అవార్డుల ‘రాణి’
-
26 సార్లు ఉత్తమ సేవలకు పురస్కరాలు
ఆదిలాబాద్ టౌన్ : మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదిలాబాద్ రూరల్ ప్రాజెక్టులో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ టీఈవీ రాణి అవార్డుల రాణిగా నిలుస్తోంది. ఉద్యోగిగా ఉత్తమ సేవలు అందిండమేగాక ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యహరిస్తోంది. ఇప్పటి వరకు ఆమె రాష్ట్ర మంత్రులు, జిల్లాలో పని చేసిన కలెక్టర్‌ల చేతుల మీదుగా, ఐసీడీఎస్ శాఖ ఉన్నత అధికారుల నుంచి సేవ పతకాలను, ప్రశంస పత్రాలను అందుకుంది.
మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఆరు సార్లు, ప్రభుత్వం నుంచి పన్నెండు సార్లు, ఉత్తమ కళాకారిణి 4 సార్లు అవార్డులు అందుకుంది. అదే విధంగా ఉత్తమ కవయిత్రిగా 8 సార్లు పురస్కారాలు అందుకున్నారు. సోమవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సమాచార పౌర సంబంధాల శాఖ నుంచి రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, జిల్లా కలెక్టర్ జగన్మోహన్ నుంచి ఉత్తమ వ్యాఖ్యత అవార్డును అందుకున్నారు. అవార్డును అందుకున్న ఆమె శాఖ అధికారులు, ఉద్యోగులు అభినందించారు.