
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులతోపాటు కూతురు ఇవాంకకు సీఎం కేసీఆర్ కానుకలు అందించనున్నారు. ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ప్రత్యేక ఆహ్వాని తుడిగా కేసీఆర్ హాజరుకాను న్నారు. ఇందుకోసం ఆయన మంగళ వారం ఢిల్లీ వెళ్లనున్నారు. కార్య క్రమంలో ఆయన ట్రంప్‌కు పోచంపల్లి శాలువా కప్పి చార్మినార్ మెమెంటో అందించనున్నారు. మెలానియా, ఇవాంకలకు పోచంపల్లి, గద్వాల చీరలను బహూకరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment