అలా చేయడానికి ఆచారాలు ఒప్పుకోవు | Sabrimala temple in SC says "she can't worship during that time" | Sakshi
Sakshi News home page

అలా చేయడానికి ఆచారాలు ఒప్పుకోవు

Published Mon, Apr 25 2016 5:36 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

అలా చేయడానికి ఆచారాలు ఒప్పుకోవు - Sakshi

అలా చేయడానికి ఆచారాలు ఒప్పుకోవు

న్యూఢిల్లీ: ప్రఖ్యాత శబరిమల ఆలయంలోకి మహిళా భక్తులను అనుమతించకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. శబరిమల ఆలయ బోర్డు మహిళల పట్ల వివక్ష చూపిస్తోందని పేర్కొంది. శబరిమలకు మహిళల నిరాకరణపై దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం పలు పశ్నలు సంధించింది. లైంగికత ఆధారంగా వివక్ష చూపిస్తారా అంటూ సూటిగా ప్రశ్నించింది. వివక్ష చూపకుండా ఆలయ ప్రతిష్ఠను కాపాడాలని సూచించింది. అయితే ఆలయ పవిత్రతను కాపాడేందుకే మహిళలను అనుమతించడం లేదని, వందల ఏళ్ల క్రితం మొదలైన ఆచారాలను కొనసాగిస్తున్నామని న్యాయస్థానానికి ఆలయ బోర్డు తెలిపింది.

మహిళలకు విధించిన నిబంధనలను పురుషులకు ఎందుకు విధించరని కోర్టు ప్రశ్నించింది. స్త్రీ, పురుషులకు సమానంగా నిబంధనలు వర్తింపచేయలేమని ఆలయబోర్డు స్పష్టం చేసింది. మహిళలు రుతుక్రమంలో ఉంటారని, ఆ సమయంలో ఆలయంలో వారు పూజలు చేయడానికి ఆచారాలు ఒప్పుకోవని తెలిపింది. పవిత్రతను రుతుక్రమంతో ముడిపెడతారా, మహిళల దేహంలో చోటుచేసుకునే జీవక్రియ కారణంగా వారిపై వివక్ష చూపిస్తారా అని న్యాయస్థానం సూటిగా నిలదీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement