భువనేశ్వర్: భక్తుల నుంచి విరాళాలు, కానుకలు స్వీకరించవద్దని ప్రఖ్యాత పూరీ జగన్నాథస్వామి ఆలయంలో పనిచేసే సేవకులకు సుప్రీంకోర్టు సూచించింది. కానుకలు ఇవ్వని భక్తుల పట్ల సేవకులు వివక్ష చూపుతున్నారంటూ వచ్చిన వార్తలపై కోర్టు స్పందించింది. సూచనలను ఆలయంలోని పలు ప్రాంతాల్లో అంటించింది.
సేవకులకు భక్తులు కానుకలు ఇచ్చే విధానానికి బదులుగా ఏపీలోని తిరుపతి,, జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి, గుజరాత్‌లోని సోమనాథ్, పంజాబ్‌లోని స్వర్ణదేవాలయంలలో అమల్లో ఉన్న వివిధ విధానాలను అధ్యయనం చేసి తగు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఒడిశా ప్రభుత్వాన్ని కోరింది. భక్తులు ఇచ్చే కానుకలపైనే తాము ఆధారపడి జీవిస్తున్నందున ఈ ఆదేశాలను పునః పరిశీలించాలంటూ కొందరు సేవకులు కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment