![Happy Mobiles Rs 5 Crore prizes - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/11/HAPPI-MOBILES-PRESS-PHOTO.jpg.webp?itok=_szYxJ_E)
మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ హ్యాపీ మొబైల్స్ ‘ఫెస్టివ్ పటాకా’ ఆఫర్లను ప్రకటించింది. దీనిలో భాగంగా రూ.5 కోట్ల విలువైన ఖచ్చితమైన బహుమతులను కస్టమర్లకు అందజేస్తామని సంస్థ సీఎండీ కృష్ణ పవన్ వెల్లడించారు. నవంబరు చివరి వరకు ఈ ఆఫర్లు ఉంటాయని చెప్పారు. గుంటూరులో హ్యాపీ ఔట్‌లెట్‌ను ప్రారంభించిన సందర్భంగా సినీ నటి కీర్తి సురేశ్ చేతుల మీదుగా ఫెస్టివ్ పటాకా ఆఫర్లను బుధవారం ఆవిష్కరించారు.
రూ.399లకే డ్యూయల్ సిమ్ ఫోన్, రూ.14,999 విలువగల మొబైల్‌పై రూ.10,590 విలువైన మైక్రోమ్యాక్స్ ఎల్‌ఈడీ టీవీ, హానర్ 9 లైట్ మొబైల్‌పై రూ.2,999 విలువచేసే స్పోర్ట్స్ వైర్‌లెస్ హెడ్ సెట్, మొబిస్టార్ ఎక్స్1 డ్యూయల్ మొబైల్‌పై రూ.4,500 విలువగల కెంట్ వాక్యూమ్ క్లీనర్ ఉచితం అని హ్యాపీ మొబైల్స్ ఈడీ కోట సంతోష్ తెలిపారు. లావా జడ్91పై రూ.2,499 విలువచేసే 4.1 హోమ్ థియేటర్ సిస్టమ్ అందుకోవచ్చు. రూ.3,999లకే 2 జీబీ ర్యామ్ ఫోన్ అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment