
క్యాండిల్ లైట్ డిన్నర్... రెడ్ రోజస్ ఇవన్నీ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మన ప్రియమైన వారికి మనసులో మాటను తెలియజెప్పే అపూర్వ కానుకలు. ఈ అపూర్వ కానుకలతో పాటు మరికొన్ని గిఫ్ట్‌లను అందిస్తూ కూడా ప్రియమైన వారి మనసు దోచేసుకోవచ్చు అంటోంది ఎజియో.కామ్. వాలెంటైన్స్ డే గైడ్‌గా ఏమేమీ గిఫ్ట్‌లుగా అందించవచ్చో తెలుపుతూ అమ్మాయిలకు, అబ్బాయిలకు ఐడియాలు అందిస్తోంది.
అమ్మాయిలను ఇంప్రెస్ చేయడమెలా?
అమ్మాయి ఫ్యాషన్‌ను ఎక్కువగా ఇష్టపడితే... ఈ సీజన్‌కు తగ్గట్టు తనకు ఇష్టమైనది ప్రజెంట్ చేయండి. లేటెస్ట్ ఫ్యాషన్ గురించి అంతా తెలుసుకోండి.. ఇయర్ రింగ్స్, డ్రస్‌లు, రఫెల్స్(ఈ సీజన్‌లో అతిపెద్ద ట్రెండ్స్ ఇవే) ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. మ్యూజిక్‌ను ఎక్కువగా ఇష్టపడే వారికి బ్లూటూత్ స్పీకర్ ది బెస్ట్ కానుక. అలా ప్రతి క్షణం తనకు ఇష్టమైన పాటలను ఆస్వాదిస్తూ.. మీ ఊహాలోనే తను మైమరిచిపోతుంటోంది. గోల్డ్ టోన్డ్ నెక్లెస్, స్లింగ్ బ్యాగ్‌తో కూడా అమ్మాయిల మనసును దోచేసుకోవచ్చు.
అబ్బాయిలకి ఇచ్చే కానుకలు..
అబ్బాయిలకు ఏం గిఫ్ట్‌లు ఇచ్చి ఇంప్రెస్ చేయాలో చాలా మంది అమ్మాయిలకు తెలియక తికమకపడిపోతుంటారు. కానీ స్మార్ట్ అప్పీరల్స్‌తోనే అబ్బాయిల మనసు దోచేసుకోవచ్చట. ల్యాప్‌టాప్‌ను ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులకు ల్యాపీ బ్యాగ్, గాడ్జెట్ ప్రియులకు ఫిట్‌నెస్ బ్యాండ్‌లు ఫర్‌ఫెక్ట్ ఛాయిస్ అట. ఫిట్‌నెస్‌ను అంతగా పట్టించుకోని వారికి, ఈ బ్యాండ్‌తో తన ఆరోగ్యంపై శ్రద్ధ వస్తుందని ఎజియో.కామ్ చెబుతోంది. బికర్ జాకెట్, ఫార్మల్ షర్ట్ వారి పాపులారిటీని, లుక్‌ను మరింత పెంచే విధంగా ఉంటాయని, అవి కూడా అమ్మాయిలు గిఫ్ట్‌లుగా ఇవ్వొచ్చని సూచిస్తోంది.