Woman shocked after holiday gifts in her luggage: ఎప్పుడైన మన వస్తువులు పొరపాటున లేక మరేదైన కారణాల వల్లో ఒక్కొసారి మన వస్తువులు వేరేవారికి వారి వస్తువులు మనకి తారుమారు అవుతుండడం సహజం. వీలైతే సాధ్యమైనంత వరకు మార్చుకోగలుగుతాం. అదే ఒక్కొసారి వాళ్ల ఎవరో తెలియకపోడమో లేక ఎప్పుడూ వస్తువులు మారిపోయాయో గుర్తించనట్లయితే కచ్చితంగా మన వస్తువు తెచ్చుకోవడం కాస్త కష్టమే. అచ్చం అలాంటి సంఘటన యూఎస్‌కి చెందిన ఒక మహిళకు జరిగింది.
(చదవండి: 10 వేల సంవత్సరాల వరకు దేశం విడిచిపెట్టి వెళ్లకూడదట!)
అసలు విషయంలోకెళ్లితే...యూఎస్‌కి చెందిన మహిళ యూరప్ విహార యాత్రకు వెళ్లింది. ఆ విహారయాత్రలో తన కోసం స్నేహితులు, బంధువుల కోసం దాదాపు రూ 2 లక్షలు ఖరీదు చేసే బహుమతులను కొనుగోలు చేసింది. అయితే ఆమె ఇటలీలో సుమారు 11 రోజుటు గడిపింది. కొన్ని రోజులు వ్యాపారం నిమిత్తం ప్యారిస్‌లో ఉంది. అయితే ఆమె విహారయాత్రకు వెళ్లి ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాక తన సూట్‌కేసుని ఎంతో సంతోషంగా తెరిచి చూస్తుంది.
అంతే ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే అందులో ఆమె కొన్న గిఫ్ట్‌లు బదులు డాగ్ ఫుడ్, పాత టీ-షర్టు, షేవింగ్ క్రీమ్ బాటిల్ ఉన్నాయి. ఆ తర్వాత ఆమె కాసేపటికి తన లగేజ్ ఎయిర్‌పోర్టులో మారిపోయి ఉంటుందని గుర్తించింది. ఈ మేరకు ఆమె సదరు ఎయిర్‌లైన్స్‌కి జరిగిన విషయాన్ని తెలియజేసింది. అయితే సదరు ఎయిర్‌లెన్స్ కూడా ఆ మహిళకు ఎదురైన అనుభవానికి క్షమపణలు చెప్పడమే కాక సాధ్యమైనంత త్వరలో దీన్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చింది.
(చదవండి: ఖాతాదారుడు తాకట్టు పెట్టిన ఆభరణాలను కొట్టేసిన బ్యాంక్ క్యాషియర్!)
Comments
Please login to add a commentAdd a comment