
రవితేజ టైటిల్ రోల్‌లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మిస్టర్ బచ్చన్.. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మిస్టర్ బచ్చన్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈమేరకు ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్‌గా తొలిపరిచయం అవుతుంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది.