
హీరో ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాల్లో ఆది పురుష్ ఒకటి. ఇటీవల ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మూవీ 103 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులనుతో ఆది పురుష్ టీం బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టెక్నిషియన్లకు ప్రభాస్ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఖరీదైన రాడో వాచ్‌లను ప్రభాస్ వారికి బహుమతిగా ఇచ్చిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
చదవండి: మహిళల పరువు పోయింది.. సమంత స్పెషల్ సాంగ్‌పై మాధవిలత షాకింగ్ కామెంట్స్
ఇందుకు సంబంధించిన ఫొటోలను ఓ టెక్నిషియన్ షేర్ చేస్తూ ఆనందం వ్యక్త చేశాడు. ప్రభాస్ నుంచి ఊహించని బహుమతి అందడంతో ఆది పురుష్ టీం టెక్నిషియన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా డైరెక్టర్ ఓం రౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ పౌరాణిక సినిమాలో ప్రభాస్ రాముని పాత్ర పోషిస్తుండగా.. కృతి సనన్ సీతగా కనిపించనుంది. లక్ష్మణుడిగా బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ ఆలీఖాన్ కీలక పాత్రల్లో నటించనున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కె చిత్రంతో బిజీగా ఉన్నాడు.
చదవండి: ‘రాధే శ్యామ్’ సంచారి ఫుల్ సాంగ్ వచ్చేసింది, గంటలోనే మిలియన్ వ్యూస్
Comments
Please login to add a commentAdd a comment