రాష్ట్రపతి విందుకు కేసీఆర్‌ హాజరు | Trump India Visit:KCR Attended President Lunch With Trump | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి విందుకు కేసీఆర్‌ హాజరు

Feb 26 2020 3:06 AM | Updated on Feb 26 2020 10:30 AM

Trump India Visit:KCR Attended President Lunch With Trump - Sakshi

ట్రంప్‌ గౌరవార్ధం రాష్ట్రపతి ఇచ్చిన విందులో అమెరికా అధ్యక్షుడితో సీఎం కేసీఆర్‌

సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాల్‌లో ఏర్పాటు చేసిన విందు సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయన.. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైన విందు భేటీలో పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఈ విందు సమావేశానికి అతిథులుగా ఆహ్వానించగా ఆ జాబితాలో కేసీఆర్‌ కూడా ఉన్నారు.(సీఎన్‌ఎన్‌ X ట్రంప్‌)

డొనాల్డ్‌ ట్రంప్, ఆ దేశ ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్‌ అతిథులను పరిచయం చేసుకుంటూ వారితో ముచ్చటిస్తూ ముందుకు సాగారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారితో కరచాలనం చేసి తనను పరిచయం చేసుకున్నారు. డొనాల్డ్‌ ట్రంప్, మెలానియా ట్రంప్‌ వెంట రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, రాష్ట్రపతి సతీమణి సవితా కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి ఉష, ప్రధాని నరేంద్ర మోదీ అతిథులను పలకరిస్తూ ముందుకు సాగారు.

ట్రంప్‌కు సంబంధించి పూర్తి వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement