అతను నాలా ఉండకూడదు: కాజల్‌ | Happy Mobiles Showroom Inagurated by actess Kajal Agarwal | Sakshi
Sakshi News home page

అతను నాలా ఉండకూడదు: కాజల్‌ అగర్వాల్‌

Published Thu, Oct 3 2019 1:51 PM | Last Updated on Thu, Oct 3 2019 4:04 PM

Happy Mobiles Showroom Inagurated by actess Kajal Agarwal - Sakshi

సాక్షి, వైజాగ్‌ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మల్టీ-బ్రాండ్ మొబైల్ రిటైల్  చైన్‌ హ్యాపీ మొబైల్స్, విశాఖలో  మరో షో రూంను ప్రారంభించింది. ప్రముఖ సినీ నటి కాజల్‌ అగర్వాల్‌ గురువారం దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  వినియోగదారులు ఈ (అక్టోబర్) నెలలో దసరా, దీపావళి సందర్బంగా హ్యాపీ మొబైల్స్ స్టోర్స్ లో మెగా ఫెస్టివల్ ధమాకా అందిస్తోంది. ప్రతీ మొబైల్పై ఉచిత బహుమతి పొందేందుకు అయిదు కోట్ల విలువైన బహుమతులును సిద్ధంగా ఉంచినట్టు హ్యామీ మొబైల్స్‌  సీఎండీ కృష్ణ పవన్, డైరక్టర్ కోట సంతోష్ తెలిపారు. పది వేల రూపాయల పైబడి మొబైల్ కొన్న కస్టమర్లకు వారి పుట్టిన రోజున అక్షయ్య పాత్ర ద్వారా నిరుపేదలకి ఉచిత భోజనం సదుపాయాన్ని అందివ్వనున్నట్టు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు 57 స్టోర్స్ ప్రారంభించామనీ తద్వారా పది లక్షల కస్టమర్లకి చేరువయ్యామని వారు సంతోషం వ్యక్తం చేశారు. 

నచ్చిన వ్యక్తి దొరికతే  తప్పకుండా పెళ్లి చేసుకుంటా  - కాజల్‌ అగర్వాల్‌

ఈ కార్యక్రమంలో కాజల్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ విశాఖ రావడం ఆనందంగా ఉందన్నారు. హ్యాపీ మొబైల్స్ తొలి షోరూమ్ ప్రారంభించడం సంతోషంగా ఉందనీ,  అలాగే కస్టమర్లకి భారీ డిస్కౌంట్ లు అందించడం  హ్యాపీగా ఉందని పేర్కొన్నారు.  విశాఖ ప్రజలు, ఇక్కడి ఫుడ్ తనకు చాలా ఇష్టమని తెలిపారు. విశాఖలోఎన్నో సినిమా షూటింగ్లలో పాల్గొన్నానంటూ ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. అలాగే క్వీన్ తమిళ రీమేక్ లో కష్టపడి నటిస్తున్నాననీ,  హిందీతో పాడు తమిళ వెబ్ సిరీస్ లో నటిస్తున్నానంటూ తన ఫ్యూచర్‌  ప్రాజెక్టుల వివరాలందించారు. తన సహనటులందరితోనూ తనకు మంచి సంబంధాలున్నాయని తెలిపారు. అంతేకాదు తనకు నచ్చిన వ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానంటూ కాజల్‌ తన అభిమానుల్లో హుషారు నింపారు. అయితే తనకు కాబోయే వరుడు తనలాగా కాకుండా డిఫరెంట్‌గా వుండాలని వ్యాఖ్యానించి నవ్వులు పూయించారు.



(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement