
అప్పుడు టాటూ.. ఇప్పుడు లాకెట్..!
ఈ మధ్య అందరి చూపులూ దీపికా పదుకొనే మెడలో వేలాడుతున్న గొలుసు పైనే. ఆ గొలుసుకో లాకెట్ ఉంది. దాని మీద ‘లవ్’ అని రాసి ఉంది.
ఈ మధ్య అందరి చూపులూ దీపికా పదుకొనే మెడలో వేలాడుతున్న గొలుసు పైనే. ఆ గొలుసుకో లాకెట్ ఉంది. దాని మీద ‘లవ్’ అని రాసి ఉంది. దాంతో ఇది కచ్చితంగా హీరో రణ్‌వీర్ సింగ్ ఇచ్చినదేనని చెప్పుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారనే వార్త బాలీవుడ్‌లో షికారు చేస్తోంది. ఆ వార్తను నిజం చేస్తూ.. ఈ ఇద్దరూ కాఫీ షాప్స్, రెస్టారెంట్లలో జంటగా కనిపిస్తున్నారు. ఆ మధ్య విహార యాత్రక్కూడా వెళ్లారనే వార్త వచ్చింది. ఈ వార్తల కారణంగానే ఈ లాకెట్‌ని దీపికాకి రణ్‌వీర్ బహుమతిగా ఇచ్చి ఉంటారన్నది చాలామంది ఊహ.
గతంలో రణబీర్ కపూర్‌ని ప్రేమించినప్పుడు మెడ మీద ‘ఆర్‌కె’ అనే అక్షరాలతో టాటూ వేయించుకున్నారు దీపికా. అతన్నుంచి విడిపోయిన తర్వాత ఆ టాటూని వదిలించుకోవడానికి చాలా కష్టాలు పడ్డారట. ఇప్పుడు రణ్‌వీర్ సింగ్‌ని ప్రేమిస్తున్నారు కాబట్టి, లెక్క ప్రకారం ‘ఆర్‌ఎస్’ అని టాటూ వేయించుకోవాలి. ఏమో.. చెరిపేయాల్సిన పరిస్థితి వస్తే..? అందుకే దీపికా టాటూ జోలికి వెళ్లి ఉండరు. సేఫ్‌గా లాకెట్‌తో సరిపెట్టుకుని ఉంటారు. నచ్చినంత కాలం ఉంచుకోవచ్చు.. నచ్చకపోతే లాకెట్టేగా.. సులువుగా తీసిపారేయొచ్చు. ఏమో.. మరి జీవితాంతం దీపికా గుండెల్లో రణ్‌వీర్ కొలువుంటారో లేదో కాలమే చెప్పాలి.