సల్మాన్ ఆమెకు కార్ కొనిచ్చాడు | salman Khan gifts a new car to daisy shah | Sakshi
Sakshi News home page

సల్మాన్ ఆమెకు కార్ కొనిచ్చాడు

Published Sun, Mar 13 2016 2:30 PM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

సల్మాన్ ఆమెకు కార్ కొనిచ్చాడు

సల్మాన్ ఆమెకు కార్ కొనిచ్చాడు

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. తనకు బాగా నచ్చిన వారిని కాస్ట్ లీ గిఫ్ట్ లతో సర్ ప్రైజ్ చేయటం సల్మాన్ ఖాన్ కు అలవాటు. ముఖ్యంగా తనతో కలిసి నటించిన హీరోయిన్లుకు భారీ గిఫ్ట్ ఇచ్చి సంతోష పెడుతుంటాడు ఈ బ్యాచిలర్ స్టార్. అందుకే హీరోయిన్లు సల్మాన్ తో ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా మంచి రిలేషన్ మెయిన్ టెయిన్ చేస్తారు.

తాజాగా తనతో జయహో సినిమాలో కలిసి నటించిన డైసీ షాకు ఓ కాస్ట్ లీ కారును గిఫ్ట్ ఇచ్చాడు సల్మాన్. రెండు రోజుల క్రితమే ఈ గిఫ్ట్ డైసీ కి చేరింది. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్న డైసీ షా ఇటీవల హేట్ స్టోరి 3లో బోల్డ్ క్యారెక్టర్ లో దర్శన మిచ్చింది. అప్పట్లో ఈ క్యారెక్టర్ లో నటించడానికి సల్మానే ఈ ముద్దుగుమ్మను ఒప్పించాడన్న టాక్ వినిపించింది. మరి సల్మాన్ డైసీ షాకు గిఫ్ట్ తోనే సరిపెడతాడో.. లేక తన నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కూడా ఇస్తాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement