
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో కన్హయ్య లాల్ గుప్తా అనే 106 ఏళ్ల వృద్ధుడు ప్రపంచంలో అత్యంత వృద్ధ రైల్యే యూనియన్ నాయకుడిగా రికార్డు సృష్టిచాడు. అతడు యూనియన్ ఎన్నికల్లో ఏకంగా 61 సార్లు గెలిచిన అత్యంత పెద్ద యాక్టివ్ ట్రేడ్ యూనియన్ లీడర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్సులోకి ఎక్కబోతున్నాడు. గోరఖ్‌పూర్‌కి చెందిన కన్హయ్య లాల్ గుప్తా 1946లో రైల్వేలో చేరిన తర్వాత ఈశాన్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
స్వాతంత్యం వచ్చేంత వరకు 10 ఏళ్లు సైన్యంలో పనిచేశారు. ఆ కొద్దికాలంలోనే ఈశాన్య రైల్వే మజ్దూర్ యూనియన్(ఎన్‌ఈఆర్‌ఎంయూ)తో అనుబంధం కలిగి ఉన్నారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది జనరల్ సెక్రటరీ ఎన్నికల్లో పోటీ చేస్తుండేవాడు. ఆయన 1981లో పదవి విరమణ చేశాడు. అయినప్పటికీ తన సహ రైల్వే యూనియన్ సభ్యులకు ప్రాతినిధ్యం వహించడం ఆపలేదు. అతను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు.
తాను 1974లో స్వాతంత్య్ర ఉద్యమకారుడు జయప్రకాశ్ నారాయణతో కలిసి పనిచేయడం వల్ల స్ఫూర్తి, నైతిక బలాన్ని పొదినట్లు చెప్పారు. అతను రైల్వేలో అత్యంత పెద్ద వయసు కలిగిన ఫించనుదారుడు. అంతేకాదు అతని కెరీయర్‌లో కొన్ని ఎత్తుపల్లాలు కూడా ఉన్నాయి. అతను నాలుగుసార్లు పదవి నుంచి తొలగింపబడ్డాడు, ఒక నెల జైలు శిక్ష అనుభవించాడు. కన్హయ్య లాల్‌కి ఈశాన్య రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యాలయమే నివాసం, అందులోని సభ్యులే తన కుటుంబం అని చెబుతుంటాడు. మీడియా నివేదికల ప్రకారం అతని కార్యాలయం ఏడాది పొడువునా తెరిచే ఉంటుంది.
(చదవండి: తల నరికేసే ఊరిలో... రెండు దేశాల బార్డర్)