు. భవంతుల పైకి ఎక్కి నినాదాలు చేయడం, బాటిళ్లను విసరడం వంటి చేష్టలకు పాల్పడ్డారు. వారిని అదుపు చేయడానికి ప్రయత్నించిన పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. భద్రత దృష్ట్యా యూట్యూబర్ సీనట్‌ను కూడా నిర్భందించి దర్యాప్తు చేపడుతున్నారు. ఇదీ చదవండి: 3 Years Jail For Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు 3 ఏళ్ల జైలు శిక్ష.. ఐదేళ్ల అనర్హత వేటు.. ఆ వెంటనే అరెస్ట్ -
మెక్రాన్ సతీమణికి పోచంపల్లి ఇక్కత్ చీర బహుకరించిన మోదీ..
ప్రధానమంతత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన రెండు రోజులపాటు కొనసాగింది. శుక్రవారం జరిగిన బాస్టిల్ డే వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీని ఫ్రాన్స్ అత్యన్నత పురస్కారంతో ఆ దేశ అధ్యక్షుడు సన్మానించారు. అయితే.. పర్యటనలో భాగంగా దౌత్య సంబంధాలకు తోడు సంస్కృతిక అంశాలను కూడా జోడించారు. ఆ దేశ పెద్దలకు ప్రధాని మోదీ భారత సంస్కృతికి చెందిన విలక్షణమైన కానుకలను అందించారు. అధ్యక్షుడు మెక్రాన్‌కు గంధపు చెక్కతో తయారు చేసిన సితార్‌ను బహుకరించారు. దక్షిణ భారతదేశంలో గంధపు చెక్కతో చేసే పూరాతన హస్తకళకు చెందిన కళారూపం. సరస్వతీ దేవీ, జాతీయ పక్షి నెమళ్లతో పాటు గణేశుని ప్రతిరూపాలు ఆ సితార్‌పై ఉన్నాయి. మెక్రాన్ సతీమణి చేత.. తెలంగాణ చీర.. ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగిట్టే మెక్రాన్‌కు ప్రధాని మోదీ పోచంపల్లి ఇక్కత్ చీరను బహుకరించారు. చీరను చందనం పెట్టెలో పెట్టి ఆమెకు అందించారు. ఇక్కత్ చీర తెలంగాణకు చెందిన పోచంపల్లిలో ఉద్భవించిన అరుదైన కళారూపం. ఆకర్షనీయమైన రంగులతో క్లిష్టమైన డిజైన్లకు ప్రసిద్ధి చెందిన కళాఖండం. చందనం పెట్టెపై కూడా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలు చెక్కబడి ఉన్నాయి. మార్బుల్ ఇన్లే వర్క్ టేబుల్.. ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఎలిసబెత్ బోర్న్‌కు 'మార్బుల్ ఇన్లే వర్క్'తో అలంకరించబడిన టేబుల్‌ను ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు. రాజస్థాన్‌లోని మక్రానా నుంచి పాలరాతిని, దేశంలో విలువైన రాళ్లను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. రాళ్లను కత్తిరించి అందంగా తయారు చేసే కళాఖండం. కాశ్మీరీ కార్పెట్.. ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యేల్ బ్రౌన్-పివెట్‌కు చేతితో అల్లిన కాశ్మీరీ కార్పెట్‌ను బహుకరించారు ప్రధాని మోదీ. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ కలిగిన కళారూపం ఇది. మృదుత్వం కలిగి వివిధ కోణాల్లో వేరు వేరు రంగుల్ని కలిగి ఉంటుంది. గంధపు ఏనుగు.. ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు గెరార్డ్ లార్చెర్కు గంధపు చెక్కతో చెక్కిన ఏనుగు బొమ్మను ప్రధాని మోదీ బహుకరించారు. ఏనుగు భారతీయ సంస్కృతిలో జ్ఞానం, బలాన్ని సూచిస్తుంది. ప్రకృతికి, కళలకు మధ్య సామరస్యాన్ని సూచించే అందమైన ప్రతిబింబం ఇది. ఇదీ చదవండి: ప్రధాని ఫ్రాన్స్ పర్యటన.. మోదీ భారీ ప్రకటనలు.. -
మెగా ఇంట్లో బారసాల వేడుక.. వారికి గిఫ్ట్‌గా ఏమిచ్చారంటే?
మెగా వారసురాలు రాకతో చిరంజీవి ఇంట్లో సందడి నెలకొంది. రామ్ చరణ్-ఉపాసనకు తొలిసారి బిడ్డ పుట్టడంతో ఫ్యాన్స్‌తో పాటు వారి కుటుంబసభ్యులు సంబురాలు చేసుకుంటున్నారు. జూన్ 20న ఉపాసన పాపకు జన్మనివ్వగా.. జూన్ 30న బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు సన్నిహితులు కూడా పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలి పేరును వెల్లడించారు. క్లీంకార కొణిదెల అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ పేరును లలిత సహస్రనామం నుంచి తీసుకున్నట్లు తెలిపారు. (ఇది చదవండి: రామ్‌చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?) ఖరీదైన గిఫ్ట్! అయితే ఈ వేడుకలో పాల్గొన్న వారికి ఎలాంటి బహుమతులు ఇచ్చారనే విషయంపై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మెగా ఇంట్లో ఈ వేడుకను ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతే కాకుండా బారసాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి అత్యంత సుందరంగా అలకరించారు. ఈ వేడుకలో పాల్గొన్న వారికి మెగా ఫ్యామిలీ ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫంక్షన్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికి పట్టుచీర గాజులతో పాటు గోల్డ్ కాయిన్ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. చిరంజీవి తన మనవరాలి పేరును రివీల్ చేస్తూ అర్థాన్ని కూడా వివరించారు. రామ్ చరణ్- ఉపాసన కూతురు పేరుని లలిత సహస్రనామం నుంచి తీసుకున్నారు. 'క్లీంకార' అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఆ పేరుకి శక్తివంతమైన వైబ్రేషన్ ఉంది అని మెగాస్టార్ చిరంజీవినే స్వయంగా తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఎదుగుతున్నకొద్దీ ఈ లక్షణాలన్నింటినీ ఆమె తన వ్యక్తిత్వంలో ఇముడ్చుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: రామ్ చరణ్- ఉపాసన బిడ్డకు ఆ పేరు.. అసలు కారణం ఇదేనా?) -
మోదీకి పాతకాలపు కెమెరా.. బైడెన్‌కు ఉపనిషత్తుల కాపీ
అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అధ్యక్ష భవనం వైట్ హౌజ్‌కు చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ బిల్ బైడెన్లు మోదీని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆ దంపతుల ఆతిథ్యం స్వీకరించారాయన. సరదాగా కబుర్లతో పాటు ప్రపంచ పరిణామాలపైనా ఈ ఇద్దరు నేతలు చర్చించారు. అనంతరం విందులో పాల్గొన్నారు. బైడెన్ దంపతుల ఆహ్వానం మేరకు ద్వైపాక్షిక చర్చల కోసం ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి విదితమే. కానుకలు.. ఇక మోదీకి జో-జిల్ బిడెన్లు కానుకలు సమర్పించారు. 20వ శతాబ్ద ప్రారంభపు కాలానికి చెందిన.. పురాతన అమెరికన్ బుక్ గ్యాలీని ఆ దంపతులు కానుకగా ఇచ్చారు. అలాగే బైడెన్ పర్సనల్‌గా మోదీకి పాతకాలపు ఓ అమెరికన్ కెమెరాను బహుమతిగా ఇచ్చారు. దానితో పాటుగా జార్జ్ ఈస్ట్‌మన్ మొదటి కొడాక్ కెమెరా పేటెంట్ ఆర్కైవల్ ఫాక్సిమైల్ ప్రింట్, అమెరికన్ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ హార్డ్ కవర్ పుస్తకాన్ని కూడా బహుమతిగా ఇచ్చారు. ఇక ఆయన భార్య జిల్ బైడెన్ ప్రధాని మోదీకి రాబర్ట్ ఫ్రాస్ట్ కవితల సంకలన సంతకం మొదటి ఎడిషన్ కాపీని బహుమతిగా ఇచ్చారు. భారత్‌లో అనుబంధం ఉన్న ఐరిష్ రచయిత, నోబెల్ విన్నర్ డబ్ల్యూబీ యేట్స్ ‘భారత ఉపనిషత్తుల’ ఆంగ్ల తర్జుమా కాపీ(శ్రీ పురోహిత్ స్వామి సహరచయిత) కాపీని బైడెన్‌కు భారత ప్రధాని మోదీ కానుకగా ఇచ్చారు. దీనిని లండన్‌కు చెందిన ఫెబర్ అండ్ ఫెబర్ లిమిటెడ్ వాళ్లు.. యూనివర్సిటీ ప్రెస్ గ్లాస్గోలో ముద్రించారు. కాళిదాసుడి రచనల ప్రభావం తనపై ఎంతో ఉందని డబ్ల్యూబీ యేట్స్ పలుమార్లు చెప్పుకున్నారు. అంతేకాదు.. రవీంధ్రనాథ్ ఠాగూర్ సమకాలీకుడిగా పేరున్న యేట్స్.. 1923లో సాహిత్య రంగంలో నోబెల్ అందుకున్నారు. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని(గ్రీన్ డైమండ్) బహుమతిగా ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ వజ్రం.. పర్యావరణ అనుకూలమైంది. సోలార్, విండ్ పవర్ లాంటి వనరులను ఉపయోగించి దీనిని రూపొందించారు. #WATCH | Prime Minister Narendra Modi met US President Joe Biden and First Lady Jill Biden at the White House in Washington DC and exchanged gifts with them. pic.twitter.com/kac0i1u9ZN — ANI (@ANI) June 22, 2023 In 1937, WB Yeats published an English translation of the Indian Upanishads, co-authored with Shri Purohit Swami. The translation and collaboration between the two authors occurred throughout 1930s and it was one of the final works of Yeats. A copy of the first edition print… pic.twitter.com/yIi9QW290r — ANI (@ANI) June 22, 2023 PM Narendra Modi gifts a copy of the first edition print of the book, ‘The Ten Principal Upanishads’ published by Faber and Faber Ltd of London and printed at the University Press Glasgow to President Joe Biden pic.twitter.com/95kKhQS267 — ANI (@ANI) June 22, 2023 I thank @POTUS @JoeBiden and @FLOTUS @DrBiden for hosting me at the White House today. We had a great conversation on several subjects. pic.twitter.com/AUahgV6ebM — Narendra Modi (@narendramodi) June 22, 2023 మేము అనేక విషయాలపై గొప్ప విషయాలపై మాట్లాడుకున్నాం అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు కూడా. PM Narendra Modi gifts a lab-grown 7.5-carat green diamond to US First Lady Dr Jill Biden The diamond reflects earth-mined diamonds’ chemical and optical properties. It is also eco-friendly, as eco-diversified resources like solar and wind power were used in its making. pic.twitter.com/5A7EzTcpeL — ANI (@ANI) June 22, 2023 -
జడేజా ఐపీల్ ఫైనల్లో వాడిన బ్యాట్ ఎవరికీ ఇచ్చాడో తెలుసా..!
-
మెక్సికోకు 'కుక్కపిల్ల'ను గిఫ్ట్‌గా ఇచ్చిన టర్కీ!..అదే ఎందుకంటే?..
మెక్సికోకు టర్కీ మూడు నెలల వయసున్న జర్మనీ షెపర్డ్ కుక్కపిల్లను ఇచ్చించి. ఈ మేరకు మెక్సికో సైన్యం బుధవారం టర్కీ గిఫ్ట్‌గా ఇచ్చిన ఆ కుక్క పిల్లను స్వాగతించింది. అసలు టర్కీ ఎందుకు ఆ కుక్కపిల్లనే గిఫ్ట్‌గా ఇచ్చిందంటే..ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి నెలలో టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకృతి విలయతాండవానికి వేలాదిగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నాటి ఘటనలో భూకంప శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు మెక్సికో రెస్క్యూ డాగ్‌లతో మోహరించింది. ఆ టర్కీ రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రొటీయో అనే జర్మన్ షెషర్డ్ జాతికి చెందిన కుక్క చాలా చురుకుగా సేవలందించింది. ఐతే అది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయింది. ఈ జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్క భూకంపాలు, ప్రకృతి వైపరిత్యాలకు గురయ్యే ప్రదేశంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఆయా ప్రదేశంలోని శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారి ఆచూకిని కనిపెట్టడంలో ప్రసిద్ధి చెందింది. దీంతో టర్కీ ఆ జాతికి చెందిని మూడు నెలల వయసున్న కుక్క పిల్లను విధి నిర్వహణలో ప్రాణాలొదిలేసిన కుక్క పిల్లకు బదులుగా మెక్కికోకు గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆ కుక్కపిల్లకు 'ఆర్కాదాస్గా' నామకరణం ఈ కుక్కపిల్లకు మెక్కికో సైన్యం స్వాగతం పలకడమే గాక ఆర్కాదాస్ అని పేరుపెట్టింది. టర్కిష్‌లో ఆర్కాదాస్ అంటే స్నేహితుడు అని అర్థం. మృతి చెందిన ప్రోటియోని సంరక్షించిన ట్రెయినరే ఆర్కాదాస్కి కూడా శిక్షణ ఇస్తారని మెక్సికో సైన్యం తెలిపింది. ఈ మేరకు సదరు కుక్కపిల్ల గ్రీన్‌కలర్ సైనిక యూనిఫాం ధరించి బుధవారం మెక్సికో సైనిక స్థావరంలో జరుగుతున్న అధికారిక వేడుకలో పాల్గొంది. సరిగ్గా మెక్కికో జాతీయ గీతం స్పీకర్ల నుంచి వస్తుండగా.. ఒక్కసారిగా ఆ కుక్కపిల్ల ఉద్వేగభరితంగా మొరిగి తన విశ్వాసాన్ని చాటుకుంది. ఈ నేపథ్యంలో మెక్కికో రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్కాదాస్ తరుఫున ఒక ట్వీట్ కూడా చేసింది. ఆ ట్వీట్లో.."నన్ను ఎంతో ఆప్యాయంగా స్వాగతించిన మెక్సికోకు చెందిన స్నేహితులకు ధన్యవాదాలు. రెస్క్యూ డాగ్‌గా ఉండేందుకు నావంతుగా కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను ". అని పేర్కొంది రక్షణ శాఖ. కాగా, టర్కీ రెస్క్యూ ఆపరేషన్‌లో మరణించిన ప్రోటీయో కుక్కుకు మెక్కికో ఘనంగా సైనిక అంత్యక్రియలు నిర్వహించి నివాళులర్పించింది. (చదవండి: మరో ఆప్షన్ లేదు.. లొంగిపోతానన్నా వినొద్దు.. జెలెన్స్కీని మట్టుబెట్టాల్సిందే!) -
కింగ్ చార్లెస్ పట్టాబిషేకం కోసం ముంబై డబ్బావాలాలు గిఫ్ట్‌లు కొనుగోలు!
సాక్షి, ముంబై: ముంబైలోని డబ్బావాలాల సేవలు గురించి అందరికీ తెలిసిందే. వారు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు, స్కూల్‌కి వెళ్లే పిల్లలకు లంచ్ బాక్స్‌లు అందిస్తుంటారు. వారికి బ్రిటన్ రాజు చార్లెస్ పట్టాభిషేక మహోత్సవానికి ఆహ్వానం అందడం విశేషం. అందుకోసం అని వారు పుణెగిరి పగడి, వార్కారీ కమ్యూనిటీకి చెందిన శాలువాను కొనుగోలు చేశారు. పుణేగిరి పగడి అనేది తలపాగా. దీన్ని పూణేలో గౌరవ చిహ్నంగానూ, గర్వంగానూ భావిస్తారు. అంతేగాదు ఇక్కడి తలపాగాకి భౌగిళిక హోదా లభించింది కూడా. ఇక్కడి ముంబై డబ్బావాలాలకు బ్రిటీష్ ఎంబసీ ద్వారా ఆహ్వానాలు అందినట్లు మీడియాకి తెలిపారు. ఈ మేరకు ముంబై డబ్బావాలాస్ ప్రతినిధి విష్ణు కల్డోక్ మాట్లాడుతూ.. తమలోని ఇద్దరు డబ్బావాలాలకు ఆహ్వానం అందిందన్నారు. అదీగాక బ్రిటీష్ రాయల్టీతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. అతను రాజు కాబోతున్నాడు కాబట్టి కింగ్ చార్లెస్‌కి పుణేరి పగడి తోపాటు వార్కారీ కమ్యూనిటీకి చెందిన శాలువాను గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నాం అని డబ్బావాలా ప్రతినిధి విష్ణు కల్డోక్ అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. కాగా, ఈ ముంబైలోని డబ్బావాలాలు నగరంలో లంచ్‌బాక్స్ డెలివరీ చేయడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచారు. #WATCH | Maharashtra: Mumbai's Dabbawalas purchase gifts - Puneri Pagadi & a shawl of the Warkari community - for Britain's King Charles III, ahead of his coronation ceremony on May 6. They say that they have been sent invitations by British Consulate, British Embassy. pic.twitter.com/88RlOhxidQ — ANI (@ANI) May 2, 2023 (చదవండి: శరద్ పవార్ రాజీనామా: పారిశుధ్య కార్మికుడి విజ్ఞప్తి.. సుప్రియా సూలే ఆసక్తికరమైన వీడియో) -
ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ట్విటర్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా లాంటి టెక్ దిగ్గజాలు వేలాది ఉద్యోగులను తొలగిస్తూ వారిని ఆందోళనలోకి నెట్టి వేస్తున్నాయి. ఎపుడు ఎవరి ఉద్యోగం పోతుందో తెలియని గందరగోళ పరిస్థితి. ఈ తరుణంలో ఒక టెక్ కంపెనీ ఉద్యోగులకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ వార్తల్లో నిలిచింది. ఏకంగా సంస్థలో పని చేస్తున్న 21 వేల మందికిభారీ బహుమతిని ప్రకటించింది. ఐటీ సొల్యూషన్స్ కంపెనీ కోఫోర్జ్ దాని Q4 ఆదాయాలలో కీలక మైలురాయిని అధిగమించింది. ఒక బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించిన శుభ సమయంలో సంస్థలోని మొత్తం 21వేల మందిలో ప్రతి ఒక్కరికి యాపిల్ ఐపాడ్‌ను బహుమతిగా ఇస్తుంది. ఇందుకోసం రూ. 80.3 కోట్లు కేటాయించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి సేల్స్, మార్కెటింగ్ సిబ్బంది తదిరులను మినహాయించి మొత్తం కంపెనీలో 21,815 మంది ఉద్యోగులున్నారు. త్రైమాసికంలో తమ పనితీరు రెండు కీలక విజయాలు సాధించామని, మొదటిది త్రైమాసిక క్రమానుగత 5 శాతం వృద్ధి. రెండోది బిలియన్ డాలర్ల మార్క్ ఆదాయాన్ని అధిగమించడమని కోఫోర్జ్ సీఈవో సుధీర్ సింగ్ వెల్లడించారు. 2024లో కూడా ఇదే వృద్ధిని కొనసాగించనున్నామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కోఫోర్జ్ కంపెనీ ఫలితాలు, డివిడెండ్ గత ఏడాది రూ.1,742 కోట్లుగాగా ఉన్న కోఫోర్జ్ కంపెనీ గ్రాస్ రెవెన్యూ మార్చి 31తో ముగిసిన క్యూ4లో 24.5 శాతం పెరిగి రూ.2,170 కోట్లకు చేరింది. అయితే నికర లాభం క్యూ4లో 48.08 శాతం తగ్గి రూ.116.7 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది అది రూ.224.8 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెర్టికల్ పై సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలడం, గ్లోబల్ బ్యాంకింక్ సంక్షోభం ఎలాంటి ప్రభావం చూపలేదని సంస్థ పేర్కొంది. రానున్న కాలంలో 13 శాతం నుండి 16 శాతానికి వార్షిక ఆదాయ మార్గదర్శకత్వం ఇచ్చింది. అలాగే దాదాపు 50 బేసిస్ పాయింట్ల (bps) స్థూల మార్జిన్ పెరుగుదలను కూడా అంచనా వేసింది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ. 19 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్ చెల్లింపునకు రికార్డు తేదీ మే 9గా సంస్థ ప్రకటించింది. 25 డెలివరీ కేంద్రాలతో 21 దేశాల్లో సేవల్ని అందిస్తోంది. -
TTD: విదేశీ కరెన్సీ విషయంలో టీటీడీకి ఊరట
సాక్షి, తిరుమల: భక్తులు సమర్పించే విదేశీ కరెన్సీ వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి కేంద్రం ఊరటనిచ్చింది. శ్రీవారికి విదేశీ దాతలు లేదా భక్తులు సమర్పించే కరెన్సీని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి టీటీడీకి మినహాయింపును ఇచ్చింది. వివరాల ప్రకారం.. భక్తులు సమర్పించే విదేశీ కరెన్సీ విషయంలో టీటీడీకి కేంద్రం మినహాయింపు ఇచ్చింది. వీటిని భక్తులు సమర్పించిన కానుకలుగా పేర్కొనాలని కేంద్రం సూచించింది. సెక్షన్ 50 ప్రకారం టీటీడీకి మాత్రమే ఈ మినహాయింపు ఇస్తున్నట్టు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ముత్తుకుమార్ తెలిపారు. ఈ మేరకు టీటీడీ ఈవోకు కేంద్రం సమాచారం ఇచ్చింది. -
పనిమనుషులకు హెలికాప్టర్లో ఐలాండ్ ట్రిప్, వైరల్వీడియో
న్యూఢిల్లీ: ఇంట్లో పనిచేసే సహాయకులకు ఏ పండగ్గో,పబ్బానికో కొత్త బట్టలు, లేదంటే ఎంతో కొంత నగదు బోనస్‌లు ఇవ్వడం సహజం. ఎంత పెద్ద గొప్ప వ్యాపారవేత్తలయినా కాస్త అటూ ఇటూగా దాదాపు ఇదే చేస్తారు. కానీ మలేషియాకు చెందిన మహిళా వ్యాపారవేత్త మాత్రం అద్భుతమైన బహుమతి ఇచ్చి వార్తల్లో నిలిచింది. వెబ్సైట్ మదర్షిప్ ప్రకారం, ఫరావెన్ అనే మహిళ తన ముగ్గురు ఇంటి పనివాళ్లకు భారీ బహుమతి ఇవ్వడం ఇపుడు హాట్ టాపిక్. తన ముగ్గురు మహిళా గృహ సహాయకులకు సుమారు రూ. 1.8 లక్షల గిఫ్ట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన కవర్లు ఇస్తూ టిక్‌టాక్ వీడియోను ఫరా షేర్ చేసింది. ముస్లింలకు అతిపెద్ద సెలవుదినాలలో ఒకటైన హరి రాయ (దీనిని హరి రాయ ఐడిల్ఫిత్రి అని కూడా పిలుస్తారు) కోసం ద్వీపానికి వెళ్లి ఎంజాయ్ చేయడానికి ఏర్పాటు చేసింది. (ఇది కూడా చదవండి: బంపర్ ఆఫర్! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ?) డిపింగ్ పూల్, బాత్‌టబ్, లాంజ్ ఏరియాతో కూడిన విలాసవంతమైన ప్రైవేట్ సూట్లో ఎంజాయ్ చేసేలా అవకాశం కల్పించింది. ఇందుకోసం వారికి హెలికాప్టర్ ఏర్పాటు చేయడం విశేషం. ఈ వీడియోలో హెలికాప్టర్లో సదరు ద్వీపానికి ప్రయాణం అవ్వడాన్ని, అలాగే యజమాని చేసిన పనికి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ, ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడొచ్చు. Jadi bibik pun dapat duit raya 5 angka, siap dapat pakej healing 😭 pic.twitter.com/94Sz6Gzj6V — 🇲🇾 (@localrkyt) April 13, 2023 టిక్‌టాక్‌లో మిలియన్ల వ్యూస్‌తో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఇతర సోషల్‌మీడియాల్లోనూ చక్కర్లు కొడుతోంది. ఆమె దాతృత్వాన్ని కొంతమంది నెటిజన్లు ప్రశంసించారు. మరి కొందరు ఇది వాళ్లకి సంతోషాన్నిస్తుందా అని, ఇది ఫేక్ అని మరికొంతమంది వ్యాఖ్యానించారు. అయితే ఇంట్లో పనిచేసే మహిళల పట్ల ఓనర్లు ఔదార్యాన్ని చూపించడం ఇదే మొదటిసారి గతేడాది దీపావళి రోజున చెన్నై వ్యాపారి తన సిబ్బందికి రూ.1.2 కోట్లకు పైగా విలువైన కార్లు, బైక్‌లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. (క్రెడిట్‌కార్డు వాడుతున్నారా? ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..గుదిబండే!) -
ప్రెగ్నెంట్ కావడంతో ఉపాసనకి అలాంటి గిఫ్ట్ పంపిన ఆలియా భట్
రామ్‌చరణ్-ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. పెళ్లైన 11 ఏళ్లకు ఉపాసన తొలిసారి గర్బం దాల్చింది. దీంతో పుట్టబోయే బిడ్డ కోసం మెగా ఫ్యామిలీ సహా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఉపాసన ఎక్కువగా భర్తతో వెకేషన్‌కు వెళ్తూ సమయం గడుపుతుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. ఇటీవలె బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఉపాసన కోసం ఓ క్యూట్ బహుమతిని పంపించింది. ప్రస్తుతం ఆలియా Ed-a-Mamma నుంచి అనే క్లోతింగ్ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే ఆమె ఎన్టీఆర్ పిల్లలకు దుస్తులు పంపించింది. తాజాగా ఉపాసనకు, పుట్టబోయే బేబీకి సంబంధించిన దుస్తులను పంపించింది. ఈ విషయాన్ని స్వయంగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆలియాకు థ్యాంక్స్ చెప్పింది. కాగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆలియా భట్ రామ్‌చరణ్ సరసన నటించిన సంగతి తెలిసిందే. -
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. ఓటర్లకు కుక్కర్లు, చీరలు, నగదు పంపిణీ
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర విధానసభ ఎన్నికలకు సమయం ఎక్కువగా లేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఆయా పార్టీల అభ్యర్థులు, ఆశావహులు నిమగ్నమై ఉన్నారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలుపొంది తీరాలని ఎవరికి వారు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు ఓటర్ల మనసులు గెలుచుకునేందుకు కొన్ని పార్టీల నేతలు, ఆశావహులు నగదు, హెల్మెట్లు, కుక్కర్లు, చీరలు తదితర బహుమానాలను పంచడం చేపట్టారు. ఎన్నికల సంఘం అధికారులు కొన్నిచోట్ల దాడులు జరిపి కానుకలను జప్తు చేస్తోంది. విస్తృతంగా తనిఖీలు డబ్బు, వస్తువులు, వెండి బంగారు కానుకల పంపిణీ ఎన్నికలు రాగానే ఊపందుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు బెంగళూరు వ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో తాత్కాలిక చెక్‌పోస్టులను తెరిచారు. అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్య, డ్రైవర్ల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు. వివిధ మార్గాల్లో ప్రలోభాలు ఎంత పటిష్ట నిఘా ఉంచినా పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు, జీఎస్టీ అధికారులు, సిబ్బంది కళ్లుగప్పి టికెట్ ఆశావహులు, అభ్యర్థులు, వారి మద్దతుదారులు బహుమానాలను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. ఆయా బహుమానాలను ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే ముందస్తుగా ఓటర్లకు టోకెన్లను ఇచ్చి నిర్ణీత దుకాణాల్లో నిత్యవసర సరుకులను తీసుకునే వెసులుబాటును కల్పించారు. చేతి గడియారాలు, వెండి దీపాలు, హెల్మెట్, కుక్కర్లు, మిక్సీలు, టీవీలు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు ఇందులో ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థులు తామేమీ తక్కువ కాదన్నట్లు ముందుకు వస్తున్నారు. కాగా, వాణిజ్య పన్నుల శాఖ ఈ తనిఖీల్లో ముందంజలో ఉంది. రసీదు లేకుండా సరుకుల రవాణా చేసిన, అక్రమంగా గోడౌన్లో వస్తువులను దాచినా, అనుమానస్పద కొనుగోళ్లు చేసినా పట్టేస్తోంది. సరుకు రవాణాకు సంబంధించి ఈ–ఇన్వాయిస్, ఈవే బిల్, సరుకు ప్రమాణం, కొనుగోలు దారుడు, సరఫరా దారుడు, చిరునామా తదితర సమాచారాలను క్షుణ్నంగా పరిశీలిస్తోంది. రౌడీలకు హెచ్చరికలు ఎన్నికల్లో ఓటర్లను బెదిరించడంలో రౌడీలు ముందుంటారు. అందుకే రౌడీలపై పోలీసు శాఖ ఒక కన్నేసింది. రౌడీషీటర్ల నడవడికపై నిఘా పెంచింది. రౌడీషీటర్లుగా ముద్రపడిన వారిని ముందస్తుగా పోలీసు స్టేషన్‌కు పిలిపించి హెచ్చరికలు జారీ చేస్తోంది. అలాగే ప్రమాదకరంగా అనిపించే ప్రముఖ రౌడీషీటర్లను నగర బహిష్కరణ చేస్తోంది. అలాగే పలువురు రౌడీషీటర్ల ఇంటిపై గస్తీ కాసే పోలీసులు హఠాత్తుగా తనిఖీలు చేస్తున్నారు. పలు మారణాయుధాలను స్వాధీనం చేసుకుంటున్నారు. -
అంతా అవాక్కయ్యారు.. సోదరి పెళ్లికి రూ.8 కోట్ల విలువైన బహుమతులు!
జైపూర్: రాజస్థాన్‌లోని నాగౌర్‌లోని ఖిమ్సర్ తాలూకాలోని ధిగ్‌సార గ్రామానికి చెందిన నలుగురు సోదరులు తమ సోదరి పెళ్లిలో కోట్లు విలువైన సంపదను కానుకగా ఇచ్చి తమ ప్రేమను చాటుకున్నారు. వివాహ వేడుకలో విలువైన బహుమతులును ఇవ్వడం అక్కడి సంప్రదాయమట. భగీరథ్ మెహ్రియా, అర్జున్ మెహ్రియా, ప్రహ్లాద్ మెహ్రియా, ఉమ్మద్ జీ మెహ్రియా తమ సోదరి భన్వారీకి ఏకంగా 8.1 కోట్లు ఇచ్చారు. ఆ ప్రాంత స్థానికులు గతంలో ఇద్దరు సోదరులు తమ సోదరికి డాలర్లతో అలంకరించిన తోహ్నీ, కోటి విలువైన కానుకను ఇచ్చారు. బుర్డి గ్రామానికి చెందిన భన్వర్‌లాల్ చౌదరి 3 కోట్ల 21 లక్షలు గిఫ్ట్ ఇవ్వగా.. తాజాగా ఈ నలుగురు సోదరులు ఈ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టారు. ప్రస్తుతం భగీరథ్ మెహ్రియా కుటుంబం రూ. 8.1 కోట్ల సంపదను కానుకగా ఇచ్చింది. ఇందులో.. 2 కోట్ల 21 లక్షల నగదు, 71 లక్షల విలువైన 1 కిలోల 105 గ్రాముల బంగారం, 9 లక్షల 80 వేల విలువైన 14 కిలోల వెండి, 2 కిలోల వెండి సోదరికి అందించగా మిగిలిన 800 నాణేలను గ్రామం మొత్తానికి పంపిణీ చేశారు. వందల సంఖ్యలో కార్లు, ట్రాక్టర్లు, ఒంటెల బండ్లు, ఎద్దుల బండ్లతో ర్యాలీగా కానుకలను తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మైరా సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డ పెళ్లికి అన్నదమ్ములు ఇలా భారీ స్థాయిలో కానుకలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందట. -
Imran Khan: తోషఖానా టు బందీఖానా! ఇమ్రాన్ అరెస్టయితే అంతర్యుద్ధమా?
పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. తోషఖానా కేసులో తనపైనున్న నాన్‌బెయిలబుల్ వారెంట్లను రద్దు చేయాలంటూ ఇమ్రాన్‌ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. పోలీసులకు లొంగిపోవాలని సూచించింది. ఇమ్రాన్ తనంతట తాను లొంగకపోతే మార్చి 18లోగా అరెస్ట్ చేసి కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని సెషన్స్ న్యాయమూర్తి జఫర్ ఇక్బాల్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అరెస్ట్ చేయాలని ఆదేశించామని మళ్లీ వారెంట్ల రద్దు పిటిషన్ ఎందుకు వేశారని న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. దీంతో ఇమ్రాన్ ఎదుట ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. శనివారం నాడు ఆయన అరెస్ట్ కాక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయడానికి 10 రోజుల క్రితం పోలీసులు ప్రయత్నించినప్పట్నుంచి పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. పోలీసులు ఇమ్రాన్ నివాసానికి వెళ్లిన ప్రతీసారి ఆయన ఇంట్లో లేకపోవడం, కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు రువ్వుతూ ఘర్షణకు దిగడం సర్వసాధారణంగా మారింది. ఏమిటీ తోషఖానా కేసు..? తోషఖానా.. అంటే ప్రభుత్వానికి దేశ విదేశీ ప్రతినిధుల నుంచి వచ్చే కానుకల ఖజానా. 1974లో ఇది ఏర్పాటైంది. ప్రభుత్వ అధికారులకొచ్చే కానుకల్ని ఇందులోనే ఉంచుతారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమకు ఎవరు ఏ కానుక ఇచ్చినా తోషఖానాకు తప్పనిసరిగా అప్పగించాలి. ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని పదవిని చేపట్టాక తనకు వచ్చిన కానుకలేమిటో చెప్పడానికి నిరాకరించారు. అంతేకాదు తనకు వచ్చిన కానుకల్ని ఎంతో కొంత ధర ఇచ్చి తోషఖానా నుంచి తీసుకొని వాటిని తిరిగి అమ్ముకోవడానికి అనుమతినివ్వాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. ఇమ్రాన్ ప్రధానిగా ఉండగా 101 కానుకలు వచ్చాయి. 2018, సెప్టెంబర్ 24 నాటికి అలా వచ్చిన కానుకల్లో 10 కోట్ల విలువైన వాటికి 2 కోట్లు చెల్లించి ఇమ్రాన్ తీసుకున్నారని నివేదికలు వెల్లడించాయి. అంతేకాకుండా మూడు వాచీలను అమ్మేసి ఇమ్రాన్ సొమ్ము చేసుకున్న మొత్తం రూ.3.6 కోట్లుగా తేలింది. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 ఆగస్టులో తోషఖానా వివాదంపై కేసు నమోదు చేసింది. ఇమ్రాన్ తనకు వచ్చిన కానుకల వివరాలు చెప్పకుండా కొన్ని అక్రమ మార్గాల్లో అమ్ముకున్నారంటూ కేసు పెట్టింది. ఇమ్రాన్ గద్దె దిగిన తర్వాత తోషఖానాలో కొన్ని పుస్తకాలు తప్ప మరే వస్తువు లేదు. పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ఏమంటోంది? ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా కేసు రిజిస్టర్ అయిన రెండు నెలల తర్వాత పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ఇమ్రాన్ ఆ కానుకల్ని అమ్ముకోవడం చట్ట వ్యతిరేకం కాదని తేల్చి చెప్పింది. ఎందుకంటే ఎంతో కొంత ధర చెల్లించి ఆయన ఆ కానుకల్ని తన సొంతం చేసుకున్నారని చెప్పింది. అయితే ఆయన అనైతికంగా ఈ పని చేస్తూ తప్పు దారి పట్టించే ప్రకటనలు చేశారంటూ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్‌పై అయిదేళ్ల నిషేధం విధించింది. 37 కేసులు ఇమ్రాన్‌ఖాన్‌పై తోషఖానాతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 37 కేసులు నమోదయ్యాయి. ► పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ (ఈసీపీ) ప్రధాన ఎన్నికల అధికారి సికందర్ సుల్తాన్ రజాకు వ్యతిరేకంగా ఇమ్రాన్‌తో పాటు పీటీఐ పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఒక కేసు నమోదైంది ► ఎన్నికల కమిషన్ అయిదేళ్లపాటు ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ అనర్హత వేటు వేసినప్పుడు ఈసీపీ కార్యాలయం ఎదుట నిరసనలు నిర్వహించడంపై కేసు దాఖలైంది ► పాకిస్తాన్ ఫారెన్ ఎక్స్ఛ్ంజ్ యాక్ట్ నియమాలను ఉల్లంఘిస్తూ విదేశాల నుంచి ఆర్థిక లావాదేవీలు నడిపారన్న ఆరోపణలపై కేసు ► పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్‌ని ఉల్లంఘిస్తూ ర్యాలీ నిర్వహించినందుకు కేసు ► పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) నేత మొహ్సిన్ షానావజా రంజా ఇమ్రాన్ ఆదేశాల మేరకే తనను పోలీసులు కొట్టి చంపడానికి వచ్చారంటూ హత్యా యత్నం కేసు పెట్టారు అరెస్టయితే అంతర్యుద్ధం తప్పదా..? ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయితే పాకిస్తాన్లో అంతర్గత యుద్ధం తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాను అరెస్ట్ అయితే ఏం చెయ్యాలన్న దానిపైనా ఇమ్రాన్ పక్కా ప్రణాళికతోనే ఉన్నారు. దానిని సరైన సమయంలో బయటపెడతానని ఆయన చెబుతున్నారు. తమ నేతపై చెయ్యి వేస్తే షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఆత్మాహుతి దాడులకి దిగుతామని ఇప్పటికే పార్టీ నాయకులు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న పాక్ ప్రభుత్వానికి పీటీఐ కార్యకర్తల సవాల్ ఎదుర్కోవడం కూడా క్లిష్టంగా మారింది. మరోవైపు పంజాబ్ ర్యాలీలో ఇమ్రాన్‌పై దాడి జరిగిన దగ్గర్నుంచి ఆయనను హత్య చేస్తారన్న ఆందోళనలూ ఉన్నాయి. తనపై అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆయన ఇప్పటివరకు కోర్టు ఎదుట కూడా హాజరు కాలేదు. ప్రభుత్వ పెద్దలే తనను హత్య చెయ్యడానికి కుట్ర పన్నుతున్నారంటూ ఇమ్రాన్ తనకు అనుమానం ఉన్న వారందరి పేర్లు వెల్లడిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. తనని జైలుకు పంపినా, చంపేసినా ప్రభుత్వంపై పోరాటం ఆపవద్దంటూ అనుచరుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆత్మీయ అతిథులకు అటవీ ఉత్పత్తులు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధిలో కొత్త చరిత్ర సృష్టిస్తూ విశాఖ వేదికగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా దేశ విదేశీ ప్రముఖులకు ఆత్మీయ ఆతిథ్యంతోపాటు మధుర స్మృతులను మిగిల్చే కానుకలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక జ్ఞాపికల కిట్స్‌తో పాటు గిరిజన సహకార సంస్థకు చెందిన ఉత్పత్తుల కిట్లను కూడా అందించనున్నారు. జీఐఎస్ సదస్సుకు దాదాపు 3 వేల మంది ప్రముఖులతో కలిపి మొత్తం 8 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరికీ కలకాలం గుర్తుండే ఆతిథ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ జ్ఞాపకాల్ని తమతో మోసుకెళ్లేలా ప్రత్యేక కానుకలు అందించనున్నారు. స్వచ్ఛమైన ప్రేమను పంచే గిరిజనులు సేకరించిన కల్తీ లేని ఉత్పత్తులను కానుకగా ఇవ్వనున్నారు. నాణ్యమైన జీసీసీ ఉత్పత్తుల్ని దేశ విదేశీ ప్రముఖులకు పరిచయం చేయాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, జీసీసీ ఎండీ సురేష్‌కుమార్ తెలిపారు. ఈ సమ్మిట్‌కు హాజరైన ప్రముఖులకు జీసీసీ గిఫ్ట్స్‌ను అందించనున్నారు. ఇందుకోసం 200 కిట్లను జీసీసీ సిద్ధం చేసింది. నాణ్యమైన తేనె, హెర్బల్ ఆయిల్, పెయిన్ రిలీఫ్ నుంచి అరకు కాఫీ వరకూ 12 రకాల జీసీసీ ఉత్పత్తులు ఈ కిట్లలో ఉంటాయి. -
valentine's day2023 రొటీన్‌గా టెడ్డీ, రోజ్ కాదు,వెరైటీగా ఇవి ఇస్తే..ఆ థ్రిల్లే వేరు!
సాక్షి,ముంబై: వాలెంటైన్స్ డే వస్తోందంటే చాలు ప్రేమికుల సందడి మొదలవుతుంది. దీనికి తగ్గట్టుగానే పలు ఆన్లైన్, ఆఫ్‌లైన్ సంస్థలు సిద్ధమవుతాయి. ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగా వెరైటీ గిఫ్ట్‌లు, ఆఫర్లతో ఆకట్టుకుంటాయి. స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లు ఇతర ట్రెండీ బహుమతులపై తగ్గింపు ధరతో ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటాయి. మరోవైపు వాలెంటైన్స్ డే చరిత్ర, అర్థం, పరమార్థం, ఈ ఒక్క రోజు ప్రేమ ఉంటే చాలా ఇలాంటి విషయాలతో సంబంధం లేకుండా...రోజుకో డే చొప్పున వారం రోజులు పాటు గిఫ్ట్‌లు, చాక్లెట్లు, టెడ్డీ బేర్స్ , గులాబీలతో పండుగ చేసుకుంటారు. ముఖ్యంగా తన స్వీటీకి సంతోషం పెట్టేందుకు వాలెంటైన్ తెగ ఆరాటపడతారు. తన కలలరాణికి, లేదా తన రాకుమారుడికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలా అనేది ఒక సవాలే. ఏ గిఫ్ట్ అయితే తమ డార్లింగ్ ఫిదా అయి పోతుందా అని ఇంటర్నెట్లో, ఆన్లైన్ సైట్లలో తెగ సెర్చ్ చేస్తారు. ఈ నేపథ్యంలో గులాబీలు, టెడ్డీ బేర్లు, చాక్లెట్ల కంటే ఎక్కువ కిక్ ఇచ్చే, మరపురాని మధుర జ్ఞాపకంగా మిగిల్చే. గిఫ్ట్స్ ఏంటో కొన్ని చూద్దాం. ప్రేమికుల మధ్య ప్రధానంగా ఉండాల్సింది అండర్ స్టాండింగ్. ఎలాంటి అరమరికలు, దాపరికాలు లేకుండా.. మనసు విప్పి మాట్లాడుకోవడాన్ని మంచిన స్వీట్ మెమొరీ. అంతకుమించిన గొప్ప అనుభూతి ఏముంటుంది. రోజూ వాట్సాప్‌లో చాటింగ్, కాల్స్లోమాట్లాడుకుంటూనే ఉంటాంగా అనుకోకుండా....స్పెషల్‌గా మాట్లాడుకోండి. ముఖ్యంగా అమ్మాయిలు సర్ప్రైజ్లకి ఎక్కువ థ్రిల్ అవుతారట. సో.. వాలెంటైన్స్ డే, ఆమె కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయండి! మన మనసుకు నచ్చిన నేస్తంతో ఒక రోజు గడపడం, మాట్లాడటం, జోకులు వేసుకోవడం,ఇష్టమైన సినిమా చూడటం, షిట్స్ క్రీక్ (లేదా ఇతర కంఫర్ట్ షోలు) చూడటం, లాంగ్ డ్రైవ్, ఇష్టమైన ఫుడ్, డిన్నర్ డేట్ ఇవన్నీ సంతోషానిచ్చేవే. వీటన్నింటికి మంచి ఒక బిగ్ హగ్, లవ్లీ కిస్ .. ఆ కళ్లలో వెలిగే స్పార్క్.. ఇవన్నీ.. ఫర్ పఫర్ ఎవర్ గుర్తుండిపోయే స్వీట్ నథింగ్స్.. ఇది స్వయంగా లవ్ బర్డ్స్ చెబుతున్న మాట. మీ ప్రియురాలికి లేదా ప్రియుడికి బుక్స్ చదవడం హాబీ అయితే,అందులోనూ మంచి రచయిత అయితే.. ఒక మంచి పుస్తకాన్న బహమతిగా ఇవ్వండి. వారికి టెడ్డీ బేర్, ఫ్లవర్ బొకే కంటే కూడా పుస్తకం ఇస్తే వచ్చే ఆనందానికి అవధులు ఉంవడట. అదీ సర్ ప్రైజింగ్‌గా ప్రియ నేస్తం ఇంటికి డెలివరీ చేస్తే ఇంకా మంచిది. మధురమైన చాక్లెట్పాటు, మసాజ్ సెషన్ గిఫ్ట్ ఇవ్వడం లేటెస్ట్ ట్రెండ్, చాక్లెట్లు మన శరీరంలో సంతోషకరమైన డోపమైన్, ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్ సెరోటోనిన్ హార్మోన్లను విడుదల చేస్తే, మసాజ్ మనస్సును రిలాక్స్ అయ్యేలా చేసిన కొత్త ఉత్సాహాన్నిస్తుంది. అందుకే అర్బన్ కంపెనీ లేదా ఇంట్లో సెలూన్ సర్వీస్‌ను అందించే ఇతర సంస్థల ద్వారా మంచి మసాజ్ సెషన్‌ను బుక్ చేస్తున్నారట. సాధారణంగా ఇచ్చే గిఫ్ట్స్ కేక్ గులాబీలు హ్యాండ్ బ్యాగ్, స్లింగ్ బ్యాగ్ స్పెషల్‌గా డిజైన్ చేససిన కాఫీ కప్స్ స్వీట్లు చాక్లెట్లు టెడ్డీ బేర్స్ హార్ట్ షేప్ కుషన్లు సీసాలో ప్రేమ లేఖలు షాపింగ్ కూపన్లు ఫస్ట్ డేటింగ్ డేట్‌ను గుర్తు చేసేలా ఒక గిఫ్ట్ మాంచి రొమాంటిక్ సాంగ్స్, మ్యూజిక్‌తో స్లైడ్‌షో డేట్ నైట్ ఐడియా కార్డ్‌లు రొమాంటిక్ షోపీస్ గిఫ్ట్ బాక్స్‌లు/గిఫ్ట్ హాంపర్లు క్యూట్ అండ్ రొమాంటిక్ ల్యాంప్స్ బంగారు, డైమండ్ నగలు స్మార్ట్ ఫోన్లు, వాచెస్, ఇతర గాడ్జెస్ట్స్ -
Valentines Day 2023: ప్రేమికుల రోజు ఇచ్చే గిఫ్ట్‌లు ఇవే..!
కరీంనగర్: ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు.. ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తం చేసే సందర్భం. ప్రేమలో ఉన్నవారు ఆరోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తమ మనసులో మాట చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. మదిలో ప్రేమ సందేశాలను ఇచ్చిపుచ్చుకునేందుకు మార్కెట్లో ఎన్నో వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. కేక్‌లు ప్రత్యేక డిజైన్లలో ఆకట్టుకుంటున్నాయి. ఆయా దుకాణాలు యువతీ యువకులతో కళకళలాడుతున్నాయి. వారు మెచ్చిన, నచ్చిన ఫొటోలు ఫ్రేమ్‌లో బంధించి ఇవ్వడంతోపాటు లవర్స్ స్పెషల్ కీచైన్లు, టుడే అండ్ టుమారో, జస్ట్ ఫర్ యూ అనే హార్ట్ పిల్లోస్‌పై ఆసక్తి చూపుతున్నారు. అలాగే ప్రేమికుల కోసం ఎన్నో రకాల విదేశీ చాక్లెట్లు నోరూరిస్తున్నాయి. గతంలో కంటే ఈసారి వెరైటీ గిఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. ముఖ్యంగా చైనా క్రిస్టల్‌తో తయారైన ఉత్పత్తులు యువతను ఆకర్షిస్తున్నాయి. ఇష్టమైన వారి ప్రేమను పొందేందుకు కానుకలు మంచి సాధనాలుగా పని చేస్తాయని నమ్మేవాళ్లు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఏటా ఒక బహుమతి ఇస్తా మాది ప్రేమ వివాహం. ఏటా ప్రేమికుల దినోత్సవం రోజు తప్పనిసరిగా మా వారికి ఏదో ఒక బహుమతి ఇస్తా. ఈసారి అది ప్రత్యేకంగా ఉండాలని షాపింగ్ చేస్తున్నా. ప్రేమ జీవితంలో భాగం కావాలి. – తాటి అమల పవన్, సవరన్ స్ట్రీట్ అందుబాటులో లవ్ గిఫ్ట్స్.. ఈసారి మా స్టోర్‌లో రూ.100 నుంచి రూ.2 వేల విలువైన లవ్ గిఫ్ట్స్ అందుబాటులో ఉంచాం. ప్రేమికులు రేటు ఆలోచించకుండా అందమైన బహుమతులు కొనుగోలు చేస్తున్నారు. – ఈశ్వర్, గణేశ్ జనరల్ స్టోర్, శాస్త్రీరోడ్ ప్రేమను ఇచ్చిపుచ్చుకోవాలి బహుమతుల కన్నా ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటే అది జీవితాంతం చెదిరిపోకుండా ఉంటుంది. నాకు కాబో యే శ్రీవారి కోసం ఈ సంవత్సరం ప్రత్యేక బహుమతి కొనుగోలు చేసి, పంపిస్తున్నాను. – ఉపాధ్యాయుల రుత్విక, సాఫ్ట్వేర్ ఉద్యోగిని, మంకమ్మతోట లవ్ సింబల్స్ ఉన్నవే ఎక్కువ.. లవ్ సింబల్స్ ఉన్న వస్తువులు, బొమ్మల విక్రయాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో మంచి కొటేషన్లతో గ్రీటింగ్ కార్డులు వచ్చేవి. ఇప్పుడు రావడం లేదు. ఇంటర్నెట్ నుంచి తీసుకొని, ఇచ్చుకుంటున్నారు. – ఉప్పుగల్ల మురళీకష్ణ, వాణిశ్రీ బుక్స్, స్టేషనరీ, 7హిల్స్ చదవండి: ఏకకాలంలో ఒక్కటైన 220 జంటలు -
ఉద్యోగులకు కార్లు గిఫ్ట్, ఇండియన్ టెక్ కంపెనీ బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: గ్లోబల్ దిగ్గజ కంపెనీలు, సహా టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోత ఆందోళనకు గురి చేస్తుండగా, దేశీయ టెక్ కంపెనీ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మంచి పనితీరు కనబర్చిన వారికి కార్లను బహుమతిగా ఇస్తోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన త్రిధ్య టెక్ అనే టెక్ కంపెనీ 13 మంది ఉద్యోగులకు 13 కార్లను బహుమతిగా ఇచ్చింది. ఈ కంపెనీ ఇటీవలే తొలి ఐదేళ్లు పూర్తి చేసుకోవడం విశేషం. త్రిధ్యా టెక్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ మరాంద్ మాట్లాడుతూ కంపెనీ ప్రారంభించినప్పటి నుంచీ కంపెనీ ఉద్యోగులకు విశిష్ట సేవలందించారనీ, ఆ సేవలకు గాను వారికి కార్లు బహుమతిగా అందిస్తున్నామని తెలిపారు. తమ ఐటీ కంపెనీని నిర్మించేందుకు ఉద్యోగులు తమ స్థిరమైన ఉద్యోగాలను వదులుకున్నారంటూ ప్రశంసించారు. అంతేకాదు కార్లను బహుమతి ఇచ్చే ఆనవాయితీ ఇకపై కూడా కొనసాగుతుందని ఎండీ పేర్కొన్నారు. ఈకామర్స్, వెబ్ ,మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ సేవలను అందించే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ త్రిధ్య టెక్ అహ్మదాబాద్‌లో కేంద్రంగా ఆసియా, యూరప్ ఆస్ట్రేలియాలోని క్లయింట్లకు సేవలందిస్తోంది. కాగా ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగం భారీ స్థాయిలో ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తున్నాయి.గ్లోబల్ ఆర్థిక మాంద్యం ముప్పు, ఆదాయాల క్షీణత తదితరకారణాలను చూపిస్తూ గూగుల్, అమెజాన్, మెటా, ట్విటర్ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్ జనవరిలో 12,000 మందిని, అమెజాన్ 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. టెక్ రంగం, కొన్ని నెలల వ్యవధిలో, ప్రపంచవ్యాప్తంగా 1,50,000 మంది ఉద్యోగులను తొలగించింది. -
అతియా శెట్టి-కేఎల్ రాహుల్‌కు ఖరీదైన బహుమతులు.. సునీల్ శెట్టి ఏమన్నారంటే..!
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి, టీంఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇటీవలే వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రేమజంటకు ఖరీదైన బహుమతులు ఇచ్చారంటూ పలు కథనాలు వచ్చాయి. అతియాశెట్టి తండ్రి సునీల్ శెట్టి రూ.50 కోట్ల ఫ్లాట్, కోహ్లీ, ధోని, సల్మాన్ ఖాన్ కూడా ఖరీదైన బహుమతులు అందించారంటూ వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలపై అతియా కుటుంబసభ్యులు స్పందించారు. అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. అందులో ఎలాంటి నిజం లేదన్నారు. ఇలాంటి వివరాలు రాసేముందు తమను సంప్రదించాలని సునీశ్ శెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. కేఎల్ రాహుల్ - అతియా శెట్టి కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. రెండు కుటుంబాల అంగీకారంతో ఈనెల 23న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ముంబయిలోని సునీల్ శెట్టికి చెందిన ఖండాలా ఫామ్‌హౌస్‌లో పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబసభ్యులు,కొద్దిమంది సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. బాలీవుడ్, క్రికెట్ ప్రముఖులు ఖరీదైన బహుమతులు ఇచ్చారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. జాకీ ష్రాఫ్, అర్జున్ కపూర్, విరాట్ కోహ్లీ, ధోనీ.. డైమండ్ హారం, బైక్, కారు బహుకరించినట్లు రాశారు. వీటిని సునీల్ శెట్టి ఖండించడంతో అందులో ఎలాంటి నిజం లేదని తెలిసింది. -
అతియా - రాహుల్ పెళ్లి.. వామ్మో అంత ఖరీదైన బహుమతులా..!
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి, టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ముంబయిలోని సునీల్ శెట్టి అత్యంత విలాసవంతమైన ఖండాలా ఫామ్‌హౌస్‌లో ఈ వేడుకకు జరిగింది. ఈ ప్రేమజంట వివాహానికి అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారు. అ తర్వాత అతియా-రాహుల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే సినీ, క్రికెట్ ప్రముఖులు వీరి పెళ్లికి హాజరు కాలేదు. ఐపీఎల్ తర్వాత గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: అతియా శెట్టి- కేఎల్ రాహుల్ పెళ్లి.. వారికి మాత్రమే ఎంట్రీ) అయితే తాజాగా అతియా-రాహుల్ పెళ్లికి వచ్చిన బహుమతులపై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఇద్దరూ ప్రత్యేకమైన రంగాల్లో ఉన్నవారు కావడంతో మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. కొత్త జంటకు వారి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు అత్యంత ఖరీదైన బహుమతులు ఇచ్చనట్లు తెలుస్తోంది. తన ముద్దుల కూతురికి సునీశ్ శెట్టి రూ.50 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను బహుమతిగా ఇచ్చారు. అతియా-రాహుల్ అందుకున్న ఖరీదైన బహుమతులు సునీల్ శెట్టి - ముంబైలో రూ.50 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్మెంట్ విరాట్ కోహ్లి రూ.2.17 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారు సల్మాన్ ఖాన్ - రూ.1.64 కోట్ల విలువైన ఆడి కారు అర్జున్ కపూర్- రూ. 1.5 కోట్ల విలువైన డైమండ్ బ్రాస్లెట్ ఎంఎస్ ధోనీ రూ.80 లక్షల విలువైన కవాసకి నింజా బైక్ నటుడు జాకీ ష్రాఫ్ - రూ.30 లక్షల విలువైన వాచ్ అతియా, రాహుల్ లవ్‌స్టోరీ బాలీవుడ్ నటి అతియా, కేఎల్ రాహుల్ పెళ్లికి మూడేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. గతేడాది సోషల్ మీడియా వేదికగా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. కాగా.. 2015లో రొమాంటిక్ యాక్షన్ చిత్రం ‘హీరో’లో అతియా తన నటనను ప్రారంభించింది. 1983 చిత్రంలోనూ నటించింది. ప్రస్తుతం ఫుట్‌బాల్ క్రీడాకారుడు అఫ్షాన్ ఆషిక్ బయోపిక్ 'హోప్ సోలో'లో ఆమె ప్రధాన పాత్రలో నటించనున్నారు. -
క్రిస్మస్ వేళ.. మమ్మీ.. శాంటా ఏమిచ్చాడో చూడు..
మమ్మీ... శాంటా ఏమిచ్చాడో చూడు.. శాంటా వస్తాడట... గిఫ్ట్స్ ఇస్తాడట... మమ్మీ... నాక్కూడా ఇస్తాడా?. డాడీ... నేనడిగింది ఇస్తాడా? పిల్లలు... బంగారు కొండలు. శాంటా వారికి ఇష్టమైన తాతయ్య. కానుకలిచ్చే తాతయ్య. పిల్లల్ని మంచి మార్గంలో పెట్టడానికి మంచి బుద్ధులు చెప్పడానికి చదువులో ప్రోత్సహించడానికి ఊరికే సంతోషపెట్టడానికి అర్ధరాత్రి దిండు కింద కానుకలు పెట్టి తల్లిదండ్రులే శాంటాలు అవుతారు. పిల్లలు ఈ సంతోషానికి హక్కుదారులు. పెద్దలు ఈ సంతోషం పంచాల్సిన బాధ్యత కలిగిన వారు. క్రిస్మస్ను సంతోషమయం చేయండి. పిల్లలను ఈ కానుకలతో ఎలా ప్రోత్సహించవచ్చు?. ఏ కానుకలు ఇవ్వొచ్చు? ‘అమ్మా... శాంటా క్లాజ్ ఎక్కడ ఉంటాడు?’ ‘నార్త్ పోల్‌లో’ ‘ఎప్పుడు వస్తాడు?’ ‘రేపు క్రిస్మస్ అనగా ఇవాళ రాత్రి వస్తాడు’ ‘ఎలా వస్తాడు?’ ‘ఎగిరే జింకల బగ్గీ మీద బోలెడన్ని గిఫ్ట్స్ వేసుకుని, ఏయే పిల్లాడికి ఏయే గిఫ్ట్ ఇవాలో వాటి మీద పేరు రాసుకుని వస్తాడు’ ‘మన ఇంటికి వస్తాడా?’ ‘ఎందుకు రాడు?’ ‘నాకు గిఫ్ట్ ఇస్తాడా?’ ‘ఇస్తాడు. మంచి పిల్లలకు మంచి గిఫ్ట్ ఇస్తాడు. అల్లరి పిల్లలకు గిఫ్ట్ ఇవ్వడు’ ‘నేను మంచి పిల్లాడినేగా’ ‘నాకేం తెలుసు. నీకు తెలియాలి’ ‘నేను అల్లరి చేయనుగా’ ‘అయితే నీకు గిఫ్ట్ తెచ్చిస్తాడులే’ ∙∙ క్రిస్మస్ వచ్చిందంటే పిల్లలందరికీ క్రిస్మస్ తాత గుర్తుకొస్తాడు. తెల్లటి ఫర్ అంచుల ఎర్రటి బట్టలు వేసుకుని, ఇంత పొడవు తెల్ల గడ్డంతో, ఎర్ర టోపీతో, కళ్లద్దాలు పెట్టుకుని ‘జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్’ పాడుతూ కానుకలు తెచ్చే శాంటా తాత కోసం ఎదురు చూపులు మొదలవుతాయి. మూడు నాలుగేళ్ల వయసు నుంచి పదేళ్ల లోపు పిల్లలకు క్రిస్మస్ తాత మీద ఎంతో నమ్మకం. సంవత్సరమంతా ఎదురు చూసైనా తాత ఇచ్చే బహుమతి అందుకోవాలనుకుంటారు. ఏ బహుమతి ఇస్తాడో అనే సస్పెన్స్‌ని ఎంజాయ్ చేస్తారు. కాస్త పెద్ద పిల్లలకు తాత మీద డౌట్ ఉన్నా తెల్లారే సరికి తమ బెడ్ మీద పక్కనే ఉన్న గిఫ్ట్స్‌ను చూస్తే ఆనందం. సంతోషం. వాటిని తాత ఇచ్చినా సరే. తాత పేరుతో ఎవరు ఇచ్చినా సరే. కాని ఆ రోజంతా ‘శాంటా ఏం ఇచ్చాడో చూడు’ అని అందరికీ చూపడం ఎంత బాగుంటుందో. ∙∙ ‘అమ్మా.. నాకేం గిఫ్ట్ కావాలో శాంటాకు ఎలా తెలుస్తుంది? ‘ఉత్తరం రాసి నాకు ఇవ్వు పోస్ట్ డబ్బాలో పడేస్తాను’ ‘సరే’ ‘నేను కోరిందే ఇస్తాడా?’ ‘శాంటాకు రాయి. తాతయ్యా... నేను బాగా చదువుకుంటాను. బుద్ధిగా ఉంటాను. క్లాస్‌లో అల్లరి చేయను. అమ్మ చెప్పినట్టు వింటాను. అన్నం తిననని మారాం చేయక పెట్టిందల్లా తింటాను. అబద్ధాలు చెప్పను. ఎక్కువగా ఫోన్‌తో ఆడను. నేను గుడ్‌బాయ్‌గా ఉంటాను అని రాయి. అప్పుడు తెస్తాడు’ ‘సరే’ ∙∙ కానుకలు ఎప్పుడూ పిల్లలను ఉత్సాహపరుస్తాయి. తల్లిదండ్రులు క్రిస్మస్ సందర్భంగా వారికి నచ్చిన చిన్నచిన్న కానుకలైనా ఇచ్చి ప్రోత్సహించాలి. ‘పోయిన సంవత్సరం మంచి మార్కులు తెచ్చుకున్నావుగా. అందుకని ఈ గిఫ్ట్. చాలా బుద్ధిగా ఉంటున్నావుగా... అందుకని ఈ గిఫ్ట్. చెల్లితో/అక్కతో కొట్లాడటం లేదు కదా అందుకని ఈ గిఫ్ట్. మంచి ఫ్రెండ్స్‌ను చేసుకున్నావుగా. అందుకని ఈ గిఫ్ట్’ ఇలా చెప్పి కానుకలు ఇస్తే వారు తాము మంచి పనులు చేస్తున్నామనే నమ్మకానికి వస్తారు. చేయాలని అనుకుంటారు. వాటికి కానుకలు ఉంటాయని ఉత్సాహపడతారు. క్రిస్మస్ తాతను చూపి దురలవాట్లు (గోర్లు కొరకడం, హ్యాండ్ రైటింగ్ కరెక్ట్ చేసుకోకపోవడం, పుస్తకాల బ్యాగ్ సరిగ్గా ఉంచుకోకపోవడం, స్కూల్ ఎగ్గొట్టడం.. వంటివి) మాన్పించవచ్చు. అవి మానతామని హామీ ఇస్తేనే తాత గిఫ్ట్ ఇస్తాడని చెప్పాలి. మెర్రీ క్రిస్మస్. పిల్లలకు ఏం గిఫ్ట్‌లు ఇవ్వొచ్చు? వీటిలోంచి ఎంచుకోండి. 1. ఆర్ట్ మెటీరియల్ 2. బొమ్మల పుస్తకాలు 3. షూస్ 4. పిగ్గీ బ్యాంక్ 5. కెలడీస్కోప్ 6. ఇండోర్ ప్లాంట్ 7. కుక్కపిల్ల 8. స్మార్ట్ వాచ్ 9. స్మార్ట్ స్పీకర్స్ 10.పోర్టబుల్ ఆడియో ప్లేయర్ 11. క్రిస్మస్ టీషర్ట్స్ 12. హెడ్ సెట్స్ 13. టాయ్స్ -
యూకే నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్..కాస్ట్లీ గిఫ్ట్..కట్ చేస్తే!
సాక్షి, ముంబై: సోషల్‌మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపడం, ఆనక మెల్లిగా మాటకలిపి, ఖరీదైన బహుమతులంటూ ఎరవేసి, అమాయకులకు కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెడుతున్న సంఘటన గతంలో చాలా చోటు చేసుకున్నాయి. ఇలాంటి నేరాలపై ఎన్ని సార్లు హెచ్చరించినా మళ్లీ మళ్లీ ఇలాంటి ఉదంతాలు రిపీట్ అవుతూనేఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా అలీబాగ్‌కు చెందిన ఓ మహిళ రూ.1.12 కోట్ల రూపాయలను పొగొట్టకుంది. రిటైర్డ్ మహిళా కోర్టు సూపరింటెండెంట్‌కు ఏడాది జూన్‌లో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మాంచెస్టర్ నివాసిని అంటూ ఒక వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. దాన్ని ఈమె అంగీకరించారు. ఆ తరువాత అతనితో కలిపి మరో ఇద్దరు మాట కలిపి తమ ప్లాన్‌ను పక్కాగా అమలు చేశారు. ఫోన్లలో తరచూ మాట్లాడుతూ బంగారం , ఇతర కాస్ట్లీ గిఫ్ట్‌లు పంపిస్తున్నామంటూ మభ్య పెట్టారు. అయితే దానికి కస్టమ్స్ డ్యూటీ చెల్లించవలసి ఉంటుందని నమ్మబలికారు. దీంతో ఆమె వారికి ఏకంగా 1.12 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసింది. ఇక ఆ తరువాతనుంచి వారి నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా, ఫోన్లను స్విచాఫ్ చేసుకున్నారు.మోసపోయానని గ్రహించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. మోసం, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, కుట్ర కేసు నమోదు చేశామనీ, cనిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అలీబాగ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. -
దీపావళి కానుకగా ఖరీదైన గిఫ్టులు ఇచ్చిన పర్యాటక మంత్రి
బెంగళూరు: కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ తన నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు. ఈ మేరకు ఆనంద్ సింగ్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ సభ్యులకు రెండు గిఫ్ట్ బాక్సులను పంపారు. ఐతే మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులకు ఇచ్చిన గిఫ్ట్ బాక్స్‌లో రూ. లక్ష రూపాయలు నగదు, 144 గ్రాముల గోల్డ్, 1 కేజీ వెండి, సిల్క్ చీర, ధోతీ, డ్రై ఫ్రూట్ బాక్స్ ఉన్నాయి. కానీ గ్రామ పంచాయతీ సభ్యులకు పంపిన గిఫ్ట్ బాక్స్‌లో తక్కువ మొత్తంలో నగదు, బంగారం తప్పించి అన్ని ఇతర వస్తువులు ఉండటం గమనార్హం. (చదవండి: ఆ తండ్రి కోరిక నెరవేరింది.. ముగ్గురు కూతుళ్లకు పోలీసు ఉద్యోగం!) -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు షాక్.. ఐదేళ్లు వేటు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఆ దేశ ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ఆయనపై ఐదేళ్లపాటు అనర్హత వేటు వేసింది. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో విదేశాల నుంచి పొందిన ఖరీదైన బహుమతులను చట్టవిరుద్ధంగా సొంతం చేసుకుని భారీ ధరకు అమ్ముకున్నారనే ఆరోపణలపై విచారణ జరిపింది. అనంతరం చీఫ్ ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం ఈ మేరకు వెలువరించింది. ఎన్నికల సంఘం తీర్పుతో ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలో తన పదవిని కోల్పోనున్నారు. అంతేకాదు మరో ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసి ఏ పదవి చేపట్టడానికి వీల్లేదు. అయితే ఈ తీర్పును తాము హైకోర్టులో సవాల్ చేస్తామని ఇమ్రాన్ సన్నిహితులు తెలిపారు. ఏంటీ వివాదం..? 2018లో పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ దుబాయ్ వంటి అరబ్ దేశాల్లో పర్యటించారు. ఈ సమయంలో ఖరీదైన వస్తువులు బాహుమతులుగా అందుకున్నారు. చట్ట ప్రకారం వీటిని కేబినెట్ నేతృత్వంలోని ప్రభుత్వ శాఖ అయిన తోషఖానాలో భద్రపరిచారు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులకు కానుకలుగా వచ్చే విలువైన వస్తువులను ఈ శాఖ భద్రపరుస్తుంది. వాటిని వాళ్లు సొంతం చేసుకోవాలనుకుంటే డిస్కౌంట్‌తో విక్రయిస్తుంది. అయితే సాధారణంగా 20శాతం ఉండే డిస్కౌంట్‌ను ఇమ్రాన్ ఖాన్ 50 శాతానికి పెంచారు. ఆ తర్వాత తనకు వచ్చిన ఖరీదైన కానుకలను తక్కువ ధరకే సొంతం చేసుకున్నారు. అనంతరం వాటిని భారీ ధరకు ఇతరులకు విక్రయించారు. ఈ ఆరోపణలపైనే విచారణ జరిపిన ఎన్నికల సంఘం ఇమ్రాన్‌పై అనర్హత వేటు వేసింది. చదవండి: అతితక్కువ కాలం పదవుల్లో కొనసాగింది వీళ్లే! -
సిబ్బందికి కార్లు, బైకులు కానుకగా పంచిన ఓనర్
వైరల్/చెన్నై: బాస్‌లలో.. మంచి బాసులు చాలా అరుదు. కేవలం టాస్క్‌లు, టార్గెట్లతో ఇబ్బందులు పెట్టేవాళ్లే ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే.. ఇక్కడో యజమాని.. తన దగ్గర పని చేసే ఉద్యోగులకు కార్లు, బైకులు కానుకలుగా ఇచ్చాడు. ఇది ఎక్కడో జరగలేదు.. మన పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలోనే జరిగింది. దీపావళికి స్వీట్లు, కొత్త బట్టలు పంచే యజమానులనే ఇప్పటిదాకా చూసి ఉంటారు. కానీ, చెన్నైకి చెందిన నగల షాపు ఓనర్ జయంతి లాల్ చాయంతి మాత్రం.. సిబ్బందికి కార్లు, బైకులు ఇచ్చి పెద్ద సర్ప్రైజే ఇచ్చారు. ఈ కానుకలకుగానూ ఆయనకు అక్షరాల కోటి ఇరవై లక్షల ఖర్చు అయ్యింది. ఈ విషయం ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. చల్లానీ జ్యువెల్లరీలో పని చేసే ఉద్యోగులకు ఈ దీపావళికి మామూలు కానుకలు దక్కలేదు. వాళ్ల వాళ్ల పర్ఫార్మెన్స్, హోదాలను బట్టి కొంత మందికి బైకులు, మరికొందరికి కార్లను కానుకగా పంచారు జ్యువెలరీ అధినేత జయంతి లాల్ ఛాయంతి. మొత్తం సిబ్బంది కోసం పది కార్లు.. ఇరవై బైకులను పంచారాయన. కుటుంబాలతో సహా భోజనాలకు ఆహ్వానించడంతో.. ప్రతీ ఏడాది షరా మామూలుగా నిర్వహించే కార్యక్రమమే అనుకున్నారంతా. అయితే ఊహించని ఈ సర్ప్రైజ్లు అందుకుంటూ ఉద్యోగుల్లో కొందరు భావోద్వేగానికి లోనై కంట తడి పెట్టుకున్నారు. వీళ్లు ఉద్యోగులు కారు.. నా కుటుంబ సభ్యులు. అందుకే వీళ్లకు ఈ నా విజయంలో.. వైఫల్యంలో.. ప్రతీ అడుగులో వీళ్లు అడుగు వేశారు. నా వెన్నంటే ఉన్నారు. లాభాల బాట పట్టడానికి వీళ్లు చేసిన కృషికి వెలకట్టలేను. కానీ, వాళ్లను ఇలా ప్రొత్సహించాలని అనుకున్నా.. అంతే అని తెలిపారాయన. యజమాని ఊహించిన సర్ప్రైజ్ పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Chennai, Tamil Nadu | A jewellery shop owner gifted cars and bikes to his staff as Diwali gifts They have worked with me through all ups and downs. This is to encourage their work. We are giving cars to 10 people and bikes to 20: Jayanthi Lal, owner of the jewellery shop (16.10) pic.twitter.com/xwUI0sgNRn — ANI (@ANI) October 17, 2022 -
ఇక నుంచి మీకు గిఫ్టులు ఎవరూ ఇవ్వరనుకుంటా సార్!
ఇక నుంచి మీకు గిఫ్టులు ఎవరూ ఇవ్వరనుకుంటా సార్! -
మాజీ ప్రేయసితో ఎలాన్ మస్క్ ఫోటోలు, గిఫ్ట్స్ వేలం: వైరల్
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో, ఎలాన్ మస్క్ ఫోటోలు, బహుమతుల వేలం అంశం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. మాజీ ప్రియురాలు జెన్నిఫర్ గ్విన్ పాత బహుమతులను, ఫోటోలను వేలానికిపెట్టింది. జంటగా ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు, కార్డులు, ఇతర దాదాపు 20 అంశాలను అమ్మకానికి పెట్టడం గమనార్హం. RR వేలం వెబ్సైట్లో లిస్ట్ అయిన ఈ వేలం సెప్టెంబర్ 14న ముగియనుంది. ఫోటోలతో పాటు, తన మాజీ ప్రియుడు, బిలియనీర్ మస్క్ సంతకం చేసిన పుట్టినరోజు కార్డును కూడా విక్రయిస్తోంది, 'హ్యాపీ బర్త్ డే బూ-బూ' లవ్ ఎలోన్" అని రాసి కార్డును ఆక్షన్కిపెట్టింది. మస్క్ 20 ఏళ్ల వయసులో జంటగా ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు, మస్క్ సంతకం చేసిన 1 డాలర్ బిల్లుఈ వేలంలో అమ్మకానికి ఉన్నాయి. అలాగే పుట్టిన రోజున గ్విన్‌కి మస్క్ ఇచ్చిన 14కే గోల్డ్ నెక్లెస్‌ను కూడా విక్రయిస్తోంది. అలాగే మస్క్ రూంలో స్నేహితులతో కలిసినవి, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ క్యాంపస్ చుట్టూ సరదాగా గడిపిన పిక్స్ కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా 1995లో గ్విన్‌కి మస్క్ ఇచ్చిన పుట్టినరోజు కార్డు వేలం ఇప్పటికే 1,300 డాలర్లకు చేరుకుంది. దీని అంచనా విలువ 10వేల డాలర్లు. ప్రస్తుతం డాలర్ బిల్‌పై వేలం జోరుగానే నడుస్తోంది. ఇది 5వేల డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేస్తుందని అంచనా. అయితే సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే మస్క్ ఈ వేలం వ్యవహారంపై ఇంకా స్పందించలేదు. కాగా గ్విన్ తన సవతి కొడుకు ట్యూషన్ ఫీజు కోసం డబ్బును సేకరించడానికి ఈ వస్తువులను వేలం వేస్తోంది. ప్రస్తుతం ఆమె సౌత్ కరోలినాలో అతనితో కలిసి నివసిస్తోంది. మస్క్ 1994 చివరిలో గ్విన్‌కి ఈ కార్డుతోపాటు బంగారు హారాన్ని ఇచ్చాడు. మస్క్ , గ్విన్ 1994-1995లో డేటింగ్ చేశారు. -
చదివింపులు.. రూ. అరకోటి!
‘‘రాజుగారింట్లో పెళ్లి.. ప్రజలంతా వెళ్లి కానుకలు సమర్పించాలి’’ అంటూ అప్పట్లో రాజ్యంలో దండోరా వేయించేవారు. ఒకప్పుడు రాజరికంలో ఇవన్నీ చెల్లుబాటు అయ్యాయి. కానీ.. ఇదే పద్ధతి ఇప్పుడూ నడుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కరీంనగర్ కలెక్టరేట్లోని ఓ ప్రభుత్వ విభాగానికి అధిపతిగా వ్యవహరిస్తున్న అధికారి కూడా తన ఇంట్లో జరిగే పెళ్లికి కానుకల సేకరణకు ఇలాగే దాదాపుగా దండోరా వేయించినంత పనిచేశారు. అసలే జిల్లాలో ఓ శాఖకు విభాగాధిపతి.. పైగా అతని ఇంట్లో పెళ్లి.. సిబ్బంది కానుకలు సమర్పించి స్వామి భక్తి చాటుకునేందుకు.. ఇదే అద్భుత అవకాశమని ప్రచారం చేయించారు. ఈ వార్త వినగానే.. 15 మండలాలు, 313 గ్రామపంచాయతీల్లో కలకలం రేగింది. దీనిపై సిబ్బందిలో మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు ఇదే మంచి తరుణమని తమ స్వామి భక్తి ప్రదర్శించేందుకు సమాయత్తమవగా.. మరికొందరు ఇదెక్కడి తలనొప్పిరా బాబూ అంటూ తల పట్టుకున్నారు. తగ్గేదేలే..! ► సదరు అధికారి ఇంట్లో పెళ్లి వేడుకకు ముందే.. కొందరు ఉద్యోగులు వసూలు చేసే బరువు బాధ్యతలను తమ భుజాలకు ఎత్తుకున్నారు. ► తొలుత జిల్లా కేంద్రంలో లిస్టు రెడీ చేసి ఆ మేరకు నగదు కానుకలను వసూలు చేశారు. ► ఆ తరువాత జిల్లాలోని ఆ విభాగానికి సంబంధించిన 15 మండలాల అధికారులకు, 313 గ్రామపంచాయతీ స్థాయిలో పనిచేసే తమ సిబ్బందికి తలా ఇంత అన్న టార్గెట్ విధించారు. ► కొందరు ససేమీరా అని ఇవ్వలేదు. మండలస్థాయి అధికారుల్లో కొందరు తలా తులం బంగారం ఇచ్చుకోగా.. మిగిలిన గ్రామస్థాయిలో నాలుగుదశల్లో పనిచేసే సిబ్బంది ప్రతీ మనిషి రూ.1000 నుంచి రూ.5000 వరకు సమర్పించుకున్నారు. ► కొందరు గ్రామీణ నేతలు, ప్రజాప్రతినిధులు, చోటా కాంట్రాక్టర్లు సైతం ఈ చదివింపుల మేళాలో పాలుపంచుకోవడం విశేషం. ► కొందరైతే విందుకోసం మేకలు, గొర్రెలు కూడా ఉడతాభక్తి కింద ఇచ్చినట్లు తెలిసింది. ► ఈ క్రమంలోనే కొన్నిచోట్ల సిబ్బంది నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనట్లు తెలిసింది. ఎవరో ఇంట్లో పెళ్లికి తామెందుకు డబ్బులు ఇవ్వాలంటూ ఎదురు తిరగడంతో వసూల్ రాజాలు వెనుదిరిగినట్లు సమాచారం. వేధింపులు మొదలు..! ఈ వేడుకకు సహకరించని వారిపై సదరు విభాగాధిపతి కక్షసాధింపులకు దిగినట్లు తెలిసింది. వారి సర్వీసు రికార్డులు తీసి మరీ వేధింపుల పర్వానికి తెరతీసినట్లు సిబ్బంది వాపోతున్నారు. సదరు అధికారి వాస్తవానికి ఈ పాటికే రిటైర్డ్ కావాల్సి ఉంది. కానీ.. ఇటీవల ఉద్యోగ విరమణ వయసును ప్రభుత్వం పెంచడంతో మూడేళ్ల సర్వీసు కలిసి వచ్చింది. దీంతో అదనంగా కలిసి వచ్చిన అవకాశాన్ని ఇలా అక్రమార్జనలకు వాడుతున్నారని సిబ్బంది మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ పలువురు సిబ్బందిని సంప్రదించగా.. చాలామంది వెల్లడించేందుకు జంకి వెనకడుగువేశారు. కొందరు మాత్రం నిజమేనని ధ్రువీకరించారు. అయినా.. సదరు అధికారికి వ్యతిరేకంగా తాము ఎలాంటి ప్రకటనా చేయలేమని వాపోయారు. వాస్తవానికి కరీంనగర్ పట్టణంలో ఇలాంటి తంతు కొత్తదేం కాదు, గతేడాది కూడా ఓ నాయకుడి ఇంట్లో పెళ్లి సమయంలోనూ దాదాపుగా ఇదే జరిగింది. ప్రతీ సిబ్బంది తాము నిర్ణయించినంత మొత్తాన్ని వెంటనే అందజేయాలని కొందరు గ్రూపులీడర్లు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసిన ఆడియో సందేశం అప్పట్లో వైరల్‌గామారిన సంగతి తెలిసిందే. చదవండి: అనూహ్యం: డీజీపీని తప్పించిన సీఎం యోగి! కారణం ఏంటంటే.. -
కానుకలు అమ్ముకున్నారంటూ ఆరోపణలు.. స్పందించిన ఇమ్రాన్
ఇస్లామాబాద్: కానుకలను అమ్ముకున్నానన్న ఆరోపణలపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం ఘాటుగా స్పందించారు. అవి తనకు అందిన కానుకలని, వాటిని తోషాఖానాలో ఉంచాలో లేదో తన ఇష్టమేనని అన్నారు. పాకిస్తాన్ చట్టం ప్రకారం దేశ ప్రముఖులు తమకందని కానుకలను తోషాఖానాలో ఉంచాలి. లేదంటే సగం ధరకు కొనుక్కోవాలి. తాను అలాగే కొనుక్కున్నానని ఇమ్రాన్ అన్నారు. చట్ట ప్రకారం అది తన హక్కన్నారు. ఇమ్రాన్ 58 కానుకలను రూ.14 కోట్లకు అమ్ముకున్నారని ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవలే ఆరోపించిన విషయం తెలిసిందే. పీఓకే ప్రధానిగా సర్దార్ తన్వీర్ ఇల్యాస్ పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ పార్టీ ప్రాంతీయ అధ్యక్షుడు సర్దార్ తన్వీర్ ఇల్యాస్ సోమవారం ఎన్నికయ్యారు. -
Sakshi Cartoon: ఏదో దేశాన్ని అమ్ముకున్నట్లు ఫీలవుతారేం?
ఏదో దేశాన్ని అమ్ముకున్నట్లు ఫీలవుతారేం? -
వాలెంటైన్స్ డే వీక్: అసలా కెమిస్ట్రీ ఏంటి?
అందమైన అమ్మాయి..ఆమె చేతిలో క్యూట్ క్యూట్ టెడ్డీ. ప్రేమికుల వారోత్సవాల్లో భాగంగా టెడ్డీ డే రోజు కనిపించే దృశ్యాలివే. నాలుగో రోజు ఫిబ్రవరి 10న టెడ్డీ డేగా జరుపుకుంటారు. అసలు ప్రేమికులకు ఈ టెడ్డీకి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఏంటి? ఈ రోజు ఎందుకు టెడ్డీ బేర్ గిఫ్టుగా ఇస్తారు. మీ వాలెంటైన్‌కి ఎలాంటి టెడ్డీ సూట్ అవుతుంది. వైట్.. రెడ్ ఎలాంటి టెడ్డీ ఇస్తే లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అనిపిస్తుంది... లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ప్రేమను గిఫ్ట్‌లతో కొలవలేం కానీ, పెద్దదైనా, చిన్నదైనా ఎప్పుడైనా సరే గిఫ్ట్ ప్రేమను పంచుతుంది. పెంచుతుంది కూడా. ప్రేమను చాటడమే దాని ఉద్దేశం. ప్రేమికుల వారంలో భాగంగా నాలుగో రోజు ఫిబ్రవరి 10న టెడ్డీ డే గా వ్యవహరిస్తాం. ప్రేమికుల మధ్య ప్రేమను చాటేందుకు టెడ్డీ డే రోజున అబ్బాయిలు అమ్మాయిలకు టెడ్డీ బేర్‌ను ఇస్తారు. ఒక విధంగా చెప్పాలంటే చిన్నప్పటినుంచి అమ్మాయిలకు కూడా టెడ్డీ బేర్ అంటే ప్రాణం. తమకలవాటైన టెడ్డీ లేకుండా క్షణం కూడా నిద్రపోని అమ్మాయిలున్నారంటే అతిశయోక్తి కాదు. అమ్మాయిలు టెడ్డి బేర్స్‌ని ఎక్కువగా ఇష్టపడటం వెనుక కొన్ని మానసిక కారణాలు ఉన్నాయి. తమకు తోడుగా, అండగా మరో మనిషి ఉన్నారనే భరోసా వారికి చాలా ధైర్యాన్నిస్తుంది. అలా ఒంటరితనాన్ని పోగొట్టుకుంటారు. తన ప్రేయసికి సరిగ్గా ఇలాంటి సపోర్ట్ ఇచ్చేందుకే ఏ అబ్బాయైనా టెడ్డీని బెస్ట్ గిఫ్ట్‌గా ఎంచుకుంటాడు. 24/7 నేను నీతోనే..నీ పక్కనే అంటూ తన కలల రాణికి ధైర్యం చెబుతాడన్నమాట. తమ పెయిన్, గెయిన్ ఏదైనా టెడ్డి బేర్స్‌కు మాత్రమే చెబుతారు. ఎందుకంటే ఏ టెడ్డీ నెవర్ బ్రేక్స్ ద రూల్ అండ్ నెవర్ బ్రేక్స్ అప్ ది రిలేషన్. మరి ఎలాంటి టెడ్డీ ఇస్తే.. మీ కరెక్ట్ ఫీలింగ్ కన్వే అవుతుందో తెలుసా. రెడ్ టెడ్డీ బేర్ ఇస్తే.. లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అని అర్థం. పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తున్నట్టు అర్థం. ఇక పింక్ గులాబీ రంగు టెడ్డీతో ఇస్తే అవతలి వాళ్ల ప్రేమను హార్ట్‌ఫుల్‌గా స్వీకరించినట్టు. ఇక పవర్‌కి, హ్యాపీనెస్‌కి గుర్తు ఆరెంజ్. కాబట్టి, త్వరలోనే ఎవరికైనా ప్రపోజ్ చేయాలి అనుకుంటే టెడ్డీ డే రోజున ఆరెంజ్ టెడ్డీ ఇచ్చేయొచ్చు. బ్లూ టెడ్డీని బహుమతి ఇచ్చి పిచ్చి పిచ్చిగా ప్రేమించడమే కాదు..నువ్వు నా పక్కన ఉండటం అదృష్టం అని గట్టిగా చెప్పేసినట్టే. గ్రీన్ టెడ్డీ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్పడం. టెడ్డీ డే రోజున బ్రౌన్ టెడ్డీ ప్రేమించిన వ్యక్తి గుండెను బద్దలు చేశారన్న బాధకు చిహ్నం. లాస్ట్ బట్ నాట్ ద లీ స్ట్. ప్రేమికులకు మాత్రం టెడ్డీ డే రోజున వైట్ టెడ్డీ అంత గుడ్ సింబల్ కాదు. ఆల్రెడీ వారు వేరే వ్యక్తితో లవ్‌లో ఉన్నట్టు అర్థం. సో.. సిల్కీ అండ్ స్మూదీ టెడ్డీ బేర్‌తో మీ ట్రూ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయండి.. హ్యాపీ టెడ్డీ డే. అరుదైన సందర్భాల్లో అమ్మాయిలు కూడా అబ్బాయిలకు ఇస్తుంటారు. సాధారణంగా క్యూట్ యానిమల్స్ బొమ్మల్ని, లేదా హార్టీ టెడ్డీ బేర్‌ను గిఫ్టుగా ఇస్తారు. అయితే ఎంత ఖరీదైన బహుమతి ఇచ్చామన్నది కాదు, ప్రేమను ఎలా వ్యక్తం చేశామన్నదే ముఖ్యం. వాలెంటైన్స్ వీక్‌లో టెడ్డీ డే తర్వాత ఫిబ్రవరి 11న హ్యాపీ ప్రామిస్ డే, 12న హ్యాపీ హగ్ డే, 13న హ్యాపీ కిస్ డే జరగనుంది. చివరగా14న హ్యాపీ వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. -
షాకింగ్!.. ఖరీదైన గిఫ్ట్‌ల స్థానంలో కుక్క బిస్కెట్లు, షేవింగ్ క్రీమ్‌లు..
Woman shocked after holiday gifts in her luggage: ఎప్పుడైన మన వస్తువులు పొరపాటున లేక మరేదైన కారణాల వల్లో ఒక్కొసారి మన వస్తువులు వేరేవారికి వారి వస్తువులు మనకి తారుమారు అవుతుండడం సహజం. వీలైతే సాధ్యమైనంత వరకు మార్చుకోగలుగుతాం. అదే ఒక్కొసారి వాళ్ల ఎవరో తెలియకపోడమో లేక ఎప్పుడూ వస్తువులు మారిపోయాయో గుర్తించనట్లయితే కచ్చితంగా మన వస్తువు తెచ్చుకోవడం కాస్త కష్టమే. అచ్చం అలాంటి సంఘటన యూఎస్‌కి చెందిన ఒక మహిళకు జరిగింది. (చదవండి: 10 వేల సంవత్సరాల వరకు దేశం విడిచిపెట్టి వెళ్లకూడదట!) అసలు విషయంలోకెళ్లితే...యూఎస్‌కి చెందిన మహిళ యూరప్ విహార యాత్రకు వెళ్లింది. ఆ విహారయాత్రలో తన కోసం స్నేహితులు, బంధువుల కోసం దాదాపు రూ 2 లక్షలు ఖరీదు చేసే బహుమతులను కొనుగోలు చేసింది. అయితే ఆమె ఇటలీలో సుమారు 11 రోజుటు గడిపింది. కొన్ని రోజులు వ్యాపారం నిమిత్తం ప్యారిస్‌లో ఉంది. అయితే ఆమె విహారయాత్రకు వెళ్లి ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాక తన సూట్కేసుని ఎంతో సంతోషంగా తెరిచి చూస్తుంది. అంతే ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే అందులో ఆమె కొన్న గిఫ్ట్‌లు బదులు డాగ్ ఫుడ్, పాత టీ-షర్టు, షేవింగ్ క్రీమ్ బాటిల్ ఉన్నాయి. ఆ తర్వాత ఆమె కాసేపటికి తన లగేజ్ ఎయిర్‌పోర్టులో మారిపోయి ఉంటుందని గుర్తించింది. ఈ మేరకు ఆమె సదరు ఎయిర్‌లైన్స్‌కి జరిగిన విషయాన్ని తెలియజేసింది. అయితే సదరు ఎయిర్‌లెన్స్ కూడా ఆ మహిళకు ఎదురైన అనుభవానికి క్షమపణలు చెప్పడమే కాక సాధ్యమైనంత త్వరలో దీన్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చింది. (చదవండి: ఖాతాదారుడు తాకట్టు పెట్టిన ఆభరణాలను కొట్టేసిన బ్యాంక్ క్యాషియర్!) -
కూలిస్తే ఉన్మాదం.. ప్రేమిస్తే మతం
సాక్షి, హైదరాబాద్: ఏ మతమైనా ఎదుటివారిని ప్రేమించాలనే చెబుతుందని, దాడులు చేయాలని ఎక్కడా చెప్పలేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. మతోన్మాదం పెరిగితేనే విషమ పరిస్థితులు తలెత్తుతాయన్నారు. మైనారిటీలపై దాడులు తాత్కాలికమేనని, ఈ దాడులతో ఎవరూ సాధించేమీ ఉండదన్నారు. ప్రజలు ఈర్షాద్వేషాలు విడనాడి ప్రేమతత్వాన్ని అలవర్చుకోవాలని కోరారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ ఉత్సవాల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. దాడులతో మానవజాతికి జరిగిన మేలు ఏమీ లేదు.. ఒక మతం మీద మరో మతం ధ్వేషం పెంచుకొని ఆలయాలను, ప్రార్థనా మందిరాలను కూల్చడం వల్ల సాధించిందేమిటని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ‘గతంలో ముస్లింలు గుడులపై దాడులు చేస్తే హిందువులు మసీదులపై దాడులు చేశారు. దీనివల్ల మానవజాతికి జరిగిన మేలు ఏమీ లేదు. ఎదుటివారిని ప్రేమించాలి. మానవజాతికి అదే కావాలి. దేశ జీడీపీ, రాష్ట్ర జీడీపీ అంటే ఏదో ఒక మతానికో సంబంధించిన కాదు. దేశం, రాష్ట్రంలోని ప్రజలందరిదీ’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మనిషిని మనిషిగా చూడలేని వాడు మనిషే కాడు ‘ఎదుటి మనిషిని ప్రేమించడమే మానవజాతి అభిమతం కావాలి. ఎదుటివారిని ప్రేమించడమే అత్యుత్తమ మతం. మనిషిని ప్రేమించడమే గొప్ప లక్ష్యం. మనిషిని ప్రేమించలేని వాడు... మనిషిని మనిషిగా చూడలేని వాడు అసలు మనిషే కాదు. మతంలో తప్పులేదు. తప్పు చేయాలని మతం ఎక్కడా చెప్పలేదు. మనిషిని ప్రేమించాలని మాత్రమే మతం చెప్పింది. తప్పు చేయాలని మత బోధకులు చెప్పలేదు. ఈర‡్ష్య, ద్వేషం పెంచుకోవాలని చెప్పలేదు. ప్రేమించాలని, శాంతియుతంగా ఉండాలని చెప్పారు’అని సీఎం అన్నారు. అందరిని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే ‘రాష్ట్రంలో ప్రజలంతా ఒక్కటే. తెలంగాణ రాష్ట్రంలో పండుగలను సెలబ్రేట్ చేయాలని ఎవరూ చెప్పలేదు. దరఖాస్తులు పెట్టలేదు. ఎన్నో పోరాటాలు, అనేక క్షోభలు ఎదుర్కొన్న తెలంగాణలో అందరూ బాగుండాలని ఓ పాలసీగా తీసుకున్నాం. ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకుంటుంది. తెలంగాణలో ఎవరిపైనా ఎవరూ దాడి చేయరు. అందరినీ కాపాడే బాధ్యత తెలంగాణ సర్కార్‌దే. ఏడేళ్ల క్రితం తెలంగాణ ఎట్టుండే... ఇప్పుడు ఎట్లుంది? ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను నిర్మించుకొని ఏటా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి దాన్ని కొనాలని కేంద్రంతో కొట్లాడే స్థాయికి తెలంగాణ ఎదిగింది’అని కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని రంగులు కలబోసుకున్న దేశం ఇండియానే ‘ప్రపంచంలోని ఇస్లాం దేశాల్లో రెండే పండుగలుంటాయి. క్రిస్టియన్ దేశాల్లోనూ అంతే. కానీ నెల తిరక్కుండానే పండుగలు చేసుకొనే దేశం ఇండియా ఒక్కటే. క్రిస్మస్, రంజాన్, దసరా, దీపావళి, సంక్రాతి... ఇలా అన్ని పండుగలను జరుపుకుంటాం. ప్రపంచంలో అత్యంత రంగుల దేశం ఇండియా ఒక్కటే. భారత్ అత్యుత్తమ దేశం. ఈ దేశంలో ప్రేమైక సమాజం కావాలి’అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అన్ని మత విశ్వాసాలను గౌరవిస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అన్నారు. రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి చేస్తున్న కృషి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వి. శ్రీనివాస్‌గౌడ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారు ఎ.కె. ఖాన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, క్రైస్తవ ప్రతినిధులు జాన్ గొల్లపల్లి, పూల ఆంథోని, సతీశ్ కుమార్, సాల్మన్, డేనియల్, రాబెల్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: కిషన్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: మంత్రి నిరంజన్ రెడ్డి -
ఆది పురుష్ మూవీ టీం సభ్యులకు ప్రభాస్ కాస్ట్లీ గిఫ్ట్స్..
హీరో ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాల్లో ఆది పురుష్ ఒకటి. ఇటీవల ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మూవీ 103 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులనుతో ఆది పురుష్ టీం బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టెక్నిషియన్లకు ప్రభాస్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఖరీదైన రాడో వాచ్‌లను ప్రభాస్ వారికి బహుమతిగా ఇచ్చిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చదవండి: మహిళల పరువు పోయింది.. సమంత స్పెషల్ సాంగ్‌పై మాధవిలత షాకింగ్ కామెంట్స్ ఇందుకు సంబంధించిన ఫొటోలను ఓ టెక్నిషియన్ షేర్ చేస్తూ ఆనందం వ్యక్త చేశాడు. ప్రభాస్ నుంచి ఊహించని బహుమతి అందడంతో ఆది పురుష్ టీం టెక్నిషియన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా డైరెక్టర్ ఓం రౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ పౌరాణిక సినిమాలో ప్రభాస్ రాముని పాత్ర పోషిస్తుండగా.. కృతి సనన్ సీతగా కనిపించనుంది. లక్ష్మణుడిగా బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ ఆలీఖాన్ కీలక పాత్రల్లో నటించనున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కె చిత్రంతో బిజీగా ఉన్నాడు. చదవండి: ‘రాధే శ్యామ్’ సంచారి ఫుల్ సాంగ్ వచ్చేసింది, గంటలోనే మిలియన్ వ్యూస్ -
సల్మాన్,రణ్‌బీర్ నుంచి కత్రినాకు కాస్ట్లీ గిఫ్ట్స్!, అవేంటో తెలుసా?
Katrina Kaif Ex Boyfriends Salman Khan, Ranbir Kapoor Sends Costly Gifts On Her Wedding: ప్రస్తుతం బి-టౌన్లో కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ పెళ్లి హాట్‌టాపిక్‌గా మారింది. పెళ్లి వరకు గొప్యత పాటించిన ఈ జంట అనంతరం వరసపెట్టి ఫొటోలు షేర్ చేస్తున్నారు. ‘మా మనసులో ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమ, కృతజ్ఙత మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. మా ఈ కొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు కావాలంటూ’ విక్ట్రీనాలు పోస్ట్‌లు షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే వీరికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. కాగా రాజస్థాన్‌లో కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక దీనికి ఎంతమంది బాలీవుడ్ సెలబ్రెటీలు వెళ్లారు, ఎవరెవరికి ఆహ్వానాలు అందాయన్న దానిపై స్పష్టత లేదు. చదవండి: కాజల్‌పై బిగ్‌బాస్ నిర్వాహకులు సీరియస్! ఆ రూల్ బ్రేక్ చేసిందా? ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ ప్రముఖుల నుంచి ఈ జంటకు ఖరీదైన బహుమతులు అందినట్లు తెలుస్తోంది. వీరిలో కత్రినా మాజీ ప్రియులు రణ్‌బీర్ కపూర్, సల్మాన్ ఖాన్లు ఉండటం ఆసక్తినెలకొంది. కత్రీనా పెళ్లి సందర్భంగా ఆమె మాజీ ప్రియుడు రణ్‌బీర్ కపూర్ 2.7 కోట్ల రూపాయలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇవ్వగా.. ఈ కొత్త జంటకు బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ 3 కోట్ల రూపాయల విలువైన రేంజ్ రోవర్ కారును కానుగా ఇచ్చినట్టు బి-టౌన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా గతంలో కత్రినా సల్మాన్ ఖాన్‌తో ప్రేమ వ్యవహరం నడపగా వీరిద్దరి బ్రేకప్ అనంతరం రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో మునిగితేలిన సంగతి తెలిసిందే. చదవండి: విక్కీ, కత్రినా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్.. రొమాంటిక్ లుక్‌లో మెరిసిపోతున్న క్యూట్ కపుల్ అంతేకాదు ముంబైలో ఓ ప్లాట్ తీసుకుని అక్కడ రణ్‌బీర్, కత్రినాలు ఎడాది పాటు కలిసి ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక సల్మాన్, రణ్‌బిర్‌తో పాటు అలియా భట్ లక్ష రూపాయల విలువైన పెర్ఫ్యూమ్ బాస్కెట్‌ను కత్రినాకు బహుమతిగా ఇచ్చిందని, రూ. 6.4లక్షల విలువైన డైమండ్ చెవి దుద్దులను విరూష్కలు గిఫ్ట్ పంపించారని సమాచారం. అలాగే షారుఖ్ ఖాన్ వారి వివాహ వేడుకలో రూ. 1.5 లక్షలు విలువ చేసే ఖరీదైన పెయింటింగ్‌ను ఇవ్వగా, హృతిక్ రోషన్.. విక్కీకి 3 లక్షల రూపాయలు విలువ చేసే బీఎండబ్య్లూ జీ310 ఆర్ బైక్‌ను ఇచ్చాడట. ఇక తాప్సీ కూడా విక్కీకి 1.4లక్షల రూపాయల విలువైన ప్లాటినం బ్రెస్లెట్ను బహుమతిగా ఇచ్చిందని తెలుస్తోంది. -
Best Gifts: మరీ టవల్‌ను కానుకగా ఇవ్వడం ఏంటని అనుకోకండి!
Best Gifts For Friends Different Seasons: పండగలు, వేడుకల సందర్భాలలో బంధుమిత్రుల ఇంటికి వెళ్లినప్పుడు ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయేలా కానుక ఏదైనా తీసుకెళ్లాలనుకుంటారు ఎవరైనా. అయితే, ఆ ఎంపికలో ఎక్కువ శాతం వాల్ ఫ్రేమ్స్ లేదా గడియారాలు, కొన్ని షో పీసులు ఉంటాయన్నది చాలా మంది ఒప్పుకోవాల్సిందే. కానీ, కొద్దిగా ఆలోచిస్తే మనం ఇచ్చే కానుక ఆ ఇంట్లో అన్ని విధాలా ఉపయోగపడే విధంగా ఎంపిక చేయచ్చు. చలికాలానికి రగ్గులు, వేసవి కాలానికి మగ్గులు, వర్షాకాలానికి గొడుగులు.. కానుకలుగా కాలానుగుణంగానూ ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే, అన్ని వేళల్లోనూ ఉపయోగపడేవాటిని ఎంచుకోవచ్చు. ఆలోచనకు కొన్ని ఎంపికలు.. 1. బ్లాంకెట్ : చలిని తట్టుకునేలా వెచ్చని ఆశీర్వచనంగా ప్రతి వింటర్లో ఉపయోగపడేవిధంగా బ్లాంకెట్‌ను ఎంపిక చేయచ్చు. వీటిలో అత్యంత ఖరీదైనవీ, బడ్జెట్‌కు తగినవీ ఉంటాయి. మార్కెట్లో అరుదుగా లభించేవి, నాణ్యమైనవీ, రంగులూ, డిజైన్లూ.. ఇలా మన ఎంపికలో ఓ ప్రత్యేకత ఉండేలా జాగ్రత్తపడవచ్చు. కొన్ని చలికాలాల పాటు మీ ఆప్తులకు మీరిచ్చిన రగ్గు వెచ్చదనాన్ని పంచుతుంది. ఆత్మీయతను పదిలం చేస్తుంది. 2. టీ పాట్: ప్రతి ఇంట్లోనూ తేనీరూ ఓ తప్పనిసరి అవసరం. కాలాలకు అతీతంగా వాడే ఈ పానీయాన్ని అతిథులకు అందించడానికి చూడచక్కని టీ కెటిల్ మంచి ఎంపిక అవుతుంది. అలాగే తేనీటికి సంబంధించి కప్పులు, ట్రే, టీ కెటిల్.. ఇలాంటివి అవసరంగా ఉంటాయి. వీటిలో ఏదైనా మంచి అందమైన సెట్‌ను కానుకగా అందిస్తే ప్రతిరోజూ మీ అతిథులను పలకరించినట్టుగానే ఉంటుంది. 3. వాటర్ జగ్స్ /బాటిల్స్: నీటిని నింపి టేబుల్ మీద పెట్టుకునే వాటర్ జగ్ లేదా బాటిల్స్ ఎంపిక మీ అభిరుచిని తెలియజేస్తుంది. అవసరం అంతగాలేని కానుకల కోసం ఎక్కువ ఖర్చు పెట్టే బదులు ఇలాంటి నిత్యావసరంగా ఉండేవాటిని కానుకలుగా ఇవ్వడానికి ఎంపిక చేసుకోవచ్చు. 4. టవల్: ‘మరీ టవల్‌ను కానుకగా ఇవ్వడం ఏంటి?!’ అనే ఆలోచనే చేయనక్కర్లేదు. నాణ్యమైన టవల్‌ను లేదా టవల్స్ సెట్‌ను కానుకగా ఇస్తే ఆ ఇంటి వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. 5. టేబుల్ నాప్కిన్స్–హోల్డర్స్: అతిథి మర్యాదలు చేసే సమయంలో డైనింగ్ టేబుల్ వద్ద ఉంచే నాప్కిన్స్ మంచి డిజైన్‌తో ఉన్న ఎంపికల గురించి చాలా తక్కువే ఆలోచిస్తారు. ‘ఎప్పుడో గానీ ఉపయోగించం కదా! ఖరీదు ఎందుకు’ అనుకునేవారు ఉంటారు. మీ బంధుమిత్రుల ఆలోచన కొద్దిగానైనా మీకు తెలిసి ఉంటుంది కాబట్టి, అందమైన నాప్కిన్, వాటికి అలంకారంగా ఉండే హోల్డ్ర్స్ని గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. ఇదే విధంగా గ్లాస్ హోల్డర్, స్పూన్లు, టేబుల్మ్యాట్స్.. ఇలా కానుకల ఎంపికలో చేర్చుకోవచ్చు. 6. ఫ్లోర్/కార్నర్ బాస్కెట్: పిల్లలు ఆడుకున్న బొమ్మలు లేదా ఇతరత్రా అవసరాలకు ఉపయోగించడానికి ప్లాస్టిక్ బుట్టలు లాంటివి వాడుతుంటారు. పర్యావరణ హితమైనవి, మంచి డిజైన్‌తో ఉన్న బుట్టలను కానుకగా ఇవ్వచ్చు. 7. గ్లాస్ సెట్: పానీయాలు సేవించడానికి ఉపయోగించే గ్లాస్ సెట్స్ ఎన్ని ఉన్నా భిన్నమైన ఆకృతిగల గ్లాసుల కోసం శోధిస్తూనే ఉంటారు. అందుకని, కానుకల విభాగంలో అందమైన గ్లాస్ సెట్ మంచి ఎంపిక అవుతుంది. 8. ఇండోర్ బోర్డ్ గేమ్స్: అతిథులు నలుగురు కలసిన వేళ కాలక్షేపానికి ఏం చేయాలో కొంత సమయం తర్వాత అర్థంకాదు. అలాంటప్పుడు ఇండోర్ బోర్డ్ గేమ్స్ బాగా ఉపయోగపడతాయి. ఆసక్తిగా అనిపించే పజిల్ గేమ్స్‌ను కానుకగా ఇవ్వచ్చు. 9. పండ్ల బుట్ట: పువ్వులు, పండ్లు పెట్టుకోవడానికి అందమైన డిజైన్లు గల రకరకాల బుట్టలు మార్కెట్లో లభిస్తున్నాయి. వెదురు నుంచి అన్ని రకరకాల లోహాల్లోనూ ఇవి లభిస్తుంటాయి. మన అభిరుచి అతిథులకు తెలిపేలా అందమైన పండ్ల బుట్టను కానుకగా ఇవ్వచ్చు. 10. పింగాణీ పాత్రలు/డిన్నర్‌సెట్: అతిథులకు భోజనాలు వడ్డించే సమయంలో ఉపయోగించే పింగాణీ పాత్రలు, ట్రే .. వంటివి తప్పనిసరి అవసరాలుగా ఉంటాయి. వీటినే కానుకగా అందిస్తే ఆతిథ్యం ఇచ్చేవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. కానుకల ఎంపికలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే మార్కెట్లో అనవసర వస్తువుల కోసం ఖర్చు పెట్టే విధానం కూడా తగ్గుతుంది. కానుకను తీసుకునే బంధుమిత్రుల స్థోమతను కూడా అంచనా వేసుకొని, దానికి తగినట్టు మన ఎంపిక ఉండటం ముఖ్యం అని భావించాలి. చదవండి: Mallappa Gate Story: అసలు ఎవరీమె? మనిషా.. దయ్యమా?.. అవును నేనే! -
బంధువులు ఇచ్చే బహుమతులయితే ఒకే.. లేదంటే పన్ను కట్టాల్సిందేనా ?
ప్ర. బహుమతులను ఆదాయంగా పరిగణిస్తారా? – యం. రామ్ గౌడ్, నిజామాబాద్ జ. బంధువుల నుంచి వచ్చే బహుమతులను ఆదాయంగా పరిగణించరు. అంటే, ఎటువంటి పన్ను భారం ఉండదు. కానీ స్నేహితుల నుండి తీసుకుంటే అటువంటి మొత్తాన్ని ఆదాయంగా పరిగణిస్తారు. మీరు ముందుగా బంధువు నిర్వచనాన్ని తెలుసుకోవాలి. ఒక వ్యక్తికి సంబంధించి ఈ కింది వారు బంధువుల జాబితాలోకి వస్తారు. 1. జీవిత భాగస్వామి 2. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు 3. జీవిత భాగస్వామి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు 4. తల్లిదండ్రులు, వారి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు 5. అటు తరం, ఇటు తరం వంశస్థులు (ముత్తాత, తాత, నాన్న, కొడుకు, మనవడు, మునిమనవడు) 6. జీవిత భాగస్వామి యొక్క అటు తరం, ఇటు తరం వంశస్థులు 7. (2) నుండి (7)వరకు పేర్కొన్న వారి జీవిత భాగస్వాములు బీరకాయ పీచు బంధుత్వం ఒక విధంగా చెప్పాలంటే ‘బంధువు‘ నిర్వచనం అనేది దగ్గర వాళ్లందరినీ చుట్టబెట్టేస్తుందని చెప్పాలి. ఈ పరిధి దాటి వెళ్లకండి. ఎత్తేస్తే ఏడు చెక్కలయ్యే బంధువుల దగ్గరకి, బీరకాయ.. బెండకాయ పీచు చుట్టాలు..బాదరాయణ సంబంధాల జోలికి వెళ్లకండి. ఇక బంధువుల నుంచి వచ్చేవే కాకుండా మరికొన్ని బహుమతులకు కూడా మినహాయింపు ఉంది. ఒక వ్యక్తికి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 విలువ దాటి బహుమతులు వస్తే మొత్తం విలువ మీద ఎటువంటి బేసిక్ లిమిట్ లేకుండా ఆదాయంగా భావిస్తారు. కానీ ఈ కింది సందర్భాల్లో మినహాయింపు ఉంటుంది. 1. వివాహ సందర్భంలో 2. వీలునామా ద్వారా 3. ఇచ్చే వ్యక్తి (దాత) చనిపోయే సందర్భంలో 4. స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వైద్య సంస్థలు, ట్రస్టులు మొదలైనవి ఇచ్చినవి (కొన్ని పరిమితుల మేరకు) 5.‘బదిలీ‘ కాని వ్యవహారాల నుండి వచ్చినవి అయితే, వ్యవహారం జరిపే ముందు తగిన జాగ్రత్త వహించాలి. దాత ఎవరైనా సరే మూడు విషయాలు గుర్తుంచుకోవాల్సిన విషయాలు 1. దాత ఐడెంటిటీ (డమ్మీని సృష్టించకండి) 2. ఇచ్చే విషయంలో దాత సామర్థ్యం (దాతకు నిర్దిష్ట సోర్స్ ఉండాలి) 3. వ్యవహారానికి సంబంధించి సాక్ష్యాలు, ఆధారాలు ఇవి చూపించకపోతే, స్థాపించకపోతే ఈ మొత్తాన్ని మీ ఆదాయంగా పరిగణించే అవకాశం ఉంది. ప్ర. ఆదాయపు పన్ను రిటర్నులలో ఏమేమి ఫారాలు దాఖలు చేయాలి? – మహ్మద్ ఖదీర్ బాషా, నల్గొండ జ. ఒక్క వాక్యంలో చెప్పాలంటే రిటర్నులతో పాటు ఏ కాగితం దాఖలు చేయనక్కర్లేదు. ఇప్పుడు అమలవుతున్న నియమం ప్రకారం ఎటువంటి అటాచ్మెంటు ఇవ్వనవసరం లేదు. ఆన్లైన్లో వేసినా, ఆఫ్‌లైన్‌లో వేసినా ఇదే రూలు. అయితే, మీరు ఒక స్టేట్మెంట్ తయారు చేసుకోండి. అన్ని సోర్స్‌లకు సంబంధించి ఆదాయాలు, లెక్కలు, కాగితాలు, రుజువులు, సర్టిఫికెట్లు, టీడీఎస్ పత్రాలు, ట్యాక్స్ చలాన్లు, ఫారం 16, ఫారం 16 అ, ఫారం 26 అ , ధృవపత్రాలు, కన్ఫర్మేషన్ లెటర్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు, ఈమెయిల్స్, బ్యాంకు అకౌంటు స్టేట్మెంట్లు, అగ్రిమెంట్లు, సేల్ డీడ్లు, డివిడెండు వారంట్లు .. ఇలా అవసరమైనవన్నీ భద్రపర్చుకోండి. కేసీహెచ్ ఏవీఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు చదవండి: సీనియర్ సిటిజన్లకు ‘పన్ను’ లాభాలు -
Viral Video: సర్ప్రైజ్ గిఫ్ట్.. బాలుడు గుక్కపెట్టి ఏడ్చాడు..
పెద్దవారు చిన్న పిల్లలను సంతోషపెట్టడానికి రకరకాల బహుమతులు ఇస్తుంటారు. కొందరు చాక్లెట్లు, ఆట బొమ్మలను బహుమతులుగా ఇస్తే.. మరికొందరు నచ్చిన ప్రదేశాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్లు వంటి వాటిని గిఫ్ట్‌లుగా ఇస్తుంటారు. చిన్న పిల్లలకు బహుమతులిచ్చి వారి కళ్లలో ఆనందాన్ని చూసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. కొందరు తల్లిదండ్రులు మాత్రం.. తమ పిల్లలను సర్ప్రైజ్ చేయడానికి వినూత్నంగా ఆలోచిస్తుంటారు. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో తల్లిదండ్రులు తమ పిల్లాడిని సర్ప్రైజ్ చేయాలనుకున్నారు. అతనికి కుక్కపిల్లలు (పప్పీ) అంటే ఇష్టం. అయితే, ఒకరోజు బాలుడి తల్లిదండ్రులు అతని కళ్లకు మాస్క్‌ను కట్టారు. ఆ తర్వాత.. టవల్‌తో చుట్టిన కుక్కపిల్లని.. బాలుడి చేతుల్లో ఉంచారు. మెల్లగా.. కళ్లకు కట్టిన మాస్క్ తీసేశారు. అప్పుడు బాలుడు తన చేతిలో ఉన్న కుక్క పిల్లని చూసి ఆనందంతో మురిసిపోయాడు. వావ్.. అంటూ దాన్ని తన ప్రేమతో తన బుగ్గలకు హత్తుకున్నాడు. ప్రేమతో నిమిరాడు. ఆ తర్వాత.. సంతోషంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తల్లిని పట్టుకుని గట్టిగా ఏడ్చేశాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియవు. ఈ వీడియోను పర్రెరాస్ అనే యూజర్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వావ్..ఎంత ప్రేమతో హత్తుకున్నాడు..’, ‘కుక్కపిల్ల క్యూట్‌గా ఉంది’,‘ పప్పీని బాగా చూసుకోవాలి.. మీ ఇద్దరి ఫ్రెండ్ షిప్ బాగుండాలంటూ’ కామెంట్లు పెడుతున్నారు. They surprised little man with a puppy, and I'm done for the day 🥺😢😭 🔊🔊 credit: Parreiras10 pic.twitter.com/YBHsTnLl92 — Jess💫 (@Jess_asli) November 1, 2021 -
పాపం ట్రంప్.. ఆ దేశ రాజు నకిలీ బహుమతులు ఇచ్చాడట!
సాధారణంగా దేశాధినేతలు తమ దేశంలో పర్యటిస్తే వారికి అతిథి మర్యాదలతో పాటు బహుమతులు కూడా ఇస్తుంటారు. ఈ తరహాలోనే అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సౌదీ పర్యటన చేసిన డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ రాజు ఇచ్చిన బహుమతులు తీసుకున్నారు. అయితే తాజాగా అందులో కొన్ని నకిలీవని తేలింది. బహుమతుల జాబితాలో.. పులి, చిరుత చర్మంతో చేసిన దుస్తులు, మూడు కత్తులు, మూడు బాకులు, ఇతర ఖరీదైనవి ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. 2017లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి హోదాలో సౌదీ అరేబియా సందర్శించారు. ఆ సందర్భంగా సౌదీ రాజ కుటుంబం ట్రంప్‌తోపాటు ఆయన సహాయకులకు పలు విలువైన బహుమతులను అందించింది. అయితే వారు ఆ బహుమతులను తీసుకున్నారు గానీ వాటి గురించి అప్పటి వైట్ హౌస్ సంబంధిత అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇక ప్రత్యేంగా పులి, చిరుత నమూనాలను అనుకరించేలా ఉన్న దుస్తులకు రంగు వేసినట్లు తాజాగా తేలింది. ఇదే నిజమైనవే అయితే, 1973 నాటి పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం ట్రంప్ ప్రభుత్వం అంతరించిపోతున్న జాతుల చట్టాన్ని ఉల్లంఘించిందని ఇప్పటికే ఆరోపణలు మొదలయ్యాయి. ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ కాలం ముగించే చివరి రోజు వైట్ హౌస్ ఈ బహుమతులతో పాటు వాటి వివరాలను సాధారణ పరిపాలన శాఖకు తెలియజేసింది. చదవండి: Byzantine Wine Complex:వెలుగులోకి 1,500 ఏళ్ల నాటి పురాతన వైన్ కాంప్లెక్స్ -
ఇందులో షాపింగ్ చేస్తే రూ.20 కోట్ల బహుమతులు మీ సొంతం!
సోషల్ కామర్స్ యునికార్న్ మీషో పండుగ సీజన్ నేపథ్యంలో అక్టోబర్ 6 నుంచి 9 వరకు 'మహా ఇండియన్ షాపింగ్ లీగ్' పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది. ఇప్పటికే లక్షకు పైగా కొత్త విక్రేతలను ఆన్ బోర్డ్ చేసినట్లు తెలిపింది, టైర్-2 నగరాల్లోని వినియోగదారుల నుంచి గతంతో పోలిస్తే 3 రేట్లు ఎక్కువ రోజువారీ ఆర్డర్లను ఆశిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. మీషో ఫ్లాగ్ షిప్ సేల్ సందర్భంగా ఇందులో పాల్గొనే వినియోగదారులకు రూ.20 కోట్ల విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. ప్రతి గంటకు వినియోగదారులు ఒక ప్రీమియం కారు, రూ.1కోటి నగదు రివార్డులు, రూ.15 కోట్ల విలువైన మీషో క్రెడిట్లు, బంగారు నాణేలు, రూ.2 కోట్లకు పైగా విలువైన ఇతర బహుమతులను గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. దేశంలోని టైర్-2 నగరాల నుంచి భారీగా ఆన్ లైన్ షాపింగ్ కు డిమాండ్ రావడంతో ఆ ప్రాంతాల్లోని వినియోగదారులకు చేరువ కావడం కోసం అనేక ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టినట్లు మీషో పేర్కొంది. 'మీషో' కామర్స్ సప్లయర్స్, రీసెల్లర్స్, కస్టమర్స్ అనే విభాగాలుగా నడుస్తోంది. ఇందులో నమోదైన రీసెలర్లు సరఫరా దారుల నుంచి అన్ బ్రాండెడ్ ఫ్యాషన్, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. వాటికి బ్రాండింగ్ ఇచ్చి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా విక్రయిస్తారు.(చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీ బుకింగ్స్ మళ్లీ ఓపెన్!) సోషల్ మీడియా ద్వారానే కాకుండా నేరుగానూ మీషో భారీగా విక్రయాలు చేపట్టి ఫేస్బుక్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సంస్థలకు పోటీగా మారింది. క్రీడలు, క్రీడా సామగ్రి, ఫిట్నెస్, పెట్ సప్లైయిస్, ఆటోమోటివ్ పరికారాలనూ మీషో విక్రయిస్తుండటం గమనార్హం. ఇందులో చాలా తక్కువ ధరకు ఉత్పత్తుల దొరకడంతో చాలా మందికి చేరువ అయ్యింది. ఈ-కామర్స్ సంస్థలకు పోటీగా ఈ సోషల్ కామర్స్ ఎదుగుతోంది. దాంతో 2022 డిసెంబర్ నాటికి నెలకు వంద మిలియన్ల లావాదేవీలు చేసే వినియోగదారులను సంపాదించుకోవాలని భావిస్తోంది. టెక్నాలజీ, ప్రొడక్ట్ టాలెంట్ తదితర విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. 2021, సెప్టెంబర్ 27 నాటికే మీషో భారత్‌లో అతిపెద్ద సోషల్ కామర్స్ వేదికగా ఆవిర్భవించింది. 1.3 కోట్ల రీసెల్లర్స్, 4.5 కోట్ల వినియోగదారులు, లక్షకు పైగా సరఫరా దారులు ఉన్నారు. -
నా కానుకల ఈ–వేలంలో పాల్గొనండి: మోదీ
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా తనకు వచ్చిన కానుకలు, మెమెంటోలను ఈ–వేలం వేస్తున్నామని అందులో పాల్గొని కొనుగోలు చేయాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ బహుమతులు అమ్మగా వచ్చిన డబ్బులన్నీ గంగానదిని ప్రక్షాళనకు ఉద్దేశించిన నమామి గంగే ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ట్వీట్ చేశారు. ‘‘గత కొద్ది ఏళ్లుగా నాకు ఎందరో ఎన్నో కానుకలు ఇచ్చారు. మన ఒలింపిక్ హీరోలు ఇచ్చిన ప్రత్యేక మెమొంటోలు, వారు వాడిన వస్తువులు కూడా ఉన్నాయి. వాటిని ఆన్లైన్ ద్వారా వేలం వేస్తున్నాం. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొనండి. ఈ–వేలంలో వచ్చిన డబ్బుల్ని గంగానది శుద్ధి చేయడానికి వినియోగిస్తాం’’ అని ప్రధాని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. Over time, I have received several gifts and mementos which are being auctioned. This includes the special mementos given by our Olympics heroes. Do take part in the auction. The proceeds would go to the Namami Gange initiative.https://t.co/Oeq4EYb30M pic.twitter.com/PrF44YWBrN — Narendra Modi (@narendramodi) September 19, 2021 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజుని పురస్కరించుకొని సెప్టెంబర్ 17న కేంద్ర సాంస్కృతిక శాఖ కానుకలు వేలం వెయ్యడం మొదలు పెట్టింది. అక్టోబర్ 7 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ వేలంలో వ్యక్తులు, సంస్థలు ఎవరైనా సరే http://pmmementos.gov.in అనే వెబ్సైట్ ద్వారా వేలంలో పాల్గొనవచ్చు. -
‘అమ్మాయిలూ మీరు పతకం తేండి.. ఇల్లు.. కారు నేనిస్తా’
అహ్మదాబాద్: ఒలింపిక్స్ పోటీల్లో భారతీయ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు వీరోచితంగా పోరాడుతున్నారు. ఇప్పటివరకు ఐదు పతకాలు రాగా వాటిలో మూడు అమ్మాయిలు సాధించినవే. తాజాగా ఈ పోటీల్లో భారత మహిళల హాకీ జట్టు ఆశలు కల్పిస్తోంది. సెమీ ఫైనల్‌కు వెళ్లిన రాణి జట్టు ఎలాగైనా పతకం సాధించాలనే పట్టుతో ఉంది. ఇప్పటికే పురుషుల హాకీ జట్టు నాలుగు దశాబ్దాల అనంతరం ఒలింపిక్ పతకం సొంతం చేసుకుంది. ఇప్పుడు మహిళలపై ఆశలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ఆ అమ్మాయిలకు నగదు ప్రోత్సహాకాలు, కానుకల ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా గుజరాత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి, హెచ్‌కే గ్రూప్ అధినేత సావ్జీ ఢోలాకియా అమ్మాయిల హాకీ జట్టుకు వరాలు ప్రకటించారు. ‘మీరు పతకం తీసుకురండి.. మీకు ఇల్లు లేదా కారు ఇస్తా’ అని ప్రకటించారు. అమ్రేలీ జిల్లాలోని ధుహల గ్రామానికి చెందిన ధోలాకియా హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ ప్రారంభించి ప్రస్తుతం రూ.7 వేల కోట్ల టర్నోవర్ పొందుతున్నారు. మొదటిసారి మహిళల జట్టు సెమీ ఫైనల్‌కు చేరింది. 130 కోట్ల భారతీయుల కలను మోస్తున్నారు. నేను వారికి అందించే ఇది చిన్న సహాయం. ఇది వారి నైతిక సామర్థ్యం పెంపునకు.. ప్రోత్సాహానికి దోహదం చేస్తుందని భావిస్తున్నా. రజత పతక విజేత మీరాబాయి చానును స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలిపారు. అతి చిన్న ఇంట్లో ఉంటూనే చాను ఒలింపిక్స్‌లో పతకం సాధించింది. ఈ నేపథ్యంలోనే హాకీ క్రీడాకారులకు రూ.11 లక్షలు ఇంటి నిర్మాణం కోసం ఇస్తున్నట్లు ధోలాకియా వివరించారు. ఇల్లు వద్దనుకునే వారికి కారు కొనుగోలు కోసం రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతోపాటు తన స్నేహితుడు డాక్టర్ కమలేశ్ డేవ్ ప్రతీ క్రీడాకారుడికి రూ.లక్ష నగదు బహుమతి ఇచ్చేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ధొలాకియా తన సంస్థలోని ఉద్యోగులను కుటుంబసభ్యుల్లాగా చూసుకుంటారు. ప్రతి దీపావళికి ఉద్యోగులకు భారీ కానుకలు ఇస్తుంటారు. చాలాసార్లు ఉద్యోగులకు ఖరీదైన కార్లు, ఆభరణాలు, ప్లాట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. The group has also decided to award others (who have a house) with a brand-new car worth Rs 5 lakhs if the team brings home a medal. Our girls are scripting history with every move at Tokyo 2020. We’re into the semi-finals of the Olympics for the 1st time beating Australia. — Savji Dholakia (@SavjiDholakia) August 3, 2021 -
అరరే ఫ్రెండ్స్ దగ్గరకు ఖాళీ చేతులతో ఎలా..? ఇలా ట్రై చేయండి..
‘‘ఈ రోజైనా ఫ్రెండ్‌ని కలిసి కాసేపైనా కబుర్లతో గడిపేద్దామంటే పనులు తెమలవు’’ ‘‘నా చేతులతో నేనే మంచి గిఫ్ట్ తయారు చేయాలనుకున్నాను. కానీ, సమయం లేదు’’ ‘‘చాలా రోజుల తర్వాత ఫ్రెండ్‌ను కలుస్తున్నాను, ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది...’’ ఇలాంటి ఎన్నో ఆలోచనలు ఈ స్నేహితుల రోజున మదిని ముసురుతుంటాయి. కొన్నిసార్లు స్నేహితులను కలవడానికి వెళ్లి చివరి నిమిషంలో ‘అరరే, ఖాళీ చేతులతో కాకుండా ఏదైనా గిప్ట్‌తో వచ్చుంటే బాగుండేది’ అనుకుంటుంటారు. తెలిసినవీ, చిన్న చిన్నవే అయినా కొన్నిసార్లు వాటినీ మర్చిపోతుంటాం. ఇలాంటప్పుడు కొద్ది సేపట్లో కలవబోయే ఫ్రెండ్‌ను కూడా ఖుష్ చేయాలంటే ఈ సింపుల్ గిప్ట్ ఐడియాస్‌ను అమల్లో పెట్టేయచ్చు. చేతితో అద్భుతం.. కొన్ని గంటల సమయం ఉంటే మీ చేతులతో ఓ అందమైన గ్రీటింగ్ కార్డును తయారుచేయండి. కొద్దిగా సమయం ఉంటే గ్రీటింగ్ కార్డు కొనేయండి. అదీ లేదంటే, మీ చేతిలో ఓ తెల్లని కాగితం, పెన్ను ఉంటే చాలు. మీ చేతి రాతతో మీ ఫ్రెండ్ మీకెంత ప్రత్యేకమో తెలియజేస్తూ కొన్ని వాక్యాలు రాయండి. మీ ఫ్రెండ్‌కు మీలోని భావన అర్థమైపోతుంది. మనసు ఆనందంతో నిండిపోతుంది. ఆన్లైన్ ద్వారా పంపాలనుకుంటే నచ్చిన కార్డును ఎంపిక చేసుకొని, దాని మీద మీదైన నోట్ రాసి, సెండ్ చేస్తే.. అవతలి మీ ఫ్రెండ్‌కు మీ మనసు దగ్గరైపోతుంది. చిట్టి టెడ్డీబేర్ యువతరం అయినా, పెద్దవాళ్లైనా టెడ్డీబేర్ అంటే చాలు వారి మనసులు చిన్నపిల్లల్లా గంతులు వేస్తాయి. మనస్పర్ధల కారణంగా కొద్దికాలంగా దూరంగా ఉన్న స్నేహితుల హృదయాలు కూడా స్నేహంగా కలిసిపోయినట్టుగా ఉండే హగ్ టెడ్డీబేర్‌ను చూస్తే కరిగిపోతాయి. ఇవి వివిధ రంగుల్లో రకరకాల పరిమాణాల్లో లభిస్తున్నాయి. మీ క్లోజ్ ఫ్రెండ్‌ను ఈ కానుక మరింత ఆకట్టుకుంటుంది. పెద్ద ఖర్చు కూడా ఉండదు. తియ్యటి స్నేహం ఫ్రెండ్‌కి ఏ బహుమతి నచ్చుతుందో ఏంటో అనే సందేహంలో ఉంటే మాత్రం చాక్లెట్లు మిమ్మల్ని రక్షిస్తాయి. ఏ చాక్లెట్ అయినా చాలా వరకు అందరికీ నచ్చుతాయి. అందుకే, మంచి చాక్లెట్‌ను ఈ రోజున కొన్ని నిమిషాల వ్యవధిలో గిఫ్ట్‌గా ఎంచుకోవచ్చు. బంధనం తమ మధ్య స్నేహ బంధం ఎప్పటì కీ నిలిచిఉంటుందని చెప్పడానికి గర్తుగా బంధనం కట్టుకుంటారు. అందుకు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఎన్నో వెరైటీలలో మార్కెట్లో ఉన్నాయి. మీకై మీరుగా రంగుల నూలు దారం, పూసలను ఉపయోగించి కూడా బ్యాండ్‌ను తయారు చేసుకోవచ్చు. మహమ్మారి కారణంగా దూరాన ఉన్న దోస్తానాలకు ఆన్లైన్ వారధిగా నిలుస్తుంది. చిన్న సందేశం, చేరవేసే కానుక ఎన్నో మైళ్ల దూరాన ఉన్న ఫ్రెండ్స్‌కు దగ్గరే ఉన్నామనే ఆలోచన వెయ్యేనుగుల బలాన్నిస్తుంది. పువ్వుల పరిమళం తాజా పువ్వులు ఎవరినైనా కాసేపు చిరునవ్వులో ముంచెత్తుతాయి. అందుకే తాజా పుష్పగుచ్ఛాన్ని కానుకగా ఇవ్వడం వల్ల స్నేహం కూడా ఎల్లప్పుడూ అంతే పరిమళ భరితంగా కొనసాగుతుంది. దూరాన ఉన్నాం, కలవలేం అనుకునేవారి కోసం ఆన్లైన్లో ఫ్రెండ్షిప్ డే ఫ్లవర్స్ డెలివరీ దేశమంతటా ఉంది. అర్ధరాత్రికి కూడా డోర్‌డెలివరీ సదుపాయాలు ఉన్నాయి. ఎక్కువ కాలం మన్నేవి, డిజైన్ చేసిన పుష్పగుచ్చాలు కూడా ఎంపిక చేసుకోవచ్చు. నేరుగా కలుసుకునే ఫ్రెండ్‌కి ఇంట్లో పూసిన కొన్ని పువ్వులను గుచ్ఛంలా తీసుకెళ్లి అందించవచ్చు. ఒకే ఒక కేక్ ట్రీట్ ఫ్రెండ్స్‌తో కలిసి ఒక కేక్‌ను కట్ చేసి, పంచుకుంటే చాలు అప్పుడిక ఆనందానికి ఆకాశమే హద్దులా అనిపిస్తుంది. అందుకు, చాక్లెట్ కేక్, ఫ్రూట్ కేక్, నట్ కేక్.. ఎన్నో వెరైటీలు ఉన్నాయి. ఆన్లైన్ కేక్ సేవలూ ఈ రోజుల్లో అందుబాటుల్లో ఉన్న విషయం తెలిసింది. -
కొత్త కోడలికి మెట్టుకో గిఫ్ట్
-
ఆత్మీయ ఆహ్వానం.. కొత్త కోడలికి మెట్టుకో గిఫ్ట్
వరకట్న పిశాచి మన సమాజంలో ఎందరు ఆడవాళ్లని బలి తీసుకుందో లెక్కేలేదు. భార్య తల్లిదండ్రులంటేనే నడిచే ఏటీఎంలా కనిపిస్తారు కొందరు భర్తలకు. పెళ్లికి ముందే భారీగా కట్నం తీసుకున్నప్పటికి వారి ధనదాహం తీరదు. వివాహం తర్వాత కూడా అదనపు కట్నం తేవాల్సిందిగా వేధింపులకు గురి చేస్తారు. చిత్రహింసలు పెట్టి.. చివరకు ప్రాణాలు తీస్తారు. అత్తమావలు, ఆడపడుచు, భర్తతో సహా అత్తింటివారందరూ ఆమెను కట్నం కోసం వేధింపులకు గురి చేస్తారు. అయితే అందరు ఇలానే ఉంటారు అనుకుంటే పొరపాటే. కొడలిని, కూతురుతో సమానంగా చూసే అత్తింటివారుంటారు. కోడలి నుంచి కట్నం ఆశించడం కాదు.. కన్నవాళ్లని విడిచిపెట్టి.. తమకోసం వచ్చిన కోడలికి.. బదులుగా బహుమతులు ఇచ్చే వారు కూడా ఉంటారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ సంఘటన మన తెలుగు రాష్ట్రాల్లోనే చోటు చేసుకుంది. అయితే ఎక్కడ అనే వివరాలు మాత్ర లేవు. ఇక వివాహం చేసుకుని.. తమ ఇంట్లోకి అడుగుపెడుతున్న కొత్త కోడలికి జీవితాంతం గుర్తుండిపోయే రీతిలో అద్భుతంగా స్వాగతం పలికారు ఈ అత్తింటివారు. మేళతాళాలతో నూతన దంపతులను ఇంట్లోకి ఆహ్వానించారు. ఆ తర్వాత ఇంట్లోకి అడుగుపెడుతున్న కోడలికి మెట్టుకొక బహుమతిచ్చారు. ఇక పెద్ద మెట్టు మీద ఏకంగా 50 వేల రూపాయల నగదు ఇచ్చారు. ఈ ఆత్మీయ ఆహ్వానానికి సదరు పెళ్లి కుమార్తె భావోద్వేగానికి గురైంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో నిజమా కాదా తెలియదు కానీ ఇంత మంచి అత్తింటివారు దొరికిన ఆ అమ్మాయి అదృష్టవంతురాలు.. అందరు మీలానే ఆలోచిస్తే.. ఇక ఈ లోకంలో ఆడపిల్లలను వద్దునుకునే తల్లిదండ్రులే ఉండరు అని ప్రశంసిస్తున్నారు. -
ప్రపోజ్ కోసం, ఎంతటి రిస్కు అయినా ఓకే!
ప్రేమికులు ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్ డేగా జరుపుకుంటారు. అయితే ఈ వారం రోజులను సంబరంగా చేసుకుంటారు. ఈ వారంలో వచ్చే రోజుకు ఒక్కో స్పెషాలిటీ ఉంది. అలా రోజ్ డేతో మొదలయ్యే ప్రేమికుల హుషారు వాలేంటైన్స్ డేతో ముగుస్తుంది. ఫిబ్రవరి 7ను రోజ్ డే జరుపుకున్న ప్రేమికులు, ఈ రోజు ప్రపోజ్ డే జరుపుకుంటారు. ప్రేమించడం ఒక ఆర్ట్ అయితే ప్రేమను వ్యక్తం చేయడం మరో గొప్ప ఆర్ట్..! ఎలా ప్రపోజ్ చేస్తారో తెలుసుకుందాం.. ప్రేమించిన వారికి ఏ గిఫ్ట్ ఇస్తే ఇంప్రెస్ అవుతారో అని ఆలోచిస్తూ నానాతంటాలు పడుతుంటారు చాలా మంది. ఇందుకోసం గ్రీటింగ్ కార్డులు, చాక్లెట్లు, గిఫ్ట్‌లు , పువ్వులు ఇలా రకారకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రేమికుల మోటో మాత్రం ఒక్కటే.. వీటిలో ఏదైనా వారికి సర్ప్రైజ్ అందించి మనసులో ఉన్న ప్రేమను చాటుకుంటారు. ఇందుకోసం ప్రేమించిన వారిని అనుసరించడం, వారి మిత్రులను కలవడం, వారి అభిరుచులు తెలుసుకోవడం వంటి చిన్నపాటి పోరాటాలు కూడా చేస్తారు. చివరికి వారికి నచ్చింది ఇచ్చి, ఆ కళ్లలో ఆనందం చూసి, వరల్డ్ కప్ గెలిచినంత సంబరపడతారు. అయితే ఈ ప్రపోజ్‌డేను కొత్తగా ప్రేమికులే కాకుండా , ఇప్పటికీ ప్రేమించి పెళ్లిచేసుకున్న దంపతులు ఈ రోజు ఒకరికొకరు ప్రత్యేక బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా చేయడం వల్ల వారి మధ్య బంధం మరింత దృఢపడుతుందని నమ్ముతారు. సాహసాలకు సిద్ధపడతారు.. మొదటిసారిగా ఇద్దరూ కలుసుకున్న చోటులో కొంత మంది ప్రేమికులు ప్రపోస్ చేస్తే, మరికొందరు టీ-షర్ట్‌మీద ఆక్సెప్ట్ మై లవ్ అని రాసుకొని ప్రేమికుల ఎదుట వాలిపోతారు. ఒక్కోసారి తమకు తామే ఒక బహుమతిగా మారిపోయి గిఫ్ట్ బాక్స్‌గా తమ వారి దగ్గరికి వెళతారు. తమదైన శైలిలో ప్రేమ విషయం చెప్పేందుకు మరికొందరు జూలియట్లు ప్రేమించిన వారి వివరాలు తెలుసుకునేందుకు సాహసాలకు సిద్ధపడతారు. ఆక్రమంలో చుట్టుపక్కల వారితోను, మిత్రులతోను చివాట్లు కూడా తింటారు. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రేమికుల సమాచారం సేకరించి వారికి ఇష్టమైంది బహుమతిగా ఇవ్వడానికి ఆరాటపడతారు. -
కథ క్లైమాక్స్‌కి వచ్చింది
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ దర్శకుడు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. శనివారంతో 30 రోజుల షెడ్యూల్‌ను పూర్తి చేశారట చిత్రబృందం. దీంతో షూటింగ్ క్లైమాక్స్‌కి వచ్చేసింది. ఇంకొక్క షెడ్యూల్ చిత్రీకరణతో ‘రాధేశ్యామ్’ షూటింగ్ మొత్తం పూర్తి కానుందని తెలిసింది. అలానే ఈ సినిమా క్లైమాక్స్ ఓ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. సుమారు 15 నిమిషాల పాటు సాగే ఈ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటాయట. ఇటీవలే ‘రాధేశ్యామ్’ చిత్రబృందానికి చేతి గడియారాలను బహుమతిగా అందించారు ప్రభాస్. ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
‘రాధేశ్యామ్’ టీమ్‌కి ప్రభాస్ సర్ప్రైజ్!
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ మూవీ షూటింగ్‌ని త్వరగా ముగించాలని తీవ్రంగా కృషి చేస్తున్న చిత్ర యూనిట్‌కి డార్లింగ్ ప్రభాస్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడట. సినిమా కోసం పని చేస్తున్న వారందరికీ చేతి వాచ్‌లు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వాచ్లకు సంబంధించిన ఫొటోలను ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇక రాధేశ్యామ్ సినిమా ఈ ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం.. ఆదిపురుష్, రాధేశ్యామ్, నాగ అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా, కేజీఎఫ్ దర్శకుడితో సలార్ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. శుక్రవారం ఈరోజు 'సలార్' షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. #Prabhas Gift To RadheShyam Team Members 💥🤩 Darling For A Reason ❤️🙏#RadheShyam#SalaarLaunch pic.twitter.com/HGxQyalVpO — Fukkard (@fukkarddd) January 14, 2021 Super 🥳#Prabhas gifted watches to #RadheShyam Team members ❤️ pic.twitter.com/XVda4Fx5iB — Sai Prasad (@Saiprasad_drlng) January 14, 2021 -
శాంటా క్లాజ్ గిప్ట్స్ : ఊహించని విషాదం
క్రిస్మస్ శాంటా క్లాజ్ నుంచి కానుకలు అందుకున్న వారి జీవితాల్లో భారీ విషాదం అలుముకుంది. ఉత్సాహంగా బహుమతులందుకున్న వారిలో 18 మంది కరోనాకు బలయ్యారు. ముఖ్యంగా బహుమతులను పంచిన శాంటాకి అప్పటికే కరోనా సోకింది. కానీ ఈ విషయాన్ని గమనించని శాంటా వృద్ధాశ్రమంలో గిఫ్ట్‌లను అందించారు. ఈ అజాగ్రత్తే బెల్జియంలోని ఒక హెమ్పాలిట పీడకలగా మారి పోయింది. యాంట్వెర్ప్ అనే వృద్ధాశ్రమం వారు అక్కడి వృద్ధులకు క్రిస్మస్ సంబరాల్లో భాగంగా శాంటాను పిలిచారు. దీనికోసం అక్కడి వృద్ధాశ్రమంలో వారి ఆరోగ్య సంరక్షణ చూసుకునే డాక్టర్నే శాంటా క్లాజ్‌గా వ్యవరించారు. అయితే అతనికి అప్పటికే కరోనా సోకడంతో అతని నుంచి బహుమతులు అందుకున్న అందరికీ వైరస్ వ్యాప్తి చెందింది. ఈ 'సూపర్ స్ప్రెడర్' కారణంగా కేర్ హోమ్‌లోని 121 మందితోపాటు అక్కడి 36 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. వీరిలో18 మంది ప్రాణాలు కోల్పోవడం మరింత విషాదాన్ని నింపింది. మరోవైపు శాంటా వచ్చినప్పుడే అతని ఆరోగ్యం బాగాలేదని, అయితే తనకు కరోనా సోకిన విషయం డాక్టర్‌కు, తమకూ తెలియదని వృద్ధాశ్రమ నిర్వాహకులు వాపోతున్నారు. అయితే వృద్ధులకు బహుమతులు ఇచ్చే సమయంలో కరోనా సంబంధిత నిబంధనలను పాటించలేదని నగర మేయర్ విమ్ కేయర్స్ చెబుతున్నారు. మిగిలిన బాధితులు కోలుకుంటున్నారనీ, కానీ రానున్న 10 రోజులు మరింత కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. -
తోషఖానా : సుష్మా స్వరాజ్‌దే భారీ గిఫ్ట్
సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ పర్యటనల సందర్భంగా దేశ ప్రధానమంత్రి విదేశాంగమంత్రులు, ఇతర అధికార ప్రతినిధులకు అందించే బహుమతులు, గౌరవసూచికగా ఇచ్చే కానుకల రూపంలో కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో 17.7 కోట్ల రూపాయలు ప్రభుత్వనిధి తోషఖానాకు చేరాయి. వీటిలో దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు లభించిన కోట్ల రూపాయల బంగారు, వజ్రాల ఆభరణాల బహుమతి అతివిలువైనదిగా నిలిచింది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన ఈ ఆరు సంవత్సరాల కాలంలో 230మందికి పైగా వ్యక్తులు 2,800 బహుమతులు అందుకోగా, వీటి విలువ సుమారు 17.74 కోట్ల రూపాయలు. సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు 2019లో ఆమెకిచ్చిన 6.7 కోట్ల విలువైన వెండి వజ్రాల పచ్చ ఆభరణాల సెట్ ఈ కాలానికి అత్యంత ఖరీదైన బహుమతిగా నిలిచింది. అలాగే 2015లో ప్రధాని మోదీ అందుకున్న 35 లక్షల విలువైన, హారము, చెవిపోగులు పెట్టె చాలా ఖరీదైన వాటిల్లో ఒకటిగా నిలిచింది. సాధారణంగా దేశ ప్రధానమంత్రి లేదా విదేశాంగ మంత్రికి ఖరీదైన బహుమతులు లభిస్తాయి. కానీ 2018-2019 కాలంలో కోట్ల విలువైన వజ్రాల గడియారాలతో చాలామంది అధికారులు టాప్ లో నిలిచారు. మంత్రులు, బ్యూరోక్రాట్ల తమ తమ విదేశీ పర్యటన సందర్భంగా మెమెంటోలు, సాంస్కృతిక కళాఖండాలు, పెయింటింగ్‌లు, ఫోటోలు, గాడ్జెట్లు, చీరలు, కుర్తాలతోపాటు మద్యం కూడా బహుమతిగా అందుకున్నారు. ముఖ్యంగా పాలరాయి రాయిపై మోదీ బొమ్మ, హిందీలో పద్యం వంటి వ్యక్తిగతీకరించిన బహుమతి కూడా ఉంది. అంతేకాదు 2014 నుండి తోషాఖానాకు చేరిన వాటిలో రహస్య ఇంటెలిజెన్స్ ఫైల్స్, పశ్చిమ బెంగాల్ నజాఫీ రాజవంశానికి చెందిన 18 వ శతాబ్దపు కత్తి, మహాత్మా గాంధీ డైరీ నుండి ఒక ఫ్రేమ్డ్ పేజీ, గాంధీ చిత్రాలు, అంతర్జాతీయ క్రికెట్ జట్టు ఆటోగ్రాఫ్ చేసిన క్రికెట్ బ్యాట్,బంతి, ఇత్తడి కంటైనర్‌లో నింపిన మానస సరోవర్ పవిత్ర జలం, బుల్లెట్ ట్రైన్ నమూనా, వెండి ఎద్దుల బండి ఉండటం విశేషం. సాంప్రదాయం ప్రకారం విదేశీ సందర్శనల సమయంలో దేశానికి చెందిన ముఖ్య ప్రతినిధులు అందుకున్న బహుమతులు నేరుగా ప్రభుత్వనిధి తోషాఖానాకు వెళతాయి. ఖరీదైన ఆభరణాలు, గడియారాల, కళాఖండాలు, గాడ్జెట్లు ఇతర వస్తువులు ఈ కోవలో ఉంటాయి. తోషాఖానా వెల్లడించిన డేటా ప్రకారం జూన్ 2014 - ఫిబ్రవరి 2020 మధ్య లభించిన బహుమతులలో 61శాతం 5,000 కంటే తక్కువ విలువైనవి కాగా, ఒక లక్ష లేదా అంతకంటే ఎక్కువ విలువైనవి 4శాతం. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ 650కి పైగా గిఫ్ట్ లు అందుకోగా, ఆ తరువాత వరుసలో సుష్మ స్వరాజ్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు. అయితే వీటికి సంబంధించిన వివరాలకు సమాచార హక్కు నుంచి మినహాయింపు నివ్వడంతో అందుబాటులో లేవు. -
పుట్టిన రోజున పిల్లలకు కానుక
‘మీరు డిక్షనరీని చాలా చిన్నచూపు చూస్తారు. మీ రచనలు చదువుతుంటే డిక్షనరీ చూడాల్సిన అవసరం ఏర్పడదు. డిక్షనరీ మీద మీకెందుకంత విముఖత’ అని ఒకసారి సరదాగా శశి థరూర్ సుధామూర్తిని అడిగారు. శశి థరూర్ జటిలమైన ఇంగ్లిష్ పదాలు వాడి అందరి చేత డిక్షనరీ పట్టిస్తాడన్న సంగతి తెలిసిందే. దానికి సుధామూర్తి జవాబు ఇస్తూ ‘భారతదేశంలో చాలామంది పది, ఇంటర్ చదువు చదివినవాళ్లు. అంతవరకే చదివిన ఆడవాళ్లు ఎప్పుడూ నా దృష్టిలో ఉంటారు. నా పుస్తకాలు చదివి వారు అర్థం కాలేదు అనుకోవడానికి వీల్లేకుండా సామాన్యమైన భాషలో నేను రాయడానికి ఇష్టపడతాను’ అన్నారు. ఇన్ఫోసిస్ మూలస్తంభాలలో ఒకరైన సుధామూర్తి ఆ రంగంతోపాటు రచనారంగంలో కూడా కృషి చేసి అభిమానులను సంపాదించుకున్నారు. ఇంగ్లిష్‌లో దాదాపు పాతికపుస్తకాలు , కన్నడంలో పదిహేను పుస్తకాలు వెలువరించారామె. అవి ఇతర భారతీయ భాషల్లో కూడా విస్తృతంగా అనువాదం అయ్యాయి. ఇప్పుడు తన 70వ జన్మదినం సందర్భంగా పిల్లలకు కానుకగా ఒక కథల పుస్తకం వెలువరించాలని నిర్ణయించారు. పెంగ్విన్ ప్రచురించనున్న ఈ పుస్తకం పేరు ‘గ్రాండ్‌పేరెంట్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్’. ‘లాక్డౌన్ మొదలెట్టినప్పటి నుంచి నాకు ఒకటే ఆలోచన. నా చిన్నప్పుడు ఈ కరోనా వచ్చి ఉంటే నేను ఏం చేసి ఉండేదాన్ని... కచ్చితంగా బోర్ అయి ఉండేదాన్ని... తప్పకుండా మా అమ్మమ్మ తాతయ్యల దగ్గరకు వెళ్లి కథలు విని ఉండేదాన్ని. ఇప్పుడు కూడా ఇలాంటి సమయంలో పిల్లలు కథలు వినడానికే ఇష్టపడతారు. వారి కోసం కథలు రాస్తే బాగుంటుందని రాశాను’ అన్నారు సుధామూర్తి. లాక్డౌన్లో ఆమె పిల్లల కథలు రాయడం మొదలుపెట్టి మొత్తం 20 కథలు రాశారు. అడవులు, సరోవరాలు, వింతలూ విడ్డూరాలు ఉండే ఈ కథలు అమ్మమ్మ, తాతయ్యలు కథలు చెప్తూ ఉంటే ఎలా ఉంటాయో అలాంటి ధోరణిలో ఉంటాయి. ప్రతికూల కాలంలో కూడా ఇష్టమైన వ్యాపకంలో మునిగి ఉంటే అవి ఫలవంతమై సంతృప్తినిస్తాయి అనడానికి కూడా సుధామూర్తి ఒక ఉదాహరణ. లాక్‌డౌన్‌కు ముందు సుధామూర్తి ‘గ్రాండ్మా బ్యాగ్ ఆఫ్ స్టోరీస్’ తెచ్చారు. ఈ పుస్తకం దాని కొనసాగింపు అనుకోవచ్చు. వచ్చే నెలలో ఇది విడుదల కానుంది. పిల్లలకు ఒక అమ్మమ్మ కానుక అనుకోవచ్చు. -
ట్రంప్ దంపతులకు సీఎం కానుకలు
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులతోపాటు కూతురు ఇవాంకకు సీఎం కేసీఆర్ కానుకలు అందించనున్నారు. ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి మంగళవారం రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ప్రత్యేక ఆహ్వాని తుడిగా కేసీఆర్ హాజరుకాను న్నారు. ఇందుకోసం ఆయన మంగళ వారం ఢిల్లీ వెళ్లనున్నారు. కార్య క్రమంలో ఆయన ట్రంప్‌కు పోచంపల్లి శాలువా కప్పి చార్మినార్ మెమెంటో అందించనున్నారు. మెలానియా, ఇవాంకలకు పోచంపల్లి, గద్వాల చీరలను బహూకరించనున్నారు. -
క్రిస్మస్ కానుకలు సిద్ధం
సాక్షి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ కానుకలను సిద్ధం చేసింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో వెయ్యి కుటుంబాలకు గిఫ్ట్ ప్యాకెట్లను అందజేయాలని, క్రిస్మస్ రోజు వారికి విందు ఏర్పాటు చేయాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాలు ఉండగా.. ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున నాలుగు వేల గిఫ్ట్ ప్యాక్‌లను అధికారులు సిద్ధం చేశారు. ఒక్కో మనిషికి రూ.200 వెచ్చించి విందు భోజనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతను చర్చి పాస్టర్లకు అప్పగించారు. చర్చికి వచ్చే సభ్యుల్లో రేషన్‌కార్డుల ఆధారంగా నిరుపేదలను గుర్తించి వారిని లబ్ధిదారుల జాబితాలో నమోదు చేసి మైనార్టీ సంక్షేమ శాఖకు పంపించారు. ఈ మేరకు క్రిస్మస్ పండుగ కిట్లతోపాటు విందు భోజనం ఏర్పాట్లపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇటీవల కలెక్టరేట్లో క్రైస్తవ మతపెద్దలతో సమీక్ష నిర్వహించి పండుగ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచి బతుకమ్మ పండుగకు చీరలు, రంజాన్‌కు దుస్తుల పంపిణీ చేసి ఇఫ్తార్ విందులు, క్రైస్తవులకు కానుకలను అందజేస్తోంది. ప్రభుత్వం 2014 నుంచి ఈ ఆనవాయితీని కొనసాగిస్తుండగా.. ఈసారి కూడా క్రిస్మస్కు వాటిని అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కొత్త దుస్తులు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక చీర, జాకెట్, ప్యాంట్, చొక్కా, చుడీదార్ డ్రెస్మెటీరియల్స్తో కూడిన గిఫ్ట్ ప్యాక్‌లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గానికి వెయ్యి కిట్లు.. జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాలు ఉండగా ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున నాలుగు వేల గిఫ్ట్ ప్యాక్‌లను సిద్ధం చేసి పంపించారు. గిఫ్ట్ ప్యాక్‌లు పొందే లబ్ధిదారులకు క్రిస్మస్ రోజున నియోజకవర్గాల్లో విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్కరికి రూ.200 వెచ్చించి విందు భోజనం ఏర్పాటు చేయాలని, వెయ్యి మందికి రూ.2 లక్షలు వెచ్చించాలని నిర్ణయించారు. నేటి నుంచి పంపిణీ.. చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు, కొడిమ్యాల మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేతుల మీదుగా బుధవారం క్రైస్తవులకు కానుకలు అందజేయనున్నారు. ఈ నెల 21న కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, హుజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతుల మీదుగా క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీకి నిర్ణయించారు. క్రిస్మస్ రోజు ఏర్పాటు చేసే విందు భోజనాల కార్యక్రమంలో కూడా వీరు క్రైస్తవ మతపెద్దలు, ఇతర మతాలకు చెందిన పెద్దలు పాల్గొంటారు. చర్చి పాస్టర్ల ద్వారా లబ్ధిదారుల ఎంపిక... నియోజకవర్గానికి వెయ్యి మంది లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను చర్చి పాస్టర్లకు అప్పగించారు. చర్చికి వచ్చే సభ్యుల్లో రేషన్‌కార్డుల ఆధారంగా నిరుపేదలను గుర్తించి వారిని లబ్ధిదారుల జాబితాలో నమోదు చేసి మైనార్టీ సంక్షేమ శాఖకు పంపించారు. కరీంనగర్‌లోనే 28 వేల మంది క్రైస్తవులు ఉండగా జిల్లా వ్యాప్తంగా వీరి సంఖ్య 50 వేల వరకు ఉంటుందని మత పెద్దలు పేర్కొంటున్నారు. వీరిలో అత్యధికులు నిరుపేదలు కాగా ప్రభుత్వం నాలుగు వేల మందికి మాత్రమే క్రిస్మస్ కానుకలు అందించి విందు భోజనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై క్రైస్తవుల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతోంది. అన్ని ఏర్పాట్లు చేశాం క్రిస్టియన్ మైనార్టీలకు పంపిణీ చేసేందుకు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు గిఫ్ట్‌ప్యాకెట్లు సిద్ధం చేశాం. ప్రతీ నియోజకవర్గంలో వెయ్యి మంది నిరుపేద క్రైస్తవులను ఎంపిక చేశాం. పేదరికంలో ఉండి క్రిస్మస్కు కొత్తబట్టలు కొనుక్కోలేని స్థితిలో ఉన్న వారికి మాత్రమే ఈ కిట్స్ అందజేయడం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం కిట్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశాం. – రాజర్షిషా, మైనార్టీ డెవలప్మెంట్ అధికారి -
దసరా మామూళ్లు.. నగలు, నెక్లెస్‌లు!
‘‘మీ లైసెన్స్ రెన్యూవల్‌కుచాలా ఇబ్బందులు ఉన్నాయి..నాకు లంచం వద్దు.. అసలుమా వంశంలోనే ఎవరూ లంచంతీసుకోలేదు. కానీ, నా కూతురికి చిన్న గిఫ్ట్ ఇవ్వండి. అది కూడాఓ నాలుగు లక్షల నెక్లెస్ అంతే’’.. ‘‘రూ.70 లక్షల బిల్లు మంజూరు చేస్తే నాకేంటి.. అలాగని నేను లంచం తీసుకునే మనిషిని కాదు.. కేవలం 5 శాతం కమీషన్. అంటే మూడు లక్షల యాభై వేలు ఇచ్చేస్తే మీ పని అయిపోతుంది. ఇందులో నాకేం మిగలదు.. నేనూ పైవారికి ఇచ్చుకోవాలి’’ సాక్షి, హైదరాబాద్: దసరా పండగ కోసం చాలామంది ప్రభుత్వాధికారులు లంచాల కోసం అడ్డదారులు తొక్కారు. ఈ క్రమంలో ఎక్కడా లంచం అన్న మాటే వాడలేదు. వాటికి బహుమతులు, కమీషన్లు ఇలా రకరకాల పేర్లు చెప్పి వసూలు చేశారు. వీరిలో పాతికేళ్ల సీనియర్ల నుంచి డ్యూటీలో చేరి పట్టుమని రెండు నెలలు కూడా పూర్తికాని వారుండటం గమనార్హం. ఒకరిని చూసి మరొకరు లంచాల వసూళ్లలో పోటీ పడ్డారు. గతంలో ఎప్పుడూ లేనిది ఈసారి అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)కి దసరా ముందు అనేక మంది లంచాల పీడితులు తమగోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారందరికీ ఉచ్చు బిగించిన ఏసీబీ అధికారులకు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 12 (దసరా) వరకు ఏకంగా 12 మంది చిక్కడం గమనార్హం. అంటే సగటున ప్రతీ నాలుగు రోజులకు ఒకరు చొప్పున ఏసీబీ వలలో చిక్కారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఏసీబీలో నమోదైన కేసుల జాబితా దాదాపు 130కి చేరింది. పకడ్బందీగా బుక్ చేస్తోన్న ఏసీబీ.. సాక్ష్యాధారాల సేకరణలో ఏసీబీ రూటుమార్చింది. తమ వద్దకు వచ్చిన బాధితుల విషయాలను ధ్రువీకరించుకునేందుకు కొంత సమయం తీసుకుంటోంది. తరువాత సదరు అధికారిని జాగ్రత్తగా ట్రాప్ చేస్తారు. అతని ఫోన్‌కాల్స్ సంభాషణలు, లంచం తీసుకుంటుండగా రహస్య వీడియో తీయడం వరకు అంతా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. దీంతో నిందితుడికి న్యాయస్థానంలో కచ్చితంగా శిక్ష పడేలా ఆధునిక సాంకేతికత సాయంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘‘గతంలో లాగ కాదు..ఇపుడు ఏసీబీ కేసులో చిక్కుకుంటే బయటపడటం దాదాపుగా అసాధ్యం’’ అని ఓ ఏసీబీ ఉన్నతాధికారి చెప్పారు. నెక్లెస్ గిఫ్ట్‌గా.. ఇటీవల హైదరాబాద్‌లో ఓ బ్లడ్‌బ్యాంక్ లైసెన్స్ రెన్యూవల్ విషయంలో అప్పటికే రూ.50 వేలు లంచం తీసుకున్న డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి.. మరింత లంచం కోసం గిఫ్ట్‌కింద రూ.1.10 లక్షల నెక్లెస్‌ని అడిగింది. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో, ఏసీబీ అధికారులు నెక్లెస్ షాపింగ్ మొత్తం ఆడియో, వీడియో సాక్ష్యాధారాలతో సహా రెడ్çహ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రెండునెలలకే లంచం.. తుర్కయాంజల్ వీఆర్వో శేఖర్ తన వద్దకు భూమి మ్యుటేషన్ కోసం వచ్చిన ఓ రైతు వద్ద రూ.లక్ష లంచం అడిగాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో వారు వలపన్ని పట్టుకున్నారు. ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే.. నిందితుడు శేఖర్ వీఆర్వోగా చేరి అప్పటికి కేవలం రెండు నెలలే అయింది. తోటివారి అవినీతి చూసిన శేఖర్ అక్రమమార్గం పట్టినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. -
మోదీ కానుకల వేలం
న్యూఢిల్లీ: ‘నమామి గంగే’ ప్రాజెక్టు కోసం నిధుల సేకరణలో భాగంగా గత సంవత్సరం ప్రధాని నరేంద్రమోదీ అందుకున్న కానుకల వేలం ప్రక్రియ మొదలైంది. బహుమతుల ప్రదర్శన, వేలం పాటను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ శనివారం ప్రారంభించారు. శాలువాలు, తలపాగాలు, జాకెట్లు సహా 2,700కుపైగా వస్తువులు ప్రదర్శనలో ఉంటాయని, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (ఎన్జీఎంఏ)లో ఈ వస్తువులు శనివారం నుంచి అక్టోబర్ 3 వరకు www.pmmementos.gov.in లో వేలం కొనసాగుతుందని తెలిపారు. ఎన్జీఎంఏలో ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వేలం జరుగుతుందని, ప్రస్తుతం స్మృతి చిహ్నాలు పేరుతో 500 వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయని పటేల్ తెలిపారు. ‘ప్రతి వారం ప్రదర్శించబడే మెమెంటోలు మార్చుతాం. పెయింటింగ్స్, మెమెంటోలు, శిల్పాలు, శాలువాలు, తలపాగాలు, సంప్రదాయ వాయిద్యాలతో సహా అనేక వస్తువులను ప్రదర్శిస్తాం’ అని చెప్పారు. మెమెంటోల అత్యల్ప ధర రూ. 200 కాగా, అత్యధిక ధర రూ. 2.5 లక్షలు అని పటేల్ తెలిపారు. ‘నేను అందుకున్న బహుమతులను వేలంలో పెడతా. ప్రజలు ఈ వేలం పాటలో పాల్గొనాలని కోరుతున్నాను’ అని మోదీ ట్వీట్ చేశారు. -
మోదీ బహుమతులు వేలం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్న బహుమతులను వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది. ఈ బహుమతులను సెప్టెంబర్ 14 నుంచి ఆన్లైన్లో వేలానికి ఉంచనున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ బుధవారం తెలిపారు. వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని గంగా నదిని శుభ్రపరచం కోసం మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నమామి గంగే’ ప్రాజక్ట్‌కు కేటాయించనున్నారు. గత ఆరు నెలల కాలంలో మోదీకి వచ్చిన 2,722 బహుమతులను వేలంలో అందుబాటులో ఉంచనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ వస్తువులు న్యూఢిల్లీలోని నేషన్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్‌లో ప్రదర్శన కోసం ఉంచినట్టు చెప్పారు. వస్తువుల ధరలు రూ. 200 నుంచి మొదలుకుని రూ. 2.50 లక్షల వరకు ఉండనున్నట్టు పేర్కొన్నారు. ఈ బహుమతుల్లో భారతీయులు ఇచ్చినవే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. కాగా, మోదీకి వచ్చిన బహుమతులను వేలానికి ఉంచడం ఇది రెండోసారి. అంతకుముందు ఈ ఏడాది జనవరి 27 నుంచి ఫిబ్రవరి 9 మధ్యలో తొలిసారిగా మోదీకి వచ్చిన బహుమతులను సాంస్కృతిక శాఖ వేలానికి ఉంచిన సంగతి తెలిసిందే. దీనికి -
ప్రభుత్వ ఉద్యోగులకు షాక్: ‘గిఫ్ట్స్’ బ్యాన్..!
లక్నో : కొత్త కొత్త రూల్స్‌తో ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోన్న యుపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మీటింగ్స్‌కు వచ్చేటప్పుడు ఉద్యోగులు ఫోన్ తీసుకురాకుడదని.. ఉదయం 9 గంటల్లోపు కార్యాలయాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇక మీదట ప్రభుత్వ ఉద్యోగులేవరూ ఉన్నతాధికారుల అనుమతి లేకుండా బయటి వ్యక్తులు ఇచ్చే బహుమతులు స్వీకరించకూడదని ఆదేశించారు. ఈ మేరకు యోగి ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం సచివాలయం ఉద్యోగులతో సహా ప్రభుత్వ ఉద్యోగులేవరూ కూడా ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎలాంటి బహుమతులు స్వీకరించకూడదని తెలిపింది. కనీసం స్వీట్ బాక్స్ కూడా తీసుకోవద్దని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు బహుమతులు రూపంలో లంచాలు స్వీకరిస్తుంటారని అందరికి తెలిసిన విషయమే. అయితే యోగి నిర్ణయం పట్ల గ్రేడ్ 3 ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఐఏఎస్ అధికారులు బహుమతుల రూపంలో ఖరీదైన వస్తువులు పొందుతారు. మాకు ఇచ్చేది కేవలం స్వీట్ బాక్స్‌లు మాత్రమే. వాటిని కూడా వద్దంటే ఎలా’ అని ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ యోగి నిజంగానే బహుమతులను బ్యాన్ చేయాలని భావిస్తే అధికారుల ఇళ్లలో సోదాలు జరపాలని.. వారి ఇళ్లలో ఉన్న ఖరీదైన వస్తువుల గురించి ఆరా తీయాలని డిమాండ్ చేస్తున్నారు. -
నగదు గిఫ్ట్.. ఫారిన్ ట్రిప్.. తమిళ తంబిల ట్రిక్
సాధారణంగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఓటర్లకు బహుమతులు ఇస్తుంటారు. తమకు ఓట్లు వేయడం కోసం చీరలు, నగల నుంచి కుక్కర్లు, టీవీలు, గ్రైండర్ల వరకు ఓటర్లకు ఎర వేస్తారు. అయితే, తమిళనాడులో ఈ ఎన్నికల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. ఓటర్లకే కాకుండా వారి చేత ఓట్లు వేయించే పార్టీ కార్యకర్తలు, కింది స్థాయి నాయకులకు కూడా బహుమానాలు ప్రకటిస్తున్నారు. తమకు ఎక్కువ ఓట్లు వేయించిన వారికి వాహనాలు, ఫ్రిడ్జ్‌లు, నగదు ఇస్తామని, విదేశీ, స్వదేశీ ప్రయాణాల ఖర్చు భరిస్తామని అభ్యర్థులు హామీలిస్తున్నారు. అరక్కోణం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి జగద్రక్షకన్ (డీఎంకే) ఈ కొత్త ట్రెండ్‌కు నాంది పలికారు. ఆయన నియోజకవర్గం పరిధిలో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఏ సెగ్మెంట్లో తనకు ఎక్కువ ఓట్లొస్తాయో ఆ సెగ్మెంట్ ఇన్చార్జికి కోటి రూపాయలు ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు. పలు విద్యాసంస్థలు, ఒక స్టార్ హోటల్‌కు యజమాని అయిన జగద్రక్షకన్ తమిళనాడు అభ్యర్థుల్లోని నలుగురు కోటీశ్వరుల్లో ఒకరు. ఇక వెల్లూరులోని షణ్ముగం (అన్నాడీఎంకే) అయితే, నియోజకవర్గం ఇన్చార్జిలకు బుల్లెట్ మోటారుసైకిళ్లు, విదేశీ ట్రిప్‌ల ఆశ పెడుతున్నారు. ఇక్కడి మరో పోటీదారు కతీర్ ఆనంద్ (డీఎంకే) ఉత్తమ ప్రతిభ చూపిన కార్యకర్తలకు రూ.50 లక్షల చొప్పున ఇస్తానని వాగ్దానం చేశారు. ఇలాంటి బహుమతుల వల్ల కార్యకర్తలు, కింది స్థాయి నేతలు మరింత ఉత్సాహంగా పని చేస్తారని కతీర్ ఆనంద్ తండ్రి, డీఎంకే కోశాధికారి దురై మురుగన్ అన్నారు. తామిచ్చే సొమ్మును పార్టీ కార్యాలయ నిర్మాణం వంటి పనులకు ఉపయోగించాలని ఆయన షరతు విధించారు. కాగా, ఈ భారీ నగదు నజరానాపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. వెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి ఫిర్యాదుతో ఐటీ అధికారులు కతీర్ ఆనంద్ నివాసాల్లో సోదాలు జరిపారు. కతీర్ అఫిడవిట్లో తన చేతిలో రూ.9 లక్షల నగదు ఉందని తెలిపారు. అయితే ఐటీ దాడుల్లో రూ.19 లక్షలు దొరికాయి. ఈ అదనపు సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. -
లవర్స్‌కి ‘లైన్’ వేశారు!
వలంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులు తమకు నచ్చిన గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకోవడానికిసిద్ధమయ్యారు. దీంతో ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్ల నిర్వాహకులు వారికి ‘లైన్’వేస్తున్నారు. విభిన్న గిఫ్ట్‌లతో ప్రేమికుల మదిని దోచుకోనున్నారు. సిటీలోని పలురెస్టారెంట్లు, పబ్స్ నిర్వాహకులు ప్రేమికుల కోసం ఎన్నో వెరైటీ కార్యక్రమాలకుసన్నద్ధమవుతున్నారు. ఫొటో ఆర్ట్ ఫర్ లవర్స్ ప్రపంచ వ్యాప్తంగా ‘గ్లోబల్ లగ్జరీ గ్రూప్’ వాళ్లు డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు ప్రపంచం మొత్తం మీద ఎవరైనా సరే తమకు నచ్చిన ఫొటోని ‘www.handpaintedstories.com’ వెబ్సైట్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. పది నుంచి పదిహేను నిమిషాల వ్యవధిలో ఆ ఫొటోను ఆర్ట్‌గా గీసి తిరిగి వెబ్సైట్లోనే పోస్ట్ చేస్తారు. అంతే కాదు ఫొటోకు సంబంధించిన స్టోరీని కూడా పోస్ట్ చేస్తారు. ఇది లవర్స్‌కి ప్రత్యేకమనే చెప్పాలి. తక్కువ ధరల్లో చక్కటి గిఫ్ట్‌లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ మార్కెట్లలో కళ్లు జిగేల్మనిపించే గిఫ్ట్‌లు ఉన్నాయి. ప్రారంభ ధర రూ.99 నుంచి మనసుకు నచ్చినవి సొంతం చేసుకోవచ్చు. ఒక్క క్లిక్ కొడితే చాలు మనచేతిలో ఉంటాయి. కపుల్స్ డిన్నర్ సిటీలోని పలు హోటల్స్ కపుల్స్ కోసం డిన్నర్‌ను ప్లాన్ చేస్తున్నాయి. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ‘పార్క్ హయత్, ది హ్యాత్, తాజ్‌బంజారా, తాజ్‌కృష్ణా, దసపల్లా’ లాంటి అనేక హోటల్స్ డిన్నర్ థీమ్‌ను ఏర్పాటు చేశాయి. షాపింగ్ అదుర్స్ అమ్మాయిల కోసం టాప్స్, జ్యువెలరీ, రింగ్స్, అబ్బాయిల కోసం వాచెస్, హ్యాండ్ జ్యువెలరీస్, నెక్ జ్యువెలరీస్ ప్రస్తుతం సిటీలోని షాపింగ్ మాల్స్‌లో హల్చల్ చేస్తున్నాయి. షాపర్స్ స్టాప్, సిటీసెంటర్, అన్లిమిటెడ్, మ్యాక్స్ వంటి ప్రధాన షోరూంలలో ఇవి అందుబాటులో ఉన్నాయి. పబ్స్‌లో అలనాటి గీతాలు సిటీలోని పలు రెస్టారెంట్స్‌తో పాటు పబ్స్ కూడా కపుల్స్ కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. పబ్స్‌లో వైట్డ్రస్లో కపుల్స్‌ని ఆహ్వానిస్తున్నారు. తెలుగు పాటలతో బ్యాండ్ కపుల్స్ కోసం అలనాటి పాటలను పాడుతూ వారిని ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యాయి. స్పెషల్ రోజెస్ ఫర్ లవర్స్ విభిన్న రకాల, కలర్స్‌లో ఉన్న రోజ్ ఫ్లవర్స్ ఆన్లైన్లో సందడి చేస్తున్నాయి. సిటీకి చెందిన సోనాల్ అగర్వాల్ ‘ఫ్లవర్వలీ’ పేరుతో రోజా పూలు విక్రయిస్తున్నారు. రోజా పూలతో పాటు టెక్నాలజీ ప్రింటెడ్ రోజెస్ అన్నీ సిటీలో, ఆన్లైన్లో సందడి చేస్తున్నాయి. -
చంద్రన్న కానుకలో నాసిరకం సరుకులు
-
‘గిఫ్ట్’ దిగుమతులకు కేంద్రం చెక్
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: గిఫ్ట్ ఐటమ్స్ దిగుమతుల నిబంధనలు దుర్వినియోగం అవుతుండటంపై కేంద్రం దృష్టి సారించింది. కస్టమ్స్ సుంకాలను ఎగవేసే ఉద్దేశంతో బహుమతుల పేరిట రూ. 5,000 దాకా విలువ చేసే ఐటమ్స్ దిగుమతి చేసుకుంటుండటాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకోనుంది. ప్రస్తుతం రూ. 5,000 దాకా ఉన్న మినహాయింపును ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తోంది. అలాగే ఒక వ్యక్తికి ఏడాదిలో గరిష్టంగా నాలుగు కన్సైన్మెంట్స్ మాత్రమే బహుమతులుగా అనుమతించే విషయమూ పరిశీలనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఈ–కామర్స్ రంగంపై జరిగిన కార్యదర్శుల అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చినట్లు వివరించాయి. దీనిపై తాము చేసిన సిఫార్సులపై కస్టమ్స్ విభాగం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఒక అధికారి తెలిపారు. రూ. 5,000 దాకా విలువ చేసే గిఫ్ట్ ఐటమ్స్ దిగుమతులకు కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపునిస్తున్న భారత విదేశీ వాణిజ్య చట్టంలోని నిబంధనలను చైనాకి చెందిన పలు ఈ–కామర్స్ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయంటూ పరిశ్రమ వర్గాలు చాలాకాలంగా ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. -
గిఫ్టు పట్టు.. ఓటు కొట్టు..
సాక్షి, హైదరాబాద్: ఓటు కొట్టు..గిఫ్టు పట్టు అన్న చందంగా మారింది గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రధాన పార్టీల అభ్యర్థుల తీరు. ఎన్నికల ప్రచారం క్రమంగా వేడెక్కుతున్న తరుణంలో ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు మహిళలు, యువతీయువకుల ఓట్లను గంపగుత్తగా రాబట్టేందుకు సవాలక్ష ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. ఇదే క్రమంలో ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీగా తాయిలాలిచ్చేందుకు రంగం సిద్ధంచేసుకుంటున్నారు. కేడర్‌ను వెంట తిప్పుకునేందుకు బీరు.. బిర్యానీ పథకం సంగతెలా ఉన్నా..బస్తీలు, కాలనీల్లో మెజార్టీ ఓట్లను ఆకర్షించేందుకు వెరైటీ గిఫ్ట్ ఐడియాలను కనిపెడుతుండడం విశేషం. ప్రధానంగా ఇటీవలే ఓటుహక్కు సాధించిన యువకుల మనసు దోచుకునేందుకు క్రికెట్ కిట్లు, వాలీబాల్, బాస్కెట్ బాల్‌లు, నెట్స్, షటిల్‌బ్యాట్లు, టీషర్ట్స్, కమ్యూనిటీ హాళ్లలో ఆడుకునేందుకు వీలుగా చెస్, క్యారమ్స్, స్నూకర్ టేబుల్స్ అందజేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ తాయిలాల ఆశ చూపి యువతను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక గృహిణులకైతే చీరలు..సారెలే కాదు..వెండి ప్లేట్లు, కుంకుమ భరిణెలు, టిఫిన్‌బాక్సులు, మిక్సీలు, గ్యాస్‌స్టవ్‌లు, బ్యాగులతోపాటు అధికంగా ఓట్ల వర్షం కురుస్తుందనుకున్న వారికి ఏకంగా కుట్టు మిషన్లు, కలర్టీవీలు,ఫ్రిజ్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆయా వస్తుసామగ్రి కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికల అధికారుల డేగ కళ్ల నిఘా నేపథ్యంలో తమ అనుచరగణంతో ఈ గిఫ్ట్‌లను భారీగా కొనుగోలు చేయించి ఎక్కడికక్కడే కాలనీలు, బస్తీల్లో నిల్వచేస్తున్నారు. పనిలో పనిగా ఇంటింటి ప్రచారం చేపడుతూ కరపత్రాలు పంచుతూనే ఈ తాయిలాల ఆశ చూపుతుండడం ఎన్నికల ప్రచారంలో కనిపిస్తోంది. ఈసీ కళ్లు కప్పి.. ఎన్నికల ఖర్చులోప్రతీపైసాకు లెక్కచూపాల్సిన అవసరం ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ చేతికి మట్టి అంటకుండా..ఎన్నికల కమిషన్ దృష్టిలో పడకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో నగదు కొరత నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో తమ పార్టీకి అండగా నిలిచే ముఖ్యనేతలు, కార్పొరేటర్లు, మాజీలు, ఫైనాన్సియర్లు, బిల్డర్లను ఎన్నికల ఖర్చు, గిఫ్ట్‌ల కొనుగోలుకు చేసే వ్యయాన్ని భరించాల్సిందిగా కోరుతున్నారు. ఈ పనుల్లోనూ అభ్యర్థులు చిక్కుల్లో పడకుండా తమ సన్నిహితులు, ముఖ్య అనుచరులకే మొత్తం చక్రం తిప్పాలని ఆర్డర్లు వేసేస్తున్నారు. నగర శివార్లలో ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారాన్ని హోరత్తిస్తుండగా..విపక్ష బీజేపీ, కాంగ్రెస్‌పార్టీల నుంచి టిక్కెట్లు ఖాయం అనుకుంటున్న వారు సైతం ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టారు. ఆ పార్టీ..ఈపార్టీ అన్న తేడా లేకుండా ఒకరు రెండు గిఫ్ట్‌లు ఇస్తే మరొకరు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఒక్క గిఫ్ట్ అయినా ఇచ్చి ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలన్న ట్రెండ్ సర్వత్రా కనిపిస్తుంది. -
ఉద్యోగులకు బొనాంజా
సూరత్‌లో జరిగిన కార్యక్రమంలో వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలకియా తన సంస్థ ఉద్యోగులకు దీపావళి కానుకగా ఇచ్చిన కొత్త కార్లు ఇవి. ‘హరే కృష్ణ ఎక్స్‌పోర్ట్స్’ సంస్థలోని 1,700 మంది వజ్రాల నిపుణులు, ఇంజనీర్లకు కానుకగా కార్లు, ఫిక్స్డ్ డిపాజిట్లను ఇచ్చారు. మరోవైపు, ఢోలకియా గురువారం ఢిల్లీలో ప్రధానిని కలసి మోదీ చేతులమీదుగా కొందరు ఉద్యోగులకు కారు తాళాలను ఇప్పించారు. ఈ సందర్భంగా మోదీ వీడియోకాన్ఫరెన్స్‌లో సూరత్‌లోని ఉద్యోగులతో మాట్లాడారు. -
హ్యాపీ మొబైల్స్ రూ.5 కోట్ల బహుమతులు
మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ హ్యాపీ మొబైల్స్ ‘ఫెస్టివ్ పటాకా’ ఆఫర్లను ప్రకటించింది. దీనిలో భాగంగా రూ.5 కోట్ల విలువైన ఖచ్చితమైన బహుమతులను కస్టమర్లకు అందజేస్తామని సంస్థ సీఎండీ కృష్ణ పవన్ వెల్లడించారు. నవంబరు చివరి వరకు ఈ ఆఫర్లు ఉంటాయని చెప్పారు. గుంటూరులో హ్యాపీ ఔట్‌లెట్‌ను ప్రారంభించిన సందర్భంగా సినీ నటి కీర్తి సురేశ్ చేతుల మీదుగా ఫెస్టివ్ పటాకా ఆఫర్లను బుధవారం ఆవిష్కరించారు. రూ.399లకే డ్యూయల్ సిమ్ ఫోన్, రూ.14,999 విలువగల మొబైల్‌పై రూ.10,590 విలువైన మైక్రోమ్యాక్స్ ఎల్ఈడీ టీవీ, హానర్ 9 లైట్ మొబైల్‌పై రూ.2,999 విలువచేసే స్పోర్ట్స్ వైర్లెస్ హెడ్ సెట్, మొబిస్టార్ ఎక్స్1 డ్యూయల్ మొబైల్‌పై రూ.4,500 విలువగల కెంట్ వాక్యూమ్ క్లీనర్ ఉచితం అని హ్యాపీ మొబైల్స్ ఈడీ కోట సంతోష్ తెలిపారు. లావా జడ్91పై రూ.2,499 విలువచేసే 4.1 హోమ్ థియేటర్ సిస్టమ్ అందుకోవచ్చు. రూ.3,999లకే 2 జీబీ ర్యామ్ ఫోన్ అందుబాటులో ఉంది. -
ఆదాయం.. హారతి
కాణిపాకం: వరసిద్ధి వినాయక స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు దేవస్థానం సిబ్బంది హారతి పళ్లెం రూపంలో స్వాహా చేస్తున్నారు. దేవస్థానం ఈఓ ఈ విషయంపై దృష్టి సారిస్తే నెలకు రూ.50 లక్షల మేరకు ఖజానాకు చేరుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. కానుకలు ఎవరికి చేరాలి? నిత్యం దేశం నలుమూల నుంచి వచ్చే వేలాది మంది భక్తులు వరసిద్ధి వినాయకస్వామివారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకుంటారు. ఈ క్ర మంలో వారు స్వామివారికి చేరేలా కానుకలు స మర్పిస్తారు. పేద, ధనిక, పిల్లల పేరుతో మొక్కుబడులు ఇచ్చేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. సగటున భక్తులు రూ.పది నుంచి రూ.10 వేల నూట పదహార్ల వరకు సమర్పించి మొక్కులు తీ ర్చుకునేవారుంటారు. వీటితో పాటు వెండి, బం గారం (తులం, అర తులం) సమర్పించే వారు దక్షిణాది రాష్ట్రాల్లో భక్తులు ఎక్కువగా ఉన్నారు. వీరిని గర్భాలయ సిబ్బంది తప్పుదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్వామివారి గర్భాలయంలో మూల విగ్రహనికి ఎదురుగా హారతి పళ్లెం ఉంచి కానుకలు అందులో పడేలా భక్తులను ప్రసన్నం చేసుకుంటారు. దీంతో ఆ మొత్తం వారి జేబుల్లోకి వెళుతోంది. ఇలా సాధారణ సమయాల్లో రోజుకు రూ.20 వేలు, రద్దీ సమయాల్లో రూ. 50 వేల పైచిలుకుకు నొక్కేస్తున్నారు. ఈ క్రమంలో నెలకు రూ.50 లక్షలకు పైగా స్వాహా జరుగుతోంది. ఆశీర్వాదాలతో నిలువు దోపిడీ వినాయకస్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు ఆలయంలో స్వామివారి సన్నిధిలో ఉండే అర్చక, వేదపండితుల వద్ద ఆశీర్వాదం పొందాలని భావి స్తారు. అలాంటి వారి కోసం దేవస్థానంలో ఆశీర్వా ద సేవ ఉంది. అయితే ఆలయంలో పనిచేసే అర్చ క, వేదపండితులు ఎలాంటి టికెట్ లేకుండా కేవలం ధనిక భక్తులకు ఉచితంగా ఆశీర్వాదం చేసి, కండువాలు కప్పుతారు. ఇందుకు భక్తులు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు అర్చకులు, వేదపండితుల చేతిలో ఉంచి, వెళుతున్నారు. ఇలా కూడా దేవస్థానానికి రూ.లక్షల్లో నష్టం వాటిల్లుతోంది. ఈఓ దృష్టి సారించాలి కాణిపాక దేవస్థానికి వచ్చే భక్తులు అందజేసే కానుకలు ఆలయంలో పనిచేసే సిబ్బందే స్వాహా చేస్తుండడం వెనుక భక్తుల నుంచి పలురకాల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానుకలు స్వాహా జరిగే ప్రాంతాలపై దేవస్థాన ఈఓ దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. ముఖ్యంగా గర్భాలయంలో హారతి పళ్లెం, అభిషేక అనంతరం స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేసే కేంద్రం, వేదపండితులు, అర్చకుల అనధికార ఆ శీర్వాదాలు, హోమం జరిగే, గణపతి చతుర్థి వ్ర తం, దేవస్థానంలో పనిచేసే సిబ్బంది పని తీరుపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. భక్తులు కానుకలు హుండీలోనే సమర్పించాలి భక్తులు కానుకలను హుండీలోనే సమర్పించాలి. ఎలాంటి కానుకలు హారతి పళ్లెం లో వేయకూడదు. ఈ క్రమంలో దేవస్థానంలో విధులు నిర్వహించే అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశాం. అలాగే ఆశీర్వా దం టికెట్టు లేకుండా ఆశీర్వాదాలు చేస్తే అలాంటి సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. –పి.పూర్ణచంద్రరావు,కాణిపాకం దేవస్థానం ఈఓ -
కానుకలు తీసుకోవద్దు
భువనేశ్వర్: భక్తుల నుంచి విరాళాలు, కానుకలు స్వీకరించవద్దని ప్రఖ్యాత పూరీ జగన్నాథస్వామి ఆలయంలో పనిచేసే సేవకులకు సుప్రీంకోర్టు సూచించింది. కానుకలు ఇవ్వని భక్తుల పట్ల సేవకులు వివక్ష చూపుతున్నారంటూ వచ్చిన వార్తలపై కోర్టు స్పందించింది. సూచనలను ఆలయంలోని పలు ప్రాంతాల్లో అంటించింది. సేవకులకు భక్తులు కానుకలు ఇచ్చే విధానానికి బదులుగా ఏపీలోని తిరుపతి,, జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి, గుజరాత్‌లోని సోమనాథ్, పంజాబ్‌లోని స్వర్ణదేవాలయంలలో అమల్లో ఉన్న వివిధ విధానాలను అధ్యయనం చేసి తగు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఒడిశా ప్రభుత్వాన్ని కోరింది. భక్తులు ఇచ్చే కానుకలపైనే తాము ఆధారపడి జీవిస్తున్నందున ఈ ఆదేశాలను పునః పరిశీలించాలంటూ కొందరు సేవకులు కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు. -
ఇదో ఎమోషనల్ మూమెంట్ : క్రికెటర్
ఐపీఎల్-11వ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ముంబై తరఫున ఓపెనర్‌గా వచ్చి తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఈ ఐపీఎల్లో రూ. 3.02 కోట్లకు సూర్యకుమార్‌ను ముంబై దక్కించుకుంది. ఐపీఎల్ వచ్చిన డబ్బుతో సూర్యకుమార్ ఓ స్కోడా కారును కొన్నాడు. అయితే, ఈ కారు తన కోసం కాదు, తన తల్లిదండ్రుల కోసమని చెప్పాడు. ‘ఇది ఓ ఎమోషనల్ మూమెంట్..నేను కొన్న మొదటి కారు ఇది. కానీ నా కోసం కాదు. ఈ కారును అమ్మానాన్నలకు గిఫ్ట్‌గా ఇస్తున్నాను. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి వారే కారణం. అందుచేత వారికే నా బహుమతి. ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. లవ్ యూ మామ్ అండ్ డాడ్’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. తన తల్లిదండ్రులతో కలిసి కారు వద్ద దిగిన ఫొటో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ సంవత్సరం ఐపీఎల్లో 14 మ్యాచ్‌లాడిన సూర్యకుమార్ మొత్తం 521 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా వచ్చిన మొదటి మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీతో సూర్యకుమార్ రాణించాడు. అంతేకాక ఇండియా టీం తరఫున ఆడని ఆటగాళ్లలో 500లకు పైగా పరుగులు చేసిన మొదటి క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. -
మైనార్టీలకు సర్కారు అండ
సాక్షి, సిద్దిపేట: ‘అల్లా దయతో స్వరాజ్యం సాధించుకున్నాం. అంతా కలసికట్టుగా పనిచేసి అభివృద్ధిలో కూడా రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచాలి’అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్లో 3,000 మంది పేద ముస్లిం కుటుంబాలకు ఆయన రంజాన్ పండుగ బహుమతులు అందచేశారు. మంత్రి మాట్లాడుతూ కరువు, కాటకాలతో అల్లాడిన ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇందుకోసం అల్లా దీవెన కూడా అవసరమని అన్నారు. ఇదే ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణలోని బీళ్లను గోదావరి జలాలతో తడుపుతామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు అండగా ఉంటుందని, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ముస్లిం యువతుల వివాహానికి రూ.1,00,116 ఆర్థిక సహాయం అందచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అలాగే మైనార్టీ గురుకులాలు ప్రారంభించి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తున్నామన్నారు. ఈ సర్పంచ్‌లు అదృష్టవంతులు.. ప్రస్తుత సర్పంచ్‌లు అదృష్టవంతులని హరీశ్ అన్నారు. ప్రస్తుత సర్పంచ్ల పదవీకాలంలోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని, గ్రామాలకు సమీపంలో జిల్లా కేంద్రాలు కూడా వచ్చాయని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, దీంతో సర్పంచ్‌లకు ప్రజలకు మరింత సేవచేసే అవకాశం వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు. -
రంగస్థలం టీంకు చెర్రీ గిఫ్ట్స్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రంగస్థలం. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. సమంత హీరోయిన్గా నటిస్తుండగా జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు రచయితలుగా పనిచేసిన బుచ్చిబాబు, కాశీ, శ్రీనివాస్‌లకు చరణ్ గిఫ్ట్స్ ఇచ్చాడు. సినిమా అవుట్‌పుట్ విషయంలో చాలా ఆనందంగా ఉన్న చరణ్ తన ఆనందాన్ని యూనిట్ సభ్యులతో పంచుకుంటున్నాడు. ఈ రోజు (మంగళవారం) తన పుట్టిన రోజు కూడా కావటంతో యూనిట్ సభ్యులకు చరణ్ గిఫ్ట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన రంగస్థలం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వాలెంటైన్స్ డే : ఈ గిఫ్ట్‌లతో మనసు దోచేయండి
క్యాండిల్ లైట్ డిన్నర్... రెడ్ రోజస్ ఇవన్నీ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మన ప్రియమైన వారికి మనసులో మాటను తెలియజెప్పే అపూర్వ కానుకలు. ఈ అపూర్వ కానుకలతో పాటు మరికొన్ని గిఫ్ట్‌లను అందిస్తూ కూడా ప్రియమైన వారి మనసు దోచేసుకోవచ్చు అంటోంది ఎజియో.కామ్. వాలెంటైన్స్ డే గైడ్‌గా ఏమేమీ గిఫ్ట్‌లుగా అందించవచ్చో తెలుపుతూ అమ్మాయిలకు, అబ్బాయిలకు ఐడియాలు అందిస్తోంది. అమ్మాయిలను ఇంప్రెస్ చేయడమెలా? అమ్మాయి ఫ్యాషన్‌ను ఎక్కువగా ఇష్టపడితే... ఈ సీజన్‌కు తగ్గట్టు తనకు ఇష్టమైనది ప్రజెంట్ చేయండి. లేటెస్ట్ ఫ్యాషన్ గురించి అంతా తెలుసుకోండి.. ఇయర్ రింగ్స్, డ్రస్‌లు, రఫెల్స్(ఈ సీజన్లో అతిపెద్ద ట్రెండ్స్ ఇవే) ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. మ్యూజిక్‌ను ఎక్కువగా ఇష్టపడే వారికి బ్లూటూత్ స్పీకర్ ది బెస్ట్ కానుక. అలా ప్రతి క్షణం తనకు ఇష్టమైన పాటలను ఆస్వాదిస్తూ.. మీ ఊహాలోనే తను మైమరిచిపోతుంటోంది. గోల్డ్ టోన్డ్ నెక్లెస్, స్లింగ్ బ్యాగ్‌తో కూడా అమ్మాయిల మనసును దోచేసుకోవచ్చు. అబ్బాయిలకి ఇచ్చే కానుకలు.. అబ్బాయిలకు ఏం గిఫ్ట్‌లు ఇచ్చి ఇంప్రెస్ చేయాలో చాలా మంది అమ్మాయిలకు తెలియక తికమకపడిపోతుంటారు. కానీ స్మార్ట్ అప్పీరల్స్తోనే అబ్బాయిల మనసు దోచేసుకోవచ్చట. ల్యాప్‌టాప్‌ను ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులకు ల్యాపీ బ్యాగ్, గాడ్జెట్ ప్రియులకు ఫిట్నెస్ బ్యాండ్లు ఫర్ఫెక్ట్ ఛాయిస్ అట. ఫిట్నెస్ను అంతగా పట్టించుకోని వారికి, ఈ బ్యాండ్‌తో తన ఆరోగ్యంపై శ్రద్ధ వస్తుందని ఎజియో.కామ్ చెబుతోంది. బికర్ జాకెట్, ఫార్మల్ షర్ట్ వారి పాపులారిటీని, లుక్‌ను మరింత పెంచే విధంగా ఉంటాయని, అవి కూడా అమ్మాయిలు గిఫ్ట్‌లుగా ఇవ్వొచ్చని సూచిస్తోంది. -
సింగరేణి కార్మికులకు వరాలపై ‘జలగం’ హర్షం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులు, సిబ్బందికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరాలు ప్రకటించడం పట్ల కొత్తగూడెం శాసన సభ్యులు జలగం వెంకటరావు హర్షం వ్యక్తం చేశారు. కొత్తగూడెంలోని తన క్యాంప్ కార్యాలయంలో శాసనమండలి విప్ పల్లా రాజేశ్వరరెడ్డి, ఇతర నాయకులతో కలసి కేసీఆర్ మీడియా సమావేశాన్ని పూర్తిగా వీక్షించారు. అనంతరం సీఎం ప్రకటించిన వరాలకి హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు తినిపించుకున్నారు. సెంట్రల్ వర్క్ షాప్, హెడ్ ఆఫీస్‌ల వద్ద బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. -
గిఫ్టులకు జీఎస్టీ మినహాయింపు
న్యూఢిల్లీ: కంపెనీలు తమ ఉద్యోగులకు ఇచ్చే గిఫ్టులకు సంబంధించి రూ. 50,000 దాకా విలువ ఉండే బహుమతులు.. వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పరిధిలోకి రావని కేంద్రం పేర్కొంది. అలాగే కంపెనీలు తమ సిబ్బందికి క్లబ్‌లు, హెల్త్.. ఫిట్నెస్ సెంటర్లలో ఉచిత సభ్యత్వం కల్పించినా.. జీఎస్టీ వర్తించదని స్పష్టం చేసింది. ఉద్యోగరీత్యా కంపెనీకి ఉద్యోగి అందించే సేవలు కూడా వస్తు, సేవల పన్నుల విధానం పరిధిలోకి రావని పేర్కొంది. ఒక ఏడాదిలో కంపెనీ తమ ఉద్యోగులకు రూ. 50,000కు లోబడి ఇచ్చే గిఫ్టులకు జీఎస్టీ నుంచి మినహాయింపునిస్తున్నట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ’బహుమతి’ని ఉద్యోగి దీన్ని తన హక్కుగా భావించడానికి లేదని స్పష్టం చేసింది. అద్దె ఆదాయం రూ. 20 లక్షలు దాటితే జీఎస్టీ వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ప్రాపర్టీలపై వచ్చే అద్దె ఆదాయం వార్షికంగా రూ. 20 లక్షలు మించితే జీఎస్టీ వర్తిస్తుందని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. జీఎస్టీ మాస్టర్ క్లాస్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. నివాస గృహాల అద్దె ఆదాయాలకు ప్రస్తుతం వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) నుంచి మినహాయింపు ఉంది. మరోవైపు, 69.32 లక్షల పైచిలుకు రిజిస్టర్డ్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ చెల్లింపుదారులు జీఎస్టీఎన్ పోర్టల్‌కి మళ్లినట్లు జీఎస్టీ నెట్వర్క్ సీఈవో ప్రకాశ్ కుమార్ తెలిపారు. ఇందులో ఇప్పటికే 38.51 లక్షల మంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నట్లు, వారికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు జూన్ 25 నాటి నుంచి 4.5 లక్షల దాకా కొత్త అసెసీలు జీఎస్టీఎన్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నట్లు కుమార్ చెప్పారు. -
గిఫ్ట్‌లకు జీఎస్టీ మోతమోగుతోంది జాగ్రత్త!
జీఎస్టీ.. జీఎస్టీ ఎక్కడ చూసినా దేశంలో ఇప్పుడు ఈ పేరే మోతమోగుతోంది. ఏ వస్తువుపై ఎంత జీఎస్టీ ఉంది? ఏ వస్తువును కొంటే జీఎస్టీ భారం నుంచి తప్పించుకోవచ్చు? అని వినియోగదారులు తెగ లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఈ జీఎస్టీ భారం ఇక కంపెనీల నుంచి ఉద్యోగులు పుచ్చుకునే గిఫ్ట్‌లకు తాకనుంది. 50వేల రూపాయలకంటే ఎక్కువ విలువ కలిగిన బహుమతులన్నింటికీ జీఎస్టీ వర్తిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. సోమవారం రోజు ఈ విషయాన్ని స్పష్టీకరించింది. వ్యాపారాలను ప్రమోట్ చేసుకోవడానికి లేదా ఉద్యోగులకు పరిహారాల కింద కంపెనీలు ఎంతో ఖరీదైన బహుమతులను ఇస్తుంటాయి. ప్రస్తుతం వీటిని పన్ను పరిధిలోకి తెస్తున్నట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఎలాంటి పరిశీలన లేని రూ.50వేల కంటే ఎక్కువ మొత్తంలో బహుమతులు వీటి కిందకు వస్తాయని పేర్కొంది. రూ.50వేలు వరకు ఉన్న బహుమతులకు మాత్రం ప్రస్తుతం జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నామని తెలిపింది. అదేవిధంగా ఉద్యోగి, కంపెనీకి మధ్యలో ఉన్న లావాదేవీలకు, డీలింగ్స్‌కు ఎలాంటి సమయాల్లో జీఎస్టీ వర్తిస్తుందో కూడా క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ ఉద్యోగులకు ఉచితంగా హెల్త్ సెంటర్ సర్వీసులను అందిస్తే అది జీఎస్టీ పరిధిలోకి రాదని చెప్పింది. అదేవిధంగా కాంట్రాక్ట్ పార్ట్ కంపెనీ వ్యయాల కింద ఉద్యోగులకు ఉచితంగా గృహవసతి కల్పిస్తే అది కూడా జీఎస్టీ వెలుపలే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 1 నుంచి దేశమంతా జీఎస్టీ పన్ను విధానంలోకి మారిన సంగతి తెలిసిందే. -
అదే నీకూ నాకూ ఉన్న తేడా!
ఓ ధనవంతుడు తన ఇంటికి ఎవరు వచ్చినా సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేయడమే కాదు, వెళ్ళే ముందు వారికి చేతినిండా కానుకలు ఇచ్చి పంపుతారు. ఓ రోజు ఓ జెన్ గురువు ఆ ఊరుకి వచ్చారు. ఆయనను ఆ ధనవంతుడు ఎంతో అభిమానంతో తమ ఇంటికి తీసుకువచ్చారు. ఆయనకు విందు ఏర్పాటు చేసారు. పాయసం, పచ్చడి, కూర, పులుసు, ఇలా అనేక వంటకాలు చేయించారు. ఆయనకు విస్తట్లో చేసిన పదార్థాలన్నీ వడ్డించారు. తీరా ఆ జెన్ గురువు మొత్తాన్నీ అమాంతం తినేశాడు. ధనవంతుడు అదంతా చూస్తూనే ఉన్నాడు. జెన్ గురువు తీరు చూసి ఆయన విస్తుపోయాడు. ‘‘ఈయనేదో పెద్ద గురువని అందరూ చెప్తుంటారు. ఏడుగురు తినే తిండిని ఒక్కడు లాగించేసాడు...?! ఆశ్చర్యంగా ఉందే...?! రకరకాల పదార్థాలను చూసి నోటిని కట్టడి చేసుకోలేకపోయిన ఈయన ఇక మనసునేం నియంత్రించగలడు?’’ ధనవంతుడి మనసులోని భావాన్ని గ్రహించిన జెన్ గురువు ‘‘ఏమిటి నీ సందేహం?’’ అని అడిగాడు. అప్పుడు ధనవంతుడు ‘‘స్వామీ! నేనొకటి అడుగుతాను. తప్పుగా అనుకోకండి’’ అన్నాడు. ‘‘అడుగు. ఏమీ అనుకోను. ఆలోచించకు. అడుగు’’ ‘‘ఇప్పుడు మీరు రుచి చూసి తిన్నారా? మిమ్మల్ని సాధువు అని ఎలా ఒప్పుకోవడం? మీకూ నాకూ ఏమిటి తేడా?’’ గురువు ఓ నవ్వు నవ్వారు. ‘‘ఈరోజు ఇలా రుచికరమైన పదార్థాలు ఎలా తిన్నానో అలాగే రేపు ఉప్పులేని వంట చేసి పెట్టినా దాన్నీ ఆస్వాదిస్తూ తింటాను. కానీ నువ్వలా తినగలవా? నీ నాలుక ఒప్పుకుంటుందా?’’ అని అడిగాడు. ధనవంతుడు ఆలోచించి ‘‘ఊహూ... అదసలు జరగనిపని. రుచికరంగా ఉంటేనే తింటాను. ఏ మాత్రం రుచి తగ్గినా తినలేను...’’ అన్నాడు. జెన్ గురువు ‘‘అదే నీకూ నాకూ ఉన్న తేడా!’’ అంటూ వంటకాలలో ఏవేవి ఎంత రుచికరంగా ఉన్నాయో చెప్పుకొచ్చాడు. ‘‘అన్నీ తృప్తిగా తిన్నానీ రోజు. మరో కప్పు పాయసం ఉంటే ఇవ్వు తాగుతాను... చాలా బాగుంది’’ అన్నాడు. దేనినైనా ఉన్నది ఉన్నట్టు స్వీకరించాలి– అని చెప్తుంది జెన్. అందుకు ఈ జెన్ గురువు ఉదంతం తార్కాణం! – యామిజాల జగదీశ్ -
ఆటో డ్రైవర్‌కు కలిసి వచ్చిన అదృష్టం
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అన్నట్టు ఓ ఆటో డ్రైవర్ ఏకంగా మహీంద్రా స్కార్పియో ఎస్యూవీ మోడల్‌ను అనుకరించి ఓ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. స్కార్పియో వాహనాన్ని త్రీ వీలర్ ఆటోగా తయారు చేసి ఏకంగా పారిశ్రామిక వేత్త మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర మనసు దోచాడు. ప్రతిఫలంగా ఒక సరికొత్త మహేంద్రా ఫోర్ వీలర్ కారును అందుకున్నాడు. కేరళకు చెందిన సునీల్ మహీంద్ర కంపెనీనుంచి ‘మహీంద్ర సుప్రో మినీ ట్రక్’ను అందుకున్నాడు. వివరాల్లోకి వెళితే కొద్ది రోజుల క్రితం మార్చి 19 అనిల్ ఫణిక్కర్ మహీంద్రా స్కార్పియో మోడల్లో ఉన్న ఓఆటో ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. భారతీయ రోడ్లపై స్కార్పియో ఎంత పాపులరో తెలుపుతూ ఆనంద్ మహీంద్రకు ట్యాగ్ చేశారు. దీనికి ఆనంద్ మహీంద్ర స్పందించారు. సదరు ఆటో రిక్షా యజమానిని కనుక్కోవాలని ట్వీట్ చేశారు. మహీంద్రా మ్యూజియం కోసం ఆ రిక్షాను తాను తీసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు దాని స్థానంలో బహుమతిగా అతనికి ఓ బ్రాండ్ న్యూ వాహనాన్ని ఇస్తానని ప్రకటించారు. మహేంద్ర టీం కేరళకు చెందిన సునీల్‌ని గుర్తించిందని ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ ద్వారా బుధవారం వెల్లడించారు. అతనికి కొత్త వాహనం అందించినట్టు తెలిపారు. Here's Sunil, the proud owner of the 3 wheeler 'Scorpio', now a happy owner of a 4 wheeler. All thanks to you twitterati! (2/2) pic.twitter.com/5nb12j2dnj — anand mahindra (@anandmahindra) May 3, 2017 -
రూ.2 కోట్ల ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇచ్చిందట..!
ముంబై: బాలీవుడ హీరోయిన్ కంగనా రనౌత్ తన గురువుగారికి ఖరీదైన గురుదక్షిణ చెల్లించుకున్నారు. యోగా గురు సూర్య నారాయణ సింగ్ కు సుమారు రూ.2 కోట్ల విలువైన ఫ్లాట్ కానుకగా ఇచ్చారు. బాలీవుడ్ లో రంగ ప్రవేశానికి ముందు నుంచీ తనకు శిక్షణనిస్తున్న గురువు పట్ల ఈ క్వీన్ తన విశ్వాసాన్ని ప్రకటించుకున్నారు. ఆయన కోసం ఏదైనా చేయాలని అనుకున్న కంగనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ ఈ ఇంటిని తీర్చిదిద్దినట్టు సమాచారం. ఒక యోగా కేంద్రం ప్రారంభించేందుకు వీలుగా, ముంబైలోని అంధేరి వెస్ట్ లోని డబుల్ బెడ్ రూం ఫ్లాట్ ని కంగన గురువు గారికి బహుకరించారు . యోగా శిక్షణకు అనువుగా ఉండేలా, కంగనా స్పెషల్ కేర్ తీసుకున్నారు. విశాలమైన బాల్కనీ సహా, అన్ని సౌకర్యాలతో మంచి యోగా సెంటర్ గా తీర్చిదిద్దారట. దీనికోసం కొన్ని రోజుల క్రితం కాంట్రాక్టర్ తో సంప్రదించి మరీ ఈ అపార్ట్ మెంట్ ను రూపొందించారట. కాగా బాలీవుడ్ రంగప్రవేశం ముందు జుహు బీచ్‌లో జిమ్నాస్టిక్స్ చేసుకుంటున్న సూర్యనారాయణ సింగ్ (సుమారు 18 ఏళ్ల వయస్సులో) కంగనాను ఆకట్టుకున్నారు. అప్పటినుంచి ఆయన యోగా శిక్షణలో తనను తాను మలుచుకున్నారు కంగనా. ప్రస్తుతం విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ రంగూన్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నసంగతి తెలిసిందే. -
ముగిసిన జాతీయస్థాయి కబడ్డీ పోటీలు
నరసాపురం : జాతీయస్థాయి పురుషుల కబడ్డీ పోటీల విజేతగా విజయాబ్యాంక్ కర్ణాటక జట్టు, మహిళల విభాగంలో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జట్టు చాంపియన్లుగా నిలిచాయి. నరసాపురం రుస్తుంబాధలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలు బుధవారం రాత్రితో ముగిశాయి. ఫ్లడ్‌లైట్ల వెలుగులో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్‌ల్లో పురుషుల విభాగంలో విజయాబ్యాంక్ కర్ణాటక జట్టు 28–16 స్కోర్ తేడాతో బాబా హరిదాస్ హర్యానా జట్టుపై విజయం సాధించింది. మహిళల విభాగంలో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జట్టు 27–25 పాయింట్ల తేడాతో గురుకుల్ హర్యానా(ఏ) జట్టుపై విజయకేతనం ఎగురవేసింది. తొలుత మూడు, నాలుగు స్థానాల కోసం కూడా పోటీ తీవ్రంగా సాగింది. పురుషుల విభాగంలో మూడు, నాలుగు స్థానాల కోసం ఆంధ్రా, పోస్టల్ కర్నాటక మధ్య పోటీ జరిగింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో 2 పాయింట్ల తేడాతో ఆంధ్రా జట్టు గెలిచి మూడోస్థానంలో నిలిచింది. పోస్టల్ కర్నాటక జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. మహిళల విభాగంలో మూడు, నాలుగు స్థానాల్లో హర్యానా(బి), దిండిగళ్ చెన్నై జట్లు నిలిచాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో హర్యానా(బి) జట్టు 8 ఫాయింట్ల తేడాతో దిండిగళ్ చెన్నై జట్టును ఓడించింది. అనంతరం నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ సభలో పురుషుల విజేత జట్టుకు రూ.1 లక్ష నగదు, రెండోస్థానంలో నిలిచిన జట్టుకు రూ.75 వేలు, మూడోస్థానంలో నిలిచిన జట్టుకు రూ.50 వేలు, నాలుగోస్థానంలో నిలిచిన జట్టుకు రూ.25 వేల నగదు, షీల్డులు అందించారు. మహిళా విభాగంలో గెలుపొందిన జట్లకు కూడా ఇదేరకంగా బహుమతులను కలెక్టర్ కాటంనేని భాస్కర్ చేతుల మీదుగా అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాల్సి ఉందన్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, పోటీల కన్వీనర్ కొత్తపల్లి జానకీరామ్, నరసాపురం సబ్ కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.వీర్లవెంకయ్య, జిల్లా కార్యదర్శి ఎం.రంగారావు పాల్గొన్నారు. -
పనికిరాని గిఫ్ట్.. మనమే ఫస్ట్!!
హైదరాబాద్‌లో 71% గిఫ్ట్‌లు అక్కరకు రానివే • 50%తో చండీగఢ్, 38%తో ముంబై ఆ తరవాత • దేశమంతటా ఇదే ధోరణి; నాలుగింట ఒకటి వేస్టే • దుస్తులు, ఆహారం, వంటింటి ఉపకరణాలే అధికం • ఓఎల్ఎక్స్–ఐఎంఆర్బీ ‘పనికిరాని’ సర్వేలో ఆసక్తికర విషయాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘మొన్న మా అబ్బాయి పుట్టినరోజుకు శ్రీలక్ష్మి వచ్చి డ్రెస్ ఇచ్చింది. కానీ ఏం లాభం? మా వాడికి చిన్నదైపోయింది’’ అంటూ తన చెల్లెలు దగ్గర వాపోయింది అనూరాధ. ‘‘సర్లే! ఎవరోఒకరికిమనం కూడా గిఫ్ట్‌గా ఇచ్చేద్దాం’’ అని సలహా ఇచ్చింది ఆమె చెల్లి. నిజానికిది వీళ్లిద్దరి సమస్యే కాదు. దాదాపు ఇండియా అంతా ఉంది. ఎందుకంటే వాళ్లకు ఇతరులిచ్చే బహుమతుల్లో మెజారిటీ వారికి పనికిరానివేనట!!.అలా పనికిరాని గిఫ్ట్‌ల జాబితాలో దుస్తులు, ఆహార వస్తువులు, వంటింటి ఉపకరణాలదే మొదటి స్థానమని ఓఎల్ఎక్స్–ఐఎంఆర్బీ చేసిన సర్వే తేల్చింది. పనికిరాని బహుమతుల జాబితా ఇంటింటా పెరుగుతోందని కూడా ఇది వెల్లడించింది. సర్వేలోని పలు ఆసక్తికర అంశాలివిగో... మీకెవరైనా బహుమతిస్తే అది అక్కరకు రావాలి. కనీసం ఏడాదిలోగా దాన్ని వాడే అవకాశముండాలి. అలా లేకుంటే అది పనికిరాని బహుమతేనని ఈ సర్వే తేల్చింది. వేరొకరిచ్చిన బహుమతులు తమకు నచ్చకుంటేవాటిని ఇతరులకివ్వటాన్ని ఈ సర్వే ‘ఓఎల్ఎక్స్ ఓమ్ని ప్రెజెంట్’గా పేర్కొంది. సర్వే చేసిన కుటుంబాల్లో 24 శాతం ఓమ్ని ప్రజెంట్‌కు బాగా అలవాటు పడ్డాయి. గతేడాది ఇది 20 శాతంగా ఉంది. 14 శాతం మంది తమకుపనికిరాని వాటిని పడేస్తామని చెప్పగా... 7 శాతం మంది మాత్రం విక్రయిస్తామన్నారు. ఇక దానం చేస్తామన్నది మాత్రం 5 శాతమేనట!!. 26 శాతానికి చేరిన పనికిరాని గిఫ్ట్‌లు.. అవసరం లేని వస్తువులను బహుమతులుగా పొందడమనేది 2014లో 16 శాతం ఉండగా.. 2016 నాటికి 26 శాతానికి చేరింది. ప్రతి ఇంటా సగటున 4 ఆహార వస్తువులు, 3 గిఫ్ట్ వోచర్లు, 3 క్లోతింగ్ ఐటమ్స్, 2 వంటింటి ఉపకరణాలు, 2 బొమ్మలు ఇష్టపడని బహుమతులుగా స్టోరేజీలో పడున్నాయి. వీటిని ఇతరులకు బహుమతిగా ఇచ్చేందుకు సందర్భం కోసం వేచి చూస్తున్నారు కూడా. అయితే రీ గిఫ్టింగ్‌లో తమ ఇమేజీని దృష్టిలోపెట్టుకొని అప్రమత్తంగా ఉండేవారూ పెరుగుతున్నారు. రీ గిఫ్టింగ్ చేయకపోవటానికి 31 శాతం మంది ‘ఆ వస్తువును బట్టి నన్ను అంచనా వేస్తారు. ఆ గిఫ్ట్ విలువ నాకు తెలియదనుకుంటారు’ అని కారణం చెప్పారు.అత్యధికంగా రీ గిఫ్ట్ అయ్యే వాటిలో దుస్తులదే అగ్రస్థానం. 2014–15లో 5 శాతంగా ఉన్న దుస్తుల రీ గిఫ్టింగ్.. 2015–16 నాటికి 33 శాతానికి చేరింది. ఆ తర్వాతి స్థానంలో గిఫ్ట్ ఓచర్లు, ఎలక్ట్రానిక్స్, షో పీసెస్ నిలిచాయి. హైదరాబాద్ నెంబర్ వన్... ఏడాది కాలంలో ఇష్టపడని బహుమతి ఒక్కటైనా అందుకున్న నగరాల్లో హైదరాబాద్‌దే అగ్రస్థానం. ఇక్కడి 71 శాతం కుటుంబాలు ఇష్టపడని వస్తువుల్ని పొందారు. చండీగఢ్ 50, ముంబై 38 శాతంతో తర్వాతి స్థానాల్లోనిలిచాయి. చెన్నైలో 2 శాతం, భువనేశ్వర్‌లో 6 శాతం, పుణెలో 7 శాతం కుటుంబాలు మాత్రమే తాము ఇష్టపడని వస్తువులను బహుమతిగా పొందినట్లు తెలియజేశాయి. ‘పనికిరాని’ సర్వే ఎందుకు చేశామంటే.. నచ్చిన వస్తువును కొనటానికి తాము ఇష్టపడని బహుమతులను విక్రయించడం ఈ మధ్య బాగా పెరిగింది. ఓఎల్ఎక్స్లో ఈ జాబితా పెరుగుతుండటంతో అసలు వారికి చేరుతున్న బహుమతులేంటి? అందులోఉపయోగపడేవి ఎన్ని? పడనివి ఎన్ని? అనే అంశాలను లోతుగా అధ్యయనం చేయటానికి ఈ సర్వే చేశాం. 16 నగరాల్లోని 5,800 కుటుంబాలకు చెందిన 19–60 ఏళ్ల వయస్కులు 5,314 మందిని కలిసి ఈ సర్వే చేశాం. – అమర్జిత్సింగ్ బాత్రా, ఓఎల్ఎక్స్ ఇండియా సీఈఓ ఇష్టపడని బహుమతులివే... దుస్తులు, ఆహార వస్తువులు, వంటింటి ఉపకరణాలు, ఇంట్లో పేరుకుపోయిన గిఫ్ట్‌లివే... బెడ్‌షీట్స్, ఎలక్ట్రానిక్స్, పర్సనల్ వస్తువులు -
డిజిటల్ చెల్లింపులకు బంపర్ డ్రా
లక్కీ గ్రాహక్ యోజన, డిజి–ధన్ వ్యాపార్ యోజనల్లో బహుమతుల వర్షం రోజూ 15 వేల మంది వినియోగదారులకు రూ.1000 చొప్పున బహుమతులు న్యూఢిల్లీ: దేశ ప్రజల్ని డిజిటల్ వైపు మళ్లించేం దుకు కేంద్రం గురువారం మరో కీలక నిర్ణయం ప్రకటించింది. డిజిటల్ చెల్లింపులు చేస్తే బంపర్ డ్రాలు, మెగా డ్రాల రూపంలో వినియోగదారులు, వ్యాపారులకు భారీ ప్రో త్సాహకాలు అందించనున్నట్లు తెలిపింది. క్రిస్మస్ నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం కోసం రూ.340 కోట్ల మొత్తాన్ని వెచ్చిస్తున్నట్లు పే ర్కొంది. ఈ మేరకు వినియోగదారుల కోసం ‘లక్కీ గ్రాహక్ యోజన’, వ్యాపారుల కోసం ‘డిజి ధన్ వ్యాపార్ యోజన’లను డిసెంబర్ 25 నుంచి ప్రారంభిస్తున్నామని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. రూ. 50 నుంచి రూ. 3వేల మధ్య డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తే లక్కీడ్రా నిర్వహించి బహుమతులు అందిస్తామన్నారు. దేశానికి ఇది క్రిస్మస్ కానుక అని, డిసెంబర్ 25న మొదటి డ్రా, అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న మెగా డ్రా నిర్వహిస్తామని కాంత్ వెల్లడించారు. అవార్డుల కోసం డిజిటల్ చెల్లింపుల ఐడీల్లో కొన్నింటిని డ్రా ద్వారా ఎంపిక చేస్తారని, యూపీఐ, యూఎస్ఎస్డీ, ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ(ఏఈపీఎస్) ద్వారా జరిపిన కార్యకలాపాలు, రూపే కార్డులు లక్కీ డ్రాకు అర్హమని తెలిపారు. ప్రైవేట్ క్రెడిట్ కార్డులు, ప్రైవేటు కంపెనీల ఈ–వాలెట్ల ద్వారా చేసే కార్యకలాపాలకు ఈ పథకాలు వర్తించవని చెప్పారు. పేద, మధ్య తరగతి, చిన్న వ్యాపారుల్ని డిజిటల్ చెల్లిం పుల విప్లవంలో భాగస్వాములు చేసేందుకు వీటిని ప్రారంభిస్తున్నట్లు కాంత్ పేర్కొన్నారు. 2, 3 వారాల్లో 50 శాతం కొత్త కరెన్సీ వచ్చే 2–3 వారాల్లో కొత్త కరెన్సీ నోట్ల పంపిణీ గణనీయంగా పెరుగుతుందని ఆర్థిక శాఖ వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ గురువారం తెలిపారు. ఇంతవరకూ రూ. 5 లక్షల కోట్ల మేర రూ. 500, రూ. 2 వేల నోట్లు చెలామణీలోకి వచ్చాయని, నెలాఖరుకు రూ.15 లక్షల కోట్ల(రదై్దన నోట్ల మొత్తం)లో 50 శాతం చలామణీలోకి వస్తాయని చెప్పారు. రదై్దన నోట్ల డిపాజిట్ల వివరాల్ని మరోసారి పరిశీలించుకోవాలని, రెండు సార్లు లెక్కించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్బీఐ, బ్యాంకులకు సూచించినట్లు దాస్ చెప్పారు. రూ. 500 నోట్ల ముద్రణ, సరఫరా వేగవంతం చేశామని, 2 లక్షల ఏటీఎంల్లో కొత్త నోట్లకు అనుగుణంగా మార్పులు చేశామని ఆయన వెలడించారు. 80% వస్తే ఆంక్షల సడలింపు! కొత్త కరెన్సీ 80 శాతం చలామణిలోకి వస్తే నగదు ఉపసంహరణలపై ఆంక్షలు సడలించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ముందుగా సహకార బ్యాంకుల్లో, అనంతరం అన్ని వాణిజ్య బ్యాంకుల్లో ఆంక్షలు సడలిస్తామని చెప్పారు. పన్ను చెల్లింపులు, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ప్రభుత్వ చెల్లింపులపై రద్దు చేసిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)ను బ్యాంకులకు రీఇంబర్స్ చేసేందుకు బడ్జెట్లో తగిన ఏర్పాట్లు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఎండీఆర్ చార్జీల కోసం బ్యాంకులు తమ క్లెయింలు ఆర్బీఐకు సమర్పించాలని సూచించింది. పరిమిత నగదు వ్యవస్థే లక్ష్యం: జైట్లీ డిజిటల్ కార్యకలాపాల వ్యయాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు చర్యలు తీసుకుంటున్నాయని, పరిమిత నగదు ఆర్థిక వ్యవస్థే తమ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. నగదు కార్యకలాపాలకు డిజిటల్ వ్యవహారాలు ప్రత్యామ్నాయం కాదని, ఇవి రెండూ సమాంతరంగా కొనసాగుతాయని చెప్పారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ అంటే పరిమిత నగదు ఆధారిత వ్యవస్థ అని... ఏ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నగదు రహితం కాదన్నారు. ముంబైలో రూ. 10 కోట్ల స్వాధీనం ముంబై శివారు చెంబూరులో పోలీసులు ఒక వాహనం నుంచి రూ.10.10 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ. 10 కోట్లు రద్దైన 500 నోట్లు కాగా, రూ. 10 లక్షల విలువైన రూ. 2వేల నోట్లు దొరికాయని పోలీసులు తెలిపారు. పుణే జిల్లాలోని వైద్యనాథ్ అర్బన్ సహకార బ్యాంకు నుంచి నగదును పుణేకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. క్రిస్మస్ కానుక: మోదీ లక్కీ గ్రాహక్ యోజ న, డిజి–ధన్ వ్యాపా ర్ యోజనలు క్రిస్మస్ కానుకలని, డిజిటల్ చెల్లింపులకు ఇవి సాయపడే ప్రోత్సాహకాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. నగదురహిత లావాదేవీలను పెంచే దిశగా ఈ పథకాల ప్రకటన వ్యూహాత్మక అడుగని, నగదురహిత, అవినీతి రహిత భారతం సాధించేందుకివి ఊతమిస్తాయన్నారు. ‘యాక్సిస్’లో 60 కోట్ల అక్రమ నగదు నోట్ల రద్దు అనంతరం యాక్సిస్ బ్యాంకు బ్రాంచీల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నోయిడాలోని సెక్టార్ 51 యాక్సిస్ బ్యాంక్ శాఖలో 20 షెల్ కంపెనీలకు చెందిన రూ. 60 కోట్ల నగదును ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. షెల్ కంపెనీల డైరెక్టర్లు ఎవరనే కోణంలో విచారణ చేపట్టారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం రూ. 600 కోట్ల విలువైన బంగారం కడ్డీల్ని నోయిడాలోని ఒక జ్యువెలరీ షాపు అమ్మిన కేసు విచారణలో భాగంగా ఈ వివరాలు వెలుగు చూశాయి. నోయిడా బ్రాంచ్‌లో బంగారం దుకాణానికి ఖాతాలున్నట్లు గుర్తించి విచారణ కొనసాగించడంతో షెల్ కంపెనీల బాగోతం బయటపడింది. ఇంతవరకూ దేశవ్యాప్తంగా యాక్సిస్ బ్యాంకుల్లో అక్రమాలపై 24 మంది ఉద్యోగుల్ని సస్పెండ్ చేశామని, 50 ఖాతాల్ని నిలిపివేశామని ఆ బ్యాంకు ప్రకటించింది. వినియోగదారులు, వ్యాపారులకు వేర్వేరుగా... లక్కీ గ్రాహక్ యోజన: డిసెంబర్ 25 నుంచి 100 రోజుల పాటు(ఏప్రిల్ 14 వరకూ) రోజు 15 వేల మంది వినియోగదారులకు రూ.1000 చొప్పున నగదు ప్రోత్సహకం అందిస్తారు. వారానికోసారి రూ. లక్ష, రూ.10 వేలు, రూ. 5 వేల చొప్పున 7 వేల మందికి అవార్డులిస్తారు. మెగా అవార్డు కింద ఏప్రిల్ 14న రూ. కోటి, రూ. 50 లక్షలు, రూ. 25 లక్షలు ఇస్తారు. డిజి–ధన్ యోజన: వారానికోసారి 7 వేల మంది వ్యాపారులకు రూ. 50,000, రూ. 5 వేలు, రూ. 2,500ల చొప్పున అవార్డులతో పాటు ఏప్రిల్ 14న వ్యాపారుల కోసం మెగా డ్రాలో రూ. 50 లక్షలు, రూ. 25 లక్షలు, రూ. 5 లక్షలు ఇస్తారు. -
కానుకల కాలం
క్రిస్మస్ వచ్చిందంటే కానుకల కాలం వచ్చినట్టే. శాంటాక్లాస్ అనే గ్రీకు బిషప్ 4వ శతాబ్దంలో ఏ ముహూర్తాన ఈ కానుకల పర్వం మొదలెట్టాడోగాని అప్పటి నుంచి ఇప్పటి వరకు అది అప్రతిహతంగా సాగిపోతూనే ఉంది. ‘అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండే పిల్లలకు మాత్రమే’ వాస్తవానికి ఈ బహుమతులు అందాలని క్రిస్మస్ తాత మొదట అనుకున్నాడు. అలా చెప్పడం వల్ల పిల్లలు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండి, ఆ కానుకల కోసం ఎదురు చూడటంలో ఒక ఉత్సుకత ఉండేది. కాని అల్లరి చేయని పిల్లలు ఎవరు? బుద్ధి ఉండని పిల్లలు ఎవరు? అసలు పిల్లలంటే మంచి పిల్లలు అని కదా అర్థం. అందుకే శాంటా క్లాస్ అందరికీ బహుమతులు ఇచ్చేవాడు. ఆయన పేరు చెప్పి పిల్లలున్న తల్లితండ్రులు తమ పిల్లల దిండ్ల కింద డిసెంబర్ 24 రాత్రి, లేదంటే 25 తెల్లవారుజామున కానుకలు ఉంచేవారు. రానురాను ఈ పద్ధతి విస్తృతి పెంచుకుంది. అనాధ పిల్లలకూ, అన్నార్తులకూ క్రిస్మస్ రోజున దాతలు కానుకలు పంపిణీ చేయడం మొదలెట్టారు. పై ఫొటోలో ఉన్నది అలాంటి క్రిస్మస్ తాతలే. సౌత్ కొరియాలో సియోల్ నగరంలో దాదాపు యాభై మంది భిన్న రంగాల మిత్రులు క్రిస్మస్ తాతయ్యలుగా మారాలనుకున్నారు. మరి కానుకలు ఎవరికి ఇవ్వాలనుకున్నారో తెలుసా? నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలకు ఇవ్వాలనుకున్నారు. అలాంటి పట్టిక సేకరించి నగరంలోని నలుమూలల్లో ఉన్న నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలకు క్రిస్మస్ కానుకలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆరోగ్యంగా సమయానికి పుట్టిన పిల్లలు ఎలాగూ మంచి పిల్లలే. కాని ప్రిమెచ్యూర్ బేబీలకు ఏవో ఆరోగ్య సమస్యలు ఉండనే ఉంటాయి. వారిని కానుకలతో సంతోషపెట్టాలనుకోవడం ఎంత మంచి విషయం. ఎంత ఆనందాన్నిచ్చే సంగతి. అటు పంచినవారికీ. ఇటు పుచ్చుకున్నవారికీ -
తెలుగు తేజానికి బహుమతుల వెల్లువ
-
అవార్డుల ‘రాణి’
26 సార్లు ఉత్తమ సేవలకు పురస్కరాలు ఆదిలాబాద్ టౌన్ : మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదిలాబాద్ రూరల్ ప్రాజెక్టులో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ టీఈవీ రాణి అవార్డుల రాణిగా నిలుస్తోంది. ఉద్యోగిగా ఉత్తమ సేవలు అందిండమేగాక ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యహరిస్తోంది. ఇప్పటి వరకు ఆమె రాష్ట్ర మంత్రులు, జిల్లాలో పని చేసిన కలెక్టర్ల చేతుల మీదుగా, ఐసీడీఎస్ శాఖ ఉన్నత అధికారుల నుంచి సేవ పతకాలను, ప్రశంస పత్రాలను అందుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఆరు సార్లు, ప్రభుత్వం నుంచి పన్నెండు సార్లు, ఉత్తమ కళాకారిణి 4 సార్లు అవార్డులు అందుకుంది. అదే విధంగా ఉత్తమ కవయిత్రిగా 8 సార్లు పురస్కారాలు అందుకున్నారు. సోమవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సమాచార పౌర సంబంధాల శాఖ నుంచి రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, జిల్లా కలెక్టర్ జగన్మోహన్ నుంచి ఉత్తమ వ్యాఖ్యత అవార్డును అందుకున్నారు. అవార్డును అందుకున్న ఆమె శాఖ అధికారులు, ఉద్యోగులు అభినందించారు. -
స్నేహం ఓ మధురం
స్నేహం.. ఓ మధురానుభూతి. అది కలకాలం నిలిచిపోతుంది. దీనికి గుర్తుగా ఓ మంచి బహుమతి ఇవ్వాలని స్నేహితులు ఆరాటపడుతుంటారు. ఏటా ఆగస్టు తొలి ఆదివారం జరుపుకొనే ఫ్రెండ్‌షిప్‌డే కోసం చిన్నాపెద్దా ఎదురుచూస్తుంటారు. స్నేహానికి మధురస్మతిగా చక్కటి బహుమతితో ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందర్నీ ఆకర్షించే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, బహుమతులు విక్రయించే స్టాళ్లు నగరంలో ఎక్కడికక్కడ ఆకర్షిస్తున్నాయి. యూత్ అభిరుచి తగ్గట్టుగానే డార్లింగ్ పారడైజ్ వంటి గిఫ్ట్హౌసెస్లో 2016 లేటెస్ట్ బహుమతులు అందుబాటులో ఉన్నాయి. ఫ్రెండ్షిఫ్ ఫిల్లో, మెసేజ్బాటిల్, ఫొటోఫ్రేం, వాటర్ ఫౌంటైన్, బాస్కెట్ విత్ టెడ్డీబేర్, ఫ్రెండ్షిప్ చాక్లెట్, ల్యాంప్, ఫ్రెండ్షిప్ వాటర్ డూమ్, గ్రీటింగ్ కార్డ్సు, ఫ్రెండ్షిప్ కీచైన్లు, చాక్లెట్ విత్ బోకే టెడ్డీ తదితర బహుమతులు ఆకట్టుకుంటున్నాయి. – పెదవాల్తేరు -
కొత్త దేవతల వరాల జల్లులు
జాతిహితం ద్రవిడ సాధికారతా మహోద్యమాన్ని ప్రజ్వలింపజేసిన నాస్తికత్వం నేడు పాతకాలపు ఉద్వేగంగా మారిపోయింది. ద్రవిడ పార్టీలు నాస్తికత్వాన్ని వదిలేయడంతో తాయిలాల పంపకం కొత్త దేవునిగా అవతరించింది. హేతువాదం క్షీణించి, ద్రవిడ రాజకీయాలు చీలి పోవడంతో ఏర్పడ్డ రెండు పార్టీలూ నేడు పూర్తి భావజాలరహితమైనవిగా మారాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో పెద్ద సమస్యలూ లేవు, ఒకరినొకరు అవినీతిపరులని ఆరోపించుకునే అవకాశమూ లేదు. రెండు పార్టీల ఉమ్మడి విశ్వాసం తాయిలాల పంపకమే. మన దేశంలో పర్యటిస్తున్నప్పుడు కనిపించే గోడల మీద రాతలు కొత్త పరిణామాల ఆవిర్భావాన్ని సూచిస్తుంటాయి. ప్రత్యేకించి ఎన్నికల సమ యంలోననే కాదు, ఎప్పుడైనా జరిగేదే. నగరాలు, వేగంగా పట్టణీకరణ చెందుతున్న గ్రామాలతో కూడిన పల్లెపట్టున పర్యటిస్తున్నప్పుడు మనం పూర్తిగా కళ్లు విప్పార్చి, చెవులు రిక్కించి గోడల మీద ఏమి రాసున్నదో లేదా మన చెవుల్లో ఏమి మారుమోగుతున్నదో గమనించాలి. మన దేశంలో ఏది మారుతోందో, ఏది మారడం లే దో అనివార్యంగా మీకు తెలుస్తుంది. భారత ఉపఖండం తన హృదయాన్ని గోడల మీద పరుస్తుంది. తమిళనాడు రాజ కీయాలు ప్రత్యేకమైనవి అయినంత మాత్రాన ఆ రాష్ట్రం అందుకు మినహా యింపనడానికి హేతువేమీ కనిపించదు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు, పేరెన్నికగల పట్టు వస్త్రాలకు పేరుమోసిన కాంచీపురం నాకు దేశంలోకెల్లా అత్యంత ఇష్టమైన స్థలం. చెన్నైకి వంద కిలోమీటర్ల దూరంలోని ఆ పాత పట్టణం శివారున పురాతనమైన శంకర మఠం ఉంది. అది శంకారాచార్యుల నివాసస్థానం. సనాతన హిందూవాద ఆధ్యాత్మిక అధికారానికి అతి ప్రముఖ కేంద్రం. అక్కడ మీరు తగినంత ఎక్కువ కాలమే గడిపేట్టయితే, నేను అక్కడికి వెళ్లిన మొదటిసారి చేసినట్టే మీరూ శంకరాచార్యులను సందర్శించడానికి వెళ్లేట్టయితే... ఆయన ‘‘జూని యర్’’ రాక కోసం వేచి చూస్తున్న శ్రోతలకు వినిపించే రికార్డు చేసిన సంస్కృత శ్లోకాలూ, మఠానికి బయట పక్కనే ఉన్న జుమా మసీదు నుంచి వినిపించే అజాన్ (ప్రార్థనకు పిలుపు) అనుద్దేశపూర్వకంగానే కలగలసి జుగల్ బందీలా ధ్వనించడాన్ని వినకుండా ఉండలేరు. మతతత్వం, నాస్తికత్వాల సహవాసం సరిగ్గా ఆ వీధి కూడలిలో శంకరాచార్యుల కోసం పూలు, పళ్లు కొనడానికి దిగే చోట... 20వ శతాబ్దపు అత్యంత సుప్రసిద్ధ విగ్రహ విధ్వంసకుడైన పెరియార్ బస్ట్ సైజు విగ్రహం కనిపిస్తుంది. ఆయనను మరచిపోయిన తరాలవారు సునీల్ ఖిలానీ తాజాగా రాసిన ‘ఇన్కార్నేషన్స్’ను త్వరత్వరగా తిరగేసి చూడొచ్చు. బ్రాహ్మణవాదం, కులవాదం, సామాజిక అసమానత, మూఢ నమ్మకాల వ్యతిరేక పోరాటంతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన, వివాదాస్పదమైన సామాజిక-రాజకీయ పరివర్తన ఉద్యమాన్ని పెరియార్ ప్రారంభించారు. ఆయన వీటన్నిటినీ హేతువాదం, నాస్తికత్వం అనే ఒకే భావజాల ఛత్రం కింద చేపట్టారు. ఇప్పుడాయన మఠం, మసీదులను చూస్తూ ఉన్నారు. అంతేకాదు విగ్రహానికి కింద దేవుడిని, దైవత్వాలను ఖండిస్తూ చేసిన ఆయన వ్యాఖ్యలు పెద్ద పెద్ద అక్షరాలతో చెక్కించుకుని మరీ పరివేష్టితులై ఉనారు. దేవుడు లేడు/దేవుడు లేడు/దే వుడు లేనే లేడు/దేవుణ్ణి కనిపెట్టివవాడు మూర్ఖుడు/దేవుణ్ణి ప్రచారం చేసేవాడు వంచకుడు/దేవుణ్ణి పూజించేవాడు ఆటవికుడు: దేశంలోని మరే ప్రజా నాయకుడు దేవుణ్ణి ఖండించి, ధిక్కరించి ఎరుగని రీతిలో ఆయన... గొప్ప హిందూ సాంస్కృతిక కేంద్రం, ప్రముఖ మసీదులతో పాటూ ఆ వ్యూహాత్మక ప్రదేశాన్ని పంచు కుండటమే ముఖ్యమైన విషయం. గాఢమైన, సనాతన మతతత్వం, అత్యంత సూటియైన హేతువాదం కలసి ఒకే రెండు వందల చదరపు గజాల స్థలాన్ని పంచుకోవడాన్నిమరే దేశంలో చూడగలం? హిందూ గ్రూపులు దీన్ని అపచారమంటూ సవాలు చేశాయి. కానీ మద్రాసు హైకోర్టు 1979 తీర్పులో ఒక వ్యక్తి విగ్రహంతో పాటూ అతని అభిప్రాయాలను లిఖించడంలో తప్పేమీ లేదని తీర్పు చెప్పింది. ఆ ఆదేశాల సారాంశం సైతం కళ్ల జోడు పెట్టుకున్న పెరియార్‌కు దిగువన మరో నల్ల రాతిపై కనిపిస్తుంది. సుప్రసిద్ధ విగ్రహ విధ్వంసకుడే నల్ల రాతి ప్రతిమ అవతారమెత్తి దేవుళ్లను వెక్కిరించడం, అది నల్ల రాతిపై తెల్ల అక్షరాలతో చెక్కి ఉండ టానికి మించిన వ్యంగ్య పరిహాసం ఇంకేమంటుంది? నాస్తికత్వానికి ద్రవిడ పార్టీల చెల్లు చీటి ఒకప్పడు ద్రవిడ సాధికారతా మహోద్యమాన్ని ప్రజ్వలింపజేసిన నాస్తికత్వం నేడు పాతకాలపు ఉద్వేగంగా మారిపోయింది. బ్రాహ్మణ కులానికి చెందిన జయలలిత తన మతతత్వాన్ని ఎన్నడూ దాచుకున్నది లేదు. ఇక క రుణానిధి, ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త యోగేంద్ర యాదవ్ (నా వాదనకు మద్దతు కోసం ఆధారపడుతున్నది ఆయనపైనే) అన్నట్టు... పాత హేతువాదపు చివరి ప్రముఖ స్వరంగా ఇంకా కొనసాగుతూనే ఉన్నా, ఆయన తర్వాత ఇప్పట్లో అలాంటి వారు ఆవిర్భవించరు. ఆయన కుమారుడు స్టాలిన్ కుటుంబం తరచుగా దేవాలయాలను సందర్శిస్తుంది. పురావస్తు, చారిత్రకపరమైన ఆసక్తితోనే వెళుతున్నామనేదే వారు చెప్పే ప్రధానమైన సాకు. ఎన్నికలు జరగ నున్న తమిళనాడులో నేను గడిపిన ఐదు రోజుల్లో దేవుడులేడనే తత్వం గుర్తున్న ఒక్క ఓటరు కూడా నాకు కనబడలేదు లేదా నా దృష్టికి రాలేదు. ఆలయాల నిండా భక్తులున్నారు. పెద్ద సంఖ్యలో బ్రాహ్మణేతర పురోహితు లున్నారు. దక్షిణాదిలోని ప్రముఖ దైవాంశ సంభూతులైన బాబాలు, గురు వుల అనుయాయులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్, శ్రీశ్రీ రవిశంకర్‌లు సైతం వారిలో ఉన్నారు. కరుణానిధి భార్య లలో ఒకరు పెద్ద కుంకుమ బొట్టును పెట్టుకుంటారని డీఎండీకే నేతగా మారిన సినీ నటుడు విజయ్‌కాంత్ చెబుతున్నారు. తమిళ రాజకీయాలు, సంస్కృతికి సంబంధించిన ప్రముఖ చరిత్రకారులలో ఒకరైన ఏఆర్ వెంకటాచలపతి నేను కనుగొన్న విషయాలతో ఏకీభవిస్తూనే... సీఎన్ అన్నాదురై సైతం 1940ల చివర్లో పెరియార్‌తో విడిపోయినప్పుడు ఆయన నాస్తికత్వానికి దూరంగా జరిగారనే విషయాన్ని నొక్కి చెప్పారు. ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనే సమస్యపై అన్నాదురై, పెరియార్‌కు దూరమయ్యారు. ఏడు దశాబ్దాల తర్వాత సరిగ్గా అదే విషయంపై కేజ్రీవాల్, అన్నా హజారే నుంచి విడిపోయారు. సామాజిక అసమానతపై దాడి చేయడానికి హేతు వాదాన్ని ఉపయోగించుకోవడం, అందుకు వ్యతిరేకులుగా ఉన్న ఓటర్లను ఆక ట్టుకోవడం పూర్తిగా భిన్నమైనవని అన్నాదురై గుర్తించారని వెంకటాచలపతి గుర్తుచేశారు. తమిళనాడులోకెల్లా అత్యంత జనాదరణగల దేవుడు గణేశుడు. అంతేకాదు పెరియార్ పగలగొట్టిన దేవుళ్ల విగ్రహాల్లో గణేశుని విగ్రహాలే ఎక్కువ. ‘‘నేను పిళ్లయ్యార్కు కొబ్బరికాయలూ కొట్టను, ఆయన విగ్రహాలూ పగులగొట్టను’’ అని అన్నాదురై 1954లో చెప్పిన సుప్రసిద్ధ వాక్యాలను ఆయన గుర్తుకు తెచ్చారు. అమ్మ, స్టాలిన్ల నడుమ ఆ ఎడబాటు ఇప్పడు పరిపూర్ణమైంది. జనాకర్షణ కోసం పాట్లే భావజాలం బ్రాహ్మణాధిపత్య క్షీణత కూడా ఇందుకు తోడ్పడింది. పీకే సినిమాలోని అమీర్‌ఖాన్ అంగారక గ్రహవాసి బాబాలకు ‘‘దేవుని మేనేజర్లు’’ అని పేరు పెట్టడానికి చాలా ముందే ద్రవిడ ఉద్యమ వ్యవస్థాపకులు ఆ విషయాన్ని గుర్తించారు. ఇప్పుడా మేనేజర్లు ధైర్యంగా మాట్లాడుతుండగా... నాటి ద్రవిడ ఉద్యమ నేతల పిల్లలకు దేవలతో అలాంటి పేచీయే లేకుండా పోయింది. ఆ పార్టీల్లోని కరడుగట్టిన నాస్తికులు దీనికి చుట్టుదారిని కనుగొన్నారు. వృద్ధ కరుణానిధిలాగే నేనూ కొంతకాలం ప్రముఖ యోగా బోధకుడు టీకేవీ దేశి కాచార్ (కృష్ణమాచార్య యోగా మందిరం) వద్ద యోగాభ్యాసం చేశాను. ఆయన ఎన్నడూ ‘‘ఓం’’ అని పలికి ఎరుగరు. ‘‘సూర్యుడు, ఎంతైనా మా పార్టీ గుర్తే కదా’’ అంటూ ఆయన తనకు సూర్య నమస్కారాలతో సమస్యేమీ లేదని చెప్పారు. హేతువాదం క్షీణించిపోయి, ద్రవిడ రాజకీయాలు చీలిపో వడంతో దాదాపు ఒకే భావజాలంగల రెండు పార్టీలు ఏర్పడ్డాయి. అయితే ఆ రెండు పార్టీలూ నేడు పూర్తి భావజాలరహితమైనవిగా మారిపోయాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో శ్రీలంక సహా పెద్ద సమస్యలంటూ ఏమీ లేవు. తమిళ రాజకీయాల్లోని ఆ రెండు ధ్రువాలను సూచించే ప్రత్యేక సూత్రాలు, భావాలు లేదా నినాదాలు ఏవీ లేవు. ఒకరు మరొరిని అవినీతిపరులని ఆరోపించే అవకాశమైతే అసలుకే లేదు. ఉన్నవల్లా యుద్ధానికి దిగిన కుటుంబాలే. అవి కరుణానిధి కుటుంబం, ఎమ్జీఆర్ కుటుంబం. రెండు పార్టీల ఉమ్మడి విశ్వాసం ఓటర్లకు తాయిలాల పంపకమే. అమ్మ ఓటరుకు పూర్తి వంటగది సామాను, కుటుంబ వినోదం, కొంత బంగారం కూడా ఉచితంగా ఇచ్చేస్తారు. డీ ఎంకే ఆమె ఇచ్చే ఉచిత కానుకలను దుమ్మెత్తి పోస్తుందనిగానీ, అదీ విద్యార్థుల, రైతుల రుణాలను మాఫీ చేస్తానంటుంది. ఇక విజయకాంత్ ఈ అర్థరాహిత్యాన్ని మరో స్థాయికి లేవ నెత్తి ఉచితంగా రేషన్ సామానంతా ఇంటికే సరఫరా చేస్తామంటారు. దేవుడు పూర్తిస్థాయిలో పునఃప్రవేశం చేయడంతో తాయిలాల పంపకమే నూతన రాజకీయ భావజాలంగా మారింది. అయినా ద్రవిడవాద పునరు ద్ధరణ మొలకలు కొన్ని కనిపిస్తున్నాయి. అతి చిన్న పట్టణాలలో పుస్తకాలు, పేపర్ల దుకాణాల్లో పెరియార్ రచనలు అత్యధికంగా అమ్ముడు పోతున్నాయి. ‘‘ఒక రాజకీయ మతాన్ని దాని అనుచరులు వదులుకున్నాక దాని అంచులలో మనుగడ సాగిస్తున్నవారు మరింత గట్టి భావజాలవాదులుగా మారారు’’ అని వెంకటాచలపతి అన్నారు. నేటి తమిళనాడులో పెరియార్వాదులైన యువత, విద్యార్థులు పెరగడం, విద్యావంతులైన దళిత యువత ఆయనపట్ల ఆకర్షితులు కావడం పెరగడం దాన్నే ప్రతిబింబిస్తోంది. ఈ నూతన కేంద్రీ కరణ ఎంత శక్తివంతమైనదో మనం ఇప్పటికే మద్రాసు ఐఐటీలో అంబేడ్కర్-పెరియార్ గ్రూపు ఏర్పాటు ద్వారా చూశాం. భారత రాజ కీయాలు ఎప్పుడూ విస్మయకర అంశాలను బయటపెడుతుంటాయి. అదే మన రాజకీయాలకున్న ప్రబల ఆకర్షణ శక్తి. - శేఖర్ గుప్తా Twitter@ShekarGupta -
ఆ ఎమ్మెల్యేల మొహాలు వెలిగిపోయాయి!
పాట్నా: బిహార్ అసెంబ్లీలో 243 మంది ఎమ్మెల్యేలు శుక్రవారం అత్యంత సంతోషంగా కనిపించారు. అధికార, విపక్ష సభ్యులన్న తేడా లేకుండా అందరి మొహాలు మతాబుల్లా వెలిగిపోయాయి. కారణం ఏమిటంటే ఎమ్మెల్యేలు అందరికీ గిఫ్ట్ లు పంచారు. బడ్జెట్ సమావేశాలకు హాజరైన సభ్యులకు మైక్రో ఓవెన్లు, సూట్ కేసులు, బ్యాగులు అందజేశారు. బడ్జెట్ సెషన్ లో ఎమ్మెల్యేలకు ప్రతి శాఖ వివిధ బహుమతులు ఇవ్వడం బిహార్ లో రెండు దశాబ్దాలుగా జరుగుతోంది. మైక్రో ఓవెన్లను కానుకలుగా ఇచ్చిన విద్యాశాఖ వీటికోసం రూ.30 లక్షలు వెచ్చించింది. చాలా ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోందని విద్యాశాఖ మంత్రి అశోక్ చౌధురి తెలిపారు. దీనిపై స్పందించేందుకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిరాకరించారు. ఎమ్యెల్యేలకు గిఫ్ట్ లు ఇస్తే తప్పేంటని డిప్యూటీ సీఎం తేజశ్వి యాదవ్ ప్రశ్నించారు. 'బిహార్ వెనుకబడిన రాష్ట్రం. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారంతా కోటీశ్వరులు కాదు. పేదలు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి కొన్ని కానుకులు ఇస్తే తప్పేంటి. ఈ విషయాన్ని పెద్దది చేయొద్ద' అని సూచించారు. అన్ని శాఖలు కలిపి ఒకే రకమైన కానుక ఇస్తే బాగుంటుందని గతంలో బీజేపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ సూచించినా అధికారులు పట్టించుకోవడం లేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. -
సల్మాన్ ఆమెకు కార్ కొనిచ్చాడు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. తనకు బాగా నచ్చిన వారిని కాస్ట్ లీ గిఫ్ట్ లతో సర్ ప్రైజ్ చేయటం సల్మాన్ ఖాన్ కు అలవాటు. ముఖ్యంగా తనతో కలిసి నటించిన హీరోయిన్లుకు భారీ గిఫ్ట్ ఇచ్చి సంతోష పెడుతుంటాడు ఈ బ్యాచిలర్ స్టార్. అందుకే హీరోయిన్లు సల్మాన్ తో ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా మంచి రిలేషన్ మెయిన్ టెయిన్ చేస్తారు. తాజాగా తనతో జయహో సినిమాలో కలిసి నటించిన డైసీ షాకు ఓ కాస్ట్ లీ కారును గిఫ్ట్ ఇచ్చాడు సల్మాన్. రెండు రోజుల క్రితమే ఈ గిఫ్ట్ డైసీ కి చేరింది. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్న డైసీ షా ఇటీవల హేట్ స్టోరి 3లో బోల్డ్ క్యారెక్టర్ లో దర్శన మిచ్చింది. అప్పట్లో ఈ క్యారెక్టర్ లో నటించడానికి సల్మానే ఈ ముద్దుగుమ్మను ఒప్పించాడన్న టాక్ వినిపించింది. మరి సల్మాన్ డైసీ షాకు గిఫ్ట్ తోనే సరిపెడతాడో.. లేక తన నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కూడా ఇస్తాడో చూడాలి. -
రాందేవ్ బాబాకు వరాలపై వరాలు
న్యూఢిల్లీ: ముక్కు మూసుకొని యోగా చేసుకునే బక్కపల్చని రాందేవ్ బాబాకు బీజేపీ పాలిత రాష్ట్రాలు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరాల మీద వరాల వర్షం కురిపిస్తోంది. నాగపూర్‌లోని 600 ఎకరాల స్థలాన్ని రాందేవ్ బాబాకు చెందిన పతంజలి యోగ పీఠానికి అప్పగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ స్థలంలో రాందేవ్ బాబా ఆరెంజ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారట. 2010లో హిమాచల్‌లోని అప్పటి బీజేపీ ప్రభుత్వం 28 ఎకరాల స్థలాన్ని కేవలం 17 లక్షల రూపాయలకు 99 ఏళ్లపాటు లీజుకు ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆయనకు దక్కుతున్న వరాలు అన్నీ ఇన్నీ కావు. అండమాన్‌లో ఓ యోగా రిసార్ట్ ఏర్పాటు చేయడం కోసం కేంద్రంలో షిప్పింగ్ శాఖ మంత్రిగా పని చేస్తున్న గడ్కారి ఏకంగా ఓ దీవినే రాసిచ్చారు. ఆయనకు ఇప్పటికే స్కాట్లాండ్లో పీస్ ఐలాండ్ అనే 900 ఎకరాల దీవి ఉంది. దీన్ని 2009లో ఓ ఎన్ఆర్ఐ జంట బహుమతిగా ఇచ్చింది. 2015, ఫిబ్రవరిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యోగా సంబంధిత ఛారిటబుల్ ట్రస్టులను పన్నుల నుంచి మినహా ఇస్తున్నట్టు ప్రకటించారు. కేవలం రాందేవ్ బాబాను దృష్టిలో పెట్టుకొనే ఈ వరాన్ని ప్రకటించారనడంలో సందేహం లేదు. బాబా కంపెనీలు వందల కోట్ల రూపాయల లాభాలను గడిస్తున్నా ప్రధాని ప్రకటించిన పన్ను మినహాయింపులను ఉపయోగించుకోవడం ఆయన కంపెనీల్లో ఛారిటీ ఎంతుందో తెలుస్తోంది. అధికారంలోవున్న బీజేపీ ప్రభుత్వాన్ని అడ్డంగా వాడుకుంటున్న రాందేవ్ బాబా ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’ను సమాంతరంగా వైదిక్ ఎడ్యుకేషన్ బోర్డును ఏర్పాటు చేస్తానని, ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ సమ్మతి కూడా ఉందని గత అక్టోబర్ నెలలో స్వయంగా ప్రకటించారు. అది ఈ ఏడాదిలో కార్యరూపం దాలుస్తుందని కూడా ఆయన అనుచరులు తెలియజేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం మంత్రి పదవి ఇస్తానన్న కాదన్న రాందేవ్ బాబా జెడ్ క్యాటగిరీ భద్రతను స్వీకరించారు. మంత్రికి ఇద్దరు గన్‌మెన్‌లుంటే ఈయనకు ఇప్పుడు 20 మంది గన్మెన్లు ఉన్నారు. విమానాశ్రయాల్లో ఎలాంటి తనికీ లేకుండా వెళ్లేందుకు అనుమతించే జాబితాలో తన పేరును చేర్చాలని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇంకా ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దేశంలో ఖాదీ మార్కెటింగ్ వ్యవస్థను కూడా తనకే అప్పగించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇంకా ఆ కోరిక తీరాల్సి ఉంది. పతంజలి యోగా పీఠానికి చెందిన కంపెనీల ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి టైఅప్ కోసం ప్రతిష్టాకరమైన డీఆర్డీవో కూడా ముందుకు వచ్చిందంటే ప్రభుత్వంపై ఆయనకు ఎంత పట్టు ఉందో అర్థం అవుతుంది. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసినందుకే ప్రభుత్వం ఆయనకు ఇన్ని వరాలను ఇస్తుందా? అన్న విషయం స్పష్టం కావాలి. కాషాయరంగు గోచితో కనిపించే రాందేవ్ బాబా కంపెనీలకు 2015 సంవత్సరానికి రెండువేల కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చినట్లు కంపెనీ రిటర్న్స్ తెలియజేస్తున్నాయి. -
ఇంటెలిజెన్స్ పోలీసులకు సర్కారు కానుక
25 శాతం అదనపు అలవెన్స్ ఇవ్వాలని ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కానుక ప్రకటించింది. ఇంటెలిజెన్స్‌లో పనిచేసే పోలీసులు, నేర విచారణ విభాగం (సీఐడీ)లో పనిచేసే సిబ్బందికి మూలవేతనంతో పాటు 25 శాతం అదనపు అలవెన్స్‌ను ప్రకటించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఎస్ఐబీలో పనిచేసే వారికి 50 శాతం అదనపు అలవెన్స్, సీఎస్ఎల్, అక్టోపస్లలో పనిచేసే వారికి 60 శాతం, ఏసీబీలో పనిచేసే వారికి 30 శాతం అదనపు అలవెన్స్ ఇస్తున్నారు. ఇక నుంచి ఇంటెలిజెన్స్, సీఐడీలలో పనిచేసే వారికీ అదనపు అలవెన్స్ లభించనుంది. -
కత్రినాకి లవర్ బాయ్ గిఫ్ట్
ముంబై: కత్రినా కైఫ్ కు ఫితూర్ హీరో ఆదిత్యరాయ్ కపూర్ స్వయంగా ఒక బహుమతి కొనిచ్చాడట. స్వచ్ఛమైన కాశ్మీరీ పష్మీనా శాలువాను ఆమెకు బహుకరించాడు. 'ఆషికీ' ఫేం ఆదిత్యరాయ్ కపూర్ స్వయంగా దగ్గరుండి మరీ ఎంతో ఇష్టంగా ఈ కానుకను సెలెక్ట్ చేశాడని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆదిత్య, కత్రీనాల ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ ఎలావుంటుందోనని ఇప్పటికే బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పష్మీనా షాల్ శాలువాపై చేతితో చేసిన ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఇదే దీని ప్రత్యేకత కూడా.. ఇదిలా ఉండగా, చార్లెడ్ డికెన్స్ రచించిన ‘గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్' నవల ఆధారంగా కత్రినా కైఫ్, ఆదిత్యరాయ్ కపూర్ జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఫితూర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో వీరిద్దరి మధ్య ఉన్న రొమాంటిక్ సీన్ల గురించి ఇప్పటికే హాట్ టాపిక్ గా వినిపిస్తోంది. -
ఇవ్వడంలోని ఆనందమే వేరు!
క్రిస్మస్ అంటే ఒకరికి ఇవ్వడంలో ఉండే సంతోషాలను అనుభవించడం. మరొకరికి సంతోషాలను పంచివ్వడంలో ఉండే ఆనందాన్ని పొందడం. నేను క్రిస్మస్ ద్వారా తెలుసుకున్నది... ఇవ్వడంలోని హాయిని అనుభూతి చెందడం. ఎందుకంటే... క్రిస్మస్ గురించి నాకు చిన్నప్పటి నుంచీ స్పష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. క్రిస్మస్ అనగానే మా ఉపప్రధాన అధ్యాపకులు సుందరం మాస్టారు, విక్టోరియా టీచర్, విమలమ్మగారు, ఇంకా మా నాన్న కొలీగ్ మోజెస్ గారు... ఇలా చాలామంది గుర్తుకొస్తారు. ఆ పండుగ రోజున మా నాన్నగారు వాళ్లకు కేక్స్, ఫ్రూట్స్ పంపుతుండేవారు. అప్పటికి నా వయసు పదీ పన్నెండేళ్లు ఉండేది. ఆ తర్వాత నేను ఇంగ్లండ్ వెళ్లాక క్రిస్మస్ అంటే మళ్లీ గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుండేది. ఇక క్రిస్మస్ సమయంలో మా ‘హృదయ ఫౌండేషన్’కు ఎన్నెన్నో విరాళాలు పంపుతుంటారు. మనకు ఉన్నదానిలో ఇతరులకు ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ల సంతోషాన్ని చూసి మనం పొందే ఆనందం ఎలా ఉంటుందో చిన్నప్పుడు తెలుసుకున్నాను నేను. ఇలా హృదయ ఫౌండేషన్‌కు ఇవ్వడం ద్వారా ఇతరులూ అదే సంతోషాన్ని పొందుతున్నారనే విషయాన్ని ఇప్పుడు పెద్దయ్యాక సహానుభూతి వల్ల తెలుసుకోగలుగుతున్నాను. చిన్నప్పుడు వ్యక్తిగా ఇవ్వడంలోని ఆనందాన్ని తెలుసుకున్న నేను... పెద్దయ్యాక అదే విషయాన్ని డాక్టర్‌గా కూడా తెలుసుకున్నాను. ఒక్కమాటలో చెప్పాలంటే క్రిస్మస్ అంటే ‘ఇవ్వడం’. - డా॥గోపీచంద్ మన్నం కార్డియోథొరాసిక్ సర్జన్, స్టార్ హాస్పిటల్స్ -
శ్రీవారు.. మేటి శ్రీమంతుడు
* తిరుమలేశుని ఆస్తులు రూ. 2 లక్షల కోట్లకుపైనే * ఏటేటా పెరుగుతున్న భక్తులు, కానుకలు, బడ్జెట్ * పెట్టుబడులు రూ. 10 వేల కోట్లకుపైనే సాక్షి, తిరుమల: ఆపద మొక్కులవాడు శ్రీవేంకటేశ్వరుడి సిరి సంపదలు యేటేటా పెరుగుతున్నాయి. ఘాట్ రోడ్లు ఏర్పడక ముందు వేలల్లో ఉండే ఆదాయం నేడు కోట్లకు చేరింది. శ్రీవారి స్థిరాస్తుల విలువ రూ. రెండు లక్షల కోట్లపైనే ఉంటుందని అంచనా. హైకోర్టు ఆదేశాలతో లెక్కలు తీసిన టీటీడీ శ్రీవారి ఆస్తులు ఎంత? ఎక్కడెక్కడున్నాయి? వాటి వివరాలేమిటీ? అన్న విషయంలో దశాబ్దాలుగా విమర్శలున్నాయి. రాష్ర్ట అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు దేశ విదేశాల్లో ఉన్న శ్రీవారి స్థిరాస్తులను 2009లో టీటీడీ లెక్కలు తీసింది. ఈ మేరకు 4,143.67 ఎకరాల్లో భూములు, భవనాలు గుర్తించి ప్రభుత్వ ధర ప్రకారం కనీస ముఖ విలువ రూ. 33,447.74 కోట్లుగా నిర్ధారించారు. వాటికి సంబంధించిన రికార్డులను కోర్టుకు సమర్పించారు. వీటి విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ. 2 లక్షల కోట్ల కు పైబడే ఉంటుందని అంచనా. రూ.10 వేల కోట్లు దాటిన శ్రీవారి పెట్టుబడులు తిరుమల శ్రీవారికి పెట్టుబడుల(ఫిక్స్డ్ డిపాజిట్లు) రూపంలో బ్యాంకుల్లో రూ. 10వేల కోట్లకు పైబడి ఉన్నాయి. వీటిపై ఏడాదికి టీటీడీకి రూ. 744 కోట్ల మేరకు వడ్డీ రూపంలో వడ్డికాసులవాడి చెంతకు చేరుతోంది. రాబోవు రెండు మూడు ఏళ్లలోనే పెట్టుబడులపై వడ్డీ రూ. వెయ్యికోట్లు దాటే అవకాశముందని ఆర్థిక నిపుణుల అంచనా. ఇక వివిధ ట్రస్టులకు భక్తులు ఇచ్చే విరాళాలు అదనం. శ్రీవారి నిత్యాన్నప్రసాద ట్రస్టులో 2015 ఏప్రిల్ 5 నాటికి దాతలు ఇచ్చిన విరాళాలు రూ. 591 కోట్లకు చేరాయి. ప్రాణదాన ట్రస్టు కింద సుమారు రూ.200 కోట్లు, మిగిలిన ట్రస్టుల్లో మరో రూ. 300 కోట్లు ఉన్నాయి. ఇవిగాక రోజువారీగా భక్తుల నుంచి వచ్చే విరాళాలు ఏడాదికి సుమారు రూ. 100 కోట్లు వస్తుండడం గమనార్హం. రూ. 2,530 వేల కోట్లకు పెరిగిన బడ్జెట్ 1933 ప్రారంభంలో టీటీడీ బడ్జెట్ లక్షల్లో మాత్రమే ఉండేది. ప్రస్తుతం 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,530 కోట్లతో ధార్మిక బడ్జెట్ నిర్ణయించారు. ఇక స్వామిని దర్శించే భక్తులు ప్రతియేటా పెరుగుతున్నారు. 2010లో 2.14 కోట్ల మంది దర్శించుకోగా 2015 అర్థసంవత్సరానికి 1.5 కోట్ల మందికిపైగా తరలి వచ్చారు. -
కిలో కొకైన్కు... రూ.2.40 లక్షలు
‘సేవకు సేవ...సొమ్ముకు సొమ్ము’ అనేలా ప్రజలకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్నారు. బంగారం, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై సమాచారాన్ని ఇలా అందించి అలా బహుమతి సొమ్ము పట్టుకు పోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చెన్నై : విదేశాల నుంచి భారత్‌కు బంగారం అక్రమ రవాణా రోజు రోజుకూ పెరిగిపోతోంది. 2012లో చెన్నై విమానాశ్రయంలో రూ.23 కోట్ల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. 2013లో ఈ అక్రమ రవాణా రూ.36 కోట్లకు పెరిగింది. 2014లో రూ.102 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది జూలై మాసాంతానికే అంటే ఏడు నెలల్లోనే రూ.53 కోట్ల బంగారం పట్టుబడింది. ఇలా ఏడాదికి ఏడాది అక్రమ రవాణా పెరిగిపోవడంపై ఆందోళన చెందిన కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలను ప్రవేశపెట్టింది. విమానం ద్వారా విదేశాల నుంచి బంగారం, పలురకాల మత్తుపదార్థాలు, నిషేధిత వస్తువులు రహస్యంగా తమిళనాడుకు చేరుకుంటున్నాయి. సంఘ విద్రోహ శక్తులు కొందరు ఇదేపనిలో నిమగ్నమై ఉన్నట్లు అధికారులు విశ్వసిస్తున్నారు. ఈ అక్రమ రవాణాను సమూలంగా అరికట్టేందుకు ప్రజల సహాయం తీసుకోవాలని భావిస్తున్నారు. సెంట్రల్ కస్టమ్స్, ఎక్సైజ్, కేంద్ర మత్తుపదార్థాల నిరోధక శాఖ, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ శాఖలకు అక్రమ రవాణాపై సమాచారం ఇస్తే బహుమానం ఇచ్చే విధానం ఎప్పట్నుంచో అమల్లో ఉంది. అయితే ఈ బహుమానం స్వల్పం కావడంతో ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని ప్రభుత్వం తెలుసుకుంది. ఈ కారణంగా బహుమతి మొత్తాన్ని భారీగా పెంచాలని కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయించింది. గత నెల 31వ తేదీన ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సైతం జారీ చేసింది. ఈ కొత్త బహుమతుల విధానాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. ఒక కిలో బంగారం అక్రమ రవాణా సమాచారం ఇచ్చిన వారికి గతంలో రూ.50 వేలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఈ మొత్తాన్ని మూడింతలు అంటే రూ.1.50 లక్షలుగా పెంచారు. అలాగే వెండి రవాణా సమాచారం ఇచ్చిన వారికి కిలోకు రూ.1000 మొత్తాన్ని రూ.3 వేలకు పెంచారు. కొకైన్ అనే మత్తుపదార్థంపై గతంలో కిలోకు రూ.40 వేలు కాగా ప్రస్తుతం ఆరింతలు పెంచారు. అంటే రూ.2.40లక్షలు బహుమతిని అందజేయనున్నారు. హెరాయిన్, బ్రౌన్ షుగర్ తదితర మత్తుపదార్థాలపై కిలోకు గతంలో ఇస్తున్న రూ.20 వేలను రూ.1.20 లక్షలకు పెంచారు. గంజాయికి కిలోకు రూ.100 మొత్తాన్ని రూ.600 చేశారు. అలాగే కెట్టమైన్, ఎపిడ్రిన్, అంబిట్టమిన్ వంటి మత్తుపదార్థాల సమాచారం ఇచ్చినవారికి గతంలో ఎటువంటి ప్రతిఫలం ముట్టేది కాదు. అయితే ఇందులో కూడా మార్పులు తెచ్చారు. కెట్టమైన్కు రూ.700, ఎపిడ్రిన్‌కు కిలోకు రూ.180, అంబిట్టమిన్కు రూ.20 వేలు బహుకరించేలా నిర్ణయించారు. విదేశాల నుంచి రహస్యంగా విలువైన వస్తువులను తెచ్చుకుంటున్నవారి సమాచారం ఇస్తే, సదరు ప్రయాణికుడి నుంచి వసూలు చేసే కస్టమ్స్ సుంకంలో 20 శాతం బహూకరిస్తామని చెబుతున్నారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి సమాచారం ఇచ్చినవారికి సైతం భారీ బహుమానాలను చెల్లించనున్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచడంతోపాటూ అవసరమైతే రక్షణ కూడా ఇస్తామని చెబుతున్నారు. అక్రమ రవాణా సమాచారాన్ని నేరుగా, ఫోన్ ద్వారా, ఉత్తరాలు, ఈ మెయిల్ ద్వారా చేరవేయవచ్చు. సమాచారం ఇచ్చినవారు తమ పేరు, చిరునామా తెలపాల్సిన అవసరం లేదు. అయితే రెండు పుట్టుమచ్చలు, ఎడమ అరచేతి రేఖలు నమోదు చేయాల్సి ఉంది. అయితే ఇందు కోసం సదరు వ్యక్తులు నేరుగా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు, తామున్న చోటు సమాచారం ఇస్తే అధికారులే వారి వద్దకు వచ్చి పుట్టుమచ్చలు, చేతిరేఖలను నమోదు చేసుకుని వెళతారు. వీరి వివరాలన్నీ పూర్తిస్థాయిలో గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. గతంలో సమాచారం ఇచ్చినవారు బహుమతి మొత్తం కోసం నాలుగైదేళ్లు వేచి ఉండాల్సివచ్చేది, అయితే ఇకపై వెంటనే చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇంకేం అక్రమ రవాణా అరికట్టడం ద్వారా దేశసేవ, భారీగా సొమ్ము ఇక మీ సొంతం. బహుమతుల జాబితా : ఒక కిలో కొకైన్కు రూ.2.40 లక్షలు, ఒక కిలో బంగారుకు రూ.1.50 లక్షలు, ఒక కిలో బ్రౌన్ షుగర్ రూ.1.20 లక్షలు, ఒక కిలో హెరాయిన్‌కు రూ.1.20 లక్షలు, ఒక కిలో కేట్టమైన్కు రూ.700 , ఒక కిలో గంజాయికి రూ.600 , ఒక కిలో ఎపిడ్రిన్‌కు రూ.180 . -
భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు..
లక్నో: లేనిపోని అనుమానాలతో, అపోహలతో నిష్కారణంగా భార్యలను వేధించుకు తినే భర్తలని చూశాం. అన్యోన్యంగా కలకాలం ఆదిదంపతుల్లా జీవించిన జంటల్నీ చూశాం. కానీ, భార్య మనసు తెలుసుకుని ఆమెకు తగిన న్యాయం చేసే భర్తలు కూడా ఉన్నారని నిరూపించాడు ఉత్తరప్రదేశ్ కు చెందిన పూల్చాంద్. వినడానికి సినిమా స్టోరీలా అనిపించినా ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో నిజంగానే జరిగిన సంఘటన ఇది. మూడేళ్ల తరువాత భార్యను కలుసుకోవాలని ఎంతో ఆతృతగా సొంత ఊరుకు వచ్చిన పూల్ చంద్‌కు అతని భార్య చందా పెద్ద షాకిచ్చింది. దీంతో అతనికి ఆవేశం పొంగుకొచ్చింది. అయితే ఆవేశాన్ని అణచుకొని స్థిమితంగా ఆలోచించాడు... తమ మధ్య నెలకొన్న సంక్షోభానికి చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నాడు.... అంతేనా..... కుటుంబ సభ్యుల్ని, గ్రామ పెద్దల్ని ఒప్పించాడు. .. ఇంతకీ భార్య ఇచ్చిన షాక్ ఏంటి? ఏమిటా పరిష్కారం.... అందర్నీ ఎలా ఒప్పించాడంటే... వివరాల్లోకి వెడితే ఫైజాబాద్‌కు చెందిన పూల్ చంద్ పెద్దలు కుదిర్చి పెళ్లి చేసుకున్నాడు. సంతోషంగా భార్య చందాను కాపురానికి తీసుకు వచ్చాడు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా జలంధర్‌కు వెళ్ళిపోయాడు. ఫోన్లో మాత్రమే భార్యాభర్తలిద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. అయితే కొన్నాళ్ల తరువాత ఇంటికి వచ్చిన అతనికి భార్య చందా షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను వేరే వ్యక్తిని ఇష్టపడుతున్నానంటూ బాంబు పేల్చింది. కేవలం పెద్దల కోసమే పెళ్లి చేసుకున్నానని... ఇక తన వల్ల కాదని తేల్చిచెప్పింది. దీంతోపాటూ పెళ్లి సమయంలో తనకు పెట్టిన నగలు, బట్టలు అన్నీ అతనికి తిరిగి ఇచ్చేసింది. పూల్చంద్తో కలిసి కాపురం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. దీంతో పూల్ చంద్ హతాశుడయ్యాడు. అందరిలాగానే అతడు కూడా చాలా ఆవేశానికి లోనయ్యాడు. అయితే... భార్య నిజాయితీగా వ్యవహరించిన తీరు తనని ఆకట్టుకుందని పూల్‌చంద్ తెలిపాడు. పెళ్లికి ముందే చందా, సూరజ్ ప్రేమించుకున్నారని, అందుకే ఎలాగైనా వారికి న్యాయం చేయాలని భావించానని చెప్పాడు. తమ పెళ్లి మూలంగా విడిపోయిన ప్రేమికుల్ని తిరిగి కలపాలనే ఉద్దేశంతోనే కష్టపడి తమ కుటుంబసభ్యులను, గ్రామ పెద్దలను ఒప్పించినట్లు పూల్‌చంద్ వెల్లడించాడు. దీంతో గ్రామపెద్దల సమక్షంలో చందాకు కోరుకున్న ప్రియుడితో అంగరంగ వైభవంగా వివాహం జరిపించడమే కాకుండా, కానుకలతో అత్తారింటికి సాగనంపాడు. -
చందమామకు బహుమతులు..
వాషింగ్టన్: అందాల చందమామపైకి బహుమతులను తీసుకెళ్లే రోబోను శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. భూమిపై నుంచి అతి తక్కువ బరువుతో వీటిని చంద్రమండలంపైకి చేర్చేలా రూపొందిస్తున్నారు. భూమిపై ప్రసిద్ధి గాంచిన కళ, కవిత్వం, సంగీతం, డ్రామా, నృత్యాలను చిన్నపాటి డిస్కుల్లో బంధించి ఓ మూన్ రోవర్‌తో వచ్చే ఏడాదిలో పంపేందుకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సర్వం సిద్ధం చేస్తోంది. అమెరికాలోని కార్నిగె మిలన్ విశ్వవిద్యాలయం, రోబోటిక్స్ సంస్థ ఈ ప్రక్రియను చేపట్టింది. ప్రయివేటు నిధులతో గూగుల్ లునార్ ఎక్స్‌ప్రైజ్, యూఎస్డీ 30 మిలియన్ కాంటెస్ట్‌ను తయారు చేస్తోంది. చంద్రుడిపైకి చిన్నసైజు డిస్కులతోపాటు, డేటా తీసుకెళ్లేలా రూపొందిస్తున్నట్లు టెక్టైమ్స్ తెలిపింది. -
కాంజీవరమంటే.. ప్రాణం
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్‌కు చీరలంటే ప్రాణం. ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలాసార్లు ఈ విషయాన్ని మీడియాతో షేర్ చేసుకుంది కూడా. అయితే ఇపుడామె తన జీవితంలో రెండుసార్లు భారీ ఆస్తిని సొంతం చేసుకున్నానని గర్వంగా ప్రకటిస్తోంది. ఒకటి తన తల్లిదండ్రులు ఇస్తే.... రెండోది తన భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ ఇచ్చాడట. ఏమిటబ్బా అంత గొప్ప సంపద అనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నా... ఆ రెండూ తనకెంతో ఇష్టమైన చీరలట. వాటిలో ఒకటి.. విద్యాబాలన్‌కు ఆమె అమ్మా నాన్న బహుమతిగా ఇచ్చిన గ్రీన్, పింక్ కాంబినేషన్‌తో ఉన్న కాంచీవరం పట్టుచీర. రెండోది తన శ్రీవారు కానుకగా ఇచ్చిన ఎరుపు రంగు బెనారస్ చీరట. తనకు చీరలంటే చిన్నప్పటినుంచీ ఇష్టమనీ, తల్లి బీరువాలోని చీరలను చూసి మూడేళ్ల వయసపుడే మనసు పారేసుకున్నానంటోంది. బాల్యంలో అమ్మచీరలు కట్టుకొని దిగిన బోలెడన్ని ఫొటోలే దీనికి నిదర్శనమంటోంది. ఆరు గజాల చీరలంటే తనకు చచ్చేంత ఇష్టమని చెబుతోంది. తనదగ్గర దేశవ్యాప్తంగా లభించే కాటన్ చీరల పెద్ద కలక్షనే ఉందిట. జూన్ 19 వరల్డ్ ఎత్నిక్ డే సందర్భంగా క్రాఫ్ట్స్ విల్లా డాట్ కామ్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమంలో విద్యాబాలన్ పాల్గొనబోతోంది. ఈ సందర్భంగా ఆమె తన మనోభావాలను వెలిబుచ్చింది. పరిణీత సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రంచేసిన విద్యాబాలన్.. 'డర్టీ పిక్చర్' సినిమాలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్న 'హమారీ అధూరీ కహానీ' అనే బాలీవుడ్ మూవీలో ఇమ్రాన్ హష్మి, రాజ్‌కుమార్ రావు తదిరులతో కలిసి నటిస్తోంది. -
ఆంధ్రా ఎమ్మెల్యేలకు ఐఫోన్లు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలందరికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం కానుకలు ఇవ్వనుంది. కానుకలంటే అలాంటి ఇలాంటి కానుకలు కాదు, ఈ మధ్యే మార్కెట్లో హల్చల్ చేస్తున్న యాపిల్ ఐఫోన్-6లను ఎమ్మెల్యేలకు కానుకగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానుకుగా ఇవ్వనున్న ఒక్కో ఐఫోన్ ధర సుమారు రూ.50 వేలు. రాష్ట్రం ఆర్థికపరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉందనీ, ఆర్థిక పురోగతి సాధించాల్సిన అవసరం ఉందనీ.. ఓ వైపు ఊదరగొడుతున్న చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇంత విలువైన కానుకలు ఇవ్వాల్సిన అవసరం ఏంటని పలువురు వాపోతున్నారు. -
తుల్జామాత కానుకలు కైంకర్యం
వందల కిలోల బంగారు, వెండి ఆభరణాలు స్వాహా సాక్షి, ముంబై: మహారాష్ట్రీయుల ఆరాధ్య దైవమైన ‘తుల్జాభవాని మాత’ మందిరంలో భక్తులు సమర్పించుకున్న కానుకలు, నగదు మాయమయ్యాయి. ఆలయ యాజమాన్యం, పూజారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై భారీ ఎత్తున బంగారు, వెండి కానుకలు, నగదు కాజేసినట్లు ప్రత్యేకంగా చేపట్టిన ఆడిట్ నివేదికలో స్పష్టమైంది. దీంతో ఈ కేసు దర్యాప్తును సీఐడీ కి అప్పగించారు. ఉస్మానాబాద్‌లోని ఈ ఆలయంలో 1989 నుంచి 2009 మధ్య 20 ఏళ్ల కాలంలో భవానీ మాతకు భక్తులు సమర్పించుకున్న 120 కిలోల బంగారం, 480 కేజీల వెండి ఆభరణాలు, రూ.240 కోట్ల నగదు మాయమైనట్లు ఆడిట్లో వెల్లడైంది. వీటికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు, లెక్కలు లేవు. దీంతో ఆలయ సొత్తు కాజేసేందుకు పూజారులను, సిబ్బందిని, కాంట్రాక్టర్లను ప్రోత్సహించిన అప్పటి 23 మంది కలెక్టర్లను విచారించేందుకు అనుమతివ్వాలని సీఐడీ కోరింది. కలెక్టర్ల ప్రమేయం లేనిదే ఇంతపెద్ద మొత్తంలో ఆలయ సొత్తు కాజేసేందుకు వీలు లేదని సీఐడీ అభిప్రాయపడింది. తుల్జాభవానీ మాత మందిరం యాజమాన్యం యేటా గర్భగుడిలో ఉన్న హుండీని వేలం వేస్తుంది. హుండీలో ఉన్న నగదు వేలం పాట పాడినవారికి, బంగారు, వెండి, ముత్యాలు, రత్నాల అభరణాలు ఆలయానికి దక్కాలని ఒప్పందం ఉంది. కాని పూజారులు, ఆలయ సిబ్బంది, కాంట్రాక్టర్లు కుమ్మక్కై హుండీలో పోగైన బంగారు, వెండి, ముత్యాల ఆభరణాలను మాయం చేసినట్లు బట్టబయలైంది. ఆడిట్ తరువాత 348 పేజీల నివేదిక రూపొందించి పోలీసు కమిషనర్, సీఐడీకి అప్పగించారు. ఈ మొత్తాన్ని ఎవరి అండతో, ఎలా, ఎవరు కాజేశారో ఆరా తీస్తే అసలు విషయం బయటకు వస్తుందని పూజారుల కమిటీ అధ్యక్షుడు కిశోర్ రంగణే చెప్పారు. -
ఘనంగా సింగరేణి డే వేడుకలు
శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ ప్రగతి మైదానంలో సింగరేణి డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీరాంపూర్ సీజీఎం సీహెచ్ వెంకటేశ్వర్రావు సింగరేణి పతాకం ఎగురవేసి వేడుకలు ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించి పరిశీలించారు. సాయంత్రం భారీ కేక్ కట్ చేశారు. ఇటీవల నిర్వహించిన వెల్‌బేబీ షో, దీపాలంకరణ పోటీల విజేతలు, ఉత్తమ సేవా కార్యకర్తలు, ఈ నెలలో ఉద్యోగ విరమణ చేయనున్న కార్మికులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీజీఎం వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ శ్రీరాంపూర్‌లో ఈ సంవత్సరం ఇప్పటివరకు రూ.223 కోట్ల నష్టం వచ్చిందన్నారు. కార్మికులు, అధికారులు కష్టపడి ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రగతి మైదానంలో సుమారు 20 స్టాళ్లు ఏర్పాటు చేయగా వీటీసీ, వైద్య ఆరోగ్యశాఖ, పర్యావరణశాఖ, రెస్క్యూ, సేవా సమితి స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం ప్రారంభంలో పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటస్వామికి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు బండి రమేశ్, ఎస్వోటూ సీజీఎం పీవీ సత్యనారాయణ, ఇన్చార్జి డీజీఎం (పర్సనల్) కిరణ్‌కుమార్, ఏజెంట్లు సురేందర్, జాన్ ఆనంద్, ఏజీఎం ఫణి, డీజీఎం (సివిల్) ప్రసాద్‌రావు, గుర్తింపు సంఘం బ్రాంచి కార్యదర్శులు నెల్కి మల్లేశ్, లెక్కల విజయ్, పానుగంటి సత్తయ్య, సంజీవ్, పోశెట్టి, నాయకులు సురేందర్‌రెడ్డి, సమ్మిరెడ్డి, సదయ్య, సేవా అధ్యక్షురాలు కళావతి, సీఎంఏవోఐ డివిజన్ అధ్యక్షుడు టి.శ్రీనివాస్ పాల్గొన్నారు. కాకాకు సంతాపం.. సీజీఎం వెంకటేశ్వర్రావు, ఇతర అధికారులు, కార్మికులు కార్యక్రమం ప్రారంభంలో పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటస్వామికి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఎస్వోటూ సీజీఎం పీవీ సత్యనారాయణ, ఇన్చార్జి డీజీఎం (పర్సనల్) కిరణ్‌కుమార్, ఏజెంట్లు సురేందర్, జాన్ ఆనంద్, ఏజీఎం ఫణి, డీజీఎం (సివిల్) ప్రసాద్‌రావు, గుర్తింపు సంఘం బ్రాంచి కార్యదర్శులు నెల్కి మల్లేశ్, లెక్కల విజయ్, పానుగంటి సత్తయ్య, సంజీవ్, పోశెట్టి, నాయకులు సురేందర్‌రెడ్డి, సమ్మిరెడ్డి, సదయ్య పాల్గొన్నారు. జైపూర్ విద్యుత్ ప్రాజెక్టులో.. జైపూర్ : మండల కేంద్రం సమీపంలో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టులో సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ప్రాజెక్టు ఈడీ సంజయ్‌కుమార్ సూర్ సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయనతోపాటు జీఎం సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ కొరత ఉందని, నూతనంగా సింగరేణి సంస్థ నిర్మిస్తున్న 1200మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టుతో రాష్ట్రంలో కొంత కొరత తీరనుందని తెలిపారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పలు సాంస్కృతిక పోటీలు అందరినీ అలరించాయి. అనంతరం విద్యార్థులు, కార్మికులకు బహుమతులు ప్రదానం చేశారు. సివిల్ జీఎం మురళీకృష్ణ, వివిధ శాఖల ఏజీఎంలు, డీజీఎంలు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏరియాలో.. రెబ్బెన : బెల్లంపల్లి ఏరియాలో సింగరేణి ఆవిర్భావ వేడుకలను గోలేటి టౌన్‌షిప్‌లోని శ్రీ భీమన్న స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏరియా జీఎం రాంనారాయణ సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించారు. 16 రకాల స్టాల్స్‌ను ఏర్పాటు చేయగా అధికారులు ప్రారంభించారు. ఏజీఎం నిర్మల్‌కుమార్, పీవో సంజీవరెడ్డి, అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సదాశివ్, ఎస్వోటూ జీఎం వెంకటేశ్వర్రావు, డీజీఎం రామకృష్ణ, ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, డీజీఎం పర్సనల్ చిత్తరంజన్కుమార్, పర్సనల్ మేనేజర్ సీతారాం, టీబీజీకేస్ ఏరియా మాజీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు ప్రకాశ్‌రావు, ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిలి, సేవా సభ్యురాళ్లు లక్ష్మి, శంకరమ్మ, డీ వైపీఎం రాజేశ్వర్ పాల్గొన్నారు. మందమర్రి ఏరియాలో.. మందమర్రి : మందమర్రి జీఎం కార్యాలయంలో ఏరియా జీఎం మల్లికార్జునరావు జెండా ఆవిష్కరించారు. స్థానిక సింగరేణి పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సేవా సమితి అధ్యక్షురాలు సత్యవతితో కలిసి ప్రారంభించారు. ఏరియాలోని వివిధ డిపార్టుమెంట్లలో ఉత్తమ ప్రతిభ చూపిన కార్మికులకు, సేవా సమితి అధ్యర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో సేవలందించిన వారికి జీఎం బహుమతులు అందించారు. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఏరియా ఎస్వోటూ జీఎం దేవికుమార్, డీజీఎం పర్సనల్ ముజాహిద్, ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, యూనియన్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. -
నా గిఫ్ట్ ప్రత్యేకంగా...
పుట్టిన రోజు జేజేలకు, పెళ్లి వేడుకలో ఆశీస్సులకు బహుమతులుగా బొకేలే దర్శనమిస్తున్నాయి. రంగురంగుల పూలతో రంగరించిన బొకేలు రెండ్రోజులకంటే ఉండవు. అపురూపమైన ఆ సందర్భంలో ఓ మొక్క నాటితే అది పచ్చగా ఉండి.. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. క్లుప్తంగా ఎకో గిఫ్ట్స్ సారాంశం ఇది. ‘నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే ప్రాణం. పదేళ్లుగా మా బంధువులకు, స్నేహితులకు మొక్కలనే బహుమతులుగా అందజేస్తున్నాను. ఇందులో కూడా ఓ ప్రత్యేకత ఉంది. సందర్భాన్ని బట్టి ఫలానా మొక్కయితే బాగుంటుందని ఎంపిక చేసుకుంటాను. దాన్ని అందమైన కుండీలో పెట్టి, కుండీపై వేడుకకు సూటయ్యే డిజైన్, మెసేజ్ రాసిస్తాను. దాంతో వేడుకలో నా గిఫ్ట్ ప్రత్యేకంగా కనిపిస్తుంది’ అని చెప్పారు కల్యాణి. హితకారిణి.. రోజురోజుకీ పెరుగుతున్న కాలుష్యం బారి నుంచి తప్పించుకోవాలంటే మొక్కలు పెంచడం తప్ప మరో దారి లేదు. కాస్త పోకడ మార్చిన ఈ తరం మనుషులు మొక్కల పెంపకాన్ని కాస్త సీరియస్‌గానే తీసుకుంటున్నారు. ఇలాంటి వారికి ఎకో గిఫ్ట్స్ కాన్సెప్ట్ అరుదైన కానుకలు అందించే కల్పతరువులా మారింది. పూల మొక్కలు, మానులుగా మారే మొక్కలు, బోన్సాయి మొక్కలు ఇలా మన అభిరుచికి తగ్గ బహుమతులను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఎకో గిఫ్ట్స్ వచ్చే కస్టమర్లు ఎక్కువగా ఆక్సిజన్ విడుదల చేసే ప్లాంట్స్కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పే డాక్టర్లు.. ఆస్పత్రి ప్రాంగణంలో ఆర్టిఫిషియల్ అందాలను కొలువుదీర్చడం బాధాకరం. వాటి స్థానంలో నిజమైన మొక్కలు నాటాలని ప్రచారం చేస్తున్నాం. కార్పొరేట్ కంపెనీల్లో తరచూ ఏవో ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఈ సందర్భంలో ఉద్యోగులకు మొక్కలు బహుమతిగా ఇవ్వాలని చెబుతున్నాం. మా ప్రయత్నాన్ని మెచ్చి కొన్ని కంపెనీలు మొక్కల కోసం మమ్మల్ని సంప్రదించాయి. ఆయా కంపెనీల బ్రాండ్లు కనిపించే విధంగా కుండీలను తీర్చిదిద్ది.. మొక్కలతో అందజేయడం వారికి ఎంతో నచ్చింది’ అని సంతోషంగా చెప్పారు కల్యాణి. సమయం.. సందర్భం.. కంపెనీ లాంచ్‌లకు ఒక రకమైన మొక్కలు, పుట్టిన రోజుకి ఒకరకమైన మొక్కలు, పెళ్లికి మరో రకం, షష్టిపూర్తి, గోల్డెన్ జూబ్లీ వంటి పెద్దల వేడుకలకు ఎకో గిఫ్ట్స్ సెంటర్‌కి వెళితే ఏ సందర్భానికి ఏ మొక్కని బహుమతిగా ఇవ్వాలి..? ఎలాంటి మొక్క శుభసూచకం..? కుండీలపై ఎలాంటి మెసేజ్‌లు రాయాలి, ఎన్ని రకాల శుభాకాంక్షలు చెప్పొచ్చు.. వంటి విషయాలపై అవగాహన కలుగుతుంది. ‘పిల్లలకయితే పూల మొక్కలు, పెద్దవాళ్లకైతే గాలినిచ్చే మొక్కలు.. ఇలా చాలా రకాలుంటాయి. చాలావరకూ మా దగ్గరికి డబ్బున్న వారే వస్తున్నారు. వారి టేస్ట్‌కి తగ్గట్టుగా ముందుగా ఆర్డర్ ఇచ్చి రెడీ చేయించుకుంటున్నారు. కంప్యూటర్ టేబుల్ దగ్గర పెట్టుకోడానికా? గుమ్మం దగ్గర వేలాడదీసుకోవడానికా? వంటింటి వరండాలోనా? ఇలా ఆ మొక్కను పెట్టే ప్లేస్ దగ్గర నుంచి దాన్ని మెయింటేన్ చేసే తీరు అన్ని డీటైల్స్ చెబుతాం’ అని వివరించారు కల్యాణి. రెండు వందల నుంచి... ఈ ఎకో గిఫ్ట్స్ షాపు దగ్గరికెళ్లి గిఫ్ట్ తెచ్చుకోవాలంటే జేబులో రూ.200 ఉంటే చాలంటున్నారు కల్యాణి. మీరిచ్చే బహుమతి పచ్చగా కళకళలాడటం కన్నా గొప్ప విషయం ఏముందంటారు. నిజమే.. ఆ మొక్క పూసిన నాలుగు పూలు, ప్రశాంతమైన వాతావరణం, కాలుష్యం లేని గాలి.. ఇవన్నీ రెండు వందలకే వస్తున్నాయంటే అంతకన్నా ఏం కావాలి? మరో విషయం ఈ ఎకో గిఫ్ట్స్‌లో రూ.25 వేల విలువ చేసే మొక్కలు కూడా ఉన్నాయి. ఈ మధ్యనే స్పెషల్ ఆర్డర్‌పై రూ.30 వేల విలువ చేసే బహుమతిని తయారు చేసి ఇచ్చారు కల్యాణి. మొక్కే కదా అని తీసి పారేయడానికి లేదు.. మీరిచ్చే ఈ బహుమతితో మీ దర్పాన్ని కూడా ప్రదర్శించుకోవచ్చు. వీటితో పాటు... ఎకో గిఫ్ట్స్‌లో మొక్కలే కాకుండా బహుమతులుగా మరిన్ని ఆసక్తికరమైన వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఈమూ కోళ్లు పెట్టే గుడ్లపై పెయింటింగ్ వేసి బహుమతులుగా తీర్చిదిద్దుతున్నారు. దీపాల వెలుగులు పంచే ప్రమిదలకు పెయింటింగ్స్ వేసి అమ్ముతున్నారు. పర్యావరణ హితం కోరుతూ అందమైన బహుమతులను అందుబాటులోకి తెచ్చిన ‘ఎకో గిఫ్ట్స్’కు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. పచ్చగా నిలిచే ఈ బహుమతులను పెంచే వారి సంఖ్య మరింత పెరగాలని కోరుకుందాం. -
బాల్ పట్టు.. గిఫ్ట్ కొట్టు..
సరదాగా వీకెండ్ సాయంత్రాలను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఆహ్లాదంతో పాటు చక్కటి బహుమతులు కూడా అందితే కాదనేదేముంది. సిటీసెంటర్ ఎస్వీఎం సెంటర్లో శుక్ర, శని, ఆదివారాల్లో బౌలింగ్ ఆడటానికి వచ్చే వారు సులభంగా గిఫ్ట్‌లు అందుకునే అవకాశం కల్పిస్తున్నారు. బాల్‌తో 10 తెల్ల పిన్‌లను పడగొట్టే ఈ ఆటలో, ఒక నల్ల పిన్ను వుంచుతున్నారు. ఆ పిన్ను పడగొడితే అక్కడికక్కడే షాపర్స్టాప్ వారందించే ఏడు రకాల బహుమతుల్లో ఏదో ఒకదాన్ని సొంతం చేసుకోవచ్చు. మరింకెందుకాలస్యం బాల్ పట్టు గిఫ్ట్కొట్టు. -
లాటరీ పేరుతో మోసం
దహెగాం : లక్కీ డ్రాపేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన సంఘటన దహెగాం మండలంలోని కేస్లాపూర్లో వెలుగుచూసిది. స్కీం నిర్వాహకుల చేతిలో మోసపోయినట్లు గ్రహించిన కేస్లాపూర్ గ్రామస్తులు పలువురు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం... మండలంలోని బీబ్రా గ్రామానికి చెందిన పాషా కొద్దిరోజుల క్రితం లక్కీ స్కీం నిర్వహించాడు. పలు గ్రామాల్లో ఏజెంట్లను నియమించాడు. ప్రతీ వారం రూ.100 వంతున 20 వారాలు చెల్లించాలని, వారవారం నిర్వహించే డ్రాలో మోటార్‌సైకిల్, రిఫ్రిజిరేటర్, ఎల్సీడీ టీవీ లాంటి విలువైన బహుమతులు అందజేస్తామని చెప్పాడు. సుమారు 2 వేల మందిని సభ్యులుగా చేర్చుకున్నాడు. 20 వారాలు వాయిదా కట్టినా ఎలాంటి వస్తువులు అందజేయకపోవడంతో డబ్బులు చెల్లించిన వారు స్కీం నిర్వాహకుడితోపాటు ఏజెంట్లను పలుమార్లు అడిగారు. అడిగిన ప్రతిసారీ ఇవ్వాళ, రేపు అంటూ కాలం వెల్లదీస్తుండడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేస్లాపూర్‌కు చెందిన బొడ్డు రాంచందర్, చునార్కర్ మల్లయ్య, తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై పోలీసులను సంప్రదించగా.. తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొనడం గమనార్హం. -
‘గ్రీజు’వీరులు
మన దగ్గర ఉట్టికొట్టి బహుమతులు పట్టినట్టుగానే, ఇండోనేషియాలోనైతే స్తంభాన్ని ఎగబాకి వాటిని ఎగరేసుకెళ్లాలి. పంజట్ పినాంగ్గా పిలిచే ఈ వేడుకలో పాల్గొంటున్న స్థానికుల్ని ఫొటోలో చూస్తున్నారు కదా! గ్రీజు పూసిన స్తంభాలను పైదాకా ఎగబాకితే ఏమేం పొందవచ్చో తెలుస్తోంది కదా! సైకిలుతోపాటు కుక్కరు, గిన్నెల్లాంటి కొంత సామగ్రి! ఫలితం దక్కినట్టే! సప్లయర్ ‘చిట్టి’ ‘రోబో’ చిట్టి ఇట్టే ఎన్నోరకాల వంటలు సిద్ధంచేస్తాడు! అది సినిమా అనుకున్నాంగానీ, వర్తమానం కూడా అని ఈ ఫొటో చెబుతోంది. చైనాలోని కున్షాన్లోని ఒక రెస్టారెంటు యజమాని నిజంగానే రోబోలను వినియోగిస్తున్నాడు. డజనుకు పైగావున్న ఈ రోబోలు వంటలోనూ, సరఫరాలోనూ సాయపడుతున్నాయి. కస్టమర్లను ‘మర్యాద’గా పలకరిస్తున్నాయి. ఇవి నలభై దాకా రోజువారీ మాటల్ని అర్థం చేసుకోగలవట! ఈ కొత్తదనానికి ఇటు వినియోగదారులు సంతోషంగావుంటే, సెలవనీ అనారోగ్యమనీ నోరెత్తని రోబోలతో యజమానీ ఆనందంగా వున్నాడు. బీచ్ బాత్రూమ్ ముఖానికి సబ్బు నురగ పూసుకున్న ఈ జపనీయుల్ని చూస్తుంటే, వీళ్లంతా మూకుమ్మడిగా స్నానం చేస్తున్నట్టు లేదూ! వేసవి తాపాన్ని తగ్గించుకోవడం కోసం నిర్వహించిన ఓ సరదా కార్యక్రమం ఇది. టోక్యోలోని టొయోసు మేజిక్ బీచ్‌లో ఇది జరిగింది. -
ఆన్లైన్లో అనుబంధం
ఒకప్పుడు రాఖీ పండుగ అంటే.. రాఖీ కొనాలి... దానిని పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించేందుకు సెంటర్‌కు వెళ్లడం, కవర్లు కొనడం వంటి ఇబ్బందులు ఉండేవి. ఇంత చేసినా చిరిగిపోకుండా ఆత్మీయులైన సోదరులకు రాఖీలు అందుతాయా, అదీ సమయానికి చేరుతాయా, లేదా అనే అనుమానాలతో అక్కాచెల్లెళ్లు మధనపడేవారు. ఇలాంటి ఇబ్బందులను తీర్చేందుకు ఆన్లైన్ ద్వారా రాఖీలు పంపించే పద్ధతి అందుబాటులోకి వచ్చేసింది. కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఒక్క క్లిక్ ద్వారా నిర్ణీత చిరునామాకు రాఖీ చేరిపోతుంది. జిల్లా, రాష్ట్రం, దేశం, విదేశాల్లో ఎక్కడికైనా రాఖీ పంపించే సౌకర్యాన్ని పలు వెబ్సైట్లు అందుబాటులోకి తెచ్చాయి. దీంతో వరంగల్ నగరంలోని పలువురు మహిళలు, యువతులు ఈసారి తమ సోదరులకు ఆన్లైన్లో రాఖీలు పంపించేందుకు సిద్ధమయ్యారు. షాపుల్లో మాదిరిగానే... రాఖీలు అమ్మే షాప్‌నకు వెళ్తే వేల రకాలు.. బంగారు, వెండి రాఖీలు ఇలా ఎన్నో అందుబాటులో ఉంటాయి. మనకు నచ్చిందే కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. అయితే ఆన్లైన్లో అన్ని రకాలు ఉంటాయా, లేదా అనే బెంగ కొందరికి ఉంది. కానీ ఆన్లైన్లో కూడా వేల సంఖ్యలో రకాల రాఖీలు అందుబాటులో ఉంచడంతో మహిళలు, యువతులు ఈసారి ఇంటర్నెట్ రాఖీకే తమ ఓటు అంటున్నారు. దీంతో ఈ సారి నగరం నుంచి సుమారుగా 10వేల మందికి పైగానే తమ సోదరులకు ఆన్లైన్ ద్వారా రాఖీలు పంపించనున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. వేల రకాలు తక్కువ నాణ్యత గల వజ్రాలు పొదిగిన రాఖీ, బంగారు పూతతో చేసిన రాఖీ, ముత్యాల జర్దోసి రాఖీ.. ఇలా చెప్పుకుంటే పోతే ఆన్లైన్లో కూడా వెయ్యికి పైగా రకాల రాఖీలు దర్శనమిస్తున్నాయి. ఇక చిన్నపిల్లల మనస్సు దోచే చోటా బీమ్, మిక్కీ మౌస్, యాంగ్రీ బర్డ్స్ బొమ్మలతో కూడిన రాఖీలకు కొదువే లేదు. రూ.300 నుంచి రూ.10వేల వరకు ధరలో విభిన్న రాఖీలు ఆన్లైన్లో సిద్ధంగా ఉన్నాయి. గిఫ్ట్‌లూ రెడీ.. సోదరులు ఇష్టపడే బహుమతులను కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేయడానికి నగర మహిళలు మొగ్గుచూపుతున్నారు. కేవలం రాఖీతో సరిపెట్టుకోకుండా డ్రై ఫూట్స్‌తో చేసే స్వీట్లను కూడా ఆర్డర్ చేసే వెసులుబాటును సైట్లు కల్పిస్తున్నాయి. ఇంకా బ్రేస్లెట్లు, పర్ఫ్యూమ్లు, కుర్తాలు, వాచీలను కూడా బహుమతిగా పంపించాలని సోదరీమణులు సైట్లను వెతికేస్తున్నారు. ఇక రాఖీ పంపిన సోదరీమణుల కోసం సోదరులు వజ్రాభరణాలు, చీరలు, వాచీలు, బ్యాగులు, టెడ్డీబేర్లు.. ఇత్యాది బహుమతుల (రిటర్న్ గిఫ్ట్)ను పంపించేందుకు సిద్ధమయ్యారు. వీటికి కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేస్తుండడంతో ఈసారి రాఖీ పండుగ మొత్తం ఆన్లైన్లో సాగే అవకాశం కనిపిస్తోంది. రాఖీలు లభించే కొన్ని సైట్లు www.onlinerakhigifts.com www.sendrakhizonline.com www.rakhisale.com www.amazon.in www.rakhi.rediff.com www.flipkart.com www.snapdeal.com -
ప్రియురాలికి బహుమతుల కోసం ... ఇంటర్ విద్యార్ధి
- ప్రియురాలికి బహుమతులిచ్చేందుకు చోరీలకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి -తా ళం వేసిన ఇళ్లలో చొరబడి డబ్బు మాత్రమే దొంగిలించిన వైనం ధర్మవరం : బహుమతులతో ప్రియురాలి మెప్పు పొందడం కోసం ఓ విద్యార్థి దొంగగా మారాడు. రాత్రిళ్లు తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని లోపలకు చొరబడి డబ్బు మాత్రమే చోరీ చేయడం, యథావిధిగా పగలు కాలేజీకి వెళ్లడం చే సేవాడు. ఇలా మూడు చోరీలకు పాల్పడ్డాడు. ఆనక పోలీసులకు పట్టుబడ్డాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ప్రేమ దొంగ వివరాలు ఇలా.. పట్టణంలోని యాదవ వీధిలో ఓ ఇంటి ఎదుట అనుమానాస్పదంగా తచ్చాడుతున్న విద్యార్థిని శనివారం పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా రూ.30 వేలకు పైగా నగదు లభ్యమైంది. అతన్ని స్టేషన్‌కు తరలించి పూర్తి స్థాయిలో విచారణ చేశారు. దీంతో నివ్వెరపరిచే నిజాలు వెలుగు చూశాయి. అతనో విద్యార్థి(16). పట్టణంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. అతనికి ఓ అమ్మాయితో పరిచయమైంది. ఆమె పుట్టిన రోజున గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. చేతిలో డబ్బు లేదు. దీంతో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నాడు. పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో రెవెన్యూ ఉద్యోగి ఇంట్లో, స్థానిక సిద్దయ్యగుట్ట, యాదవ వీధిలోఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగులగొట్టి నగదు మాత్రమే దొంగిలించడం.. బీరువాలో నగదు దొరక్కపోతే దేవునిహుండీ ఎత్తుకు పోవడం చేసేవాడు. ఇలా ఎస్బీఐ కాలనీలో దాదాపు 30 తులాల బంగారు బీరువాలో ఉన్నప్పటికీ దానిని ముట్టుకోకుండా కేవలం హుండీలో ఉన్న డబ్బును, బీరువాలో ఉన్న కొద్దిపాటి నగదును మాత్రమే అపహరించాడు. యాదవ వీధి, సిద్దయ్యగుట్టలోని ఇళ్లలోనూ నగలు, ఇతర విలువైన వస్తువులను ముట్టుకోకుండా నగదు మాత్రమే ఎత్తుకెళ్లాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు మైనర్ కావడం.. అందునా విద్యార్థి అయిన కారణంగా పోలీసులు ఆ విద్యార్థిని కౌన్సిలింగ్ సెంటర్‌కు పంపి నేర ప్రవృత్తిని మార్చుకునేలా పరివర్తన తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. -
బెల్టు షాపు వద్దన్నందుకు కుటుంబం వెలి
కేవీబీపురం: గ్రామంలో బెల్టుషాపు వద్దన్నందు కు ఓ కుటుంబాన్ని వెలివేశారు ఆ ఊరిపెద్దలు. కేవీబీ పురం మండలంలోని అంజూరుపాళెంలో ఈ సాంఘిక దురాచారం చోటు చేసుకుంది. బాధితుడు ఎన్ షణ్ముగం కథనం మేరకు ఈ సంఘటన వివరాల్లోకి వెళితే... అంజూరుపాళెం గ్రామంలో ప్రతి ఏటా గంగమ్మకు జాతర చేస్తారు. గతేడాది గ్రామం లో బెల్టు షాపు నిర్వహణకు వేలం పాడారు. షాపు నిర్వహించడానికి షణ్ముగం కుటుంబ సభ్యులు వ్యతిరేకత తెలిపారు. అయితే అదేవిధంగా ఈ ఏడాది కూడా వేలం నిర్వహించారు. యథాతథంగా ఈసారి కూడా వ్యతిరేకించారు. దీంతో గ్రామపెద్దలు నెంబలి వెంకట కృష్ణయ్య, నెంబలి పచ్చయ్య, అత్తింజేరి రామచంద్రయ్య, నంబాకం వెంకటేశులు, కే. వేమయ్య ఆ కుటుంబాన్ని వెలివేసినట్లు దండోరా వేయించారు. ఆ కుటుంబానికి నీళ్లు, ఇతర సౌకర్యాలు కల్పించకూడదని గ్రామకట్టుబాటు విధించారు. జాతరకు ఆ ఇంటి నుంచి నైవేద్యం, ఇతర కానుకలు, చందాలు తీసుకోరాదని నిర్ణయించారు. ఆ కుటుంబసభ్యులతో గ్రామస్తులు మాట్లాడినా, వారి ఇంటికి వెళ్లినా... వారికి కూడా గ్రామబహిష్కరణ తప్పదని హెచ్చరించారు. సోమవారం బాధితుడు షణ్ముగం ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది సాంఘిక దురాచారమని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. గ్రామ పెద్దలపై సాంఘిక దురాచార చట్టం కింద కేసులు నమోదు చేశారు. -
నాన్నకో ముద్దా...
చిన్నప్పుడు అన్నం తినకుండా పిల్లలు మారాం చేస్తుంటే... అమ్మకు కూడా లొంగకుండా ఏడుస్తుంటే... వారిని ఎత్తుకుని సముదాయించి... అలికి ముగ్గు పెట్టి పీటేసి ఆకేసి పప్పేసి, కూరేసి, అన్నం పెట్టి అంటూ నాన్నలు అన్నం తినిపించే ఉంటారు... రేపు ఫాదర్స్ డే ... ఈ రోజు మీరే వంటింటికి అధికారులు కండి... ఈ మెనూ పక్కన పెట్టుకొని వంటలు తయారుచేయండి... నాన్నను అన్నానికి రమ్మనండి... నా ముద్ద, అక్క ముద్ద, పిన్ని ముద్ద, బాబయ్య ముద్ద, నానమ్మ ముద్ద... అంటూ బోలెడు కబుర్లు చెబుతూ... నాన్నకి గోరుముద్దలు తినిపించండి... అన్నం తిన్నాక నాన్నకి కిళ్లీ కూడా ఇవ్వండి... ఆ తరవాత సరదాగా చిన్నచిన్న బహుమతులు అందజేయండి... నాన్న ప్రేమను మనసారా ఆస్వాదించండి... రోస్టెడ్ కాజూ కావలసినవి జీడిపప్పు పలుకులు - కప్పు; నెయ్యి - టీ స్పూను; మిరియాల పొడి - పావు టీ స్పూను; కారం - కొద్దిగా; ఉప్పు - తగినంత; పంచదార - చిటికెడు తయారీ: ఒక బాణలిలో నెయ్యి వేసి కాగాక జీడిపప్పులు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి ఉప్పు, కారం పంచదార, మిరియాల పొడి వేసి బాగా కలపాలి బాణలి కిందకు దించి చల్లారనివ్వాలి వీటిని గాలి చొరని డబ్బాలో ఉంచితే సుమారు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. అర్బీ కా సాగ్ కావలసినవి: చేమదుంపలు - అర కేజీ; ఆవాలు - పావు టీ స్పూను; కారం - ముప్పావు టీ స్పూను; నిమ్మరసం - ముప్పావు టీ స్పూను; ధనియాల పొడి - అర టీ స్పూను; పసుపు - చిటికెడు; నూనె - కప్పు; ఉప్పు - రుచికి తగినంత; వాము - అర టీస్పూను. తయారీ: ముందుగా చేమదుంపలను ఉడకబెట్టి, చల్లారాక తొక్కు తీసి చక్రాలుగా కట్ చేసి పక్కన ఉంచాలి బాణలిలో నూనె పోసి కాగాక చేమదుంప ముక్కలు వేసి కరకరలాడేలా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక ఆవాలు, వాము వేసి వేయించాలి వేయించి ఉంచుకున్న చేమదుంప ముక్కలు, ఉప్పు, ధనియాల పొడి, కారం, పసుపు, నిమ్మరసం ఒకదాని తరవాత ఒకటి వేసి బాగా కలిపి దించేయాలి నాన్నకు కరకరలాడే కూర సిద్ధమైనట్లే. గ్రీన్ టీ కావలసినవి: గ్రీన్ టీ పొడి - ఒకటిన్నర టీ స్పూన్లు; నీళ్లు - కప్పు; పంచదార లేదా తేనె - రుచికి తగినంత తయారీ: ఒక గిన్నెలో కప్పు నీళ్లు పోసి మరిగించాలి నీళ్లు మరగ్గానే స్టౌ ఆపేసి గ్రీన్ టీ పొడి వేయాలి రెండు మూడు నిమిషాలయ్యాక, మరో కప్పులోకి టీ వడపోసి, పంచదార లేదా తేనె వేసి కలిపి వేడివేడిగా అందించాలి నాన్న నిద్రలేవగానే ముందుగా ఈ ఆరోగ్యకరమైన టీ అందించండి. ఖట్టీ మీఠీ దాల్ కావలసినవి కందిపప్పు - అర కప్పు; టొమాటో తరుగు - అరకప్పు; పల్లీలు - పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను; కారం - తగినంత; అల్లం తురుము - అర టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూను; పంచదార లేదా బెల్లం - ఒక టేబుల్ స్పూను; పసుపు - పావు టీ స్పూను; నిమ్మరసం - టేబుల్ స్పూన్; ఆవాలు - అర టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను; మెంతులు - పావు టీ స్పూను; నెయ్యి లేదా నూనె - రెండు టేబుల్ స్పూన్లు; ఇంగువ - చిటికెడు; ఉప్పు -తగినంత తయారీ: కందిపప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఐదు విజిల్స్ వచ్చాక దింపాలి చల్లారాక, గరిటెతో మెత్తగా మెదపాలి బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వరుసగా వేసి బాగా వేయించాలి అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి టొమాటో తరుగు, పల్లీలు వేసి బాగా కలిపి, ఈ మిశ్రమం మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి ఉడికించిన కందిపప్పు, పసుపు, ఉప్పు, కారం, బెల్లం తురుము వేసి సుమారు కప్పు నీళ్లు జత చేసి బాగా కలిపి పది నిమిషాలు ఉంచాలి పప్పు బాగా చిక్కబడిన తర్వాత కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి బాగా కలిపి దించేయాలి నాన్నకు అన్నంలో పప్పు, నెయ్యి వేసి కమ్మగా గోరుముద్దలు పెట్టండి. మేతీ పోహా కావలసినవి: అటుకులు - 2 కప్పులు; మెంతి కూర - కప్పు; ఉల్లితరుగు - పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు - రెండు టేబుల్ స్పూన్లు; కరివేపాకు - రెండు రెమ్మలు; నిమ్మ రసం - టేబుల్ స్పూను; పల్లీలు - పావు కప్పు; పసుపు - అర టీ స్పూను; ఆవాలు - టీ స్పూను; సెనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత; నూనె -టేబుల్ స్పూను తయారీ: ఒక గిన్నెలో నీళ్లు పోసి, అందులో అటుకులు వేసి, శుభ్రంగా కడిగి నీరు తీసేసి పక్కన ఉంచాలి బాణలిలో టేబుల్ స్పూను నూనె కాగాక ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి వేయించాలి పచ్చి మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేగాక, ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి మెంతికూర, పసుపు వేసి బాగా కలపాలి అటుకులు, ఉప్పు వేసి బాగా కలిపి దించేయాలి నిమ్మరసం వేసి కలిపి పళ్లెంలో ఉంచి నాన్న నోటికి అందించండి. ఆమ్ రస్ కావలసినవి: మామిడిపండ్లు - రెండు (మీడియం సైజు); పంచదార - 4 టేబుల్ స్పూన్లు; పాలు - 4 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - అర టీ స్పూను తయారీ: ముందుగా మామిడిపండ్ల తొక్కు తీసి ముక్కలు తరగాలి మిక్సీలో మామిడిపండు ముక్కలు, పాలు, పంచదార, ఏలకుల పొడి వేసి మెత్తగా అయ్యేవరకు తిప్పాలి ఈ జ్యూస్‌ని చిన్న చిన్న పాత్రలలో పోసి ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడ్డాక బయటకు తీయాలి వేడి వేడి పూరీలు, దోసెలు, చపాతీలతో కలిపి అందించాలి. -
అప్పుడు టాటూ.. ఇప్పుడు లాకెట్..!
ఈ మధ్య అందరి చూపులూ దీపికా పదుకొనే మెడలో వేలాడుతున్న గొలుసు పైనే. ఆ గొలుసుకో లాకెట్ ఉంది. దాని మీద ‘లవ్’ అని రాసి ఉంది. దాంతో ఇది కచ్చితంగా హీరో రణ్వీర్ సింగ్ ఇచ్చినదేనని చెప్పుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారనే వార్త బాలీవుడ్లో షికారు చేస్తోంది. ఆ వార్తను నిజం చేస్తూ.. ఈ ఇద్దరూ కాఫీ షాప్స్, రెస్టారెంట్లలో జంటగా కనిపిస్తున్నారు. ఆ మధ్య విహార యాత్రక్కూడా వెళ్లారనే వార్త వచ్చింది. ఈ వార్తల కారణంగానే ఈ లాకెట్‌ని దీపికాకి రణ్వీర్ బహుమతిగా ఇచ్చి ఉంటారన్నది చాలామంది ఊహ. గతంలో రణబీర్ కపూర్‌ని ప్రేమించినప్పుడు మెడ మీద ‘ఆర్కె’ అనే అక్షరాలతో టాటూ వేయించుకున్నారు దీపికా. అతన్నుంచి విడిపోయిన తర్వాత ఆ టాటూని వదిలించుకోవడానికి చాలా కష్టాలు పడ్డారట. ఇప్పుడు రణ్వీర్ సింగ్‌ని ప్రేమిస్తున్నారు కాబట్టి, లెక్క ప్రకారం ‘ఆర్ఎస్’ అని టాటూ వేయించుకోవాలి. ఏమో.. చెరిపేయాల్సిన పరిస్థితి వస్తే..? అందుకే దీపికా టాటూ జోలికి వెళ్లి ఉండరు. సేఫ్‌గా లాకెట్‌తో సరిపెట్టుకుని ఉంటారు. నచ్చినంత కాలం ఉంచుకోవచ్చు.. నచ్చకపోతే లాకెట్టేగా.. సులువుగా తీసిపారేయొచ్చు. ఏమో.. మరి జీవితాంతం దీపికా గుండెల్లో రణ్వీర్ కొలువుంటారో లేదో కాలమే చెప్పాలి. -
పెళ్లిళ్లలో దొంగల చేతివాటం
-
మనసు నొప్పించే విషయాలు
చనువు ఉందని ‘డర్టీ’ విషయాలు మాట్లాడడం. సమస్యలో ఉన్నపుడు మీకు పని ఉందని కారణం చూపుతూ, ఆమెకు తోడు లేకపోవడం. వారి కొత్త డ్రెస్‌ను ఏ మాత్రం పట్టించుకోకపోవడం.. అది బాలేకున్నా! ఆమెకు సంబంధించిన దేనిపైన అయినా వ్యతిరేకతను నేరుగా వ్యక్తం చేయడం. ఆమె అందం గురించి ప్రతికూల విషయాలు నేరుగా చెప్పడం. ఇతర అమ్మాయిల అందచందాలను ఆమె ముందు పొగడటం. గమనిక: మీరు ఊహించని కొన్ని విషయాలకు కూడా వారు హర్ట్ అవుతుంటారు. మనసు మెప్పించే విషయాలు వీలైనన్ని ఎక్కువ సార్లు మీరు ప్రేమను వ్యక్తం చేయాలని కోరుకుంటారు. అమ్మాయిలే తెలుసుకోగలిగిన బహుమతులు వారికి నచ్చేలా ఇవ్వగలగడం (గాజులు, లిప్‌స్టిక్, పర్ఫ్యూమ్). ఆమె తప్పులను కూడా పొరపాట్లు అని చిత్రీకరించి చెప్పగలిగే మీ నైపుణ్యం! ప్రశంసలు... వాటిని కూడా అందంగా వ్యక్తం చేయాలి. ఆమె ప్రైవేట్ టైం, ప్రైవేట్ విషయాలు ఎప్పుడూ అడగకపోవడం (పూర్తిగా చనువు ఏర్పడక ముందు). ఇతరులను ఆమె వద్ద ఎప్పుడూ తిట్టకపోవడం. -
గిప్ట్‌లు ఇవ్వడంలో పూరీనే టాప్
-
ప్రేమను పంచే రోజు
-
‘లాల్బాగ్ చా రాజా’కు కాసుల వర్షం
సాక్షి, ముంబై: ‘లాల్బాగ్ చా రాజా’ కు కాసుల వర్షం కురిసింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా భక్తులు భారీ సంఖ్యలో కానుకలు సమర్పించారు. నగదు రూపంలో రూ.6.77 కోట్లు వచ్చాయని లాల్బాగ్ చా రాజా మండలి అధ్యక్షుడు అశోక్ పవార్ చెప్పారు. వెండి, బంగారు కానుకలు భారీగానే వచ్చాయని తెలిపారు. వీటిని ప్రతిరోజూ సాయంత్రం ఐదు నుంచి రాత్రి 10 గంటల వరకు రాజా మండపం ఆవరణలో బహిరంగంగా వేలం వేస్తున్నామని వివరించారు. ఈ వేలం నిర్వహణ శుక్రవారం వరకు ఉంటుందని తెలిపారు. ‘వినాయక చవితి ఉత్సవాల సమయంలో భక్తులకు కొంగుబంగారంగా నిలిచిన రాజాను దర్శించుకోవాలంటే కనీసం 20 నుంచి 25 గంటల సమయం తీసుకుంటుంది. ఇందుకోసం ఎంతో ఓపిగ్గా క్యూలో నిలబడాల్సి ఉంటుంది. అయినా ఎంతో భక్తిశ్రద్ధలతో 10 రోజుల పాటు రాజాను లక్షల్లో వచ్చిన జనం దర్శించుకున్నార’ని ఆయన చెప్పారు. రాజాను గత బుధవారం ఉదయం నిమజ్జనానికి తరలించినప్పటికీ అంతకుముందు రోజు నుంచే నగదు లెక్కింపు ప్రారంభించామన్నారు. లాల్బాగ్ చా రాజా మండలి ఆవరణలో ఏర్పాటుచేసిన ఆరు హుండీల్లో పోగైన నగదును బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు చెందిన 20 మంది సిబ్బంది ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లెక్కించారని పేర్కొన్నారు. రూ.6.77 కోట్లు నగదు వచ్చినట్టు తేలిందన్నారు. ఇందులో దేశ కరెన్సీతో పాటు విదేశీ డాలర్లు కూడా ఉన్నాయని చెప్నారు. ‘వస్తురూపంలో చెల్లించుకున్న కానుకల్లో బంగారు, వెండి ఆభరణాలు, బిస్కెట్లు, గణేశ్ విగ్రహాలు, మూషికాలు, ఉంగరాలు, కిరీటాలు, రుద్రాక్ష మాలలు, బంగారు గొలుసులు, బ్రాస్లెట్లు, మోదక్‌లు, త్రిశూలాలు, వజ్రాలతో కూడిన వాచీలు తదితర వస్తువులు ఉన్నాయి. ఇందులో దాదాపు 11 కేజీల బంగారు, 200 కేజీల వెండి వస్తువులు ఉన్నాయ’ని పవార్ వెల్లడించారు.