
RRR Movie Officially Final Release Date Out By Makers: దర్శక ధీరుడు జక్కన్న, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో భారీ మల్టీ స్టారర్‌గా వస్తున్న చిత్రం చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్‌ఆర్ఆర్). అయితే ఈ సినిమా ఇప్పటికే సంక్రాంతి కానుకగా విడుదలై అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోవాల్సింది. కానీ అలా జరగకుండా కరోనా, ఒమిక్రాన్, థియేటర్ ఆక్యుపెన్సీ వంటి పలు కారణాలతో వాయిదా పడింది. తర్వాత సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూసిన ప్రేక్షకులకు, అభిమానులకు మార్చి 18 లేదా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఇటీవల ఏదో ఒక తేదినే రిలీజ్ చేస్తారని అది మార్చి 18 అని ఒక రూమర్, కాదు కాదు ఏప్రిల్ 28నే అని మరొక పుకారు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ పుకార్లన్నింటికి చెక్ పెడుతూ తాజాగా ఏ తేదిన విడుదల చేయనున్నారో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇందులో ఎక్కువగా ఏప్రిల్ 28న విడుదల కానుందని ప్రచారం జరిగినా ఆ రెండు కాకుండా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు కరోనా కారణంగా నాలుగు సార్లు ట్రిపుల్ ఆర్ వాయిదా పడింది.
ప్రకటించిన రిలీజ్ డేట్స్
జూలై 30. 2020
జనవరి 8 2021
అక్టోబర్ 13 2021
జనవరి 7, 2022
#RRRonMarch25th, 2022... FINALISED! 🔥🌊 #RRRMovie pic.twitter.com/hQfrB9jrjS
— RRR Movie (@RRRMovie) January 31, 2022