![Happy Mobiles Launch 40th Store - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/18/HAPPI.jpg.webp?itok=B6yahePB)
మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ హ్యాపీ మొబైల్స్ 40వ స్టోర్‌ను హైదరాబాద్, బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఔట్‌లెట్‌ను సినీ నటి రష్మిక, షావొమి ఆఫ్‌లైన్ సేల్స్ హెడ్ దీపక్ నక్రా బుధవారం ఆరంభించారు. షావొమి ‘మి’ జోన్‌ను సైతం ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసినట్లు హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ చెప్పారు.
ఆన్‌లైన్‌లో విజయవంతంగా అమ్ముడవుతున్న పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌ను ఈ సందర్భంగా విడుదల చేశారు. పోకో ఎఫ్1 ఎక్స్‌క్లూజివ్‌గా తమ స్టోర్‌లో లభిస్తుందని హ్యాపీ మొబైల్స్ ఈడీ కోట సంతోష్ తెలిపారు. దసరా, దీపావళి సందర్భంగా హ్యాపీ ఫెస్టివ్ పటాకా పేరుతో రూ.5 కోట్ల విలువైన బహుమతులను అందజేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment