Happy Mobiles
-
హ్యాపీ మొబైల్ క్యాష్ బ్యాక్ ధమాకా ఆఫర్లు
హైదరాబాద్: హ్యాపీ మొబైల్స్ దీపావళి పండుగ సందర్భంగా ‘‘క్యాష్ బ్యాక్ ధమాకా’’ పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎలాంటి లక్కీ డ్రా లేకుండా ప్రతి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి అందించనుంది. మొబైల్, ల్యాప్ ట్యాబ్, టీవీల కొనుగోళ్లపై 10% వరకు క్యాష్ బ్యాక్‌ను పొందొచ్చు. శాంసంగ్, ఒప్పో, వివో మొబైళ్ల కొనుగోలుపై రూ.3000 వరకు, ఐఫోన్ కొనుగోలుపై రూ. 6000 వరకు, స్మార్ట్ టీవీల కొనుగోలుపై రూ. 3000 వరకు క్యాష్ బ్యాక్‌ను అందించవచ్చు. అన్ని మొబైల్ ఉపకరణలపై 60% వరకు తగ్గింపు పొందవచ్చు. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్సర్వ్, మొబిక్విక్, పేటీఎంల ద్వారా 10% వరకు తక్షణ క్యాష్ బ్యాక్‌ను పొందొచ్చు. ప్రత్యేక ఆఫర్లను కస్టమర్లు వినియోగించుకోవాలని కంపెనీ సీఎండీ కృష్ణ పవన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోట సంతోష్ తెలిపారు. -
అతను నాలా ఉండకూడదు: కాజల్
సాక్షి, వైజాగ్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మల్టీ-బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ హ్యాపీ మొబైల్స్, విశాఖలో మరో షో రూంను ప్రారంభించింది. ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ గురువారం దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వినియోగదారులు ఈ (అక్టోబర్) నెలలో దసరా, దీపావళి సందర్బంగా హ్యాపీ మొబైల్స్ స్టోర్స్ లో మెగా ఫెస్టివల్ ధమాకా అందిస్తోంది. ప్రతీ మొబైల్‌పై ఉచిత బహుమతి పొందేందుకు అయిదు కోట్ల విలువైన బహుమతులును సిద్ధంగా ఉంచినట్టు హ్యామీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్, డైరక్టర్ కోట సంతోష్ తెలిపారు. పది వేల రూపాయల పైబడి మొబైల్ కొన్న కస్టమర్లకు వారి పుట్టిన రోజున అక్షయ్య పాత్ర ద్వారా నిరుపేదలకి ఉచిత భోజనం సదుపాయాన్ని అందివ్వనున్నట్టు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు 57 స్టోర్స్ ప్రారంభించామనీ తద్వారా పది లక్షల కస్టమర్లకి చేరువయ్యామని వారు సంతోషం వ్యక్తం చేశారు. నచ్చిన వ్యక్తి దొరికతే తప్పకుండా పెళ్లి చేసుకుంటా - కాజల్ అగర్వాల్ ఈ కార్యక్రమంలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ విశాఖ రావడం ఆనందంగా ఉందన్నారు. హ్యాపీ మొబైల్స్ తొలి షోరూమ్ ప్రారంభించడం సంతోషంగా ఉందనీ, అలాగే కస్టమర్లకి భారీ డిస్కౌంట్ లు అందించడం హ్యాపీగా ఉందని పేర్కొన్నారు. విశాఖ ప్రజలు, ఇక్కడి ఫుడ్ తనకు చాలా ఇష్టమని తెలిపారు. విశాఖలోఎన్నో సినిమా షూటింగ్లలో పాల్గొన్నానంటూ ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. అలాగే క్వీన్ తమిళ రీమేక్ లో కష్టపడి నటిస్తున్నాననీ, హిందీతో పాడు తమిళ వెబ్ సిరీస్ లో నటిస్తున్నానంటూ తన ఫ్యూచర్ ప్రాజెక్టుల వివరాలందించారు. తన సహనటులందరితోనూ తనకు మంచి సంబంధాలున్నాయని తెలిపారు. అంతేకాదు తనకు నచ్చిన వ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానంటూ కాజల్ తన అభిమానుల్లో హుషారు నింపారు. అయితే తనకు కాబోయే వరుడు తనలాగా కాకుండా డిఫరెంట్‌గా వుండాలని వ్యాఖ్యానించి నవ్వులు పూయించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నిమిషానికో ఫోన్ విక్రయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ హ్యాపీ మొబైల్స్... సగటున నిముషానికి ఒక స్మార్ట్‌ఫోన్ చొప్పున విక్రయిస్తోంది. కార్యకలాపాలు ప్రారంభించిన తొలి ఏడాదిలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 50 స్టోర్లతో 5 లక్షల మందికిపైగా కస్టమర్లకు చేరువైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 150– 200 ఔట్లెట్లు ప్రారంభిస్తామని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ వెల్లడించారు. తొలి స్టోర్‌ను ఆరంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా కంపెనీ ఈడీ కోట సంతోష్‌తో కలసి గురువారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. ‘2018–19లో రూ.250 కోట్ల పైచిలుకు టర్నోవర్ సాధించాం. 2019–20లో రూ.500 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా చేసుకున్నాం. ప్రస్తుతం 600 మంది ఉద్యోగులున్నారు. విస్తరణతో సిబ్బంది సంఖ్య 2,000 దాటుతుంది’ అని వివరించారు. గంటలో ఫోన్ డెలివరీ... లక్షన్నర జనాభా ఉన్న పట్టణాల్లో ఔట్‌లెట్‌ను తెరుస్తున్నట్లు కృష్ణ పవన్ వెల్లడించారు. ‘‘ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరిస్తాం. వచ్చే ఏడాది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర మార్కెట్లలో అడుగు పెడతాం. హ్యాపీ స్టోర్ ఉన్న చోట కస్టమర్లు ఆన్లైన్లో ఆర్డరిస్తే గంటలో ఫోన్‌ను డెలివరీ చేస్తాం. త్వరలోనే ఈ సేవలను ప్రారంభిస్తున్నాం’’ అని వివరించారు. హ్యాపీ మొబైల్స్ ఒక్కో స్టోర్‌కు రూ.40–50 లక్షలు వెచ్చిస్తోంది. కొన్ని స్టోర్లలో ఎల్ఈడీ టీవీలు, వాక్యూమ్ క్లీనర్లు, సీసీ కెమెరాల వంటి లైఫ్‌స్టైల్ ప్రొడక్టులను విక్రయిస్తోంది. దశలవారీగా అన్ని స్టోర్లలో వీటిని అందుబాటులో ఉంచనుంది. 40 శాతం క్యాష్‌బ్యాక్.. తొలి వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ హ్యాపీ డేస్‌ను ప్రకటించింది. రూ.5 వేలు ఆపైన ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై 40 శాతం క్యాష్‌బ్యాక్ ప్రత్యేక ఆకర్షణ. స్మార్ట్ఫోన్లపై రెండేళ్ల వారంటీ ఉంది. వన్‌టైం స్క్రీన్ రీప్లేస్మెంట్, ప్రైస్ డ్రాప్ ప్రొటెక్షన్, బ్రాండెడ్ గిఫ్టులు కస్టమర్లు అందుకోవచ్చు. ఈ నెల 30 వరకు ఈ ఆఫర్లుంటాయి. ప్రతి మూడు నెలలకు హ్యాపీ డేస్ ఆఫర్లను పరిచయం చేస్తామని కోట సంతోష్ చెప్పారు. రిపీటెడ్ కస్టమర్లలో అత్యధికులు 18–26 ఏళ్ల వయసువారని చెప్పారాయన. -
ఘనంగా సాక్షి పండుగ సంబరాలు
-
హ్యాపీ మొబైల్స్ 40వ స్టోర్ ప్రారంభం
మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ హ్యాపీ మొబైల్స్ 40వ స్టోర్‌ను హైదరాబాద్, బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసింది. ఈ ఫ్లాగ్షిప్ ఔట్‌లెట్‌ను సినీ నటి రష్మిక, షావొమి ఆఫ్‌లైన్ సేల్స్ హెడ్ దీపక్ నక్రా బుధవారం ఆరంభించారు. షావొమి ‘మి’ జోన్‌ను సైతం ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసినట్లు హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ చెప్పారు. ఆన్లైన్లో విజయవంతంగా అమ్ముడవుతున్న పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌ను ఈ సందర్భంగా విడుదల చేశారు. పోకో ఎఫ్1 ఎక్స్‌క్లూజివ్‌గా తమ స్టోర్‌లో లభిస్తుందని హ్యాపీ మొబైల్స్ ఈడీ కోట సంతోష్ తెలిపారు. దసరా, దీపావళి సందర్భంగా హ్యాపీ ఫెస్టివ్ పటాకా పేరుతో రూ.5 కోట్ల విలువైన బహుమతులను అందజేస్తున్నామన్నారు. -
హ్యాపీ మొబైల్స్ రూ.5 కోట్ల బహుమతులు
మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ హ్యాపీ మొబైల్స్ ‘ఫెస్టివ్ పటాకా’ ఆఫర్లను ప్రకటించింది. దీనిలో భాగంగా రూ.5 కోట్ల విలువైన ఖచ్చితమైన బహుమతులను కస్టమర్లకు అందజేస్తామని సంస్థ సీఎండీ కృష్ణ పవన్ వెల్లడించారు. నవంబరు చివరి వరకు ఈ ఆఫర్లు ఉంటాయని చెప్పారు. గుంటూరులో హ్యాపీ ఔట్‌లెట్‌ను ప్రారంభించిన సందర్భంగా సినీ నటి కీర్తి సురేశ్ చేతుల మీదుగా ఫెస్టివ్ పటాకా ఆఫర్లను బుధవారం ఆవిష్కరించారు. రూ.399లకే డ్యూయల్ సిమ్ ఫోన్, రూ.14,999 విలువగల మొబైల్‌పై రూ.10,590 విలువైన మైక్రోమ్యాక్స్ ఎల్ఈడీ టీవీ, హానర్ 9 లైట్ మొబైల్‌పై రూ.2,999 విలువచేసే స్పోర్ట్స్ వైర్లెస్ హెడ్ సెట్, మొబిస్టార్ ఎక్స్1 డ్యూయల్ మొబైల్‌పై రూ.4,500 విలువగల కెంట్ వాక్యూమ్ క్లీనర్ ఉచితం అని హ్యాపీ మొబైల్స్ ఈడీ కోట సంతోష్ తెలిపారు. లావా జడ్91పై రూ.2,499 విలువచేసే 4.1 హోమ్ థియేటర్ సిస్టమ్ అందుకోవచ్చు. రూ.3,999లకే 2 జీబీ ర్యామ్ ఫోన్ అందుబాటులో ఉంది. -
సందడి చేసిన మిల్కీబ్యూటీ
భీమవరంలో సినీ హీరోయిన్ (మిల్కీబ్యూటీ) తమన్నా సోమవారంసందడి చేశారు. హ్యాపీ మొబైల్ షోరూమ్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా అభిమానుల కోరిక మేరకు సినిమా పాటకు స్టెప్వేసి అలరించారు. భీమవరం: సినీ హీరోయిన్ తమన్నా భాటియా భీమవరంలో సోమవారం సందడి చేసింది. పట్టణంలోని హ్యాపీ మొబైల్ షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా అభిమానుల కోరిక మేరకు సినిమాలోని ఓ పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షోరూం ప్రారంభోత్సవం తనతో పాటు తన అభిమానితో కలిసి చేయించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలుగువారి ప్రేమాభిమానాలు ఎప్పటి మర్చిపోలేనని చెప్పారు. తెలుగు క్షుణ్నంగా నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. భీమవరం పట్టణం మళ్లీమళ్లీ రావాలనిపించేలా ఉందన్నారు. తాను ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలసి సైరా చిత్రంలోను, దటీజ్ మహాలక్ష్మి చిత్రంలోను నటిస్తున్నట్టు వెల్లడించారు. చిరంజీవితో కలసి నటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనకు తెలుగుసినీ పరిశ్రమలో రామ్‌చరణ్, ప్రభాస్, రాణా అంటే ప్రత్యేకమైన అభిమానమని పేర్కొన్నారు. డ్యాన్స్‌లో ప్రభుదేవా తనకు గురువని చెప్పారు. హ్యాపీ మొబైల్స్‌లో అత్యధిక డిస్కౌంట్‌తో విక్రయాలు చేయడంతో పాటి ప్రతి కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సంస్థ అధినేత కృష్ణపవన్ మాట్లాడుతూ కస్టమర్లకు సంతోషాన్నివ్వడమే తమ లక్ష్యమన్నారు. భీమవరంలోని పీపీ రోడ్డులో 30వ షోరూంను ప్రారంభించామని తెలిపారు. తొలి ఏడాదిలోనే 200 నూతన షోరూమ్‌లు ఏర్పాటు చేయాలనే భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వివరించారు. భారీ డిస్కౌంట్లతో సేవలందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోటా సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
హ్యాపీ మొబైల్స్ ప్రచారకర్తగా రామ్‌చరణ్