దక్షిణమధ్య రైల్వేకు అవార్డుల పంట
సాక్షి,హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వేకు అవార్డుల పంట పండింది. ఈ నెల 13న గువాహటిలో జరిగిన 60వ రైల్వే వారోత్సవాల్లో రైల్వే మంత్రి సురేష్ ప్రభు చేతుల మీదుగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ ఈ అవార్డులను అందుకున్నారు. 2014-15 సంవత్సరానికి సివిల్ ఇంజనీరింగ్, స్టోర్స్, సేల్స్ మేనేజ్‌మెంట్, రన్నింగ్ రూమ్ రంగాలలో ఉత్తమ సేవలకు గాను దక్షిణ మధ్య రైల్వేకు షీల్డ్స్ బహూకరించారు. ఈ కార్యక్రమంలో రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా, రైల్వే బోర్డు చైర్మన్ ఎ.కె.మిట్టల్, రైల్వేబోర్డు సభ్యులు పాల్గొన్నారు.