
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న మంత్రి మురుగేశ్ నిరాణి వద్ద ఐదు వందల సీడీలు ఉన్నట్లు సామాజిక కార్యకర్త ఆలం పాషా ఆరోపించారు. ఆయన మంగళవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. మురుగేశ్ నిరాణి వద్ద ఐదు వందల సీడీలున్నాయి.
అందులో ఎవరివైనా ఉండవచ్చన్నారు. మురుగేశ్‌ను సీడీ బాబా అని వర్ణిస్తూ అనేక మంది రాసలీల సీడీలు ఆయన వద్ద ఉన్నాయన్నారు. నకిలీ పేర్లతో ఆయన బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నారని అన్నారు.