Bank Loans
-
ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కఠిన చర్యలు
బ్యాంకుల్లో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోవడం ప్రస్తుతం పరిపాటిగా మారింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులను (విల్‌ఫుల్ డిఫాల్టర్) నిరోధించడానికి బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక చర్యలను చేపట్టింది. వీరి వర్గీకరణపై తుది మార్గదర్శకాలను జారీ చేసింది.ఆర్బీఐ వివరాల ప్రకారం..రుణ ఖాతాలు మొండి బకాయిగా మారిన ఆరు నెలల లోపు విల్‌ఫుల్ డిఫాల్టర్లను నిర్దిష్టంగా గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని ప్రత్యేక కమిటీ పరిశీలిస్తూ ఉండాలి. ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల ఫొటోలను ప్రచురించాలి. ఎగవేతదారుకు, అతనికి సంబంధమున్న ఏ కంపెనీకీ అదనపు రుణ సదుపాయాలను అందించరాదు. ఎగవేతదార్ల జాబితా నుంచి బ్యాంకులు సదరు వ్యక్తి పేరును తొలగించిన ఏడాది వరకు ఇది అమల్లో ఉండాలి.ఇదీ చదవండి: పెళ్లి కాకుండానే 100 మందికి తండ్రయ్యాడు..!తాజా మార్గదర్శకాలు బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఎక్స్పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంక్), నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) వంటి ఆర్థిక సంస్థలకు వర్తిస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. బకాయి మొత్తం రూ.25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉండి, రుణగ్రహీత లేదా గ్యారెంటార్ రుణ చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన పక్షంలో దాన్ని ‘విల్‌ఫుల్ డిఫాల్టర్’గా వ్యవహరిస్తారు. -
అప్పు చెల్లించని వైజాగ్ స్టీల్‌ప్లాంట్!
ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్) బ్యాంకులకు అప్పులు చెల్లించకుండా తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురవుతుంది. జూన్ 30న బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.410 కోట్లను డిఫాల్ట్ చేసింది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లకు తీవ్రనష్టం వాటిల్లినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెంటనే చర్యలు తీసుకునేలా అప్పు ఇచ్చిన బ్యాంకులు ఇంటర్క్రెడిటర్ అగ్రిమెంట్(రుణ గ్రహీతలు డిఫాల్ట్ అయితే రిస్క్ తగ్గించే ఒప్పందం)పై సంతకాలు చేయాలని నిర్ణయించుకున్నాయి.వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు దాదాపు రూ.14,000 కోట్లు టర్మ్ లోన్లు ఉన్నాయి. రూ.15,000 కోట్లు షార్ట్ టర్మ్ లోన్లు, గ్యారెంటీలు, లెటర్ ఆఫ్ క్రెడిట్ వంటివి ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు రూ.5,000 కోట్ల కంటే ఎక్కువ టర్మ్ లోన్, రూ.4,000 కోట్ల షార్ట్ టర్మ్ లోన్, రూ.1,400 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్ అందించింది. కెనరా బ్యాంక్ రూ.3,800 కోట్ల రుణాలు, ఇండియన్ బ్యాంక్ రూ.1,400 కోట్ల టర్మ్ లోన్ ఇచ్చింది. అయితే ఇటీవల రుణదాతలకు చెల్లించాల్సిన రూ.410 కోట్లు డిఫాల్ట్ చేయడంతో బ్యాంకులు ఇంటర్ క్రెడిట్ అగ్రిమెంట్(ఐసీఏ)పై సంతకాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సంస్థ డిఫాల్ట్ అయిన నెలలోపు ఐసీఏపై సంతకం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది. తద్వారా నష్టాల్లో ఉన్న కంపెనీని పునరుద్ధరించడానికి తక్షణ చర్య తీసుకోవచ్చు. అయితే 75% మంది రుణదాతలు నిబంధనలకు అంగీకరిస్తేనే ఈ చర్య అమలు అవుతుంది.సంస్థ ఇటీవల చేసిన డిఫాల్ట్ నగదు ఇంకా సాంకేతికంగా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ (ఎన్పీఏ) అవ్వలేదు. కానీ, ముందుజాగ్రత్త చర్యగా కొంతమంది రుణదాతలు తాము ఇచ్చిన అప్పులకుగాను సంస్థలో 15 శాతం కేటాయింపులు పూర్తి చేశారు. డిఫాల్ట్ నిర్ణయం ప్రకటించిన 90 రోజుల తర్వాత లోన్ ఖాతా ఎన్పీఏగా మారుతుంది. ఆ సమయంలో బ్యాంకులు కనీసం 15 శాతం కేటాయింపులు కలిగి ఉండేలా జాగ్రత్తపడినట్లు తెలిసింది.ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ-టాటా మోటార్స్ వివాదం.. ఢిల్లీ హైకోర్టులో విచారణఈ వ్యవహారంపై సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు స్పందిస్తూ..‘వైజాగ్‌స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నప్పటికీ సంస్థ రుణాలకు ప్రభుత్వ హామీ ఉండదు. సంస్థ ప్రస్తుతం కేవలం 30 శాతం సామర్థ్యంతో పని చేస్తోంది. దాంతో ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. కంపెనీ కస్టమర్లు తమ చెల్లింపులు సరిగా చేయడంలేదు. దాంతో పరిస్థితి మరింత దిగజారుతోంది’ అని అన్నారు. ఇదిలాఉండగా, ఈ నెల ప్రారంభంలో ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించి, అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఉత్పత్తి సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇటీవల విడుదల చేసిన కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు రూ.620 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.63 కోట్లు కోతపెట్టింది. ఇప్పటికే ఈ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. సొంతంగా ఉక్కు గనులు కేటాయిస్తే కంపెనీ లాభాల్లోకి వెళ్తుందని అధికారులు, కార్మికులు చెబుతున్నారు. -
ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఆర్థికాభివృద్ధికి, జీవన ప్రమాణాల పెంపునకు, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేశారు. ఈ ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా తయారైంది. బ్యాంకింగ్ రంగం కీలక సూచికలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో డిపాజిట్లతో పాటు రుణాల మంజూరులో భారీగా వృద్ధి నమోదైనట్లు 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో రెండేళ్లు కోవిడ్ సంక్షోభం నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రజల జీవనోపాధికి సమస్యల్లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు సత్పలితాలు ఇస్తున్నాయనడానికి డిపాజిట్లలో భారీ వృద్ధి నిదర్శనం. గత ఐదేళ్లలో డిపాజిట్లలో ఏకంగా 58.23 శాతం వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి డిపాజిట్లు రూ.3,12,642 కోట్లు ఉండగా 2023 డిసెంబర్ నాటికి రూ.4,94,690 కోట్లు.. అంటే రూ.1,82,048 కోట్లు పెరిగాయి. అన్ని రంగాలకు బ్యాంకు రుణాల మంజూరులో ఏకంగా 96.64 శాతం భారీ వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి రుణాల మంజూరు రూ.3,97,350 కోట్లు ఉండగా 2023 డిసెంబర్ నాటికి రూ.7,81,313 కోట్లకు పెరిగాయి. అంటే రుణాలు రూ.3,83,963 కోట్లు పెరిగాయి. డిపాజిట్ల పెరుగుదల ప్రజల ఆదాయం పెరుగుదలకు నిదర్శనం కాగా రుణాలు ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా నేరుగా నగదు బదిలీని అమలు చేసింది. అలాగే బ్యాంకుల ద్వారా పేదలు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎంఎస్ఎంఈలు, ఇతర వర్గాలకు వివిధ పథకాల కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా వారి ఆదాయం మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది., ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు విరివిగా లభించేలా చర్యలు చేపట్టింది. అందువల్లే గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రంగాల్లో రుణాల మంజూరులో భారీ వృద్ధి నమోదైంది. ఆర్బీఐ నిబంధనలకన్నా అన్ని రంగాల్లో అత్యధికంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. బ్యాంకులు ఇచ్చిన రుణాలను సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. అలాగే నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలు ఇప్పిస్తోంది. వీధుల్లో, వాడల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి బ్యాంకులు ద్వారా సున్నా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పిస్తోంది. వైఎస్సార్ చేయూత ద్వారా పేద మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు బ్యాంకు రుణాలను మంజూరు చేయించి, వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. ప్రజలు కూడా ప్రభుత్వం అందించిన చేయూతతో సకాలంలో రుణాలు చెల్లిస్తూ వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం గత ఏడాది డిసెంబర్ నాటికి క్రెడిట్ రేషియో 60 శాతం ఉండాల్సి ఉండగా దానికి మించి 157.94 శాతం నమోదైనట్లు బ్యాంకర్ల కమిటీ నివేదిక పేర్కొంది. సీడీ రేషియో అధికంగా ఉందంటే ఆ రాష్ట్రంలో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు అధికంగా జరగుతున్నాయనే అర్ధమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. -
నారీశక్తి నూతనాధ్యాయం లిఖిస్తా
సాక్షి, న్యూఢిల్లీ/గురుగ్రామ్: ఎన్డీఏ ప్రభుత్వం మూడో దఫా కొలువుతీరడం ఖాయమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. హ్యాట్రిక్ పాలనలో మహిళల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం పాటుపడుతుందని ప్రకటించారు. నారీశక్తి అభివృద్ధిలో నూతన అధ్యయనం లిఖిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ‘సశక్తి–నారీశక్తి’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళల కష్టాలు, కన్నీళ్లను ఏమాత్రం లెక్కలోకి తీసుకోలేదు. మా ప్రభుత్వాలు మహిళలను ప్రతిదశలోనూ చేయి అందించిమరీ వారి అభ్యున్నతికి పాటుపడ్డాయి. మరుగుదొడ్ల లేమి, శానిటరీ ప్యాడ్ల వాడకం, వంటచెరకు వాడకంతో వంటగదుల్లో పొగచూరిన మహిళల బతుకులపై మాట్లాడిన ఏకైక ప్రధాని మంత్రిని నేనే. మహిళలందరికీ బ్యాంక్ ఖాతాలు ఉండాలని ఎర్రకోట వేదికగా పిలుపునిచ్చా’’ అని మోదీ వ్యాఖ్యానించారు. 1,000 మంది ‘నమో డ్రోన్ దీదీ’లకు డ్రోన్లు సశక్తి–నారీశక్తి కార్యక్రమంలో భాగంగా స్వయంసహాయక బృందాలకు దాదాపు రూ.8,000 కోట్ల బ్యాంక్ రుణాలను మోదీ అందజేశారు. ఈ సందర్భంగా వారిలో కొందరితో మోదీ స్వయంగా మాట్లాడారు. స్వావలంభనతో అభివృద్ధిలోకి వచి్చన వారిని మెచ్చుకున్నారు. దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన–నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కార్యక్రమం మద్దతుతో లక్షాధికారులుగా మారిన ‘లఖ్పతి దీదీ’లను ఈ సందర్భంగా మోదీ సత్కరించారు. వ్యవసాయం, సాగు సంబంద పనుల్లో డ్రోన్లను వినియోగంచడంలో ఇప్పటికే తర్ఫీదు పొందిన 1,000 మంది ‘నమో డ్రోన్ దీదీ’లకు మోదీ డ్రోన్లను పంపిణీచేశారు. మూలధన సంబంధ నిధి కింద స్వయం సహాయక బృందాలకు మరో రూ.2,000 కోట్లను మోదీ పంపిణీచేశారు. ప్రతికూల మనస్తత్వానికి ప్రతిబింబం.. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు సానుకూల మనస్తత్వం ఏ కోశానా లేదని మోదీ విమర్శించారు. దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థలను మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు వీలుగా 112 జాతీయ రహదారులకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేశారు. -
Loans: రుణ పడొద్దు!
సొంత కారు, అందమైన భవంతి, ఇంట్లో అన్ని రకాల సాధనాలు (మెషీన్లు).. ఎందులోనూ రాజీపడేది లేదన్నట్టుగా ఉంది నేటి యువతరం ధోరణి. ముందు పొదుపు, తర్వాతే ఖర్చు.. గతంలో మన పెద్దలు అనుసరించిన ధోరణి. ముందు ఖర్చు.. మిగిలితేనే పొదుపు అన్నట్టుగా ఉంది నేటి తీరు. ఏ అవసరం వచ్చినా ‘తగ్గేదే లే’ అన్న ధోరణి కనిపిస్తోంది. కొనుగోళ్ల నుంచి వైద్య చికిత్సల వరకు అన్నింటికీ రుణబాట పడుతున్నారు. తీర్చే సామర్థ్యం ఉంటేనే రుణం తీసుకోవాలి. ప్రాధాన్యత లేని వాటికి సైతం రుణాలను ఆశ్రయిస్తే తీర్చే విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. కారణం ఏదైనా సకాలంలో రుణం వాయిదా చెల్లించలేకపోతే, ఎదుర్కోవాల్సిన పరిణామాలు చాలానే ఉంటాయి. చివరికి ఉద్యోగ అన్వేషణకు సైతం దూరం కావాల్సి రావచ్చు. గతంలో బ్యాంకుల రుణ వృద్ధిలో కార్పొరేట్ రుణాలదే పైచేయిగా ఉండేది. మొదటిసారి 2020 (కరోనా విపత్తు కాలంలో) నవంబర్‌లో బ్యాంకుల రుణాల్లో కార్పొరేట్లను కాదని రిటైల్ రుణాలు ముందుకు వచ్చేశాయి. అప్పటి నుంచి 2023 నవంబర్ 17 నాటికి చూస్తే రిటైల్ రుణాలు 79 శాతం పెరగ్గా.. కార్పొరేట్ రుణాల్లో వృద్ధి 28 శాతానికి పరిమితమైంది. 2023లో రెండో త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లోనూ రిటైల్ రుణాల్లో వృద్ధి 15 శాతంగా నమోదైంది. రిటైల్ రుణాల్లో కన్జ్యూమర్ ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం తీసుకునేవి (విలువ పరంగా) 20 శాతం పెరిగాయి. ద్విచక్ర వాహన రుణాలు 18 శాతం వృద్ధి చెందాయి. వ్యక్తిగత అవసరాల కోసం తీసుకునే రుణాలు 12 శాతం పెరిగాయి. ఆటో రుణాలు 13 శాతం పెరిగితే, ఇంటి రుణాలు విలువ పరంగా మైనస్ 6 శాతంగా ఉన్నాయి. వినియోగ రుణాలు ఎక్కువగా ఉంటున్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, అదే సమయంలో రుణ ఎగవేతల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ రుణాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంది. 2023 జూలై నాటికి క్రెడిట్ కార్డ్ రుణాలు రూ.2.13 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏడాది క్రితం కంటే 31 శాతం పెరిగాయి. రిటైల్ రుణాలన్నీ కూడా అన్సెక్యూర్డ్. రుణ గ్రహీత చేతులు ఎత్తేస్తే అది బ్యాంకింగ్ వ్యవస్థపై భారాన్ని మోపుతుంది. అందుకే రిజర్వ్ బ్యాంక్ వ్యక్తిగత, అన్ సెక్యూర్డ్, క్రెడిట్ కార్డ్ రుణాలకు రిస్క్ వెయిటేజీ పెంచుతూ, వీటికి బ్యాంకులు మరిన్ని నిధులను పక్కన పెట్టేలా గత నవంబర్‌లో ఆదేశాలు తీసుకొచి్చంది. క్రెడిట్ స్కోర్‌కు విఘాతం తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించలేకపోయినా, రుణాన్ని ఎగవేసినా అది క్రెడిట్ స్కోర్‌ను గణనీయంగా తగ్గించేస్తుంది. కరోనా అనంతరం రిటైల్ రుణాలు తీసుకోవడం గణనీయంగా పెరిగిపోగా, అదే సమయంలో అంతకుముందు తీసుకున్న రుణాలకు సంబంధించి ఎగవేతలు కూడా పెద్ద మొత్తంలోనే నమోదయ్యాయి. దీంతో బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు పెద్ద మొత్తాల్లో కేటాయింపులు చేయాల్సి వచి్చంది. ఈ పరిణామాలతో చాలా మంది రుణ గ్రహీతల క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడింది. నేడు ప్రతి రుణానికి సంబంధించి చెల్లింపుల చరిత్రతో క్రెడిట్ బ్యూరోలు రికార్డులను నిర్వహిస్తున్నాయి. రుణం సకాలంలో చెల్లించకపోయినా, ఎగ్గొట్టినా, సెటిల్మెంట్ చేసుకున్నా, రుణం కావాలంటూ విచారణలు చేసినా, అవన్నీ సంబంధిత వ్యక్తి పేరిట రికార్డుగా నమోదవుతాయి. వీటి ఆధారంగానే క్రెడిట్ బ్యూరోలు స్కోర్‌ను కేటాయిస్తుంటాయి. 750, అంతకుమించి క్రెడిట్ స్కోర్ ఉంటే అది మెరుగైనది. రుణం సులభంగా వస్తుంది. మెరుగైన రేటుకు వస్తుంది. 750కంటే తక్కువ ఉంటే రుణం పొందడం కష్టమవుతుంది. ఒకవేళ రుణం లభించినా, అది అధిక వడ్డీ రేటుపై తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ రుణ వాయిదాలను సకాలంలో చెల్లించాలి. నేడు దాదాపు అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు క్రెడిట్ స్కోర్ ఆధారంగానే అన్సెక్యూర్డ్ రుణాలు మంజూరు చేస్తున్నాయి. తదుపరి పరిణామాలు.. బకాయి చెల్లించాలంటూ రుణగ్రహీతను రుణం ఇచి్చన సంస్థలు కోరతాయి. గడువు తీరిన 30 రోజులకూ చెల్లింపులు చేయకపోతే అప్పుడు ఆయా రుణగ్రహీతల సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు పంపిస్తుంటాయి. 30–60 రోజుల పాటు చెల్లింపులు చేయకపోతే అది క్రెడిట్ స్కోరును దెబ్బతీస్తుంది. ఇక రుణ వాయిదా 60 రోజులు దాటినా చెల్లించలేని వారి క్రెడిట్ స్కోర్ మరింత తగ్గిపోతుంది. తక్కువ క్రెడిట్ స్కోర్ వల్ల భవిష్యత్తులో రుణానికి ద్వారాలు మూసుకుపోతాయి. అత్యవసరంలో రుణం కావాల్సి వస్తే నిరాకరణ ఎదురుకావచ్చు. డిజిటల్‌గా రుణాలు ఇచ్చే సంస్థలు కనీసం ఒక్క రోజు ఆలస్యం చేసినా,ఎగవేతదారుల జాబితాలో చేరాల్సి వస్తోంది. 650–750 మధ్య స్కోర్ ఉన్న వారికి గృహ రుణం కావాలంటే, మెరుగైన స్కోర్ ఉన్న వారితో పోలిస్తే 2 శాతం అధిక రేటు చెల్లించాల్సి వస్తుంది. రూ.50 లక్షల రుణం 20 ఏళ్ల కాలవ్యవధికి కావాలంటే, తక్కువ స్కోర్ కారణంగా వడ్డీ రూపంలో అదనంగా రూ.12 లక్షల వరకు భారాన్ని మోయాల్సి రావచ్చు. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య ఈ రేటు వ్యత్యాసం మారుతుంది. రుణం ఎగ్గొట్టడం సివిల్ నేరం కిందకు వస్తుంది. రుణ గ్రహీత ఇచి్చన చెక్కుల ద్వారా వసూలు చేసుకునే చర్యలను ఆరి్థక సంస్థలు ప్రారంభిస్తాయి. గడువు ముగిసిన 90 రోజుల్లోపు కూడా రుణ గ్రహీత చెల్లించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, నోటీసు వస్తుంది. 180 రోజులు (ఆరు నెలలు) ముగిసినా ఎలాంటి ఫలితం లేకపోతే అప్పుడు నెగోషియబుల్ ఇనుస్ట్రుమెంట్ యాక్ట్, 1881లోని సెక్షన్ 138 కింద రుణం ఇచి్చన సంస్థ కేసు దాఖలు చేస్తుంది. చెల్లించే సామర్థ్యం ఉన్నా, చెల్లించకపోతే ఉద్దేశపూర్వక ఎగవేతదారు అనే ముద్ర పడుతుంది. సరైన కారణంతో రుణం చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు రుణం ఇచి్చన సంస్థతో చర్చలు నిర్వహించి పరిష్కారానికి, పరస్పర అంగీకారానికి రావచ్చు. హోమ్‌లోన్ లేదా ప్రాపర్టీ లోన్ లేదా బంగారంపై రుణం వంటి సెక్యూర్డ్ రుణాల్లో రుణ గ్రహీత చెల్లింపుల్లో చేతులు ఎత్తేస్తే.. తనఖాగా ఉంచిన ఆస్తులను బ్యాంకులు వేలం వేస్తుంటాయి. అలాగే, ఆటోమొబైల్ రుణాల్లోనూ వాహనాన్ని జప్తు చేసి, చెల్లింపులకు తగినంత వ్యవధి ఇస్తాయి. అప్పటికీ చెల్లించకపోతే వాహనాన్ని వేలం వేసి రుణంలో సర్దుబాటు చేసుకుంటాయి. బ్యాంక్ జాబ్ కష్టమే! బలహీన క్రెడిట్ స్కోర్ ఉందంటూ ఉద్యోగ దరఖాస్తు తిరస్కరించే అధికారం బ్యాంకుల బోర్డులకు ఉంటుంది. బ్యాంక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి కనీసం 650 క్రెడిట్ స్కోర్ ఉండాలన్న నిబంధనను ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) విధించింది. బా«ధ్యతాయుత ఆరి్థక నడవడిక ఉండాలన్నది దీని వెనుక ఉద్దేశం. ఎంతో విలువైన లావాదేవీల వ్యవహారాల బాధ్యతలను బ్యాంకుల ఉద్యోగులు చూస్తుంటారు. అందుకే ఈ నిబంధన ప్రవేశపెట్టారు. అందుకే బ్యాంకు ఉద్యోగాలకు ప్రయతి్నంచే వారు మెరుగైన స్కోర్ కోసం ముందు నుంచే తగిన జాగ్రత్త చర్యలను పాటించడం మంచిది. కొన్ని బహుళజాతి సంస్థలు కూడా ఉద్యోగం కోరుతున్న వారి క్రెడిట్ స్కోర్‌ను పరిశీలిస్తుంటాయి. 2022 మార్చిలో ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కోసం జారీ చేసిన ప్రకటనలో.. బ్యాంక్‌లు/ఎన్‌బీఎఫ్‌సీల నుంచి తీసుకున్న ఏ రుణం చెల్లింపుల్లో అయినా విఫలం అయినట్టయితే, క్రెడిట్ కార్డ్ బకాయిలు సకాలంలో చెల్లింపులు చేయకపోతే అటువంటి వారు నియామకానికి అర్హులు కాదని స్పష్టంగా పేర్కొంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో ఉద్యోగార్థుల క్రెడిట్ రిపోర్ట్‌లను పరిశీలించడం సర్వసాధారణమని.. దీనివల్ల ఆర్థికంగా ఎంత బాధ్యతాయుతంగా ఉంటారనేది తెలుస్తుందని డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ ఫైబ్ హెచ్ఆర్ హెడ్ మోనికా మిశ్రా తెలిపారు. ఇది సంస్థలో మోసాలు, చోరీల అవకాశాలను తెలియజేస్తుందన్నారు. ఆర్థిక అంశాల నిర్వహణలో బాధ్యతారహితంగా ఉండే వ్యక్తి, కంపెనీ ఆరి్థక వ్యవహారాల నిర్వహణకు సరైన వ్యక్తి కాదని మిశ్రా వివరించారు. ఏ రుణంలో ప్రతికూలతలు ఎలా..? రుణం కోసం రుణం... తీసుకున్న రుణాన్ని చెల్లించలేని పరిస్థితుల్లో మరో రుణం తీసుకుని చెల్లించే ఆలోచనలు సరికాదు. ముందు తీసుకున్న రుణంపై అధిక వడ్డీ రేటు ఉండి, చాలా తక్కువ రేటుకే మరో సంస్థ రుణం ఇవ్వడానికి ముందుకు వస్తే అప్పుడు ఆలోచించొచ్చు. తక్కువ రేటుపై రుణం తీసుకుని అధిక రేటుతో కూడిన రుణాన్ని తీర్చివేయవచ్చు. వ్యక్తిగత రుణాలపై 14–15 శాతం మేర వడ్డీ రేటు ఉంటే, మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి 12 శాతానికే లభిస్తుంది. అలాంటప్పుడు పరిశీలించొచ్చు. అంతేకానీ, చెల్లింపుల సమస్య నుంచి బయటపడేందుకు మరో రుణాన్ని ఆశ్రయిస్తే సమస్యను పెంచుకున్నట్టు అవుతుంది. అలాగే, క్రెడిట్ కార్డ్‌పై 3–4 రూపాయల వడ్డీ పడుతుంది. వ్యక్తిగత రుణాన్ని తీసుకుని క్రెడిట్ కార్డ్ రుణాన్ని తీర్చివేయవచ్చు. రుణ గ్రహీత ముందున్న మార్గం రుణం తీసుకుని, చెల్లింపులు సకాలంలో చేయకపోయినా.. రుణం ఇచ్చిన సంస్థలు గౌరవప్రదంగా, పారదర్శకంగానే వ్యవహరించాలి కానీ, వేధించడం, బెదిరించడం చేయకూడదని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్‌శెట్టి తెలిపారు. రుణం 90 రోజులకు మించి చెల్లింపులు లేకపోతే, అప్పటికీ చెల్లించేందుకు 60 రోజుల నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. సెక్యూర్డ్ రుణం చెల్లించనప్పుడు, తనఖాలో ఉంచిన ఆస్తులు లేదా వాహనాలను విక్రయించగా, వచ్చే మొత్తం నుంచి రుణం మినహాయించుచుని మిగిలినది తిరిగి రుణ గ్రహీతకు ఇచ్చేయాల్సి ఉంటుంది. రుణం చెల్లించలేనప్పుడు మారటోరియం లేదా వన్‌టైమ్ పరిష్కారం కోసం డిమాండ్ చేయవచ్చు. రుణం చెల్లించలేకపోవడం వెనుక సహేతుక కారణాలు ఉంటే బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ సంస్థను సంప్రదించాలి. చెల్లించడానికి మరింత సమయం ఇవ్వాలని కోరొచ్చు. మీరు చెప్పిన కారణాల్లో వాస్తవికత ఉందని బ్యాంక్/ఎన్బీఎఫ్సీ భావిస్తే రుణ చెల్లింపులపై స్వల్పకాలం పాటు మారటోరియం (విరామం) కలి్పస్తాయి. లేదంటే రుణ కాల వ్యవధిని పెంచి, ఈఎంఐ మొత్తాన్ని తగ్గిస్తాయి. క్రెడిట్ కార్డు రుణం క్రెడిట్ కార్డ్ బిల్లు మొత్తం చెల్లించలేని సందర్భాల్లో, మినిమం డ్యూ (బిల్లులో నిరీ్ణత శాతం) చెల్లించినా సరిపోతుంది. ఈ మినిమం డ్యూని కూడా చెల్లించనట్టయితే ఆరు నెలలు వేచి చూసిన తర్వాత డిఫాల్ట్‌గా ఖరారు చేస్తారు. డిపాజిట్‌ను సెక్యూరిటీగా ఉంచి క్రెడిట్ కార్డు తీసుకుంటే, బకాయి పడిన సందర్భంలో డిపాజిట్‌ను రద్ధు చేసి రుణం కింద సర్దుబాటు చేసుకుంటారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పొందిన క్రెడిట్‌కార్డు అయితే, బకాయి వసూలు బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగిస్తాయి క్రెడిట్ కార్డు కంపెనీలు. రుణ గ్రహీత నుంచి రుణాన్ని రప్పించే ప్రయత్నాలను ఏజెన్సీలు చేస్తాయి. అప్పటికీ ఫలితం లేకపోతే కోర్టులో కేసు దాఖలవుతుంది. బ్యాంక్‌లు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు బ్లాక్ లిస్ట్‌ను నిర్వహిస్తుంటాయి. చెల్లింపులు చేయని వారిని బ్లాక్ లిస్ట్‌లో చేరుస్తాయి. విద్యా రుణం విద్యా రుణం ఈఎంఐ చెల్లింపులు సాధారణంగా కోర్సు ముగిసి, ఉద్యోగంలో చేరిన నాటి నుంచి మొదలవుతాయి. కానీ, కొన్ని కారణాల వల్ల కోర్స్‌లో సకాలంలో ఉత్తీర్ణులు కాకపోతే ఉద్యోగం రాదు. కోర్సు పూర్తి చేసినా కానీ వెంటనే అందరికీ ఉపాధి లభిస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. లేదంటే ఉద్యోగం వచి్చనప్పటికీ, అది కోల్పోయి ఖాళీగా ఉండాల్సి వచి్చన సందర్భాల్లో రుణ ఈఎంఐ చెల్లించలేకపోతే, తదుపరి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెంటనే ఉద్యోగం లభించకపోయినా, వచ్చిన ఉద్యోగం కోల్పోయినా బ్యాంకులను సంప్రదించి, పూర్తి వివరాలు తెలియజేయాలి. మరింత గడువు కోరాలి. లేదంటే బ్యాంక్‌లు నిర్ణీత కాలం పాటు వేచి చూసి మిగిలిన రుణాల మాదిరే నోటీసు జారీ ద్వారా తదుపరి చర్యలు ప్రారంభిస్తాయి. విద్యా రుణానికి సంబంధించి డిఫాల్టర్‌గా మారితే భవిష్యత్‌లో ఎన్నో రుణాలకు అవరోధంగా మారొచ్చు. రూ.4–10 లక్షల వరకు విద్యా రుణాలకు బ్యాంక్‌లు ఎలాంటి సెక్యూరిటీని కోరవు. అంతకుమించితే మరో వ్యక్తిని గ్యారంటర్‌గా, లేదా ప్రాపరీ్టని తనఖాగా ఉంచాలని కోరతాయి. సకాలంలో చెల్లించలేకపోతే గ్యారంటర్ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. వ్యక్తిగత రుణం వ్యక్తిగత రుణం వాయిదా గడువు ముగిసిన 30 రోజుల వరకు చెల్లించకపోతే డిఫాల్ట్‌గా పరిణిస్తాయి. ఇదే విషయాన్ని క్రెడిట్ బ్యూరోలకు తెలియజేస్తాయి. ఇలా వరుసగా మూడు వాయిదాల్లో విఫలమైతే అప్పుడు రుణంపై అదనపు వడ్డీ రేటును (పీనల్ ఇంటరెస్ట్) వడ్డిస్తాయి. 30 నుంచి 60 రోజుల్లోపు రుణ వాయిదాను వడ్డీ, అన్ని చార్జీలతో చెల్లిస్తే క్రెడిట్ స్కోర్‌పై స్వల్ప ప్రభావమే పడుతుంది. 90 రోజులకు కూడా చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్‌పై ఎక్కువ ప్రభావం పడుతుంది. 180 రోజుల తర్వాత కూడా చెల్లింపులు రాకపోతే అప్పుడు రుణ గ్రహీతపై కేసులు దాఖలవుతాయి. వినియోగ రుణం కన్జ్యూమర్ ఉత్పత్తుల కోసం తీసుకునే రుణాలు, వాహన రుణాలు అయినా గడువులోపు చెల్లించకపోతే ఒకటి రెండుసార్లు నోటీసును జారీ చేస్తాయి. 30 రోజుల్లోగా చెల్లించకపోతే అప్పుడు ముందుగా సమర్పించిన చెక్కులను నగదుగా మార్చుకునే చర్యలు మొదలు పెడతాయి. చెక్కులు బౌన్స్ అయితే కోర్టులో కేసు దాఖలు చేస్తాయి. వాహనం లేదా ఉత్పత్తిని స్వా«దీనం చేసుకుంటాయి. వడ్డీసహా రుణ మొత్తాన్ని చెల్లించి సమస్య నుంచి బయటపడవచ్చు. గృహ రుణం ఇంటిపై పొందే మార్ట్గేజ్ రుణం చెల్లించకపోతే ఇంటిని కోల్పోవాల్సి వస్తుంది. గడువు ముగిసిన తర్వాత 30 రోజుల్లోపు చెల్లింపులు లేకపోతే దాన్ని డిఫాల్ట్ (బకాయిపడినట్టు)గా పరిగణిస్తారు. వరుసగా మూడు ఈఎంఐలు కూడా చెల్లించకపోతే, అప్పుడు బకాయిలను 60 రోజుల్లోగా సెటిల్ చేసుకోవాలంటే లీగల్ నోటీసు పంపిస్తాయి. ఆ గడువులోపు స్పందించకపోతే, సర్ఫేసీ చట్టం కింద ఇంటి జప్తు ప్రక్రియను మొదలు పెడతాయి. ఆ తర్వాత కూడా కొల్లేటరల్ (తాకట్టు) విలువ, వేలం తేదీ తదితర వివరాలతో ఒక నోటీసు పంపిస్తాయి. అప్పుడు స్పందించినా, బ్యాంక్‌లు పరిష్కారానికి అవకాశం ఇస్తాయి. చివరి ఆప్షన్‌గా ఇంటిని వేలం నిర్వహిస్తాయి. దీనివల్ల ఇంటిని కోల్పోవడంతోపాటు, క్రెడిట్ రిపోర్ట్‌లో కొన్నేళ్లపాటు దీని ప్రభావం కనిపిస్తుంది. -
పెరిగిన బ్యాంక్ లోన్స్.. ఆ రంగానికే ప్రాధాన్యం
ముంబై: ప్రైవేటు కార్పొరేట్ రంగానికి బ్యాంకుల రుణ వితరణ సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 14.9 శాతం పెరిగినట్టు ఆర్బీఐ డేటా వెల్లడింంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోనూ 14.7 శాతం వృద్ధి నమోదు కాగా, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలోనూ 11.5 శాతం చొప్పున వృద్ధి చెందడం గమనార్హం. బ్యాంకుల మొత్తం రుణాల్లో పరిశ్రమలకు ఇచ్చినవి 25 శాతంగా ఉన్నాయి. వార్షికంగా చూస్తే సెప్టెంబర్ క్వార్టర్లో 8.6 శాతం పెరిగాయి. వర్కింగ్ క్యాపిటల్ రుణాల వృద్ధి గత ఆరు త్రైమాసికాలుగా రెండంకెల వృద్ధిని నమోదు చేస్తూ వస్తోంది. బ్యాంక్ రుణాల్లో వ్యక్తిగత రుణాల వాటా ఐదేళ్ల క్రితం ఉన్న 22 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది. మహిళా రుణ గ్రహీతల సంఖ్యలోనూ వృద్ధి కనిపిస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంక్‌లతో పోలిస్తే ప్రైవేటు బ్యాంక్‌లు రుణాల్లో ఎక్కువ వృద్ధిని చూపిస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరిగిపోవడంతో, అధిక ఈల్డ్స్ వచ్చే డిపాజిట్లలోకి పెట్టుబడులు మళ్లుతున్నాయి. 6 శాతం వడ్డీలోపు డిపాజిట్లు 2022 మార్చి నాటికి 85.7 శాతంగా ఉంటే, 2023 మార్చి నాటికి 38.7 శాతానికి, సెప్టెంబర్ వరికి 16.7 శాతానికి తగ్గాయి. రేట్లు పెరగడంతో కరెంట్, సేవింగ్స్ డిపాజిట్ల కంటే టర్మ్ డిపాజిట్లలోకి ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయి. దీంతో బ్యాంక్‌ల మొత్తం డిపాజిట్లలో టర్మ్ డిపాజిట్ల వాటా ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న 57 శాతం నుం సెప్టెంబర్ చివరికి 60 శాతానికి చేరింది. డిపాజిట్లను ఆకర్షించడంలోనూ ప్రభుత్వరంగ బ్యాంక్‌లతో పోలిస్తే ప్రైవేటు బ్యాంక్‌లే ముందున్నాయి. మొత్తం టర్మ్ డిపాజిట్లలో 44 శాతం రూ.కోటికి పైన ఉన్నవే కావడం గమనార్హం. -
ఇన్ని రకాల లోన్స్ ఉన్నాయా - లిస్ట్ చూస్తే అవాక్కవుతారు!
ఈ రోజుల్లో ఏ పని చేయాలన్న డబ్బు చాలా ప్రధానం. కావలసినంత జీతాలు రానప్పుడు ఈ చిన్న పని చేయాలన్నా.. బ్యాంకుల ద్వారా లోన్స్ తీసుకోవడం అలవాటైపోయింది. చాలామందికి పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, కార్ లోన్స్ వంటి వాటి గురించి మాత్రమే తెలిసి ఉంటుంది. ఈ కథనంలో బ్యాంకులు అందించే వివిధ రకాల లోన్స్ గురించి తెలుసుకుందాం. పర్సనల్ లోన్స్ - కస్టమర్ ఆదాయం, సిబిల్ స్కోర్, తిరిగి చెల్లించే కెపాసిటీ వంటి వాటిని బేస్ చేసుకుని బ్యాంకులు ఈ పర్సనల్ లోన్స్ అందిస్తాయి. ఇలాంటి లోన్లకు ఎక్కువ వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా మీరు లోన్ తీసుకునే బ్యాంకుల మీద ఆధారపడి ఉంటాయి. హోమ్ లోన్స్ - కొత్త ఇల్లు కట్టుకోవడానికి లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేయడానికి ఇలాంటి లోన్స్ పొందవచ్చు. ఇలాంటి లోన్స్ మీద బ్యాంకులు వివిధ ఆఫర్స్ అందిస్తాయి, వడ్డీలో రాయితీలు కూడా లభిస్తాయి. హోమ్ రేనోవేషన్ లోన్స్ - కొత్త ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే కాకుండా.. ఉన్న ఇల్లుని రేనోవేషన్ చేసుకోవడానికే లేదా ఇంటీరియర్స్ డిజైన్స్ కోసం కూడా బ్యాంకులు లోన్స్ అందిస్తాయి. వెడ్డింగ్ లోన్స్ - బ్యాంకులు పెళ్లి చేసుకోవడానికి కూడా కొన్ని ప్రత్యేకమైన లోన్స్ అందిస్తాయి. ఎందుకంటే పెళ్లి జీవితంలో ఒకేసారి చేసుకుంటారు, కొంత ఆడంబరంగా చేసుకోవాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. ఈ సమయంలో బ్యాంకులు అందించే వెడ్డింగ్ లోన్స్ చాలా ఉపయోగపడతాయి. శాలరీ అడ్వాన్స్ లోన్స్ - అడ్వాన్స్ శాలరీ లోన్ అనేది జీతం తీసుకునే వారికి బ్యాంకులు అందించే తాత్కాలిక లోన్స్, ఈ లోన్ వడ్డీ రేటుని నెలవారీ లేదా రోజువారీ ప్రాతిపదికన కూడా లెక్కిస్తారు. వడ్డీలు లోన్ ఇచ్చే బ్యాంకుల మీద ఆధారపడి ఉంటాయి. ఎడ్యుకేషన్ లోన్స్ - ఎడ్యుకేషన్ లోన్ అనేది పోస్ట్-సెకండరీ ఏజికేషన్ లేదా ఉన్నత విద్యకు సంబంధించిన ఖర్చుల కోసం బ్యాంకులు అందించే లోన్స్. డిగ్రీ చదువుకునే సమయంలో ట్యూషన్, బుక్స్ ఇతర ఖర్చుల కోసం ఇలాంటి లోన్స్ పొందవచ్చు. మెడికల్ లోన్స్ - మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో మీరు పొందగలిగే ఈ లోన్ హాస్పిటల్ బిల్స్, ఆపరేషన్ ఖర్చులు, ప్రిస్క్రిప్షన్ బిల్లులు, కీమోథెరపీ ఖర్చులు వంటి ఏదైనా ఇతర వైద్య సంబంధిత ఖర్చులను కవర్ చేయడానికి ఉపయోగపడతాయి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ లోన్స్ - సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి ఇలాంటి లోన్స్ లభిస్తాయి. అంతే కాకుండా డాక్టర్, ఆర్కిటెక్ట్, చార్టర్డ్ అకౌంటెంట్ వంటి వారు సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించడానికి బ్యాంకులు ఇలాంటి లోన్స్ అందిస్తాయి. గోల్డ్ పర్సనల్ లోన్స్ - మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకునే లోన్ ఇది. కొంత తక్కువ వడ్డీ రేటుతో ఈ లోన్స్ పొందవచ్చు. ట్రావెల్ లోన్స్ - చదువుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లి కోసం మాత్రమే కాకుండా మీ ప్రాయానాలకు కూడా కావలసిన లోన్స్ అందిస్తాయి. ఇలాంటి లోన్స్ మీ ఫ్లైట్ చార్జెస్, వసతి ఖర్చులు వంటి వాటికి ఉపయోగపడతాయి. ఇలాంటి లోన్స్ మాత్రమే కాకుండా.. పర్సనల్ లైన్ ఆఫ్ క్రెడిట్ లోన్, సెక్యూర్డ్ పర్సనల్ లోన్, యూజ్డ్ కార్ లోన్, స్మాల్ పర్సనల్ లోన్ మొదలైనవి కూడా అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం లోన్ పేరుతో ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి, కాబట్టి అలంటి మోసాలు భారీ నుంచి బయటపడటానికి.. మరిన్ని ఇతర లోన్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న బ్యాంకులను సందర్శించి తెలుసుకోవచ్చు. -
తగ్గుతున్న పారిశ్రామిక రుణాలు.... వ్యక్తిగత రుణాలు పైపైకి...
బ్యాంకులు ఎక్కువగా కార్పొరేట్ రుణాల ద్వారానే అధికంగా లాభాలు సంపాదిస్తుంటాయి. అయితే గత కొంతకాలంగా బ్యాంక్ రుణాల సరళిమారుతోంది. కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీయల్ రంగానికి అధికంగా రుణాలు ఇస్తున్న బ్యాంకులు..ప్రస్తుతం వాటి వాటా తగ్గిస్తున్నాయి. అందుకు బదులుగా వ్యక్తిగత రుణాల ఇవ్వడంలో మొగ్గు చూపుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఆర్బీఐ మానిటరీ పాలసీ నివేదిక ప్రకారం.. బ్యాంకులు ఇచ్చే మొత్తం రుణాల్లో దాదాపు 32.1శాతం వ్యక్తిగత రుణాలు, సర్వీస్ సెక్టార్‌కు 28.4శాతం, ఇండస్ట్రీ రంగానికి 26.2 శాతం, 13.3శాతం వ్యవసాయ రంగానికి ఇస్తున్నట్లు వెల్లడించింది. హౌజింగ్, వెహికిల్, క్రెడిట్ కార్డు రుణాలు తగ్గిపోయాయి. గత పదేళ్లలో ఇండస్ట్రీ రంగానికి ఇచ్చే రుణాలు 46శాతం నుంచి 26శాతం మేర క్షీణించాయి. అదే వ్యక్తిగత రుణాలు మాత్రం 18శాతం నుంచి 32శాతానికి పెరిగాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇతర హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీల సంఖ్య పెరగడంతో అవి సర్వీస్ రంగంలో ఉన్న కంపెనీలకు ఎక్కువగా రుణాలు కల్పిస్తున్నాయి. (తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులు ఎవరంటే..) ఇండస్ట్రీయల్ రంగానికి బ్యాంకులు రుణాలు ఇవ్వడం తగ్గించడంతో కార్పొరేట్ కంపెనీలు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నాయి. అయితే కంపెనీలు రుణ సమీకరణతో పాటు సంస్థ ఆర్థికవృద్ధిపై దృష్టి సారిస్తే మరింత ప్రయోజనం ఉంటుదని బ్యాంకింగ్ రంగ నిపుణులు వి.విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ కంపెనీలు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడానికి బదులుగా డెట్‌మార్కెట్ ద్వారా నగదును పెంచుకుంటున్నాయి. తమ బ్యాలెన్స్షీట్లో నగదు ఎక్కువగా ఉన్న కొన్ని సంస్థలు రుణం తీసుకోవలసిన అవసరం ఉండడం లేదు. ఎన్బీఎఫ్సీ, బ్యాంకు నిబంధనల ప్రకారం నిరర్థక ఆస్తులకు సంబంధించిన నియామాలు మార్చడం వల్ల కూడా ఇండస్ట్రీయల్ రుణాలు తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
బ్యాంకర్లతో మంత్రి హరీష్ సమీక్ష.. రుణమాఫీలపై కీలక ఆదేశం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రుణమాఫీ విషయంలో రైతులకు గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో రైతుల రుణమాఫీపై ఆర్థికమంత్రి హరీష్ రావు బ్యాంకర్లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీఎస్ శాంతి కుమారి, వివిధ బ్యాంకుల అధికారులు హాజరయ్యారు. వివరాల ప్రకారం.. తెలంగాణలో రైతుల రుణమాఫీపై మంత్రి హరీష్ రావు మరోసారి అధికారులతో భేటీ అయ్యారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్ష(99,999)రూపాయలలోపు రైతుల రుణాలను మాఫీ చేశారు. ఈ సందర్బంగా రుణాలు మాఫీ కాని రైతులపై ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరికీ రుణమాఫీ అందేలా చూడాలని మంత్రి హరీష్ ఆదేశించారు. అలాగే, రుణమాఫీ పొందే రైతులు సమస్యలు చెప్పుకునేలా ఆయా బ్యాంకులు కూడా టోల్‌ఫ్రీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.99,999 వరకు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ పూర్తి చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. సీఎం కేసీఆర్ ఆదేశాలు మేరకు.. 10.79 లక్షల రైతులకు.. రూ.6,546 కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి.. ప్రతి వారం కొంత మొత్తాన్ని జమ చేస్తోన్న రాష్ట్ర సర్కార్.. ఖజానాకు వస్తోన్న ఆదాయం ప్రకారం చెల్లింపులు చేస్తోంది. ఈ మేరకు పన్నేతర ఆదాయంపై కూడా దృష్టి సారించింది. ఏది ఏమైనా సెప్టెంబర్ రెండో వారంలోగా.. ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య కోల్డ్‌వార్! -
ఎన్‌బీఎఫ్‌సీలకు భారీగా బ్యాంకు రుణాలు
ముంబై: బ్యాంకుల నుంచి ఎన్బీఎఫ్సీలు భారీగా నిధుల సమీకరణ చేస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకుల రుణాలు జూన్‌లో 35 శాతం పెరిగి రూ.14.2 లక్షల కోట్లకు చేరినట్టు కేర్ రేటింగ్స్ తెలిపింది. ఎన్బీఎఫ్సీలు అంతర్జాతీయ రుణాలపై ఆ ధారపడడాన్ని తగ్గించినట్టు ఇది తెలియజేస్తోందని పేర్కొంది. మొత్తం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 2022 జూన్ నాటికి ఉన్న 8.5 శాతం నుంచి ఈ ఏడాది జూన్ నాటికి 9.9 శాతానికి పెరిగినట్టు కేర్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనం జూలై 1 నుంచి అమల్లోకి వచి్చనందున.. బ్యాంకుల రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా తగ్గుతుందని అంచనా వేసింది. హెచ్డీఎఫ్సీ రుణాలు పునర్వర్గీకరణకు గురవుతాయని పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీలకు మ్యూచువల్ ఫండ్స్ డెట్ పథకాల ఎక్స్పోజర్ సై తం జూన్‌లో 14.5 శాతం పెరిగి రూ.1.62 లక్షల కోట్లకు చేరుకున్నట్టు కేర్ రేటింగ్స్ వివరించింది. బ్యాంకుల రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 2018 ఫిబ్రవరి నాటికి 4.5 శాతంగా ఉంటే, అది ఈ ఏడా ది జూన్ నాటికి 10 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. 2021–22 ద్వితీయ ఆరు నెలల కాలం నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకుల రుణాలు పెరుగుతూ వ స్తున్నట్టు కేర్‌రేటింగ్స్ వెల్లడించింది. కరోనా తర్వా త ఆరి్థక కార్యకలాపాలను తిరిగి పూర్తి స్థాయిలో తెరవడం ఇందుకు అనుకూలించినట్టు తెలిపింది. -
AP: ఆస్తి మీ హక్కు.. తనఖా పెట్టుకోవచ్చు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 లక్షలకు పైబడి విలువ చేసే ఇల్లు ఉండి కూడా పిల్లల పెద్ద చదువుల కోసమో, ఇంకే పెద్ద అవసరానికైనా ఆ ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందే అవకాశం లేక ఇబ్బందులు పడే లక్షలాది మధ్య తరగతి ప్రజల కష్టాలు తీరబోతున్నాయి. వైఎస్సార్ జగనన్న భూ హక్కు – భూ రక్ష కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ల యజమానులందరికీ వారి ఆస్తి యాజమాన్య హక్కు పత్రాల (ప్రాపర్టీ కార్డులు)ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తోంది. ఈ పత్రాలను బ్యాంకుల్లో తనఖా పెట్టుకోవడానికి బ్యాంకులను సైతం ప్రభుత్వం తాజాగా ఒప్పించింది. ఈ పత్రాల డిజైన్‌ను కూడా రుణాలు సులభంగా లభించేలా రూపొందించారు. ఈ హక్కు పత్రాలను అవసరమైన వారు నచ్చిన బ్యాంకులో తనఖా పెట్టుకొనేందుకు గతనెల 27న జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో రాష్ట్ర బ్యాంకర్ల సమాఖ్య ఆమోదం తెలిపింది. ఈ సమాచారాన్ని రాష్ట్ర బ్యాంకర్ల సమాఖ్య కోఆర్డినేటర్ నాలుగు రోజుల క్రితం రాష్ట్ర పరిధిలోని అన్ని బ్యాంకుల కంట్రోలింగ్ అథారిటీలకు, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులకు పంపారు. గ్రామాల్లో వారసత్వంగా వచ్చే ఈ ఇళ్లకు నిర్దిష్ట అధికారిక హక్కు పత్రాలు ఉండవు. అందువల్ల ప్రభుత్వం తాజాగా ఇచ్చే ప్రాపర్టీ కార్డులను తనఖా పెట్టుకునే సమయంలో ఆ ఆస్తి లింకు డాక్యుమెంట్ల కోసం ఒత్తిడి చేయవద్దని ఎస్ఎల్బీసీ కోరింది. సంబందిత ఆస్తికి రిజి్రస్టేషన్ శాఖ అధికారికంగా సూచించే మార్కెట్ విలువ ఆధారంగా తనఖా విలువ లెక్కగట్టుకోవచ్చని తెలిపింది. తొలి దశలో లక్షన్నరకు పైగా హక్కు పత్రాలు రాష్ట్రవ్యాప్తంగా 17,461 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామ కంఠాల పరిధిలోని ఇళ్లు, దొడ్లు, ఖాళీ స్థలాలన్నింటికీ వైఎస్సార్ జగనన్న భూ హక్కు– భూ రక్ష కార్యక్రమంతో ప్రభుత్వం యాజమాన్య హక్కు పత్రాలు ఇస్తోంది. దాదాపు 11,150 గ్రామాల పరిధిలోని గ్రామ కంఠాల ఇళ్ల సర్వే కూడా చేపట్టింది. 294 గ్రామాల్లో సర్వే దాదాపు పూర్తయింది. ఒక్కో ఆస్తికి (ఇల్లు లేదా దొడ్డి లేదా ఖాళీ స్థలం వారీగా) యాజమాన్య హక్కు పత్రాల నిర్ధారణ చేసే ఫైనల్ ఆర్వోఆర్ నోటిఫికేషన్ జారీ కూడా పూర్తయినట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. వీటిలో 262 గ్రామాల్లో శుక్రవారం నాటికి 1,22,943 ప్రాపర్టీ కార్డులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మిగిలిన 32 గ్రామాల్లో హక్కు పత్రాలు కూడా త్వరలో సిద్ధమవుతాయని వెల్లడించారు. మొత్తంగా 294 గ్రామాల్లో లక్షన్నర వరకు ప్రాపర్టీ కార్డులు సిద్ధమైనట్లేనని తెలిపారు. వీటిలో 42 గ్రామాల్లో యజమాన్య హక్కు పత్రం నమూనా కాపీని సంబంధిత యజమానులకు ఇప్పటికే అందజేసినట్టు చెప్పారు. అక్టోబరు 2న పండుగలా పంపిణీ అక్టోబరు 2న గాంధీ జయంతి రోజున 300 – 350 గ్రామాల పరిధిలోని అన్ని ఇళ్లు, దొడ్లు, ఖాళీ స్థలాల వారీగా యజమానులకు హక్కు పత్రాల పంపిణీని పండుగలా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా వీటిని పంపిణీ చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. ప్రాపర్టీ కార్డుల ముద్రణ టెండర్లకు కూడా ఏర్పాట్లు చేశారు. -
పొదుపు మహిళల రుణాల వడ్డీ రేపు జమ
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లిస్తే ఆ రుణాలపై వడ్డీని ప్రభుత్వమే భరిస్తోంది. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద గత మూడేళ్లుగా క్రమం తప్పకుండా వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తోంది. వరుసగా నాలుగో ఏడాది కూడా ప్రభుత్వమే భరించి, ఆ వడ్డీ డబ్బులను శుక్రవారం నేరుగా మహిళల ఖాతాలలో జమ చేయనుంది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నాలుగో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల మంది మహిళలకు సంభంధించిన 10 లక్షల రుణ ఖాతాల వడ్డీ మొత్తం రూ.1,353.76 కోట్లను ప్రభుత్వం ఆ మహిళలకు అందజేయనుంది. ఈ లబ్ధిదారులు 9,48,122 సంఘాలకు చెందిన వారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లి గ్రామంలో లబ్దిదారులైన వేలాది మంది మహిళల సమక్షంలో బటన్ నొక్కి వడ్డీ డబ్బును వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా.. ఉమ్మడి రాష్ట్రం నుంచి అమలులో ఉన్న పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకాన్ని కూడా నిలిపివేశారు. దీంతో అప్పట్లో పొదుపు సంఘాల మహిళలు తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇబ్బందులు పడ్డారు. వైఎస్ జగన్తన సుదీర్ఘ పాదయాత్రలో పొదుపు సంఘాల మహిళల ఇబ్బందులు గుర్తించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక 2019 ఎన్నికలు జరిగిన నాటికి పొదుపు సంఘాలకు సంబంధించి మహిళలకు ఉండే బ్యాంకు అప్పులను నాలుగు విడతల్లో చెల్లించేందుకు వైఎస్సార్ ఆసరా పథకం తీసుకొచ్చారు. రుణాలు సకాలంలో చెల్లించే మహిళలకు వడ్డీ డబ్బును ప్రభుత్వమే భరించేలా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికీ జీవం పోశారు. ముఖ్యమంత్రి కార్యక్రమం ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అమలాపురం చేరుకుంటారు. అక్కడి నుంచి జనుపల్లి గ్రామానికి వెళ్తారు. జనుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించి, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం లబి్ధదారులకు నిధులు విడుదల చేస్తారు. అనంతరం తాడేపల్లికి తిరుగు పయనమవుతారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. గత మూడు విడతలతో కలిపి రూ.4,969 కోట్లు 2019 నుంచి ఇప్పటికే వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలకు పొదుపు సంఘాల మహిళల రుణాల వడ్డీ మొత్తాలను ప్రభుత్వమే భరించింది. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రూ. 3615.29 కోట్లను లబ్ధిదారులకు అందజేసింది. నాలుగో విడత కూడా కలిపితే మొత్తం రూ. 4969.05 కోట్లు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారానే అందజేసినట్టు అవుతుందని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు. మరోవైపు తొలి ఏడాది 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం ద్వారా అందజేసిన లబ్ధిదారుల సంఖ్య కంటే నాలుగో ఏడాది లబ్ధి పొందే వారి సంఖ్య 20 లక్షల వరకు పెరిగినట్టు అధికారులు తెలిపారు. 2019–20లో 7.81 లక్షల సంఘాలకు చెందిన దాదాపు 81.52 లక్షల మంది మహిళలకు సంబంధించిన రుణాలపై రూ. 1,257.99 కోట్లు వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం భరించింది. ప్రస్తుత నాలుగో ఏడాదిలో లబ్ధిదారుల సంఖ్య 1.05 కోట్లకు, సంఘాల సంఖ్య 9,48,122 పెరిగింది. వడ్డీ మొత్తం కూడా రూ. 1,353.76 కోట్లకు పెరిగింది. నాలుగో విడతలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 83.86 లక్షల మంది రూ.1002.31 కోట్ల మేర లబ్ధి పొందనుండగా.. పట్టణ ప్రాంతాలకు చెందిన 21.26 లక్షల మంది మహిళలు రూ. 351.45 కోట్లు లబ్ధి పొందనున్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 5.92 లక్షల మంది మహిళలు రూ. 69.50 కోట్లు లబ్ధి పొందనున్నారని అధికారులు వెల్లడించారు. -
రూ.25 లక్షల కోట్లకు పైగా రుణాలు.. ఎవరా 10 మంది?
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా సేద్యాన్ని నమ్ముకున్న కోట్ల మంది వ్యవసాయదారులకు బ్యాంకులు అందించిన రుణాలు దాదాపు రూ.20 లక్షల కోట్లు కాగా టాప్ టెన్ కార్పొరేట్లు / ప్రముఖ సంస్థలకు ఏకంగా రూ.25 లక్షల కోట్లకు పైగా రుణాలిచ్చాయి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ సమాచారాన్ని వెల్లడించినప్పటికీ, ఆ పది మంది కార్పొరేట్లు / సంస్థలు ఎవరనేది మాత్రం రహస్యంగానే ఉంచారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆ వివరాలను వెల్లడించలేమని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న టాప్ టెన్ కార్పొరేట్ రుణ గ్రహీతల వివరాలను తెలియచేయాలని లోక్‌సభలో ఎంపీ మనీష్ తివారీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ సమాధానం ఇచ్చారు. టాప్ టెన్ కార్పొరేట్లు గతేడాది సెప్టెంబర్ వరకు రూ.25,43,208 కోట్ల మేర రుణాలు పొందినట్లు తెలిపారు. ఆర్బీఐ చట్టం 1934 రుణ గ్రహీతల వారీగా క్రెడిట్ వివరాలు వెల్లడించటాన్ని నిషేధించినట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకు గ్రూపులు, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకుల నుంచి పది మంది కార్పొరేట్లు రుణాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. 14 కోట్ల మంది రైతులు.. దేశంలో 14 కోట్ల మంది రైతులకు వచ్చే ఆర్థిక ఏడాది రూ.20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను లక్ష్యంగా నిర్దేశించినట్లు బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక ఏడాది వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.18 లక్షల కోట్లుగా ఉంది. ఒక పక్క దేశంలో వ్యవసాయం చేసే 14 కోట్ల మంది అన్నదాతలకు అందించే రుణాలు రూ.20 లక్షల కోట్లు కాగా కేవలం పది మంది కార్పొరేట్లకు ఏకంగా రూ.25.43 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేయడం గమనార్హం. రైతులు సకాలంలో రుణాలు చెల్లించకుంటే ఆస్తుల జప్తు లాంటి చర్యలకు దిగుతున్న బ్యాంకులు కార్పొరేట్ సంస్థలను మాత్రం ఉపేక్షిస్తున్నాయనే అభిప్రాయం సాధారణ ప్రజల్లో పెరిగిపోతోంది. -
సిబిల్ స్కోరు గురించి ఈ విషయాలు తెలియక.. తిప్పలు పడుతున్న ప్రజలు!
ప్రస్తుత రోజుల్లో రుణాలు తీసుకుంటున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అయితే లోన్లు ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించేది సిబిల్ స్కోరు. ఇందులో మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు వీటితో పాటు పాత, లేదా ప్రస్తుత రుణ వివరాలు వంటి సమాచారం మొత్తం ఉంటుంది. అందుకే బ్యాంకులు, లోన్లు మంజూరు చేసే ప్రైవేటు కంపెనీలు సిబిల్ స్కోరును ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటాయి. అంతేకాదు మనకు రుణాలు మంజూరు కావడంతో సిబిల్ స్కోరు కీలకంగా కూడా వ్యవహరిస్తుంది. సాధారణంగా సిబిల్ స్కోర్ 0 నుంచి 900 వరకు ఉంటుంది. మనం లోన్లు పొందాలంటే ఈ స్కోరు 700 కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు రుణాల మంజూరు సులభంగా జరుగుతాయి. కొన్ని కారణంగా వల్ల ఒక్కోసారి ప్రజలకు తెలియకుండానే ఈ సిబిల్ స్కోరు తగ్గుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సిబిల్ స్కోరును పెంచుకోవచ్చు. ప్రస్తుతం ఆ అవేంటో చూద్దాం. స్కోరు ఇలా పెంచుకోండి క్రెడిట్ కార్డ్ యూజర్లు, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.. ఆ కార్డు పూర్తి క్రెడిట్ పరిమితిని వాడకూడదు. మీ మొత్తం క్రెడిట్ పరిమితిలో 30% కంటే ఎక్కువ లోన్ తీసుకోకూడదు. ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. వీటితో పాటు మీరు లోన్ రీపేమెంట్ తక్కువ కాలం ఎంచుకోకండి. సరైన సమయంలో చెల్లంచని పక్షంలో స్కోరు తగ్గే అవకాశం ఉంది. మీరు ఎక్కువ కాల వ్యవధిని ఎంచుకుంటే, తక్కువ EMIలను చెల్లించాలి. ఇంకా అలాగే, దాని సాధారణ చెల్లింపు మీకు చాలా సులభం అవుతుంది. మీ ఆదాయంలో క్రెడిట్ రీపేమెంట్ వాటా అనేది తక్కువగా ఉంటుంది. ఇక మీ ఆదాయం లోన్ మొత్తం కంటే ఎక్కువ కానట్లయితే, మీరు దీర్ఘకాలిక లోన్ చెల్లింపు ఎంపికను ఎంచుకోవడం ద్వారా మీ సిబిల్ రేటింగ్‌ను పెంచుకోవచ్చు. ఒకేసారి చాలా రుణాలు తీసుకోవడం మీ క్రెడిట్ రేటింగ్‌పై నెగిటివ్ మార్క్ పడుతుంది. ఎక్కువ రుణాలు తీసుకుంటే వాటి వాయిదాలను సకాలంలో చెల్లించడం చాలా కష్టమవుతుంది. ఇది మీ CIBIL స్కోర్‌పై ఖచ్చితంగా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ నేపథ్యంలో మీరు సులభంగా తిరిగి పేమెంట్ చేయగల రుణం మాత్రమే తీసుకోవాలి. ఇక మీరు కొత్త రుణం తీసుకోబోతున్నట్లయితే, దానికి ముందు ఏదైనా బకాయిలు ఉంటే చెల్లించడం ఉత్తమం. ఎందుకంటే ఇది మీ మొత్తం ఆదాయంలో రుణ చెల్లింపు వాటాను తగ్గిస్తుంది. మీ ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడంలో కనుక ఖర్చు చేస్తుంటే, బ్యాంకు మీకు కొత్త లోన్ ని సులభంగా ఇవ్వడానికి ఇష్టపడదు. చదవండి: అమెజాన్ ఆఫర్: ఇలా చేస్తే రెడ్మీ ఏ1 స్మార్ట్‌ఫోన్ రూ.1000లోపు సొంతం చేసుకోవచ్చు! -
బ్యాంకు రుణాల్లో 17% వృద్ధి
ముంబై: బ్యాంకు రుణాలు సెప్టెంబర్ త్రైమాసికంలో 17.2 శాతం వృద్ధిని చూశాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 7 శాతంతో పోలిస్తే రెట్టింపునకు పైగా పెరగడం ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడడాన్ని తెలియజేస్తోందని ఆర్బీఐ ప్రకటించింది. ‘‘రుణాల్లో వృద్ధి అన్ని విభాగాల్లోనూ ఉంది. అన్ని రకాల జనాభా వర్గాల్లో, బ్యాంకుల్లో రెండంకెల వార్షిక వృద్ధి నమోదైంది’’అని తెలిపింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు సంబంధించి త్రైమాసికం వారీ డిపాజిట్లు, రుణ గణాంకాలను ఆర్బీఐ సోమవారం విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) బ్యాంకుల రుణాల్లో వృద్ధి 14.2 శాతంగా నమోదైన విషయాన్ని ప్రస్తావించింది. క్రితం త్రైమాసికంతో పోల్చి చూసినా, అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినా రుణాల్లో మంచి వృద్ధి కనిపిస్తోంది. దండిగా డిపాజిట్లు.. ఇక బ్యాంకుల డిపాజిట్లు సెప్టెంబర్ త్రైమాసికంలో 9.2 శాతం పెరిగాయి. 2021 జూన్ నుంచి బ్యాంకుల డిపాజిట్లు సగటున 9.5–10.2 శాతం మధ్య వృద్ధి చెందుతున్నాయి. విదేశీ బ్యాంకులు, ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటు రంగ బ్యాంకులే అధిక డిపాజిట్లను ఆకర్షిస్తున్నాయి. టర్మ్ డిపాజిట్లలో 10.2 శాతం వృద్ధి కనిపించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో టర్మ్ డిపాజిట్లు 6.4 శాతమే పెరగడం గమనించాలి. ఇక కరెంట్ డిపాజిట్లు 8.8 శాతం, సేవింగ్స్ డిపాజిట్లు 9.4 శాతం వృద్ధి చెందాయి. ఏడాది క్రితం ఇవి 17.5 శాతం, 14.5 శాతం చొప్పున వృద్ధిని చూశాయి. మొత్తం డిపాజిట్లలో సేవింగ్స్ డిపాజిట్లు 2019 జూన్ నాటికి 32.4 శాతంగా ఉంటే, 2022 జూన్ నాటికి 35.2 శానికి పెరిగాయి. తదుపరి సెప్టెంబర్ త్రైమాసికంలో 34.7 శాతానికి పరిమితమయ్యాయి. దేశవ్యాప్తంగా క్రెడిట్–డిపాజిట్ రేషియో 74.8 శాతానికి మెరుగుపడింది. రుణ వృద్ధి పటిష్టం 2022–23పై ఫిచ్ అంచనా భారత్ బ్యాంకింగ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 11.5 శాతం పటిష్ట రుణ వృద్ధితీరును నమోదుచేస్తుందని రేటింగ్ దిగ్గజం– ఫిచ్ అంచనావేసింది. రుణ వృద్ధికి అధిక వడ్డీరేట్లు అడ్డంకి కాబోవని కూడా స్పష్టం చేసింది. భారీ రుణ వృద్ధి వల్ల నికర ఆదాయాలు ప్రత్యేకించి నికర వడ్డీ మార్జిన్లు పటిష్టంగా ఉంటాయని వివరించింది. ‘‘2021–22లో బ్యాంక్ రుణ వృద్ధి 11.5 శాతం. 2022–23లో ఈ రేటు 13 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. కోవిడ్ తదనంతరం సానుకూల పరిస్థితులు, చక్కటి జీడీపీ వృద్ధి రేటు వంటి అంశాలు రిటైల్, వర్కింగ్ క్యాపిటల్ రుణాలకు డిమాండ్ పెంచుతుందని భావిస్తున్నాం’’ అని ఈ ఒక ప్రకటనలో వివరించింది. 2022–23లో దేశ జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉంటుందని ఫిచ్ అంచనా. కాగా, బ్యాంకింగ్ డిపాజిట్లు 2022–23లో 11 శాతం పెరుగుతాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంల్లో రుణ వృద్ధి కొంత మందగిచ్చవచ్చని ఫిచ్ అంచనా వేస్తోంది. ‘‘డిపాజిట్ రేట్లు పెరగడం బ్యాంకుల వడ్డీ మార్జిన్లపై ప్రభావితం చూపవచ్చు. అయితే నిధుల సమీకరణ వ్యయాలు తగ్గడం బ్యాంకులకు ఇక్కడ కలిసి వచ్చే అంశం. ఈ రెండింటి మధ్య సమతౌల్యం ఉంటుంది’’ అని ఫిచ్ విశ్లేషించింది. -
ప్రాసెసింగ్ చార్జీలొద్దు
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల పేరిట మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై బ్యాంకులు ఎలాంటి ప్రాసెసింగ్ చార్జీలు వసూలు చేయకుండా ఆదేశాలివ్వాలని ప్రభుత్వం బుధవారం రిజర్వు బ్యాంకు అప్ ఇండియా (ఆర్బీఐ)ను కోరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో మహ్మద్ ఇంతియాజ్ బుధవారం ముంబయిలోని రిజర్వు బ్యాంక్ ప్రధాన కార్యాలయంలోని ఛీప్ జనరల్ మేనేజర్, హైదరాబాద్‌లోని రిజర్వు బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయ జనరల్ మేనేజర్‌తో పాటు రాష్ట్ర బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) కన్వీనర్లకు వేర్వేరుగా లేఖ రాశారు. రుణం ఇచ్చే బ్యాంకును బట్టి ప్రస్తుతం పొదుపు సంఘాల రుణ మొత్తంపై 0.5 శాతం నుంచి 1.2 శాతం దాకా ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం పొదుపు సంఘాల మహిళలకు గరిష్టంగా రూ.20 లక్షల వరకు బ్యాంకు రుణాలు ఇచ్చే వెసులు బాటు ఉంది. అంటే, మహిళలు రూ.20 లక్షల రుణం తీసుకుంటే సుమారు రూ.20 వేలు ప్రాసెసింగ్ ఫీజు పేరిట బ్యాంకులు మినహాయించుకుంటున్నాయి. పొదుపు సంఘాలు తీసుకునే రుణాల్లో అత్యధికులు పేద కుటుంబాలకు చెందిన వారే కావడంతో ఈ తరహా ప్రాసెసింగ్ చార్జీలు వారికి భారంగా తయారవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఈ లేఖ ద్వారా ఆర్బీఐ దృష్టికి తీసుకొచ్చింది. ఈ తరహా రుణాలపై ప్రాసెసింగ్ చార్జీలతో పాటు డాక్యుమెంటేషన్ చార్జీలు, ఇతర అడహాక్ చార్జీలు సైతం బ్యాంకులు వసూలు చేయకుండా అన్ని బ్యాంకులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆర్బీఐని ప్రభుత్వం కోరింది. రుణాల చెల్లింపులో దేశంలోనే ప్రథమ స్థానం పొదుపు సంఘాల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆసరాతో పాటు సకాలంలో రుణాలు చెల్లించే వారికి సున్నా వడ్డీ పథకం అమలు వంటి చర్యలు చేపట్టడంతో రాష్ట్రంలో ప్రస్తుతం మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలలో 99.5 శాతం సకాలంలో చెల్లిస్తున్నారు. పొదుపు సంఘాల రుణాల చెల్లింపుల్లో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. దీంతో బ్యాంకులు కూడా మహిళా పొదుపు సంఘాల గరిష్ట పరిమితి మేరకు రుణాలు ఇస్తున్నాయి. మరో పక్క.. రాష్ట్రంలో పొదుపు సంఘాల పేరిట ప్రస్తుతం రూ.30 వేల కోట్ల పైబడి మహిళలు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని ఉన్నారు. అందులో ఎప్పటికప్పుడు కిస్తీ ప్రకారం పాత రుణాల చెల్లింపులు పూర్తి కాగానే, తిరిగి కొత్తగా ఏటా రూ.15 వేల కోట్లు రుణాలు పొందుతున్నారు. ఇప్పటికే కొన్ని బ్యాంకుల స్పందన ► పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై రూ.2.5 లక్షల వరకు ప్రాసెసింగ్ చార్జీలను మినహాయిస్తూ ఆర్బీఐ గతంలోనే అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్ల కిత్రం వరకు మన రాష్ట్రంలోనూ అత్యధిక సంఘాలు ఈ పరిమితి మేరకే బ్యాంకుల నుంచి రుణాలు పొందే పరిస్థితి ఉండింది. ► అయితే, రాష్ట్రంలో ఇటీవలి కాలంలో అత్యధిక పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి రూ.10 లక్షలకు పైబడే రుణాలు పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాసెసింగ్ చార్జీ భారంగా మారింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టి రాగానే.. గత రెండేళ్లగా జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశాలన్నింటిలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ విషయాన్ని బ్యాంకర్ల దృష్టికి తీసుకొచ్చింది. ► ఫలితంగా రూ.10 లక్షల వరకు ప్రాసెసింగ్ చార్జీలను మినహాయిస్తూ యూనియన్ బ్యాంకు (గతంలో ఆంధ్రా బ్యాంకు) 2021 సెప్టెంబర్ 1వ తేదీన అన్ని బ్రాంచ్‌లకు ఆదేశాలు జారీ చేంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా 2021 ఆగస్ట్ 23వ తేదీన అదే తరహా ఉత్తర్వులిచ్చింది. ► సకాలంలో చెల్లింపులు జరుగుతుండడంతో ఇప్పుడు బ్యాంకులు రూ.20 లక్షల దాకా సంఘాల పేరిట రుణాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన బ్యాంకర్ల సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా రూ.20 లక్షల వరకు ప్రాసెసింగ్ చార్జీల మినహాయింపు విషయాన్ని ప్రస్తావించారు. ఆ అంశాన్ని సమావేశ మినిట్స్‌లో ఉదహరించి, అన్ని బ్యాంకులకు ఆదేశాలివ్వాలంటూ సూచన చేశారు. ► రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంకు (అప్కాబ్) ఇప్పటికే రూ.20 లక్షల వరకు పొదుపు సంఘాల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు వసూలును పూర్తిగా మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేసిందని సెర్ప్ అధికారులు వెల్లడించారు. -
AP: రైతులకు పుష్కలంగా రుణాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడేళ్లుగా అన్నదాతలకు పుష్కలంగా వ్యవసాయ రుణాలు మంజూరవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీని క్రమం తప్పకుండా చెల్లిస్తుండటంతో రైతులకు అవసరమైన వ్యవసాయ రుణాలను బ్యాంకులు విరివిగా మంజూరు చేస్తున్నాయి. ఏడాదికేడాదికి రైతుల సంఖ్యతో పాటు రుణాల మంజూరులో పెరుగుదల ఉంది. గత మూడేళ్లలో అంటే 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి 2021–22 ఆర్థిక సంవత్సరం వరకు 307.20 లక్షల మంది రైతులకు రూ.4,37,828 కోట్ల వ్యవసాయ రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో వ్యవసాయ రుణాల మంజూరు లక్ష్యం రూ.97,197 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.85,346 కోట్ల రుణాలను 48.49 లక్షల మంది రైతులకు బ్యాంకులు మంజూరు చేశాయి. మరో పక్క రాష్ట్రంలో కౌలు సాగుదారులకు కూడా బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం పంట సాగుదారు హక్కుల చట్టం–2019ను తీసుకువచ్చింది. ఈ చట్టం కింద పంట సాగుదారుల హక్కు పత్రాలు పంపిణీ చేస్తోంది. వాస్తవ సాగుదారులకు సీసీఆర్సీ పత్రాలు జారీ చేయడంతో బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి. కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడానికి ఆర్బీకేల్లోని సిబ్బంది సహకరిస్తున్నారు. ఇప్పటి వరకు 4.75 లక్షల మంది కౌలు రైతులకు రూ.3595.02 కోట్ల మేర బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. వీలైనంత ఎక్కువ మంది కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బ్యాంకర్ల సమావేశాల్లో ఈ విషయంపై సీఎంతో పాటు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. గత సర్కారు.. రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని మోసం చేయడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి రుణాలు పొందలేకపోయిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే ఆ పరిస్థితి పూర్తిగా మార్చేసి, రైతులకు మేలు చేసే పలు నిర్ణయాలు తీసుకుంది. -
Sakshi Cartoon 22-09-2022
ఇక మన పని స్టార్ట్ చేద్దాం! బ్యాంకులో రుణం తీసుకొని నువ్వు లండన్ వెళ్లు.. నేను అమెరికా వెళ్తా.. నువ్వేమో సింగపూర్.. అతను దుబాయ్! -
ఉన్నవాళ్లకే మరిన్ని రాయితీలా?
పేదలకు అత్యవసరమైన ఉచితాలను ‘పప్పు బెల్లాలు’ అంటూ చాలామంది గగ్గోలు పెడుతుంటారు. కానీ కార్పొరేట్ కంపెనీలకు అందుతున్న రాయితీల గురించి ఎవరూ మాట్లాడరు. వ్యవసాయ రుణాలను మాఫీ చేసినప్పుడు రుణ సంస్కృతిని అవి విచ్ఛిన్నపరుస్తున్నాయని చాలామంది ఆక్షేపించారు. కానీ భారీ ఎత్తున కార్పొరేట్ పన్నులు తగ్గించడం అనేది ఆర్థిక పురోగతికి దారి తీస్తుందని వీరే తప్పుడు సూత్రాలు వల్లిస్తున్నారు. గత అయిదేళ్లలో రూ.10 లక్షల కోట్ల కార్పొరేట్ నిరర్థక రుణాలను మాఫీ చేసినట్లు కేంద్రప్రభుత్వం ఇటీవలే పార్లమెంటుకు తెలిపింది. అత్యంత సంపన్నుల జేబుల్లో డబ్బును తేరగా పోయడం ద్వారా ఇప్పటికే ఉన్న సంపద అసమానత్వం మరింతగా పెరిగింది. సంపన్నులకు యాభై సంవత్సరాలుగా లభిస్తున్న పన్ను రాయితీలు ఏమాత్రం తగ్గడం లేదని ఒక అధ్యయనాన్ని ఉల్లేఖిస్తూ ‘బ్లూమ్‌బెర్గ్’లో ఒక కథనం ప్రచురితమైంది. లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన ఇద్దరు పరిశోధకులు అధునాతనమైన గణాంక విధానాన్ని ఉపయోగించడమే కాకుండా, 18 పురోగామి ఆర్థిక వ్యవస్థలు అనుసరించిన విధానాలను పరిశీలించారు. సాక్ష్యాధారాలు లేకుండా అనుభవపూర్వకంగా చాలామంది ఇంతకాలంగా చెబుతున్నదాన్ని వీళ్లు ససాక్ష్యంగా నిరూపించారు. అనేకమంది భారతీయ ఆర్థికవేత్తలు కార్పొరేట్ పన్నులను తగ్గించాల్సిన అవసరాన్ని సమర్థించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఈ ఇద్దరు పరిశోధకుల అధ్యయనం (కొద్దిమంది ఇతరులు కూడా) స్పష్టంగా ఒక విషయాన్ని బయటపెట్టింది. పన్ను రాయితీ అనేది ఆర్థిక పురోగతికి సహాయం చేయలేదు. అది మరిన్ని ఉద్యోగావశాలను కూడా కల్పించలేదు. డబ్బును తేరగా అత్యంత సంపన్నుల జేబుల్లో పోయడం ద్వారా ఇప్పటికే ఉన్న సంపద అసమానత్వాన్ని మరింతగా పెంచడంలో పన్ను రాయితీ సాయపడింది. భారతదేశంలో రైతులతో సహా పేదలకు అందిస్తున్న ఉచితాలను ‘పప్పు బెల్లాల’ సంస్కృతి అంటూ ఎన్నో వార్తాపత్రికల కథనాలు ధ్వజమెత్తుతున్నాయి. అదే సమయంలో కార్పొరేట్ సంస్థలకు అంది స్తున్న భారీ స్థాయి ఉచితాల గురించి ఇవి ఏమాత్రం ప్రస్తావించడం లేదు. కొద్దిమంది వ్యాఖ్యాతలను మినహాయిస్తే– మాఫీలు, ట్యాక్స్ హాలిడేలు, ఉద్దీపన ప్యాకేజీలు, పన్ను తగ్గింపులు వంటి కార్పొరేట్ సబ్సిడీల విస్తృతి, స్వభావాన్ని చాలామంది దాచిపెడుతున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు ‘ఫలితం ఇవ్వని ఉచితాలు’ అంటూనే, ఆ మాటకు అర్థమేమిటో స్పష్టంగా నిర్వచించలేక పోయినప్పటికీ, భారత్‌లో కార్పొరేట్ పన్నుల తగ్గింపు కూడా ఈ విభాగంలోనే చేరతుందని అంతర్జాతీయ అధ్యయనాలు తెలుపు తున్నాయి. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త జెఫ్రీ సాచెస్ను గతంలో ఒక ప్రశ్న అడిగారు. పారిశ్రామిక ఉత్పత్తిని ఏమాత్రం పెంచనప్పుడు లేదా అదనపు ఉద్యోగాలను సృష్టించలేకపోయినప్పుడు కార్పొరేట్లకు భారీస్థాయి పన్ను తగ్గింపు ద్వారా ఏం ఫలితం దక్కింది అని ప్రశ్నించారు. పన్ను రాయితీల ద్వారా ఆదా అయిన డబ్బు కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌ల జేబుల్లో పడిందని ఆయన క్లుప్త సమాధానం ఇచ్చారు. కొన్ని ప్రముఖ ఆర్థిక వ్యవస్థల్లో కేంద్ర బ్యాంకులు వాస్తవంగా అత్యంత ధనవంతుల జేబుల్లోకి చేరేలా అదనపు డబ్బును ముద్రించాయి. 2008–09 కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిన రోజుల్లో పరిమాణాత్మక సడలింపు అనే పదబంధాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. ఈ పేరుతో ధనిక దేశాలు 25 లక్షల కోట్ల డాలర్ల అదనపు డబ్బును ముద్రించాయి. తక్కువ వడ్డీరేటుతో, అంటే సుమారు రెండు శాతంతో ఫెడరల్ బాండ్ల రూపంలో ఆ సొమ్మును సంపన్నులకు జారీ చేశాయి. ఈ మొత్తం డబ్బును వాళ్లు అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్ మార్కెట్లలో మదుపు చేశారు. అందుకే ఆ కాలంలో బుల్ మార్కెట్లు ఎలా పరుగులు తీశాయో చూశాం. మోర్గాన్ స్టాన్లీకి చెందిన రుచిర్ శర్మ ఒక వ్యాసంలో కరోనా మహమ్మారి కాలంలో జరిగిన తతంగంపై రాశారు. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో 9 లక్షల కోట్ల డాలర్ల నగదును అదనంగా ముద్రించారనీ, కునారిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థలకు ఉద్దీపన ప్యాకేజీలను అందించడమే దీని లక్ష్యమనీ చెప్పారు. కానీ ఉద్దీపన ప్యాకేజీల కోసమని కేటాయించిన ఈ మొత్తం నగదు స్టాక్ మార్కెట్ ద్వారా అత్యంత సంపన్నుల జేబుల్లోకి వెళ్లిపోయిందని వెల్లడించారు. ఈ భారీమొత్తం ఏ రకంగా చూసినా ఉచితాల కిందకే వస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కల్లోల పరిస్థితుల్లో ఉన్న 2008–09 కాలంలో భారతదేశంలో 1.8 లక్షల కోట్ల రూపాయలను ఆర్థిక ఉద్దీపన పేరుతో పరిశ్రమ వర్గాలకు అందుబాటులో ఉంచారు. ఈ భారీ ప్యాకేజీని ఒక సంవత్సరం తర్వాత ఉపసంహరించుకోవాలి. కానీ ఒక వార్తా నివేదిక ప్రకారం, ప్రభుత్వంలో ఎవరో ‘నల్లాను ఆపేయడం’ మర్చిపోయారు. దీని ఫలితంగా ఉద్దీపన కొనసాగుతూ వచ్చింది. మరో మాటల్లో చెప్పాలంటే, ఆ తర్వాత పదేళ్ల కాలంలో భారత పరిశ్రమ దాదాపుగా రూ. 18 లక్షల కోట్ల డబ్బును ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా అందుకుంది. దీనికి బదులుగా ఈ మొత్తాన్ని వ్యవసాయ రంగానికి అందుబాటులోకి తెచ్చి ఉంటే, ప్రధానమంత్రి కిసాన్ పథకంలో భాగంగా మన రైతులకు యేటా ఒక్కొక్కరికి 18 వేల రూపాయల మేరకు అదనంగా ప్రత్యక్ష నగదు మద్దతు కింద అంది ఉండేది. సెప్టెంబర్ 2019లో భారత పరిశ్రమకు మరోసారి రూ. 1.45 లక్షల కోట్ల పన్నులను ప్రభుత్వం తగ్గించింది. చాలామంది ఆర్థిక వేత్తలు గ్రామీణ డిమాండును ప్రోత్సహించడం కోసం ఆర్థిక ఉద్దీపనను అందించాలని కోరుతున్న సమయంలో మళ్లీ కార్పొరేట్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కరుణించింది. దాదాపు రూ.2.53 లక్షల కోట్ల మేరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసినప్పుడు రుణ సంస్కృతిని అవి విచ్ఛిన్నపరుస్తున్నాయని ఆర్థికవేత్తలు ఆరోపించారు. కానీ భారీ ఎత్తున కార్పొరేట్ రుణాలను మాఫీ చేయడం వల్ల ఆర్థిక పురోగతికి దారి తీస్తుందని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. గత అయిదేళ్లలో రూ. 10 లక్షల కోట్ల కార్పొరేట్ నిరర్థక రుణాలను కొట్టేసినట్లు ప్రభుత్వం ఇటీవలే పార్లమెంటుకు తెలిపింది. కార్పొరేట్ పన్నులు తగ్గించడం ద్వారా వచ్చే ప్రయోజనాలు సగటు మనిషిని చేరుకోలేదు. సంపన్నులు మాత్రమే వాటినుంచి లబ్ధిపొందారు. ఇది సంపన్నులకు, పేదలకు మధ్య అంతరాన్ని మరింతగా పెంచింది. వ్యవసాయ రుణాలను మాఫీచేసినప్పుడు బ్యాంకులు తమకు రావలసిన అసలు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డిమాండ్ చేసి మరీ తీసుకుంటాయి. కానీ కార్పొరేట్ రుణాలను మాఫీ చేసినప్పుడు బ్యాంకులు పైసా డబ్బును కూడా వసూలు చేయలేక దెబ్బతింటాయి. దేశంలో రుణాలు చెల్లించే సామర్థ్యం ఉండి కూడా ఎగవేస్తున్న సంస్థలు 10 వేల వరకు ఉంటాయి. రెండు వేలమంది రైతులు తీసుకున్న రుణాలను చెల్లించలేదని జారీ చేసిన అరెస్టు వారెంట్లను కొన్ని నెలలక్రితం పంజాబ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కానీ ఉద్దేశ పూర్వకంగా రుణాలు ఎగ్గొడుతున్న వారిని మాత్రం స్వేచ్ఛగా వదిలేస్తున్నారు. మునుపటి ప్రణాళికా సంఘం సబ్సిడీపై కార్యాచరణ పత్రాన్ని రూపొందించింది. న్యూఢిల్లీలో ఎకరాకు రూపాయి చొప్పున 15 ఎకరాల భూమిని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి సబ్సిడీల పేరిట అప్పనంగా ధారపోశారని ఇది బయటపెట్టింది. ఐటీ రంగంతో సహా ప్రైవేట్ ఆసుపత్రులు, పరిశ్రమలకు తరచుగానే చదరపు మీటరుకు ఒక రూపాయి చొప్పున భూమిని ధారపోస్తున్నారు. అదే సమయంలోనే మౌలిక వసతుల కల్పనకు, వడ్డీ, మూలధనం, ఎగుమతులతో పాటు విద్యుత్, నీరు, ముఖ్యమైన సహజ వనరులకు కూడా సబ్సిడీలు అందిస్తున్నారు. ఇవి చాలవన్నట్లుగా పలు రాష్ట్రాలు నూరు శాతం పన్ను మినహాయింపు, ‘ఎస్జీఎస్టీ’ మినహాయింపు వంటి ప్రోత్సాహకాలను అందజేస్తున్నాయి. ఈరకంగా కార్పొరేట్ ఇండియా కూడా భారీ సబ్సిడీలు, ఉచితాల మీదే ఎలా బతుకీడుస్తోంది అనేది అధ్యయనం చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. దీంతో అమూల్యమైన వనరులు హరించుకుపోతున్నాయి. పేదలకు కొద్ది మొత్తం ఉచితాలు మిగులుతున్నాయి. - దేవీందర్ శర్మ ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఆ లోన్ తీసుకున్నవారికి భారీ షాక్.. .. ప్చ్, ఈఎంఐ మళ్లీ పెరిగింది!
దేశంలో ద్రవ్యోల్పణాన్ని కట్టడి చేసేందుకు ఇటీవల ఆర్బీఐ రెపో రేటుని పెంచిన సంగతి తెలిసిందే. దీంతో పలు బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచే పనిలో పడ్డాయి. తాజాగా ప్రముఖ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. హోమ్ లోన్స్‌పై ఉన్న రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (ఆర్పీఎల్ఆర్)ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహ రుణాల బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 25 బేసిస్ పాయింట్లు మేర పెంచింది. కాగా పెంచిన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు ఆగస్టు 9 నుంచి అమలులోకి రానుంది. అయితే ఈ నెలలో ఇది రెండవ పెంపు కావడం గమనార్హం. మూడు నెలల్లో హెచ్‌డిఎఫ్‌సి చేపట్టడం ఇది ఆరోసారి. మే 2022 నుంచి ఇప్పటివరకు మొత్తం రేటు 140 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపుతో గృహ రుణాలు తీసుకున్న కస్టమర్ల ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. మే నుంచి ఆర్బీఐ ఆర్థిక సంస్థలు వడ్డీ రేట్ల పెంపుదలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మరోసారి సెప్టెంబరుతో పాటు డిసెంబర్లో కూడా ఆర్బీఐ సమావేశం కానుంది. ఏది ఏమైనా భారం మాత్రం తప్పట్లేదని సామన్య ప్రజలు వాపోతున్నారు. మూడు నెలల కాలంలోనే ఆర్పీఎల్ఆర్ (RPLR) చాలా అధికంగా పెరగడంతో హోం లోన్స్ తీసుకున్న వారు అధిక ఈఎంఐలు చెల్లించాల్సి వస్తోంది. చదవండి: Revised ITR: రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలా? చివరి తేదీ ఎపుడు? -
పెరుగుతున్న వడ్డీ రేట్లు.. భారం తగ్గించుకోవాలంటే ఇలా చేయండి!
సెంట్రల్ బ్యాంకు ఆర్బీఐ తాజా నిర్ణయంతో సామాన్యుడికి భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే ప్రక్రియలో ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.40 శాతాని చేరింది. మే నుంచి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా మూడో సారి రెపో రేటును పెంచింది. మే నుంచి ఆగస్టు మధ్య కాలంలో రెపో రేటు 140 బేసిస్ పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం పెంచిన రెపో రేట్ల ఫలితంగా గృహ, వాహనాల రుణాలపై వినియోగదారులకు ఈఎంఐ భారం పడనుంది. ఆగస్టు 5న ఆర్బీఐ రెపో రేటు పెంపు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ సహా ఇతర బ్యాంకులు రుణ రేట్లను పెంచాయి. అయితే కొన్ని నిబంధనలను పాటించడం ద్వారా కస్టమర్లపై పడే వడ్డీ భారాన్నీ తగ్గించుకోవచ్చు. ఈఎంఐ( EMI) లేదా లోన్ కాలపరిమితిని పెంచాలా? పెరుగుతున్న వడ్డీ రేట్ల ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే.. ప్రస్తుతం హోమ్ లోన్ తీసుకొని కస్టమర్లు వారి ఈఎంఐ కాలాన్ని పెంచుకోవడం, లేదా మీ లోన్ కాలపరిమితిని పెంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే లోన్ టెన్యూర్ పెంచుకుంటే మీ ఈఎంఐ పెంపు ఆప్షన్ కంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. హోమ్ లోన్ ప్రీపేమెంట్ వడ్డీ భారాన్ని తగ్గింపు కోసం కస్టమర్లు ముందస్తు చెల్లింపు చేయవచ్చు. అనగా తమ హోమ్లోన్లను ముందస్తుగా చెల్లించాలి. వడ్డీ వ్యయం తగ్గించుకునేందుకు లోన్ కాలపరిమిత తగ్గింపు ఆప్షన్ ఎంచుకోవాలి. అంతేకాకుండా రెగ్యులర్ ప్రీపేమెంట్ వల్ల బకాయి ఉన్న లోన్ మొత్తం గణనీయంగా తగ్గుతుంది. అకౌంట్ ట్రాన్స్ఫర్ తక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్న బ్యాంకులకు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడం మరో ఆప్షన్. అర్హత ఉన్న రుణగ్రహీతలు తమ హోమ్ లోన్లను ప్రస్తుతం ఉన్న బ్యాంక్ కంటే తక్కువ వడ్డీ రేట్లు అందించే ఇతర బ్యాంకుకు మార్చుకునే వెసలుబాటు ఉంది. అయితే ఈ ప్రక్రియకు అదనపు ఖర్చులు అవుతాయని గుర్తుంచుకోండి. లోన్ తీసుకున్న కస్టమర్లు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకునే ముందే వారికి ఎదురయ్యే లాభనష్టాలను చెక్ చేసుకోవడం మంచిది. చదవండి: అధ్యక్షా.. బాస్ అంటే ఇట్టా ఉండాలా.. అదిరిపోయే జీతం, బోలెడు బెనిఫిట్స్ కూడా.. -
రైతన్నలకు విరివిగా రుణాలు.. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ముందుకొస్తున్న బ్యాంకర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ చొరవతో చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకులు విరివిగా రుణాలు అందచేస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతేడాది సెప్టెంబర్ వరకు కొత్తగా 12.74 లక్షల మంది చిన్నకారు రైతులకు, 7.81 లక్షల మంది సన్నకారు రైతులకు బ్యాంకులు కొత్తగా రూ.56,256.90 కోట్ల మేర వ్యవసాయ రుణాలను మంజూరు చేశాయి. చిన్న కారు రైతులకు రూ.40,787.50 కోట్లు, సన్నకారు రైతులకు రూ.15,469.40 కోట్లు రుణాలు కొత్తగా మంజూరయ్యాయి. దీంతో చిన్న, సన్నకారు రైతులకు మంజూరైన మొత్తం రుణం రూ.1,48,085.14 కోట్లకు చేరుకుంది. అంతకు మించి రుణాలు.. మొత్తం రుణాల్లో బ్యాంకులు చిన్న, సన్నకారు రైతులకు 9 శాతం మేర ఇవ్వాలని ఆర్బీఐ నిబంధనలు స్పష్టం చేస్తుండగా రాష్ట్రంలో అంతకు మించి 27.76 శాతం మేర మంజూరు కావడం గమనార్హం. సకాలంలో పంట రుణాలను చెల్లించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ రాయితీని అమలు చేస్తోంది. సక్రమంగా చెల్లిస్తుండటంతో బ్యాంకులు కూడా రైతులకు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. పంటలు వేసిన రైతులందరి వివరాలను ఆర్బీకేల ద్వారా సేకరించి బ్యాంకు రుణాలు మంజూరయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక ప్రకారం 2019 వరకు టీడీపీ హయాంలో, ఆ తరువాత గతేడాది సెప్టెంబర్ వరకు చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకు రుణాల మంజూరు వివరాలు ఇవీ.. -
మీకు తెలియకుండా.. మీ పేరు మీద ఇంకెవరైనా లోన్ తీసుకున్నారా!
మీకు తెలియకుండా లేకుండా.. మీ పేరు మీదు ఇంకెవరైనా పర్సనల్ లోన్, కన్జ్యూమర్ లోన్ తీసుకుంటున్నారా? ఎస్. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా.. అక్షరాల ఇది నిజం. ఇటీవల కాలంలో అకౌంట్ హోల్డర్లకు తెలియకుండా పాన్ కార్డ్‌ల సాయంతో వారి పేరు మీద వేరే వాళ్లు బ్యాంకులు లేదంటే ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్లు తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇలా సీక్రెట్‌గా తీసుకునే లోన్ల కారణంగా నేరస్తుల రుణాల్ని బాధితులు చెల్లించడమో,లేని పక్షంలో కోర్ట్‌ను ఆశ్రయించడం లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటి వల్ల ఆర్ధిక ఇబ్బందులతో పాటు డబ్బులు కట్టకుండా ఎగ్గొడుతున్నారనే అపవాదు మోయాల్సి ఉంటుంది. రహస్యంగా లోన్ మరి ఎలాంటి సందర్భాల్లో మీకు తెలియకుండా మీ పేరుమీద రహస్యంగా లోన్లను తీసుకోవచ్చంటే? బహిరంగంగా లేదంటే,సీక్రెట్‌గా బ్యాంక్‌ల నుంచి, ఆర్ధిక సంస్థల నుంచి ఈజీగా లోన్లు తీసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.ఎలా అంటే? ఉదాహరణకు మనం తీసుకునే లోన్లకు పాన్ నెంబర్ లింకై ఉంటుంది. ఆ పాన్ నెంబర్‌తోనే ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా లోన్లను పొందవచ్చు. నేరస్తులు చట్టబద్దంగానే అస్సలు మీతో సంబంధం లేకుండా బ్యాంక్ నుంచి వారికి కావాల్సిన రుణాల్ని పొందే అవకాశం ఉంటుంది. అలాంటి లోన్లకు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరి అలాంటి సమస్యలు రాకుండా ఏం చేయాలంటే. క్రెడిట్ స్కోర్ చెక్ చేయండి బ్యాంక్‌ల నుంచి లోన్ తీసుకుంటే తప్పని సరిగా సంబంధిత డాక్యుమెంట్లకు పాన్ నెంబర్‌ను జత చేస్తారు. మీ పాన్ నెంబర్ సాయంతో సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటే..మీరు ఎప్పుడు? ఎక్కడ? లోన్ తీసుకున్నారు. ఎంత చెల్లించారు. ఇంకా ఎంత చెల్లించాలి అనే విషయాలన్నీ బయటకొస్తాయి. మీరు కాకుండా ఇంకెవరైనా మీ పేరు మీద లోన్ తీసుకుంటే అలాంటి మోసాల్ని ఈజీగా గుర్తించొచ్చు. అదే జరిగితే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. జరిగిన మోసంపై ఫిర్యాదు చేయాలంటే! ఇటీవల ఓ బాధితుడు (పేరు చెప్పేందుకు ఇష్టపడలేదు) తనకు తెలియకుండా తనపేరు మీద లోన్ తీసుకున్నట్లు గుర్తించాడు. ఆ సమయంలో తన క్రెడిట్ స్కోర్ 776 నుంచి 830కి పెరిగింది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్యాంక్ లోన్‌కు పాన్ నెంబర్‌ను డీయాక్టీవ్ చేసినట్లు తెలిపాడు. వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. తనకు జరిగిన మోసంపై బ్యాంకు అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకులు మిమ్మల్ని నమ్మవ్! కొన్ని సందర్భాల్లో బ్యాంకులు మీ ఫిర్యాదును నమ్మే సాహసం చేయవు. అలాంటప్పుడు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. అక్కడ న్యాయం జరగలేదంటే కోర్ట్లు లేదా స్థానిక సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేయోచ్చు. క్రెడిట్ బ్యూరోల దృష్టికి తీసుకెళ్లాలి. వాళ్లు చెక్ చేసి మీ సిబిల్ స్కోర్ తగ్గింపు,పెంచే విషయంలో సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, సిబిల్ స్కోర్ల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. చదవండి👉 ధరలు పెరిగితే ధనవంతులకే నష్టం - కేంద్ర ఆర్థిక శాఖ -
దేశానికి ఏపీ మార్గదర్శకం
తిరుపతి అర్బన్: దేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తోందని జాతీయ గ్రామీణ జీవనోపాధి సంస్థ ప్రతినిధి శ్రేయమంజుధా అన్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర బృందం బుధవారం తిరుపతి డీఆర్డీఏ కార్యాలయంలో పొదుపు సహకార సంఘాలకు చెందిన ఎస్టీ మహిళలతో సమావేశమైంది. ఈ సందర్భంగా శ్రేయమంజుధా మాట్లాడుతూ.. తాము దేశంలోని అనేక రాష్ట్రాల్లో పర్యటించామని, చాలాచోట్ల మహిళా సంఘాలు బ్యాంక్ రుణాలు తీసుకోవడంతోనే సంఘాల పని పూర్తయినట్లు భావిస్తున్నాయని చెప్పారు. ఏపీలో మహిళలకు బ్యాంక్ రుణాలతోపాటు వైఎస్సార్ బీమా, జగనన్న తోడు, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత వంటి పథకాలు వర్తింపచేయడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళల ఆర్థికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. పొదుపు సంఘాల ద్వారా వచ్చే రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో వచ్చే నగదుతో మహిళలు వ్యాపారులుగా మారడం పలు రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఏపీ మహిళాభివృద్ధికి, వారి జీవనోపాధికి తీసుకుంటున్న చర్యలను కేంద్రానికి నివేదించి ఇలాంటి పథకాలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తే బాగుంటుందనే సూచనలు సైతం చేస్తామని చెప్పారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి సంస్థ ప్రతినిధులు కరిమైనాన్, మాన్‌కే ధవే మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. డీఆర్డీఏ జిల్లా ఇన్చార్జి ప్రాజెక్టు డైరెక్టర్ ప్రభావతి, డీఆర్డీఏ అధికారి ధనుంజయరెడ్డి ఉన్నారు. -
మహిళా సంఘాల తరహాలో వృద్ధుల సంఘాలు
సాక్షి, అమరావతి: మహిళా పొదుపు సంఘాల మాదిరే ఇప్పుడు కొత్తగా వృద్ధుల సంఘాల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ సంఘాలకు ‘ఎల్డర్లీ స్వయం సహాయక సంఘాలు (ఈఎస్హెచ్జీ)’గా పేరు పెట్టారు. మహిళలు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు రివాల్వింగ్ ఫండ్ రూపంలో ఆర్థికసాయం అందజేసినట్లే ప్రభుత్వం వృద్ధుల సంఘాలకు కూడా రెండేళ్లపాటు రూ.25 వేల చొప్పున మొత్తం రూ.50 వేలు ఇవ్వనుంది. రెండేళ్ల తర్వాత ప్రస్తుతం మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నట్లే వృద్ధుల సంఘాలకు బ్యాంకు రుణాలను ఇప్పించే అవకాశం ఉంది. ఈ వృద్ధుల సంఘాల్లో.. 60 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలు ఒకే సంఘంలోనే సభ్యులుగా కొనసాగవచ్చు. అయితే.. పురుషులు, మహిళల వేర్వేరు సంఘాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తారు. ఒక సంఘంలో కనీసం పదిమంది, గరిష్టంగా 20 మంది సభ్యులుగా కొనసాగవచ్చు. కొండ ప్రాంతాలతోపాటు ఇతర గిరిజన ప్రాంతాల్లో అత్యంత వెనుకబాటుతనంతో ఉండే 12 కులాలకు చెందిన వారైతే కనీసం ఐదుగురితోనే సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా 15 మండలాల్లో వృద్ధుల సంఘాల ఏర్పాటును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత దశలో క్రమంగా రాష్ట్రమంతా ఈ కార్యక్రమాలను విస్తరించనున్నారు. మూడు విభాగాలుగా.. సంఘాల ఏర్పాటుకు వృద్ధులను మూడు విభాగాలుగా విభజించారు. 1. తమ వ్యక్తిగత పనులు సొంతంగా చేసుకుంటూ, జీవనోపాధి కోసం ఇతర పనులు కూడా చేసుకునేవారు. 2. తమ పనులు మాత్రమే చేసుకుంటూ, ఇంకేమీ చేయలేని వారు. 3. వ్యక్తిగత పనులకు వేరే వాళ్లపై ఆధారపడే స్థితిలో ఉన్న వారు ► ప్రస్తుతం ప్రయోగాత్మకంగా మొదటి రెండు విభాగాల వారితో మాత్రమే సంఘాల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ సంఘాల ఏర్పాటు ఎందుకంటే.. ► వృద్ధాప్యంలో కూడా వారు సమాజంలో గౌరవంగా జీవించేహక్కును ప్రోత్సహించడం. ► కుటుంబ ఇబ్బందుల కారణంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు వారి మనసు బాగుండేలా సంఘ సభ్యులందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడాన్ని ప్రోత్సహించడం. ► వృద్ధాప్యంతో వచ్చే ఆరోగ్య సమస్యలపై పరస్పరం మాట్లాడుకోవడం ద్వారా వారిలో అవగాహన పెరిగేలా చూడటం. సాయం ఇలా.. ► వృద్ధులు సొంత ఆదాయం పెంచుకోవడానికి ఆసక్తి చూపితే వారికి ఆసక్తి ఉన్న అంశంలో శిక్షణ ఇచ్చి ముందుకెళ్లేందుకు సంఘాల వారీగా బ్యాంకు రుణం ఇప్పించే అవకాశం ఉంది. ► సంఘం ఏర్పాటు చేసినప్పుడు రూ. 5 వేలు, తర్వాత సభ్యులకు శిక్షణ కార్యక్రమాల సమయంలో రూ.5 వేలు, తొలి ఏడాది పెట్టుబడిగా మరో రూ.15 వేలు, రెండో ఏడాది రూ.25 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. 15 మండలాల్లో 3,017 సంఘాలు మహిళా పొదుపు సంఘాల ఏర్పాటు కార్యకలాపాలను పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలోనే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన 15 మండలాల్లో వృద్ధుల సంఘాల ఏర్పాటు కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది. ఆ 15 మండలాల్లో ఈ ఏడాది ప్రాథమికంగా 3,017 సంఘాలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటికే 1,048 సంఘాలు ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో మహిళా పొదుపు సంఘాల ఏర్పాటు ప్రక్రియలో పాల్గొనే గ్రామ సమాఖ్య అసిస్టెంట్ (వీవోఏ)ల ద్వారానే వృద్ధుల సంఘాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుంది. వృద్ధుల సంఘాల ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలో బాధ్యులుగా ఉన్న ఒక్కొక్కరికీ శిక్షణ ఇవ్వగా, ఆ తర్వాత స్థాయిలో ఎంపికచేసిన మండల సెర్ప్ సిబ్బందికి, ఆయా మండలాల పరిధిలోని గ్రామ సమాఖ్యల సిబ్బందికి, వీవోఏలకు ప్రభుత్వం ఒక దశ శిక్షణను కూడా పూర్తిచేసింది. గ్రామాల్లో వీవోఏలు వృద్ధులను కలిసి సంఘాల ఏర్పాటు ఉద్దేశం వివరించి, సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. -
ఉత్సాహంగా ‘ఓటీఎస్’
సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు బ్యాంకులు పెద్దఎత్తున రుణ సదుపాయాన్ని కల్పిస్తుండటంతో ఓటీఎస్ వినియోగించుకునేవారికి మరింత మేలు జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు ఓటీఎస్ ద్వారా క్లియర్ టైటిళ్లు పొందిన లబ్ధిదారులకు బ్యాంకులు భారీగా రుణ సదుపాయాన్ని కల్పించడం ప్రారంభించాయి. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు కనిష్టంగా రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఓటీఎస్ లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు అందజేస్తోంది. సోమవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గుంటూరు కార్పొరేషన్‌కు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం జగన్ చెక్కులు అందజేయడంతోపాటు పథకంపై సమీక్షించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, యూబీఐ చీఫ్ జనరల్ మేనేజర్ – ఎస్ఎల్బీసీ కన్వీనర్ వి. బ్రహ్మానందరెడ్డి, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ టి. కామేశ్వరరావు, ఆ బ్యాంకు ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. న్యాయ వివాదాలు లేకుండా స్థిరాస్తి గుంటూరు కార్పొరేషన్‌కు చెందిన ఈ లబ్ధిదారులు ఓటీఎస్ కింద కేవలం రూ.20 వేలు చెల్లించి క్లియర్ టైటిల్స్ పొందారు. ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా వారి చేతికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి. ఈ ఆస్తిని మళ్లీ బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.3 లక్షలు చొప్పున రుణం పొందారు. వారి కుటుంబాలు మరింత అభివృద్ధి చెందడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వల్ల జరుగుతున్న మంచికి ఇది చక్కటి ఉదాహరణ. బ్యాంకులు ఉత్సాహంగా ముందుకు వచ్చి ఓటీఎస్ లబ్ధిదారులకు రుణాలు ఇవ్వడం సంతోషకరం. రిజిస్ట్రేషన్ చార్జీలు.. స్టాంపు డ్యూటీ లేదు రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీని పూర్తిగా మినహాయించడం వల్ల ఒక్కో లబ్ధిదారుడికి రూ.15 వేల చొప్పున ప్రయోజనం చేకూరుతోంది. ఓటీఎస్ పథకం ద్వారా దాదాపు రూ.10 వేల కోట్ల రుణాలను మాఫీ చేయడమే కాకుండా స్టాంపు డ్యూటీ మినహాయింపు ద్వారా ఇప్పటివరకు మరో రూ.1,600 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. పేదల జీవితాల్లో గొప్ప మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. వారి కాళ్లమీద వారు నిలబడడానికి ఇవి దోహదం చేస్తాయి. వారి జీవితాల్లో గొప్ప మార్పులు వస్తాయి. ఓటీఎస్ లబ్ధిదారులకు నిర్ణీత కాలంలోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారులకు రుణాలు అందేలా చూడాలి. ఈ సదుపాయాన్ని అంతా వినియోగించుకోవాలి. భావి తరాలకు చక్కటి పునాదులు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా లబ్ధిదారుల ఆస్తికి క్లియర్ టైటిల్స్ ఇవ్వడం అభినందనీయం. సీఎం తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలు భవిష్యత్తు తరాలకు మంచి పునాదులు వేస్తున్నాయి. అధిక వడ్డీల బారిన పడకుండా మా బ్యాంకు సహకారం అందిస్తోంది. ముఖ్యమంత్రి పిలుపుతో మరింత మందికి రుణ సదుపాయం కల్పిస్తున్నాం. ఇది లబ్ధిదారుల జీవన ప్రమాణాలను పెంపొందిస్తుంది. ఇవాళ నలుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా రూ.11,75,000 రుణాలను అందచేస్తున్నాం. నాలుగు జిల్లాల్లో 228 బ్రాంచీలున్నాయి. ఓటీఎస్ లబ్ధిదారులు మా బ్యాంకు బ్రాంచీలను సంప్రదిస్తే రుణసేవలు అందిస్తాం. – టి.కామేశ్వర్రావు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ పేదలకు ఎంతో ప్రయోజనం ఓటీఎస్ లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఆలోచనతో ఎంతోమంది పేదలకు మేలు జరుగుతోంది. గతంలో డాక్యుమెంట్లు, తగిన సెక్యూరిటీ లేక రుణాల మంజూరులో సమస్యలు ఎదురయ్యేవి. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ద్వారా ప్రభుత్వం క్లియర్ టైటిల్స్‌తో ఇస్తోంది. బ్యాంకులకు ఇది గొప్ప అవకాశం. – వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్ఎల్బీసీ కన్వీనర్ -
హమ్మయ్యా!! బ్యాంక్ రుణాలు రికవరీ అవ్వనున్నాయ్, కారణం ఇదే?!
ఇదిలాఉండగా, భారత్ బ్యాంకింగ్ అవుట్‌లుక్ 2022–23 ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తన తాజా నివేదికలో పేర్కొంది. పటిష్ట రుణ డిమాండ్, బ్యాలన్స్ షీట్స్ అంచనాలు తమ విశ్లేషణకు కారణమని తెలిపింది. బ్యాంకింగ్ రుణ వృద్ధి 10 శాతంగా నమోదయ్యే వీలుందని కూడా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రేటును 8.4 శాతంగా అభిప్రాయపడింది. రుణాల్లో స్థూల మొండి బకాయిల నిష్పత్తి 6.1 శాతంగా ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు తగిన మూలధన నిల్వలు అందుబాటులో ఉంటాయని అభిప్రాయపడింది. అన్ని రంగాల్లో వృద్ధి, మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయాలు పెరగడం వంటి అంశాల నేపథ్యంలో రుణ రికవరీలు కూడా మెరుపడే వీలుందని తెలిపింది. ఇక రుణాలు, డిపాజిట్ల విషయంలో దిగ్గజ ప్రైవేటు బ్యాంకుల మార్కెట్ వాటా పెరుగుతుందని అంచనా వేసింది. మూలధనం, పోర్ట్‌ఫోలియో నిర్వహణల విషయంలో ప్రైవేటు బ్యాంకులు మంచి పనితీరును కనబరిచే అవకాశం ఉందని విశ్లేషించింది. కాగా, కార్పొరేట్ ఎన్పీఏలు 2020–21లో 10.8%గా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10.4 శాతానికి తగ్గే వీలుందని అభిప్రాయపడింది. 2022–23లో రిటైల్ రంగంలో ఒత్తిడిలో ఉన్న రుణాలు 4.9 శాతానికి తగ్గుతాయని, ఎంఎస్ఎంఈ పరిశ్రమల్లో ఈ పరిమాణం 16.7 శాతానికి పెరుగుతుందన్నది సంస్థ అంచనా. కార్పొరేట్ రంగం విషయంలో ఈ రేటు 10.3 శాతానికి దిగివస్తుందని పేర్కొంది. -
విద్యుత్ సంస్థలపై కేంద్రం ఆంక్షల కత్తి
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. విద్యుత్ నియమావళి సవరణ ముసాయిదాకు అదనంగా కొన్ని నిబంధనలు చేర్చింది. దేశ వ్యాప్తంగా మొండి బకాయిలు పెరిగిపోయాయనే కారణంతో ఇకపై రుణాలు పొందడాన్ని కఠినతరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తేనే డబ్బులిస్తామని, అది కూడా పాత బకాయిలు చెల్లించిన వారికేనని షరతు విధించింది. విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించకుండా డిస్కంలు విద్యుత్‌ను పొందడంపైనా ఆంక్షలు విధించనుంది. సకాలంలో చెల్లింపులన్నీ పూర్తి చేసిన సంస్థలు మాత్రం 0.5 శాతం అదనంగా రుణాలు పొందవచ్చంటూ అనుమతినిచ్చింది. దేశవ్యాప్తంగా ఇదీ పరిస్థితి.. కేంద్ర విద్యుత్ శాఖ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తాలు రూ.71,865 కోట్లకు చేరాయి. ప్రభుత్వ విభాగాల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు రూ.52,052 కోట్లు ఉన్నాయి. ఏటా నష్టాల వల్ల పెట్టుబడులు పెట్టిన ఆర్థిక సంస్థలు, బ్యాంకులకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. 2019–20లో డిస్కంల మొత్తం టర్నోవర్ రూ.7,28,975 కోట్లలో రూ.5,14,232 కోట్లు అప్పులే ఉన్నాయి. అంతేకాకుండా ట్రాన్స్‌కో, జెన్కోలకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అది రూ.93,585 కోట్లుగా ఉంది. డిస్కంలకు ప్రభుత్వాల నుంచి రావాల్సిన సబ్సిడీ ఆదాయం సగటున 16.5 శాతం ఉంది. నిజానికి కొన్ని రాష్ట్రాల్లో ఇది 30 నుంచి 41 శాతం వరకూ ఉండటం వాటి మనుగడకు ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల విద్యుత్ నియమావళి సవరణ ముసాయిదాను కేంద్రం విడుదల చేసింది. ముసాయిదాను అనుసరించాలి.. ఈ ముసాయిదా ప్రకారం డిస్కంలకు కేంద్రం కొన్ని నిబంధనలు ప్రతిపాదించింది. విద్యుత్ కొనుగోలు చేసిన 45 రోజుల్లోగా జెన్కోలకు డిస్కంలు నగదు చెల్లించాలి. కనీసం 75 రోజుల్లోనైనా బిల్లు క్లియర్ చేయాలి. లేదంటే తొలుత 25 శాతం విద్యుత్ తగ్గిస్తారు. అప్పటికీ చెల్లించకుంటే వంద శాతం తగ్గించడమే కాకుండా బయట మరెక్కడా కొనుగోలు చేయడానికి వీలు లేకుండా కట్టడి చేస్తారు. పాత బకాయిలను మాత్రం 6 నుంచి 24 నెలలలోపు వాయిదాల్లో చెల్లించవచ్చు. ఇవి పూర్తిగా చెల్లిస్తే ఆంక్షలన్నీ ఎత్తివేసి యధావిధిగా విద్యుత్ కొనుగోలుకు అనుమతిస్తారు. జనవరి 10వ తేదీలోగా ఈ ముసాయిదాపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసే సమయంలో ఈ నిబంధనలన్నిటినీ తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈమేరకు నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని సూచిస్తూ బ్యాంకర్లకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి తాజాగా లేఖలు రాశారు. బ్యాంకర్లకు కేంద్రం ప్రధాన సూచనలు.. ► డిస్కంల ఆడిట్ లెక్కలన్నీ ఏటా పక్కాగా ఉండాలి. ► విద్యుత్ చార్జీల టారిఫ్ పిటిషన్లు ఏటా నవంబర్ 30లోగా సమర్పించాలి. ► ఏటా ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్ అమలులోకి తీసుకురావాలి. ► 2019 ఏప్రిల్ 1వతేదీ నాటికి ఉన్న సబ్సిడీలన్నీ క్లియర్ చేయాలి. ► మొత్తం ఆదాయంలో వర్కింగ్ క్యాపిటల్ 25 శాతానికి మించకూడదు. ► రాష్ట్ర ప్రభుత్వ విభాగాల నుంచి ఎటువంటి బకాయిలు ఉండకూడదు. ► పాత బకాయిల చెల్లింపులకు 12 నెలవారీ వాయిదాల వరకూ అవకాశం. ► బ్యాంకులు లేదా విద్యుత్ ఆర్థిక సంస్థలకు డిస్కంలు డిఫాల్టర్ కారాదు. -
పిల్లల్ని కంటే రుణాలిస్తాం
బీజింగ్: ఒకప్పుడు చైనా అంటే జనాభా విస్ఫోటనం. దీన్ని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం పలు కఠిన నియమాలు తెచ్చింది. అవన్నీ ఫలితాలివ్వడంతో చాలావరకు జనన రేటు అదుపులోకి వచ్చింది. ఈ ప్రయత్నాలు క్రమంగా ఆదేశ జనాభా తరుగుదలకు, ముఖ్యంగా యువత సంఖ్య తగ్గేందుకు కారణమయ్యాయి. ప్రమాదాన్ని ఊహించిన ప్రభుత్వం ప్రస్తుతం మరింతమందిని కనేందుకు ప్రోత్సాహాలిస్తోంది. ఈ కోవలోనే జిలిన్ ప్రావిన్సు కొత్త పథకం ప్రకటించింది. పెళ్లైన వారు పిల్లలు కనాలనుకుంటే వారికి 2 లక్షల యువాన్ల(సుమారు రూ. 25 లక్షలు) బ్యాంకు రుణాలిప్పిస్తామని ప్రకటించింది. చిన్నాచితకా వ్యాపారాలు నడిపే జంటలకు ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమంది పిల్లలుంటే వారి వ్యాపారాలపై పన్నుల్లో తగ్గింపులు, మినహాయింపులు ఇస్తామని ప్రకటించింది. -
వరికి రుణంపై కిరికిరి..
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో వరిసాగుపై కొనసాగుతున్న సందిగ్ధత పంట రుణాలపై ప్రభావం చూపిస్తోంది. కొన్నిచోట్ల బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. వరి వేయొద్దని ప్రభుత్వం చెబుతుం టే, ఆ పంటకు తాము రుణం ఎలా ఇస్తామని బ్యాంకు అధికారులు ప్రశ్ని స్తున్నారు. ఇతర పంటలు వేస్తే ఇస్తామంటున్నారు. ఒకపక్క వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు యాసంగిలో రైతులకు వరి విత్తనాలు అమ్మొద్దంటూ కంపెనీలను హెచ్చరిస్తున్నారు. అమ్మితే లైసెన్సులు రద్దు చేస్తామంటూ డీలర్లకు వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఉన్నతస్థాయి ఆదేశాలు ఏవీ రాకపోయినా, అక్కడక్కడ కొందరు బ్యాంకర్లు ఇలా వ్యవహరించడంపై వ్యవసాయ శాఖకు ఫిర్యాదులు వస్తున్నాయి. స్పష్టత లేకపోవడంతో.. యాసంగి ప్రారంభమై రెండు నెలలు కావొస్తోంది. ఈ సీజన్లో వరి వేయవద్దని, మిల్లర్లతో ఒప్పందాలు చేసుకున్నవారు మాత్రమే వేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. కానీ వ్యవసాయ శాఖ ఇప్పటివరకు ఎలాంటి పంటల ప్రణాళిక విడుదల చేయలేదు. గత యాసంగిలో ఏకంగా 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అయితే ఈసారి వరి వద్దంటున్న ప్రభుత్వం.. సాగు విస్తీర్ణం ఎంతమేరకు తగ్గించనుందో స్పష్టత ఇవ్వలేదు. దీంతో రైతులు, బ్యాంకర్లలో అయోమయం నెలకొంది. ప్రత్యామ్నాయ పంటలు వేయాలటూ కొన్ని పంటలను సర్కారు సూచించినా.. ఆయా విత్తనాలు సరిపడా సరఫరా చేసే పరిస్థితి లేదు. ఈ విషయంపై రైతులు అడుగుతున్నా ఏఈవోలు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్రస్తుత పరిస్థితి పంట రుణాల మంజూరుపైనా ప్రభావం చూపిస్తోంది. వారం పదిరోజుల్లో వరినాట్లు! 2021–22 రెండు సీజన్లలో రూ.59,440 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ఈ వానాకాలం సీజన్ లక్ష్యం రూ. 35,665 కోట్లు కాగా, యాసంగిలో రూ.23,775 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ యాసంగిలో ఇప్పటివరకు రూ.4,755 కోట్ల (20%) వరకు మాత్రమే పంట రుణాలు ఇచ్చారని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. పంటల సాగుపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చాక రుణాలు ఇస్తామని బ్యాంకర్లు చెబుతున్నారని కొన్ని ప్రాంతాల రైతులు వాపోతున్నారు. వచ్చేనెల మొదటి వారం అంటే వారం పది రోజుల్లో వరి నాట్లు మొదలవ్వాల్సి ఉండగా.. ఇప్పటికీ రుణాలు ఇవ్వకపోతే ఎలాగని రైతులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులు సహకరించకపోవడంతో చాలాచోట్ల రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పంట రుణాల మంజూరును ఎప్పటికప్పుడు సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాల్సిన వ్యవసాయ శాఖ యంత్రాంగం పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలపైనా.. వరికి బదులు ప్రభుత్వం వేరుశనగ, శనగ, పెసర, మినుములు, ఆవాలు, నువ్వులు, కుసుమలు, ఆముదాలు, పొద్దుతిరుగుడుతో పాటు జొన్న సాగు చేయాలని చెబుతోంది. అయితే ఏపంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలో ఇప్పటివరకు చెప్పలేదు. సబ్సిడీ విత్తనాలు ఇవ్వలేదు. ఇతర ఏర్పాట్లు ఏవీ చేయలేదు. ఎరువులూ సరిపడా సరఫరా కాలేదు. ఇలా యాసంగి సీజన్ మొత్తం గందరగోళంగా, రైతుకు పరీక్షగా మారింది. -
తీరు మారింది, లోన్ల కోసం బ్యాంకులు చుట్టూ తిరగడం మానేశారు
న్యూఢిల్లీ: రుణం తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్లడం, పేపర్లకు పేపర్లు నింపి సంతకాలు చేయడం వంటి సాంప్రదాయక ‘ఆఫ్‌లైన్’ విధానాలకు రుణ గ్రహీతలు క్రమంగా దూరం అవుతున్నారు. రుణం పొందేందుకు ఆఫ్‌లైన్ ద్వారా కాకుండా ఆన్‌లైన్‌కు మొగ్గుచూపే కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రత్యేకించి మిలీనియల్స్ (1977 నుంచి 1995 మధ్య జన్మించిన వారు) ఈ విషయంలో ముందు ఉంటున్నారు. పలు సంవత్సరాల నుంచీ మొదలైన ఈ వైఖరి కోవిడ్–19 సవాళ్లతో మరింత వేగం పుంజుకుంది. డిజిటల్ సేవలు విస్తరించడం కూడా ఈ విషయంలో కలిసి వస్తున్న ఒక అంశం. ఆయా అంశాలపై ఆర్థిక సంస్థ– హోమ్ క్రెడిట్ ఇండియా నిర్వహించిన వార్షిక సర్వే ’హౌ ఇండియా బారోస్’ (హెచ్ఐబీ) తెలిపిన అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి... ►దాదాపు 40 శాతం మంది రుణగ్రహీతలు రుణాలు తీసుకోవడానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై సుముఖత వ్యక్తం చేశారు. ఇటీవల వరకూ ఇది కేవలం 15 శాతంగా ఉండేది. ►హైదరాబాద్‌సహా ఢిల్లీ, జైపూర్, బెంగళూరు, భోపాల్, ముంబై, కోల్‌కతా, పాట్నా, రాంచీల్లో ఈ అధ్యయనం జరిగింది. 21–45 సంవత్సరాల వయస్సు మధ్య వయస్సువారు 1,200 మంది (హోమ్ క్రెడిట్ కస్టమర్లు) సర్వేలో పాల్గొన్నారు. వీరందరూ నెలకు రూ. 30,000 కంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్నారు. ►గత సంవత్సరంతో పోల్చితే 2021లో గృహ వ్యయాల కోసం తీసుకునే రుణాలు గణనీయంగా తగ్గాయి. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం దీనికి కారణం. రుణ గ్రహీత అవసరాల ఆధారిత రుణం నుండి కోరిక ఆధారిత రుణాల వైపు మొగ్గుచూపడం పెరుగుతుండడం కనిపిస్తోంది. ►మొత్తం రుణ గ్రహీతల్లో 28 శాతం మంది వ్యాపారం ఏర్పాటు లేదా విస్తరణకు సంబంధించి రుణాలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత చిన్న రుణాలు తీసుకునే వారు 26 శాతం మంది ఉన్నారు. వీటిలో అధికంగా రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు, కండీషనర్లు, కన్జూమర్ డ్యూరబుల్స్ కొనుగోళ్లు ఉన్నాయి. మిగిలిన వాటిలో గృహ పునరుద్ధరణ, కొత్త నిర్మాణం (13 శాతం), వైద్య అత్యవసర పరిస్థితి (2 శాతం), వాహన రుణం (9 శాతం), వివాహం (3 శాతం), విద్యా రుణం (2 శాతం), పెట్టుబడులు, మునుపటి రుణం చెల్లింపుల (1 శాతం) వంటివి ఉన్నాయి. ►ప్రాంతీయంగా చూస్తే, బెంగుళూరు, హైదరాబాద్ కరోనా మహమ్మారి సవాళ్ల నుండి వేగంగా కోలుకుంటున్నాయి. హైదరాబాద్‌లో 41 శాతం (సర్వేలో పాల్గొన్న వారిలో) మంది వ్యాపార పునరుద్ధరణ కోసం రుణాలు తీసుకున్నారు. బెంగళూరు విషయానికి వస్తే, కొనుగోలు కోసం రుణం తీసుకున్న వారు 42 శాతం మంది ఉన్నారు. ►ఇంటర్నెట్ సౌలభ్యం అందుతున్న ప్రజల విషయానికి వస్తే, బిహార్, జార్ఖండ్‌లు వరుసగా 24 శాతం, 29 శాతంతో చివరి స్థానంలో ఉన్నాయి. కాగా పాట్నా, రాంచీలలో మొబైల్ ఫోన్ల వినియోగం పరంగా డిజిటల్ అక్షరాస్యత వరుసగా 64 శాతం మరియు 65 శాతంగా నమోదైంది. చదవండి: దేశంలో క్రిప్టో చట్టబద్ధత ఖాయం! -
టీఎస్ఆర్టీసీ: ప్రభుత్వ పూచీకత్తు లేకుండానే రూ.300 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీపై దివాలా ముద్ర క్రమంగా సమసిపోతోంది. ఇటీవలి వరకు అప్పు పుట్టడమే గగనంగా ఉన్న తరుణంలో ఓ జాతీయ బ్యాంకు ఆర్టీసీకి రూ.300 కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అది కూడా ప్రభుత్వ పూచీకత్తు లేకుండానే. కొన్నేళ్లుగా ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చినా కూడా అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు తటపటాయించిన తరుణంలో ఇప్పుడు ఏ పూచీకత్తుతో సంబంధం లేకుండా ఆర్టీసీ ఆస్తులపై తనఖా రుణం ఇచ్చేందుకు అంగీకరించడం విశేషం. చదవండి: రైతులు భిక్షగాళ్లు కాదు..పరిహార వారి హక్కు: హైకోర్టు నగరంలో పక్కపక్కనే ఉన్న జంట డిపోల అధీనంలో ఉన్న 10 ఎకరాల స్థలాన్ని తనఖా పెట్టుకుని ఈ రుణం ఇవ్వనుంది. కొద్దిరోజులుగా ఆర్టీసీ కార్యకలాపాలు చురుగ్గా సాగటం, కొత్తగా వచ్చిన ఎండీ సజ్జనార్ ఆర్టీసీ దిశ మార్చేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతుండటం, రోజువారీ ఆదాయం పెరుగుతూ ఉండటంతో బ్యాంకులు రుణం ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఓ బ్యాంక్ రూ.300 కోట్ల రుణం ఇచ్చేందుకు రెండుమూడు రోజుల్లో అధికారిక ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈమేరకు అధికారిక లేఖను కూడా అందించినట్టు తెలిసింది. ప్రతిపనికీ ప్రభుత్వంపై ఆధారపడే దుస్థితి నుంచి సంస్థను బలోపేతం చేసుకోవడం ద్వారా సొంతంగా వనరులు సమకూర్చుకోవాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలను ఆర్టీసీ అమల్లోకి తెస్తున్నట్టు కనిపిస్తోంది. చదవండి: డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా.. బస్సు చార్జీల సవరణ! పూచీకత్తు రుణం కొలిక్కి రాకపోవటంతో.. మూడు నెలల క్రితం ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల రుణం కోసం ఆర్టీసీకి పూచీకత్తు ఇచ్చింది. ఆ జాతీయ బ్యాంకుతో చర్చలు జరగ్గా, స్థానిక అధికారులు సరేనన్నా, ఆ బ్యాంకు కేంద్రస్థాయి అధికారులు ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగాలేనందున తిరస్కరించారు. చివరకు అందులో సగం నిధులు విడుదల చేశారు. దీంతో మిగతా ఐదొందల కోట్ల కోసం మరికొన్ని బ్యాంకుల చుట్టూ తిరిగితే తప్ప రాలేదు. ఆ తర్వాత బడ్జెట్ కేటాయింపుల ఆధారంగా మరో రూ.500 కోట్లకు ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చింది. ఆ మొత్తాన్ని కేవలం ఆర్టీసీ సహకార పరపతి సంఘం బకాయిలు తీర్చేందుకే వినియోగించాలని నిర్ణయించిన ఆర్టీసీ.. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో చర్చించింది. ఆ సంస్థ అందుకు అంగీకరించినా.. ఇప్పటివరకు పూచీకత్తు లేఖ ఆ సంస్థకు అందలేదు. దీంతో ఆ రుణం రాలేదు. ఇప్పుడు దాని బదులు స్వయంగా ఆర్టీసీనే ప్రభుత్వ పూచీకత్తు లేకుండా రుణం పొందనుంది. సహకార పరపతి సంఘానికే.. ఆర్టీసీ ఉద్యోగులు ప్రతినెలా 7 శాతం మొత్తాన్ని తమ జీతాల నుంచి జమ చేస్తూ ఏర్పాటు చేసుకున్న ఆర్టీసీ సహకార పరపతి సంఘాని (సీసీఎస్)కి ఈ 300 కోట్ల నిధులు కేటాయించనున్నారు. సీసీఎస్ నిధులను ఆర్టీసీ సొంతానికి వాడుకోవడంతో అందులో నిధులు కరిగిపోయాయి. దాదాపు రూ.వెయ్యి కోట్లను ఆర్టీసీ వాడేసుకోవడంతో ఉద్యోగుల ఇంటి అవసరాలకు రుణాలు పొందే వీల్లేకుండా పోయింది. క్రమంగా సీసీఎస్ సభ్యత్వాన్ని రద్దు చేసుకోవడం ద్వారా, ఇంతకాలం అందులో జమచేసుకున్న మొత్తాన్ని తీసుకోవాలని పోటీపడుతుండంతో సీసీఎస్ మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఈనేపథ్యంలో దాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో కొన్ని బకాయిలు తీర్చాలని ఎండీ సజ్జనార్ నిర్ణయించారు. దీంతో ఏడాది కాలంగా పెండింగులో ఉన్న రుణ దరఖాస్తులన్నింటినీ క్లియర్ చేసే అవకాశం ఉంది. సీసీఎస్‌తో తెగదెంపులు చేసుకునేందుకు దరఖాస్తులు సమర్పించినవారు ఇప్పుడు ఉపసంహరించుకునేందుకు ముందుకొస్తున్నారు. -
ఈక్విటీ మార్కెట్ల మద్దతు ఒక్కటే చాలదు
ముంబై: సుస్థిరమైన ఆర్థిక వృద్ధికి ఒక్కఈక్విటీ మార్కెట్ల మద్దతే చాలదని.. బ్యాంకు రుణాల మాదిరి డెట్ మార్కెట్లు సైతం బలంగా ఉండాలన్న అభిప్రాయాన్ని ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ వ్యక్తం చేశారు. బ్యాంకులు బ్యాలన్స్ షీట్లను శుద్ధి చేసుకున్నాయని.. అవి ఇప్పుడిక ఆర్థిక వృద్ధికి మద్దతుగా రుణ వితరణను వేగవంతం చేయాలని సూచించారు. బ్యాంకింగేతర రుణ సంస్థల లాబీ గ్రూపు ఎఫ్ఐడీసీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సంజీవ్ సన్యాల్ మాట్లాడారు. ‘‘ఆర్థిక చరిత్రను పరిశీలించినట్టయితే.. దీర్ఘకాలంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధి స్థిరంగా కొనసాగడం అన్నది ఒక్క ఈక్విటీ మార్కెట్ల నిధుల చేదోడుతోనే సాధ్యం కాలేదు. డెట్ క్యాపిటల్ (రుణాలు) మద్దతుతో ఇది సాధ్యమైంది. ఎక్కువ మొత్తం బ్యాంకుల నుంచి నిధుల సాయం అందుతోంది’’ అని సన్యాల్ పేర్కొన్నారు. ఈక్విటీ మార్కెట్ల ద్వారా నిధుల సమీకరణ మార్గం మెరుగ్గానే ఉందన్న ఆయన.. అదే సమయంలో డెట్ మా ర్కెట్ చెడ్డగా ఏమీ లేదన్నారు. పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ అవసరం ‘‘భారత్ ఆర్థిక వృద్ధి కొన్ని దశాబ్దాల పాటు సుస్థిరంగా కొనసాగాలంటే అందుకు.. ప్రస్తుతమున్న దానితో పోలిస్తే అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ కావాలి. బ్యాంకులు తమ రుణ వితరణ కార్యకలాపాలను విస్తరించాలి’’ అని సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు. బ్యాంకులు ఎన్నో ఏళ్ల పాటు బ్యాలన్స్‌షీట్లను ప్రక్షాళన చేసుకున్నందున అవి తమ రుణ పుస్తకాన్ని మరింత విస్తరించుకోవడానికి అనుకూలతలు ఉన్నాయని చెప్పారు. చైనా జీడీపీ సైతం బ్యాంకు బ్యాలన్స్ షీట్ల విస్తరణ మద్దతుతో మూడు దశాబ్దాల కాలలో బలమైన వృద్ధిని చూసినట్లు పేర్కొన్నారు. చదవండి: ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టం -
రుణాల ఎగవేత: కార్వీ ఎండీ పార్థసారథి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాలను ఎగవేశారనే ఆరోపణల నేపథ్యంలో కార్వీ ఎండీ పార్థసారధి అరెస్టయ్యారు. రూ.780 కోట్ల రుణాల ఎగవేత కేసులో సీసీఎస్ పోలీసుల గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ బ్యాంకుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. కార్వీ షేర్లను తనఖా పెట్టి వివిధ బ్యాంకుల వద్ద పార్థసారధి రుణాలు స్వీకరించారు. హెచ్‌డీఎఫ్‌సీలో రూ.340 కోట్లు, ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో రూ.137 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీలో మరో రూ.7 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ రుణాలను అక్రమంగా వినియోగించుకున్నారని బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. ఆయనను నాంపల్లిలోని కోర్టులో హాజరుపరిచారు. కార్విపై గతంలో సెబీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీసీఎస్ పోలీసులతో పాటు ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్ట్ గేషన్ దర్యాప్తు చేయనున్నాయి. దేశవ్యాప్తంగా కార్వీ స్టాక్ బ్రోకింగ్‌కు లక్షలాది మంది వినియోగదారులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వేల కోట్ల పెట్టుబడులు వినియోగదారులు పెట్టారు. కస్టమర్ల షేర్లను ఎండీ పార్థసారథిరెడ్డి బ్యాంకులకు తనఖా పెట్టడంతో బ్యాంకులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే అతడిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’ చదవండి: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా మారిన ‘బుల్లెట్టు బండి’ వధువు -
ఆయన మంత్రి కాదు.. సీడీల బాబా.. అనేక మంది రాసలీలల..
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న మంత్రి మురుగేశ్ నిరాణి వద్ద ఐదు వందల సీడీలు ఉన్నట్లు సామాజిక కార్యకర్త ఆలం పాషా ఆరోపించారు. ఆయన మంగళవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. మురుగేశ్ నిరాణి వద్ద ఐదు వందల సీడీలున్నాయి. అందులో ఎవరివైనా ఉండవచ్చన్నారు. మురుగేశ్‌ను సీడీ బాబా అని వర్ణిస్తూ అనేక మంది రాసలీల సీడీలు ఆయన వద్ద ఉన్నాయన్నారు. నకిలీ పేర్లతో ఆయన బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నారని అన్నారు. -
ముగ్గురు యువకులు, మాటలతో మాయ.. ఆపై
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ మొదటి వేవ్ ప్రభావంతో అమలైన లాక్డౌన్లో ఉద్యోగాలు కోల్పోయిన ముగ్గురు యువకులు నేరబాట పట్టారు. రుణాల పేరుతో ఎర వేసి డబ్బులు స్వాహా చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన బాధితుడి ఫిర్యాదుతో సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ పర్యవేక్షణలో దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి ఈ త్రయాన్ని అరెస్టు చేసి మంగళవారం నగరానికి తీసుకువచ్చారు. కాల్సెంటర్లో పని చేసి.. ► ఢిల్లీకి చెందిన విజయ్ ధావన్, కపిల్ ఠాకూర్, అభయ్ వర్మ డిగ్రీలు పూర్తి చేసి అక్కడి ఓ కాల్ సెంటర్లో టెలీ కాలర్లుగా పని చేశారు. స్నేహితులుగా మారిన ఈ ముగ్గురు గతేడాది లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. దీంతో సైబర్ నేరాలు చేయాలని నిర్ణయించుకున్న వీరు తమకు తెలిసిన టెలీ కాలింగ్ విధానాన్నే ఎంచుకుని రంగంలోకి దిగారు. బోగస్ కాల్ సెంటర్ ఏర్పాటు చేయడానికి అవసరమైన డబ్బు కూడా లేకపోవడంతో అవివాహితుడైన విజయ్ ఇంట్లోనే సెట్ చేసింది. అక్కడ నుంచి దేశ వ్యాప్తంగా పలువురికి కాల్స్ చేస్తూ బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులుగా చెప్పుకొన్నారు. ► సికింద్రాబాద్ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి వీరి వలలో పడ్డాడు. ఇతడికి ఫోన్ చేసిన కేటుగాళ్లు తక్కువ వడ్డీకి రూ.10 లక్షల రుణం ఇస్తామంటూ ఎర వేశారు. రుణం దరఖాస్తు కోసమంటూ బాధితుడి నుంచి కొన్ని గుర్తింపు పత్రాలు వాట్సాప్ ద్వారా సేకరించారు. ఆపై రుణం మంజూరైందని చెబుతూ.. కొన్ని చార్జీలు చెల్లించాలంటూ అతడి వద్ద నుంచి డబ్బు వసూలు చేశారు. లోన్ మొత్తం బ్యాంకు ఖాతాలో పడాలంటే ముందుగా మూడు కిస్తీలు అడ్వాన్స్‌గా చెల్లించాలని మరికొంత గుంజారు. చెల్లిస్తున్న చార్జీల్లో కొన్ని రిఫండ్ వస్తాయంటూ చెప్పడంతో సికింద్రాబాద్ వాసి డబ్బు చెల్లిస్తూ పోయారు. ► ఇలా రూ.9,44,351 చెల్లించినా తన ఖాతాలో డబ్బు పడకపోవడం, మరికొంత చెల్లించాలంటూ సైబర్ నేరగాళ్లు కోరడంతో బాధితుడు అనుమానించారు. ఈ ఏడాది జూన్‌లో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన అధికారుల సాంకేతిక ఆధారాలతో నిందితులు ఢిల్లీలో ఉన్న ట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం ముగ్గురినీ అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.2 లక్షల నగదు, 8 సెల్ఫోన్లు, మోసాలు చేయడానికే తెరిచిన పది బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పాస్‌బుక్స్, చెక్‌బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణలో వీళ్లు ఎంత మందిని మోసం చేశారో తెలుసుకోనున్నారు. -
కరోనా ఫండ్‌తో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా
వాషింగ్టన్: కరోనా ముప్పేట దాడితో అమెరికా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కోట్లాది మందిపై కరోనా ప్రభావం తీవ్రంగా చూపింది. ఈ క్రమంలోనే కరోనా వ్యాప్తితో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో ఓ యువకుడికి ఉపాధి అవకాశం పోయింది. నిరుద్యోగిగా మారిపోయాడు. అయితే కరోనా వలన నష్టపోయిన వారికి అక్కడి ప్రభుత్వం ప్రోత్సహాకాలు, రుణాలు తదితర సౌకర్యాలు కల్పించి వారు తిరిగి స్థిరపడేలా అవకాశం కల్పించింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఓ యువకుడు విలాసవంత జీవితానికి అలవాటు పడ్డాడు. కరోనా లోన్లు తీసుకుని ఏకంగా ఖరీదైన కార్లు కొనుగోలు చేశాడు. కాలిఫోర్నియాకు చెందిన యువకుడు ముస్తఫా ఖాద్రీ కరోనా కారణంగా ఉపాధి కోల్పోయాడు. అయితే ప్రభుత్వం చిన్న వ్యాపారులకు సహాయం ప్రకటించింది. ఈ సహాయాన్ని పొంది ముస్తఫా విలాసవంతమైన కార్లు కొనుగోలు చేశాడు. ఏకంగా 50 లక్షల కోవిడ్ సహాయ నిధిని సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నాడు. తనకు ఒక కంపెనీ ఉందని.. కరోనా వలన నష్టపోయినట్లు సహాయం కోసం దరఖాస్తు పంపాడు. ఆ దరఖాస్తులకు సమర్పించివన్నీ నకిలీవే. అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పే చెక్ ప్రొటెక్షన్’ కార్యక్రమంతో ముస్తఫా లబ్ధి పొందాడు. బ్యాంక్‌లకు వెళ్లి లక్షల రూపాయల రుణం పొందాడు. నకిలీ చెక్కులు, ఐటీ రిటర్న్‌లు సమర్పించి మూడు బ్యాంకులను మోసగించాడు. దీనిపై ఫిర్యాదు రాగా పోలీసులు విచారణ చేపట్టారు. తీరా అతడి వద్దకు వెళ్లగా పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే ముస్తఫా వద్ద ఖరీదైన లంబోర్గిని, ఫెరారీ కార్లు కనిపించాయి. విచారణ చేపట్టగా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంతో ఆ కార్లు కొనుగోలు చేశాడని తెలిసి అవాక్కయ్యారు. ముస్తఫాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న కార్లు, బ్యాంక్ ఖాతాలో ఉన్న 20 లక్షల డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: తుపాకీకి భయపడి బిల్డింగ్ దూకిన చిన్నారులు తెలంగాణతో పాటు లాక్డౌన్ విధించిన రాష్ట్రాలు ఇవే! -
‘పరపతి’ పెంచుకున్న అక్కచెల్లెమ్మలు
సాక్షి, అమరావతి: స్వయం సహాయక సంఘాల్లోని మహిళల పరపతి పెరుగుతోంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న పొదుపు సంఘాల మహిళలు ఇప్పుడు క్రమం తప్పకుండా రుణ వాయిదాలు చెల్లిస్తున్నారు. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా మారినా సకాలంలో వాయిదాలు చెల్లించే మహిళల సంఖ్య అంతకు ముందు సంవత్సరం కంటే దాదాపు 6 లక్షలు పెరిగినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధికారులు నిర్ధారించారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 8,78,874 సంఘాల పేరిట తీసుకున్న రుణాలకు సంబంధించి ఆయా సంఘాల్లో సభ్యులుగా ఉండే మహిళలు సక్రమంగా వాయిదాలు చెల్లించగా.. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 9,34,852 సంఘాలకు చెందిన మహిళలు సకాలంలో రుణ కిస్తీ చెల్లించినట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. తెలుగుదేశం ప్రభుత్వం నాటి పరిస్థితులతో పోలిస్తే 20 లక్షల మందికి పైగా మహిళలు సక్రమంగా రుణ కిస్తీలు చెల్లిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సున్నా వడ్డీ, వైఎస్సార్ ఆసరా పథకాలతో... గత టీడీపీ ప్రభుత్వ నిర్ణయాల కారణంగా సంఘాల్లో ప్రతి నెలా చేసుకోవాల్సిన పొదుపును కూడా మహిళలు పూర్తిగా పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి దాపురించింది. దీంతో కొంత కాలంపాటు రాష్ట్రంలో డ్వాక్రా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కొక్కటిగా చేపట్టిన చర్యలతో మహిళలు మళ్లీ పొదుపు సంఘాల కార్యకలాపాలలో క్రియాశీలకంగా పాల్గొనడం పెరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. పొదుపు సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై వడ్డీని ప్రభుత్వం ఏటా క్రమం తప్పకుండా చెల్లించడంతో పాటు పొదుపు రుణ వ్యవహారాలు యథావిధిగా కొనసాగేలా చర్యలు చేపట్టారు. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న రుణ మొత్తాలను నాలుగు విడతల్లో మహిళలకు నేరుగా చెల్లించే వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పటివరకు వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ పథకాల ద్వారానే పొదుపు సంఘాల మహిళలకు దాదాపు రూ.10 వేల కోట్ల మేర ఆర్థిక లబ్ధి చేకూరింది. ఈ చర్యలన్నీ సత్ఫలితాలు ఇవ్వడం మొదలు పెట్టాయి. లక్ష సంఘాలకు రూ.10 లక్షలపైగా రుణాలు ముందెన్నడూ లేనంత ఎక్కువ స్థాయిలో పొదుపు సంఘాల మహిళలు సకాలంలో రుణ కిస్తీలు చెల్లిస్తుండటంతో బ్యాంకులు ఇప్పుడు ఒక్కొక్క పొదుపు సంఘానికి రూ.10 లక్షలకు పైబడి కూడా రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పుడు దాదాపు లక్ష సంఘాలకు రూ.10 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం రుణంగా ఇవ్వడానికి బ్యాంకులు ముందుకొచ్చాయని సెర్ప్ అధికారులు వెల్లడించారు. -
కిసాన్ క్రెడిట్.. రూ.7,362 కోట్లు
సాక్షి, అమరావతి: కోవిడ్–19 లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ కింద.. కిసాన్ క్రెడిట్ కార్డులపై రాష్ట్రంలో పంట రుణాలు, మత్స్య, పశు సంవర్ధక రంగాలకు కలిపి బ్యాంకులు ఇప్పటివరకు రూ.7,362.38 కోట్ల మేర రుణాలు మంజూరు చేశాయి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. లాక్డౌన్ నేపథ్యంలో మందగించిన ఆర్ధిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు, అలాగే రైతులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా కిసాన్ క్రెడిట్ కార్డులపై పంట రుణాలను మంజూరు చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఉద్దేశంతో కేంద్రం ఈ ప్యాకేజీ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా కిసాన్ క్రెడిట్ కార్డులపై 2.50 కోట్ల మంది రైతులకు పంట రుణాలను మంజూరు చేయించాలని లక్ష్యంగా నిర్ధారించింది. అలాగే దేశ వ్యాప్తంగా 1.50 కోట్ల మంది డెయిరీ రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను మంజూరు చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించింది. దీంతో గత ఏడాది జూన్ 1వ తేదీ నుంచి నవంబర్ 13వ తేదీ వరకు రాష్ట్రంలో ఆత్మ నిర్భర్ అభియాన్ ప్యాకేజీ కింద 7,66,827 దరఖాస్తులు అందాయి. ఇందులో అర్హత గల దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు పంపించి రుణాలు మంజూరు చేయించడానికి ప్రాధాన్యత ఇచ్చింది. ప్యాకేజీ కింద వీలైనంత ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం కల్పించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టగా బ్యాంకులు సైతం సానుకూలంగా స్పందించాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంతో పాటు పాడి, మత్స్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తుండడంతో బ్యాంకులు కూడా ఆయా రంగాలకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. -
జనం ఆస్తికి అధికారిక ముద్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో యజమానులకు ఇప్పటివరకు వాడుకునేందుకు మినహా మరే విధంగానూ అక్కరకు రాకుండా ఉన్న దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ఆస్తికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ముద్ర వేయనుంది. గ్రామాల్లో ఉండే ఇళ్లు, పశువుల కొట్టాలు, ఇతర ఖాళీ స్థలాలకు వాటి యజమానుల పేరిట సర్టిఫికెట్లు ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని గ్రామ కంఠాల్లో కోటిన్నరకి పైగానే ఇళ్లు, ఇతర ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటి విలువ లక్షన్నర కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ భూములకు రెవెన్యూ సర్వే రికార్డులు లేవు. అలాగని అవసరమైనప్పుడు ఏదైనా ధ్రువీకరణ పత్రం ఇచ్చే విధానమూ ఇంతవరకు లేదు. దీనివల్ల యజమానులకు ఆ ఆస్తులతో ఎలాంటి ఇతర ప్రయోజనాలూ లభించడం లేదు. కనీసం బ్యాంకు రుణాలు కూడా లభించడం లేదు. ఇంటి పన్ను వసూలుకు వీలుగా గ్రామ పంచాయతీల వద్ద ఇళ్ల యజమానుల జాబితాలు తప్ప ఆయా ఇళ్లకు సంబంధించి రికార్డులు, ఆస్తి వివరాలు ఆయా గ్రామ పంచాయతీల వద్ద లేవు. దీంతో ఎవరన్నా ఆస్తి అమ్ముకోవాలంటే పెద్ద మనుషుల మధ్య కాగితాలు రాసుకోవాల్సిందే తప్ప ఆ పత్రాలకు ఎలాంటి అధికారిక గుర్తింపు ఉండటం లేదు. దీనివల్ల సరైన రేటూ లభించడం లేదు. అన్నదమ్ములు పంచుకోవాలన్నా ఇబ్బందులే. ఈ పరిస్థితులన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పుడు గ్రామ కంఠంలో ఉండే అలాంటి ఇళ్లు, పశువుల కొట్టాలు, ఇతర స్థలాలన్నింటికీ ‘క్యూఆర్ కోడ్’ (వివరాలు తెలుసుకునేందుకు ఉపకరించే ఆప్టికల్ లేబుల్)తో కూడిన ఆస్తి సర్టిఫికెట్లు జారీ చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకంలో భాగంగా సోమవారం నుంచి ఈ కార్యక్రమం అమలు చేయనుంది. ప్రతి ఆస్తికీ ధ్రువీకరణ ► ఆస్తి సర్టిఫికెట్ జారీతో యజమానికి తనకు సంబంధించిన ప్రతి ఆస్తికీ ధ్రువీకరణ లభిస్తుంది. తద్వారా ఆస్తికి రక్షణ లభిస్తుంది. ఆస్తి తాకట్టు పెట్టి బ్యాంకు రుణం తీసుకునేందుకు ఆ సర్టిఫికెట్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల సహజంగానే ఆస్తి విలువ పెరిగిపోతుంది. ► ఇల్లు/ స్థలం అమ్ముకోవాలనుకుంటే.. నిర్దిష్ట ఆస్తి సర్టిఫికెట్ ఉండటంతో సులభంగా మార్పిడి ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఆ ఆస్తి సర్టిఫికెట్లో ముద్రించిన క్యూఆర్ కోడ్ సహాయంతో గ్రామ పంచాయతీ వద్ద ఉండే రికార్డులలో సంబంధిత కొత్త యజమాని పేరు ఆటోమేటిక్‌గా నమోదు అవుతుంది. కొత్త యజమానిపేరుతో పంచాయతీ కార్యదర్శి ఆస్తి సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ► అలాగే ఆస్తిని అన్నదమ్ములు పంచుకున్న సమయంలో.. పాత ఆస్తి సర్టిఫికెట్‌ను రద్దు చేసి, పంపకంలో వచ్చిన వాటాల మేరకు అన్నదమ్ములకు వెంటనే కొత్త ఆస్తి సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ► గ్రామాల్లో స్థలాల వివాదాలు తలెత్తినప్పుడు వాటిని సులభంగా పరిష్కరించేందుకు కూడా వీలు కలుగుతుందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ జారీ ప్రక్రియ ఇలా.. ► వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ద్వారా ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల పరిధిలో అన్ని రకాల భూముల రీ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామాల పరిధిలో గ్రామ కంఠం ప్రాంతంలో ఉన్న వాటితో సహా అన్ని ఇళ్లు, ఇతర స్థలాలన్నింటినీ డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వే చేయనున్నారు. ఆ విధంగా గ్రామ పరిధిలో ప్రతి ఇంటినీ, స్థలాన్ని హద్దులతో సహా గుర్తించి, స్థానిక అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకున్న అనంతరం విస్తీర్ణం, మూలలు, కొలతలు, ఇతర వివరాల నిర్ధారణతో రికార్డులను గ్రామ పంచాయతీకి అప్పగిస్తారు. ► గ్రామ కంఠంలో ఉండే ఇళ్లు, స్థలాలకు కొత్తగా సర్వే నంబర్లు కూడా కేటాయిస్తారు. ప్రతి ఇంటినీ, ప్రతి స్థలాన్ని వేర్వేరు ఆస్తిగా పేర్కొంటూ వాటికి వేర్వేరుగా గుర్తింపు నంబర్లను కేటాయిస్తారు. ఆ వివరాలన్నింటినీ ఒక్కొక్క దానికీ ఒక్కొక్క ప్రత్యేక క్యూఆర్ కోడ్‌తో అనుసంధానం చేస్తారు. ► ఒక్కొక్క ఆస్తికి వేర్వేరుగా ఆస్తి సర్టిఫికెట్లను (ధ్రువీకరణ పత్రాలు) తయారు చేసి (వాటిపై క్యూఆర్ కోడ్ ముద్రిస్తారు) గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా వాటిని సంబంధిత యజమానులకు పంచాయతీరాజ్ శాఖ పంపిణీ చేస్తుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా రీసర్వే చేపట్టిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామ పరిధిలోని 423 ఇళ్లు, 83 ఖాళీ స్థలాల యజమానులకు సోమవారం ఆస్తి సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. -
బ్యాంకును మోసం చేసిన కేసులో పలువురి ఆస్తుల జప్తు
సాక్షి, అమరావతి: బ్యాంకు రుణాల మోసం కేసులో వీనస్ ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ డైరెక్టర్లు నిమ్మగడ్డ రామకృష్ణ, నిమ్మగడ్డ వేణుగోపాల్, వీవీఎన్‌కే విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు చెందిన హైదరాబాద్, విజయవాడల్లోని 27 స్థిరాస్తులను జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. ఈ స్థిరాస్తుల విలువ రూ.11.05 కోట్లు ఉంటుందని బుధవారం ఈడీ ట్వీట్ చేసింది. గుడివాడలోని ఆంధ్రా బ్యాంకు (ప్రస్తుతం యూనియన్ బ్యాంక్) నుంచి వీనస్ ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ పేరు మీద 470 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నట్టు తప్పుడు కాగితాలు సృష్టించి రూ.19.44 కోట్ల రుణాలను తీసుకొని ఎగ్గొట్టారు. దీనిపై బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేయడంతో దీని ఆధారంగా దర్యాప్తు చేసిన ఈడీ స్థిరాస్తులను జప్తు చేసింది. బ్యాంకు రుణం ద్వారా తీసుకున్న సొమ్మును సొంత ఖాతాలకు మరలించి స్థిరాస్తులు కొనుగోలు చేయడంతో పాటు సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం బ్యాంకుకు చెల్లించాల్సిన రుణం విలువ రూ.36.97 కోట్లకు చేరింది. జప్తు చేసిన ఆస్తుల మార్కెట్ విలువ రూ.34 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
ఉపశమనం ఇంతటితో సరి
న్యూఢిల్లీ: బ్యాంక్‌ల నుంచి రుణాలు తీసుకున్న వారికి చక్రవడ్డీని మాఫీ చేశామని, ఇంతకుమించిన ఉపశమనం ఇవ్వబోమని కేంద్రం స్పష్టంచేసింది. ఆర్థిక వ్యవహారాల్లో ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత పునరాలోచించే ప్రసక్తే లేదని తేల్చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి, తదనంతర పరిస్థితుల వల్ల ఆదాయం పడిపోయి, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మారటోరియంతో ఎంతో ఉపశమనం కలిగించామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి చక్రవడ్డీ(వడ్డీపై వడ్డీ)ని మాఫీ చేశామని, ఇంతకంటే ఎక్కువ ఊరట కలిగించలేమని పేర్కొంది. ఒకవేళ అలా చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగే ప్రమాదం ఉందని, బ్యాంకింగ్ రంగం సంక్షోభంలో చిక్కుకుంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. రూ.2 కోట్ల లోపు రుణాలు తీసుకున్నవారికి ఆరు నెలల మారటోరియం కాలానికి ఈ వెసులుబాటు లభిస్తుందని వెల్లడించింది. మారటోరియం గడువును ఆరు నెలల కంటే పొడిగించడం కుదరదని తెలిపింది. రుణాల చెల్లింపులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే నిర్ణయాన్ని తీసుకోలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి పంకజ్ జైన్ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. రుణ గ్రహీతలకు చక్రవడ్డీని మాఫీ చేయడం కాకుండా ఇంకా ఇతర ఏ ఉపశమనాలూ కలిగించలేమని కేంద్రం తెలిపింది. ఆరు నెలల మారటోరియం కాలంలో చక్రవడ్డీని మాఫీ చేస్తామని, అంతకంటే ఇంకేం చేయలేమని కేంద్రం ప్రకటించడం తెల్సిందే. ఈ అంశంపై కేంద్రం తన వాదనను వినిపిస్తూ అక్టోబర్ 5న న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. పూర్తి వివరాలతో మరో అఫిడవిట్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో పంకజ్ జైన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేశారు. మారటోరియం గడువును పొడిగిస్తే రుణగ్రహీతలపై మరింత భారం పడుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ అఫిడవిట్లపై సుప్రీంకోర్టు అక్టోబర్ 13న తదుపరి విచారణ జరపనుంది. కరోనా నేపథ్యంలో కేంద్రం మార్చి 1 నుంచి మే 31వ తేదీ వరకు మారటోరియం విధించింది. రుణాలు, వడ్డీలపై ఇన్స్టాల్మెంట్ల చెల్లింపులను వాయిదా వేసుకోవచ్చని సూచిస్తూ ఆర్బీఐ మార్చి 27న తెలిపింది. తర్వాత కరోనా వ్యాప్తి తగ్గకపోవడంతో మారటోరియం గడువును ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించారు. కేంద్ర సర్కారు నిర్ణయం వల్ల తమపై భారం తగ్గదని, వడ్డీపై వడ్డీ చెల్లించాల్సి వస్తుందని పేర్కొంటూ పలువురు రుణగ్రహీతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రూ.2 కోట్ల లోపు రుణాలు తీసుకున్న వారికి ఆరు నెలల మారటోరియం కాలానికి చక్రవడ్డీని మాఫీ చేస్తామని కేంద్రం సమాధానమిచ్చింది. -
ఎస్సీ, ఎస్టీలకు చేయూత
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి, సంక్షేమంలో గత సర్కారుకు ఇప్పటి సర్కారుకు స్పష్టమైన తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకు రుణాలే దిక్కుగా ఉండేవి. అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేసిన వారికే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు కావాలంటే సిఫార్సులతో పాటు దళారులకు లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. అధికార పార్టీకి చెందిన మంత్రులు, పలుకుబడి గల వ్యక్తుల చుట్టూ ఉండే వారికే బ్యాంకు రుణాలు మంజూరు అయ్యేవి. గత ప్రభుత్వంలో లక్ష మంది ఎస్సీ, ఎస్టీలకు కూడా రుణాలు ఇవ్వలేదు. అయితే వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే నవరత్నాలతో పాటు ఇతర పథకాల ద్వారా సెప్టెంబర్ ఆఖరు వరకు ఏకంగా 1.35 కోట్ల మందికి (1.06 కోట్లు ఎస్సీలు, 29.50 లక్షల మంది ఎస్సీలు) లబ్ధి చేకూర్చింది. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేవలం అర్హతే ప్రామాణికంగా గత 16 నెలల్లో వైఎస్సార్ నవశకం పేరుతో వలంటీర్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను గుర్తించారు. వారి ఇళ్ల వద్దకే వెళ్లి నవరత్నాల గురించి వివరించి, దరఖాస్తులు తీసుకుని, లబ్ధి చేకూర్చారు. ► గత సర్కారు ఈ వర్గాలను బ్యాంకు రుణాలకే పరిమితం చేయగా, ఈ సర్కారు ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా మరింత మెరుగైన జీవనం సాగించాలనే లక్ష్యంతో ఆయా పథకాలకు సంబంధించి నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే నగదు జమ చేసింది. ► గత సర్కారులో ఎస్సీ ,ఎస్టీల్లోని చిన్న, సన్న కారు రైతులకు రుణాలు అందేవి కాదు. అధిక వడ్డీతో అప్పులు తెచ్చుకుని వ్యవసాయానికి పెట్టుబడి పెట్టేవారు. ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో 4,54,984 మంది ఎస్సీ రైతులు, 2,77,310 మంది ఎస్టీ రైతులకు లబ్ధి కలిగించింది. సంక్షేమం అంటే ఇలా ఉండాలి గతంలో సంక్షేమం అంటే దళారుల హవా ఉండేది. వారి సంక్షేమం కాగితాల్లోనే కనిపించేది. ఇన్నోవా కార్లు, పలుకుబడి ఉన్న వారికే లబ్ధి కలిగించారు. ఎస్సీ హాస్టల్స్ మూసి వేసిన ఘనత చంద్రబాబుది. ఆయన హయాంలో ఆరువేల స్కూళ్లు మూసేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో విద్య, వైద్యానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ విధమైన సంక్షేమం లేదు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ఎస్సీ కుటుంబాలకు ఆర్థిక సాయం అందుతోంది. సంక్షేమం అంటే ఇది. – కల్లూరి చెంగయ్య, జాతీయ అధ్యక్షుడు, ఐక్య దళిత మహానాడు ఇంతగా సాయం అందడం ఇదే మొదటిసారి ఇప్పటి వరకు గిరిజనులకు నేరుగా ఏ ప్రభుత్వం కూడా సాయం అందించలేదు. పలుకుబడి ఉన్నవారే ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకునే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దళారులు అసలే లేరు. సీఎం వైఎస్ జగన్ గిరిజనులను అన్ని విధాలా ఆదుకుంటున్నారు. అన్ని పథకాలకు సంబంధించి నేరుగా సాయాన్ని బ్యాంకు అకౌంట్లో వేస్తుండటం ఇదే ప్రథమం. సీఎం అంటే ఇలా ఉండాలని నిరూపించారు. – ఆరిక సూర్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ట్రైబల్ డెవలప్మెంట్ మిషన్ -
రుణాలపై ఎస్బీఐ పండుగ ఆఫర్లు
ముంబై: పండుగల సీజన్ సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలపై భారీ ఆఫర్లు ప్రకటించింది. తమ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే రిటైల్ కస్టమర్లకు కారు, పసిడి, వ్యక్తిగత రుణాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజును 100 శాతం మాఫీ చేస్తున్నట్లు సోమవారం తెలిపింది. అలాగే, నిర్దిష్ట ప్రాజెక్టుల్లో గృహాలు కొనుగోలు చేసే వారికి కూడా రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు వివరించింది. ఇక, క్రెడిట్ స్కోర్, గృహ రుణ పరిమాణాన్ని బట్టి వడ్డీ రేటులో 10 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) దాకా రాయితీ ఇస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఒకవేళ యోనో ద్వారా దరఖాస్తు చేసుకుంటే 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రాయితీ పొందవచ్చని పేర్కొంది. కార్ లోన్ తీసుకునే వారికి వడ్డీ రేట్లు అత్యంత తక్కువగా 7.5 శాతం నుంచి ప్రారంభమవుతాయి. ఎంపిక చేసిన మోడల్స్‌పై 100 శాతం ఆన్–రోడ్ ఫైనాన్స్ కూడా లభిస్తుంది. మరోవైపు, అత్యంత తక్కువగా 7.5 శాతం వడ్డీ రేటుకే పసిడి రుణాలు కూడా ఇస్తున్నట్లు ఎస్బీఐ వివరించింది. ఇక వ్యక్తిగత రుణాలపై 9.6 శాతం నుంచి వడ్డీ రేటు ఉంటోందని పేర్కొంది. ‘ఎకానమీ క్రమంగా కోలుకుంటున్న నేపథ్యంలో కొనుగోళ్లు పుంజుకుంటాయని ఆశిస్తున్నాం. పండుగ సీజన్లో కొనుగోలుదారుల ఆర్థిక అవసరాలకు తోడ్పాటు అందించాలని భావిస్తున్నాం‘ అని ఎస్బీఐ ఎండీ (రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ విభాగం) సీఎస్ శెట్టి తెలిపారు. యోనో యాప్ ద్వారా కారు, పసిడి రుణాల దరఖాస్తులకు సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఎస్బీఐకి గృహ రుణాల విభాగంలో దాదాపు 34 శాతం, వాహన రుణాల విభాగంలో సుమారు 33 శాతం మార్కెట్ వాటా ఉంది. దాదాపు 7.6 కోట్లకు పైగా ఎస్బీఐ ఖాతాదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకుంటున్నారు. సుమారు 1.7 కోట్ల మంది మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకుంటున్నారు. పండుగ సీజన్ అమ్మకాలపై ఆటో డీలర్ల ఆందోళన: ఇక్రా ఈ పండుగ సీజన్లో వాహన విక్రయాల వృద్ధి ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని ఆటోమొబైల్ డీలర్లు అంచనా వేస్తున్నట్లు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. స్థూల ఆర్థికవ్యవస్థలోని సవాళ్లతో పాటు కరోనా ప్రతికూల ప్రభావాలు అమ్మకాలపై కనిపించే అవకాశం ఉందని డీలర్లు అంచనా వేస్తున్నారు. ఇక్రా జరిపిన సర్వే ప్రకారం... ఈ పండుగ సీజన్లో 58శాతం మంది డీలర్లు వార్షిక ప్రాతిపదికన కేవలం 5శాతం వృద్ధిని అంచనా వేస్తున్నారు. ఏ ఒక్క డీలర్ కూడా కనీసం 10శాతం విక్రయాల వృద్ధిని అంచనా వేయలేకపోయారు. ప్యాసింజర్ వాహన విక్రయ డీలర్లలో కొంత ఆశాభావ అంచనాలు నెలకొన్నాయని, కమర్షియల్ వాహన డీలర్లలో ఒత్తిడి కొనసాగుతుందని ఇక్రా సర్వే తెలిపింది. -
పోతుకు గడ్డివేసి, ఆవును పాలిమ్మంటే..
సాక్షి, సిద్దిపేట : ‘దున్నపోతుకు గడ్డివేసి.. ఆవును పాలు ఇవ్వమంటే ఎలా?.. పని చేసే ప్రభుత్వానికి ప్రజలు వెన్నుదన్నుగా ఉండాలి’ అని మంత్రి తన్నీరు హరీష్‌రావు వ్యాఖ్యానించారు. ఆదివారం దుబ్బాక రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన బ్యాంకు రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రిగా కేసిఆర్ బాధ్యతలు చేపట్టాకే దుబ్బాక ప్రజల నీటి గోస తీరింది. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక సహాయం అందిస్తున్నాం. దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటివరకూ 5 వేల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం చేశాం. దుబ్బాక నియోజకవర్గంలో 56,900 మందికి పింఛన్లు అందిస్తున్నాం. ( ఉత్కంఠగా పోరులో విజయం ఎవరిదో..! ) పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పు సౌకర్యం కల్పించాం. బాలింతలకు 12 వేల ఆర్థిక సహాయంతో పాటు కేసీఆర్ కిట్‌ను అందిస్తున్నాం. దుబ్బాక నియోజకవర్గంలో నెలన్నరలో 100 పడకల ఆసుపత్రిని వినియోగంలోకి తెస్తాం. అర్హులందరికీ పింఛన్లు అందించే బాధ్యత నాది. కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ... అభివృద్ధిలో వెన్నంటి ఉంటా. దుబ్బాక నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న మహిళా భవనాలను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తాం. కొత్తగా పీఎఫ్ వచ్చిన బీడీ కార్మికులకు జీవన భృతి అందిస్తా’’మన్నారు. -
చిన్న వ్యాపారులకు సున్నా వడ్డీ
విజయవాడలోని కానూరులో కూరగాయలు విక్రయించే శ్రీను వ్యాపారం బాగానే ఉన్నా రూ.10 చొప్పున వడ్డీకి తెచ్చిన అప్పు తీర్చడానికే లాభం అంతా సరిపోతోంది. వ్యాపారం గిరాకీ బాగున్నా చేతిలో చిల్లిగవ్వ లేక అతడి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గుంటూరు జిల్లా అల్లూరివారి పాలెం గ్రామానికి చెందిన రమణయ్య బండి మీద అరటి కాయలు అమ్ముకునే చిరు వ్యాపారి. రోజూ ఊరి నుంచి 5 కి.మీ దూరంలోని నరసరావుపేటకు వెళ్లి అమ్ముతుంటాడు. వారానికి రూ.2,000 (వడ్డీ మినహాయించి ఇచ్చేది రూ.1,700లే) కాబూలీ వడ్డీ వ్యాపారి వద్ద అప్పు తీసుకోవడం.. రోజూ రూ. 300 చొప్పున బాకీ తీర్చడమే సరిపోతోంది. సాక్షి, అమరావతి: అధిక వడ్డీలతో సతమతమవుతున్న చిరు వ్యాపారుల కష్టాలు తీర్చేందుకు ‘జగనన్న తోడు’ పథకం ద్వారా సున్నా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అర్హులను గుర్తించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా అక్టోబర్‌లో నెలలో సున్నావడ్డీ ద్వారా బ్యాంకు రుణాలిప్పించేలా కార్యాచరణ సిద్ధమైంది. గ్రామాలు, పట్టణాల్లో టీ దుకాణాలు, కూరగాయల వ్యాపారం, బడ్డీ కొట్లు, తోపుడు బండ్లపై టిఫిన్ విక్రయాలు తదితర చిరు వ్యాపారాలను నిర్వహిస్తూ పొట్టపోసుకునే వారికి రూ.10,000 చొప్పున రుణాలు ఇప్పించి వడ్డీ డబ్బులను ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. రుణంగా పొందే అసలును మాత్రమే బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా వాయిదాల పద్ధతిలో చిరు వ్యాపారులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి బ్యాంకులు రుణాలిచ్చేందుకు వీలుగా ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది చిరు వ్యాపారులు ఉంటారనే అంచనాతో వారందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది. గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు ఈ నెల 18వ తేదీ వరకు సర్వే నిర్వహించి 30వ తేదీకల్లా అర్హులను గుర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎవరు అర్హులు..? ► గ్రామాల్లోనైనా, పట్టణాల్లోనైనా సుమారు 5 అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు స్థలంలో, అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాపులను ఏర్పాటు చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులు. ► రోడ్డు పక్కన, ఫుట్‌పాత్‌లపై, ప్రజా, ప్రైవేట్ స్థలాల్లో తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునేవారు. తలపై గంపలో వస్తువులు మోస్తూ అమ్ముకునే వారు. ► ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సైకిల్, మోటార్ సైకిళ్లు, ఆటోలపై తిరుగుతూ వ్యాపారం చేసుకునే వారు. ► చిరు వ్యాపారి వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామాల్లో రూ.10 వేల లోపు, పట్టణాల్లో రూ.12 వేల లోపు ఉండాలి. ► ఆధార్, ఓటరు కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర గుర్తింపు కార్డును తప్పనిసరిగా కలిగి ఉండాలి. గుర్తింపు కార్డుల జారీ ఇలా.. ► గ్రామ, వార్డు వలంటీర్ల సర్వేలో అర్హులుగా గుర్తించిన వారి జాబితాలను సచివాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించి సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. ఈ జాబితాలకు ఎంపీడీవో, జిల్లా జాయింట్ కలెక్టర్లు ఆమోదం తెలుపుతారు. ► తుది జాబితాలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ గుర్తింపు కార్డును అందజేస్తారు. బ్యాంకు ఖాతాలు లేని వారు కొత్తగా పొదుపు ఖాతా ప్రారంభించేలా వలంటీర్లు సహకరిస్తారు. ► చిరు వ్యాపారులకు రూ.పది వేల వరకు విరివిగా రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం(ఎస్ఎల్బీసీ)లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన సూచన చేశారు. ► గుర్తింపు కార్డులు జారీ చేసిన జాబితాలను జిల్లా అధికారులు అన్ని బ్యాంకులకు పంపుతారు. అక్టోబర్‌లో బ్యాంకు రుణాలు.. ► వలంటీర్ల సర్వే అనంతరం అర్హుల ప్రాథమిక జాబితాలను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి ఈ నెల 18 నాటికి ఆమోదం కోసం జిల్లా జాయింట్ కలెక్టర్లకు పంపుతారు. 24వ తేదీ కల్లా జాబితాకు కలెక్టర్లు ఆమోదం తెలుపుతారు. 30వ తేదీ కల్లా గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ చేపట్టేలా సచివాలయాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ‘జగనన్న తోడు’ ద్వారా అక్టోబర్‌లో సున్నావడ్డీ ద్వారా రుణాలిప్పించేలా కార్యాచరణ సిద్ధమైంది. -
కంపెనీలకు ఊరటపై ఆర్బీఐ కసరత్తు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిణామాలతో తీవ్రంగా దెబ్బతిన్న నిర్దిష్ట రంగాల సంస్థలకు వన్ టైమ్ ప్రాతిపదికన రుణాల పునర్వ్యవస్థీకరణ పథకాన్ని ప్రకటించడంపై రిజర్వ్ బ్యాంక్ కసరత్తు చేస్తోంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో పాటు పలు వ్యాపార సంస్థల సమాఖ్యలు కేంద్రం, రిజర్వ్ బ్యాంక్‌లకు విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వివిధ వర్గాల సూచనలన్నీ పరిగణనలోకి తీసుకున్న ఆర్బీఐ.. రుణాల పునర్వ్యవస్థీకరణకు అర్హత ఉన్న రంగాలకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నట్లు వివరించాయి. ఆగస్టు ఆఖరు నాటికి దీనిపై నిర్ణయం వెలువరించవచ్చని పేర్కొన్నాయి. ప్రస్తుతం అమలవుతున్న ఆరు నెలల మారటోరియం వ్యవధి అప్పటితో ముగిసిపోనుంది. (చైనా దిగుమతులు ఇప్పట్లో తగ్గవు!) ఆతిథ్య, టూరిజం, ఏవియేషన్, నిర్మాణం మొదలైన రంగాలకు రుణ పునర్వ్యవస్థీకరణ స్కీమ్ వెసులుబాటు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒత్తిడిలో ఉన్న కంపెనీలకు తోడ్పాటు అందించేలా వన్–టైమ్ ప్రాతిపదికన రుణాల పునర్వ్యవస్థీకరణ అంశంపై ఆర్బీఐ, ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారమే వెల్లడించారు. 2008 అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో సంక్షోభం నుంచి బైటపడేందుకు పలు రంగాల సంస్థలకు ఆర్బీఐ వన్–టైమ్ రుణ రీస్ట్రక్చరింగ్ అవకాశం కల్పించింది. అయితే, దాన్ని కార్పొరేట్లు దుర్వినియోగం చేయడంతో 2015లో నిబంధనలను కఠినతరం చేసింది. -
రుణాల పేరిట లక్షల టోకరా
బంజారాహిల్స్: ప్రముఖ బ్యాంకు ఆమోదం ఉందంటూ ఓ డొల్ల కంపెనీని ఏర్పాటుచేసి ... ఈ కంపెనీ బ్యాంకు కన్నుసన్నల్లోనే నడుస్తుందని ప్రచారం చేసి 40 మంది నిరుద్యోగ యువకులకు వెరిఫికేషన్ ఆఫీసర్లు, డాక్యుమెంట్ పికప్, చెక్స్ విత్‌డ్రా విభాగం అంటూ ఉద్యోగాలు కల్పించారు. అనంతరం వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు ఫోన్ చేసి రుణాలు ఇప్పిస్తామని నమ్మించి సంతకాలు చేయని ఖాళీ చెక్కులు తీసుకుని వాటిపై ఫోర్జరీ సంతకాలు చేసి బ్యాంకుల్లో లక్షలు డ్రా చేశారు. మోసపోయిన బాధితులు, ఉద్యోగులు మంగళవారం బంజారాహిల్స్ పోలీసును ఆశ్రయంచారు. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 ఇందిరానగర్‌కు చెందిన మురళి అనే వ్యాపారికి ఈ నెల 18న ఓ బ్యాంకు పేరుతో టెలికాలర్ ఫోన్ వచ్చింది. రుణం కావాలా..? అని అడిగాడు. ఇల్లు కట్టుకునేందుకు రుణం కావాలని మురళి చెప్పారు. ఇందుకుగాను ఆదాయ ధ్రువీకరణ పత్రాలను టెలీకాలర్ అడిగాడు. రెండు రోజుల తరువాత బ్యాంకు నుంచి వచ్చినట్లు చెప్పిన ప్రశాంత్ అనే యువకుడు మురళి వద్ద నుంచి డాక్యుమెంట్లు తీసుకున్నాడు. ఇది జరిగిన నాలుగు రోజుల తరువాత బ్యాంకు నుంచి మాట్లాడుతున్నట్లు ఓ యువతి ఫోన్ చేసి రుణం ఇచ్చేందుకు తాము సిద్ధమని చెప్పింది. ఇళ్లు కట్టే స్థలం తనిఖీకి తమ ప్రతినిధులు వస్తారని పేర్కొంది. ఆ రెండు రోజుల తరువాత ఇద్దరు యువకులు బ్యాంకు నుంచి వస్తున్నట్లు చెప్పి స్థలాన్ని చూసి వెళ్లిపోయారు. అదే రోజు బ్యాంకు నుంచి ఫోన్ చేసి రెండు కోట్ల రుణం ఇస్తామన్నారు. కాకపోతే కొన్ని షరతులు పూర్తి చేసేందుకు సంతకాలు పెట్టని చెక్కులు కావాలని కోరారు. మురళి ఐదు చెక్కులను వారికి అందజేశారు. అంతే మరుసటి రోజు మురళి ఖాతాలో ఉన్న రూ.1.65 లక్షలు డ్రా అయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. ఖంగుతిన్న మురళి వెంటనే రుణం ఇస్తామని చెప్పిన వారి ఫోన్ కోసం ప్రయత్నించగా స్విచ్ఛాఫ్ వచ్చింది. వెంటనే ఆయన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రుణం పేరిట ఫోన్ చేస్తుంది ఓ డొల్ల కంపెనీ అని గుర్తించారు. బెంగళూర్‌కు చెందిన మహేశ్ అలియాస్ ఎం.ప్రణయ్ రాయ్ అలియాస్ మధు(45)గా తేలింది. తమను ఇంటర్వ్యూ చేసింది బాలాజీ అలియాస్ సురేష్ మెహతా అని బాధితులు తెలిపారు. సికింద్రాబాద్‌లో బుజ్వర్క్, ఫార్చూన్ ఎంటర్ ప్రైజెస్ పేరిట ఓ కార్యాలయం తెరిచి సుమారు 49 మంది యువతీ, యువకులను ఉద్యోగులుగా చేర్చుకున్నారు. టెలీకాలర్ ద్వారా నగరవాసులకు ఫోన్ చేసి రుణం పేరిట ఆకర్షించి మోసం చేస్తున్నట్లు తేలింది. మంగళవారం మురళితో పాటు హిమాయత్‌నగర్‌కు చెందిన దయాకర్ రెడ్డి అనే వైద్యుడు రూ. 5.50 లక్షలు, గౌస్ అనే వ్యక్తి రూ.40వేలు పోగొట్టుకున్నట్లు పోలీసులను ఆశ్రయించారు. బంజారాహిల్స్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఖాతాలో కూడా రూ.6 లక్షలు డ్రా చేసేందుకు ప్రయత్నించారు. కానీ సంతకాలు సరిపోకపోవడంతో ఆ ప్రయత్నం సాధ్యం కాలేదు. కేవలం పదిరోజుల్లో రూ.10 లక్షలకు పైగా ఆ డొల్ల కంపెనీ ప్రతినిధులు కొల్లగొట్టారు. పక్కా ప్రణాళికతో... ♦ కంపెనీ నిర్వాహకులు పక్కా ప్రణాళికలతో మోసాలకు పాల్పడ్టట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాధితుల వద్ద సంతకాలు పెట్టని ఖాళీ చెక్కులు తీసుకుంటూ అనుమానం రాకుండా వారి ముందే చెక్కులుపై ఓ ప్రముఖ బ్యాంకు తాలుకు స్టాంప్ వేయడంతో బాధితులు భరోసాగా ఫిలయ్యారు. ♦ అయితే ఆ తరువాత ఆ చెక్కులను తీసుకున్న డొల్ల కంపెనీ ముఠా వాటిపై ఉన్న స్టాంప్‌లను తుడిచేసి ఫోర్జరీ సంతకాలు చేశారు. అప్పటికే రుణం కోసం వివిధ పత్రాలపై చేయించుకున్న సంతకాల ఆధారంగా సంతకాలు ఫోర్జరీ చేయగలిగారు. ఆ విధంగా డబ్బును తమ ఖాతాలోకి ఆర్టీజీఎస్ పద్ధతిలో మళ్లించుకున్నారు. పై నుంచి దూకిన నిందితుడు ఇదిలా ఉండగా ఓ బాధితుడు నిందితుడి కోసం గాలిస్తూ గూగుల్ మ్యాప్ ద్వారా వెస్ట్‌మారేడ్‌పల్లిలోని ఓ లాడ్జిలో తలదాచుకున్న మోసగాడి జాడ కనిపెట్టారు. నేరుగా మంగళవారం ఉదయం మిగతా బాధితులతో కలిసి ఆ లాడ్జి వద్దకు స్థానిక పోలీసుల సాయంతో చేరుకున్నారు.దీంతో గమనించిన నిందితుడు ప్రణయ్ లాడ్జి రెండో అంతస్తునుంచి కిందికి దూకాడు. దీంతో కాలు విరిగింది. వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అనంతరం బంజారాహిల్స్ పోలీసులకుఅప్పగించారు. -
దా‘రుణ’ మోసం
కర్నూలు, డోన్: ప్రభుత్వ నిబంధనల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని బ్యాంకుల్లో లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న ఘనులు రోజుకోకకరు బయట పడుతూనే ఉన్నారు. మండలంలోని యాపదిన్నె మజారా మల్యాల గ్రామంలోనూ ఇలాంటి ఘటనే ఒకటి ఆలస్యంగా వెలుగుచూసింది. చనుగొండ్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. మల్యాల గ్రామానికి చెందిన కుందర్తి సంజీవులుకు సబ్సిడీ రుణం ఇప్పిస్తానని నమ్మబలికాడు. రూ.లక్ష రుణం తీసుకొని తలా రూ.50 వేలు తీసుకుందామని, నువ్వు తీసుకున్న రుణం సబ్సిడీ కింద పోగా, మిగతాది తానే చెల్లిస్తానని చనుగొండ్ల వ్యక్తి నమ్మించాడు. 815/1 సర్వే నంబర్లో సెంటు భూమి లేకపోయినా సంజీవులుకు 13 ఎకరాలు పొలం ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు సృష్టించాడు. వాటిని పత్తికొండ కేడీసీసీ బ్యాంక్‌లో పెట్టి 2018 ఫిబ్రవరి 21న రూ.9,75,000 రుణం తీసుకున్నాడు. సంజీవుడిని మాత్రం రూ.50 వేలు చేతిలో పెట్టి మిగతాది స్వాహా చేశాడు. డొంక కదిలింది ఇలా.. సర్వీస్ ఏరియా కాకపోయినా సంజీవునికి ఉదారంగా రుణం ఇచ్చిన పత్తికొండ కేడీసీసీ బ్యాంక్ అధికారులు వాయిదాలు చెల్లించకపోవడంతో ఈ ఏడాది మే 19న నోటీసులు జారీ చేశారు. దీంతో సంజీవుడు లబోదిబో మంటున్నాడు. తనకు ఇచ్చింది కేవలం రూ.50వేలు మాత్రమేనని మిగిలిన రూ.9,25,000 చనుగొండ్లకు చెందిన ఓ వ్యక్తి స్వాహా చేశాడని సంజీవుడు ఆరోపిస్తున్నాడు. ఆన్లైన్లో మాయం రుణం ఇచ్చే సందర్భంలో ఆన్లైన్లో కన్పించిన పొలం వివరాలు ప్రస్తుతం మాయం కావడంతో బ్యాంక్ అధికారులు నివ్వెరపోతున్నారు. సెంటు స్థలం లేని వ్యక్తి నుంచి రుణం ఎలా కట్టించుకోవాలో అర్థంకాని పరిస్థితుల్లో పడిపోయారు. ఎందరో బలి పశువులు.. సంజీవుడు లాంటి వ్యక్తుల బలహీనతలను ఆసరాగా చేసుకొని కొందరు రెవెన్యూ, బ్యాంక్ అధికారులకు మామూళ్లు ఎరచూపి లక్షలాది రూపాయలను రుణాల కింద దిగమింగుతున్న పెద్దల భరతం పట్టేందుకు ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ అంశంపై అలసత్వం వహిస్తే సంజీవుడు లాంటి మరెందరో బలిపశువులు కావాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. -
59 నిమిషాల్లోనే బ్యాంక్ రుణాలు
న్యూఢిల్లీ: ‘59 నిమిషాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) రుణాలు’ పోర్టల్ సేవలు రిటైల్ రుణాలకూ విస్తరించడం జరిగింది. రిటైల్ రుణ లభ్యతకూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. గృహ, వ్యక్తిగత రుణ ప్రతిపాదనలకు ఈ పోర్టల్ ఇకపై అందుబాటులో ఉండనుంది. త్వరలో ఆటో రుణాలకు సంబంధించి కూడా అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు తెలపాయి. ఇప్పటి వరకూ ఈ సేవలు లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) మాత్రమే అందుబాటులో ఉంది. 2018 నవంబర్‌లో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఎంఎస్ఎంఈలకు కోటి రూపాయల వరకూ ఈ పోర్టల్ ద్వారా రుణం పొందే సౌలభ్యం ఉంది. ఆదాయపు పన్ను రిటర్న్స్ నుంచి బ్యాంక్ అకౌంట్ల వరకూ అందుబాటులోఉన్న పలు ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను పరిశీలనలోకి తీసుకుని వచ్చే డేటా పాయింట్లను అత్యుధునిక ఆల్గోరిథమ్స్ ద్వారా విశ్లేషించి తక్షణ రుణ లభ్యత కల్పించడం ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశం. 2019 మార్చి 31వ తేదీ వరకూ అందిన గణాంకాల ప్రకారం- ఈ రుణాల కోసం 50,706 ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 27,893 ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. -
‘వడ్డీ బకాయిపడితే దివాలా తీసినట్లు కాదు’
సాక్షి, న్యూఢిల్లీ : రుణాలపై వడ్డీ బకాయిలు చెల్లించని సంస్థను బ్యాంకులు దివాలా ప్రక్రియకు తీసుకెళ్లడం విచారకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఇన్సాల్వెన్సీ, బాంక్రప్టసీ కోడ్ సవరణ బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ బిల్లులో రుణం, క్లెయిమ్, డిఫాల్ట్ అనే పదాలను నిర్వచించారు.. కానీ రుణాలపై వడ్డీ అనే పదానికి సరైన నిర్వచనం లేదని తెలిపారు. రుణాలపై వడ్డీ బకాయిల చెల్లింపులో విఫలమైన కేసులను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ దివాలా పరిష్కార ప్రక్రియకు సిఫార్సు చేస్తోందని.. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పాలని కోరారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న సంస్థలకు, ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయిన ఇతర ఒడిదుడుకులకు లోనైన సంస్థలకు మధ్య కచ్చితమైన నిర్వచనం చేసినప్పుడు మాత్రమే అది పటిష్టమైన రుణ పరిష్కార చట్టం కాగలదని ఆయన అభిప్రాయపడ్డారు. కంపెనీ ఆస్తులకంటే భవిష్యత్తుల్లో అది ఆర్జించే లాభాల విలువ తక్కువగా ఉంటే అలాంటి కంపెనీనిని ఆర్థికంగా కష్టాల్లో ఉన్నట్టు గుర్తించాలని కోరారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు లేకపోయినప్పటికీ.. కేవలం రుణాలు లేదా వడ్డీ చెల్లించలేని స్థితిలో ఉన్న కంపెనీని దివాలా పరిష్కార ప్రక్రియకు పంపడం సరైన నిర్ణయం కాదాన్నరు. అలాంటి సంస్థ ఆస్తులను గుర్తించి.. అది తిరిగి మనుగడ సాగించేలా తోడ్పాటు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. దేశంలో ఇప్పటికే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్స్(ఎన్సీఎల్టీ) పనిచేస్తున్నాయని.. మరో రెండు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. మరో 24 దివాలా పరిష్కార కోర్టులను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన అంశాన్ని ప్రస్తావించారు. ఎస్‌సీఎల్‌టీలలో మొత్తం 60 మంది న్యాయాధికారులు, సాంకేతిక సభ్యులు పని చేయాల్సి ఉండగా కేవలం 27 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని.. వారు 2,500 కేసులపై పనిచేస్తున్నట్టు తెలిపారు. -
సిండి‘కేటు’కు సంకెళ్లు
బ్యాంకు రుణం తీసుకోవాలంటే సామాన్యుడికి కష్టమే. ఒకవేళ ఒప్పుకున్నా రుణం మంజూరుకు సవాలక్ష నిబంధనలతో కాలయాపన చేస్తారు. మరి బ్యాంకు మేనేజర్ స్వయంగా తలచుకుంటే .. రూల్స్ గీల్స్ ఏవీ అడ్డురావు. అనుకున్న వారికి అనుకున్నంతా ఇస్తారు. డాక్యుమెంట్లు, కీలక పత్రాలు ఎలాంటివైనా ఓకే అంటారు. ఖాజీపేట సిండికేట్ బ్యాంకు మేనేజర్ అచ్చం అలాగే చేశారు. చేతివాటం ప్రదర్శించి రుణాలు మంజూరు చేశారు. తరువాత వచ్చిన మేనేజర్లు గుర్తించి ఫిర్యాదు చేయడంతో బండారం బయటపడింది. రెండేళ్లుగా దీనిపై సాగుతున్న విచారణ తాజాగా కొలిక్కివచ్చింది. ఈ కేసులో నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సాక్షి, ఖాజీపేట: ఖాజీపేట సిండికేట్ బ్యాంకులో గతంలో జరిగిన రుణాల గోల్‌మాల్‌పై విచారణ కొలిక్కి వచ్చింది. ఇక్కడ మేనేజర్‌గా జయంత్ బాబు 2014 జూన్ నుంచి 2016 జనవరి మధ్యకాలంలో పనిచేశారు. ఆ సమయంలో బ్యాంకును దళారీలకు కేంద్రంగా మార్చారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలు, ముద్ర రుణాలు వ్యవసాయ రుణాలు ఇలా ఒకటేమిటి అన్నీ దళారుల మధ్యవర్తిత్వంతోనే జరిగాయి. రుణం మంజూరుకు బేరం కుదర్చుకుని డబ్బు ముట్టిన తరువాత దళారీలు చెప్పినట్లు రుణాలు ఇచ్చేవారనే అభియోగముంది. అలా పెద్ద మొత్తంలోనే డబ్బులు చేతులు మారాయి. తరువాత అక్కడ నుంచి ఆయన బదిలీపై వెళ్లిపోయారు. సిక్ గ్రూపులకు రుణాలు చివరకు డ్వాక్రా గ్రూపు సంఘాలను బ్యాంకు మేనేజరు వదలలేదు. 7నుంచి 9సంవత్సరాలుగా సిక్ అయిన గ్రూపులపై ఆయన దృష్టి సారించారు. పూర్తి వివరాలు సంబంధిత యానిమేటర్ ద్వారా తెలుసుకున్నారు. డిఎల్, లక్ష్మిప్రసన్న, యువదర్శిని, గణేష్గ్రూపులు సిండికేట్ బ్యాంకులో ఏడేళ్లుగా రుణాలు చెల్లించక సిక్ గ్రూపులుగా ఉన్నాయి. ఈ గ్రూపుల యానిమేటర్, మేనేజర్ ఒక ఒప్పందానికి వచ్చి బకాయి రుణాన్ని చెల్లించి గ్రూపు సభ్యులకు తెలియకుండానే క్షణాల్లో వారికి రుణం మంజూరు చేశారు. మంజూరైన గ్రూపులకు పొదుపు డబ్బు లేక పోయినా కొత్తగా మంజూరు చేసిన రుణం పొదుపు గ్రూపు అకౌంట్లో ఉంచి మిగిలిన సొమ్ము డ్రా చేశారు. ఆ విధంగా నాలుగు గ్రూపులకు రూ.20 లక్షలు మంజూరు చేశారు. డీఎల్ గ్రూపులో కొందరు సభ్యులు చనిపోయారు. మిగిలిన చాలా మంది సభ్యులు స్థానికంగా లేరు. వారిపేరున బినామీలను పెట్టి ఫోర్జరీ సంతాలు చేసి తప్పుడు డ్యాక్యుమెంట్లు ఇచ్చి రుణాలు మంజూరు చేసి స్వాహా చేశారు. లక్ష్మి ప్రసన్న గ్రూపులో కూడా రూ.5 లక్షలు రుణం మంజూరు చేసి డ్రా చేశారు. అలా డ్రా చేశారని తెలియడంతో తిరిగి ఆ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించారు. తనకు మట్టి అంటకూడదని గూపు సభ్యుల సహకారం తీసుకున్నారు. వ్యక్తిగత రుణాలు ఇస్తానని చెప్పి కొత్తగా గ్రూపు సభ్యులు రుణం తీసుకున్నట్లు సంతకాలు చేయించి రుణాలను మంజూరు చేసినట్లు తెసింది. గణేష్ గ్రూపు సభ్యులు ఈ వ్యవహరంపై అప్పట్లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఫిర్యాదు డ్వాక్రా గ్రూపుల రుణాల్లో అక్రమాలు జరిగిన మాట నిజమేనని గతంలోనే వెలుగు అధికారులు గుర్తించారు. అప్పటి వెలుగు ఏరియా కోఆర్డినేటర్ ధనుంజయ్ బ్యాంకు మేనేజర్‌పై ఫిర్యాదు చేశారు. రుణాల మంజూరులో యానిమేటర్ కాంతమ్మకు సంబంధముందని తొలగించారు. తరువాత టీడీపీ ఇన్చార్జీ పుట్టా సుధాకర్‌యాదవ్ అధికారులపై ఒత్తిడి తెచ్చి తిరిగి ఆమెను యానిమేటర్‌గా కొనసాగించారు. డ్వాక్రా గ్రూపు రుణాల మంజూరులో అక్రమాలు జరిగాయంటూ 2017మార్చిలో సిండికేట్ బ్యాంకులో స్వాహా పర్వం అనే కథనం సాక్షిలో ప్రచురితమైంది. అప్పటి లీడ్ బ్యాంక్ మేనేజర్ రాఘనాధరెడ్డి ఈ వ్యవహారాలపై విచారణ చేపట్టారు. అక్రమాలు జరిగినట్లు ఆయన గుర్తించారు. అప్పడు స్థానిక టీడీపీ నాయకుల జోక్యంతో కేసు బయటకు రాకుండా తొక్కిపట్టారు. తరువాత వచ్చిన బ్యాంకు మేనేజర్లు ఈ అక్రమాల జోలికి వెళ్లకుండా మిన్నకుండి పోయారు. దీంతో విచారణ రెండేళ్లుగా సాగుతూనే వచ్చింది. మేనేజరుపై ఫిర్యాదు మేనేజరు అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపిన బ్యాంకు ఉన్నతాధికారులు కేసు నమోదుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో అప్పటి బ్యాంకు మేనేజర్ లీలాప్రతాప్ పోలీసులకు ఫిబ్రవరి 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.2.22 కోట్ల రుణాల మంజూరులో మేనేజరు నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేశారని, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రుణాలు ఇచ్చారని, అధికారాలను దుర్విని యోగం చేశారని ఫిర్యాదు చేశారు. కేసు విచారణ సీఐ కంబగిరి రాముడు వేగవంతం చేశారు. ఎన్నికల సందర్భంగా కొంత జాప్యం జరిగింది. తాజాగా ఆయన విచారణను వేగవంతం చేశారు. వెంకటసుబ్బయ్య, కాంతమ్మ, బ్యాంకు మాజీ మేనేజర్ జయంత్ బాబులను విచారించారు. ముగ్గురు అరెస్టు ఖాజీపేట : సిండికేట్ బ్యాంక్‌లో అక్రమాలకు పాల్పడిన బ్యాంక్ మాజీ మేనేజర్ జయంత్ బాబు శనివారం అరెస్ట్ అయ్యారు. ఆయనతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఎల్లయ్య అనే కీలక నిందుతుడు పరారీలో ఉన్నాడని మైదుకూరు రూరల్ సిఐ కంబగిరాముడు, ఖాజీపేట ఎస్ఐ రోషన్లు తెలిపారు. జయంత్ మేనేజర్‌గా పనిచేసిన కాలంలో దళారులను పెట్టుకుని బ్యాంకును అడ్డంగా దోచాడని తేలిందన్నారు. విచారించి ఖాజీపేట యానిమేటర్ కాంతమ్మ.. మీసాల వెంకటసుబ్బయ్యలను కూడా అరెస్టు చేశామన్నారు. ఫోర్జరీ సంతకాలతో పాటు దొంగ వెబ్‌ల్యాండ్, డాక్యుమెంట్లను సృష్టించిన ఎల్లయ్య పరారీలో ఉన్నాడు. త్వరలో పూర్తి విచారణ జరిపి రూ.2.22 కోట్లు రుణాల రికవరీ చేయాల్సి ఉందని తెల్పారు. మరికొందరిని విచారిస్తున్నామన్నారు. -
డీసీసీబీ కుంభకోణం విచారణలో కీలక మలుపు
సాక్షి, (పశ్చిమ గోదావరి) : ఇప్పటివరకూ సమన్వయంతో బ్యాంకు డబ్బులు స్వాహా చేసిన అధికారులు, డీసీసీబీ చైర్మన్ తాజాగా నిర్వహించిన ‘సమన్’వయ భేటీ చర్చనీయాంశమైంది. జిల్లా సహకార బ్యాంకులో జరిగిన కుంభకోణం విచారణకు అధికారులు శనివారం హాజరుకావాలంటూ ఉన్నతాధికారుల నుంచి సమన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులతో హడావుడిగా సమావేశమైన డీసీసీబీ చైర్మన్ ముత్యాలరత్నం స్వాహాకు కథ, దర్శకత్వం తానే అయినా.. ఎలాగైనా బయటపడతానని.. మీ సంగతి మాత్రం చూసుకోవాలంటూ ఓ ఉచిత సలహా పడేశారు. దీంతో అవాక్కవడం అధికారుల వంతైంది. జిల్లా సహకార బ్యాంకులో జరిగిన కుంభకోణంపై విచారణ సాగుతూనే ఉంది. ఫ్రిబవరిలో పాలకవర్గాన్ని రెండోసారి పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పుడే విచారణ కూడా పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే డీసీసీబీ చైర్మన్ గత ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి విచారణ సాగకుండా చేశారు. ఇప్పుడు తాజాగా ఈనెల 17న అధికారులందరూ విచారణకు హాజరుకావాలని విచారణ కమిటీ సభ్యులు డెప్యూటీ రిజిస్ట్రార్ ఎం.అబ్దుల్ లతీఫ్ డీసీసీబీ అధికారులకు సమన్లు జారీ చేయడంతో వారిలో టెన్షన్ మొదలైంది. దీంతో డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం అధికారులను తన ఇంటికి పిలిచి సమావేశం పెట్టారు. తాను ఎలాగొలా బయటకు వస్తానని, మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే విచారణ ఆపుకునే యత్నాలు చేయాలని సూచించినట్లు సమాచారం. దీనిలో భాగంగానే ఈ నెల 27న జరగాల్సిన డీసీసీబీ బోర్డు సమావేశాన్ని 17వ తేదీకి మార్చారు. ప్రభుత్వం మారడంతో విచారణ ఆపుకునే అవకాశం లేదని, ఏం చేయాలోననే ఆందోళన అధికారుల్లోనూ, పాలకవర్గంలోనూ కనపడుతోంది. అసలేం జరిగిందంటే.. ఈ పాలకవర్గం హయాంలో డీసీసీబీలో సుమారు రూ.33.32 కోట్ల రుణం సెక్యూరిటీలు లేకుండా ఇచ్చి బ్యాంకు నష్టాలకు అధికారులు, ఉద్యోగులు కారణమయ్యారు. వీరిపై విచారణ చేపట్టాలని జనవరిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది ఖరీఫ్‌లో కస్టమ్ మిల్లింగ్ విధానంలో ధాన్యం ఆడించి పౌర సరఫరాల శాఖకు బియ్యం ఇచ్చే మిల్లర్లు సరైన సెక్యూర్టీలు లేకుండా యలమంచిలి బ్యాంకు నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. మిగిలిన బ్యాంకుల నుంచి మరో రూ.13 కోట్ల వరకూ అప్పులు పొందారు. యలమంచిలి బ్యాంకు ఇన్చార్జి మేనేజరు, మరి కొందరు ఉద్యోగులు మిల్లర్లు సరైన సెక్యూర్టీలు ఇవ్వకపోయినా రూ.20 కోట్ల వరకు రుణాలు ఇచ్చేశారు. కస్టమ్ మిల్లింగ్ విధానంలో ధాన్యాన్ని ఆడించి బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు సరఫరా చేయాల్సిన మిల్లర్లు వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మేసుకున్నారు. దీంతో గుట్టురట్టయింది. దీంతో మిల్లర్లపై చర్యలకు పౌర సరఫరాల శాఖ నోటీసులు ఇచ్చి, సెక్యూర్టీగా పెట్టిన ఆస్తులను జప్తుకు యత్నించింది. మిల్లర్లు స్పందించకపోవడంతో పౌరసరఫరాల శాఖ రుణం ఇచ్చిన డీసీసీబీపై చర్యలకు ఉపక్రమించింది. సెక్యూర్టీల్లేకుండా రూ. 20 కోట్లు రుణం ఎలా ఇచ్చారని, వారి తరఫున సెక్యూర్టీ ఇచ్చి న బ్యాంకు బాధ్యత వహించాలని నోటీసులు జారీ చేసింది. విచారణకు షురూ.. దీంతో బ్యాంకు అధికారులు మిల్లర్ల నుంచి రుణం వసూలుకు యత్నించినా ఫలితం లేదు. దీంతో బాధ్యులైన బ్యాంకు మేనేజరు, ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అప్పటి కలెక్టర్ కాటంనేని భాస్కర్ రాష్ట్ర సహకార శాఖకు, ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ డెప్యూటీ రిజిస్ట్రార్ స్థాయి అధికారిని విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో హడావిడిగా డీసీసీబీ బ్యాంకు ఏజీఎం ఒకరు యలమంచిలి వెళ్లి మిల్లర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రుణం ఎగ్గొట్టి ఐపీ..! పాలకొల్లుకు చెందిన రైస్‌మిల్లర్ యలమంచిలి డీసీసీ బ్యాంకులో ఆస్తి తనఖా రిజిస్ట్రేషన్ చేయకుండా సుమారు రూ.11.90 కోట్లు రుణం పొందారు. దీన్ని ఎగ్గొట్టి ఐపీ దాఖలు చేసినట్లు సమాచారం. దీంతో బ్యాంకు అధికారులు హడావిడిగా పాలకొల్లు చాంబర్స్ కళాశాల సమీపంలోని పూలపల్లిలో ఎకరం రూ.2 కోట్లు విలువైన పంట పొలాన్ని హామీగా చూపి.. దాని విలువ రూ.8 కోట్లుగా చూపే యత్నం చేసినట్లు తెలిసింది. ఇరగవరం మండలానికి చెందిన ఇంకో రైతు రూ.6.90 కోట్లు తీసుకున్నాడు. తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులే బ్యాంకు సొమ్మును చెల్లించిన విషయాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రెండురోజుల క్రితం ఏజీఎం ఒకరు యలమంచిలి పోలీసులకు అప్పటి బ్యాంకు మేనేజర్, సిబ్బంది, రుణం తీసుకున్న సుందర రామిరెడ్డి అండ్ కోపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాల నుంచి బయటపడేందుకు సిబ్బంది చేసిన యత్నాలు సఫలం కాలేదు. ఈలోగా ప్రభుత్వం మారిపోవడంతో అధికారులు టెన్షన్ పడుతున్నారు. -
రూ.1,576 కోట్లు!
ప్రతియేటా పంట రుణం లక్ష్యాన్ని అంతోఇంతో పెంచుతూ.. ఆ విషయాన్ని ఘనంగా ప్రకటించుకుం టున్న బ్యాంకులు.. ఆ లక్ష్యం మేరకు రైతులకు రుణాలివ్వడంలో విఫలమవుతున్నాయి. ఈసారి కూడా గతేడాది కంటే 8శాతం పెంచి 2019–20 సంవత్సరానికి రూ.1,576 కోట్ల పంట రుణాలివ్వనున్నట్లు బ్యాంకులు ప్రకటించేశాయి. కానీ, ఆ మేరకు లక్ష్యాన్ని చేరుకుంటాయా.. అనేది సందేహాస్పదమే! ఎందుకంటే, 2017–18 కంటే 2018–19లో బ్యాంకులు రుణ లక్ష్యాన్ని 15శాతం పెంచాయి. కానీ, ఆ రెండు పంట కాలాల్లోనూ బ్యాంకులు నిర్ణీత లక్ష్యాన్ని అందుకోలేకపోయాయి. ఇప్పుడేమో 2018–19 కంటే 2019–20 సంవత్సరానికి 8శాతం పెంచాయి. మరి ఈ కొత్త లక్ష్యం ఏ మేరకు నెరవేరి.. రైతులకు అండగా నిలబడుతుందో వేచిచూడాలి. ఇదిలా ఉంటే, రుణ లక్ష్యం చేరుకోలేకపోవడం వెనుక బ్యాంకుల వైఫల్యమే కారణమని గతానుభవాలు చెబుతున్నాయి. ఎలాగంటే.. కొత్తగా అప్పు కోసం బ్యాంకుకు వచ్చే రైతులకు ఏవో కొర్రీలు పెడుతుండగా.. పాత రైతులకు ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ ప్రకారం రుణాలివ్వడం కుదరదని చెప్పేస్తున్నారు. దీంతో రైతులు బ్యాంకులపై ఆశలు వదులు కొని.. గత్యంతరం లేక బయట అప్పులు చేయాల్సి వ స్తోంది. ఇదే అదునుగా వడ్డీ వ్యాపారులు అన్నదాత రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. బ్యాంకులే గనక రుణాల మంజూరును సులభతరం చేస్తే.. తామెందుకు వడ్డీ వ్యా పారుల ఉచ్చులో పడతామని రైతులు ప్రశ్నిస్తున్నారు. సాక్షి, ఆదిలాబాద్ : జిల్లా రైతుల పరిస్థితి ఎప్పటిలాగే ప్రస్తుతం కూడా ఆగమ్యగోచరంగా మారింది. పంట వేద్దామని ఉన్నా.. చేతిలో చిల్లిగవ్వ ఉండదు. రుణాల కోసం బ్యాంకులకు వెళితే ఇస్తారన్న నమ్మకం లేదు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తే అసలుకే ఎసరు పెడుతున్నారు. ఇలా ప్రతియేటా అన్నదాతల కష్టాలు అన్నీఇన్నీ కావు. కానీ, బ్యాంకులు మాత్రం ఏయేటికాయేడు పంట రుణ లక్ష్యాన్ని పెంచుతూ వస్తున్నామని చాలా ఘనంగా చెబుతున్నాయి. రుణ లక్ష్యాన్ని పెంచుతున్న బ్యాంకులు.. ఆ మేరకు రైతులకు రుణాలను మాత్రం ఇవ్వడం లేదన్నది కాదనలేని సత్యం! కొత్తగా అప్పు కోసం బ్యాంకుకు వచ్చే రైతులకు అంత తొందరగా రుణాలివ్వడం లేదు. పాత రైతులకేమో వారు తీసుకున్న తీసుకున్న రుణాలు రీషెడ్యూల్ చేసుకోవాలని అంటారు. ఇక్కడ కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (పంట రుణ పరిమితి) ఉందని చెప్పి అప్పు ఇవ్వడానికి బ్యాంకులు వెనుకడుగు వేస్తాయి. అది ఖరీఫ్ గానీ.. రబీ గానీ.. ప్రతిసారీ ఇదే తంతు కొనసాగుతూ వస్తోంది. ఇలా బ్యాంకుల చుట్టూ తిరిగీతిరిగీ అలిసిపోయే రైతులు పంట వేసే సమయం దగ్గర పడగానే వేరే దిక్కు లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి. అన్నదాత నడ్డి విరుస్తున్న వడ్డీ.. గత్యంతరం లేక తమ దగ్గరికి అప్పు కోసం వస్తున్న రైతులను వడ్డీ వ్యాపారులు నిలువు దోపి డి చేస్తున్నారు. ఆ వడ్డీ.. ఈ వడ్డీ అంటూ అన్నదాతల నడ్డి విరుస్తున్నారు. ఇక ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లోనైతే ‘దిడి’ పేరిట వడ్డీ దందా కొనసాగుతోంది. దీని ప్రకారం తీసుకున్న అప్పు ను పంటకాలం పూర్తయ్యే వరకు అంటే.. ఆరు నెలలోపే కట్టాల్సి ఉంటుంది. ఈ దిక్కుమాలిన లెక్క ప్రకారం రూ.వెయ్యి అప్పు చేస్తే.. ఇచ్చేట ప్పుడు రూ.500 అదనంగా కట్టాలి. ఈ లెక్క చూ స్తే చాలు.. రైతు ఎంత దోపిడికి గురవుతున్నాడనేది తెలిసిపోతుంది. అదే రూ.20 వేల అప్పు తీసుకుంటే రూ.30 వేలు చెల్లించాలి. ‘దిడి’ దం దాయే కాకుండా కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ‘సవా యి’ వడ్డీ కూడా నడుస్తోంది. ఇందులో రూపాయి కి 25 పైసల చొప్పున వడ్డీ లెక్క కడతారు. బజార్హత్నూర్, బోథ్, నేరడిగొండ, బోథ్, గుడిహత్నూర్, తలమడుగు, తాంసి వంటి మండలాల్లో ఈ రకరకాల వడ్డీలు రైతుల పాలిట శాపంగా మారా యి. ఒకవేళ బ్యాంకులే పూర్తిస్థాయిలో రుణమిచ్చి ఆదుకుంటే రైతులకు ఈ పరిస్థితి ఎదురుకాదు. కీలక సమయంలో ఆదుకునేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదనేది సుస్పష్టం! గతంలోనూ ఇంతే.. 2018–19 ఆర్థిక సంవత్సరంలోనూ వానాకాలం, యాసంగి సీజన్లకు ఇవ్వాల్సిన రుణ లక్ష్యంలో బ్యాంకర్లు వెనుకబడ్డారు. జిల్లాలో వానాకాలం పంటలే ప్రధానం. ఈ సమయంలోనే రైతులకు విరివిగా రుణాలివ్వాలి. కానీ, బ్యాంకులు వివిధ కొర్రీలు పెట్టి రైతులను చుట్టూ తిప్పుకోవడం తప్ప ఆశించిన మేర రుణాలిచ్చిన దాఖలాలు చా లా స్వల్పం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఆ దిశగా ప్రణాళి కలేవీ కనుచూపు మేరలో కానరావడం లేదు. ఇదిలా ఉంటే, గతేడాది జిల్లాలో 85,501 మంది రైతులు తమ రుణాన్ని రెన్యూవల్ చేసుకున్నారు. మరో 16 వేల మంది చేసుకోలేదు. ఎన్నికల సమయం కావడంతో రుణ మాఫీ చేస్తారని పలువురు రైతులు పాత బకాయిలు కట్టకపోవడంతోపాటు కొత్త అప్పు కోసం కూడా ప్రయత్నించలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. కానీ, ఇదెంత వరకు నిజమో రైతులకు, బ్యాంకర్లకే తెలియాలి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇవ్వాల్సిందే.. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకర్లు రైతులకు పంట రుణాలు ఇవ్వాలి. కొన్ని బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అమలు చేయడం లేదని మా దృష్టికి వచ్చింది. ఇలాంటి బ్యాంకులపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఇప్పటి వరకు బ్యాంకు రుణం పొందని రైతులు బ్యాంకులకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు బయట అప్పులు తీసుకోవద్దు. వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు కలిసి రైతులు బ్యాంకు రుణాలే తీసుకునేలా అవగాహన కల్పించాలి.– జీవీఆర్ఎస్కె ప్రసాద్, లీక్ బ్యాంకు మేనేజర్, ఆదిలాబాద్ రెండేళ్లుగా తిరుగుతున్నా.. రెండేళ్ల కిందట విరాసత్ కింద ఐదెకరాలకు నా పేరు మీదా పట్టా అయింది. ఈ పట్టా తీసుకొని బ్యాంకుల చుట్టూ రెండేళ్లుగా తిరుగుతున్నా పంట రుణం ఇవ్వడం లేదు. అదేమిటంటే పాత రైతులకు ఇచ్చిన తర్వాత ఇస్తామని అధికారులు చెబుతున్నారు. తీరా అందరికీ ఇచ్చిన తర్వాత బ్యాంకుకు వెళ్తే రుణం ఇచ్చే గడువు అయిపోయిందని చెప్పి దాట వేస్తున్నారు. బ్యాంకు రుణం దొరక్క రెండేళ్లుగా రూ.45 వేల చొప్పున బయట వ్యాపారుల దగ్గర వడ్డీకి తీసుకున్నా. ఈ వానాకాలం పంటల ముందైనా బ్యాంకు రుణం ఇప్పించాలి. కుంరం గజానంద్, రైతు, పిట్టబొంగరం, ఇంద్రవెల్లి మండలం -
డ్వాక్రా సభ్యులకు కిలాడి లేడీ టోకరా
అనంతపురం, గుత్తి రూరల్: సభ్యులకు తెలియకుండా డ్వాక్రా సంఘం పేరుపై రూ.5లక్షలు బ్యాంకు రుణం పొంది ఉడాయించిన కిలాడి లేడీ వ్యవహారం సోమవారం వెలుగు చూసింది. పట్టణంలోని లెవెన్ స్టార్ మహిళా సంఘం సభ్యులు 2015లో లోన్ కోసం సిండికేట్ బ్యాంకును సంప్రదించారు. అయితే మేనేజర్ లోన్ దరఖాస్తును తిరస్కరించారు. సభ్యుల సంతకాలతో కూడిన డ్వాక్రా సంఘం డాక్యుమెంట్లను ఇమాంబీ అనే మహిళ తీసుకుని తాను లోను ఇప్పిస్తానని నమ్మబలికింది. కొన్ని రోజుల తర్వాత లోను గురించి డ్వాక్రా లీడర్ సరస్వతి అడిగితే ఆమె సమాధానం ఇవ్వలేదు. లోను మంజూరు కాలేదేమోనని భావించి మిన్నకుండిపోయారు. అయితే ఇమాంబీ బ్యాంకు సిబ్బంది, అప్పటి మెప్మా సిబ్బందితో కుమ్మక్కై రూ.5లక్షల లోను మంజూరు చేయించుకుంది. 16 నెలలపాటు కంతులు చెల్లించాక ఇమాంబీ పత్తాలేకుండా పోయింది. కంతుల చెల్లింపులు ఆగిపోవడంతో రూ.3.95 లక్షల మేర బకాయి పేరుకుపోయింది. రికవరీ కోసం బ్యాంకు మేనేజర్ ప్రమోద్‌కుమార్ సోమవారం లెవెన్ స్టార్ మహిళా సంఘం లీడర్ సరస్వతిని పిలిపించాడు. గ్రూపు పేరిట అప్పు ఉందని, చెల్లించాలని చెప్పడంతో లీడర్ నిర్ఘాంతపోయింది. తమకు తెలియకుండా, తాము లేకుండా అంతపెద్ద మొత్తం ఎప్పుడు, ఎవరికి ఇచ్చారంటూ మేనేజర్‌ను నిలదీసింది. అవన్నీ తమకు తెలియదని ఏదైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని మేనేజర్ సూచించారు. ఈ మేరకు లీడర్ సరస్వతి తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇమాంబీ గతంలో కూడా గుత్తి స్టేట్‌బ్యాంకులో ఐదు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన నగదు డ్రా చేసి పారిపోయిందని తెలిసింది. -
కుంటిసాకులు!
మహబూబ్‌నగర్ రూరల్: సంక్షేమ పథకాల అమలులో భాగంగా రైతులకు అందించే పంట రుణాలు జిల్లా వ్యాప్తంగా సగం మందికే అందడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. రైతులకు పంట రుణాలు సకాలంలో ఇవ్వాలని ఉన్నతాధికారులు బ్యాంకర్లకు సూచిస్తున్నా అమలు కావడంలేదు. గత ఖరీఫ్‌లో పంట రుణ లక్ష్యం రూ.1,410 కోట్లు కాగా జూన్ మాసం వరకు రూ.250 కోట్లు మాత్రమే ఇచ్చారు. అలాగే రబీ రుణ లక్ష్యం రూ.940 కోట్లు కాగా ఇప్పటివరకు కేవలం ఐదు శాతానికి కూడా మించలేదు. దీనికి బ్యాంకర్లు అనేక కారణాలు చెబుతున్నారు. రెన్యూవల్‌కు వెనుకంజ ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీలు తాము అధికారంలోకి వస్తే రూ.లక్ష నుంచి రూ. రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రకటించారు. దీంతో అప్పటికే రుణాలు తీసుకున్న రైతులు రెన్యూవల్ చేయించుకోవడానికి ముందుకు రావడంలేదు. ఈ కారణంగా లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నారు. బ్యాంకులు, రైతుల మధ్య వారధిగా ఉండి పంట రుణాలు సకాలంలో మంజూరీ విషయంలో ప్రముఖపాత్ర పోషించే లీడ్ బ్యాంకు అధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ కారణంగా ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో రైతులకు పంట రుణాలు అంతంత మాత్రంగానే అందాయి. ఖరీఫ్ లక్ష్యం రూ.1,410 కోట్లు కాగా జూన్ నాటికి కేవలం రూ.250 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు చెబుతున్నా వీరి వద్ద సమగ్ర సమాచారం లేకపోవడంతో రుణాల మంజూరీపై స్పష్టత కనిపించడం లేదు. లక్ష్యం మంచిదే కానీ.. ఖరీఫ్‌లో జిల్లా వార్షిక రుణ లక్ష్యం రూ.1,410 కోట్లు. అయితే ఇందులో ఇచ్చింది రూ. 250 కోట్లు మాత్రమే. అంటే సగం లక్ష్యాన్ని కూడా చేరలేదు. ఇక రబీలో రుణ లక్ష్యం రూ.940 కోట్లు కాగా ఇప్పటి వరకు కేవలం 5 శాతానికి కూడా మించలేదు. అంటే రైతులు ఈసారి రుణాల కోసం బ్యాంకులకు కూడా వెళ్లలేదన్న మాట. గతంలో మాదిరిగా కనీసం రెన్యూవల్ కూడా చేసుకోలేదు. దీంతో లక్ష్యం నీరుగారిపోతుంది. రుణమాఫీ ప్రకటనలే కారణమా? అధికారంలోకి వస్తే రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే రూ.లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేయించారు. తాజా ఎన్నికల్లోనూ అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో రుణమాఫీ అంశాన్ని ప్రకటించడంతో పంట రుణాలు చెల్లించేందుకు చాలామంది రైతులు ముందుకురావడం లేదని తెలుస్తోంది. అధికారంలోకి వస్తే ఏకంగా రూ. రెండు లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించగా బీజేపీతో పాటు ఇతర పార్టీలన్నీ మాఫీ అంశాన్నే ప్రచారం చేస్తున్నాయి. ఇక అధికార టీఆర్ఎస్ సైతం రుణ మాఫీని మరోసారి వర్తించనున్నట్లు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన నేపథ్యంలో రైతులు రుణం చెల్లించేందుకు కనీసం రెన్యూవల్ చేయించుకునేందుకు ముందుకురావడం లేదని సమాచారం. ఇదిలాఉండగా ప్రధాన బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులు రబీలో చెల్లించి వడ్డీ రాయితీ పొందాల్సి ఉండగా రుణాలు చెల్లించేందుకు గానీ, రీ షెడ్యూల్ చేసుకునేందుకు గానీ రైతులెవరూ ముందుకు రావడం లేదు. రబీలో జిల్లాలో రూ. 940 కోట్లు రుణం ఇవ్వాలని లక్ష్యం ఉండగా అందులో 5 శాతం కూడా పూర్తి కాలేదు. అయితే ఇండియన్ బ్యాంకు, కొటక్ మహేంద్ర బ్యాంకు, విజయా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, తెలంగాణ గ్రామీణ బ్యాంకు తదితర బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు టార్గెట్లు పెట్టుకున్నప్పటికినీ ఖరీఫ్ సీజన్లో జీరో శాతం కూడా పంట రుణాలు ఇవ్వలేదు. మాఫీ కలిసి వస్తుందా? వాస్తవంగా బ్యాంకుల్లో పంట రుణం తీసుకుంటే ప్రభుత్వం పంట రుణాన్ని మాఫీ చేసినప్పుడు మాఫీ వర్తిస్తుంది. రుణాన్ని రీ షెడ్యూల్ చేసినా వర్తిస్తుంది. ఈ విషయంలో రైతులకు అవగాహన ఉండదు. అందుకే రీ షెడ్యూల్‌కు ముందుకు రావడం లేదు. జిల్లాలోని రైతుల్లో దాదాపు 80 శాతం మంది రైతులు రూ. లక్షలోపు రుణం తీసుకున్న వారే ఉన్నారు. పంట రుణం రీ షెడ్యూల్ చేసుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే వడ్డీ సక్రమంగా రాకపోవడంతో బ్యాంకులు 7 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. వడ్డీతో పాటు ఇన్సూరెన్స్, బ్యాంకు ఖర్చులు ఇలా బ్యాంకులు ఇచ్చే లక్ష రుణానికి రూ.10వేలు అవుతున్నాయి. ఎలాగో ఎన్నికల్లో రాజకీయ పార్టీలు రుణమాఫీ వాగ్ధానాలు ప్రకటించగా వడ్డీతో సహా అధికారంలోకి వచ్చిన పార్టీలే చెల్లిస్తాయని రైతులు భరోసాతో ఉన్నారు. దీంతో బ్యాంకులు వడ్డీ మీద వడ్డీ వసూలు చేసినా రుణం రూ.2 లక్షల మించి వెళ్లదని రైతులు బ్యాంకర్లకే చెప్పే పరిస్థితి నెలకొంది. క్షేత్ర స్థాయి బ్యాంకు అధికారులు గ్రామాలకు వెళ్లి వడ్డీ చెల్లించి రుణాన్ని రీ షెడ్యూల్ చేసుకోమంటే గతంలో రుణం చెల్లించని వారికి మాఫీ అయ్యాయని, రెగ్యులర్‌గా చెల్లించిన వారికి మాత్రం మాఫీ కాలేదంటూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల సందర్భంగా కోడ్ ముగిసే వరకు ఆగాలని బ్యాంకర్లను రైతులు బతిమిలాడుతున్నారు. బ్యాంకులు ససేమిరా ఇప్పటికే బ్యాంకుల నుంచి పంట రుణం తీసుకున్న వారు ఎన్నికల వాగ్ధానాలతో చెల్లించేందుకు ససేమిరా అంటుంటే ఇదే సమయంలో బ్యాంకులు సైతం పంట రుణ పరిమితిని పెంచి ఇవ్వడం లేదు. నాబార్డు ప్రతిపాదించినట్లు రుణ పరిమితికి అనుగుణంగా పంట రుణాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నప్పటికీ బ్యాంకులు పట్టించుకోవడం లేదు. ప్రతి బ్యాంకు పంట రుణాన్ని పెంచి ఇవ్వాలని, వరికి ఎకరానికి రూ. 32వేల నుంచి రూ. 33వేలు, మొక్కజొన్నకు రూ, 22 వేల నుంచి రూ. 23వేలు ఇలా ప్రతి పంటకూ పెంచి ఇవ్వాలని రైతులు అడుగుతున్నారు. కానీ బ్యాంకర్లు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేవంటూ దాటవేస్తున్నారు. రైతులు రావడం లేదు పంట రుణాలు తీసుకున్న రైతులు బ్యాంకుల వైపు కన్నెత్తి చూడటం లేదు. రుణాలను రీ షెడ్యూల్ చేసుకోమంటే కూడా రుణం మాఫీ అవుతుందంటూ వ్యవసాయశాఖ అధికారులు, బ్యాంకర్లకు రకరకాల కారణాలు చెబుతున్నారు. దీంతో రైతులపై ఒత్తిడి చేయకలేపోతున్నాం. – ప్రభాకర్, లీడ్ బ్యాంకు మేనేజర్ -
ఈడీ ఎదుట హాజరైన సుజనా చౌదరి
సాక్షి, చెన్నై : బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన కేసులో టీడీపీ రాజ్యసభ సభ్యుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరి సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. బ్యాంకుల ఫిర్యాదు మేరకు సుజనా చౌదరి కంపెనీలపై ఈడీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. సుజనా చౌదరి మొత్తం 126 డొల్ల కంపెనీలు సృష్టించి.. బ్యాంకుల నుంచి ఏకంగా రూ. 7500 కోట్లు కొల్లగొట్టారని ఈడీ వెల్లడించింది. ఇప్పటికే సుజనా చౌదరి అక్రమాలపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. కాగా, ఈడీ జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని సుజనా చౌదరి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గత శుక్రవారం దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ ధర్మాసనం పిటీషనర్ వాదనలతో ఏకీభవించలేదు. దీంతో పిటిషన్‌ను కొట్టివేస్తూ.. డిసెంబర్ 3న ఈడీ ముందు సుజనా చౌదరి వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశించింది. -
ఢిల్లీ హైకోర్టులో సుజనాకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన కేసులో టీడీపీ రాజ్యసభ సభ్యుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని సుజనా చౌదరి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ ధర్మాసనం పిటీషనర్ వాదనలతో ఏకీభవించలేదు. దీంతో పిటిషన్‌ను కొట్టివేస్తూ.. డిసెంబర్ 3న ఈడీ ముందు సుజనా చౌదరి వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశించింది. (ఆంధ్రప్రదేశ్ మాల్యా... సుజనా!) అసలేం జరిగిందంటే.. బ్యాంకుల ఫిర్యాదు మేరకు సుజనా చౌదరి కంపెనీలపై ఈడీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. సుజనా చౌదరి మొత్తం 120 డొల్ల కంపెనీలు సృష్టించి.. బ్యాంకుల నుంచి ఏకంగా రూ. 5,700 కోట్లు కొల్లగొట్టారని ఈడీ వెల్లడించింది. ఇప్పటికే సుజనా చౌదరి అక్రమాలపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని కోర్టు మెట్లెక్కిన సుజనా ఢిల్లీ ధర్మాసనం తీర్పుతో కంగు తిన్నారు. (బ్యాంకులకు కుచ్చుటోపీ: సుజనాకు ఈడీ షాక్..) -
ఆ రూ.133 కోట్లు ఎక్కడివి?
సాక్షి, అమరావతి: టీడీపీ ఎంపీ వై. సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా పదవి చేపట్టడానికి సరిగ్గా రెండు రోజుల ముందు తీర్చేసిన రూ.133 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రధానంగా దృష్టి సారించింది. మంత్రి పదవికి అడ్డంకిగా మారిన రూ.133 కోట్ల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాన్ని 2014 నవంబర్ 7న సుజనా చెల్లించారు. అనంతరం రెండు రోజులకే మోదీ సర్కారు రెండో విడత మంత్రివర్గ విస్తరణలో 2014 నవంబర్ 9వ తేదీన సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా సుజనా చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. బ్యాంకు డిఫాల్టర్లకు మంత్రి పదవి ఎలా ఇస్తారని కాంగ్రెస్‌తో సహా బ్యాంకు యూనియన్లు సైతం నిలదీయటంతో సుజనా చౌదరి తన పేరుతో ఉన్న రుణాలన్నీ తీర్చేసిన తర్వాతే మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు. అప్పటికే 2014 డిఫాల్టర్ల లిస్టును ఆడిట్ కమిటీ ఆమోదించడంతో ఆ జాబితాలో సుజనా యూనివర్సల్ పేరు కూడా ఉంది. కానీ తన పేరు మీద ఎటువంటి రుణాలు లేవని సుజనా చౌదరి అప్పట్లో స్వయంగా చెప్పారు. అంతేకాదు నవంబర్ 13న సుజనాగ్రూపు డైరక్టర్ల పదవి నుంచి తప్పుకుంటూ రాజీనామా చేశారు. 2015 డిఫాల్టర్ల లిస్టు నుంచి సుజనా పేరును తొలగించడంపై బ్యాంకు యూనియన్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. టీడీపీ ప్రధాన ఆర్థిక వనరు సుజనా...! నరేంద్ర మోదీ గత ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు మిత్రపక్షానికి రెండు క్యాబినెట్ బెర్తులు ఇస్తామని ప్రతిపాదించగా అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిల పేర్లను టీడీపీ సూచించింది. అయితే బ్యాంకు డిఫాల్టర్ల జాబితాలో సుజనా పేరు ఉండటంతో ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు మోదీ తిరస్కరించారు. దీంతో తొలివిడత మంత్రివర్గంలో సుజనాకు అవకాశం లభించలేదు. అనంతరం రెండోసారి మంత్రి వర్గ విస్తరణ సమయంలో కూడా చంద్రబాబు మరోసారి ఆయన పేరునే సూచించడంతో బకాయిలు చెల్లిస్తే తమకు అభ్యంతరం లేదన్న ప్రతిపాదన రావడంతో సుజనా హడావుడిగా రూ.133 కోట్ల రుణాన్ని తీర్చినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన వ్యక్తికే మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు పట్టుబట్టడంటీడీపీకి సుజనా ప్రధాన ఆర్థిక వనరు అనే విషయాన్ని స్పష్టం చేస్తోందంటున్నారు. ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? సుజనా చౌదరి కేంద్ర మంత్రి పదవి చేపట్టే నాటికి గ్రూపు సంస్థలు భారీ నష్టాల్లో ఉండటమే కాకుండా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయి. 2013 నాటికి సుజనా గ్రూపు వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.930 కోట్లు బకాయి పడినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. 2013–14 ఆర్థిక సంవత్సరానికి సుజనా మెటల్స్ రూ.38 కోట్లు, సుజనా యూనివర్సల్ రూ.6.3 కోట్లు, సుజనా టవర్స్ రూ.1.8 కోట్ల నష్టాలను ప్రకటించాయి. మరి ఇంత నష్టాల్లో ఉన్న కంపెనీలు రూ.133 కోట్ల రుణాన్ని ఎలా తీర్చగలిగాయి? ఈ నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారనే అంశాలపై ఈడీ ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విచారణలో ఈ అంశంపైనే ప్రధానంగా దృష్టి సారించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో ఈనెల 27న విచారణకు హాజరు కాలేనని సుజనా చౌదరి ఆదివారం ప్రకటించిన సంగతి విదితమే. -
సొంతింటి సంకటం
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గృహ లబ్ధిదారులుఇరకాటంలో పడ్డారు. బ్యాంకులు రుణాలు ఇస్తాయో లేదో తెలియదు కాని లబ్ధిదారులు మాత్రం వరుసగా మూడు వాయిదాల సొమ్ము చెల్లించాల్సిందేనంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతోఅందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. పశ్చిమగోదావరి,భీమవరం టౌన్: ప్రభుత్వం పట్టణాలలో అట్టహాసంగా చేపట్టిన అందరికీ ఇళ్లు పథకంలో గృహ నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. కొన్ని బ్యాంకులు ఇంకా లబ్ధిదారులతో అకౌంట్లు ప్రారంభించుకునే అవకాశం కూడా కల్పించలేదు. ఈ నేపథ్యంలో ఇల్లు ఎప్పటికి వస్తుందో తెలియదుగాని ఒక్కసారిగా లబ్ధిదారుని వాటా సొమ్ము మొత్తం చెల్లించాలనడంపై పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీప్లస్ 3 తరహాలో ఇళ్లు : సొంతిల్లు లేని నిరుపేదలు ఉండకూడదన్న ఆశయంతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భీమవరం పట్టణం తాడేరు రోడ్డులో 82 ఎకరాల స్థలాన్ని సేకరించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ స్థలంలో జీప్లస్ 3 తరహాలో 9,500 ఇళ్లు నిర్మించేందుకు నిర్ణయించింది. ఆ తర్వాత దీన్ని 8,352 గృహాలకు పరిమితం చేసిఏపీ టిడ్కో పర్యవేక్షణలో ఎల్అండ్టీ కంపెనీ నిర్మాణం చేపట్టింది. తొలినుంచీ ప్రహసనమే లబ్ధిదారుల ఎంపిక తొలి నుంచి ప్రహసనంగా మారింది. అర్హులను దరఖాస్తు చేసుకోమని ఆ తర్వాత వివిధ నిబంధనలతో మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ ఏడాదికి పైగా ప్రదక్షిణలు చేయించారు. పేదలతో రూ.200 వ్యయం చేయించి పాన్ కార్డులు కూడా చేయించారు. ఇల్లు మంజూరు అయ్యిందో లేదో తెలుసుకునేందుకు లబ్ధిదారులు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎట్టకేలకు కొంత మందికి ప్లాట్లు కేటాయించినట్లు నంబర్లు ఇచ్చారు. ఈ పథకంలో కేటగిరి ఎ, కేటగిరి బి, కేటగిరి సి గా విభిజించారు. కేటగిరి ఎలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్ నిర్మిస్తారు. కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ1.50 లక్షలు సబ్సిడీగా మంజూరు చేస్తుంది. లబ్ధిదారుల వాటా రూ.500 ఒక విడత చెల్లిస్తే సరిపోతుంది. బ్యాంకు రుణం రూ.2,64,500. కేటగిరి బిలో 365 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్ నిర్మిస్తారు. కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు సబ్సిడీగా మంజూరు చేస్తుంది. లబ్ధిదారుల వాటా రూ. 50,000 ఒక విడతలోగాని నాలుగు విడతల్లోగాని చెల్లించవచ్చు. బ్యాంకు రుణం రూ.3.15 లక్షలు. కేటగిరి సిలో 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్ నిర్మిస్తారు. కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ1.50 లక్షలు సబ్సిడీగా మంజూరు చేస్తుంది. లబ్ధిదారుల వాటా రూ.1,00,000. ఒక విడతలోగాని నాలుగువిడతల్లోగాని చెల్లించ్చవచ్చు. బ్యాంకు రుణం రూ.3.65 లక్షలు. ఒకేసారి చెల్లించాలంటూ.. ఇల్లు మంజూరు కాగానే లబ్ధిదారుడు తొలి విడతగా తన వంతు వాటాను భీమవరం మున్సిపాలిటీ కమిషనర్ పేరిట బ్యాంకుల్లో డీడీ తీసి అందచేశారు. కేటగిరీ ఎలో రూ.500 చెల్లించడంతో లబ్ధిదారుని వాటా పూర్తయ్యింది. ఇక కేటగిరి బి విభాగంలో లబ్ధిదారులు తొలి దఫాగా రూ.12,500, కేటగిరి సీ లబ్ధిదారులు తొలి విడతగా 25,000 చెల్లించారు. తాజాగా ప్రస్తుతం ఒక వాయిదా, డిసెంబర్లో రెండు వాయిదాల సొమ్ము చెల్లించాలని అధికారులు ఆదేశించారు. ఒకేసారి ఇంత మొత్తం ఎలా చెల్లించగలమంటూ పేదల్లో ఆందోళన మొదలైంది. కేటగిరి బిలో 3,520 ఫ్లాట్లు నిర్మించనున్నారు. ఒక్కో బ్లాక్‌కు 32 ఫ్లాట్ల వంతున 110 బ్లాకులు నిర్మిస్తారు. ఈ లెక్కన ఇప్పటికిప్పుడు బి.కేటగిరీ విభాగం లబ్ధిదారులు రూ.88 లక్షలు, సి కేటగిరీ విభాగంలో లబ్ధిదారులు రూ.7.4 కోట్లు మొత్తం రూ.7.92 కోట్లు చెల్లించే భారం పేదలపై పడుతోంది. ఆ వెనువెంటనే రెండు కేటగిరీల్లోని లబ్ధిదారులు మరో రూ.3.96 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇది పేదలకు గుదిబండగా మారింది. బ్యాంక్ రుణం పొందేందుకు లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటి వరకూ బ్యాంకులు రుణం మంజూరు చేసే విషయంలో స్పష్టమైన హామీని ఇవ్వలేదు. కొన్ని బ్యాంకులు లబ్ధిదారునితో అకౌంట్లు ప్రారంభించేందుకు కూడా అంగీకరించడం లేదు. బ్యాంకు రుణం పొందాలంటే అన్ని వివరాలతోపాటు ఫ్లాట్ కేటాయింపు పత్రం, లీగల్ ఒపీనియన్, ట్రై పార్టైట్ అగ్రిమెంట్ సేల్ డీడ్ పత్రాలు కూడా అవసరమవుతాయి. ఇంత వరకూ ఇటువంటి ఏర్పాట్లు జరగలేదు. బ్యాంకు రుణం పూర్తిగా చెల్లించిన తర్వాతే ఇంటిపై లబ్ధిదారునికి సొంత యాజమాన్య హక్కు కలుగుతుంది. అప్పుడే యాజమాన్యపు దస్తావేజులు అందచేస్తారు. అన్నీ వాయిదాలే 2017 జూన్ 19న ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. 15 నెలల వ్యవధిలో పూర్తి చేసి గృహప్రవేశాలు జరిపిస్తామన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వాయిదాలు పడుతూనే వస్తోంది. గృహ నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. దీంతోపాటు బాహ్య భౌతిక సదుపాయాలు, ఇతర సదుపాయాలను కల్పిస్తేనే లబ్ధిదారుడు గృహ ప్రవేశం చేయగలడు. ఇవన్నీ ఎప్పటికి పూర్తవుతాయో తెలియదుగాని లబ్ధిదారున్ని మాత్రం పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి లబ్ధిదారునితో వాయిదా సొమ్ము డీడీలు తీసుకోవాల్సి ఉండగా ప్రభుత్వ పరంగా జరిగిన జాప్యానికి ఇప్పుడు ఒకేసారి భారం మోపుతున్నారు. ఒక్కసారిగా ఇంత మొత్తం ఎలా చెల్లించగలమంటూ పట్టణ ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల మహిళలు మున్సిపాలిటీ వద్ద ధర్నా చేశారు. చైర్మన్ కొటికలపూడి గోవిందరావు పేదలతో మాట్లాడుతూ ముందుగానే లబ్ధిదారుని వాటా నాలుగు వాయిదాల్లో చెల్లించాల్సి ఉందన్నారు. ప్రతీ మూడు నెలలకో వాయిదా చెల్లించాలని తొలి వాయిదా 2017లో కట్టారని మిగిలింది చెల్లించక తప్పదన్నారు. ప్రస్తుతం ఒక వాయిదా వచ్చేనెల ఒక వాయిదా, ఇల్లు ఇచ్చే ముందు మరో వాయిదా చెల్లించాలని సూచించారు. బ్యాంకు రుణాలకు వెళ్లాలంటే వాయిదాలు చెల్లించాలన్నారు. పేదల విజ్ఞప్తిని మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ దృష్టికి తీసుకు వెళతానన్నారు. అయితే పేదలు మాత్రం ఇంటి అద్దె కట్టడానికే ఇబ్బందులు పడుతున్నామని ఒకేసారి తాము వాయిదాలు చెల్లించలేమని బ్యాంకులు కూడా రుణం ఎప్పుడు ఇస్తాయో ఇంత వరకూ స్పష్టత లేదని నిరసన వ్యక్తం చేశారు. అవస్థలు పడుతున్నాం ఇంటి అద్దె చెల్లించలేక ఎన్నో అవస్థలు పడుతున్నాం. ఇంటి ఖర్చులు తగ్గించుకుని మిగిల్చి దాన్ని అద్దెగా చెల్లించాల్సిన పరిస్థితి మాది. ఇల్లు మంజూరైందంటే ఎంతో ఆనందపడ్డాం. కాని ఇప్పుడు ఒకేసారి వాయిదాలు చెల్లించాలంటే రోజుకు ఒక పూటయినా కుటుంబం పస్తులు ఉండాల్సిందే. అప్పులు చేయాలి ఆ బాకీకి వడ్డీ చెల్లించాలంటే ఎన్నో తిప్పలు పడాలి. ఇలాంటి విధానం సరికాదు. పేదలకు వెసులుబాటు కల్పించేలా అధికారులు నిర్ణయం తీసుకోవాలి.– నజీరుద్దిన్, 19వ వార్డు, భీమవరం త్రైపాక్షిక ఒప్పందం పూర్తికావాలి బ్యాంకర్లకు, లబ్ధిదారులకు ఒప్పందం కుదరాలంటే నాలుగు వాయిదాల సొమ్ము చెల్లించి ఉండాలి. ప్రతి మూడు నెలలకు ఒక వాయిదా చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే ఆలస్యమైంది. ఇళ్లు త్వరితగతిన కేటాయించాలంటే ట్రైపార్టైట్ (త్రైపాక్షిక ఒప్పందం) పూర్తి కావాలి. ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులు వాయిదాల డీడీ అందచేయాల్సి ఉంది. లబ్ధిదారునిపై ఇప్పటి వరకూ ఎటువంటి ఒత్తిడి చేయలేదు. ఈ పాటికే వాయిదాలు చెల్లించి ఉంటే సరిపోయేది.– సుబ్రహ్మణ్యం, ఏపీ టిడ్కో ఈఈ -
యాసంగి లక్ష్యంలో 6 శాతమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బ్యాంకులు రైతులకు యాసంగి రుణాలిచ్చేందుకు గజగజలాడుతున్నాయి! అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రకటించిన రైతు రుణమాఫీ హామీలు దడ పుట్టిస్తుండటంతో రైతులకు కొత్త రుణాలివ్వకుండా వారికి చుక్కలు చూపిస్తున్నాయి. నిబంధనల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఏడాది (2018–19)కి ఇవ్వాల్సిన రైతు రుణాల లక్షం రూ. 17 వేల కోట్లలో ఇప్పటివరకు కేవలం రూ. వెయ్యి కోట్లే (సుమారు 6 శాతం) ఇచ్చాయి. దీంతో లక్షలాది మంది అన్నదాతలు ఇప్పుడు అప్పు కోసం నానా పాట్లు పడుతున్నారు. రాజకీయ పార్టీల రుణమాఫీ హామీల కారణంగా తాము నిబంధనలు పాటించాల్సి వస్తుందని బ్యాంకర్లు చెబుతుంటే నిబంధనల పేరు చెప్పి బ్యాంకులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. రుణం తీసుకుంటే ఎలాగూ మాఫీ అవుతుందన్న ధీమాతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 19 శాతం కొత్త ఖాతాదారులు నమోదయ్యారని, రబీలో కూడా రుణాలు ఇస్తే ఆ సంఖ్య 40 శాతం దాటుతుందని ఓ బ్యాంకు అధికారి వెల్లడించారు. లక్ష్యం రూ. 17 వేల కోట్లు... ఇచ్చింది రూ. 1,000 కోట్లే... రబీలో తెలంగాణ రైతాంగానికి రూ. 17 వేల కోట్ల మేర రుణాలు ఇవ్వాలని ఈ ఏడాది మొదట్లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా బ్యాంకులు అక్టోబర్‌లోనే రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. అయితే రుణాల మంజూరులో బ్యాంకులు ఒక్కసారిగా అన్ని నిబంధనలను తెరమీదకు తెచ్చాయి. రుణాల రీ షెడ్యూల్‌కు అంగీకరించడం లేదు. ఎవరైనా రైతు ఎక్కువ రుణం కావాలని వెళ్తే నిబంధనల ప్రకారం మీకు వచ్చేది అందులో 25 శాతమేనని చెబుతున్నాయి. రైతు అడిగిన మొత్తంలో అతని లావాదేవీలనుబట్టి 80 శాతం నుంచి 90 శాతం ఇవ్వడమన్నది సాధారణం. కానీ ఈసారి బ్యాంకులు అందుకు అంగీకరించడం లేదు. ఈ కారణంగా నవంబర్ 2వ తేదీ నాటికి తెలంగాణలో రైతాంగానికి ఇచ్చిన అప్పుల మొత్తం రూ. 1,000 కోట్ల లోపే. నెలాఖరు దాకా రుణాలు ఇచ్చినా ఆ మొత్తం రూ. 2,000 కోట్లు దాటకపోవచ్చని బ్యాంకర్లే అంటున్నారు. గతేడాది (2017–18) రబీలో రూ. 15,901 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే బ్యాంకులు 10,384 కోట్లు ఇచ్చాయి. అంతకు ముందు ఏడాది అంటే 2016–17లో రూ.15 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకుని రూ.13456 కోట్లు మంజూరు చేశాయి. ఈ ఏడాది మాత్రం లక్ష్యంగా 25 శాతం కూడా ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. క్యూ కడుతున్న కొత్త రైతులు... గత ఖరీఫ్ సీజన్లో మునుపెన్నడూ లేనివిధంగా 19 శాతం కొత్తవారు రైతు రుణాలు పొందారని బ్యాంకర్లు విశ్లేషిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రుణమాఫీ అవుతుందన్న ఉద్దేశంతో భూమి ఉన్న ప్రతి ఒక్కరూ రుణాల కోసం క్యూ కడుతున్నారని, ఈ పరిణామం నిజంగా వ్యవసాయం చేసుకునే రైతులకు ఇబ్బందిగా మారింద ని కూడా బ్యాంకర్లే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎవరైనా పంట రుణం కోసం వెళ్తే బ్యాంకర్లు వారిని ఏం పని చేస్తుంటారని అడుగుతున్నారు. ఒకవేళ ఫలానా ఉద్యోగం అని చెబితే మరి వ్యవసాయ రుణం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అప్పు కావాలని ఎవరైనా కొత్త రైతు గట్టిగా అడిగితే బ్యాంక్ ఇన్స్పెక్టర్ వస్తారు.. పంటల సాగు కోసం ఏం చేస్తున్నారో పరిశీలిస్తారని చెబుతున్నారు. అప్పు ఖాతాకు రైతు బంధు సొమ్ము బదిలీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పంట రుణం మాఫీ అవుతుందని భావించి రైతులు ఖరీఫ్ రుణాలు చెల్లించలేదు. ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ. 4 వేలు ఇస్తున్న మొత్తం రైతు బ్యాంకు ఖాతాలో పడగానే బ్యాంకర్లు దాన్ని వెంటనే ఆ రైతు అప్పు ఖాతాకు బదిలీ చేసేస్తున్నారు. దీనిపై రైతులు గగ్గోలు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చేవారు రుణమాఫీ చేస్తామంటుంటే బ్యాంకులు సతాయిస్తున్నాయని మండిపడుతున్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం యాపలగూడెంకు చెందిన సంజీవరెడ్డి రబీలో వరి సాగుకు రూ. లక్ష రుణం కావాలని ఎస్బీఐని ఆశ్రయించాడు. ఖరీఫ్ సీజన్లో రుణం ఎందుకు తీసుకోలేదు? మాఫీ ఆశించి రుణం కోసం ఇప్పుడు వచ్చావా? నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి కదా వ్యవసాయం ఎలా చేస్తావు? అంటూ యక్ష ప్రశ్నలు వేసిన బ్యాంకు అధికారులు రుణం ఇవ్వబోమన తేల్చిచెప్పారు. కరీంగనర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన గోపగాని సమ్మయ్య పంటల సాగు కోసం ఖరీఫ్‌లో కొంత రుణం తీసుకున్నాడు. తీసుకున్న మొత్తానికి వడ్డీ చెల్లించి రుణాన్ని రీ షెడ్యూల్ చేయించుకోవడంతోపాటు కొత్తగా మరికొంత రుణం కోసం బ్యాంకును ఆశ్రయించాడు. అయితే పూర్తి మొత్తం చెల్లిస్తేనే కొత్త రుణం ఇస్తామన్న బ్యాంకు మెలికతో కంగుతిన్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా బూత్పూర్ మండలం కరివేన గ్రామానికి చెందిన గంగుల వేణుగోపాల్‌రెడ్డి ఖరీఫ్‌లో తీసుకున్న రుణం పూర్తిగా చెల్లించడంతోపాటు రబీలో ఎక్కువ అవసరం ఉందని బ్యాంకును ఆశ్రయించాడు. గతంలో అడిగినంత రుణం ఇచ్చిన బ్యాంకు ఈసారి మాత్రం ఆయన అడిగిన దానిలో 25 శాతమే ఇస్తామని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగాడు. రుణమాఫీ హామీలే కారణమా? ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఏకకాలంలో రూ. 2 లక్షల చొప్పున రైతు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్, రూ. లక్ష చొప్పున మాఫీ చేస్తామని టీఆర్ఎస్ ఇప్పటికే హామీలు ఇచ్చాయి. గత ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ పూర్తి రుణమాఫీ హామీ ఇచ్చినా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేయడంతో రైతులతోపాటు బ్యాంకులు సంక్షోభాన్ని చవిచూశాయి. తెలంగాణలో రూ. లక్షలోపు రైతు రుణాలు చెల్లించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల సమయం తీసుకుంది. ‘రైతు రుణమాఫీ హామీల కారణంగా బ్యాంకింగ్ రంగం ఇబ్బందుల పాలవుతోంది. ఇతర రంగాలకు సరైన సేవలు అందించలేకపోతున్నాము. ఏడాది ముందు నుంచే రాజకీయ పార్టీలు రుణమాఫీ అంటుండటంతో వసూళ్లలో మందగమనం ఏర్పడింది. ఖరీఫ్‌లో అది మరింతగా పెరిగింది’అని లీడ్ బ్యాంక్ (ఎస్బీఐ) సీనియర్ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. నిబంధనల మేరకు రుణాలు ఇవ్వాలని లీడ్ బ్యాంక్ తెలంగాణలోని అన్ని బ్యాంకు శాఖలను ఆదేశించింది. ట్రాక్ రికార్డు బాగున్న రైతులకు ఏ ఇబ్బందీ లేకుండా రుణాలు మంజూరు చేస్తున్నామని ఆ అధికారి అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోతున్నది బ్యాంకులు, రైతులేనని, దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించామని హైదరాబాద్ రిజర్వు బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. -
సంతకాల ఫోర్జరీతో ఘరానా మోసం
టీడీపీ మాజీ సర్పంచ్ తన పలుకుబడిని ఉపయోగించి 33 మంది డ్వాక్రా సభ్యుల పేరుతో బ్యాంకులో రూ.13 లక్షలు రుణాలు మంజూరు చేయించారు. అనంతరం వారి సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బు స్వాహా చేశారు. సంఘాల సభ్యులకు బ్యాంకుల నుంచి నోటీసులు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కేవీబీపురం : మండలంలోని దిగువపుత్తూరుకు చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ అదే గ్రామంలో పాల కేంద్రాన్ని నిర్వహిస్తోంది. తన వద్ద పాలు పోసే అదే గ్రామానికి చెందిన 33 మంది డ్వాక్రా మహిళలకు ఆవులపై బ్యాంకు రుణాలు మంజూరు చేయిస్తానని నమ్మబలికింది. పాలు పోయగా వచ్చిన డబ్బులో కొంత చెల్లిస్తే సరిపోతుందని పేర్కొంది. దీంతో మహిళలు ఆమెను నమ్మారు. 2016 ఆగస్టులో పాలమంగళం సప్తగిరి గ్రామీన బ్యాంకు నుంచి ఆవులపై వ్యక్తిగత లోన్ల కింద ఒక్కోక్కరికి రూ.40 వేల రుణం మంజూరు చేయింది. అప్పటి నుంచి మహిళలు సంబంధిత పాల కేంద్రంలో పాలు పోస్తూ కొద్ది కొద్దిగా డబ్బు జమచేసుకుంటూ వచ్చారు. రూ.83 వేలు చెల్లించాలని బ్యాంకు నోటీసులు డ్వాక్రా మహిళలకు గత మంగళవారం వారికి బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి. అందులో బ్యాంకులో రూ.83 వేలు అప్పు ఉందని, వెంటనే చెల్లించాలని ఉంది. దీంతో డ్వాక్రా మహిళలు ఖంగుతిన్నారు. మునెమ్మ అనే బాధితురాలు మాజీ సర్పంచ్‌ను నిలదీయగా పొంతన లేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చింది. తక్షణం లెక్కలు తేల్చాలని నిలదీసింది. ఇప్పటి వరకు తీసుకున్న బ్యాంకు రుణంలో రూ.20 వేలు మాత్రమే తీరిందని, ఇంకా రూ.20 వేలు చెల్లించాలని పాల కేంద్రం నిర్వాహకురాలు, మాజీ సర్పంచ్ తెలిపింది. మహిళలు బ్యాంకులో ఆరా తీయగా 2017 జూలైలో రూ.40 వేలు రుణం తీసుకున్నారని, ప్రస్తుతం రూ.83 వేలు బకాయి ఉందని అధికారులు తేల్చి చెప్పారు. గతంలో తీసుకున్న అప్పుకు రూ.20 వేలు జమ అయిందని, రెండో విడత తీసుకున్న రూ.40 వేలు, వడ్డీ కలిపి రూ.83 వేలు అప్పు ఉన్నట్లు వివరించారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడడంతో పలువురు డ్వాక్రా సంఘాల సభ్యులు బ్యాంకులో ఆరాతీస్తున్నారు. బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తమకు జరిగిన మోసంపై ప్రశ్నించిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని సంబంధిత మాజీ సర్పంచ్ బెదిరిస్తున్నట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. బ్యాంకు అధికారుల పాత్రపైనా అనుమానాలు సాధారణంగా బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం అంత సులభం కాదు. అలాంటిది ఖాతాదారులు లేకుండా.. వారితో ప్రత్యక్షంగా సంతకాలు తీసుకోకుండా 33 మందికి చెందిన రూ.13 లక్షలు ఒకరికే ఇవ్వడంపై బ్యాంకు అధికారుల పాత్రపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలో తీసుకున్న రుణం తీరకముందే రుణాలు మంజూరు చేయడంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్లుగా లెక్కలు లేవు రెండేళ్ల క్రితం బ్యాంకు నుంచి రూ.40 వేలు రుణం తీసుకున్నాము. అప్పటి నుంచి పాలు పోస్తూనే ఉన్నాం. వాటికి సంబంధించి లెక్కలు లేవు. అడిగితే వాయిదాలు వేస్తూ వస్తోంది. నిజం తెలిసి నిలదీస్తే కేసులు, పరువు నష్టం దావా వేస్తానని బెదిరిస్తోంది. మాకు న్యాయం చేయండయ్యా. – మునెమ్మ, బాధితురాలు మా కడుపు కొట్టడం ధర్మం కాదు కూలీ నాలీ చేసుకుని బతికేవాళ్లం. మాలాంటి వాళ్ల ను మోసం చేసి..మా కడుపు కొట్టడం ధర్మంకాదు. బ్యాంకు నుంచి డబ్బు తీసుకున్నది ఒకరైతే.. వాళ్లని వదిలేసి మాకు నోటీసులు పంపిస్తే అంత డబ్బు మేమెక్కడి నుంచి కట్టేది. ఒత్తిడి పెరిగితే ఆత్మహత్యలే గతి. – చిట్టెమ్మ, బాధితురాలు మేము లేకుండా రుణాలు ఎలా ఇస్తారు నేను బ్యాంకుకు అప్పు ఉన్నప్పటికీ మళ్లీ అప్పు ఎలా ఇస్తారు. అది కూడా మేము లేకుండా మా సంతకాలను చూసి ఎలా ఇస్తారు. బ్యాంకు అధికారులు తప్పుడు లెక్కలు చూపించి కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు న్యాయం చేయాలి. – రాణెమ్మ, బాధితురాలు నిబంధనల ప్రకారమే రుణాలు మంజూరు చేశాం పూర్తి నిబంధనలతో వారి సంతకాల ప్రకారమే రుణాలు మంజూరు చేశాం. ఏది ఏమైనా వారు తీసుకున్న రుణాలు చెల్లించాల్సిందే. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బ్యాంకును, ప్రజలను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం.– మురళి,సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజర్,పాలమంగళం -
మాల్యా కేసులో గ్రేట్ విక్టరీ
లండన్ : బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కేసులో భారత ప్రభుత్వం ఘన విజయం సాధించింది. భారత ప్రభుత్వ ధాటికి తట్టుకోలేక ఎట్టకేలకు దిగొచ్చిన విజయ్ మాల్యా బ్యాంకులకు బకాయి పడిన రుణాలన్నింటిన్నీ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఉన్న రుణాలను సెటిల్ చేయడానికి తాను ప్రయత్నాలన్నింటిన్నీ కొనసాగిస్తున్నానని చెప్పారు. తీసుకున్న రుణాలన్నింటినీ సెటిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, భారత ప్రభుత్వం తనపై కనికరం లేకుండా వ్యవహరిస్తోందని, ఇలాంటి వ్యవహారాలతో తాను అలసిపోయినట్టు పేర్కొన్నారు. రుణాలను రికవరీ చేయడం సివిల్ విషయమని, కానీ తనది మాత్రం క్రిమినల్ కేసుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయంపై మాల్యా, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రధానమంత్రికి రాసినట్టు చెబుతున్న లేఖ ప్రస్తుతం బహిర్గతమైంది. బ్యాంకుల రుణాలను సెటిల్ చేసుకోవడానికి మాల్యా అంగీకరించినట్టు ఆలేఖలో ఉంది. అయితే కన్సార్టియం ఆఫ్ బ్యాంకుల విషయంలో మాల్యా అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిల్లో నకిలీ బ్యాంకులు ఉన్నట్టు మాల్యా ఆరోపించారు. రుణాలను చెల్లించడంలో భాగంగా న్యాయ పర్యవేక్షణలో ఉన్న తన ఆస్తులను విక్రయించడానికి కోర్టు అనుమతి ఇవ్వాలని మాల్యా కోరారు. విక్రయించిన ఆస్తుల ద్వారా తాను బ్యాంకులకు రుణాలు చెల్లిస్తానని ప్రకటించారు. బ్యాంకులకు దాదాపు రూ.13 వేల కోట్ల మేర రుణాలను మాల్యా బకాయి పడిన సంగతి తెలిసిందే. మాల్యాను ఎలాగైనా భారత్‌కు రప్పించాలని దర్యాప్తు సంస్థలు చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో సుదీర్ఘ కాలం తర్వాత ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. అయితే తన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని మాల్యా ఆరోపించారు. బ్యాంకులకు భారీగా రుణాలు ఎగ్గొట్టిన మాల్యా, ప్రస్తుతం లండన్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. అతన్ని భారత్‌కు అప్పగించే వ్యవహారంపై లండన్ కోర్టులో ప్రస్తుతం విచారణ కూడా జరుగుతోంది. -
ఇటు పరిహారం.. అటు రికవరీ!
సాక్షి, జడ్చర్ల టౌన్ : వారందరూ ముంపు గ్రామాల రైతులు.. ఉన్న పొలం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కోల్పోతున్నారు.. అంతకుముందే ఆ భూములపై బ్యాంకులో రుణం తీసుకున్నారు... ఇప్పుడు పరిహారం వస్తున్నందున రుణం చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు ఒత్తిడి తీసుకొస్తుండడం ఆరోపణలకు తావిస్తోంది.. ఇది మొదటి దశేనని, రెండో దశ పరిహారం రాగానే రుణం చెల్లిస్తామని రైతులు చెబుతుండగా.. మొత్తం భూములే కోల్పోతున్నందున రుణం రికవరీ చేసుకునేందుకు తమకు మరో మార్గం లేదని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిహారం చెక్కులను కళ్లతోనైనా చూసుకోకుండానే లాక్కోవడం ఎంతవరకు సబబంటూ జడ్చర్ల తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. 273 ఎకరాలకు పరిహారం జడ్చర్ల మండలం ఖానాపూర్ గ్రామంలో వ్యవసాయ పొలాలు మొత్తం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉదండాపూర్ రిజర్వాయర్‌లో 800 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. నిందులో 273 ఎకరాలకు సంబంధించి రూ.1,49,09,375 పరిహారం విడుదలైంది. ఈ డబ్బుకు సంబంధించి రైతులకు చెక్కులను తహసీల్దార్ కార్యాలయంలో అందజేస్తున్నారు. ఈ మేరకు గురువారం 75మంది రైతులకు జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో చెక్కులు ఇవ్వగా.. అక్కడకు కారుకొండ కెనరాబ్యాంక్ ఇన్చార్జి రాజేష్ చేరుకుని 12 మంది రైతుల నుంచి చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. ఆ చెక్కులను రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని.. వారం తర్వాత రుణం పోను మిగతా నగదు తీసుకోవచ్చని తెలిపారు. తహసీల్ వద్ద ఆందోళన ముంపు రైతులు సోమవారం జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో చెక్కులు తీసుకునేందుకు వచ్చారు. అయితే బ్యాంక్ ఇన్చార్జి రాజేష్ వచ్చే వరకు అధికారులు చెక్కులు ఇవ్వలేదు. సదరు అధికారి వచ్చాక చెక్కులు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధం కాగానే.. తనకు అందజేయాలని బ్యాంకు అధికారి కోరాడు. దీంతో రైతులు చెక్కులు తీసుకోకుండా ఆందోళనకు దిగారు. ఇవి మొదటి విడతే అయినందున రెండో విడత చెక్కులు వచ్చాక రుణం చెల్లిస్తామని బదులిచ్చారు. ఇలా ఇరువర్గాల వాదనలతో చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. 1,200ఖాతాలు.. రూ.12కోట్ల రుణం నవాబుపేట మండలం కారుకొండ గ్రామంలో కెనరాబ్యాంక్ ఏర్పాటు చేశారు. బ్యాంకు పరిధి లో ఖానాపూర్, కారుకొండ గ్రామాలు ఉన్నా యి. రెండు గ్రామాల్లో 1,200ఖాతాలు రైతులకు సంబంధించి ఉండగా ప్రస్తుతం రూ. 12కోట్ల వ్యవసాయ రుణాలు రికవరీ కావాల్సి ఉంది. వీటిలో సగభాగం ఖానాపూర్ గ్రామ రైతులవే. ప్రభుత్వం ఇటీవల కొత్త పాస్‌పుస్తకా లు పంపిణీ చేసినప్పటికీ ఖానాపూర్ ముంపుకు గురవుతుండటంతో ఇక్కడ రైతుల కు రాలేదు. ప్రస్తుతం పరిహారం చెక్కులు వస్తుం డడంతో బ్యాంక్ అధికారులు తహసీల్‌కు చేరుకున్నారు. అయితే, కలెక్టర్‌తో సంప్రదించి లీడ్‌బ్యాంక్ మేనేజర్‌కు ముందుస్తుగా సమాచారం ఇచ్చాకే రికవరీ చేస్తున్నామని చెబుతున్నారు. బలవంతంగా చెక్ తీసుకున్నారు నాకు మొత్తం రూ.18లక్షల చెక్ వచ్చింది. క్రాప్‌లోన్ రూ.10వేలు మాత్రమే ఉంది. దీనికోసం నా చెక్ మొత్తం తీసుకుని ఖాతాలో జమ చేస్తామంటూ తీసుకున్నారు. నా ఇష్టంతో చెక్ ఇవ్వలేదు. ఓ వైపు పొలాలు పోయి బాధలో ఉంటే బ్యాంక్ అధికారులు చెక్కులు లాక్కోవటం సబబు కాదు. – చాకలి చిన్న రాములు, ఖానాపూర్ కొద్ది మొత్తమే వచ్చింది.. నా భూమి మొత్తం 8ఎకరాలు పోతుంది. అంత భూమికి డబ్బులు రాలే. సగం డబ్బులు అంటే రూ.16.38 లక్షలే వచ్చాయ్. నా క్రాప్ లోన్ రూ.1.10లక్షలే ఉంది. రెండో విడత డబ్బు వచ్చాక రుణం చెల్లిస్తానన్నా వినకుండా చెక్ లాగేసుకున్నారు. – ఊశన్న, ఖానాపూర్ మేం ఎన్ఓసీ ఇస్తేనే పాస్ అవుతుంది.. ఖానాపూర్ రైతుల క్రాప్ లో న్ బకాయిలు ఇప్పుడు వ సూలు చేసుకోవాల్సిందే. భూములు ముంపునకు గురవుతున్నందున ఆ త ర్వాత వారు రుణం చెల్లించలేరు. ఇన్నాళ్లు సేవలందించిన మా బ్యాంకును కాదని కొందరు రైతులు పరిహారం చెక్కులను ఇతర బ్యాంకుల్లో వేసుకుని డ్రా చేసుకుంటున్నారు. అందుకోసం లీడ్‌బ్యాంక్ మేనేజర్‌తో సంప్రదించి ఇకపై మా బ్యాంకు ఎన్ఓసీ ఇస్తేనే ఏ బ్యాంకులోనైనా పాస్ అయ్యేలా చర్యలు తీసుకోనున్నాం. – రాజేష్, కెనరా బ్యాంక్ ఇన్చార్జి, కారుకొండ -
‘మార్చ్ ఎండింగ్’ను వాడేసుకున్నారు!
సాక్షి, సిటీబ్యూరో : ఆర్థిక సంవత్సరం ముగింపు సమయమైన మార్చ్ ఎండింగ్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చాలా బిజీగా ఉంటాయి. ఈ సమయంలో వచ్చే రుణ దరఖాస్తులను అన్ని కోణాల్లోనూ పరిశీలించకుండా ఏజెంట్లను నమ్ముతాయి. దీనిని అనుకూలంగా మార్చుకుందో త్రయం. ఇద్దరు బ్యాంకు ఏజెంట్లతో ముఠా కట్టిన సూత్రధారి ఆరు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు దాఖలు చేయడం ద్వారా కేవలం 20 రోజుల్లో రూ.77 లక్షలు రుణం తీసుకుని ఎగ్గొట్టాడు. గతేడాది చోటు చేసుకున్న ఈ స్కామ్‌పై రెండు ఆర్థిక సంస్థలు ఇటీవల పంజగుట్ట, బేగంపేట ఠాణాల్లో ఫిర్యాదులు చేశాయి. రంగంలోకి దిగిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.8.66 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు గురువారం వెల్లడించారు. జీతం సరిపోకపోవడంతో... పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడానికి చెందిన కంచర్ల శ్రీనివాస్ ఐటీఐ పూర్తి చేసి 2001లో సిటీకి వలసవచ్చాడు. గచ్చిబౌలిలోని విప్రో సంస్థలో కమ్యూనికేషన్స్ విభాగంలో నెలకు రూ.30 వేల జీతానికి ఉద్యోగంలో చేరాడు. ఈ జీతంతో జల్సాలు, కుటుంబ పోషణ సాధ్యం కాకపోవడంతో అప్పులు పెరిగాయి. వీటి నుంచి బయపడే మార్గాలు అన్వేషిస్తున్న ఇతడికి కూకట్‌పల్లికి చెందిన వేణుగోపాల్లో పరిచయం ఏర్పడింది. నకిలీ పత్రాలతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేయడం ఎలాగో నేర్పిన ఇతగాడు అందుకు అవసరమైన బోగస్ పాన్‌కార్డులు, గుర్తింపు పత్రాలు, ఇతర ధ్రువీకరణలు సైతం తయారు చేసి ఇచ్చాడు. వీటి ఆధారంగా రుణాలు తీసుకోవడానికి మార్చ్ ఎండింగ్ సరైన సమయమంటూ సూచించాడు. అయితే బోగస్ పత్రాల ఆధారంగా రుణం పొందాలంటే బ్యాంకు ఏజెంట్ల సహకారం ఉండాలని భావించిన శ్రీనివాస్ సోమాజిగూడ, మియాపూర్లకు చెందిన మల్లికార్జునరావు, నాగిరెడ్డిలను తనతో కలుపుకున్నాడు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి తీసుకునే రుణంలో సగం వీరు, మిగిలిన సగం శ్రీనివాస్ తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. ఐదు సంస్థలు..రూ.77 లక్షలు... విప్రోలో పని చేస్తున్న శ్రీనివాస్ అక్కడ ధ్వంసం చేయాల్సిన డేటా నుంచి కొన్ని ఫొటోలు, ఇతర పత్రాలు సేకరించాడు. వీటి ఆధారంగా వేణుగోపాల్ సాయంతో బోగస్ పత్రాలు, «ధ్రువీకరణలు తయారు చేయించాడు. శ్రీనివాస్ జీతం రూ.30 వేలు కాగా, దీనిని రూ.1.26 లక్షలకు పెంచుతూ నకిలీ పే స్లిప్స్ రూపొందించారు. వీటిని దాఖలు చేస్తూ ఈ ముఠా గతేడాది మార్చ్‌లో మొత్తం ఆరు సంస్థలకు రుణం కోసం దరఖాస్తు చేసింది. ఏజెంట్లు మల్లికార్జున్, నాగిరెడ్డి ఫీల్డ్ వెరిఫికేషన్ స్టాఫ్‌ను, రుణ మంజూరు అధికారులను ఏమార్చడంతో రుణాలు మంజూరయ్యాయి. యాక్సిస్ బ్యాంక్ నుంచి రూ.10 లక్షలు, సిటీ బ్యాంక్ నుంచి రూ.12 లక్షలు, ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి రూ.12.5 లక్షలు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుంచి రూ.15 లక్షలు, క్యాపిటల్ ఫస్ట్ సంస్థ నుంచి రూ.15 లక్షలు, టాటా క్యాపిటల్ సంస్థ నుంచి రూ.12.5 లక్షలు తీసుకున్నారు. ఈ మొత్తంలో సగం మల్లికార్జున్, నాగిరెడ్డి తీసుకోగా మిగిలింది శ్రీనివాస్ పట్టుకుని తన స్వస్థలానికి వెళ్ళిపోయాడు. అక్కడ అప్పులు తీర్చడంతో పాటు జల్సాలకు ఖర్చు చేశాడు. ఏడాది ఆలస్యంగా ఫిర్యాదులు... ఈ వ్యక్తిగత రుణాలకు సంబంధించి శ్రీనివాస్ ప్రతి నెల వాయిదాలు చెల్లించకపోవడంతో క్యాపిటల్ ఫస్ట్, సిటీ బ్యాంక్ సంస్థలు ఆరా తీశాయి. ఈ నేపథ్యంలో తమకు దాఖలు చేసిన పత్రాలు, దరఖాస్తుల్లో ఉన్న ఫొటో శ్రీనివాస్‌ది కాదని తేలింది. వేరే వారి ఫొటో అతడి వివరాలతో వీటిని రూపొందించారని, విప్రోలోనూ ఉద్యోగం మానేసినట్లు బయటపడింది. కూకట్‌పల్లిలో అతడు ఇచ్చిన చిరునామా సైతం బోగస్‌గా గుర్తించారు. అయినప్పటికీ దాదాపు ఏడాదికి పైగా ఆల స్యం చేసిన ఈ రెండు సంస్థలూ ఇటీవల పం జగు ట్ట, బేగంపేట ఠాణాలో ఫిర్యాదు చేశాయి. నార్త్‌జో న్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు శ్రవణ్‌కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీకాంత్, కేఎస్ రవి రంగంలోకి దిగారు. అనేక ప్రాంతాల్లో గాలించి గురువారం శ్రీనివాస్, మల్లికార్జున్, నాగిరెడ్డిలను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.8.66 లక్షల నగదు, బోగస్ గుర్తింపుకార్డులు, నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు కు సంబంధించిన మరో నిందితుడు వేణుగోపాల్ ఆచూకీ లభించట్లేదు. శ్రీనివాస్ నుంచి తీసుకోవాల్సిన కమీషన్ సైతం అతడు తీసుకోలే దు. అతడు చనిపోయాడంటూ శ్రీనివాస్ చెబుతుండటంతో పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. దొంగలకు రోజుల్లో రుణాలు బోగస్ పత్రాలు, నకిలీ ధ్రువీకరణలతో దరఖాస్తు చేస్తున్న దొంగలకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కేవలం రోజుల్లో రుణాలు ఇచ్చేస్తున్నాయి. సాధారణ వ్యక్తులు పక్కాగా అప్లై చేసుకున్నా వారాలు, నెలలు తమ చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని ఆయా సంస్థలు గుర్తించాలి. తమ వైఖరి మార్చుకుంటూ సంస్థాగతంగా ఉన్న లోపాలు సరిచేసుకోవాలి. ఏదైనా మోసం జరిగితే ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసుల కు ఫిర్యాదు చేయాలి. ఈ కేసులో బ్యాంకు సిబ్బంది, అధికారుల పాత్ర ఉందా? అనే కోణ ంలో ఆరా తీస్తున్నాం. ఫీల్డ్ వెరిఫికేషన్ సిబ్బ ంది వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఆధారాలు లభిస్తే వారినీ అరెస్టుచేస్తాం. – పి.రాధాకిషన్‌రావు, డీసీపీ, టాస్క్‌ఫోర్స్ -
దీపక్ కొచర్‌కు మళ్లీ ఐటీ నోటీసులు
న్యూఢిల్లీ: వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంకు రుణం ఇచ్చిన కేసులో బ్యాంకు సీఈఓ చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌కు ఆదాయపన్ను శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పన్ను ఎగవేత అంశాన్ని ఐటీ శాఖ దర్యాప్తు చేస్తుండటం తెలిసిందే. దీపక్ కొచర్‌కు వ్యక్తిగత హోదాలోనే ఈ నోటీసులు జారీ చేశామని, నూపవర్ రెన్యువబుల్స్ కంపెనీ ఎండీగా దీపక్ కొచర్ వ్యక్తిగత ఆర్థిక అంశాలు, లావాదేవీల వివరాలు కోరామని ఐటీ వర్గాలు తెలిపాయి. పది రోజుల్లోగా డాక్యుమెంట్లు సమర్పించాలని నోటీసుల్లో ఐటీ శాఖ కోరింది. మారిషస్‌కు చెందిన రెండు సంస్థల (ఫస్ట్ లాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్, డీహెచ్ రెన్యువబుల్స్ హోల్డింగ్స్) నుంచి నూపవర్ రెన్యువబుల్స్లోకి రూ.325 కోట్ల నిధుల రాకపై ఐటీ శాఖ తన దర్యాప్తులో ప్రత్యేకంగా దృష్టి సారించింది. -
చిన్న ప్రాజెక్ట్‌లు.. పెద్ద లాభాలు!
సాక్షి, హైదరాబాద్: పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనాలా? లేక చిన్న స్థలంలో కట్టే ప్రాజెక్ట్లల్లో కొనాలా? అని గృహ కొనుగోలుదారులు సందిగ్ధ పడుతుంటారు. నిజం చెప్పాలంటే వీటికవే ప్రయోజనకరమైనవే. కానీ, కొంత ఎక్కువ లాభం చేకూరాలన్నా లేక త్వరగా గృహ ప్రవేశం కావాలన్నా సరే చిన్న ప్రాజెక్ట్‌ల్లో ఇల్లు కొనడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న ప్రాజెక్ట్‌లు విస్తీర్ణంలోనే చిన్నవి.. వసతుల్లో మాత్రం పెద్ద ప్రాజెక్ట్‌లకు ఏమాత్రం తీసిపోవు. పైపెచ్చు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉండటం చిన్న ప్రాజెక్ట్‌లకు మరింత కలిసొచ్చే అంశం. బడా ప్రాజెక్టులు నిర్మించాలంటే కోట్లలో పెట్టుబడి కావాలి. అమ్మకాలు బాగుంటే పర్వాలేదు.. కానీ, సీన్ రివర్స్ అయ్యిందో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం కష్టం. దీంతో అటు కొనుగోలుదారులకు, ఇటు నిర్మాణ సంస్థలకూ తలనొప్పే. ప్రతికూల పరిస్థితుల్లో గొప్పకు పోయి పెద్ద మొత్తంలో బ్యాంకు రుణాలు తెచ్చి ప్రాజెక్ట్‌లు ప్రారం భించి అమ్మకాల్లేక బోర్డు తిప్పేసిన సంస్థలనేకం. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా హాట్‌కేకుల్లా ప్రాజెక్ట్ అమ్ముడుపోవాలంటే చిన్న ప్రాజెక్ట్‌లే మేలని సూచిస్తున్నారు నిపుణులు. చేతిలో ఉన్న కొద్దిపాటి పెట్టుబడితో ప్రాజెక్ట్‌ను ప్రారంభించి.. పునాదుల్లోనే సగానికి పైగా అమ్మకాలు చేసుకునే వీలుంటుంది కూడా. ఏడాదిలో గృహప్రవేశం.. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో కొద్ది పాటి స్థలంలోనే చిన్నపాటి నిర్మాణాలు చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం కావటం, ఆధునిక వసతులూ కల్పిస్తుండటంతో కస్టమర్లు ఫ్లాట్లు కొనేందుకు ముందుకొస్తున్నారు. చిన్న ప్రాజెక్ట్‌ల మార్కెట్లో లాభాలు తక్కువే అయినా నిర్మాణం చేపట్టడానికి సిద్ధం. ఎందుకంటే ఈ నిర్మాణాలు ఏడాది లేక 15 నెలల్లో పూర్తవుతాయి. దీంతో త్వరగానే కొనుగోలుదారుల సొంతింటి కల నెరవేరడంతో పాటు మార్కెట్లో తమ కంపెనీ బ్రాండింగ్ పెరుగుతుందనేది నిర్మాణ సంస్థల వ్యూహం. అయితే చిన్న ప్రాజెక్ట్‌లు నిర్మించాలంటే స్థలం అంత సులువుగా దొరకదు. పోటీ ఎక్కువగా ఉంటుంది. -
సిటీ నీరవ్.. రంగారెడ్డి
లేని కంపెనీలను ఉన్నట్లు నమ్మించాడు. పదుల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నట్లు నమ్మబలికాడు. వీరి పేరిట బ్యాంకుల్లో సాలరీ ఎకౌంట్లను ఓపెన్ చేసి...క్రెడిట్ కార్డులు సైతం పొంది దాదాపు కోటిన్నర రూపాయలకు టెండర్ వేశాడు నగరానికి చెందిన కంభం రంగారెడ్డి.ఉత్తరాదికి చెందిన నీరవ్ మోదీ మాదిరిగానే ‘షెల్ కంపెనీ’లతో బ్యాంకులను మోసగించాడు. రెండేళ్లుగా కనిపించకుండా తిరుగుతుండగా..ఎట్టకేలకు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగారెడ్డి ఆటకట్టించారు. ఇతనికి సహకరించిన 9 మందిని సైతం అరెస్టు చేశారు. సాక్షి,సిటీబ్యూరో: ఉత్తరాదికి చెందిన నీరవ్ మోదీ షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ఒకే బ్యాంకు నుంచి రూ.వేల కోట్లు రుణాలు తీసుకుని పరారయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన కుంభం రంగారెడ్డి దాదాపు అదే బాటలో పయనించాడు. షెల్ కంపెనీ ఏర్పా టు చేయడంతో పాటు అందులో పదుల సంఖ్యలో బోగస్ ఉద్యోగులను క్రియేట్ చేసి వారి పేర్లతో నాలుగు బ్యాంకుల్లో శాలరీ అకౌంట్స్ తెరిచాడు. వీటి ఆధారంగా క్రెడిట్ కార్డ్స్ పొంది రూ.1.52 కోట్ల మేర వాడేసుకున్నాడు. దాదాపు రెండేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న రంగారెడ్డితో పాటు ఇతడికి సహకరించిన 9 మంది నిందితులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో రెండు బ్యాంకులు, జీహెచ్ఎంసీకి చెందిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సైతం ఉన్నట్లు సిటీ పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు గురు వారం వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ, అదనపు డీసీపీలు పి.రాధాకిషన్‌రావు, ఎస్.చైతన్యకుమార్‌లతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ పూర్తి వివరాలు వెల్లడించారు. రెండు కార్డులు ఇచ్చిన అనుభంతో... నల్లగొండ జిల్లా తెలుగుపల్లికి చెందిన కుంభం రంగారెడ్డి డిగ్రీ చదువుతూ మధ్యలోనే మానేశాడు. 1998 నుంచి హయత్‌నగర్ మండలంలోని తుర్కయాంజల్‌లో స్థిరపడిన ఇతను కంప్యూటర్ హార్డ్‌వేర్ ట్రైనింగ్ తీసుకుని కర్మన్‌ఘాట్ ప్రాంతంలో దుకాణం ఏర్పాటు చేశాడు. ఇందులో నష్టాలు రావడంతో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల కోసం అన్వేషించాడు. అదే సందర్భంలో తనతో పాటు భార్య పేరుతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి రెండు క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో రంగారెడ్డికి బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ డివిజన్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న గోపతోటి కిషోర్‌బాబుతో పరిచయమైంది. అతడి ద్వారా క్రెడిట్ కార్డులు పొందే విధానం, జారీలో బ్యాంకుల వద్ద ఉన్న లోటుపాట్లు తెలుసుకున్నాడు. భారీ స్థాయిలో క్రెడిట్‌కార్డులు తీసుకుని మోసం చేస్తే ‘లాభం’ ఉంటుందని భావించిన రంగారెడ్డి తన బావమరిది తిప్పర్తి విజయ్‌కుమార్‌రెడ్డితో కలిసి రంగంలోకి దిగాడు. కర్మన్‌ఘాట్ ప్రాంతంలో ఓ రేకుల షెడ్డును అద్దెకు తీసుకుని ‘ప్రణిక నానో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశాడు. డేటా ప్రాసెసింగ్ చేస్తుందంటూ కేవలం నాలుగు కంప్యూటర్లు ఏర్పాటు చేసి రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్‌లో రిజస్టర్ చేయించుకున్నాడు. ఈ తతంగం మొత్తం 2013 ఏప్రిల్‌లో జరిగింది. టీ స్టాల్, బార్బర్ షాపు నిర్వాహకులే.. తనకు పరిచయస్తులైన అనేక మంది నుంచి మాయమాటలు చెప్పి ఫొటోలు, ఇతర పత్రాలు సేకరించిన రంగారెడ్డి వారందరూ తన సంస్థలో ఉద్యోగులంటూ ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. కర్మన్‌ఘాట్ ప్రాంతంలో ఉండే కొందరు బార్బర్ షాపు యజమానులు, టీ స్టాల్ నిర్వాహకుల ఫొటోలు సైతం సేకరించి వీరు బీటెక్, ఎంటెక్, ఎంబీఏలు పూర్తి చేసినట్లు నకిలీ వివరాలు సృష్టిస్తూ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఇంజినీర్లుగా, హెచ్ఆర్ నిర్వాహకులుగా మార్చాడు. ఈ వ్యవహారాల్లో ఫొటోలు ఎవరివి తీసుకున్నా.. పేరు, చిరుమానాలు మాత్రం బోగస్‌వి వాడుతూ సిమ్‌కార్డులు తీసుకోవడంతో పాటు వీరందరినీ ఉద్యోగులుగా మార్చేశాడు. వీరి వివరాలతో ఓటర్ ఐడీ, పాన్‌కార్డు దరఖాస్తులను హయత్‌నగర్‌కు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు మేక సంతోష్‌రెడ్డి ద్వారా అప్లోడ్ చేయించాడు. జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ సర్కిల్లో ఎలక్షన్ విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్న వరికుప్పల శ్రీకాంత్, మేకల నరేష్ ద్వారా ఈ దరఖాస్తులను అప్రూవ్ చేయించి ఓటర్ ఐడీ కార్డులు తీసుకున్నాడు. వీటి ఆధారంగా పాన్‌కార్డులు సైతం పొందాడు. మొత్తం 41 మంది తన సంస్థలో పని చేస్తున్నట్లు క్రియేట్ చేసిన రంగారెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి వారి పేర్లతో ఓ ప్రైవేట్ బ్యాంకులో శాలరీ అకౌంట్స్ తెరిచాడు. ఒక్కో కార్డుకు సంబంధించిన సంతోష్‌కు రూ.2 వేలు, శ్రీకాంత్‌కు రూ.1500, నరేష్‌కు రూ.1000 చొప్పున చెల్లించారు. మూడు నెలలు జీతాల కథ నడిపి... ఇలా తెరిచిన శాలరీ అకౌంట్స్ ఖాతాలకు సంబంధించి ఏటీఎం కార్డులు, చెక్ పుస్తకాలను రంగారెడ్డి, విజయ్‌కుమార్ తమ వద్దే ఉంచుకున్నారు. దాదాపు మూడు నెలల పాటు జీతాలు వేయడంతో పాటు ఆ మొత్తాలను వీరే డ్రా చేసుకున్నారు. ఇలా రూపొందించిన స్టేట్మెంట్స్, బోగస్ ధ్రువీకరణలను ఆధారంగా చేసుకుని ఎస్బీఐ. హెచ్డీఎఫ్సీ, స్టాండర్డ్ చార్టర్డ్, ఆర్డీఎల్ బ్యాంకులకు క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ డివిజన్లో, వెరిఫికేషన్ విభాగాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గోపతోటి కిషోర్‌బాబు, జి.శైలేష్‌కుమార్, ఎస్బీఐకి చెందిన ఆర్.సందీప్ కుమార్, యు.ఆనంద్‌రావు సహాయంతో కార్డులు మంజూరయ్యేలా చేశాడు. ఒక్కో కార్డుకు కొంత కమీషన్‌గా చెల్లిస్తూ వివరాలు సరిచూడకుండా, కార్డులు నేరుగా తమ చేతికే అందేలా రంగారెడ్డి, విజయ్‌లు సఫలీకృతులయ్యారు. తమ సంస్థ పేరుతో సంతోష్‌నగర్‌లోని హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మిషన్ సైతం పొందారు. దీంతో పాటు కొన్ని పెట్రోల్ బంకులు, సంస్థల్లో ఈ కార్డుల్ని స్వైప్ చేస్తూ వచ్చారు. ఇలా మొత్తం 41 మంది పేర్లతో 4 బ్యాంకుల నుంచి 125 క్రెడిట్‌కార్డులు తీసుకుని ‘వాడేశాడు’. మూడు శాతం కమీషన్ ఇస్తూ... రంగారెడ్డి, విజయ్ తాము తీసుకువచ్చిన క్రెడిట్‌కార్డుల్ని పీఓఎస్ మిషన్లలో స్వైప్ చేసి, నగదు ఇవ్వడానికి కొందరు దళారులను ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకుగాను వారికి 3 శాతం కమీషన్ ఇస్తూ వీరు 97 శాతం నగదు తీసుకునేవారు. ఇలా మొత్తం నాలుగు బ్యాంకుల నుంచి రూ.1,52,10,725 కాజేసి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని మాకాం మార్చేశారు. ఈ స్కామ్ మొత్తం 2015 వరకు జరిగింది. డిఫాల్టర్ల కోసం కొన్నాళ్ళు ప్రయత్నించిన బ్యాంకు ప్రతినిధులు బోగస్ వివరాలని తెలియడంతో మిన్నకుండిపోయారు. ఓ బ్యాంకు ద్వారా సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, బి.శ్రవణ్‌కుమార్, పి.చంద్రశేఖర్ రెడ్డి, కె.శ్రీకాంత్ దర్యాప్తు చేశారు. గురువారం రంగారెడ్డితో పాటు విజయ్, సంతోష్, శ్రీకాంత్, నరేష్, కిషోర్, శైలేష్, సందీప్, పరమేష్కుమార్ను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.6.9 లక్షల నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇలా సంపాదించిన సొమ్మును రంగారెడ్డి కొన్ని సంస్థల్లో పెట్టుబడి పెట్టినట్లు తెలిసిందని, దానిని రికవరీ చేయడానికి చట్టపరమైన మార్గాలు అన్వేషిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. -
అధికారులేం చేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లాలో దాదాపు 2 వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను సృష్టించి, వాటి ఆధారంగా బ్యాంకు రుణాలు పొందిన వ్యవహారంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇంత జరుగుతుంటే అధికారులేం చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారం పై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. విచారణలో తేలిన అంశాలతో సమగ్ర నివేదికను తమ ముందుంచాలని పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 20కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంచిర్యాల జిల్లా, నెన్నల మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఫోర్జరీ సంతకాలతో నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి భారీగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని, దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ గొల్లపల్లి గ్రామానికి చెందిన ఇందూరి రామ్మోహనరావు పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యానికి ‘సాక్షి’లో వచ్చిన కథనాలను జత చేశారు. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జోగాపూర్, గొల్లపల్లి, మైలారం, ఘనాపూర్, నెన్నెల తదితర గ్రామాల్లో దాదాపు 2 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పాసు పుస్తకాలు సృష్టించి గ్రామీణ బ్యాంకు నుంచి భారీగా రుణాలు తీసుకున్నారని తెలిపారు. నెన్నెల మండలం ఎంపీపీ భర్త గడ్డం భీమా గౌడ్ 32 ఎకరాలు ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. భూముల విలువ రూ.5 వేల కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. -
చందన.. వంచన..
మలికిపురం(రాజోలు): కేశనపల్లి సిండికేట్ బ్యాంకులో మహిళల పేర్లు, వేర్వేరు ఫొటోలతో వేరొకరికి రుణాలిచ్చేసిన లీలలు చోటు చేసుకున్నాయి. రుణాల రికవరీ కోసం బ్యాంకు అధికారులు ఇచ్చిన నోటీసులతో ఈ వ్యవహారం బయటపడింది. ఏడాదిగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని అటు బ్యాంకు అధికారులు, ఇటు డీఆర్డీఏ అధికారులు పెద్దల మధ్య తేల్చే పనిలో ఉన్నారు. మరోవైపు బ్యాంకుల నుంచి చెల్లించాలని ఒత్తిడి వస్తుండడంతో బాధిత మహిళలు బుధవారం రోడ్డెక్కారు. దీనిపై ఇప్పటికే బాధితులు మలికిపురం గ్రీవెన్స్ సెల్లో తూర్పుపాలెం గ్రామ సీఫ్ నల్లి చందన కుమారిపై ఫిర్యాదు కూడా చేశారు. మహిళలు బుధవారం మలికిపురం స్త్రీ శక్తి భవనాన్ని ముట్టడించారు. ఈ అవినీతి వ్యవహారం వెనుక ఒక బ్యాంకు ఉన్నతాధికారి హస్తం కూడా ఉన్నట్టు స్పష్టమవుతోంది. మలికిపురం మండలంలోని తూర్పుపాలెం గ్రామానికి చెందిన పలు డాక్రా సంఘాల మహిళలు సమీప గ్రామం కేశనపల్లి సిండికేట్ బ్యాంకులో రుణాలు పొందారు. అదే మహిళలకు మరలా రుణాలు వస్తాయని చెప్పిన గ్రామ సీఎఫ్ చందన కుమారి వారి నుంచి సంతకాలు, ఫొటోలు తీసుకుంది. ఇలా వేర్వేరు గ్రూపుల నుంచి కొందరిని ఎన్నుకుని కొత్త గ్రూపులను సృష్టించింది. కొన్నాళ్లకు రుణాలు రాలేదు సరి కదా బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయి. బ్యాంకులకు వెళ్లిన ఆ మహిళలకు షాక్ తగిలింది. ఒక్కొక్క మహిళ పేరున రూ.45 వేల రుణాలు ఉన్నాయని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో వ్యవహారం బ్యాంకు ఉన్నతాధికారులకు, డీఆర్డీఓ అధికారులకు తెలిసింది. మహిళల ఫిర్యాదుతో విచారణ చేసిన అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి. సీఎఫ్ చందన పలు గ్రూపుల పేరుతో రూ.12 లక్షలకు పైగా నగదు తీసుకుని తన సొంత అవసరాలకు వినియోగించుకున్నట్టు తెలిసింది. అలాగే స్త్రీ నిధి కూడా రూ.2.15 లక్షలను మహిళల పేరుతో సీఎఫ్ తీసుకుని వాడుకున్నట్టు డీఆర్డీఎ అధికారులు గుర్తించారు. సుమారు మూడేళ్ల క్రితం ఈ రుణాలు తీసినట్టు తెలుస్తోంది. ఓ బ్యాంకు అధికారి అండతో సీఎఫ్ ఈ రుణాలను తీసుకున్నట్టు స్పష్టమైంది. ఆ బ్యాంకు అధికారి బదిలీ కావడంతో రుణాల రికవరీ కోసం ప్రస్తుత అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఆందోళన చేస్తున్న మహిళలతో డీఆర్డీఎ ఏపీఎం ప్రభుదాసు చర్చలు జరిపారు. ఆందోళనలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సీహెచ్ రమణి, రాజోలు డివిజన్ అధ్యక్షురాలు కందికట్ల గిరిజ, వ్యవసాయకార్మిక సంఘం నాయకులు చెవ్వాకుల సూర్య ప్రకాశరావు, కందికట్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. తమ ఉపాధి కూలీ డబ్బులను బ్యాంకుల్లో జమ చేసుకుంటున్నారని తూర్పుపాలెం దయ గ్రూపు సభ్యురాలు ఆకుమర్తి దుర్గా భవాని, మరియమ్మ గ్రూపు సభ్యురాలు చేట్ల పైడమ్మ వాపోతున్నారు. విచారణ చేశాం తూర్పుపాలెం సీఎఫ్ ఎన్.చందన కుమారిపై విచారణ చేశాం. రూ.12 లక్షల బ్యాంకు రుణాలు, మరో రూ.2 లక్షల స్త్రీ నిధులను మహిళల పేరుతో స్వాహా చేసినట్టు తేలింది. ఆమెను తొలగించాం, రికవరీకి ప్రయత్నిస్తున్నాం. పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించాం. – జి.ప్రభుదాసు, ఏపీఎం, డీఆర్డీఏ -
అర్హులకు సులభంగా బ్యాంకు రుణాలు
న్యూఢిల్లీ: ప్రస్తుతం అమలు చేస్తున్న సంస్కరణలతో నిజాయితీగల రుణగ్రహీతలు.. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) నుంచి రుణాలు పొందడం సులభం కాగలదని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. నిజాయితీకి పెద్ద పీట వేయడమనేది ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ప్రక్రియ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని ఆయన చెప్పారు. కచ్చితంగా అవసరం ఉండి, నిజాయితీగా వ్యవహరించే రుణగ్రహీతలకు ఏ ఆటంకాలూ లేకుండా రుణాలు లభించేలా చూడటం ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ‘‘జీఎస్టీ రిటర్నులు, వివిధ ఫైనాన్షియల్ టెక్నాలజీ సాధనాలు రుణగ్రహీతల ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా రుణమివ్వటంపై బ్యాంకులు నిర్ణయం తీసుకోవచ్చన్నారు. మదింపు ప్రక్రియ కఠినతరం చేయడం వల్ల రుణాలను రాబట్టుకునే ప్రక్రియ మెరుగుపడుతుంది’’ అని కుమార్ వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఏకంగా రూ. 8 లక్షల కోట్ల మేర మొండిబాకీలు పేరుకుపోయిన నేపథ్యంలో రాజీవ్ కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మొండిబాకీలతో కుదేలైన పీఎస్‌బీలను గట్టెక్కించేందుకు కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం రూ. 88,139 కోట్ల మేర అదనపు మూలధనాన్ని అందిస్తోంది. అయితే, నిర్దేశిత సంస్కరణలు అమలు చేయడాన్ని బట్టి కేటాయింపులు ఉంటాయంటూ షరతు విధించిన సంగతి తెలిసిందే. -
బ్యాంకుతో లింకు లేకుండా రాయితీ రుణాలు
సాక్షి, హైదరాబాద్: బ్యాంకర్ల సహకారం లేకపోవడంతో ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రాయితీ రుణ లక్ష్యాల పురోగతి అంతంతమాత్రంగానే ఉండేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. ఇకపై బ్యాంకర్ల గొడవ లేకుండా లబ్ధిదారులకు రుణాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోందన్నారు. శుక్రవారం బీసీ నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్వయం ఉపాధి, ఆర్థిక చేకూర్పు పథకాలపై చర్చించారు. 2018–19 సంవత్సరం సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రంగా మారుతుందని ఈ సందర్భంగా ఈటల అన్నారు. గొల్ల, కురుమలు, మత్స్యకారుల ఉపాధికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. బీసీల సంక్షేమం కోసం కమిటీ పలుమార్లు చర్చించిందని, అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించిందన్నారు. నివేదిక తుది దశకు వచ్చిందని, మరోమారు సమీక్షించి ïసీఎంకు సమర్పిస్తామన్నారు. -
రెరా చట్టం.. స్థిరాస్థి కొనుగోలుదారులకు వరం
సాక్షి, నెల్లూరు: ఏదైనా వెంచర్లో ప్లాట్ బుక్ చేసుకుంటే నిర్మాణదారు మనకు ఎప్పుడు అప్పగిస్తాడో తెలియదు. ఒక వేళ డబ్బు తీసుకుని మనకు ఇంటిని సరైన సమయానికి అప్పగించకపోయినా ఏమీ చేయలేని పరిస్థితి. తీసుకున్న బ్యాంకు రుణంపై వడ్డీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇటీవల కొత్తగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చట్టాన్ని తీసుకువచ్చింది. నియంత్రణ అధికారుల వద్ద నమోదు ఈ చట్ట ప్రకారం చేపడుతున్న ప్రాజెక్టులను, ఇప్పటికీ కంప్లీషన్ సర్టిఫికెట్(సీసీ)అందుకోని ప్రాజెక్టులను, కొత్త ప్రాజెక్టులను నియంత్రణ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలి. దీంతో నిర్మాణ రంగంలోని బిల్డర్లు చేసే మోసాల నుంచి కొగుగోలుదార్లను రక్షించవచ్చు. ఇంతకు ముందు కోర్టు కేసులు, వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి మాత్రమే వినియోగదారులు తమకు రావాల్సిన డబ్బును రాబట్టుకునేందుకు వీలుండేది. ఇకపై ఈ ప్రయాసలకు కాస్త విముక్తి కలుగుతుంది. రెరా చట్టంలోని కీలక ప్రతిపాదనలు బిల్డర్లు తాము చేపట్టిన ప్రాజెక్టుల కోసం ఒక ప్రత్యేక(ఎస్క్రో) ఖాతాను నిర్వహించాల్సి ఉంటుంది. పెట్టుబడిదారుల, కొనుగోలుదారుల నుంచి సేకరించిన డబ్బులో 70 శాతం అదే ఖాతాలో ఉండాల్సిందే. ఈ సొమ్మంతా ప్రాజెక్టు నిర్మాణానికి, భూమి కొనుగోలుకు వెచ్చించాల్సిఉంటుంది. ఒక్క ప్లాట్ అమ్మిన తర్వాత దాని నిర్మాణంలో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే తప్పనిసరిగా బిల్డర్ కొనుగోలుదారు నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవాలి. దీంతో మధ్యలోనే మళ్లీ ధరలు పెంచే అవకాశం ఉండదు. ప్రతి దశా ప్రాజెక్ట్ కిందే ఈ చట్టం ప్రకారం భవన నిర్మాణంలోని ప్రతి దశా ప్రత్యేక ప్రాజెక్టు కింద లెక్క. ప్రతి దశకూ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ దశలను సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. సమాచారం అందుబాటులో.. ప్రతి బిల్డర్ ప్రాజెక్టు ప్లాన్, లేఅవుట్, ప్రభుత్వ అనుమతులు, ప్రాజెక్టు నిర్మించే భూమిపై హక్కు, ప్రస్తుత స్థితిగతులు, ప్రాజెక్టు ఉప కాంట్రాక్టర్ల వివరాలు, ఎప్పటి లోపు పూర్తవుతుందనే వివరాలను ఆయా రాష్ట్రాల నియంత్రణ సంస్థలకు సమర్పించాలి. ప్లాట్ కొనుగోలుకు ముందే కొనుగోలుదారులు ఈ వివరాలను ఆయా సంస్థ«ల నుంచి ఎప్పుడైనా తెలుసుకునే వీలుంటుంది. నిర్మాణదారులకు జైలు, జరిమానా రెరా చట్టం కింద ఏర్పాటు చేసిన అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చే ఆదేశాలను పాటించి తీరాలి. లేనిపక్షంలో 3 సంవత్సరాల వరకూ జైలుశిక్ష అనుభవించాలి. అక్కడ కేసు తీవ్రతను బట్టి జరిమానా సైతం ఉండొచ్చు. అలాగే ఈ చట్టం ప్రకారం కొనుగోలుదారుడికి ప్లాట్ చేతికందిన ఏడాది సమయం వరకూ తలెత్తే నిర్మాణలోపాలను సరిదిద్దే బాధ్యత బిల్డర్ తీసుకోవాల్సిఉంటుంది. బుకింగ్ సొమ్ము ఇలా.. కొంత మంది బిల్డర్లు పూర్తి నిర్మాణ ఖర్చులో 10 శాతం కన్నా ఎక్కువ సొమ్మును బుకింగ్ కోసం అడుగుతారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమ్మకపు ఒప్పందం తర్వాత జరుగుతోంది. కానీ రెరా చట్టం ప్రకారం ప్రమోటర్లు 10 శాతం కన్నా ఎక్కువ సొమ్మును డిమాండ్ చేయకూడదు. మొదట సేల్ అగ్రిమెంట్‌ను కుదుర్చుకోవాల్సిందే. అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం జరిగితే బ్యాంకు రుణం మీద వడ్డీ కట్టాల్సిన బాధ్యత నిర్మాణదారుపై పడుతుంది. దీంతో వినియోగదారునికి వడ్డీ భారం తగ్గుతుంది. -
సూటేసుకొచ్చి... కారేసుకెళ్తాడు!
- మాజీ ఐఏఎస్ కుమారుడి ఘరానా మోసాలు - బోగస్ పత్రాలతో బ్యాంకు రుణాలు - తాజాగా ల్యాండ్‌రోవర్ కారు పేరిట రుణం హైదరాబాద్: హైక్లాస్ గెటప్.. ఖరీదైన నివాసం.. డాబుసరి మాటలు.. ఇవే పెట్టుబడిగా ఓ మాజీ ఐఏఎస్ కుమారుడు వరుస మోసాలకు పాల్పడుతున్న వైనం బట్టబయలైంది. బోగస్పత్రాలతో బ్యాంకుల్లో కారు రుణాలు తీసుకుని టోకరా వేసేవాడు. అతడిపై తాజాగా ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం కనకటపాలెం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ భాస్కర్‌రావు కుమారుడు కర్రెద్దుల విజయ్‌కుమార్ (36) హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. ఇతడికి కర్నెందుల విజయ్‌కుమార్ చాణక్య, జయకుమార్, సూర్యతేజ్ తదితర మారుపేర్లూ ఉన్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ రోడ్ నం.25లోని టర్నోహౌస్ అనే ఖరీదైన కమర్షియల్ కాంప్లెక్స్‌లో సూర్య కమర్షియల్ పేరుతో సూట్‌కేస్ కంపెనీ ఏర్పాటు చేశాడు. కారు కొనుగోలుకు రూ.70 లక్షల రుణం కావాలంటూ జూబ్లీహిల్స్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో దరఖాస్తు చేశాడు. ముషీరాబాద్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న హైక్లాస్ ఇంటిని బ్యాంకు అధికారులకు చూపించాడు. ఫిబ్రవరి 6న రూ.70.2 లక్షల రుణం మంజూరైంది. జూబ్లీహిల్స్‌లోని ప్రైడ్ మోటార్స్ షోరూం నుంచి రూ.79.17 లక్షలకు ల్యాండ్‌రోవర్ కారు ఖరీదు చేశాడు. నెలసరి వాయిదాలు చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు మేనేజర్ నిందితుడి చిరుమానాను ఆరా తీశారు. ఆచూకీ దొరక్కపోవడంతో బ్యాంకు చీఫ్ రీజినల్ మేనేజర్ శివకుమార్ చతుర్వేది జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేయగా ఇప్పటివరకు మొత్తం 17 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, అన్నీ ఈ తరహా మోసాలేనని వెల్లడైంది. గతంలో ఇలా ఖరీదు చేసిన కార్లను నెల వ్యవధిలోనే విక్రయించేవాడని తేలింది. ఓ సందర్భంలో బ్యాంకు రుణం మంజూ రు కావడం ఆలస్యమవుతుండటంతో కేంద్రమంత్రి పేరుతో బ్యాంక్ అధికారికి ఫోన్ కూడా చేశాడు. వరుస మోసాలకు పాల్పడుతున్న ఈ ఘరానా మోసగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సూటేసుకొచ్చి... కారేసుకెళ్తాడు!
-
బ్యాంకు రుణాలకు గిరిజనులు దరఖాస్తు చేసుకోండి
కర్నూలు(అర్బన్): గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బ్యాంకు లింకేజీ పథకానికి సంబంధించి రుణాలు పొందేందుకు అర్హులైన గిరిజనులు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారి హెచ్.సుభాషన్ రావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన గిరిజనులు ఆన్లైన్ వెబ్సైట్ apobmms.cgv.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ రకాల వ్యాపార సంబంధమైన యూనిట్లు నెలకొల్పుకునేందుకు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
బక్క రైతు చిత్తు
చంద్రబాబు సర్కార్ కుటిల వ్యూహం... పంటల బీమాతో పెట్టుబడి రాయితీకి లింకు.. బీమా ఉన్న వారికి పెట్టుబడి రాయితీ ఎగనామం ♦ ఏదైనా హెక్టారుకు గరిష్టంగా రూ.15 వేలే ♦ 6 లక్షల మంది అన్నదాతలకు అన్యాయం ♦ రూ.500 కోట్లు నష్టపోనున్న రైతులు ♦ జిల్లాల్లో బ్యాంకు రుణాల సమాచారం కోరిన వ్యవసాయ అధికారులు ♦ బీమా వివరాల కోసమే పెట్టుబడి ♦ రాయితీ పంపిణీ నిలిపివేత ♦ సర్కారు మోసపూరిత నిర్ణయంపై ♦ రైతులు, రైతు సంఘాల మండిపాటు సాక్షి, అమరావతి : అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే విపత్తు బాధిత రైతులకు రూ.2350 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలు ఎగవేసిన చంద్రబాబు సర్కారు కరువు రైతులకు తాజాగా మరో రూ.500 కోట్లు శఠగోపం పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. పంటల బీమాకు, పెట్టుబడి రాయితీకి ముడిపెట్టి కరువు పీడిత అన్నదాతలకు తీవ్ర అన్యాయం చేయాలని ఎత్తుగడ వేసింది. ఇందులో భాగంగా 2016 ఖరీఫ్‌లో కరువు వల్ల పంట ఎండిపోయి పెట్టుబడులు కోల్పోయిన అన్నదాతలకు పెట్టుబడి రాయితీ లేదా పంటల బీమా.. రెండూ కలిపీ అయినా హెక్టారుకు గరిష్టంగా రూ.15 వేలు మాత్రమే చెల్లించాలని వ్యవసాయ అధికారులకు తాజాగా అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. జీవో జారీ చేస్తే అందరికీ తెలిసిపోయి రచ్చ రచ్చఅవుతుందనే భావనతో రహస్యంగా మెమో పంపించింది. దీంతో 2016 ఖరీఫ్‌లో పంటల సాగుకు పంట రుణాలు తీసుకున్న వారి వివరాల సేకరణలో వ్యవసాయ అధికారులు నిమగ్నమయ్యారు. వాస్తవంగా పంటల బీమా, పెట్టుబడి రాయితీ రెండూ పొందడానికి రైతులు అర్హులే. ఇప్పటి వరకూ ఇలాగే పొందుతూ వచ్చారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు సర్కారు ఈ రెండింటికీ లింకు పెట్టి బక్క రైతులకు అన్యాయం చేయడానికి ఒడిగట్టిందని వ్యవసాయ అధికారులు సైతం విమర్శిస్తున్నారు. పెట్టుబడి రాయితీని బీమాతో ముడిపెట్టి రైతులకు అన్యాయం చేయాలన్న ప్రభుత్వ ఎత్తుగడతో పంపిణీలోనూ జాప్యం జరుగుతోంది. గత ఏడాది ఖరీఫ్‌లో పంట ఎండిపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడి రాయితీ విడుదల చేసి మూడు నెలలు దాటింది. బాధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి రాయితీని అన్లైన్ ద్వారా జమ చేయాలంటూ ఆర్థిక శాఖ గత నెల 31వ తేదీన నిధులు విడుదల చేసింది. తక్షణమే ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా రాష్టంలోని 268 మండలాలకు చెందిన 13.21 లక్షల మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి రాయితీ జమ చేయాలని వ్యవసాయ కమిషనర్‌ను ఆదేశిస్తూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఈ నెల ఒకటో తేదీన జీవో 67 జారీ చేసింది. ఇందు కోసం రూ.1680.05 కోట్లను వ్యవసాయ శాఖ కమిషనర్ పేరిట విడుదల చేసింది. ఈ జీవోలో ఎక్కడా పంటల బీమాతో ముడిపెట్టినట్లు ఒక్క అక్షరం కూడా లేదు. ఈ ఉత్తర్వులు వచ్చి 15 రోజులు గడిచినా రైతుల ఖాతాల్లో నిధులు జమ కాకపోవడం గమనార్హం. పక్కా వ్యూహంతో సర్కారు కుట్ర గత ఏడాది ఖరీఫ్ సీజన్లో సగంపైగా మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఏర్పడింది. సగం మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాల్సి ఉన్నా కలెక్టర్లు పంపిన ప్రతిపాదనలను పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకోకుండా 2016 అక్టోబరు 21, నవంబరు 12 తేదీల్లో 268 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. కరువు మండలాల ప్రకటనలో అన్యాయం జరిగిందని తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర బృందం వచ్చి రాష్ట్రంలో కరువును పరిశీలించి వెళ్లింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరో 33 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. కరువు మండలాల సంఖ్య 301కి చేరినా ప్రభుత్వం కేవలం 268 మండలాల రైతులకే పెట్టుబడి రాయితీ విడుదల చేయడం గమనార్హం. వీరికైనా పంపిణీ చేసిందా అంటే లేదు. అంతర్గత ఉత్తర్వుల ద్వారా అందులో రూ.500 కోట్లు ఎగవేసేందుకు కుట్ర పన్నింది. దీనివల్ల కరువుల కాణాచిగా పేరొందిన రాయలసీమ మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతులు దారుణంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ నిర్ణయం అమలైతే ఒక్క అనంతపురం జిల్లా వేరుశనగ రైతులే రూ.370 కోట్లు పైగా పెట్టుబడి రాయితీని కోల్పోవాల్సి వస్తుందని అంచనా. ప్రస్తుతం విపత్తుల వల్ల వేరుశనగ పంట దెబ్బతింటే హెక్టారుకు రూ.15 వేలు పెట్టుబడి రాయితీ అమల్లో ఉంది. గత ఖరీఫ్‌లో వేరుశనగ పంట 90 శాతం పైగా ఎండిపోయింది. బీమా కంపెనీలు, వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి హెక్టారుకు గరిష్టంగా రూ.16000 చెల్లించాలని లెక్క కట్టారు. ఇందులో భాగంగానే గత ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులకు చెల్లించేందుకు బీమా సంస్థ రూ.576 కోట్లు మంజూరు చేసింది. అయితే ప్రభుత్వం పంటల బీమా, పెట్టుబడి రాయితీ కలిపి హెక్టారుకు రూ.15 వేలు చెల్లించాలని నివేదికలు రూపొందించడం గమనార్హం. ఉదాహరణకు ఒక రైతుకు పంటల బీమా హెక్టారుకు రూ.10 వేలు వచ్చిందనుకుంటే దానికి రూ.5 వేలు (రూ.15 వేలు బదులు) పెట్టుబడి రాయితీ కలిపి 15 వేలు చెల్లిస్తారు. బీమానే రూ.15 వేలు వస్తే పెట్టుబడి రాయితీ అసలు ఇవ్వరు. దీనివల్ల రాష్ట్రంలో ఆరు లక్షల మంది అన్నదాతలకు అన్యాయం జరుగనుంది. ఈ విషయం వ్యవసాయ అధికారుల ద్వారా తెలియడంతో ప్రభుత్వంపై రైతు సంఘాల నేతలతోపాటు రైతులు మండి పడుతున్నారు. వేరుశనగ రైతులకు అన్యాయం రాష్ట్రంలో గత ఖరీఫ్ సీజన్లో సుమారు 9.30 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగైంది. ఇందులో అనంతపురం జిల్లాలో 6.10 లక్షలు, కర్నూలులో 1.14 లక్షలు, చిత్తూరులో 1.34 లక్షల హెక్టార్లు ఉంది. రాయలసీమలోని చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల రైతులకు వేరుశనగ పంటల బీమా కింద రూ.576 కోట్లు మంజూరైంది. ఒక్క అనంతపురం జిల్లాలోనే 5.22 లక్షల మంది పంటల బీమా ప్రీమియం చెల్లించారు. మిగిలిన మూడు జిల్లాలు కలిపితే పంటల బీమా ప్రీమియం చెల్లించిన రైతుల సంఖ్య ఆరు లక్షలు పైగా ఉంటుంది. ప్రస్తుత విధానం ప్రకారం వీరికి పంటల బీమా, పెట్టుబడి రాయితీ రెండూ చెల్లించాలి. ఉదాహరణకు గత ఏడాది అనంతపురం జిల్లాలోని మొత్తం 63 మండలాలు కరువు ప్రాంతాల జాబితాలో ఉన్నాయి. అందువల్ల ఈ జిల్లాలో 6.10 లక్షల హెక్టార్లకు పెట్టుబడి రాయితీ కింద సుమారు రూ.913 కోట్లు అవుతుంది. ఈ జిల్లాలో బీమా ప్రీమియం చెల్లించిన వేరుశనగ రైతులకు రూ.415 కోట్లు పంటల బీమా కింద చెల్లించాల్సి ఉంది. వీటి రెండింటినీ వేర్వేరుగా ఇస్తే అనంతపురం జిల్లా రైతులకు రూ.913 కోట్ల పెట్టుబడి రాయితీ, రూ.415 కోట్లు పంటల బీమా చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అనుకున్నట్లు కలిపి ఇస్తే రైతులకు రూ.370 కోట్లు పైగా తగ్గిపోతుందని అనధికారిక అంచనా. రెండింటినీ కలపడమంటే బీమా చేసిన వారిని, చేయని వారిని ఒకే గాటన కట్టినట్లవుతంందని, ఇది సరికాదని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అంటున్నారు. సీఎం సమక్షంలోనే నిర్ణయం పంటల బీమాకు, పెట్టుబడి రాయితీకి ముడిపెట్టడం ద్వారా రైతులకు అన్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగిన సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే గ్రామసభల అంశాన్ని తెరపైకి తెచ్చారు. 2016 ఖరీఫ్ సీజన్‌కు కరువు రైతులకు పెట్టుబడి రాయితీ పంపిణీకి మార్గాదర్శకాల ప్రకారం ముఖ్యమంత్రి ఆదేశం మేరకు గ్రామసభలు నిర్వహించాలంటూ వ్యవసాయ శాఖ కమిషనర్ ఆ శాఖ సంయుక్త సంచాలకులకు (జేడీలకు) ఈనెల 13వ తేదీన మెమో జారీ చేశారు. విపత్తు బాధిత రైతులకు పంటల బీమా పరిహారంతో సంబంధం లేకుండా నేరుగా పెట్టుబడి రాయితీ పంపిణీ చేయాల్సి ఉండగా దీనికి భిన్నంగా ఈ రెండింటికీ ముడిపెడుతున్నట్లు మెమోలో పేర్కొన్నారు. ‘రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో పంటల బీమా పరిహారం మొత్తాలను మొదట తీసుకోవాలి. ఒక రైతుకు హెక్టారుకు రూ.15 వేల లోపు పంటల బీమా పరిహారం వచ్చి ఉంటే పెట్టుబడి రాయితీ ఖాతా నుంచి మిగిలిన మొత్తాన్ని డ్రా చేసి గరిష్టంగా రెండు హెక్టార్లకు ఇవ్వాలి’ అని మెమోలో స్పష్టంగా పేర్కొన్నారు. ఉదాహరణకు వేరుశనగ సాగు చేసిన రైతు సొంత జేబు నుంచి పంటల బీమా ప్రీమియం చెల్లించారనుకుందాం. పంట నష్టపోయినందుకు ఆయనకు హెక్టారుకు రూ.20 వేలు పంటల బీమా పరిహారం వచ్చింటే తర్వాత ప్రభుత్వం పైసా కూడా పెట్టుబడి రాయితీ ఇవ్వదు. దీనిని ఎగవేస్తుందన్న మాట. వాస్తవ నిబంధనల ప్రకారం పంటల బీమా పరిహారం పొందిన రైతులకు దీనితో సంబంధం లేకుండా ప్రభుత్వం పెట్టుబడి రాయితీ మొత్తాన్ని ఇవ్వాలి. ఖరీఫ్ సీజన్లో రాయలసీమ రైతులు సాగు చేసిన పంటలకే పంటల బీమా ఉంది. అందువల్లే ప్రభుత్వం మెమోలో రాయలసీమ రైతులకు మొదట పంటలబీమా డేటా తీసుకోవాలని పేర్కొంది. మిగిలిన శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు పెట్టుబడి రాయితీ నేరుగా యథా ప్రకారం పంపిణీ చేయాలని మెమోలో పేర్కొనడం గమనార్హం. దీనిని బట్టే పంటల బీమా వచ్చిన వారికి పెట్టుబడి రాయితీ ఎగవేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తేటతెల్లమవుతోంది. -
నల్ల రేగళ్లలో నాగేటి సాళ్లు
భారీ వర్షాలతో దుక్కులు దున్నుతున్న రైతన్నలు - విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు సిద్ధం - ఇంకా రుణాలివ్వని బ్యాంకులు - రైతు సమగ్ర సర్వేలో వ్యవసాయశాఖ యంత్రాంగం సాక్షి, హైదరాబాద్: అన్నదాత నాగలి పట్టాడు.. ఏరువాకకు సిద్ధమయ్యాడు.. రెండు మూడ్రోజుల నుంచి వర్షాలు పడు తుండటంతో ఉత్సాహంగా పొలంబాట పట్టాడు.. ఇటీవల కొన్నిచోట్ల మోస్తరు నుంచి 11 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. మరో నాలుగు రోజులు సాధా రణ వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అటు మూడు నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో అనేకచోట్ల రైతులు దుక్కులు దున్నుతున్నారు. విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుం టున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపో యినా అప్పోసొప్పో చేసి సాగుకు అవసర మైన సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే బ్యాంకులు మాత్రం స్పందించడం లేదు. రాష్ట్ర పంటల రుణ ప్రణాళిక ఇంకా విడుదల చేయలేదు. బ్యాంకు రుణాలు అందక రైతులు ప్రైవేటు అప్పులు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ కూడా ఇంకా పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదు. మొత్తం వ్యవసాయ యంత్రాంగం రైతు సమగ్ర సర్వేపైనే దృష్టి సారించి వానాకాలం పంటల సాగును గాలికొదిలేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక కూడా విడుదల చేయలేదు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇప్పటివరకు రైతులకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వలేదు. 1.08 కోట్ల ఎకరాల్లో సాగు.. 2017ృ18 ఖరీఫ్‌లో 1.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధారించారు. ఇది గతేడాది కంటే 6 లక్షల ఎకరాలు అదనం. 2016ృ17 వానాకాలంలో వరి 22.15 లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. ఈసారి 24.65 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. మొత్తంగా 16.20 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేయాలని నిర్ణయించారు. 2017ృ18 ఆర్థిక సంవత్సరంలో 90.89 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో వరి 58.11 లక్షల టన్నులు పండించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ఖరీఫ్‌లో 32.47 లక్షల టన్నులు పండిస్తారు. లక్ష్యాలన్నీ బాగానే ఉన్నా రైతులకు అవసరమైన బ్యాంకు రుణాలు అందడంలో సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికీ బ్యాంకులు రైతులకు పైసా కూడా రుణం ఇవ్వలేదన్న విమర్శలు వస్తున్నాయి. పెరిగిన సాగు ఖర్చు ఎకరా విస్తీర్ణంలో సాధారణ వరి ధాన్యం పండించేందుకు రూ.43,160 ఖర్చవుతోంది. అన్ని వ్యయాలను లెక్క లోకి తీసుకొని రాష్ట్ర వ్యవసాయశాఖ తేల్చిన ఖర్చు ఇది. ఇక ఏ గ్రేడ్ వరి రకం సాగుకు ఎకరాకు రూ.44,121 ఖర్చవు తోందని తేల్చింది. అలాగే కందికి రూ. 14,246, మొక్కజొన్నకు రూ.26,507, సోయాబీన్‌కు రూ.19,433, పత్తికి రూ. 44,860 ఖర్చవుతుందని తేల్చింది. అంత మేర పెట్టుబడులు ఉంటేనే రైతు నిలదొ క్కుకోగలడు. కానీ బ్యాంకు రుణాలు ఇప్పటికీ అందకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో రైతన్న ప్రైవేటు అప్పుల వైపు చూస్తున్నాడు. -
రైతులకు సకాలంలో అందిస్తాం
► పంట రుణం రూ.3939.58 కోట్లు ► ఖరీఫ్ సీజన్‌కు రూ. 2954.28 కోట్లు ► రబీ సీజన్‌కు రూ.985.30 కోట్లు ► లీడ్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ లేవాకు రఘునాథరెడ్డి వెల్లడి కడప అగ్రికల్చర్: ఈ ఏడాది వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలు రైతులకు భారీగానే ఇవ్వాలని బ్యాంకర్లు సంకల్పించారు. సీజన్ ప్రారంభానికి ముందే రుణాలు అందించడానికి ప్రణాళికలు తయారు చేశాం.. అని జిల్లా లీడ్‌బ్యాంకు చీఫ్ మేనేజర్ లేవాకు రఘునాథరెడ్డి తెలిపారు. శనివారం కడప నగరం ఏడురోడ్ల కూడలిలోని బ్యాంకు కార్యాలయంలో ఆయన సాక్షితో మాట్లాడారు. ఈ ఏడాది పంట రుణాలు మొత్తం రూ.3939.58 కోట్లుగా ఖరారు చేశామన్నారు. ఇందులో ఖరీఫ్ సీజన్‌కు రూ. 3939.58 కోట్లు, రబీ సీజన్‌కు రూ.985.30 కోట్లు ఇవ్వాలని ప్రణాళికలు తయారు చేశామన్నారు. అలాగే వ్యవసాయంలో దీర్ఘకాలిక రుణాలు రూ.321.75 కోట్లు, వ్యవసాయ గోడౌన్ల నిర్మాణాలకు, ఇతర అభివృద్ధి పనులకుగాను రూ.144.68 కోట్లు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణాలకు, బిజినెస్ సెంటర్లకుగాను రూ.79.61 కోట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ.5085.63 కోట్లు ఖర్చు చేయాలని బ్యాంకులకు చెప్పామన్నారు. అప్రాధాన్యత రంగాలకు రూ. 853.57 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో మే నెల 1 వ తేదీ నుంచి రుణాలను రైతులకు ఇవ్వాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. గత ఏడాది అన్ని రకాల పంట రుణాలు కలిపి రూ.5900 కోట్లకుగాను, రూ.5483 కోట్ల రుణాలు అందించారని అన్నారు. ఈ ఏడాది ముందుగా కొత్త రుణాలు రెన్యూవల్ చేయాలని బ్యాంకర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ ఆదేశాలు ఇచ్చారన్నారు. రైతులు పంట సాగు సమయంలో కాకుండా రుణాలు ఇచ్చే మొదటి నుంచే రెన్యూవల్ చేసుకోవడం, కొత్త రుణాలు తెచ్చుకుంటే బ్యాంకర్లకు ఒత్తిడి తగ్గుతుందన్నారు. అలాగే రైతులకు కూడా ఒక వైపు వర్షాలు పడుతుంటే, మరోవైపు ఎరువులు, విత్తనాలు సమకూర్చుకోవడం, ఇంకో వైపు రుణాల కోసం వెంపర్లాడడం కంటే ముందుగానే రుణాలు తీసుకుంటే బాగుంటుందని సూచించారు. -
తమ్ముడా మజాకా !
► తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ నేత ఆగడాలు ► కోల్డ్ స్టోరేజీలో ఉన్న పంటలపై బ్యాంకులో రుణాలు ► 260 మంది పేరుతో రూ.14 కోట్లు కైంకర్యం ► కర్షకులకు బ్యాంకర్లు, కోర్టు నోటీసులు అల్లాడుతున్న రైతులు సాక్షి, విజయవాడ : జిల్లాలో టీడీపీ నేతల అడ్డగోలు సంపాదనకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ‘తమ్ముళ్లు’ రైతులను కూడా వదలడం లేదు. ఒకవైపు ప్రభుత్వం పొలాలను గుంజుకుంటుండగా... మరోవైపు టీడీపీ నేతలు అరకొరగా పండిన పంటలను కూడా వదలడం లేదు. ఇందుకు తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలానికి చెందిన ఒక టీడీపీ నాయకుడి ఆగడాలే నిదర్శనం. సదరు నాయకుడు తన కోల్డ్ స్టోరేజీలో ఉన్న పంటలపై రైతుల పేరు మీద ఒక ప్రభుత్వ బ్యాంక్‌లో రూ.14 కోట్లు రుణం తీసుకున్నాడు. కొద్దిరోజుల క్రితం ఆ బ్యాంక్ అధికారులు రుణాలు చెల్లించాలని 260 మంది రైతులకు నోటీసులు ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అంతా తాను చూసుకుంటానని సదరు నాయకుడు హామీ ఇచ్చాడు. రైతులు కొద్దిరోజులు మౌనంగా ఉన్నారు. రుణాలు చెల్లించలేదంటూ బ్యాంకు అధికారులు కోర్టులకు వెళ్లడంతో నూజీవీడు, మధిర కోర్టుల నుంచి రైతులకు నోటీసులు వస్తున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కోల్డ్ స్టోరేజీ నుంచి బ్యాంకులో రుణాలు తీసుకున్నట్లు ఉండడం.. ఈ వ్యవహారం కోర్టులో ఉండటంతో రైతులకు మిగిలిన బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. రైతులంతా కలిసి టీడీపీ నేత, ఆయన కుమారుడిని నిలదీయడంతో వారు అడ్డం తిరిగారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక రైతులు గగ్గోలు పెడుతున్నారు. సిండికేట్‌గా ఏర్పాటు... తాను మాత్రమే తప్పు చేస్తే ఇబ్బంది వస్తుందని భావించిన ఆ నాయకుడు... మైలవరం నియోజకవర్గం ముచ్చనపల్లికి చెందిన ‘బాయ్’గా పిలవబడే ఒక వ్యక్తిని, మరో టీడీపీ నాయకుడిని కలుపుకొని సిండికేట్‌గా ఏర్పడ్డారు. జిల్లాకు చెందిన ఒక కీలక మంత్రికి బాయ్ ముఖ్య అనుచురుడు కావడంతో వారికి అడ్డులేకుండా పోయింది. మంత్రి అండతో ఈ సిండికేట్ అక్రమార్జనలో దూసుకుపోతోంది. తమ భూ కబ్జాలను అడ్డుకున్న గంపలగూడెం తహసీల్దార్‌ను ఇటీవల బదిలీ చేయించారు. తమ మాట వినని ఇతర అధికారులపై ఏసీబీ దాడులు చేయించి ఒత్తిడికి గురి చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు బెదిరింపు రూ.16 కోట్లతో చేపట్టనున్న చీమలపాడు–గంపలగూడెం ఆర్అండ్బీ రోడ్డు పనులకు నాలుగు రోజుల క్రితం ఈ– టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. ఈ సిండికేట్ ప్రతినిధులు కూడా టెండర్లు వేశారు. అయితే తమిళనాడుకు చెందిన ఒక కాంట్రాక్టర్ లెస్ టెండర్ వేశారు. ఆ తర్వాత విజయవాడకు చెందిన మరో కాంట్రాక్టర్ కొద్దిగా ఎక్కువకు టెండర్ వేశారు. సదరు సిండికేట్ కాంట్రాక్టర్ 4శాతం ఎక్కువ రేటుకు టెండర్ వేయడమే కాకుండా మరో మూడు డమ్మీ టెండర్లు వేయించారు. ఇప్పుడు తమకు టెండర్ రాదని తెలుసుకున్న సదరు సిండికేట్... ఆర్ అండ్ బీ అధికారులపై మంత్రి చేత ఒత్తిడి తీసుకొచ్చి టెండర్లు ఖరారు కాకుండా ఆపినట్లు తెలిసింది. మరోవైపు ఈ సిండికేట్ సభ్యులు రంగంలోకి దిగి విజయవాడకు చెందిన కాంట్రాక్టర్‌తో టెండర్‌ను ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. తమిళనాడు కాంట్రాక్టర్ కూడా తన టెండర్‌ను ఉపసంహరించుకునేలా చూడాలని ఆర్ అండ్ బీ అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
బ్యాంకు రుణాలు పెరిగిపోయాయ్
ఇటు బ్యాంకు డిపాజిట్లు, అటు బ్యాంకు రుణాలు గతేడాది కంటే బాగానే పెరిగాయట. జనవరి 6 వరకున్న రెండు వారాల కాలవ్యవధిలో బ్యాంకు రుణాలు గతేడాది కంటే 5.1 శాతం పెరిగినట్టు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వెల్లడించింది. అదేవిధంగా డిపాజిట్లు సైతం 14.7 శాతం ఎగిసినట్టు సెంట్రల్ బ్యాంకు వీక్లి స్టాటిస్టికల్ సప్లిమెంట్లో శుక్రవారం పేర్కొంది. అవుట్ స్టాండింగ్ రుణాలు సైతం రెండు వారాల కాలంలో రూ.65,360 కోట్ల నుంచి రూ.74.13 లక్షల కోట్లకు పెరిగినట్టు ఆర్బీఐ పేర్కొంది. బ్యాంకు డిపాజిట్లు కూడా రూ.67,930 కోట్ల నుంచి రూ.105.84 కోట్లకు పెరిగాయని ఆర్బీఐ వెల్లడించింది. -
దీర్ఘకాలంలో మంచి ఫలితాలు
కొన్నేళ్లలోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవినీతి రహిత ఆర్థిక వ్యవస్థ బ్యాంకుల వద్ద అపారంగా నిధులు తక్కువ వడ్డీకే బ్యాంక్ రుణాలు పెద్ద నోట్ల రద్దుపై అరుణ్ జైట్లీ అంచనా న్యూఢిల్లీ: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన ఇబ్బందులకు చింతిస్తున్నామని, ఈ ఇబ్బందులను ముందే ఊహించామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. అయితే ఈ చర్య వల్ల దీర్ఘకాలంలో మంచి వృద్ధి సాధించగలమని, రుణాలివ్వడానికి బ్యాంకుల వద్ద నిధులు అపారంగా ఉంటాయని, అవినీతి రహితమైన ఆర్థిక వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ జరిగిన పెట్రోకెమికల్ సమావేశంలో దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లనుద్దేశించి ఆయన ప్రసంగించారు. భవిష్యత్తులో భారీ మార్పులు.. భవిష్యత్తులో భారత్ చాలా పెద్ద పెద్ద మార్పులకు గురికానున్నదని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు చేయడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని విశ్వాసం వెలిబుచ్చారు. అరుుతే పెద్ద కరెన్సీ నోట్ల రద్దు వలన దేశంలో కరెన్సీ కొరత ఏర్పడిందని ఆయన అంగీకరించారు. ఆర్బీఐ కొంత మొత్తంలో నగదును సర్దుబాటు చేసిందని, దీనికి సమాంతరంగా డిజిటల్ లావాదేవీల సంఖ్య పెంచడం ద్వారా ఈ కొరత సమస్యను అధిగమించాలని సూచించారు. డిజిటల్ లావాదేవీల విషయమై గత కొన్ని దశాబ్దాల్లో సాధించిన వృద్ధి కన్నా రానున్న 2/3 నెలల్లో మరింత వృద్ధి సాధించగలమని చెప్పారు. పన్ను ఆదాయం పెరుగుతుంది.. ఈ చర్య కారణంగా బ్యాంకుల వద్ద నిధులు పెరుగుతాయని, ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునిచ్చే శక్తి బ్యాంకులకు మరింతగా పెరుగుతుందని, తక్కువ వడ్డీరేట్లకే బ్యాంక్ రుణాలు లభిస్తాయని జైట్లీ వివరించారు. ఈ చర్య వల్ల బ్యాంక్ లావాదేవీలు పెరుగుతాయని, పన్ను ఆదాయం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాదీ అదే జోరు... మన దేశంలో 80 కోట్లకు పైగా డెబిట్, క్రెడిట్ కార్డులున్నాయని, అయితే వీటిల్లో 45 కోట్ల కార్డులను మాత్రమే చురుగ్గా ఉపయోగిస్తున్నారని, ఈ దృష్ట్యా డిజిటల్ లావాదేవీల జోరును పెంచాల్సి ఉందని జైట్లీ వివరించారు. గత కొన్నేళ్లుగా సరైన సంస్కరణలు లేక మన దేశం నీరసించిందని, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ అవతరించిందని పేర్కొన్నారు. గత రెండేళ్లలో మంచి వృద్ధి సాధించామని, ఈ ఏడు కూడా అదే జోరు కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొన్నేళ్లలోనే వర్థమాన దేశం స్థాయి నుంచి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి రియల్ ఎస్టేట్, మరికొన్ని రంగాల్లో 2 విధాలుగా చెల్లింపులు జరపడం (నల్లధనం, తెల్ల ధనం) ప్రజలకు అలవాటు అయిపోయిందని.. దీన్ని ప్రభుత్వం మార్చాలని గట్టిగా ప్రయత్ని స్తోందని జైట్లీ స్పష్టం చేశారు. -
కార్పొరేట్లకు బ్యాంకు రుణాలపై పరిమితులు..
చెన్నై: పెద్ద కంపెనీలకు బ్యాంకులిచ్చే రుణాలపై పరిమితులు విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలపై నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి ప్రకారం బ్యాంకులు తమ మూలధన వనరుల్లో 20 శాతానికి మించి ఏ ఒక్క కంపెనీకి రుణమివ్వకూడదు. అసాధారణ సందర్భాల్లో మరో 5 శాతం మేర ఇవ్వొచ్చు. పరిమితుల ఉల్లంఘన జరిగిన పక్షంలో తక్షణం ఆర్బీఐకి తెలియజేసి, 30 రోజుల వ్యవధిలోగా బ్యాంకులు సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. స్థూలంగా ఒక కార్పొరేట్ గ్రూప్‌నకు ఇచ్చే మొత్తం రుణాలు.. బ్యాంకుల నిర్దిష్ట మూలధనంలో 25 శాతాన్ని మించకూడదని ఆర్బీఐ పేర్కొంది. ఇవి 2019 మార్చ్ 31 నుంచి అమల్లోకి వస్తారుు. -
బకాయిలపై వివరణ ఇచ్చిన హీరో నాగార్జున
హైదరాబాద్ : బ్యాంకు రుణాలపై వచ్చిన ఆరోపణలను హీరో నాగార్జున ఖండించారు. బ్యాంకులకు తాము ఎలాంటి బకాయిలు లేమని ఆయన స్పష్టం చేశారు. అన్నపూర్ణ స్టూడియో అభివృద్ధి కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నమాట వాస్తవమేనని అన్నారు. అయితే ఆ రుణాలు అన్నీ ఈ ఏడాది మొదట్లోనే చెల్లించినట్లు నాగార్జున తెలిపారు. కాగా కొంతమంది ఆరోపణలు చేస్తున్నట్లు తాను కానీ, అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో కానీ బ్యాంకులకు ఎలాంటి బకాయిలు లేమని అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు. It is true we took a loan frm banks to build new film facilities at annapurna studios earlier.ALL LOANS HAVE BEEN CLEARED EARLIER THIS YEAR.— Nagarjuna Akkineni (@iamnagarjuna) 17 November 2016For the few who may believe so neither me nor annapurna studios owe any money to any banks!!FYI— Nagarjuna Akkineni (@iamnagarjuna) 17 November 2016 -
వెయ్యి మంది నిరుద్యోగులకు క్యాబ్‌లు: ఈటల
గచ్చిబౌలి: వెయ్యిమంది నిరుద్యోగులకు క్యాబ్‌లు ఇప్పిస్తామని, ప్రతి ఒక్కరు వృత్తిని ప్రేమించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ క్యాబ్ డ్రైవర్లకు సూచించారు. గురువారం గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో ఉబెర్ అవార్డులను ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ.. చదువుకున్న వెయ్యిమంది నిరుద్యోగులకు డ్రైవర్ కమ్ ఓనర్ స్కీం కింద క్యాబ్‌లు ఇప్పిస్తామని చెప్పారు. వాహనం కొనుగోలుకు రూ.5 లక్షలు బ్యాంక్ రుణం ఇస్తే 60 శాతం సబ్సిడీ, ఐదు లక్షలకు పైగా లోన్ ఇస్తే 50 శాతం సబ్సిడీ అందిస్తామని వెల్లడించారు. రూ.2 లక్షల లోన్ ఇస్తే 70 శాతం సబ్సిడీ అందజేస్తామని తెలిపారు. క్యాబ్ డ్రైవర్ వృత్తి నామోషీగా భావించవద్దని సూచించారు. అనేక మంది చదువుకున్నవారు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు లేనప్పుడు ప్రైవేట్ ఉగ్యోగాలలో సెటిల్ అవుతున్నారని పేర్కొన్నారు. ఉబెర్ క్యాబ్ సహకారంతో నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వృత్తిని సామాజిక సేవగా భావించాలని అన్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో ఉబెర్ క్యాబ్ ప్రయాణికులకు చేరువగా ఉందన్నారు. ఖాళీ సమయాల్లో క్యాబ్ డ్రైవర్లు ఉబెర్‌లో పనిచేసుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
పశ్చిమగోదావరి జిల్లాలో రైతుల ఆందోళన
-
బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలి
కొల్చారం: స్వయం ఉపాధి కింద ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఎంపీడీఓ వామనరావు సూచించారు. రూ.1.50 లక్షలలోపు ఆదాయం కలిగిన నిరుద్యోగులకు బ్యాంకులు రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన ఫారాలను ఎంపీడీఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. -
సిబిల్ స్కోరు ఎంతుండాలి?
ఫైనాన్షియల్ బేసిక్స్ రుణ మంజూరుకు సంబంధించి సిబిల్ స్కోర్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. రుణమిచ్చే సంస్థ/బ్యాంక్ ఒకరికి రుణమివ్వడానికి ముందు వారి సిబిల్ స్కోర్ ఎంతుందో చూస్తుంది. స్కోర్ బాగుంటే పర్వాలేదు. రుణం వస్తుంది. లేకపోతే రుణ లభ్యత కష్టమవుతుంది. అందుకే సిబిల్ స్కోర్‌ను జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. సిబిల్ స్కోర్ సాధారణంగా 300-900 మధ్యలో ఉంటుంది. సిబిల్ సంస్థ ఒక వ్యక్తి బ్యాంకు రుణాలు, క్రెడిట్ కార్డు లావాదేవీలను ఆధారంగా చేసుకొని అతనికి 300-900 మధ్యలో ఒక స్కోర్‌ను కేటాయిస్తుంది. ఈ స్కోర్ 900కు దగ్గరిలో ఉంటే.. రుణమిచ్చే సంస్థలు మీరు రుణాన్ని తిరిగి చెల్లించగలరని ఒక అంచనాకు వస్తాయి. అంటే రుణ మంజూరు సులభంగా జరుగుతుంది. ఒక్కొక్క బ్యాంకు ఒక్కో రకమైన సిబిల్ స్కోర్‌ను రుణ మంజూరుకు ప్రాతిపదికగా తీసుకుంటాయి. అయితే సాధారణంగా చాలా బ్యాంకులు మాత్రం 750 లేదా అంత కన్నా ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులకు రుణాలివ్వటానికి ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే మీ క్రెడిట్ రేటింగ్ ఎలా ఉందనేది తరచూ పరిశీలించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి ఉచితంగా ఈ రిపోర్ట్ పొందవచ్చని ఇటీవలే ప్రభుత్వం ప్రతిపాదించింది. మీ ఆర్థిక జీవనంలో క్రెడిట్ స్కోర్ పాత్ర ఎంతో కీలకమన్న విషయం మర్చిపోవద్దు. ఈ రిపోర్టును మీరు బ్యాంకు లేదా సిబిల్ నుంచి పొందే వీలుంది. తప్పిదాలు జరగొచ్చు జాగ్రత్త: మనం క్రెడిట్ కార్డు పేమెంట్స్‌ను సక్రమంగా చెల్లించినా కూడా సిబిల్ స్కోర్ తక్కువగా రావొచ్చు. దీనికి బ్యాంకులు లేదా మాన్యువల్ తప్పిదాలు కారణంగా నిలువొచ్చు. ఒక్కొక్కసారి డేటా తప్పుగా అప్డేట్ జరగవచ్చు. రిపోర్ట్ సందర్భంలో పేరు, అడ్రస్, పుట్టినతేదీ వంటి వివరాల్లో చిన్న తేడా వచ్చినా, రిపోర్ట్ తప్పుగా నమోదయ్యే వీలుంటుంది. ఏదైనా తప్పు ఎంట్రీ జరిగితే.. దానిని సిబిల్ దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. -
ఊడుతున్న ఉద్యోగాలు
* యూఏఈలో రాష్ట్ర కార్మికుల పాట్లు.. * ఆదుకోవాలంటూ వినతులు రాయికల్: ప్రపంచంలో ఆయిల్ ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఆర్థికమాంద్యం మన కార్మికుల మెడకు చుట్టుకుంటోంది. ఆయా కంపెనీల్లో ఉద్యోగాల కల్పనలో అరబ్ దేశాలకు చెందిన వారికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని యూఏఈ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భారత్‌లోని కార్మికులను టార్గెట్ చేసుకొని ఉద్యోగాల నుంచి నిర్ధాక్షిణ్యంగా తొలగింపు చేపట్టారు. యూఏఈలోని దుబాయ్, అబుదాబీ, షార్జా, అజ్మన్, రస్ ఆల్‌ఖైమా, పుజ్‌రాహీ, ఉమా ఆల్ ఉక్వెన్ వంటి దేశాల్లో తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన సుమారు పది లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఆర్థిక సంక్షోభంతో కంపెనీలకు అక్కడి బ్యాంకులు రుణాలు మంజూరు చేయకపోవడంతో పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. వీటిపై ఆధారపడ్డ కార్మికులను హఠాత్తుగా పనిలో నుంచి తొలగిస్తూ ఆయా కంపెనీలు ఉత్తర్వులు జారీ చే శాయి. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు వివిధ కంపెనీల్లో కొంత హోదాలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ జీతాలకు అనుగుణంగా అక్కడి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. ఒక్కసారిగా కంపెనీల నుంచి ఉద్యోగాలు తీసివేయడంతో బ్యాంకుల్లో తీసుకున్న రుణం కట్టలేక ఆందోళనకు గురవుతున్నారు. రుణాలు చెల్లించకుంటే బ్యాంకులు పాస్‌పోర్ట్‌లను బ్లాక్ చేసే అవకాశం ఉండటంతో ఇటు స్వగ్రామానికి రాలేక, అక్కడ ఉపాధి లేక తంటాలు పడుతున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించి భారతీయ, తెలంగాణ కార్మికులకు ఉద్యోగాలు కల్పించేలా చొరవ చూపించాలని దుబాయ్‌లో పనిచేస్తున్న కార్మికులు సాక్షితో తమ ఆవేదనను చెప్పుకొన్నారు. రాష్ట్రానికి చెందిన వారే 5 లక్షలు: యూఏఈలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐదు లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, తదితర జిల్లాలకు చెందినవారే. యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుదాబీ వంటి ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఉపాధి పొందుతున్నారు. ఒక్కసారిగా పనిలో నుంచి వీరిని తొలగించడంతో వీరి కుటుంబాలు వీధిన పడే పరిస్థితి నెలకొంది. హఠాత్తుగా కార్మికులను కంపెనీల నుంచి తొలగించడంతో మూడు నెలల వేతనాన్ని కంపెనీ ఇవ్వాల్సి ఉంటుంది. కాని కంపెనీలు 3 నెలల వేత నం కూడా ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దుష్ర్పచారం చేస్తే జరిమానా.. యూఏఈలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, ఇక్కడి దేశాలకు ఎవరూ రావద్దని కార్మికులు ఎవరైనా మాట్లాడినా, ఫోన్లో సంభాషించినా వారికి అక్కడి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. దీంతో అక్కడి విషయాలు ఫోన్లో చెప్పడానికి సైతం కార్మికులు వెనుకడుగు వేస్తున్నారు. ఎవరైనా దుష్ర్పచారం చేస్తే జైలుశిక్ష లేదా భారీ మొత్తంలో జరిమానా విధిస్తున్నారని కార్మికులు తెలిపారు. రాత్రికి రాత్రే ఉద్యోగం తొలగించారు అజ్మల్లోని దుబాయ్ ఆయిల్ క ంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఎలాంటి నోటీసు లేకుండా రాత్రికి రాత్రే ఉద్యోగం నుంచి తొలగించారు. ఇక్కడ ఉద్యోగాలు లేకపోవడంతో గత్యంతరం లేక స్వగ్రామానికి తిరిగి వస్తున్నా. - రవి, రాజేశ్వర్రావుపేట, ఇబ్రహీంపట్నం, కరీంనగర్ జిల్లా -
నకిలీలలు
కలిగిరి కేంద్రంగా నకిలీ పాసుపుస్తకాలు, అడంగల్, 1బీల తయారీ అధికారుల సంతకాలు ఫోర్జరీ బ్యాంకు రుణాల కోసం అడ్డదారులు తొక్కుతున్న రైతులు కలిగిరి: నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు, అడంగల్, 1బీల తయారీకి కలిగిరి మండలం అడ్డాగా మారింది. అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లు, మీసేవ నిర్వాహకుల సహకారంతో కొందరు పెద్దమొత్తంలో నగదు తీసుకుని నకిలీలను తయారు చేసి ఇస్తున్నారు. కొందరు రైతులు నకిలీల సాయంతో యథేచ్ఛగా బ్యాంకు రుణాలు పొందుతున్నారు. బ్యాంకుల్లో రుణాల్లో పొందే సమయంలో ఇబ్బందులు కలుగకుండా ముందు జాగ్రత్తగా వెబ్‌ల్యాండ్‌లో తాత్కాలికంగా పేర్లు నమోదు చేస్తున్నారు. రుణాలు పొందిన అనంతరం వాటిని తొలగిస్తున్నారు. ఇందుకు మీసేవ కేంద్రాల నిర్వాహకులు, తహసీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్లు సహకరిస్తున్నారు. కలిగిరిలో నకిలీ అడంగల్, 1బీ తయారీకి సహకరించారని కంప్యూటర్ ఆపరేటర్, మీసేవ నిర్వాహకునిపై తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. వెలుగులోకి వచ్చిన నకిలీ సంఘటనలు –గత ఏడాది జూన్ 24న కలిగిరిలోని ఏపీజీబీ బ్యాంకులో నకిలీ పాసుపుస్తకాలు, అడంగల్, 1బీలతో రుణాలు పొందేందుకు నలుగురు రైతులు ప్రయత్నించారు. అప్పటి తహసీల్దార్ లావణ్య ఫిర్యాదు మేరకు సదరు రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. –గతేడాది జూన్ 27న కలిగిరి ఏపీజీబీ బ్యాంకులో మరో 9 నకిలీ పాసుపుస్తకాలను గుర్తించి ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. జూలై 6న జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించి నకిలీ పాసుపుస్తకాలు, అడంగల్ తయారీదారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ నకిలీలు చలామణి అవుతున్నాయి. –ఈ ఏడాది జూలై 12న కంప్యూటర్ ఆపరేటర్, మీసేవ నిర్వాహకుని సహకారంతో నకిలీ 1బీ, అడంగల్ తయారు చేసి కొందరు బ్యాంకులో రుణాలు పొందడానికి ప్రయత్నిస్తున్నారని తెల్లపాడు గ్రామస్తులు తహసీల్దార్ రవీంద్రనాథ్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన తహసీల్దార్ కంప్యూటర్ ఆపరేటర్, మీసేవ నిర్వాహకుడు, మరికొందరిపై కేసు నమోదు చేయించారు. – తాజాగా ఈ నెల 8న మార్తులవారిపాళేనికి చెందిన మూలి పెంచలయ్య రెవెన్యూ అధికారుల సంతకాలు, స్టాంపులు ఫోర్జరీ చేయడం వెలుగులోకి వచ్చింది. దీనిపై తహసీల్దార్ పోలిసులకు ఫిర్యాదు చేశారు. సూత్రదారులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం మండలంలో యథేచ్ఛగా నకిలీ పాసుపుస్తకాలను తయారు చేస్తున్నా సూత్రధారులను పట్టుకోవడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నకిలీల తయారీదారులు మీసేవ కేంద్రాల నుంచి ఖాళీ సర్టిఫికెట్లను కొనుగోలు చేస్తున్నారు. రెవెన్యూ శాఖ అధికారుల స్టాంపులు, సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను సష్టిస్తున్నారు. బ్యాంకు రుణాలను పొందవచ్చనే ఆశను చూపుతూ అమాయకులైన రైతులకు ఎరవేస్తున్నారు. ఈ క్రమంలో నకిలీ పత్రాలు బయటపడి కేసులు నమోదు చేస్తే నకిలీదారులు తప్పించుకుంటున్నారు. రైతులు మాత్రం బలవుతున్నారు. నకిలీలకు కొందరు అధికారులు, నాయకులు సహకారం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నారు. పోలీసులు సైతం నకిలీ పత్రాల తయారీదారులను పట్టుకోవడంలో చొరవచూపడం లేదు. కేసును సీఐడీకి బదిలీ చేశామని చెబుతూ తప్పించుకుంటున్నారు. నకిలీ పత్రాల తయారీదారులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించడం లేదని తహసీల్దారే ఆవేదన వ్యక్తం చేస్తుండడం చూస్తే వారికి ఉన్న అండదండలు ఏ పాటివో అర్ధమవుతోంది. -
రెవెన్యూ సిబ్బందిలో నకిలీ పుస్తకాల గుబులు
కొడకండ్ల : మండలంలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల బాగోతం కొద్ది రోజుల క్రితం వెలుగు చూసిన నేపథ్యంలో స్థానిక రెవెన్యూ సిబ్బందిలో గుబులు మొదలైంది. ఈ ఊచ్చు ఎవరికి బిగుస్తుందోననే వారు ఆందోళనకు గురవుతున్నారు. కొన్నేళ్లుగా ఓ ముఠా నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను తయారు చేస్తూ అమాయక రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ అక్రమాలకు పా ల్పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే నకిలీ పుస్తకాలు తయారు చేసిన ముఠా సభ్యులు స్థానిక రెవెన్యూ సిబ్బందికి ముడుపులిచ్చి వాటి భూముల సర్వే నంబర్లను కంప్యూటర్ పహాణీలు, 1 బీలో నమోదు చేయించి పలువురు రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించినట్లు తెలుస్తోంది. అటెండర్ నుంచి మొదలుకుని పైస్థాయి అధికారి వరకు అందరికి ముడుపులిచ్చి తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగించినట్లు సమాచారం. అయితే వందల సంఖ్యలో నకిలీ పాసుపుస్తకాలను తయారు చేశారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని రైతు లు అభిప్రాయపడుతున్నారు. కాగా, నకిలీ పాసు పుస్తకాల బాగోతం వెలుగులోకి రావడంతోపాటు పోలీసులు దానిపై విచారణ చేపడుతుండడంతో అనుమానిత వ్యక్తులు ఐదారు రోజులుగా మండల కేంద్రంలో కనిపించడంలేదని తెలుస్తోంది. ఇదిలా ఉం డగా, ఈ తతంగం వెలుగులోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సిబ్బందిలోని ఇద్దరిని ఇంచార్జ్ తహసీల్దార్ సరెండర్ చేయడంతోపాటు కొంతమంది వీఆర్ఏలను కార్యాలయానికి రావద్దని హెచ్చరించినట్లు సమాచారం. -
అప్పు పుట్టని ‘అరక’
- అన్నదాతలకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ససేమిరా - రుణమాఫీ సొమ్ము రాలేదంటూ కొర్రీలు - బ్యాంకు రుణాలకు నోచుకోని 30 లక్షల మంది రైతులు - బ్యాంకు అధికారుల చుట్టూ తిరిగినా రుణాలు ఇవ్వడం లేదని ఆవేదన - ఇప్పటివరకు 6.16 లక్షల మందికే అందజేత - వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న అన్నదాతలు - రూ. 2, రూ. 3 మిత్తికి అప్పులు చేస్తూ తిప్పలు - ఖరీఫ్ రుణ లక్ష్యం.. రూ. 17,460 కోట్లు - ఇప్పటిదాకా ఇచ్చింది రూ. 3,761 కోట్లే! సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ‘‘బ్యాంకులకు పోతే లోన్లు ఇయ్యడానికి ఇంకా చానా రోజులైతదని చెబుతుండ్రు. ఎక్కడా అప్పు పుడుతలేదు. సేట్ల దగ్గరికి పోతే కాలమే సక్కగైతలేదు.. అప్పులెలా చెల్లిస్తావని అంటుండ్రు.. ఇగ ఏం విత్తనం ఎయ్యాలే? ఏం జేయాలే..? పూట గడుపుకోవడానికి కూలీకి పోతున్న’’ - మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌కు చెందిన రైతు పోకల మల్లేశం ఆవేదన ఇది! ‘‘బ్యాంకు చుట్టూ రుణం కోసం తిరిగినా ఫలితం లేదు. రెన్యువల్ చేయాలని అడిగినా రుణమాఫీ సొమ్ము రాలేదని వాయిదా వేశారు. చేసేది లేక ప్రైవేటుగా రూ.3 వడ్డీకి లక్ష అప్పు తెచ్చి 14 ఎకరాల్లో మొక్కజొన్న వేశా’’ మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాలకు చెందిన రాంరెడ్డి వ్యథ ఇది!! ..ఇలా ఒక్కరిద్దరు కాదు.. రాష్ట్రంలో లక్షల మంది రైతులది ఇదే గోస. గత రెండేళ్లతో పోలిస్తే వానలు కాస్తోకూస్తో బాగానే పడుతున్నా చేలలో గింజ వేసేందుకు రైతన్న చేతిలో చిల్లి గవ్వ లేదు. రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు మొహం చాటేస్తున్నాయి. అప్పు కోసం కాళ్లరిగేలా తిరిగినా నానా కొర్రీలు పెడుతూ మొండిచేయి చూపుతున్నాయి. దీంతో గత్యంతరం లేక చాలా మంది రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు బంగారం కుదువపెట్టి బ్యాంకుల్లో, షావుకార్ల వద్ద అప్పు తెచ్చుకుంటున్నారు. కాస్త పెద్ద రైతులు సొంతంగా పెట్టుబడులు పెడుతున్నా.. చిన్న, సన్నకారు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై నెలన్నర దాటినా పంట రుణాలు అనుకున్న స్థాయిలో ఇవ్వడం లేదు. 2016-17 ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి రూ.29,101 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ఖరీఫ్‌కు రూ.17,460 కోట్లు, రబీకి రూ.11,640 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ బ్యాంకర్ల లెక్కల ప్రకారం ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు కేవలం రూ.3,761 కోట్లు ఇచ్చారు. సర్కారు లెక్కల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 55.53 లక్షల మంది రైతుల్లో.. 36 లక్షల మంది బ్యాంకు రుణాలు తీసుకుంటారు. అయితే ఇప్పటివరకు కేవలం 6.16 లక్షల మంది రైతులకే బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. దాదాపు 30 లక్షల మంది రైతులు రుణాలకు దూరంగా ఉన్నారు. రుణమాఫీనే బూచీగా చూపుతూ.. తెలంగాణ ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణాలకు రుణమాఫీ ప్రకటించింది. మొత్తం రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించింది. రుణమాఫీకి అర్హులుగా 35.82 లక్షల రైతులను గుర్తించింది. మొదటి విడతగా 2014లో రూ.4,230 కోట్ల మాఫీ ప్రకటించింది. ఆ తర్వాత రెండో విడత రుణమాఫీని గతేడాది రెండు విడతలుగా విడుదల చేసింది. ఇంకా రెండు విడతల సొమ్ము రూ.8 వేల కోట్లకుపైగా విడుదల చేయాల్సి ఉంది. ఈ ఏడాది మూడో విడత సొమ్ముకు బడ్జెట్లో నిధులు కేటాయించింది. మూడు, నాలుగో విడత సొమ్ము ఒకేసారి చెల్లించాలని ప్రతిపక్షాలు, బ్యాంకులు కోరాయి. కానీ సర్కారు మూడో విడతకే పరిమితమైంది. మూడో విడతలోనూ రూ.2,020 కోట్లే ఇస్తానని చెప్పింది. చివరకు ఆ సొమ్మును కూడా రెండు విడతలుగా విడుదల చేసింది. ఇప్పటికీ రుణమాఫీ సొమ్మును సక్రమంగా చెల్లించకపోవడంతో బ్యాంకులు రైతులకు పూర్తిస్థాయిలో పంట రుణాలు ఇవ్వడంలేదు. రుణమాఫీతో రైతులకు సంబంధం లేదని, అది ప్రభుత్వానికి, బ్యాంకులకు సంబంధించిన వ్యవహారమేనని సర్కారు పదేపదే చెప్పినా బ్యాంకులు మాత్రం రుణమాఫీ వ్యవహారాన్నే ముందుకు తెస్తూ రుణాలివ్వడానికి వెనుకంజ వేస్తున్నాయి. జిల్లాల్లో ఇదీ పరిస్థితి.. రైతులకు బ్యాంకు రుణాలు ఏ మేరకు అందుతున్నాయో తెలుసుకునేందుకు ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పర్యటించింది. మచ్చుకు జిల్లాకో గ్రామాన్ని ఎంచుకొని ఆ ఊళ్లో రైతుల పరిస్థితిని తెలుసుకుంది. ఇందు లో చాలా మంది బ్యాంకు రుణాలు అందడం లేదని, ఫలితంగా ప్రైవేటుగా రూ.3 వడ్డీకి అప్పులు చేయా ల్సి వస్తోందని గోడు వెల్లబోసుకున్నారు. - ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలం కత్తరశాలలో సుమారు 110 మంది రైతులు ఉండగా.. వీరిలో ఇప్పటివరకు 25 మందికి మాత్రమే రుణాలు అందాయి. మిగతావారంతా ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.22.50 లక్షల మేర అప్పులు చేశారు. - కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లిలో 1,038 మంది రైతులుంటే.. వారిలో 400 మందికి రుణాలు అందాయి. మరో 252 మంది ప్రైవేటుగా రూ.2 వడ్డీకి అప్పులు తెచ్చుకొని పెట్టుబడులు పెట్టారు. మిగతావారిలో బ్యాంకుల్లో బంగారు ఆభరణాలు కుదవపెట్టి కొందరు, డ్వాక్రా సంఘాల నుంచి కొందరు రుణాలు తీసుకున్నారు. - మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాలలో 852 మంది రైతులు ఉండగా.. ఈ ఖరీఫ్‌లో బ్యాంకుల నుంచి 40 మందికి మాత్రమే రూ.25 లక్షల మేర రుణాలందాయి. 350కి పైగా రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పులు చేశారు. ఒక్కో రైతు రూ.40 వేల నుంచి రూ.2 లక్షల అప్పులు చేశారు. - నల్లగొండ జిల్లా చిలుకూరు మండలంలోని చిలుకూరులో 1,322 రైతులు ఉండగా.. ఈ ఖరీఫ్‌లో కొత్తగా 16 మందికి రూ.9 లక్షల మేర మాత్రమే రుణాలిచ్చారు. ప్రాథమిక సహకార సంఘం నుంచి 1,024 మంది రైతులకు రూ.1.14 కోట్ల రుణాలను రెన్యూవల్ చేసినా కొత్త రుణాలు మాత్రం ఇవ్వలేదు. - వరంగల్ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకలో 789 మంది రైతులు ఉండగా.. 266 మంది రైతులకు బ్యాంకులు రుణాలిచ్చాయి. మిగిలిన 523 మంది రైతులు ప్రైవేటు, ఫైనాన్స్ కంపెనీల వద్ద అధిక వడ్డీలకు అప్పు తెచ్చుకున్నారు. - ఖమ్మం జిల్లా బయ్యారం మండలం గౌరారంలో 356 రైతులు ఉండగా.. ఈ ఖరీఫ్‌లో 12 మందికి పలు బ్యాంకులు రుణాల రెన్యూవల్ జరిగింది. రుణాలందకపోవడంతో దాదాపు 200 మంది ప్రైవేటు అప్పులు చేశారు. - మెదక్ జిల్లా వర్గల్ మండలం తున్కిఖాల్సాలో 1,978 మంది రైతులు ఉండగా.. వారిలో 100 మందికే బ్యాంకు రుణాలందాయి. దాదాపు 1,500 మంది ప్రైవేటు అప్పులు చేశారు. మిగతావారు సొంతంగా పెట్టుబడులు పెట్టారు. - నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం ఆరెపల్లిలో 365 మంది రైతులు ఉండగా.. వాణిజ్య, సహకార బ్యాంకుల నుంచి 284 మంది రుణాలు తీసుకున్నారు. 40 మంది ప్రైవేటు అప్పులు చేయగా.. బంగారం తాకట్టు పెట్టి 60 మంది రుణాలు పొందారు. - రంగారెడ్డి జిల్లా పరిగి మండ లం మిట్టకోడూరులో 750 మంది రైతులు ఉండగా.. 10 మందికే రుణాలందాయి. 550 మంది ప్రైవేటు అప్పులు చేశారు. బంగారం కుదువ పెట్టా.. ఆంధ్రాబ్యాంక్‌లో పోయిన ఏడాది రూ.30 వేల రుణం ఇచ్చిండ్రు. ఈ ఏడాది రెండెకరాల్లో మొక్కజొన్న పంట ఏసిన. కాగితాల్లో మార్పులు చేసినమని చెప్పిండ్రు. రుణం మాత్రం ఇంక ఇయ్యలే. బంగారం కుదువ పెట్టి అప్పు తెచ్చుకుని సాగు చేసుకున్న. -ఎగుర్ల లచ్చయ్య, గొల్లపల్లి, కరీంనగర్ కొత్త వారికి రుణం ఇవ్వరట! ఈయన పేరు సింగతి బాపు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం పెర్కపల్లి. ఈ రైతుకు మూడెకరాల భూమి ఉంది. పంట రుణం కోసం బెల్లంపల్లి కో-ఆపరేటివ్ బ్యాంకుకు వెళ్తే కొత్త వారికి ఇవ్వడం కుదరదని వెనక్కి పంపేశారు. చేసేది లేక సమీపం బంధువు వద్ద రూ.2 వడ్డీ చొప్పున రూ.లక్ష అప్పు తీసుకొని రెండెకరాల్లో పత్తి, ఎకరంలో వరి సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ అప్పుకు ఏడాదికి అసలుతో పాటు వడ్డీ రూ.24 వేలు చెల్లించాలి. బ్యాంకు చుట్టూ తిరిగి అలసిపోయా.. నేను రెండేళ్ల క్రితం బ్యాంకులో రూ.35 వేలు రుణం తీసుకున్నా. అది మాఫీ అయ్యిందా? లేదా అన్నది బ్యాంకు వారు చెప్పడం లేదు. కొత్త రుణం ఇవ్వడం లేదు. బ్యాంకు చుట్టూ తిరిగి అలసిపోయాను. పొలాన్ని బీడు పెట్టడం ఇష్టం లేక పంట పండిన తర్వాత ధాన్యం విక్రయిస్తానని చెప్పి అప్పు తెచ్చుకొని పంట వేశా. -యాపచెట్టు చిన్న చెంద్రాయడు, గోపాల్పేట, మహబూబ్‌నగర్ -
ఖైదీల పునరావాసానికి రుణసాయం
సిద్దిపేట: జైలు నుంచి విముక్తి పొందిన ఖైదీలకు జైళ్ల శాఖ తరఫున రుణాలు అందజేయనున్నట్లు మెదక్ జిల్లా సబ్‌జైళ్ల అధికారి లక్షీనర్సింహ తెలిపారు. శనివారం ఆయన సిద్దిపేట సబ్‌జైలును సందర్శించి ఖైదీలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జైళ్ల శాఖ సంస్కరణల్లో డీజీ వినయ్‌కుమార్ సింగ్ చొరవతో ఖైదీలకు మేలు కలిగేలా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. జైలు నుంచి విముక్తి పొందిన ఖైదీలకు స్థిరాస్తికి సంబంధించిన పత్రాలుంటే బ్యాంక్ రుణాలు ఇప్పించేందుకు సహకరిస్తామని చెప్పారు. దీంతో ఖైదీలకు ఉపాధి లభిస్తుందన్నారు. సిద్దిపేట సబ్‌జైలును చిన్నకోడూరు మండలం మందపల్లి వద్ద ఉన్న ఏఆర్ సబ్‌హెడ్ క్వార్టర్ సమీపంలోకి మార్చేందుకు పరిశీలిస్తున్నామన్నారు. దీంతోపాటు పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేసి ఖైదీలకు ఉపాధిని కల్పించాలనే ఆలోచనతో ఉన్నట్లు పేర్కోన్నారు. -
పత్తి బీమాకు ధీమా కరువు!
♦ ఈ నెల 14 వరకు ప్రీమియం చెల్లింపు గడువు ♦ బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో చెల్లించని రైతులు సాక్షి, హైదరాబాద్: పత్తి రైతు మీద కత్తి కట్టినట్లుగా ఉంది పరిస్థితి. బీమాకు ధీమా కరువైంది. ఖరీఫ్ ఇంకా ఊపందుకోలేదు. పత్తి పంట బీమా గడువు మాత్రం సమీపిస్తోంది. ఈ నెల 14వ తేదీ నాటికి పత్తి పంట బీమాకు ప్రీమియం చెల్లించాలి. లేకుంటే వారికి ఒక్క పైసా బీమా సొమ్ము చేతికందదు. తెలంగాణ సర్కారే స్వయంగా ఈ తేదీని గడువుగా నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా గత ఖరీఫ్‌లో 42 లక్షల ఎకరాల్లో పత్తినే సాగు చేశారు. ఈసారి పత్తి సాగును తగ్గించాలని సర్కారు భావిస్తున్నా రైతులు ఇతర పంటలవైపు మరలడంలేదు. పత్తి పంటకు నష్టం జరిగితే వాతావరణ ఆధారిత బీమా పథకం (డబ్ల్యుబీసీఐఎస్) కింద రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతులు తీసుకునే రుణం నుంచే బ్యాంకులు ప్రీమియం సొమ్మును మినహాయించుకుంటాయి. బ్యాంకులు ఇప్పటికీ కొత్త రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు చాలామంది ప్రీమియం చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. కనీసం రుణం తీసుకునే రైతుల వివరాలు ఇస్తే వారు ప్రీమియం చెల్లించినట్లుగా భావించి బీమా జాబితాలో చేర్చుతామని బీమా కంపెనీలు చెప్పినా బ్యాంకులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. మూడో విడత రుణమాఫీ సొమ్ము విడుదల చేయకుండా ఏమాత్రం కొత్త రుణాలు ఇవ్వబోమని బ్యాంకులు తేల్చి చెబుతున్నాయి. మరోవైపు ప్రీమియం గడువు పెంపుపైన సర్కారు శ్రద్ధ చూపడంలేదు. పత్తికి బీమా ప్రీమియాన్ని రైతులు మొత్తం బీమా సొమ్ములో 5 శాతం చెల్లించాలి. మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్రాలు భరించాల్సి ఉంది. తమ వాటాను భరించడానికి సిద్ధంగా లేకపోవడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ ప్రారంభం కాకముందే ప్రీమియం చివరి తేదీ ప్రకటించిందన్న విమర్శలూ ఉన్నాయి. తద్వారా రైతుల సంఖ్యను, రాయితీ సొమ్ము తగ్గించుకోవచ్చనేది సర్కారు ఆలోచన. అనుకూలమైన గడువు తేదీలు ప్రకటించుకోవాలని కేంద్రం స్పష్టం చేసినా రాష్ట్ర సర్కారు మాత్రం ఈ నెల 14ని చివరి గడువుగా ప్రకటించిందన్న విమర్శలున్నాయి. -
మాల్యాను భారత్ కు పంపించం: యూకే
లండన్: బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కేసులో భారత్ కు యూకే షాక్ ఇచ్చింది. మాల్యాను స్వదేశానికి పంపించాలని ఇటీవల యూకే ప్రభుత్వాన్ని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ కోరింది. అయితే యూకే చట్టాల ప్రకారం ఓ వ్యక్తిని దేశం నుంచి పంపించివేసే అధికారం తమకు లేదని అధికారులు స్పష్టంచేశారు. అయితే ఈ కేసు నిమిత్తం అవసరమైతే ఎలాంటి సహాయం అయినా చేయడానికి సిద్ధమని యూకే అధికారులు వివరించడం భారత్ కు కాస్త ఊరటనిచ్చే అంశమ. ఎలాంటి సమాచారం అందించకుండా గత మార్చి 2న విజయ్ మాల్యా లండన్ కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అతడిపై చర్యలు తీసుకోవాలని తమ డబ్బులు రికవరీ చేసేలా చూడాలని బ్యాంకులు కేంద్ర ప్రభుత్వాన్ని, సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మాల్యాను భారత్ కు తిరిగి పంపించాలని యూకే ప్రభుత్వాన్ని భారత్ ఏప్రిల్ 29న కోరింది. అదేవిధంగా గత నెలలో మాల్యా పాస్ పోర్టు కూడా రద్దయింది. మాల్యా విషయంలో చర్యలు తీసుకుని భారత్ కు తిప్పిపంపడం అసాధ్యమని, సాయం చేస్తామని యూకే అధికారులు వివరించారు. -
నన్ను అరెస్ట్ చేస్తే.. ఒక్క రూపాయీ రాదు
న్యూఢిల్లీ: బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా దేశంవిడిచి పారిపోయిన లిక్కర్ కింగ్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యాను వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. మాల్యా మాత్రం తాను ఇంగ్లండ్‌ను వదిలివచ్చే ఉద్దేశ్యంలేదని చెబుతున్నాడు. తన పాస్‌పోర్టు తీసుకున్నా, అరెస్ట్ చేసినా బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా రాదని చెప్పాడు. బ్యాంకులకు ఎంతో కొంత చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. విజయ్ మల్యా పలు బ్యాంకులకు దాదాపు 9500 కోట్ల రూపాయలు బకాయిపడిన సంగతి తెలిసిందే. బ్యాంకులకు రుణం చెల్లించకుండా ఆయన ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు. లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యాను తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వానికి కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ... బ్రిటన్ హై కమిషనర్‌కు లేఖ రాసింది. మాల్యాను స్వదేశానికి రప్పించే ప్రయత్నాల్లో భాగంగా ఆయన పాస్ట్ పోర్టును కూడా రద్దు చేసింది. ఇక మాల్యా రాజ్యసభ సభ్వత్వాన్ని రద్దు చేయాల్సిందిగా ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది. -
మాల్యాకు బిగుసుకుంటున్న ఉచ్చు!
న్యూఢిల్లీ : బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగొట్టి, విదేశాలకు వెళ్లిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు బిగుసుకున్న ఉచ్చు మరింత బలపడేలా కనిపిస్తోంది. లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యాను తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వానికి కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ... బ్రిటన్ హై కమిషనర్‌కు లేఖ రాసింది. ఇదిలా ఉంటే బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన మాల్యా ప్రస్తుతం లండన్‌లో తలదాచుకున్నారు. విచారణకు రావాలంటూ ఈడీ మూడు సార్లు నోటీసులు పంపినా... డొంకతిరుగుడు సమాధానాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాల్యాను భారత్‌కు తీసుకువచ్చేదిశగా బ్రిటన్ ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తెస్తోంది. గత మార్చి 2వ తేదీన విజయ్ మాల్యా లండన్ కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. మాల్యా భారత్ కు తిరిగిరాకపోవడం, ఆయనపై దాఖలయిన పిటిషన్లు, కేసులపై విచారణ నిమిత్తం స్వదేశానికి తిరిగి రావాలన్న ఆదేశాలను పాటించకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవలే ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా తనని అరెస్టు చేస్తారనే భయంతోనే భారత్ కు రావడం లేదంటూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను ఇచ్చిన గడువులోగా వెల్లడించాలని జస్టిస్ కురియన్ జోసెఫ్, ఆర్ఎఫ్ నారీమన్ లతోకూడిన బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు బ్యాంకులకు రూ.9,400 కోట్ల రుణాల ఎగవేతను క్షుణ్ణంగా పరిశీలించిన 10మంది సభ్యుల కమిటీ ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దుచేయడానికి అంగీకరించారు. -
సంక్షేమానికి దూరం గిరిజనం
మొక్కుబడిగా బ్యాంకు రుణాలు కనిపించని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం, ఎన్టీఆర్ విద్యోన్నతి పేరుకే గిరిపుత్ర కల్యాణపథకం ఇస్తామన్న బ్యాంకు రుణాలు రూ.948.47 కోట్లు, ఇచ్చింది రూ. 67.9 కోట్లు {పభుత్వ హామీలు గాలికి అభివృద్ధికి ఆమడ దూరంలో గిరిజన ప్రాంతాలు చిత్తూరు: గిరిజనుల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు జిల్లాలో మచ్చుకైనా అమలు కావడం లేదు. జిల్లావ్యాప్తంగా 1283 ఎస్టీ హేబిటేషన్లు(కాలనీలు) ఉండగా వీటి పరిధిలో 1,73,320 మంది గిరిజనులు ఉన్నట్లు గణాంకా లు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య రెట్టింపు ఉంటుందని అంచనా. వీరిలో యానాదులు 1,20,176 (69శాతం), ఎరుకలు 16,335 (9.42శాతం), సుగాలీలు 33,791 (19.50శాతం), నక్కలోల్లు 3,018 (1.74 శాతం) ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఎస్టీల కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఎస్టీల జీవనప్రమాణాలు పెంచడానికి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నట్లు చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టిన రోజు నుంచీ చెబుతూనే ఉంది. అందులో భాగంగా పేద ఎస్టీలకు బ్యాంకు రుణాలిస్తున్నట్లు తెలి పింది. గిరిజనుల అభివృద్ధి కోసం 2014-15లో 1150 మందికి రూ. 476.7 కోట్లు, 2015-16లో 597 మందికి రూ.464.17 కోట్లు ఇస్తున్నట్లు ప్రణాళికలో వెల్లడించారు. అయితే 2014-2015కు గాను కేవలం 139 మందికి రూ.66.48 కోట్లు, 2015-16కు గాను కేవలం 142 మందికి రూ. 1.42 కోట్లు మాత్రమే మంజూరు చేసిం ది. రెండేళ్ల పాలనలో 1747 మందికి రూ.948.87 కోట్లు రుణాలిస్తామని చెప్పి కేవలం 281 మందికి రూ.67.9 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఫీజులు, మెస్ చార్జీల బకాయిలు... గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా పేద విద్యార్థులకు ఫీజులు, మెస్ బిల్లులు క్రమం తప్పకుండా ప్రభుత్వమే చెల్లిం చాలనేది నిబంధన. కానీ 2015-16 కు గాను 4,562 మంది విద్యార్థులకు రూ.8 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.4 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగిలిన 2,300 మంది విద్యార్థులకు మరో రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక 2014-15 ఏడాదికి సంబంధించి 4,598 మందికి రూ.7,83,80,603 చెల్లించాల్సి ఉండగా, 3,876 మందికి రూ.7,04,00,716 మాత్రమే ఇచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో మిగిలిన బిల్లు రూ.79లక్షలు పెండింగ్‌లో ఉండిపోయిందని అధికారులు చెబుతున్నారు. ట్యూషన్ ఫీజులు , మెస్ బిల్లులు కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో గిరిజన విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. విదేశీ చదువుల మాట హుళక్కే... అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథ కం ద్వారా ఎస్టీ విద్యార్థులకు విదేశీ వి ద్యనందించి వారి పురోభివృద్ధికి పాటుపడుతామని చెబుతున్న ప్రభుత్వం ఇంతవరకూ ఏ ఒక్క విద్యార్థిని పంపిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో చదువుతు న్న వారికే మొండి బకాయిలు చెల్లించలేని ప్రభుత్వం విదేశీ విద్యని ఎప్పుడు అందిస్తుందని గిరిజనుల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లాలంటే డిగ్రీ, పీజీలలో 60 శాతం మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇక ఇంజనీరింగ్ విద్య కోసం అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, జర్మనీ, స్వీడన్, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, రష్యా దేశాలకు పంపుతామని తెలిపింది. మెడిసిన్ కోసం ఫిలిప్పైన్, చైనా దేశాలకు పంపుతామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిలో వంద మంది విద్యార్థులను ఉన్నత విద్య కోసం విదే శాలకు పంపుతామని చెప్పింది. ఈ లెక్కన జిల్లా నుంచి 10 నుంచి 13 మందిని పంపుతామని చెప్పినా, పంపినట్లు ఎక్కడా ప్రభుత్వ రికార్డుల్లో లేదు. గిరిపుత్ర కల్యాణపథకం పేదరికంతో ఆడపిల్ల పెళ్లి కూడా చేయలేని గిరిజనుల కోసం వివాహ సమయంలో గిరిపుత్ర కల్యాణ పథకం కింద రూ.50వేలను అందిస్తామని ప్రభుత ్వం హామీ ఇచ్చింది. జిల్లాలో వేలాది వివాహాలు జరుగుతున్నా చంద్రబాబు సర్కారు రెండేళ్ల పాలనలో 57 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 19 మందికి రూ.9.50లక్షలు ఇచ్చినట్లు గిరిజన సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆ శాఖ మంత్రి కనీసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయకపోవడంపై విమర్శలున్నాయి. మొత్తం ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి గిరిజన సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలిందన్న విమర్శలున్నాయి. ఎస్సీ, ఎస్టీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తూతూమంత్రంగా జిల్లాలో పర్యటించి వెళ్లడమే కానీ ఫలితం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
మాల్యాతో చర్చించండి.. నష్టాలను తగ్గించుకోండి..
బ్యాంకులకు అసోచామ్ సూచన న్యూఢిల్లీ: భారీ ఎత్తున బ్యాంకు రుణాలు కలిగివున్న విజయ్ మాల్యాతో చర్చలు జరిపి రావాల్సిన డబ్బును తిరిగి రాబట్టుకోవాలని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ బ్యాంకులకు సూచించింది. చర్చలతో నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపింది. మాల్యా బ్యాంకులకు ఇచ్చిన రూ.4,000 కోట్ల ఆఫర్ తన రుణ చెల్లింపు ఉద్దేశాన్ని తెలియజేస్తోందని పేర్కొంది. మాల్యా రుణ ఎగవేత చర్యపై బ్యాంకులు.. మీడియా నివేదికలకు, బహిరంగ చర్చలకు ప్రభావితం కావొద్దని తెలిపింది. మాల్యా ఉన్న ప్రాంతంతో సంబంధం లేకుండా బ్యాంకులు ఆయనతో వాస్తవిక చర్చలు జరిపితే రూ.4,000 కోట్ల సంఖ్య మారొచ్చని పేర్కొంది. ‘ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ముందున్న ప్రధాన అంశం వాటి ఆస్తులను/డబ్బుల్ని తిరిగి రాబట్టుకోవడం. లేకపోతే అవి మొండిబకాయిలుగా మారిపోతాయి. అందుకే డబ్బుల రికవరీకి గట్టి ప్రయత్నం జరగాలి’ అని పేర్కొంది. -
ఇకపై రుణ రేటుకు ప్రాతిపదిక కొత్త డిపాజిట్ రేటే
♦ మూడేళ్ల వరకూ స్థిర రేటు రుణంపై కూడా ఆదే పద్ధతి ♦ బ్యాంకింగ్‌కు ఆర్బీఐ తాజా ఆదేశం ముంబై: ఇక నుంచి కొత్త డిపాజిట్ రేటు ప్రాతిపదికన బ్యాంకు రుణాల వడ్డీ రేటు వుంటుంది. దీంతో ఆర్బీఐ చేసే రేట్ల మార్పు వెనువెంటనే బ్యాంకుల రుణ రేట్లలో కన్పిస్తుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీచేసిన ఆదేశాలు వచ్చే నెల ఆరంభం నుంచీ అమలవుతాయి. ఇప్పటివరకూ బ్యాంకులు వాటి పాత డిపాజిట్ వ్యయాలు, ఇతర నిధుల సేకరణ వ్యయాలన్నింటినీ పరిగణన లోకి తీసుకుని రుణాలపై రేట్లను నిర్ణయిస్తున్నాయి. దాంతో ఆర్బీఐ రెపో రేటును తగ్గించినంత మేర బ్యాంకులు రుణాల రేట్లను తగ్గించడం లేదు. దాంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచీ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్) విధానాన్ని అనుసరించాలంటూ గత డిసెంబర్లో ఆర్బీఐ మార్గదర్శకాలు జారీచేసింది. అయితే ఈ పద్ధతి నుంచి స్థిర రేటు రుణాలకు అప్పట్లో మినహాయింపునిచ్చింది. ఫ్లోటింగ్ రేటు రుణాల రేటు మాత్రమే ఎంసీఎల్ఆర్ విధానం ప్రకారం అమలుకావాల్సివుంది. కానీ తాజాగా మంగళవారం ఆ మార్గదర్శకాల్లో స్వల్పమార్పు చేస్తూ మూడేళ్లవరకూ కాలపరిమితిగల స్థిర రేటు రుణంపై వడ్డీ రేటును కూడా ఎంసీఎల్ఆర్ ఆధారంగానే నిర్ణయించాలని బ్యాంకుల్ని ఆదేశించింది. మూడేళ్ల కాలపరిమితిపైబడిన స్థిర రేటు రుణాలపై వడ్డీ రేటును పాత పద్ధతి ప్రకారమే బ్యాంకులు నిర్ణయించుకోవొచ్చు. ప్రతి నెలా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండింగ్ ప్రాతిపదికన బ్యాంకులు ఒక స్థిర రుణ రేటును నిర్ణయిస్తాయి. కొత్త డిపాజిట్లపై ఆఫర్ చేస్తున్న వడ్డీరేటు ప్రాతిపదికన ఎంసీఎల్ఆర్ నిర్ణయమవుతుంది. పలు బ్యాంకులు ప్రస్తుతం తాజా డిపాజిట్ల ప్రాతిపదికన కాకుండా... స్థూల డిపాజిట్ల ప్రాతిపదికన రుణ రేటును నిర్ణయిస్తున్నాయి. తాజా నిర్ణయం వల్ల రెపో ద్వారా (బ్యాంకులకు తాను ఇచ్చే స్వల్పకాలిక నిధులపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ- ప్రస్తుతం 6.75 శాతం) తనకు అందిన ప్రయోజనాన్ని బ్యాంకింగ్ త్వరితగతిన వినియోగదారుకు బదలాయించినట్లవుతుంది. అలాగే వడ్డీరేటు విధానంలో మరింత పారదర్శకతకు సైతం తాజా విధానం దోహదపడుతుంది. రుణ రేటు మార్కెట్ రేటుకు అనుసంధానమవుతుంది. కాగా మూడేళ్లు దాటిన తరువాత స్థిర రుణ రేటుకు ఎంసీఎల్ఆర్ నుంచి మినహాయింపు లభిస్తోంది. నిజానికి డిసెంబర్లో జారీచేసిన మార్గదర్శకాల్లో ఎంసీఎల్ఆర్ విధానం నుంచి స్థిర రుణ రేటును మినహాయించారు. అయితే ఈ విధానంలో మార్పు చేస్తూ... ఆర్బీఐ బ్యాంకింగ్‌కు తాజా ఆదేశాలు జారీ చేసింది. -
'వైశ్రాయ్' ఎండీ ఇంటి ముందు ధర్నా
హైదరాబాద్: బడాబాబుల నుంచి రుణాలు వసూలు చేసుకునేందుకు బ్యాంకులు నానాకష్టాలు పడుతున్నాయి. మొండి బకాయిలు రాబట్టుకునేందుకు బ్యాంకు ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు. వైశ్రాయ్ హోటల్ ఎండీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు ఓరియంటల్ బ్యాంకు సిబ్బంది మంగళవారం ధర్నాకు దిగారు. రుణాలు చెల్లించాలంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. అప్పుగా తీసుకున్న కోట్లాది రూపాయలు తిరిగి చెల్లించకపోవడంతో రోడ్డెక్కాల్సి వచ్చిందని బ్యాంకు సిబ్బంది వాపోయారు. కాగా, తమ బ్యాంకు నుంచి రుణాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ కావూరి సాంబ శివరావు ఇంటిముందు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్యోగులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరిట కావూరి రూ.160 కోట్ల రుణాలు తీసుకున్నారని బ్యాంకు సిబ్బంది చెప్పారు. -
కౌలుకోనివ్వరా?
ఏటా రైతుల గుర్తింపులో వివక్ష! రైతుల సంఖ్య పెరుగుతున్నా రుణాలివ్వని బ్యాంకర్లు 24 నుంచి మళ్లీ ప్రహసనం భూమిమీద పడినప్పటినుంచి మట్టి వాసనే పీలుస్తూ, మట్టి తల్లి ఒడిలోనే సేదదీరుతూ..వ్యవసాయం తప్ప మరో వ్యవహారం తెలియని కౌలు రైతులు..అటు వ్యవసాయం చేయలేక..ఇటు కూలి పనులకు పోలేక సతమతమవుతున్నారు. యజమాని దగ్గర భూమిని కౌలుకు తీసుకుని ఆరుగాలం స్వేదం చిందించి సాగుచేశాక పంట కలిసివచ్చినా..రాకపోయినా యజమానికి శిస్తు చెల్లించాల్సిందే. సాగు సమయంలో పెట్టుబడి కోసం రుణాలిచ్చి ఆదుకోవాల్సిన బ్యాంకర్లు మొండిచేయి చూపుతున్నారు. విజయనగరం కంటోన్మెంట్: కౌలు రైతులను చైతన్య పరిచి వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్దామనే ధ్యాస ప్రభుత్వానికి లేకపోవడం విచారకరం. 2011లో కౌలు రైతు చట్టం వచ్చినప్పుడు జిల్లాలో 24 వేల మందిని గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తరువాత జిల్లాలో వ్యవసాయ భూములు సాగు చేసేవారి సంఖ్య తగ్గిపోవడంతో పాటు భూములను కౌలుకు ఇచ్చేసే పద్ధతి ఎక్కువైంది. ఈ దశలో కౌలు రైతుల చట్టాన్ననుసరించి మరింత మంది కౌలు రైతులను గుర్తించి వారికి బ్యాంకర్లు రుణా లు ఇచ్చేలా సమావేశాలు నిర్వహించి చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ యంత్రాంగం పట్టిం చుకోవడం లేదు. జిల్లాలో సుమారు లక్షమంది కౌలు రైతులుంటారని సంబంధిత సంఘాలు చెబుతున్నాయి. అయినా ఎప్పుడూ 9వేల నుంచి 24 వేల మంది మాత్రమే ఉంటారని యంత్రాంగం లెక్కలు చెబుతోంది. తహశీల్దార్ల వైఫల్యం : గ్రామాల్లో ఉన్న కౌలు రైతులను గుర్తించేందుకు వీఆర్వోల ద్వారా గుర్తింపు శిబిరాలను నిర్వహించి గుర్తింపు కార్డులు ఇచ్చే విధంగా తహశీల్దార్లు చర్యలు తీసుకోవాల్సి ఉండగా అలా జరగడం లేదు. ప్రతి మండలం నుంచి కౌలు రైతులకు బ్యాంకర్లు రుణాలివ్వాలని ఆయా మండలాల్లో ఉన్న కౌలు రైతుల సంఖ్య ఇది అని చెప్పాల్సిన తహశీల్దార్లు టార్గెట్ల ప్రకారం ఏదో అంకె చెప్పేసి ఊరుకోవడంతో అసలైన కౌలు రైతుల సంఖ్య జిల్లాలో ఏటా తేలడం లేదు. గుర్తింపునకు రెండు స్టేజ్‌లు : జిల్లాలో 2016-17 సంవత్సరానికి సంబంధించి కౌలు రైతుల గుర్తింపును రెండు స్టేజ్లలో నిర్వహించనున్నారు. కౌలు రైతులకు ఏఏ ప్రయోజనాలున్నాయి. రుణాలు పొందడమెలా? కౌలు రైతుల చట్టాల సంగతేంటన్న విషయాలపై ఈనెల 10 నుంచి గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. మార్చి 24నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం గ్రామసభలు నిర్వహించనున్నారు. ఆ అవగాహన సదస్సుల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం గ్రామాల్లోని కౌలు రైతులను గుర్తించి వారికి రుణార్హత కార్డులిస్తారు. గుర్తింపు కార్డులందించిన వారికి రుణాలివ్వాలని బ్యాంకర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించి ఆదేశాలిస్తారు. వారికి లక్ష్యాలను విధిస్తారు. కానీ ఈ లక్ష్యాలను చేరుకోవడంలో బ్యాంకర్లు చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు. ఈ ఏడాది రుణాలు అంతేనా? : జిల్లాలో ఈ ఏడాది 24,807 మంది కౌలు రైతులను గుర్తించేందుకు అధికారులు లక్ష్యం విధించారు. వీరికి గుర్తింపు కార్డులు ఇచ్చి రుణార్హత కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అయితే గతేడాది కూడా 24వేల మంది రైతులనే గుర్తిస్తామని లక్ష్యం విధించుకున్న యంత్రాంగం 15,827 మంది కౌలు రైతులను గుర్తించి రుణార్హత కార్డులిచ్చారు. వారికి సుమారు రూ.5 కోట్ల పైచిలుకు రుణాలివ్వాల్సి ఉండగా కేవలం రూ.65 లక్షలతోనే బ్యాంకర్లు సరిపెట్టారు. 15,827 మందిలోనూ కేవలం 329 మందికే కౌలు రుణాలిచ్చిన బ్యాంకర్లు మిగిలిన 15,498 మందిని రుణాల కోసం కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోలేదు. ఈ ఏడాది కూడా అ లానే రుణాలిస్తారా అని కౌలు రైతులు ప్రశ్నిస్తున్నారు. హెచ్‌డీటీలదే బాధ్యత! : జిల్లాలో కౌలు రైతుల గుర్తింపు మొత్తం హెచ్‌డీటీలదే. వారు గ్రామాల్లో సభలు నిర్వహించి కౌలు రైతులను గుర్తించి నివేదికను పంపించాలి. అప్పుడు వారికి గుర్తింపు కార్డులు ఇస్తాం. అనంతరం కలెక్టర్ నిర్ణయం ప్రకారం బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి వారికి రుణాలు అందేలా చర్యలు తీసుకుంటాం. మండలాల్లో హెచ్‌డీటీలు చిత్తశుద్ధితో వ్యవహరించి కౌలు రైతులను పారదర్శకంగా గుర్తించాలి. -
దారుణదగా!
2014మార్చి వరకు రుణాలు తీసుకున్న రైతులు : 2లక్షల 67వేలు తీసుకున్న రుణ మొత్తం: రూ. 1,462 కోట్లు పంటలపై రుణాలు తీసుకున్న రైతులు: లక్షా 82 వేలు తీసుకున్న రుణ మొత్తం : రూ. 730 కోట్లు బంగారు ఆభరణాలపై పంట రుణాలు తీసుకున్న రైతులు : 55 వేలు బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణాలు : రూ.432 కోట్లు కేవలం బంగారు రుణాలపై మాఫీ అయిన మొత్తం: రూ. 86.40 కోట్లు అన్నదాత నిలువునా దగాపడ్డాడు. సజావుగా సాగుతున్న బతుకులో చిక్కులు కొని తెచ్చుకున్నాడు. బ్యాంకులో చేసిన అప్పులు తీర్చకపోవడంతో డిఫాల్టరుగా మారాడు. కుదువపెట్టిన బంగారు ఆభరణాలు విడిపించలేకపోతున్నాడు. కట్టుకున్న భార్యకు... కన్నబిడ్డలకూ... శత్రువులా మారాడు. ఇలా ఎందుకయిందో తెలుసా...? ఒక్క రుణమాఫీ ప్రకటనకు ఆశపడి... పైసా చెల్లించకుండానే కుదువపెట్టిన ఆభరణాలు ఇచ్చేస్తామని చెప్పిన కల్లబొల్లి కబుర్లు నమ్మినందుకు. చివరికేమైంది ? హామీలిచ్చిన వారు అందలం ఎక్కారు. ఎంచక్కా అధికారం చెలాయిస్తున్నారు. కొండత రుణంలో గోరంత తీర్చి... చేతులు దులిపేసుకున్నారు. పైగా నిండు సభలో లెక్కలేనన్ని అబద్ధాలు చెప్పి తప్పించుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘బ్యాంకు రణాలు తీర్చవద్దు... మేం అధికారంలోకి వచ్చాక రుణాలన్నీ రద్దు చేస్తాం... మీరు బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణాలకూ మాదే బాధ్యత. తాకట్టు పెట్టిన ఆభరణాలు మీ ఇంటికొచ్చే పూచి మాది.’ ఇదీ ఎన్నికల ముందు టీడీపీ అధినేత చేసిన హామీ. వాటిని నమ్మిన రైతన్నలు పాపం రుణాలు తీర్చడం మానేశారు. అధికారంలోకి వచ్చాక గోరంత మాఫీ చేసి కొండంతగా చెప్పి రైతులను అయోమయంలో పడేశారు. ఇప్పుడా అప్పులు తీర్చుకోలేక అన్నదాతలు నలిగిపోతున్నారు. బ్యాంకులిచ్చే నోటీసులతో ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ కాకపోగా... కాలాతీతం అవ్వడంతో వడ్డీలు పెరిగి, తీర్చలేకపోవడంతో బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తున్నాయి. మాఫీ అయింది 20శాతమే... జిల్లాలో పంట రుణాలు పక్కన పెడితే 55వేల మంది రైతులు బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ.432 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. ఇందులో కేవలం 20 శాతం మాత్రమే రుణాలు మాఫీ అయ్యాయి. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా రూ. 86.40కోట్లు మాఫీ జరిగింది. ఇంకా రూ.345.60 కోట్లు రైతులు బకాయి ఉన్నట్టు తేలింది. రుణాలు తీసుకున్న వారి గడువు తీరిపోయిం దని బ్యాంకులు నోటీసులిస్తున్నాయి. చంద్రబాబు బం గారు రుణాలను మాఫీ చేస్తాననడంతో రైతులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. కానీ సర్కా ర్ అరకొరగానే మాఫీ చేసింది. మిగిలిన బకాయిల కోసం బ్యాంకులు లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకొస్తున్నా యి. ఆభరణాలు వేలం వేస్తామని హెచ్చరిక నోటీసులు జారీ చేశాయి. కాస్తో కూస్తో పరపతి ఉన్నవారు అప్పో, సప్పో చేసి రుణాలు తీర్చుకుని ఆభరణాలు విడిపించుకోగా... కొందరైతే ఇక చేసేది లేక వదలుకుంటున్నారు. వేలం వేసిన బంగారు ఆభరణాల విలువ రూ. 3కోట్లు ఇప్పటివరకు జిల్లాలో 300మంది రైతులకు చెందిన రూ. 3కోట్ల విలువైన బంగారు ఆభరణాలను బ్యాంకర్లు వేలం వేసినట్టు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా... ప్రభుత్వం మాత్రం కిమ్మనడంలేదు. అసలు నోటీసులిచ్చిన సమాచారమే లేదని సాక్షాత్తు అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి పుల్లారావు ప్రకటన చేయడం అందరినీ విస్మయపరుస్తోంది. తగ్గిన కొత్త రుణాలు రుణమాఫీ వర్తింపు తరువాత కొత్తరుణాలకు పరిమితి విదించడంతో బ్యాంకు రుణాలకు రైతులు దూరమవుతున్నారు. బంగారం, భూమి ఎంతమేరకు పెట్టినా రూ.లక్ష దాటి ఇవ్వరాదని బ్యాంకర్లు నిర్దేశించారు. దీంతో బంగారం తనఖా రుణాలు రైతుకు ఆసరా ఇవ్వడంలేదు. కొన్నేళ్లుగా బ్యాంకు రుణ లక్ష్యాలను పరిశీలిస్తే బంగారం తనఖా రుణాలపై ఆధారపడే రైతులు జిల్లాలో 40 శాతం ఉన్నారు. రుణమాఫీ ప్రకటించిన తరువాత బ్యాంకర్ల వైఖరి మారింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, రుణ పరిధి కుదింపు వంటి నిబంధనలు విధించడంతో బంగారు ఆభరణాల కింద రుణాలు తీసుకున్న వారి శాతం 10శాతానికి పడిపోయింది. గతేడాది ఖరీఫ్, రబీ కలుపుకొని రూ.1,100 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించినప్పటికీ ఇంతవరకు రూ. 605కోట్లు రుణాలు మాత్రమే ఇచ్చారు. ఇదంతా దాదాపు రీషెడ్యూలే. కొత్త వారికి రూ. కోటికి మించి ఇవ్వలేదు. బంగారు రుణాలకొచ్చేసరికి రూ. 600కోట్ల లక్ష్యమైనా... ఇచ్చిన రుణం మాత్రం రూ. 60కోట్లు లోపే. వేలం వేయొద్దనే ఆదేశాలు లేవు ఏడాది కాల పరిమితితో బంగారంపై పంట రుణాలిస్తాం. నిర్దేశిత గడువులోగా చెల్లింపులు చేయాలి. లేదంటే మూడు సార్లు నోటీసులిస్తాం. అప్పటికీ చెల్లించకపోతే వేలం వేస్తాం. వేలం ప్రక్రియ ఆపాలంటే ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలి. ప్రత్యేక ఆదేశాలివ్వడం గాని, రైతుల తరపున బకాయిని గానీ ప్రభుత్వమే చెల్లించాలి. - ఎ.గురవయ్య, లీడ్ బ్యాంకు మేనేజర్ మాఫీ చేయూలి ప్రభుత్వం మాట నమ్మి వడ్డీ కూడా కట్టలేదు. దీంతో తోణాం కెనరా బ్యాంకులో తీసుకున్న 70 వేల రూపాయల అప్పు నేడు లక్ష రూపాయలకు చేరుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాలాంటి వారికి న్యాయం చేయూలి - ఎస్ఆర్టీపీ సుజాత, తోణాం, సాలూరు మండలం వేలం వేస్తామంటున్నారు 2012లో బ్యాంకు నుంచి రెండు సార్లు రుణం తీసుకున్నాను. ఈ ఏడాది జనవరిలో బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి. మూడు రూపాయల వడ్డీకి 39,500 రూపాయలు తీసుకువచ్చి విడిపించాను. బాబు మాటలు నమ్మి మోసపోయూను. ఇంకా రూ. 20 వేలు చెల్లించాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా చెల్లించకపోతే వేలం వేస్తామంటున్నారు. కె. వెంకట శ్రీనివాసరావు, పాత గైశీల, మక్కువ మండలం -
లక్ష్యం రూ. 9,707 కోట్లు.. ఇచ్చింది 300 కోట్లే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని కరువు కబళించింది. పంటలు పండక అప్పుల భారం ఎక్కువై రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వర్షాలు లేక, బోర్లు, బావుల్లో నీరు అడుగంటి రబీలో పంటలు వేసే పరిస్థితి కనిపించడంలేదు. ఆరుతడి వైపు వెళ్లాలని సర్కారు చెబుతోన్నా అందుకు తగ్గా ఏర్పాట్లు లేవు. రైతులను ఆర్థికంగా ఆదుకోవాల్సిన ఈ తరుణంలో వారికి బ్యాంకు రుణాలు ఇప్పించడంలో సర్కారు ఘోరంగా విఫలమైంది. 2015-16 రబీ పంట రుణ లక్ష్యం రూ. 9,707 కోట్లు కాగా... ఇప్పటివరకు బ్యాంకులు కేవలం రూ. 300 కోట్లు మాత్రమే ఇవ్వడం అత్యంత దారుణ పరిస్థితికి నిదర్శనం. ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ. 18,032 కోట్లు కాగా... రూ. 14 వేల కోట్ల మేరకు మాత్రమే ఇచ్చారని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి వివరించారు. రబీలో పంటల సాగు కేవలం 26 శాతానికే పరిమితమైంది. రాష్ట్రవ్యాప్తంగా రబీలో సాధారణంగా 31.32 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా... 8.22 లక్షల ఎకరాల్లో (26%) మాత్రమే జరిగింది. అందులో ఆహారధాన్యాల సాగు 25.20 లక్షల ఎకరాలకు గాను... కేవలం 4.97 లక్షల ఎకరాల్లోనే చేపట్టారు. కీలకమైన వరి నాట్లు కేవలం ఒకే ఒక్క శాతంలోనే పడ్డాయి. పప్పుధాన్యాల సాగు మాత్రమే సాధారణ సాగులో 86 శాతం విస్తీర్ణంలో సాగైంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లడానికి... అందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో సాగు విస్తీర్ణం కూడా పడిపోయిందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. పూర్తి రుణమాఫీ ప్రకటించకపోవడం వల్లే తెలంగాణ ప్రభుత్వం రూ. లక్షలోపు పంట రుణాలకు రుణమాఫీ ప్రకటించింది. ఆ ప్రకారం రూ. 17 వేల కోట్లు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు గాను 35.82 లక్షల మంది రైతుల ఖాతాలను గుర్తించింది. తొలి విడతగా గత ఏడాది రూ. 4,230 కోట్లు రుణ మాఫీ ప్రకటించింది. ఆ మొత్తం జిల్లాల్లోని బ్యాంకులకు అందజేసింది. ఆ సొమ్ములో రూ. 4,086 కోట్లు ఇప్పటివరకు రైతుల ఖాతాలో మాఫీ అయినట్లుగా బ్యాంకులు జమచేశాయి. ఆ తర్వాత రెండో విడత మాఫీని రెండు విడతలుగా మరో రూ. 4,086 కోట్లు విడుదల చేసింది. విడతల వారీగా సొమ్ము విడుదల చేస్తుండటంతో బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇవ్వడానికి కొర్రీలు పెడుతున్నాయి. కొందరు రైతుల నుంచి మిగిలిన సొమ్మును వసూలు చేస్తూనే ఉన్నాయి. దీనిపై దుమారం రేగినా ప్రభుత్వం స్పందించడంలేదు. మరో రెండు విడతల రుణమాఫీ సొమ్మును ఏకమొత్తంగా ఒకేసారి విడుదల చేయడంపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు అసెంబ్లీలో చెప్పినా అది ఆచరణలోకి రాలేదు. ప్రభుత్వం నుంచి మిగిలిన సగం రుణమాఫీ విడుదల కానందున రుణాలు ఇవ్వబోమని బ్యాంకులు రైతులకు తెగేసి చెబుతున్నాయి. దీంతో బ్యాంకు అధికారులను వేడుకుంటున్నా వారు కనికరించడంలేదు. మరికొన్ని బ్యాంకులైతే రూ. లక్ష లోపు రుణాలకు కూడా వడ్డీ వసూలు చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎంత చెప్పినా వినడంలేదు. వాస్తవంగా బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చి ఆదుకోకపోవడం వల్లే రైతులు ప్రైవేటు రుణాల వైపు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవే అన్నదాతను ఆత్మహత్యల వైపు పురిగొల్పుతున్నాయని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. -
నేడు రాష్ట్ర బంద్
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ, రైతు సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శనివారం తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌ను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు, ప్రజా సంఘాలు సమాయత్త మయ్యాయి. ఆయా పార్టీల నేతలు జిల్లాల్లో ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు రాజధానితో పాటు జిల్లా కేంద్రాల్లో బస్సులు యథావిధిగా నడపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ఆదేశించింది. బస్సులు నడిపేందుకు వీలుగా అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి డీజీపీ అనురాగ్‌శర్మను ఆదేశించారు. దుకాణాలు మూసేయొద్దని, తాము భద్రత కల్పిస్తామంటూ పోలీసులు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వ్యాపారులకు భరోసా ఇచ్చారు. కాగా, శనివారం నాటి బంద్‌ను విజయవంతం చేయాలంటూ హైదరాబాద్‌లో శుక్రవారం కాంగ్రెస్, సీపీఐ నేతలు బైక్ ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి నాంపల్లి వరకు ర్యాలీ నిర్వహించేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి నాగేందర్‌తోపాటు మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి తదితరులను అరెస్టు చేసి అనంతరం వదిలిపెట్టారు. సీపీఐ ఆధ్వర్యంలో ఛత్రినాక నుంచి బషీర్‌బాగ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. నగరంలో ఆటో సంఘాలు కూడా బంద్‌కు మద్దతు పలికాయి. ఎంఎంటీఎస్ రైళ్లు యథావిధిగా తిరుగుతాయని, అవరమైతే రద్దీని బట్టి సర్వీసులు పెంచుతామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ తెలిపారు. టీడీఎఫ్ సిద్ధం.. రైతు సమస్యల పరిష్కారంతోపాటు వరంగల్ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలన్న డిమాండ్‌తో బంద్‌లో పాల్గొనేందుకు తెలంగాణ ప్రజాస్వామిక వేదిక (టీడీఎఫ్) భాగస్వామ్యపక్షాలు సిద్ధమయ్యాయి. పది వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జూబ్లీ, ఇమ్లీబన్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద నేతలు నిరసన తెలపనున్నారు. సీపీఐ నేత కె.నారాయణ, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఇమ్లీబన్ బస్‌స్టేషన్ వద్ద, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేత అజీజ్‌పాషా, న్యూడెమోక్రసీ, రెవెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నేతలు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహిస్తారు. మరోవైపు బంద్‌కు భారత విప్లవకారుల సమైక్యతా కేంద్రం (యూసీసీఆర్ఐ-ఎంఎల్) మద్దతు ప్రకటించింది. -
బ్యాంకులకు టోకరా
‘నకిలీ’లు బ్యాంకులకే కన్నం వేశారు. బోగస్ పాస్‌పుస్తకాలతో బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలను కొల్లగొట్టారు. సర్కారు స్థలాలను తనఖా పెట్టి కొందరు.. లేని భూమిని పట్టాదారు పుస్తకాల్లో చూపించి మరికొందరు.. దొంగ పాస్‌పుస్తకాలు, ఫోర్జరీ సంతకాలతో ఇంకొందరు బ్యాంకులకు టోకరా కొట్టారు. బ్యాంకర్ల హస్తలాఘవం.. రెవెన్యూ సిబ్బంది అండదండలతో గుట్టుగా సాగిన ఈ అవినీతి పరంపర వెలుగులోకి వస్తోంది. జిల్లాలో దాదాపు రూ.5 కోట్ల మేర కుంభకోణంజరిగినట్లు ప్రాథమికంగా గుర్తించిన యంత్రాంగం.. ఈ బాగోతంపై లోతుగా విచారణ జరపాలని నిర్ణయించింది. - బోగస్ పాస్‌పుస్తకాలతో రూ.5 కోట్ల మేర కుచ్చుటోపీ - అధికారుల విచారణతో వెలుగులోకి అక్రమాల చిట్టా - బ్యాంకర్ల హస్తం.. రెవెన్యూ సిబ్బంది చేతివాటం సాక్షి, రంగారెడ్డి జిల్లాప్రతినిధి: గతంలో పహాణీ, పట్టా పాస్‌పుస్తకాలను అట్టిపెట్టుకొని బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు దొంగ పాస్‌పుస్తకాలను సృష్టించి సర్కారీ స్థలాలను రికార్డుల్లోకెక్కించి బ్యాంకర్లను తప్పుదోవ పట్టించారు. రుణగ్రహీత దరఖాస్తును నిశితంగా పరిశీలించకుండా.. క్షేత్రస్థాయిలో భూమి స్థితిగతులను తెలుసుకోకుండా రుణాలివ్వడంతో కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి. ఇటీవల ఈసీలు, ఆన్లైన్ పహాణీలను తప్పనిసరి చేయడంతో ఈ అవినీతి గుట్టు బయటపడింది. ఇప్పటికే యాచారం, మర్పల్లి, మంచాల, మోమిన్‌పేట, షాబాద్, గండేడ్, ధారూరు తదితర మండలాల్లో నకిలీ పాసు పుస్తకాలతో బ్యాంకులను మోసగించినట్లు రెవె న్యూ, బ్యాంకు యాజమాన్యాలు గుర్తించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన నకిలీ పాసు పుస్తకాల రాకెట్‌ను తలదన్నెలా జిల్లాలోనూ ‘బోగస్’ చిట్టా బహిర్గతమవడం అధికారవర్గాలను విస్మయపరుస్తోంది. తిలాపాపం.. తలా పిడికెడు! నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు పొందడమే కాకుండా.. రుణ మాఫీ కూడా వర్తింపజేయడంతో సర్కారు ఖజానాకు భారీగా చిల్లు పడింది. బోగస్ పట్టాల సృష్టిలో రెవెన్యూ సిబ్బంది కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తహసీల్దార్/ ఆర్డీఓ కార్యాలయాల నుంచి తస్కరించిన పాస్‌పుస్తకాల్లో ఫోర్జరీలతో బినామీలను సృష్టించి బ్యాంకులకు టోపీ పెట్టారు. బ్యాంకర్లు కూడా పాస్ పుస్తకాలు అసలువా? నకిలీవా అనేది తేల్చుకోకపోవడం.. రికార్డుల్లో నమోదైన భూమిపై క్షేత్రస్థాయిలో తెలుసుకోకపోవడం నిధుల దుర్వినియోగానికి దారి తీసింది. అంతేకాకుండా మీ-సేవ కేంద్రాల్లో రికార్డులను ట్యాంపరింగ్ చేసి వాటి ద్వారా రుణాలు తీసుకున్న విషయాన్ని కూడా బ్యాంకర్లు పసిగట్టలేకపోయారు. రుణ వితరణలో దళారీల ప్రమేయం కూడా తోడు కావడంతో రుణాలు అనర్హుల పాలయినట్లు తెలిసింది. నకి‘లీలలు’ మచ్చుకు కొన్ని.. - యాచారం మండలం నక్కర్తమేడిపల్లి, పల్లె చెల్కతండా, నల్లవెల్లి, మంతన్‌గౌరెల్లి, మొండిగౌరెల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములను పాస్‌పుస్తకాల్లో చూపి.. బ్యాంకులను మోసం చేశారు. ఇప్పటికే దాదాపు 150 మంది నకిలీ పాసుపుస్తకాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు తేలింది. ఈ తతంగంలో ఆరుగుర్ని అరెస్టు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. - మంచాల మండలం బోడకొండ దక్కన్ గ్రామీణ బ్యాంకులో నకిలీ పాస్బుక్కులతో పెద్ద సంఖ్యలో బినామీ రైతులు రుణాలు పొందగా.. ఇటీవల ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీకి సైతం అర్హుల య్యా రు. గ్రామపంచాయతీలో అర్హుల వివరాలను ప్రదర్శించిన సమయంలో అనర్హుల చిట్టా బయటపడింది. దీంతో స్థానిక రెవెన్యూ యంత్రాంగం పట్టాదారు పుస్తకాల జారీపై పూర్తిస్థాయి విచారణకు ఉపక్రమించింది. - మోమిన్‌పేట మండలం చిట్టెంపల్లి, రాళ్లడుగుపల్లి, ఎన్కెపల్లి, మోమిన్‌పేట, మర్పల్లి మండలం మొగిలిగుండ్ల, కోంశెట్టిపల్లి, కోటమర్పల్లి గ్రామాల్లో 25 మంది ఖాతాదారులు బోగస్ పీటీ బుక్కులతో బుధేరా కార్పొరేషన్ బ్యాంకు నుంచి లక్షలాది రూపాయలను రుణంగా పొందారు. - పరిగి మండల పరిధిలోని రంగాపూర్, మాదారం, రాఘవాపూర్, లఖ్నాపూర్, నస్కల్, సయ్యద్‌మల్కాపూర్, మల్లెమోనిగూడ, గండేడ్ మండలంలో రెడ్డిపల్లి, బల్సుర్‌గొండ, బల్సుర్‌గొండ తండా, కొండాపూర్‌లలో, దోమ మండల పరిధిలోని గూడూరు, పూడూరు మండల పరిధిలోని రాకంచర్ల, తిర్మలాపూర్, తదితర గ్రామాల్లోని భూములకు సంబంధించి పలువురు రైతులు వెయ్యి ఎకరాలపై బినామీలు పాసుపుస్తకాలు సమర్పించి దాదాపు రూ.3కోట్ల మేర రుణాలు పొందారు. ఈ తంతును గుర్తించిన అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. -
రుణాల కోసం రైతన్నల ధర్నా
బెజ్జూరు (ఆదిలాబాద్) : కొత్త రుణాలు మంజూరు చేయకుండా బ్యాంకులు జాప్యం ప్రదర్శించడంపై రైతన్నలు నిరసన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలానికి చెందిన పలువురు రైతులు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నాకు దిగారు. రుణాలు అందకపోవడంతో అనేక ఇక్కట్లు పడుతున్నామని నిరసనకారులు తెలిపారు. తర్వాత తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. దీంతో స్పందించిన తహసీల్దార్ బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడగా వారు రుణాలు మంజూరు చేసేందుకు సముఖత తెలిపారు. -
కరువు మేఘాలు..!
జిల్లాపై కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులు, జలాశయాల్లోకి నీరు చేరక వెలవెలబోతున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 26 శాతం లోటుగా వర్షపాతం నమోదైంది. ఫలితంగా జిల్లాలో మూడు లక్షల ఎకరాలు సాగుకు నోచుకోలేదు. అడపాదడపా కురిసిన వర్షాలకు సోయా, పత్తి, కంది, పెసర, మొక్కజొన్న పంటలు సాగు చేయగా.. పూత, కాత దశకు చేరాయి. ప్రస్తుతం వరుణుడు ముఖం చాటేయడంతో భూమిలో తేమ శాతం తగ్గి పంటలు రంగు మారుతున్నాయి. - సాగుకు దూరంగా మూడు లక్షల ఎకరాలు - పంట పూత, కాత దశలో కనిపించని వర్షాలు - వరి సాగుకు రైతులు దూరం.. - జిల్లాలో 26 శాతం లోటు వర్షపాతం ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ప్రకృతి వైపరీత్యాలతో ఏటా రైతులకు నష్టాలే దిగుబడి అవుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తున్నా.. దిగుబడి చేతికొచ్చే సమయంలో వర్షాల్లేక వాడిపోతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో బ్యాంకు రుణాలు ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారు. ఆరంభంలో కురిసిన వర్షాలకు సోయా, మొక్కజొన్న, పత్తి, కంది తదితర పంటలు విత్తుకున్నారు. పంట ఎదిగే సమయం జూలైలో వర్షాలు మొహం చాటేశాయి. దీంతో పంట ఎండిపోతున్న సమయంలో ఆగస్టు నెల ఆరంభంలో కురిసిన మోస్తారు వర్షాలు పంటపై ఆశలు నిలిపింది. సోయా, పత్తి, కంది, పెసర, మొక్కజొన్న పంటలు పూత, కాత దశకు చేరాయి. ఈ సమయంలో వర్షాల్లేకపోవడం, రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా భూమిలో తేమ శాతం తగ్గి పంటలు రంగు మారుతున్నాయి. మండుతున్న ఎండలతో పూత, పిందె రాలడం రైతులను మనోవేదనకు గురి చేస్తోంది. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో ఇప్పటికే సాధారణ సాగు కంటే మూడు లక్షల ఎకరాలు సాగుకు దూరంగా ఉన్నాయి. వరి 1.30 లక్షల ఎకరాల్లో నాట్లు వేయకపోవడంతో బీళ్లుగా మిగిలిపోయాయి. జిల్లాలో వరి నాట్లు వేసుకునే సమయం ఆగస్టుతో ముగిసింది. సాధారణ వర్షపాతం ఖరీఫ్ ఆరంభం నుంచి ఆగస్టు నెలాఖరు వరకు 801.6 మిల్లీమీటర్లు కాగా.. ఇప్పటి వరకు 599.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే ఇంకా 26 శాతం లోటుగా ఉంది. జిల్లాలో ఎక్కువగా వర్షాధార పంటలే సాగు చేస్తుంటారు. వర్షాభావ పరిస్థితుల వల్ల జలాశయాల్లోకి పూర్తి స్థాయిలో నీరు చేరలేదు. వరితోపాటు ఇతర పంటలు 3 లక్షల ఎకరాల వరకు సాగుకు నోచుకోలేదు. తేమ తగ్గుతున్న నేలలు.. జిల్లాలో 6.50 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగువుతాయని అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులకు వ్యవసాయ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటి వరకు 4.98 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. పత్తి, సోయా పంటలు విత్తుకునేందుకు గత నెలతో గడువు ముగియగా వరి, కంది, పెసర ఇతర పంటలు వేసుకునేందుకు ఆగస్టుతో ముగిసింది. సోయా పంట కాత కాసి దిగుబడి వచ్చే సమయంలో రంగు మారడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం పూత దశలో రంగు మారుతోంది. పత్తి పూత, పిందె దశలో ఉంది ఈ సమయంలో నీటితడులు ఉంటే కాత బాగా కాసి వృద్ధి చెంది దిగుబడులు బాగా వస్తాయి. కానీ పదును లేక పూత రాలడం, పింద వృద్ధి చెందకుండా రాలిపోతోంది. ఇతర పంటలదీ అదే పరిస్థితి. ఈ సమయంలో ఒక్క భారీ వర్షం కురిసినా కాత నిలబడి దిగుబడులు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరో నాలుగు రోజులు వర్షాల్లేకపోతే పెట్టుబడీ రాని పరిస్థితి నెలకొంటుందని వాపోతున్నారు. వరి సాగు హరి.. జిల్లాలో ఆశించిన వర్షాలు లేక వరి నారు పోసుకుని పొలంలో నాట్లు వేసుకునే గడువు దాటిపోయింది. గడువు దాటిన తర్వాత నాట్లు వేసుకున్నా ప్రయోజనం ఉండదు. ఇప్పటికే ఎండిపోయి, ముదిరిపోతున్న వరినారుమళ్లను చాలా మంది రైతులు వృథాగా వదిలేశారు. 70 వేల హెక్టార్లలో నాట్లు వేసుకోవాల్సి ఉండగా.. 15 వేల హెక్టార్లకే పరిమితమైంది. జిల్లాలో ప్రధానంగా జలాశయాల కిందనే ఎక్కువగా సాగువుతుంది. జలాశయాల్లో నీరు లేకపోవడంతో ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటితడులు అందవేమోనని నాట్లు వేసేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. కొంతమంది రైతులు ఇప్పటికే నారుమళ్లలో పశువులను వదులుతున్నారు. 32 మండలాల్లో లోటు వర్షపాతం జిల్లాలో సాధారణ వర్షపాతం 802.6 మిల్లీమీటర్లకు గాను ఇప్పటి వరకు 599.2 మిల్లీమీటర్లు కురిసింది. 52 మండలాలకు గాను 32 మండలాల్లో సాధారణం కంటే 50 శాతం నుంచి 25 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మిగితా 15 మండలాల్లో 80 శాతం నుంచి 96 శాతం వర్షపాతం నమోదు అయింది. జిల్లాలో నాలుగు వ్యవసాయ డివిజన్లు ఉండగా.. ఆదిలాబాద్ డివిజన్లో సాధారణ వర్షపాతం 7807.9 మిల్లీమీటర్లు కాగా 6150.2, ఆసిఫాబాద్ డివిజన్లో 7398.3 మిల్లీమీటర్లుకు గాను 5600.2, మంచిర్యాలడివిజన్లో 9608.5 మిల్లీమీటర్లకు గాను 7895.6, నిర్మల్ డివిజన్లో 9695.0 మిల్లీమీటర్లకు గాను 6686.6, ఉట్నూర్ డివిజన్లో 6778.1 మిల్లీమీటర్లకు గాను 4837.4 మిల్లీమీటర్లు నమోదైంది. పూత దశలో వర్షాల్లేవు పడుతలేవు.. పత్తి పంట పూతకు వచ్చింది. ఈ సమయంలో వర్షాలు కురవడం లేదు. పదిహేను రోజులు దాటింది. ఈ సమయంలో ఒక భారీ వర్షం కురుస్తే దిగుబడి మంచిగా వస్తాది. లేకపోతే పంట పెట్టుబడి ఎళ్లడం కష్టమే. - అన్నం లింగన్న, బట్టిసావర్గాం పత్తికి డీఏపీ వేయండి.. పత్తి పంటలో తేమ తగ్గడం, ఉష్ణోగ్రత పెరగడం వల్ల తామర పురుగు, తెల్లదోమ ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. దీని నివారణకు డీఏపీ 4 కిలోలు, అగ్రోమిన్ మాక్స్ 1 కిలో ఎకరానికి లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. సోయా పంట తెల్లదోమతో పసుపు ఆకులు రంగులోకి మారుతున్నాయి. దీని నివారణకు ఎసీటోఫిన్, నువాన్, లేదా ఫ్రోఫినో ఫాస్ 3 మిల్లీమీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. - రాజశేఖర్, ఏరువాక శాస్త్రవేత్త, సమన్వయకర్త -
సా...గుతున్న సర్వే..!
ఒకరుకాదు..ఇద్దరు కాదు. రెండువేల మంది అన్నదాతలు. రెండున్నరేళ్లుగా అష్టకష్టాలు. తాతముత్తాతల నుంచి సాగుచేసుకుంటున్న భూములపై రెవెన్యూ శాఖాధికారులు చేపట్టిన ఎంజాయ్మెంట్ సర్వే పూర్తికాకపోవడంతో వెతలు. అడంగల్, 1బీలు నిలిచిపోవడంతో బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు అందక అవస్థలు. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా స్పందించని అధికారులు. కొమరోలు మండలం దద్దవాడ, రెడ్డిచెర్ల గ్రామాల్లో అన్నదాతల ఆక్రందనలు... - కొమరోలు మండలం దద్దవాడ, రెడ్డిచెర్ల గ్రామాల్లో రెండున్నరేళ్లుగా పూర్తికాని ఎంజాయ్మెంట్ సర్వే - రెండు వేల మంది రైతులకు నిలిచిపోయిన అడంగల్, 1బీలు - బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు అందక అవస్థలు - ఆగిపోయిన భూముల కొనుగోలు, అమ్మకాలు - రైతులు మొరపెట్టుకుంటున్నా..పట్టించుకోని అధికారులు కొమరోలు : మండలంలోని పలు గ్రామాల్లో వేల మంది రైతులు వారి పెద్దల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను సాగుచేసుకుంటున్నారు. కొంతకాలంగా భూముల కంప్యూటరీకరణ చేపట్టిన నేపథ్యంలో ఆయా భూములకు సంబంధించి రికార్డుల్లో ఒకరిపేరు, పట్టాదారు పాస్‌పుస్తకాల్లో మరొకరిపేరు, భూముల్లో ఇంకొకరు ఉండటంతో రెవెన్యూ అధికారులకు ఆయా భూములకు సంబంధించి 2013 జనవరి 14వ తేదీ ఎంజాయ్మెంట్ సర్వే చేపట్టింది. కొమరోలుతో పాటు గిద్దలూరు, రాచర్ల, అర్ధవీడు మండలాల్లోని కొన్ని రెవెన్యూ గ్రామాల్లో ఎంజాయ్మెంట్ సర్వే చేపట్టారు. కొమరోలు మండలంలోని దద్దవాడ, రెడ్డిచెర్ల గ్రామాల్లో మినహా మిగిలిన మండలాలు, గ్రామాల్లో భూముల విస్తీర్ణం తక్కువగా ఉండటంతో సర్వే పూర్తయింది. దద్దవాడ, రెడ్డిచెర్ల రెవెన్యూ పరిధిలోని 21 గ్రామాల్లో 2760 సర్వే నంబర్లలో సర్వే నేటికీ పూర్తికాకపోవడంతో సుమారు 2 వేల మంది రైతులకు అడంగల్, 1బీలు నిలిచిపోయాయి. వాటిపై ఆధారపడిన రాయితీలు, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు రైతులకు దూరమయ్యాయి. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణం మీదకు వచ్చి తమ భూములను అమ్ముకోవాలన్నా అడంగల్, 1బీలు లేని కారణంగా కొనేవారు కనిపించక ఆవేదన చెందుతున్నారు. 11,720 ఎకరాలు, 1,925 మంది రైతులు... దద్దవాడ రెవెన్యూ పరిధిలోని 910 సర్వే నంబర్లకుగానూ 3,320 ఎకరాల విస్తీర్ణంలో 725 మంది రైతులున్నారు. రెడ్డిచెర్ల రెవెన్యూ పరిధిలో 1850 సర్వే నంబర్లకుగానూ 8,400 ఎకరాల విస్తీర్ణంలో 1,200 మంది రైతులున్నారు. వీటికి సంబంధించి ఎంజాయ్మెంట్ సర్వే చేసేందుకు రెండు టీంలు ఏర్పాటు చేశారు. మార్కాపురం ఆర్డీఓ రాఘవరావు 2013 జనవరి 14వ తేదీ సర్వే ప్రారంభించారు. దద్దవాడలో 200 సర్వే నంబర్లలో, రెడ్డిచెర్లలో 50 సర్వే నంబర్లలో మాత్రమే ఇప్పటి వరకూ సర్వే పూర్తిచేశారు. ఇంతలో సర్వే బృందాల్లోని వారికి పదోన్నతులు రావడం, వారి స్థానాల్లో కొత్తవారిని నియమించడంతో సర్వే పూర్తిగా ఆగిపోయింది. అడంగల్, 1బీల జారీ కూడా నిలిచిపోయింది. అవి లేకపోవడంతో బ్యాంకు రుణాలు కూడా అందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కలెక్టర్ స్పందించి సర్వేపై ప్రత్యేక దృష్టిసారించి పూర్తిచేయించాలని రైతులు కోరుతున్నారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ వైవీ... ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి దద్దవాడ గ్రామాన్ని దత్తత తీసుకున్న నేపథ్యంలో రైతుల భూములకు చేపట్టిన సర్వే పూర్తిచేయించాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రెవెన్యూ అధికారులకు రైతులు సమస్యను వివరించినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. ఆ సమస్యను పరిష్కరిస్తామని ఎంపీకి కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇదీ..అసలు సమస్య... గతంలో గ్రామాలను పరిపాలించే కరణాలు వారిష్టారాజ్యంగా వ్యవహరించి ఒకే సర్వే నంబర్‌ను ఇద్దరుముగ్గురు రైతులకు వేసి పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇప్పించారు. ప్రస్తుతం భూములను ఆన్లైన్ చేస్తుండటంతో ఆ లోపాలన్నీ వెలుగుచూశాయి. ఆ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఒకరి పేరు, పాస్‌పుస్తకాల్లో మరొకరి పేరు ఉండగా, భూమిని ఇంకొకరు సాగుచేసుకుంటున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు ఆ భూములను ఎవరిపేరుతో ఆన్లైన్లో నమోదు చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎంజాయ్మెంట్ సర్వే చేపట్టారు. ఏయే భూములు ఎవరికి చెందినవో తేల్చేందుకు ఈ సర్వే చేపట్టారు. అప్పటి తహశీల్దార్ పి.చంద్రశేఖరరాజు అప్పటి కలెక్టర్ కాంతిలాల్‌దండే దృష్టికి సమస్యను తీసుకెళ్లగా, కొమరోలు మండలంలోని రెడ్డిచెర్ల, దద్దవాడ రెవెన్యూ గ్రామాలతో పాటు గిద్దలూరు, రాచర్ల, అర్ధవీడు మండలాల్లోని మరికొన్ని రెవెన్యూ గ్రామాల్లో సర్వే ప్రారంభించారు. పాత సర్వే నంబర్లను రద్దుచేసి పట్టాదారు పాస్‌పుస్తకంలోని విస్తీర్ణానికి, భూమ్మీద ఉన్న విస్తీర్ణాన్ని సరిపోల్చి సరిహద్దులు ఏర్పాటు చేయాలని ఆర్డీవో ఆదేశించారు. అయితే, మిగిలిన మండలాల్లో తక్కువ సర్వే నంబర్లు ఉండటంతో సర్వే పూర్తయింది. అదే సమయంలో సర్వేయర్ల నియామకాలు, పదోన్నతులు జరగడంతో సిబ్బంది తారుమారవడం, ఎక్కువ సర్వే నంబర్లు, విస్తీర్ణం ఉండటంతో రెడ్డిచెర్ల, దద్దవాడ రెవెన్యూ గ్రామాల్లో ఎంజాయ్మెంట్ సర్వే మొదట్లోనే నిలిచిపోయింది. -
పాసు పుస్తకం లేకపోయినా బ్యాంకులో రుణాలు
హైదరాబాద్: ఇక మీద రైతులు పట్టాదారు పాసుపుస్తకం లేకపోయినా బ్యాంకులో రుణాలు పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగులకు 13 వేల ట్యాబ్‌లు ఇస్తున్నామని తెలియజేశారు. వాటి ద్వారానే రైతుల భూములు అప్లోడ్ చేస్తామన్నారు. భూ యజమానుల వివరాలతో పాటు పంటల వివరాలు కూడా ఆన్లైన్లో ఉంచుతామని తెలిపారు. రైతుల భూమి రికార్డుల సమస్యలన్నింటినీ గ్రామసభల్లో పరిష్కరిస్తామన్నారు. అందుకోసం ఆగస్టు నెల 10 నుంచి 30 వరకు రాష్ట్రంలో రెవెన్యూ గ్రామసభలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ తెలిపారు. -
కౌలు రైతుకు ‘భరోసా’
రుణ అర్హత కార్డులు జారీ! - కొత్తవి, రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకోండి - మీ సేవ కేంద్రాల ద్వారా కార్డుల జారీ - ఆధార్‌తో అనుసంధానం - పట్టా భూముల యజమానులతో సమానంగా లబ్ధి - ఙ్ట్చఛగ్రామ గ్రామాన అవగాహన సదస్సులు జోగిపేట: ప్రభుత్వం కౌలు రైతుకు భరోసానిస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వీరందరికీ బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలను వర్తింపజేసేందుకు కొత్తగా రుణ అర్హత కార్డు (ఎల్ఈసీ)లను అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. త్వరలోనే జిల్లాలో కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు జారీ కానున్నాయి. పట్టా భూమి కలిగి ఉన్న రైతులు ప్రభుత్వం నుంచి పొందుతున్న అన్ని సదుపాయాలు కౌలు రైతుకూ వర్తింపజేయాలని సర్కారు నిర్ణయించింది. పట్టాదారులకు తప్ప ఆ భూమిలో కౌలు చేస్తున్న రైతులకు పంట రుణాలు అందడం లేదని గుర్తించిన ప్రభుత్వం భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా వారి అనుమతి పొందిన కౌలు రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కార్డులను జారీ చేయనుంది. ఈ రుణ అర్హత కార్డులను ఆధార్‌తో అనుసంధానిస్తారు. దీంతో బ్యాంకు రుణాలు, రాయితీ విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు, వివిధ రాయితీలు ఇకపై కౌలు రైతులకూ అందనున్నాయి. మార్కెట్ యార్డుల్లో పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడంతో పాటు కనీస మద్దతు ధరనూ పొందవచ్చు. ప్రకృతి విపత్తులు, వ్యవసాయ పరికరాల లోపం వల్ల పంట నష్టపోతే బీమా పరిహారాన్నీ పొందవచ్చు. కార్డు పొందిన నాటి నుంచి మే 31 వరకు అది చెల్లుబాటులో ఉంటుంది. మీ సేవ ద్వారా.. కౌలు రైతులకు కార్డులను మీ సేవ కేంద్రాల ద్వారా అందించాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. వీటిని పొందాలనుకునే వారు, పునరుద్ధరణ (రెన్యువల్) చేసుకునే వారి కోసం దరఖాస్తులను మీ సేవ కేంద్రాలు, గ్రామ, మండల రెవెన్యూ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తులో కౌలుకు తీసుకున్న భూమి వివరాలతో పాటు ఆధార్, రేషన్, ఓటరు, పాన్‌కార్డు నంబర్లలో ఏదో ఒకటి నమోదు చేయాలి. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి గ్రామసభ ద్వారా అధికారులు విచారణ చేస్తారు. నిర్దారణ తర్వాత 15 రోజుల్లో కొత్తవి, పునరుద్ధరణ కార్డులను జారీ చేస్తారు. అవగాహన సదస్సులు.. జిల్లాలో రెండేళ్ల క్రితం 2070 మంది కౌలు రైతులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో దాదాపు 935 మంది బ్యాంకు రుణాలు పొందినట్లు సమాచారం. గత ఏడాది రుణ అర్హత కార్డులు పొందిన వారు వాటిని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అవి చెల్లుబాటవుతాయి. కాగా, వివిధ ప్రయోజనాలు కల్పించిన రీత్యా ఈసారి రుణ అర్హత కార్డులు పొందే కౌలు రైతుల సంఖ్య పెరగనుంది. అలాగే, కౌలు రైతులకు కలిగించనున్న ప్రయోజనాలపై గ్రామ గ్రామాన రైతులతో సమావేశాలు నిర్వహించనున్నారు. గ్రామాల్లో ఆర్ఐ, వీఆర్ఓలు గ్రామసభలు నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2013-14లో రూ.447 లక్షల రుణాలు 2013-14లో జిల్లాలో 2070 మంది కౌలు రైతులకు అర్హత కార్డులను పంపిణీ చేశాం. వీరిలో 935 మంది వివిధ బ్యాంకుల ద్వారా రూ.447 లక్షల మేర రుణాలను పొందారు. 2014-15లో రుణ అర్హత కార్డుల్ని రెన్యువల్ చేయక, రుణాలు ఇవ్వలేదు. 2015-16 సంవత్సరానికి కౌలు రైతుల రుణ అర్హత కార్డుల రెన్యువల్‌కు నిర్ణయించాం. మీసేవ కేంద్రాల ద్వారా వీటిని జారీ చేస్తాం. - జేడీఏ హుక్యానాయక్, వ్యవసాయశాఖ -
కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు
మీ సేవ కేంద్రాల ద్వారా జారీకి రెవెన్యూశాఖ ఏర్పాట్లు ♦ కార్డున్న వారికే పథకాల లబ్ధి ♦ ఈ ఏడాది కొత్తగా 2.5 లక్షల మందికి కార్డులు ♦ పాత కార్డులున్న రైతులకు పునరుద్ధరణ ♦ ప్రతి కార్డుకు ‘ఆధార్’ అనుసంధానం సాక్షి, హైదరాబాద్: కౌలు రైతులందరికీ బ్యాంకు రుణాలను అందించే ఉద్దేశంతో.. ప్ర భుత్వం కొత్తగా రుణ అర్హత కార్డు (ఎల్ఈసీ)లను అందజేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.20 లక్షలమంది కౌలురైతులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే రుణ అర్హత కార్డులున్న 2.70 లక్షల మందికి ఈ ఏడాది వాటిని పునరుద్ధరించనున్నారు. కార్డులు లేని సుమారు 2.5 లక్షల మంది కౌలు రైతులకు వాటిని కొత్తగా అందజేయాలని సర్కారు తాజాగా నిర్ణయించింది. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సబ్సిడీతో అందజేస్తున్న విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ పనిముట్లను ఇకపై కౌలు రైతులకూ అందజేయనుంది. బ్యాంకుల ద్వారా పంట రుణాలతో పాటు, మార్కెట్ యార్డుల్లో పంటలను నిల్వ ఉంచుకునే సదుపాయం, కనీస మద్దతు ధరను పొందే అవకాశం.. తదితర అంశాల్లోనూ వారికి బాసటగా నిలవాలని భావిస్తోంది. బ్యాంకుల రుణాలు ఇప్పటివరకు భూముల యజమానులకే అందుతున్నాయని, వాస్తవానికి వ్యవసాయం చేస్తున్న రైతులకు అందడం లేదని ప్రభుత్వం గుర్తించింది. భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా, వారి అనుమతి పొందిన కౌలు రైతులకు ప్రయోజనం చేకూర్చేలా వీటిని జారీ చేయనుంది. ప్రయోజనాలు ఇలా.. రుణ అర్హత కార్డులను పొందనున్న కౌలురైతులకు ఇకపై బ్యాంకుల నుంచి పంట రుణాలతో పాటు ప్రభుత్వం రైతాంగానికి అందిస్తున్న వివిధ రకాల సబ్సిడీలు, మౌలిక సదుపాయాలను పొందేందుకు వీలు కలగనుంది. ప్రకృతి విపత్తులతోగానీ, వ్యవసాయ పరికరాల లోపం వల్ల గానీ పంట నష్టపోతే బీమా ద్వారా పరిహారాన్ని పొందవచ్చు. ఈ కార్డులను ఆధార్‌కు అనుసంధానం చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలను మరింత పటిష్టంగా అమలుచేయొచ్చని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. భూమిపై హక్కును క్లెయిం చేసుకునేందుకు గానీ, సమర్థించుకునేందుకు గానీ ఈ కార్డులను సాక్ష్యంగా వినియోగించుకునేందుకు వీలు కాదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.మీ సేవ ద్వారా ఎల్‌ఈసీలు జారీ కౌలు రైతులకు ఎల్ఈసీలను మీ సేవకేంద్రాల ద్వారా అందించేందుకు రెవెన్యూశాఖ ఏర్పాట్లు చేసింది. వీటిని పొందాలనుకునే/ రెన్యువల్ చేసుకోవాలనుకునే వారు దరఖాస్తులను సమీపంలోని మీ సేవకేంద్రాల్లో, గ్రామ లేదా, మండల రెవెన్యూ కేంద్రాల్లో ఉచితంగా పొందవచ్చు. దరఖాస్తులో కౌలుకు తీసుకున్న భూమి వివరాలతో పాటు తమ ఆధార్/రేషన్ కార్డు/ఓటర్ ఐడీ/పాన్ కార్డు నంబర్లలో ఏదో ఒకటి తప్పనిసరిగా నమోదు చేయాలి. కార్డు పొందేందుకు రూ.35 రుసుము చెల్లించాలి. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి గ్రామసభ ద్వారా అధికారులు విచారణ చేస్తారు. వెరిఫికేషన్ పూర్తయిన 15 రోజుల్లో కొత్త/ రెన్యువల్ కార్డులను మీసేవ కేంద్రాల నుంచే పొందవచ్చు. ఈ కార్డు ఏడాది (జూన్ 1 నుంచి మే 31 వరకు) మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. ప్రతిఏటా రెన్యువల్ చేయించుకోవాలి. -
కౌలు రైతుకు కష్టం
గుర్తింపు కార్డుల జారీలో జాప్యం రుణాలు పొందడంలో ఇబ్బందులు పంట నష్టపోతే అంతే.. చొరవ చూపించని అధికారులు రూపాయి అప్పు ఇవ్వలే... ఆరేళ్ల సంది కౌలుకు చేత్తన్న. ఆరెకరాల్లో పత్తి, వరి సాగుచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. వానదేవుడు కనికరించక, వడగళ్లతో పంటలు నష్టపోయిన. ప్రతి సీజన్‌కూ అప్పులు చేసి పంటలను సాగుచేత్తున్నం. రైతు రాసిచ్చిన కౌలు కాయితం, పట్టా బుక్కులు చూసి మూడేళ్ల కిందట కౌలుకార్డు ఇచ్చిండ్రు. గిప్పటి వరకు కార్డు ఉందే తప్ప, బ్యాంకోళ్లు రూపాయి అప్పు ఇవ్వలేదు. పోయినేడు పెట్టుబడుల మందం పైసలు వచ్చినయి. గిప్పుడు చేతిలో చిల్లిగవ్వలేదు. ప్రైవేట్‌లో రూ.20వేలు అప్పుతెచ్చి నాలుగున్నరెకరాల్లో వరి, ఎకరంన్నరలో పత్తి పెట్టా. తెలంగాణ ప్రభుత్వమైనా కౌలుకార్డు ఇచ్చి ఆదుకోవాలి. - పిట్టల నర్సయ్య, కౌలురైతు, గోపాల్‌నగర్, బచ్చన్నపేట సాక్షి, హన్మకొండ : బ్యాంకు రుణాలు పొందడం, పంట నష్ట పరిహారం అందుకోవడంలో కౌలు రైతుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం 2011 సంవత్సరంలో కౌలు రైతుల అర్హత గుర్తింపు కార్డులు అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డులు కలిగిన కౌలు రైతు లు భూమి యజమాని అంగీకారం తో నిమిత్తం లేకుండా బ్యాంకు రుణాల మంజూరు, రాయితీపై ఎరువులు, ఠమొదటిపేజీ తరువాయి విత్తనాలు పొందవచ్చు. అదేవిధంగా ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన సందర్భాల్లో ప్రభుత్వ సాయం పొందేందుకు ఓ సాధనంగా ఉపయోగపడు తుంది. ఒక ఏడాదిపాటు భూమిని కౌలుకు తీసుకున్న రైతులకు ఈ రుణ అర్హత కార్డులు జారీ చేయాలి. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే మార్చిలో గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియను మొదలుపెట్టి జూన్ 15వ తేదీ వరకు కౌలు రైతులకు ఈ పట్టాలు అందివ్వాలి. ఈ బాధ్యతను క్షేత్రస్థాయిలో వీఆర్వో, డిప్యూటీ తహసీల్దార్లు నిర్వహించాల్సి ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యం 2011 సంవత్సరం తొలినాళ్లలో రుణ అర్హత కార్డులకు అనూహ్య స్పందన లభించింది. జిల్లాలో 1.20 లక్షల మంది కౌలు రైతులు ఉండగా 30 వేల మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు మంజూరయ్యూరుు. ఈ అర్హత కార్డులు పొందిన రైతులు రుణసాయం కోసం బ్యాంకులకు వెళ్తె భూమి యజమాని నుంచి అంగీకార పత్రం తీసుకురావాల్సిందిగా అధికారులు కొర్రీలు వేశారు. దీనితో సమస్య మొదటికి వచ్చింది. బ్యాంకు అధికారులు, కౌలు రైతులకు మధ్య నెలకొన్న సందేహాలను తీర్చేందుకు జిల్లా అధికారులు చొరవ చూపలేదు. తొలి ఏడాది కేవలం నాలుగు శాతం రైతులకే రుణాలు అందాయి. ఫలితంగా రైతులు ఈ కార్డులను తీసుకోవడంపై అనాసక్తి చూపారు. 2014లో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో రుణ అర్హత కార్డులు జారీ చేయలేదు. ఎన్నికలు ముగియడం, కొత్త రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రుణ అర్హత కార్డుల జారీలో జాప్యం జరిగింది. ఫిబ్రవరిలో మొదలు కావాల్సిన ప్రక్రియ జూన్‌లో ప్రారంభమైంది. దానితో ఈ ఖరీఫ్‌కి కౌలు రైతుల రుణఅర్హత కార్డుల జారీ అందని ద్రాక్షగానే మిగిలింది. ఈ విషయంలో బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నారుు. ఇప్పటికైనా తెలంగాణ సర్కారు రుణ అర్హత కార్డులు మంజూరు చేయూలని రైతులు కోరుతున్నారు. రాయితీలు అందించాలి.. నేను ఎంకాం వరకు చదువుకున్నా. దుగ్గొండి మండలం రాజుతండాలో నాలుగేళ్లు గా భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నా. మూడెకరాల భూమికి రూ.48 వేలు చెల్లించా. ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలిస్తామంటూ గతంలో రెండు సార్లు కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చింది. నేటికి రూపాయి రుణం అందలేదు. రెండేళ్ల క్రితం అధిక వర్షాలతో పంట నాశనమైంది. పోయినేడాది పంట నష్టం ఇచ్చింది. కానీ.. నష్టపరిహారం అందలేదు. ఆపై ఆ పరిహారాన్ని అసలు రైతులకే ఇచ్చారు. గతేడాది పంటలు గిట్టుబాటు కాక రూ. లక్ష నష్టం వచ్చింది. ప్రభుత్వం సాయం చేసింది శూన్యం. ఇప్పటికైనా ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలతోపాటు పంట నష్టపరిహారం, రాయితీలు అందేలా చూడాలి. - బానోతు శ్రీనివాస్, దుగ్గొండి -
బాబూ.. చాలించండి మోసాలు!
అనంతపురం క్రైం : ‘‘సకాలంలో బ్యాంకు రుణాలు ఇవ్వలేదు. సీజన్లో విత్తన వేరుశనగ కాయలు అందరికీ ఇవ్వలేదు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలపై చంద్రబాబు ఇచ్చిన హామీలు బుట్టదాఖలయ్యాయి. అబద్దాలతో గద్దెనెక్కిన చంద్రబాబుకు రైతుల ఉసురు తగిలి అడుగుడుగున అవమానాల పాలవుతున్నారు. బాబు.. ఇక చాలించండి.. మీ మోసాలు.. భరించలేకపోతున్నాం.. ఇక గద్దె దిగండి.’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ‘రైతన్నల కోసం ధర్నా’ను జిల్లా అధ్యక్షుడు ఎం.శంకర్‌నారాయణ అధ్యక్షతన నిర్వహించారు. సీజీసీ సభ్యులు డాక్టర్ సిద్ధారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రాగే పరుశురాం, మీసాల రంగన్న, నదీమ్ అహమ్మద్, కార్మిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా, గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలే జయరాంనాయక్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రారెడ్డి, తాడిపత్రి నియోజకవర్గ నాయకుడు వీఆర్ వెంకటేశ్వర్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యుపి నాగిరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, మహిళ విభాగం రాష్ట్ర కార్యదర్శి డి.దేవి, గౌస్‌బేగ్, పార్టీ అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, పెన్నోబిలేసు, మిద్దె భాస్కర్‌రెడ్డి, బండి పరుశురాం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ధనుంజయ యాదవ్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు పామిడి వీరాంజినేయులు, అధికార ప్రతినిధులు సీపీ వీరన్న, చింతకుంట మధు, పోరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, మహిళ విభాగం నగర అధ్యక్షురాలు బి. శ్రీదేవిరెడ్డి, మహిళ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి, ఎల్లుట్ల మారుతినాయుడు, అంకి రెడ్డి ప్రమీల, షమీమ్, షాబీన్, పార్వతి, లక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి.. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి, అబద్దా ల హామీలతో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమ సంపాదనలో మునిగి తేలుతున్నారు. విత్తన వేరుశనగ కాయల కోసం రైతులు పడిగాపులు కాస్తుంటే అధికార పార్టీ నాయకులు ఇసుక అక్రమ వ్యాపారంలో బిజీ అయిపోయారు. రైతులకు అందాల్సిన విత్తన కాయలపై అధికార పార్టీ చేతివాటం చూపింది. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు.. నోటు వ్యవహారం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. - ఎం. శంకర్‌నారాయణ, జిల్లా అధ్యక్షులు ఆత్మగౌరవాన్ని మంటగలిపారు ఓటుకు నోటు కేసులో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటగలిపారు. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. చంద్రబాబుకు నైతికత ఉంటే తక్షణమే రాజీనామా చేయాలి. - దుద్దేకుంట శ్రీధర్‌రెడ్డి, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త రైతులపై చిత్తశుద్ధి ఉందా? జిల్లాలో రైతులకు 5 లక్షల క్వింటాళ్ల వేరుశనగ అసవరమైతే 2లక్షల క్వింటాళ్లు సరఫరా చేశారు. అసలు మీకు రైతులపై చిత్తశుద్ధి ఉందా? ఉంటే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయండి. - అత్తార్చాంద్ బాషా, కదిరి ఎమ్మెల్యే ధనమదంతో పాలన చంద్రబాబు ధనమదంతో పాలన సాగిస్తున్నారు. ఓ పక్క రైతులు విత్తన వేరుశనగ కాయలు అందక అల్లాడుతుంటే.. ఆయన మాత్రం కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనే పనిలో ఉన్నారు. - కాపు రామచంద్రారెడ్డి, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే నిధులన్నీ చిన్న బాబుకే ప్రజల ప్రయోజనాల కోసం ఖర్చుపెట్టాల్సిన నిధులన్నీ చిన్నబాబు (లోకేష్) కార్యకర్తల సంక్షేమానికి వెళ్లుతున్నాయి. జిల్లాలో రైతులకు విత్తనకాయలు అందించకపోవడం దారుణం. - కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అవినీతికి నిలువెత్తు నిదర్శనం నేను చాలా నిజాయితీ పరున్ని అని చాటింపు వేసుకున్న చంద్రబాబు ఓటుకు.. నోటు వ్యవహారంలో ఏసీబీకి దొరికిపోయారు. దీంతో బాబు అవినీతికి నిలువెత్తు నిదర్శనమని తేలిపోయింది. - కె. ఉషాచరణ్, కళ్యాణదుర్గం సమన్వయకర్త రైతుల పరిస్థితి చూస్తే బాధేస్తోంది ఒక వైపు అదును దాటుతోంది.. సకాలంలో వర్షాలు కురిశాయి.. కానీ విత్తనకాయలు ఇప్పటికీ లభిం చడం లేదు. జిల్లాలోని రైతుల పరిస్థితి చూస్తే బాధేస్తోంది. - వై. వెంకటరామిరెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త -
గ్రీన్హౌస్ రైతులకు బ్యాంకు రుణాలు
విలువైన ఆస్తుల పూచికత్తుతో ఇచ్చేందుకు ఎస్ఎల్బీసీ అంగీకారం సాక్షి, హైదరాబాద్: గ్రీన్హౌస్ రైతులకు రుణాలు ఇచ్చేందుకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) అంగీకరించింది. ఉద్యానశాఖ పంపిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అయితే సాధారణ పంట రుణాలకు ఇచ్చినట్లుగా కాకుండా ప్రభుత్వ గ్రీన్హౌస్ పథకం కింద రుణాలు తీసుకోవాలంటే విలువైన ఆస్తులను పూచీకత్తుగా చూపితేనే ఇస్తామని షరతు విధించింది. అది కూడా పట్టణాల్లో ఉండే విలువైన ఇళ్ల స్థలాలు లేదా ఇళ్లను పూచీకత్తు చూపాలని బ్యాంక్‌లు తేల్చిచెప్పాయి. సాధారణంగా గ్రీన్హౌస్ కోసం ఎకరాకు రూ.38 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అందులో ప్రభుత్వ సబ్సిడీ 75 శాతం పోను మిగిలిన రూ. 9.5 లక్షలు రైతులే సమకూర్చుకోవాలి. ఇది చిన్నసన్నకారు రైతులకు మోయలేని భారమే. దీంతో గ్రీన్హౌస్ సబ్సిడీ పథకం కోసం ధనిక రైతులే ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యానశాఖ విన్నపం మేరకు వారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు అంగీకరించాయి. అయితే పట్టణాల్లో ఇళ్లు, ఇళ్లస్థలాలు ఉండే వారెందరనేది ప్రశ్నార్థకం. ఎస్సీ, ఎస్టీ రైతులకు మరికొంత సబ్సిడీ... గ్రీన్హౌస్ నిర్మాణం ఖరీదైన వ్యవహారం కావడంతో ఎస్సీ, ఎస్టీ రైతులు అనేకమంది ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో గ్రీన్హౌస్ నిర్మాణం జరిపేలా చర్యలు తీసుకోవాలని గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖలు ఉద్యానశాఖకు విన్నవించాయి. తక్కువ ఖర్చుతో కూడిన నిర్మాణాలు చేపట్టే కంపెనీలుంటే వాటి గురించి ఆరా తీయాలని కోరాయి. అవసరమైతే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పోను మిగిలిన సొమ్ముకు తమ శాఖల నుంచి ఎస్సీ, ఎస్టీ రైతులకు సబ్సిడీ భరించేందుకు సన్నద్ధత వ్యక్తంచేశాయి. ఆదాయ పన్నుదారులూ అర్హులే... గ్రీన్హౌస్ ఖరీదైన వ్యవహారం కావడంతో లబ్ధిదారులు ఆదాయపు పన్ను పరిధిలోకే వస్తారు. కానీ తొలుత ప్రభుత్వం ఆదాయపు పన్ను చెల్లించే వారికి గ్రీన్హౌస్ సబ్సిడీకి అనుమతి ఇవ్వలేదు. తాజాగా ఈ విషయంలో మార్పులు చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై ఆదాయపు పన్ను చెల్లించే వారూ ఈ పథకం కింద సబ్సిడీ పొందవచ్చని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి ఉత్తర్వులు జారీచేశారు. -
ఎగవేత కంపెనీలపై బ్యాంకులకు మరిన్ని అధికారాలు
న్యూఢిల్లీ: రుణాలు ఎగ్గొట్టిన సంస్థల విషయంలో కఠినంగా వ్యవహరించేలా బ్యాంకులకు మరిన్ని అధికారాలు కట్టబెట్టింది రిజర్వ్ బ్యాంక్. ఒకవేళ రుణ పునర్వ్యవస్థీకరణ చేసినప్పటికీ నిర్దిష్ట కాలంలో సదరు కంపెనీ గట్టెక్కని పక్షంలో దానికి ఇచ్చిన అప్పును ఈక్విటీ కింద మార్చుకునేందుకు బ్యాంకులకు అనుమతినిచ్చింది. తద్వారా రుణ భారం గల కంపెనీలను బ్యాంకులు తమ అజమాయిషీలోకి తెచ్చుకునేందుకు వీలు కల్పిస్తూ ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. బ్యాంకులు రుణ పునర్వ్యవస్థీకరణ చేసినా కూడా నిర్వహణపరమైన అసమర్థత వల్ల పలు కంపెనీలు నిలదొక్కుకోవడం లేదన్న సంగతి తమ దృష్టికి వచ్చినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఇలాంటి సందర్భాల్లో యాజమాన్యాన్ని మారుస్తూ వ్యూహా త్మక రుణ పునర్వ్యవస్థీకరణకు (ఎస్డీఆర్) ప్రాధాన్యమివ్వొచ్చని తెలిపింది. సదరు సంస్థకు రుణమిచ్చిన బ్యాంకుల ఫోరం (జేఎల్ఎఫ్) దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. ఇందుకోసం ప్రాథమిక స్థాయిలో రీస్ట్రక్చరింగ్ చేసేటప్పుడే .. నిర్దిష్ట లక్ష్యాలను సాధించని పక్షంలో బాకీ మొత్తాన్ని కంపెనీలో వాటాల కింద మార్చుకునేలా నిబంధనను బ్యాం కులు పొందుపర్చాలని ఆర్బీఐ తెలిపింది. దీనికి సదరు కంపెనీ షేర్ హోల్డర్ల నుంచి అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. ఇలాంటి ఎస్‌డీఆర్‌కు అనుమతులు లేకపోతే రుణ పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఉండబోదని పేర్కొంది. -
కౌలు రైతుల కష్టాలు
- రుణాలివ్వని బ్యాంకులు - బ్యాంకు నిబంధనలు పట్టించుకోని ప్రభుత్వం - గత ఏడాది వంద మందికే రుణాలు - ఈ ఏడాది అవీ అందని పరిస్థితి బ్యాంకు రుణాలు అందకపోవడంతో జిల్లాలో కౌలు రైతులకు కష్టాలు తప్పడం లేదు. కౌలు రైతులందరికీ రుణాలిస్తామని ప్రభుత్వం పదేపదే చెప్పినా బ్యాంకులు మాత్రం మొండిచేయి చూపాయి. ప్రభుత్వ నిర్వాకం వల్లే కౌలు రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని బ్యాంకులు పేర్కొంటున్నాయి. సాక్షి, చిత్తూరు : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం గుర్తించిన కౌలు రైతులు 5,626 మంది ఉన్నారు. వాస్తవానికి ఈ సంఖ్య రెట్టింపు ఉంటుందని అంచనా. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం జిల్లాలో 5,626 మంది కౌలు రైతులను గుర్తించి ఏడాది కాలపరిమితితో రుణ అర్హత కార్డులను మంజూరు చేసింది. ఎటువంటి ష్యూరిటీ లేకుండా అందరికీ రుణాలిస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో వంద మంది రైతులకు రూ.30 లక్షల లోపు రుణాలు మాత్రమే ఇచ్చి బ్యాంకులు చేతులు దులిపేసుకున్నాయి. మిగిలిన 5,526 మంది కౌలు రైతులకు మొండిచేయి చూపాయి. బ్యాంకుల చుట్టూ పదేపదే తిరిగి రైతులు విసిగిపోయారు. చేసేది లేక కౌలు రైతులు మిన్నకుండిపోయారు. ఈ ఏడాదైనా రుణాలందేనా? ప్రభుత్వం ఈ ఏడాదైనా కౌలు రైతులకు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. రుణాలు అందరికీ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా కౌలు రైతులకు ఇచ్చే విషయంలో బ్యాంకులు నిబంధనలను బూచిగా చూపుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి సూచనలు చేసినా పట్టించుకోవడంలేదన్నది బ్యాంకుల ఆరోపణ. ప్రధానంగా రుణ అర్హత కార్డుల కాలపరిమితిని ఏడాదికి బదులు మూడేళ్లకు పెంచాలి. కౌలు రైతులందరికీ రుణాలు అందించేందుకు వీలుగా రుణహామీ నిధిని (క్రెడిట్ గ్యారంటీ ఫండ్) ఏర్పాటు చేయాలి. కౌలు రైతులకు మంజూరు చేసే పంట రుణాల నుంచి బ్యాంకులు కొంతమొత్తాన్ని ప్రీమియం కింద రాష్ట్ర ప్రభుత్వానికి జమచేస్తే ప్రభుత్వం అందుకు తగ్గ మ్యాచింగ్ గ్రాంట్‌ను రుణహామీ (క్రెడిట్ గ్యారంటీ) కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి. దీనిపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంటే ఈ నిధి వినియోగంపై విధివిధానాలను రూపొందిస్తామని బ్యాంకులు తెలిపాయి. దీంతో పాటు కౌలు రైతుల రుణాల వసూళ్లలో బ్యాంకులకు సహకరించేందుకు రెవెన్యూ, వ్యవసాయ, స్వయం సహాయక బృందాలతో ప్రభుత్వం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఈ అంశాలపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) ప్రభుత్వానికి లేఖలు రాసింది. ప్రభుత్వం ఏమాత్రమూ స్పందించలేదు. దీంతో బ్యాంకులు కౌలు రైతులకు రుణాల మంజూరులో వెనుకడుగు వేశాయి. ఈ సీజన్‌కైనా బ్యాంకుల సూచనలు పాటించి కౌలు రైతులకు రుణాలందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. -
పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు!
* రాష్ట్రప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం * టైటిల్ డీడ్స్ కూడా కాలగర్భంలో కలసినట్టే.. * ఇక అన్నింటికీ ‘1-బి’నే ఆధారం * ‘మీ భూమి’ నుంచి ‘1-బి’ రికార్డు నేరుగా డౌన్లోడ్ * ‘వెబ్‌ల్యాండ్’ డేటా ప్రకారం బ్యాంకు రుణాలు * మరి పట్టాదారు పాసుపుస్తకాలు రద్దయితే రైతులకు బ్యాంకు రుణాలెలా? సాక్షి, హైదరాబాద్: కొండనాలుకకు మందేసి ఉన్న నాలుక ఊడగొట్టే చందంగా ఉంది సర్కారు తీరు. రెవెన్యూశాఖలో అక్రమాలను నియంత్రించలేక ఏకంగా పట్టాదారు పాసుపుస్తకాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఫలితంగా రైతులు ఎంతో విలువైన ఆస్తి పత్రాల్లా భావించే పట్టాదారు పాసుపుస్తకాలకు కాలం చెల్లనుంది. పట్టాదారు పాసుపుస్తకాల జారీ, వెబ్‌ల్యాండ్‌లో భూ వివరాల అప్డేట్, మ్యుటేషన్లు(భూ యాజమాన్య హక్కుల సవరణ) కోసం క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది భారీ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ విమర్శలు రావడం, వీటిపై పత్రికల్లోనూ కథనాలు రావడంతోపాటు రెవెన్యూ అక్రమాలను నియంత్రించలేకపోతున్నామంటూ జాయింట్ కలెక్టర్లు రెవెన్యూ మంత్రి సమక్షంలోనే పేర్కొన్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై చర్చించింది. అయితే అక్రమాలను నియంత్రించే మార్గాలను అన్వేషించే బదులుగా సమస్యకు పరిష్కారంగా ఏకంగా పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ దిశగా ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకుని కార్యరూపంలోకి తెస్తే పట్టాదారు పాసుపుస్తకాలకు కాలం చెల్లినట్లే. పట్టాదారు పాసుపుస్తకాల విధానాన్ని రద్దు చేయడమంటే టైటిల్‌డీడ్స్(భూ యాజమాన్యహక్కుల పత్రాలు)నూ కాలగర్భంలో కలిపేసినట్లే. ఇక ‘1-బి’నే ఆధారం! రైతులు ప్రస్తుతం పట్టాదారు పాసుపుస్తకాలను తనఖాపెట్టి వాణిజ్య, సహకార బ్యాంకుల్లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు పొందుతున్నారు. ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాల విధానాన్ని అధికారికంగా రద్దు చేస్తే.. ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ఉన్న ‘1-బి’(భూ యాజమాన్య) రికార్డు జిరాక్స్ పత్రాలను ఉపయోగించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు రైతులు ‘మీభూమి’ వెబ్సైట్ ద్వారా ‘1-బి’ నుంచి వారికి చెందిన భూముల వివరాలను డౌన్లోడ్ చేసుకుని బ్యాంకుల్లో పెట్టి రుణాలు పొందవచ్చని సూచిస్తున్నారు. ‘సర్కారు భూమి’(మీ భూమిలోని డేటానే ఇందులో ఉంటుంది) వెబ్‌ల్యాండ్ ఆధారంగా రుణాలిచ్చేలా బ్యాంకులను ప్రభుత్వం ఒప్పించనుంది. రైతుల భూముల డేటా నేరుగా చూసుకునేందుకు వీలుగా ఇప్పటికే బ్యాంకులకు ‘సర్కారు భూమి’ వెబ్‌ల్యాండ్‌ను రెవెన్యూ శాఖ అందుబాటులోకి తెచ్చింది. దీనిప్రకారం రుణాలివ్వడంలో బ్యాంకులకు అభ్యంతరం ఉండకపోవచ్చునంటున్నారు. ప్రైవేటు రుణాల మాటేమిటి? సన్న, చిన్నకారు రైతులకు బ్యాంకులిస్తున్న రుణాలు పది శాతమే. మిగిలిన 90 శాతం వరకు వడ్డీ వ్యాపారులనుంచే రుణాలు పొందుతున్నారు. వడ్డీ వ్యాపారులు చాలామంది పట్టాదారు పాసుపుస్తకాలను, భూముల కొనుగోలు డాక్యుమెంట్లను తనఖా పెట్టుకుని రుణాలిస్తున్నారు. ఈ పుస్తకాలు రద్దయితే ప్రైవేటు వ్యాపారుల నుంచి రుణాలు పొందడం చిన్న రైతులకు ఇబ్బంది కావచ్చని రెవెన్యూ అధికారులు సైతం అంగీకరిస్తుండడం గమనార్హం. రద్దు ఎలా పరిష్కారం.. రెవెన్యూలో అక్రమాల నియంత్రణకు పాసు పుస్తకాలను రద్దు చేయడం ఎలా పరిష్కారమో అర్థంకాని ప్రశ్నగా మారిందని ఈ శాఖలో సుదీర్ఘ అనుభవమున్న అధికారులు అంటున్నారు. వెబ్‌ల్యాండ్ డేటాలో సర్వే నంబర్లవారీగా రైతుల భూముల వివరాలుంటేనే బ్యాంకులు రుణాలిస్తాయి. ఇప్పటివరకూ 40 నుంచి 50 శాతం డేటాలోకి ఎక్కలేదు. పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేస్తే వీరికి బ్యాంకు రుణాలెలా వస్తాయి? వెబ్‌ల్యాండ్‌లోకి భూవివరాలు ఎక్కించాలంటే రెవెన్యూ సిబ్బంది డబ్బు డిమాండు చేస్తుంటే.. దీనిని కట్టడి చేయడం మాని వెబ్‌ల్యాండ్ ఆధారంగా రుణాలిప్పించే విధానం తెస్తామని చెప్పడంలో అర్థమేంటీ? ’ అని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. -
అర్హులకు రుణాలందిస్తాం...
మేడ్చల్ (రంగారెడ్డి జిల్లా) : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్ ద్వారా అందించే బ్యాంకు రుణాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని మేడ్చల్ ఎంపీడీఓ దేవసహాయం అన్నారు. మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్ ద్వారా అందించే వివిధ పథకాల రుణాలకు సంయుక్త లబ్ధిదారుల గుర్తింపు శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ... గ్రామాల్లోని నిరుద్యోగులు ఆర్థిక స్వావలంబన కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపికచేసి వారికి బ్యాంకుల ద్వారా రుణాలను అందించేలా కృషి చేస్తామని తెలిపారు. ఏప్రిల్ 30 వ తేదీ వరకు తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సభ్యురాలు శైలజ మాట్లాడుతూ... గ్రామాల్లో నిరుపేదలకు రుణాలను సకాలంలో అందించి వారిని ఆదుకునే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. -
నేడు రాష్ట్రానికి కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రాక
వ్యవసాయ బీమాపై ఇరు రాష్ట్రాల అధికారులతో భేటీ సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లో వ్యవసాయ బీమా సంబంధిత అంశాలపై చర్చించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఆ శాఖ ముఖ్య కార్యదర్శులు, అధికారులతో మెట్ట వ్యవసాయ కేంద్ర పరిశోధన సంస్థ (క్రిడా) కేంద్ర కార్యాలయంలో సమావేశం కానున్నారు. బ్యాంకు రుణాలు పొందిన బీమా రైతుల సంఖ్య, వారు చెల్లించిన ప్రీమియం ఎంత? ఎన్ని జిల్లాల్లో ఎందరికి బీమా సౌకర్యం లభించింది అనే విషయాలపై చర్చించి, తదుపరి చర్యలపై చర్చిస్తారని తెలిసింది. అనంతరం సచివాలయంలో ఇరు రాష్ట్రాల అధికారులతో మరోసారి భేటీ అవుతారు. -
మరిన్ని రంగాలకు ప్రాధాన్య హోదా
- చిన్న రైతులకు 8 శాతం నిధులు - సిబ్బందికి తప్పనిసరి సెలవు నిబంధన - రిజర్వ్ బ్యాంక్ వెల్లడి ముంబై: బ్యాంకులు రుణాలివ్వడానికి సంబంధించి ప్రాధాన్యతా రంగాల నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ గురువారం సవరించింది. మధ్యతరహా సంస్థలు, సామాజిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక విద్యుత్ మొదలైన రంగాలను కూడా ప్రాధాన్యతా రంగ పరిధిలోకి చేర్చింది.ఇకపై మొత్తం రుణాల్లో 8 శాతం నిధులను చిన్న, సన్నకారు రైతులకు ఇవ్వాలని పేర్కొంది. దశలవారీగా 2017 మార్చి నాటికి దీన్ని అమలు చేయాలని సూచించింది. ఇక 20 కన్నా తక్కువ శాఖలు ఉన్న విదేశీ బ్యాంకులు కూడా 2019-20 నాటికి ఇతర బ్యాంకులకు సరిసమానంగా 40 శాతం రుణాలు ప్రాధాన్యతా రంగాలకి ఇవ్వాలని సూచించింది. ప్రస్తుతం వ్యవసాయం, సూక్ష్మ.మధ్యతరహా సంస్థలు, ఎక్స్పోర్ట్ క్రెడిట్, విద్య, హౌసింగ్ మొదలైన వాటిని ప్రాధాన్యతా రంగాలుగా పరిగణించి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. మరోవైపు బ్యాంకులు విధిగా తమ ఉద్యోగులకు ‘తప్పనిసరి సెలవుల’ నిబంధనను పాటించాలని ఆర్బీఐ ఆదేశించింది. ట్రెజరీ తదితర కొన్ని ముఖ్యమైన విభాగాల ఉద్యోగులు ఏడాదిలో ఒకసారి ఏకమొత్తంగా పది రోజుల సెలవును తప్పనిసరిగా వినియోగించుకునేట్లు చూడాలని సూచించింది. మోసాలు వంటి రిస్కులు తలెత్తకుండా ఇటువంటి విధానాలు పటిష్టంగా అమలు చేయడం ముఖ్యమని ఆర్బీఐ పేర్కొంది. ట్రాన్స్జెండర్లు సైతం బ్యాంకు సేవలను సులభతరంగా పొందే దిశగా.. అన్ని ఫారమ్‌లు, అప్లికేషన్లలో వారి కోసం ప్రత్యేకంగా మరో కాలమ్ ఏర్పాటు చేయాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. స్త్రీ, పురుషులకు తప్ప తమకు ప్రత్యేక కాలమ్ లేకపోవడం వల్ల ట్రాన్స్జెండర్లు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. -
హైదరాబాద్‌లో మేదర సంక్షేమ భవనం
- రాష్ట్ర మేదర సంఘం మహాసభలో మంత్రులు ఈటల, జూపల్లి, లక్ష్మారెడ్డి హామీ - మేదరలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి - సెక్యూరిటీ లేకుండా బ్యాంకు రుణాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆర్థికంగా అత్యంత వెనుకబడిన మేదర కులస్తులను బీసీ -ఎ జాబితా నుంచి ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఒకే కులం ఒకే వృత్తిలో కొనసాగుతున్న మేదరులకు సీమాంధ్రుల పాలనలో తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆంధ్ర మేదరులను ఎస్టీ జాబితాలో చేర్చి, తెలంగాణ మేదరులను మాత్రం బీసీ ‘ఎ’ జాబితాలో చేర్చారని ఆరోపించారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మాదిరే తెలంగాణలోని మేదరులను సైతం ఎస్టీలుగా గుర్తించి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పారు. మేదరుల ఆవేదనను సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర మేదర మహాసభ ఆదివారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగింది. మేదర సంఘం అధ్యక్షుడు బాలరాజ్ అధ్యతన జరిగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా మంత్రి రాజేందర్, విశిష్ట అతిథులుగా వైద్యశాఖమంత్రి సి.లక్ష్మారెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ జితేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో మేదరుల కోసం ఒక సంక్షేమ భవనాన్ని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మేదరుల సంక్షేమం కోసం ప్రస్తుత బడ్జెట్లో రూ.15 కోట్లు కేటాయించామని, అవసరమైతే మరో రూ.5 కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వమే మధ్యవర్తిగా వ్యవహరించి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంకుల ద్వారా రూ.ఐదు లక్షల వరకు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ రుణాలపై ఇస్తున్న సబ్సిడీని 30 నుంచి 50 శాతానికి పెంచనున్నట్లు తెలిపారు. ఆర్థిక సరళీకృత విధానాల వల్ల తెలంగాణలోని అనేక కులవృత్తులు ఘోరంగా దెబ్బతిన్నాయన్నారు. మేదరులు తయారు చేసిన వెదురు బుట్టలు, చాటలు, శిబ్బి వంటి ఉత్పత్తులు కనుమరుగై పోయాయని, ఒకప్పుడు సమాజంలో చాలా గొప్పగా బతికిన మేదరులు నేడు కులవృత్తి దెబ్బతినడంతో ఉపాధిలేక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీ, బీసీ కులాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సొసైటీలకు భూములు కేటాయించి వెదురు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని మంత్రి ఈటల హామీనిచ్చారు. సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నట్లు నిర్వాహకులు ప్రచారం చేశారు. తీరా సభకు ఆయన రాకపోవడంతో అభిమానులు నిరుత్సాహానికి లోనయ్యారు. మంత్రులు మాట్లాడుతున్న సమయంలో కొంతమంది మేదరులు లేచి సీఎం కేసీఆర్ రావాలి.. అంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయం నెలకొంది. సమావేశంలో మేదర సంఘం కార్యదర్శి జొర్రీగల శ్రీనివాసులు, కన్వీనర్ మురళీకృష్ణ, గౌరవ అధ్యక్షుడు వెంకటరాముడు, కోశాధికారి ఏకుల సత్యం, ప్రచార కార్యదర్శి గణేష్‌రావు, యువజన సంఘం అధ్యక్షుడు జొర్రీగల శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. -
అన్నపూర్ణ స్టూడియోకి నోటీసులు
హైదరాబాద్ : తీసుకున్న లోన్లు చెల్లించనందుకు రెండు బ్యాంకుల నుంచి అన్నపూర్ణ స్టూడియోకి లీగల్ నోటీసులు అందాయి. వివరాల ప్రకారం... సినీనటుడు నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియో రెండు బ్యాంకులకు కలిపి దాదాపు రూ.62 కోట్లు బకాయి పడింది. ఆంధ్రా బ్యాంక్‌కు రూ.29.7 కోట్లు బాకీ పడగా, ఇండియన్ బ్యాంక్‌కు రూ.32.3 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ రెండు బ్యాంకుల అధికారులు సోమవారం అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యానికి లీగల్ నోటీసులు అందజేశారు. -
సంక్షేమానికి సమయం లేదు
కార్యాచరణ ప్రణాళిక లేని ఎస్సీ కార్పొరేషన్ 45 రోజుల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం ఈ లోగా లబ్ధిదారుల ఎంపిక అసాధ్యం ! సాక్షి, హైదరాబాద్: దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్నట్లు ఉంది రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ పరిస్థితి.. నిండుగా నిధులున్నా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చలేని దుస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) మరో నెలన్నరలో ముగియనుంది కానీ, ఇప్పటివరకు రాష్ట్ర షెడ్యూల్ కులాల కార్పొరేషన్ కార్యాచరణ ప్రణాళికే (యాక్షన్‌ప్లాన్) ఇంకా సిద్ధం కాలేదు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం కార్యకలాపాలన్నీ స్తంభించాయి. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నియామకం జరిగి నెలలు గడిచినా, నామమాత్రంగానే కార్యక్రమాలు సాగుతున్నాయి. కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తే లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకుల లింకేజీ, రుణాల మంజూరు జరిగేవి. సంక్షేమ రంగానికి పెద్దపీట వేశామని ప్రభుత్వం చెబుతున్నా.. సీఎం కేసీఆర్ ఈ శాఖను నిర్వహిస్తున్నా.. ఇప్పటివరకు లబ్ధిదారుల ఎంపిక జరగకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు గత ఏడాది లబ్ధిదారులను ఎంపిక చేసినా వారికి బ్యాంకుల ద్వారా రుణాలు అందకపోవడం, ప్రభుత్వపరంగా మంజూరు కూడా ఇవ్వకపోవడంతో అవి కూడా మధ్యలోనే ఆగిపోయాయి. గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశాలు ఉండడంతో, కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం కాని పరిస్థితుల్లో నెలన్నర వ్యవధిలోనే ఇది ఏ మేరకు సాధ్యమనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎస్టీ, బీసీ ప్లాన్లు వెలువడినా అమలు కష్టమే? మరోవైపు ఎస్టీ,బీసీ కార్పొరేషన్లు,ఫెడరేషన్లకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైనా.. రెండు నెలల్లోనే గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకుల ద్వారా రుణాల మంజూరు ఏ మేరకు సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది. మండల, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు ఈ ప్రక్రియ జరగాల్సి ఉంది. దీనిని అమలు చేసేందుకు సిబ్బంది కూడా తగిన సంఖ్యలో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది బీసీ కార్పొరేషన్ ద్వారా దాదాపు 42 వేల మందిని, ఫెడరేషన్ల ద్వారా 62 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. -
మెప్మాలో మరో బాగోతం
బినామీల పేరిట బ్యాంకు రుణాలు ఖమ్మం సిటీ: పట్టణ పేరిక నిర్మాలన సంస్థ (మెప్మా)లో అవినీతికి అంతేలేకుండా పోతోంది. బినామీ గ్రూపుల ఏర్పాటు, విద్యార్థుల పేరిట ఉపకార వేతనాల స్వాహా లాంటి బాగోతాలు ఇప్పటికే వెలుగుచూడగా తాజాగా బ్యాంకు రుణాల వ్యవహారం మెప్మా అధికారుల వైఖరికి అద్దం పడుతోంది. అర్బన్ సెల్ఫ్ ఎంప్లాయీమెంట్ పథకం (యూఎస్ఈపీ) ద్వారా 2007 నుంచి రూ. 25 లక్షలకు పైగా రుణాలు పొంది ఇప్పటి వరకూ చెల్లించని 40 మంది జాబితాను బాంకర్లు మెప్మా అధికారులకు అందించారు. దీనిపై మెప్మా అధికారులు నగరంలో శుక్రవారం విచారణ ప్రారంభించారు. పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లారు. అయితే.. ఈ రుణాల్లోనూ అవినీతి చోటుచేసుకుందని తెలుస్తోంది. గ్రూపు సభ్యుల పేరిట సీఓ రిసోర్స పర్సన్లే రుణాలు పొందినట్లు సమాచారం. బ్యాంకర్లతో కుమ్మక్కై ఇలా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. యూఎస్‌ఈపీలో 25 శాతం సబ్బిడీ వర్తిస్తుండడంతో బినామీ రుణాలు పొందేందుకు కమ్యూనిటీ ఆర్గనైజర్లు (సీపీ), రిసోర్స్పర్సన్లు (ఆర్పీ) ప్రణాళికలు రచించారని తెలుస్తోంది. బినా మీ గ్రూపులు ఏర్పాటు చేసి కొంత మంది సభ్యుల పేరుతో స్వయం ఉపాధి పథకం కింద కూడా రుణాలు పొందినట్లు సమచారం. ఈ అవినీతిలో సీవో, ఆర్పీలే ప్రధాన పాత్ర పోషించడం గమనార్హం. వీరికి బ్యాంకు అధికారులు కూడా సహకరించడంతో అవినీతికి అడ్డు లేకుండా పోయిం దని తెలుస్తోంది. విచారణ చేస్తున్నాం వేణుహనోహర్రావు, మెప్మా,పీడీ వ్యక్తిగత రుణాలు పొంది చెల్లించని వారిపై నగరంలో విచారణ చేస్తున్న మాట వాస్తమే. అక్రమార్కులు ఎవరనేది తేలాక వారిపై చర్యలు తీసుకుంటాం. -
రూ.15లక్షలు స్వాహా
సారంగాపూర్ : మహిళల నిరక్షరాస్యత, నిస్సహాయతను ఆసరాగా చేసుకుని రూ.15లక్షలు స్వాహా చేశాడో ఐకేపీ సీఏ.మండలంలోని ఆలూరు గ్రామంలో సోమవారం నిర్వహించిన గ్రామసభలో సీఏ దండు హన్మాండ్లు అక్రమాలు వెలుగుచూశాయి. గ్రామంలోని స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం మంజూరు చేసిన రుణాలను మహిళల సంతకాలు ఫోర్జరీ చేసి బినామీల పేరిట రూ.15లక్షలు దుర్వినియోగం చేశాడు. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో 60 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి ఒకే గ్రామైక్య సంఘం ఉండడంతో ఖాతాల నిర్వహణ భారం, రుణాల చెల్లింపు, బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించడంలో ఆసల్యం జరుగుతోందని, మరో వీవో ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. దీంతో వీవో అధ్యక్షురాలు పెంటల లక్ష్మి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మరో సంఘం ప్రతిపాదన తీసుకొచ్చారు. ఖాతాల నిర్వహణను అధికారులకు వివరించగా అవినీతి జరిగిందని, నిధులు దుర్వినియోగం అయ్యాయని గుర్తించారు. అక్రమాలు బయటపడుతాయనే ఉద్దేశంతో సీఏ దండు హన్మాండ్లు వారం రోజులపాటు కనిపించకుండాపోయాడు. ఈ విషయమై బంధువులు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి అతడిని తీసుకొచ్చారు. ఇటీవల నిధుల దుర్వినియోగంపై సమావేశం ఏర్పాటు చేసి రూ.6లక్షలు దుర్వినియోగం అయినట్లు అధికారులు గుర్తించారు. అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో ఐకేపీ ఏపీఎం నాగజ్యోతి ఆధ్వర్యంలో రిసోర్స్పర్సన్లు ఇంటింటా విచారణ చేపట్టారు. వారం రోజుల విచారణలో మరో రూ.8లక్షల వరకు దుర్వినియోగమైనట్లు గుర్తించిన అధికారులు సోమవారం గ్రామసభలో వివరాలు వెల్లడించారు. వీఓ రుణాల తాలూకు రూ.8,13,900, దీనికి వడ్డీ రూ.2,12,970, స్త్రీనిధి పథకం కింద మహిళలకు చెల్లించే రుణాలు రూ.2,25,410, దీనికి వడ్డీ రూ.1,88,985, స్త్రీనిధి డబ్బులు చెల్లించకపోవడంతో బ్యాంకు వారు విధించిన రూ.లక్ష పెనాల్టీ, రూ.1.37లక్షలు వరి ధాన్యం కొనుగోలు కమీషన్, మరో రూ.10వేల మ్యాచింగ్ గ్రాంటు, రూ.24వేలు బీమా డబ్బులు కాజేసినట్లు స్పష్టం చేశారు. అధికారులు సీఏ హన్మాండ్లును సంజాయిషీ కోరగా.. తనకు ఎలాంటి సంబంధం లేదని, ఏటా ఆడిట్ చేసే అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించడం గమనార్హం. సదరమ్ సర్టిఫికెట్లకు డబ్బులు వసూలు చేశాడని వికలాంగులు ఆరోపించారు. మొత్తంగా రూ.15,23,280 స్వాహా చేశాడని వెల్లడైంది. వీటిని మూడు వారాల్లో చెల్లించాలని ఏపీడీ గజ్జారాం ఆదేశించారు. మొదటి వారం 50శాతం, రెండు వారాల్లో మరో 50శాతం చెల్లించాలని సీఏకు సూచించారు. లేనిపక్షంలో ఆర్‌ఆర్‌యాక్టు కింద క్రిమినల్ కేసు నమోదు చేసి ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు. అనంతరం సీఏ బదులిస్తూ తనపై అనవసరంగా రికవరీ విధించారని, న్యాయపోరాటం చేస్తానని అధికారులకు రాసిచ్చాడు. దీంతో సదరు సీఏను పోలీసులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సీహెచ్.రాజమణి, ఎంపీటీసీ సభ్యురాలు భూలక్ష్మి, ఏపీడీ గజ్జారాం, ఏరియా కోఆర్డినేటర్ రవికుమార్, డీపీఎం ఐబీ లత, ఏపీఎం ఐబీ సునందన్, ఫైనాన్స్ ఏపీఎం సుజాత, ఏపీఎం నాగజ్యోతి, డీఎంజీ శ్రీనివాస్, సమాఖ్య అధ్యక్షురాలు లలిత, సమాఖ్య కార్యదర్శి లత, సీసీలు మల్లేష్, నర్సయ్య, గోపాల్, ఆడిట్ సీఆర్పిలు పద్మ, భూమ, మాజీ సర్పంచ్ జీవన్‌రావు పాల్గొన్నారు. -
పొలాల్లో ఇళ్లు పోయినట్టే
భూ సమీకరణ విధానంపై చంద్రబాబు సమీక్ష రాజధాని ప్రాంత 29 గ్రామాల్లోని పొలాల్లో ఇళ్లుంటే తొలగించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ప్రశాంత వాతావరణం కోసం ఊరికి దూరంగా పొలాల్లో ఇళ్లు కట్టుకున్న రాజధాని ప్రాంత రైతులు ఇక ఆ ఇళ్లపై ఆశలు వదులు కోవాల్సిందే. రాజధాని ప్రాంత 29 గ్రామాల్లోని పొలాల్లో ఎవరైనా ఇళ్లు కట్టుకుని ఉంటే ప్రభుత్వం ఆ ఇళ్లను తొలగించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శని వారం.. రాజధాని నిర్మాణ సలహా కమిటీతో భూ సమీకరణ విధానంపై నిర్వహించిన సమీక్ష నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాజధాని కోసం 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములను సమీకరించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా 29 గ్రామాల్లోని పొలాల్లో నివాసాలుంటే వాటిని తొలగించి, ఇళ్లు కోల్పోయినవారు మరోచోట ఇళ్లు కట్టుకోవడానికి వీలుగా బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. పొలాల్లోని ఇళ్లను తొలగించాలనే నిర్ణయం నేపథ్యంలో పొలాల్లో, రహదారుల పక్కన గల గృహాలతో పాటు ఆయా గ్రామాల్లో ఉన్న మొత్తం ఇళ్లను లెక్కింపజేయనున్నారు. గృహాల స్థాయిని బట్టి వివిధ కేటగిరీలుగా వర్గీకరించనున్నారు. మరోవైపు పంట భూముల్ని నాలుగు రకాలుగా వర్గీకరించి భూముల వారీగా రైతులకు పరిహారం చెల్లించాలని కూడా ముఖ్యమంత్రి సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. పరిహారం ఇలా.. 29 గ్రామాల్లో 51,786 ఎకరాలున్నాయని, ఆ గ్రామాల్లో 1,02,408 మంది జనాభా ఉన్నట్లు తేల్చారు. తొలి దశలో 30 వేల ఎకరాల భూమిని సమీకరించనున్నారు. ఈ విధానంలో సమీకరించే ఎకరం మెట్ట భూమికి బదులుగా 800 గజాల ఇంటి స్థలం, మరో 100 గజాల వాణిజ్య స్థలం ఇవ్వాలన్నది ప్రతిపాదన. అలాగే ఏడాదికి రూ.25 వేల నుంచి 30 వేలు పరిహారం ఇస్తారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోని మాగాణి భూములకైతే ఎకరానికి 1,100 గజాల ఇంటి స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం, ఏడాదికి రూ.50 వేల నుంచి 55 వేల వరకు పరిహారం చెల్లించే ప్రతిపాదనపై చర్చించారు. అలాగే ఎత్తిపోతల పథకాల కింది భూములకు ఎకరానికి 1,100 గజాల ఇంటి స్థలం, 100 గజాల వాణిజ్య స్థలం. అసైన్డ్ భూముల్లో మాగాణి భూములకు ఎకరానికి 800 గజాల ఇంటి స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం ప్రతిపాదించారు. ఇదే భూముల్లో మెట్టకు ఎకరానికి 800 గజాల ఇంటి స్థలం, 100 గజాల వాణిజ్య స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. 29 గ్రామాల్లోని 22,405 మంది రైతులకు చెందిన రుణాల్లో రూ.లక్షన్నర వరకు ఒకేసారి మాఫీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.198 కోట్లు అవసరమని అంచనా. ఈ నెల 15న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆయా అంశాలపై చర్చించి ఆమోదం పొందనున్నారు. 29 గ్రామాల్లోని భూములు, రైతుల వివరాలు.. జనాభా: 1,02,408 స్థలం: 51,786 ఎకరాలు ఎస్సీ జనాభా: 32,153, ఎస్టీ జనాభా: 4,663, ఇతరులు: 65,592 వ్యవసాయం చేస్తున్న రైతులు: 10,656 కూలీల సంఖ్య: 31,634 గృహాల్లో పనిచేసే వారి సంఖ్య: 4,010, ఇతరులు: 11,603 పట్టా భూములు: 37,701 ఎకరాలు అసైన్డ్ భూములు: 1,910 ఎకరాలు దేవాదాయ భూములు: 723 ఎకరాలు అటవీ భూమి: 585 ఎకరాలు పోరంబోకు భూములు: 8,730 ఎకరాలు అర ఎకరంకన్నా తక్కువమంది ఉన్న రైతులు: 4,000 అర ఎకరం నుంచి ఎకరం వరకు ఉన్న రైతులు: 5,200 ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు ఉన్న రైతులు: 5,000 -
మాయా మశ్చీంద్ర
మాట నిలబెట్టుకోని చంద్రబాబు నాది మునగపాక మండలం ఒంపోలు. వ్యవసాయ మదుపుల కోసం రూ.55వేలు రుణం తీసుకున్నాను. ఎన్నికల ముందు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామంటూ చంద్రబాబు ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక కేవలం రూ.50వేలుమాత్రమే రద్దు చేస్తామనడం విచారకరం. అదికూడా ఎప్పటి నుంచి అమలవుతుందో స్పష్టంగా చెప్పలేదు. వడ్డీతో అప్పు బాగా పెరిగిపోయింది. దీనికి తోడు బ్యాంక్‌లు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో పంటల సాగుకు నానా ఇబ్బందులు పడుతున్నాం. - నరాలశెట్టిసూర్యనారాయణ, రైతు రుణమాఫీపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. దాని కోసం కళ్లల్లో వత్తులేసుకుని ఎదురు చూస్తున్న అన్నదాతలకు మళ్లీ నిరాశే ఎదురైంది. రోజుకో ప్రకటనతో కాలం గడిపేస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకు తొలి విడత జాబితాను ఆదివారం విడుదల చేసింది. కానీ దానిలో తమ పేర్లు ఎక్కడున్నాయో అన్నదాతలకు కూడా తెలియకుండా మాయ చేసింది. జిల్లాలో ఎందరికి రుణమాఫీ అయిందో బయటపడకుండా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో జాగ్రత్తపడింది. మొత్తంగా మసిపూసి మారేడుకాయ చేసింది. సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో రెండున్నర లక్షల మంది రైతులకు చెందిన 3.87లక్షల ఖాతాల పరిధిలో పంట, బంగారు రుణాలు కలిపి సుమారు రూ.3,800కోట్ల వరకు ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన లక్షన్నర లోపు రుణాల వరకు చూస్తే కనీసం రూ.2,200 వేల కోట్ల వరకు మాఫీ కావాల్సి ఉంది. వీటిలో పంట రుణాలు దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటాయి. అయితే ప్రస్తుతం 50 వేల లోపుపంట రుణాలు మాఫీ చేస్తామంటున్నారు. దాని ప్రకారం జిల్లాలో 70వేల అకౌంట్ల పరిధిలోని 25వేల మంది రైతులకు రూ.400కోట్ల వరకు మాఫీ అవుతుందని అంచనా. ఈ నేపధ్యంలో ప్రభుత్వం రుణమాఫీ అర్హుల జాబితా ప్రకటిస్తుందని తెలిసినప్పట్నుంచీ రైతులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 6న ఆన్లైన్లో అర్హుల జాబితా పెడతామని సీఎం ప్రకటించినప్పటికీ చెప్పిన సమయానికి విడుదల చేయలేదు. ఆదివారం ఆన్లైన్లో పెట్టామంటున్నప్పటికీ ఏ రైతుకి దానిలో స్పష్టమైన సమాచారం లేదు. ఆధార్, రేషన్, బ్యాంక్ అకౌంట్ నంబర్లలో ఏదో ఓ దానిని ప్రభుత్వం నిర్దేశించిన వెబ్సైట్లో నమోదు చేస్తే రుణమాఫీ గురించి సమాచారం తెలుస్తుందన్నారు. తీరా అవన్నీ చేశాక చూస్తే తొలి విడతలో ఎలాంటి వివరాలు లేవని కనిపిస్తోంది. ఇలా ఏ రైతు చూసుకున్నా ఒకటే సమాధానం వస్తోంది. దీంతో తొలి జాబితాలో తమ పేరు లేదేమోనని రైతులు ఆందోళనపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏ బ్యాంకులో ఎన్ని అకౌంట్లకు, ఎంత మంది రైతులకు రుణమాఫీ అయ్యిందనే వివరాలు ఆన్లైన్లో ఉంచలేదు. అంతేకాదు ఆ వివరాలేవీ బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులకు కూడా వెల్లడించకుండా ప్రభుత్వం కట్టడి చేసింది. దీంతో ఎవరిని అడిగినా మాకే స్పష్టత లేదంటున్నారు. ఎవరికి మాఫీ అయింది ఎవరికి కాలేదనే విషయాలు బహిర్గతమైతే తమ మాయలు, వంచనలు బయటపడతాయని భావించే టీడీపీ ప్రభుత్వం ఈ విధంగా చేసిందని రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. సోమవారం అన్ని బ్యాంకుల వద్దకు వెళ్లి తమ రుణం మాఫీ అయిందోలేదో తెలుసుకోవడానికి సిద్ధమవుతున్నారు. -
దిగమింగి దగా చేశాడు
ఆశాలపల్లి(సంగెం) : ఐకేపీ సీఏ నిర్లక్ష్యంతో గ్రామైక్య సంఘాల మహిళలను రూ. 50 లక్షలు నష్టపోయూరు. 48 సంఘాలకు రాయితీ వడ్డీ రాకుండా సీఏ ఇష్టానుసారంగా వ్యవహరించాడు. ఇలా ఒక్కో సంఘం రూ. లక్ష-1.8 లక్షలు నష్టపోయింది. నష్టాన్ని ఆలస్యంగా గుర్తించిన మహిళలు గురువారం ఆందోళనకు దిగారు. మండలంలోని ఆశాలపల్లిలో రెండు గ్రామైక్య సంఘాల్లో 48 సంఘాలకు చెందిన 580 మంది సభ్యులున్నారు. వీరంతా క్రమం తప్పకుండా పొదుపులు, బ్యాంకు రుణాలకు వడ్డీ చెల్లిస్తున్నారు. కానీ మూడేళ్లలో ఒక్క సంఘానికీ వడ్డీ తిరిగిరాలేదు. ఇదే విషయూన్ని సీఏ బొల్లేబోయిన కుమారస్వామిని అడిగితే దాటవేస్తూ వచ్చాడు. మహిళలు వారింట్లో సమస్య చెప్పుకోగా గత నెల 22న ఏపీఎం ఝాన్సీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గ్రామంలో అధికారులు గురువారం బహిరంగ చర్చ చేపట్టారు. తమ పొదుపులు, రుణ వాయిదాలను బ్యాంకులో చెల్లిస్తానని సీఏ కుమారస్వామి తీసుకుని సొంతానికి వాడుకునేవాడని మహిళలు ఆరోపించారు. అన్ని సంఘాల పుస్తకాలు తన వద్దే పెట్టుకునేవాడని, ఈ విషయం బయటపెట్టొద్దని బెదిరించేవాడని పేర్కొన్నారు. లింకేజీ కింద రూ. లక్ష రుణం మంజూరైతే రూ. వెయ్యిచొప్పున కమీషన్ తీసుకునేవాడని, అభయహస్తం బీమా సొమ్ము రూ. 30 వేలు మంజూరైతే రూ.4 వేల చొప్పున కోత విధించేవాడని ఆరోపించారు. ఆడిట్ కోసం రూ. 150, మొబైల్ బుక్కీపింగ్ ఇతరాల కోసం ఒక్కో సంఘం నుంచి నెలకు రూ.450ల చొప్పున వసూలు చేశాడని తెలిపారు. ఇన్ని వసూళ్లకు పాల్పడి కూడా.. ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ రాయితీని దక్కనీయలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఏపై చర్య తీసుకుని తమకు న్యాయం చేయూలని కోరారు. సీఏ కుమారస్వామి, సీసీ కొమురయ్యపై పీడీకి నివేదిక ఇస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు. సర్పంచ్ గాజే మురళి, మాజీ సర్పంచ్ కిశోర్‌యాదవ్, మాజీ ఎంపీటీసీ సూరయ్య తదితరులు పాల్గొన్నారు. -
బాబు వైఫల్యాలను నిలదీసేందుకే..: వైఎస్ జగన్
* 5న అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు: వైఎస్ జగన్ * 6 నెలలు తిరక్కముందే చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత * రైతుల, డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తానన్న బాబు మాట తప్పారు * ఎన్నికల్లో చంద్రబాబు మాటలు నమ్మి రైతులు నిలువునా మోసపోయారు * బడ్జెట్లో చాలీచాలని కేటాయింపులు చేసి 20 శాతం రుణ మాఫీ అంటున్నారు * దీనిపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రజలు ధర్నా చేస్తున్నారు * రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబుదే పూర్తి బాధ్యత * వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: ఎన్నికలపుడు చేసిన వాగ్దానాలను అమలు చేయడంలో ఘోరంగా విఫల మైన ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీయాలని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారని.. అందువల్లనే ఈ నెల 5న అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద తమ పార్టీ ధర్నాలు చేయబోతోందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ప్రజలు ఈ ధర్నాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని తమ సమస్యలు పరిష్కరించాలని నిలదీయబోతున్నారని.. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వారికి తాము అండగా నిలబ డతామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జగన్ మీడియాతో మాట్లాడారు. ‘‘సాధారణం గా ఏ ప్రభుత్వం పైనైనా ప్రజల్లో వ్యతిరేకత రావాలంటే రెండేళ్లైనా పడుతుంది. అంతకన్నా ముందే ప్రజల్లోకి వెళ్లి ధర్నాలు, ఆందోళనలు అంటే వారు హర్షించరు. కానీ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం పై ఆరు నెలలు తిరక్క ముందే తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ఈ ప్రభుత్వం ఎపుడు పోతుందా అని గ్రామాల్లో ప్రజలు ఎదురు చూస్తున్నారు’’ అని ఆయన ధ్వజమెత్తారు. రైతులపై అపరాధ వడ్డీ భారం పడింది... ‘‘మొన్న ఒంగోలు పార్టీ కార్యకర్తల సమావేశంలో నేను చెప్పింది ఇదే. ఒక ప్రతిపక్షంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలకు తోడుగా ఉండి వారి తరఫున పోరాడాలని కోరాను’’ అని జగన్ తెలిపారు. రైతుల, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని ఆయన తప్పుపట్టారు. బ్యాంకుల రుణాలు కట్టొద్దని చంద్రబాబు ఎన్నికలపుడు చెప్పిన మాటలు నమ్మి రైతులు నిలువునా మోసపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల నుంచి ఇపుడు అపరాధ వడ్డీ కింద 14శాతాన్ని బ్యాంకులు వసూలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రుణాలపై వడ్డీయే రూ. 28 వేల కోట్లు... ‘‘87 వేల కోట్ల రూపాయల రైతు రుణాల మీద ఏడాదికే రూ. 12,800 కోట్ల అపరాధ వడ్డీ అవుతుంది. కానీ ఈ సంవత్సరం బడ్జెట్లో రుణ మాఫీకి చేసిన కేటాయింపులు వడ్డీలకు కూడా సరిపోవు’’ అని జగన్ గుర్తుచేశారు. ‘‘బడ్జెట్లో తగినన్ని కేటాయింపులు చేయకపోవడంతో.. మార్చి నెలాఖరు లోపు అపరాధ వడ్డీయే కాకుం డా మరో రూ. 12,800 కోట్ల వడ్డీ భారం అదనంగా పడుతుంది. ఆ ప్రకారం మొత్తం మీద 25 వేల కోట్ల రూపాయల మేరకు వడ్డీ అవుతుంది. ఇదే చంద్రబాబు మాటలు నమ్మి రుణాలు కట్టని కారణంగా అపరాధ వడ్డీ రూపేణా రూ.14 వేల కోట్లు, రూ. 14 వేల కోట్లు అదనపు వడ్డీ భారం కలిపితే.. అసలు కథ దేవుడెరుగు.. వడ్డీయే రూ. 28 వేల కోట్లు అవుతుంది. కానీ చంద్రబాబనే ఈ పెద్ద మనిషి బడ్జెట్లో చాలీచాలని కేటాయిం పులు చేసి దాన్నే 20 శాతం రుణ మాఫీ కింద జమ చేసినట్లుగా బుకాయిస్తున్నారు. ఇది ప్రజ లను మోసం చేయడం తప్ప మరొకటి కాదు’’ అని చంద్రబాబును తూర్పారబట్టారు. ‘‘ఇలా చేయడం ఎంత వరకు ధర్మమని జిల్లా కలెక్టరేట్ల వద్ద ప్రజలు గట్టిగా నిలదీయబోతున్నారు. వారికి మేము అండగా ఉంటున్నాం’’ అన్నారు. పింఛన్ల కోతకు బడ్జెట్లోనే నిర్ణయం... ‘‘బాబు పింఛన్ల విషయంలోనూ ఇలాగే చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చేసరికి 43,11,686 పిం ఛన్లు ఉన్నాయి. ఒక్కో పింఛనుదారుకు వెయ్యి రూపాయల చొప్పున చెల్లించడానికి అందరికీ నెలకు రూ. 431 కోట్లు అవసరమవుతాయి. ఏడు నెలల పాటు చెల్లించడానికి సుమారు రూ. 3,000 కోట్లు అవసరమవుతాయి. ఇవే పింఛన్లకు రూ. 200 చొప్పున చెల్లించడానికి నెలకు రూ. 130కోట్లు అవసరమవుతాయి. ఐదు నెలల పాటు రూ. 130 కోట్ల చొప్పున చెల్లించడానికి రూ. 750 కోట్లు కావాలి. ఇదివరకు పింఛను, పెరిగిన పింఛను మొత్తం చెల్లించడానికి పన్నెం డు నెలలకు గాను రూ. 3,700 కోట్లు కావాల్సి ఉండగా బడ్జెట్లో కేటాయించింది రూ. 1,338 కోట్లు మాత్రమే. అంటే బడ్జెట్ కేటాయింపుల రోజునే పింఛన్లను అడ్డగోలుగా కత్తిరించాలని చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నారు’’ అని జగన్ ఎండగట్టారు. ఉత్తరాంధ్రలో హుద్‌హుద్ తుపాను బాధితుల పరిహారం కోసం కూడా తుపాను ప్రభావిత జిల్లాల్లో ధర్నాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబుదే బాధ్యత రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు చంద్రబాబుదే బాధ్యత అని ప్రతిపక్ష నేత పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో ఇప్పటికి 86 మం ది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు పత్రికల్లో చదివాం. పంటలకు పంటల బీమా పథకం అందక రైతులు అప్పుల్లో కూరుకుపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. దీనికి పూర్తి బాధ్యత చంద్రబాబుదే’’ అని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలోనూ రైతు సమస్యలపై పోరాడుతామని, తమ పార్టీ ఎంపీ పి.శ్రీనివాసరెడ్డి కార్యనిర్వాహక అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్నాక రైతు సమస్యలపై చురుగ్గా పని చేస్తున్నారని, రైతులను ఆదుకోవాలని గవర్నర్‌ను తొలుత వినతిపత్రం సమర్పించిన పార్టీ తమదేనని జగన్ చెప్పారు. రైతులకు న్యాయం జరిగేదాకా తమ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుందని ఉద్ఘాటించారు. మీడియాతో మాట్లాడుతున్నపుడు ఆయన వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. -
ఎరువు.. ‘ధర’వు..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ‘మూలిగె నక్కపై తాటికాయ పడ్డ’ చందంగా.. రైతున్నలకు ప్రభుత్వాలు షాక్‌ల మీద షాక్లనిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కనికరించని ప్రకృతి.. ఆదుకోని కరెంటుతో అన్నదాతలు కష్టాల సాగును నెట్టుకొస్తున్నా.. చివరికి వారికి మిగిలేది అప్పులే. మద్దతు ధర లేక.. మార్కెట్లలో దళారుల దోపిడీతో ఏటా నష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే ఖరీఫ్‌లో పూర్తిగా నష్టపోయిన రైతులకు రబీ సాగు మరింత భారం కానుంది. తాజాగా డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పది శాతం పెరగడంతో ఆ భారం కోట్లకు చేరింది. ఇప్పటివరకు 50 కిలోల డీఏపీ బస్తా ధర రూ.1,192 ఉండగా.. పెంచిన ధరతో రూ.1,249కి చేరింది. కాంప్లెక్స్ పాత ధర రూ.919 ఉండగా.. కొత్త ధరతో రూ.955కు విక్రయించనున్నారు. పలు కంపెనీల ఆధారంగా ధరల్లో హెచ్చుతగ్గుతో సరాసరి రూ.50 నుంచి రూ.60 వరకు పెరగనున్నాయి. ఈ ఏడాది జిల్లాలో వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం.. ఖరీఫ్ రబీ సాగు కలిపి 20,445 మెట్రిక్ టన్నుల డీఏపీ, 15,214 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ అవసరం పడుతుంది. డీఏపీ ఎరువుకు రూ.48 కోట్లు 25 లక్షల 18 వేలు కాగా, కాంప్లెక్స్‌కు రూ.33 కోట్ల 59 లక్షల 66 వేలు ఇది వరకు చెల్లించారు. పెంచిన ధరతో డీఏపీకి రూ.50 కోట్ల 62 లక్షల 18 వేలు, కాంప్లెక్స్‌కు రూ.34 కోట్ల 59 లక్షల 66 వేలు చెల్లించాలి. దీంతో రైతులపై ఏటా రూ.4 కోట్ల వరకు భారం పడనుంది. ఈ ధరల పెంపుతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కంపెనీలు ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలను పెంచుతున్నా.. తాము పండించిన ధాన్యానికి మాత్రం ప్రభుత్వం మద్దతు ధరలు కల్పించడం లేదం టూ విమర్శిస్తున్నారు. ప్రభుత్వాలు ధరల నియంత్రణలో విఫలమవడంతోనే ఏటా సాగు భారం పెరుగుతోందని దుయ్యబడుతున్నారు. రబీలో 90,100 వేల హెక్టార్ల సాగు లక్ష్యం.. వచ్చే రబీలో మొత్తం 90,100 వేల హెక్టార్లలో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వే శారు. వరి 25 వేల హెకా ర్లు, జొన్న 22 వేల హెక్టార్లు, మొక్కజొన్న 6,500, శెనగ 36 వేలు, పొద్దు తిరుగుడు 5,800, నువ్వులు 5,200, వేరుశనగ 5,500, పెసర 3,100, గోధుమ 5,500 హెక్టార్లలో సాగవుతాయని అంచనా వేశారు. ఈసారి కరువు నేపథ్యంలో అంత మేరకు సాగయ్యే పరిస్థితులు కనిపించడంలేదు. ఇప్పటికే ఖరీఫ్‌లో నిం డా మునగడం.. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం.. మద్దతు ధర దక్కకపోవడం.. వెరసి సాగుకు వెళ్లేందుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ సీజన్‌కు ప్రాజెక్టుల నుంచి కూడా నీరు ఇవ్వని పరిస్థితి ఉంది. -
ప్రహసనంగా రుణమాఫీ
వీఆర్వోల చేతుల్లోనే జాబితాలు నెల్లూరు(అగ్రికల్చర్): రుణమాఫీ వ్యవహారం ప్రహసనంగా మారింది. పాలకుల రోజుకోమాట.. పూటకో మెలికతో అన్నదాతలు గందరగోళానికి గురవుతున్నారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వడం లేదు. ఈ నెల 10వ తేదీ నాటికి జాబితాలను పరిశీలించి, 15వ తేదీకల్లా అర్హుల జాబితా ప్రకటించి రైతుల ఖాతాల్లో 20 శాతం నగదును జమ చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. ప్రభుత్వం ఆదిశగా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కన్పించడం లేదు. బ్యాంకులు పంపిన ఖాతాల వివరాలు సరిగా లేవని ముప్పుతిప్పలు పెడుతోంది. జాబితాల పరిశీలన అనంతరం, జన్మభూమి కమిటీల ఆమోదం అంటూ మాట మార్చుతూ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన చివరి గడువు గురువారంతో ముగిసింది. జాబితాలు తమకు అందలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నత అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వీఆర్వోల చేతుల్లోనే పరిశీలనా జాబితాలు ఉన్నట్లు సమాచారం. ఎక్కువ ఖాతాల విచారణ చేయాల్సి రావడంతో జాప్యం జరుగుతున్నదని అధికారులు పేర్కొంటున్నారు. మూడుసార్లు తీసుకున్నారు రైతుల రుణమాఫీ సంబంధించిన వివరాల సేకరణ ప్రహసనంగా మారింది. జిల్లాలో ఎంతమంది పేర్లు అర్హుల జాబితాలో ఉన్నాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ కోసమంటూ ఇప్పటివరకు మూడు దఫాలుగా తీసుకున్న పత్రాలు బుట్టదాఖలేనని పలువురు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ ప్రక్రియను జాప్యం చేసేందుకే ప్రభుత్వం ఎన్నో రకాల షరతులు, లింకులు పెడుతుందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.ఈ ఏడాది మార్చి 31 వరకు జిల్లాలో 5,67,158 మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలను తీసుకున్నారు. 4,93,906 మంది రైతులు మాత్రమే రుణమాఫీకి అర్హులని బ్యాంకు అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. గత ఏడాది రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులు తీసుకున్న రూ. 3,093.02 కోట్లు పంట రుణాలు రద్దవుతాయని ఆశించారు. బంగారం తనఖా పెట్టి 2,20,625 మంది రైతులు రూ.921 కోట్లు బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకున్నారు. బ్యాంకు అధికారులు పంపిన జాబితాలు సరిగా లేవని, వాటిని పరిశీలించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని రెవెన్యూ అధికారులకు పంపించారు. పరిశీలనకు పంపిన జాబితాలో 3.40 లక్షల మంది పేర్లు మాత్రమే ఉండటంతో మిగిలిన 1.5 లక్షల మంది రుణమాఫీకి అర్హులా, కాదా అనేది తేలాల్చి ఉంది. అంతా గందరగోళం... రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన విడుదల చేయకపోవడంతో అందరిలో గందరగోళం నెలకొంది. ఈ నెల 8న తహశీల్దార్ కార్యాలయాలకు పంపిన జాబితా అర్హులదో.. అనర్హులదో తెలియక లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు. తొలుత 4,93,906 మంది అర్హులుగా గుర్తించిన ప్రభుత్వం 3.4 లక్షల మంది పేర్లు మాత్రమే పరిశీలనకు తహశీల్దార్ కార్యాలయాలకు పంపడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 21వ తేదీకల్లా 20 శాతం జమ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఎవరికి జమ చేస్తుందో అర్థంకాని అయోమయ స్థితి నెలకొంది. పత్రాలు సమర్పించేందుకు నానా పాట్లు... రుణమాఫీకి సంబంధించి పలుమార్లు వివిధ పత్రాలను అందించేందుకు నానా పాట్లు పడినట్లు రైతులు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా పలు రుణాలు పొందిన 4 లక్షల మందికి పైగా రైతులు బ్యాంకర్లకు, వీఆర్వోలకు ఇప్పటివరకు మూడుసార్లు పత్రాలు అందించారు. తొలిసారి బ్యాంకర్లకు 34 అంశాలకు సంబంధించి పలు పత్రాలు అందించగా, జాబితా వచ్చిన తర్వాత ఒకసారి, జాబితాలో నంబర్లు తీసుకున్న తర్వాత రెండోసారి వీఆర్వోలకు ఆధార్, ఓటరు కార్డులు ఇద్దరివి, రేషన్‌కార్డు, రుణ రసీదు కాపీలు అందజేశారు. వీటికి సంబంధించి పనులు మానుకొని మరీ కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగడానికి..జెరాక్స్‌లకు..చార్జీలతో కలిపి లెక్కేసుకుంటే ఒక్కొక్కరికీ రూ.500 పైగానే ఖర్చయ్యాయని చెబుతున్నారు. స్పష్టత కరువు * జిల్లాలో ఎంతమంది రైతులకు రుణమాఫీ అవుతుంది? తొలిసారిగా అందించిన జాబితాలోని 4,93,906 మందికా? ఇటీవల తహశీల్దార్ కార్యాలయాలకు పంపిన 3.4 లక్షల మందికా అనేది స్పష్టత లేదు. * తహశీల్దార్ కార్యాలయానికి పంపిన 3.4లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తారనుకుంటే మిగిలిన 1,53,906 మంది రైతుల పరిస్థితి ఏమిటి? * రెండో జాబితా వస్తుందని కొంతమంది తహశీల్దార్లు, వీఆర్వోలు, బ్యాంకర్లు చెబుతున్నారని రైతులు పేర్కొంటున్నారు. నిజంగా రెండో జాబితా ఉంటుందా? ఉంటే ఎప్పుడు ప్రకటిస్తారు? * రైతు రుణమాఫీకి, డ్వాక్రా రుణమాఫీకి లింకు పెడతారా? జన్మభూమి కమిటీలు నిర్ణయించిన టీడీపీ మద్దతుదార్లకే రుణమాఫీ ఉంటుందా? * జాబితా పరిశీలనే పూర్తికాకుంటే 21న రైతు రుణమాఫీ లబ్ధిదారుల ఖాతాలోకి 20 శాతం జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. జాబితాపై స్పష్టత లేనప్పుడు ఏ ఖాతాకు జమ చేస్తారు. -
పౌల్ట్రీకి ప్రాణం
సిద్దిపేట అర్బన్: పౌల్ట్రీరంగంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మెతుకుసీమది రెండోస్థానం. రంగారెడ్డి జిల్లా తర్వాత కోళ్ల ఫారాలు, ఉత్పత్తులు ఎక్కువగా ఉన్న జిల్లా. గడచిన పదేళ్లలో పౌల్ట్రీ జిల్లాలో బాగా అభివృద్ధి చెందింది. సంవత్సరానికి రూ.1,116 కోట్ల వరకు పౌల్ట్రీ వ్యాపారం సాగుతోంది. జిల్లాలో 80 లక్షల కోళ్ల పెంపకం సామర్థ్యం కలిగిన బాయిలర్ ఫారాలు 2 వేల వరకు ఉన్నాయి. ఇక 70 లక్షల సామర్థ్యం కలిగిన లేయర్ ఫారాలు 70, 5 లక్షల కోళ్ల పెంపకం సామర్థ్యం కలిగిన బ్రీడర్ పౌల్ట్రీ ఫారాలు జిల్లాలోని వివిధ చోట్ల ఉన్నాయి. పౌల్ట్రీరంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. నిర్వహణ ఖర్చులతో కుదేలు ఒకప్పుడు కాసులు కురిపించిన పౌల్ట్రీ రంగం రానురాను సంక్షోభంలో కూరుకుపోయింది. కోళ్ల ఫారాల నిర్వహణ ఖర్చులు భారంగా మారడంతో పాటు విద్యుత్ ఛార్జీలు, తరచూ దాణా ధరల పెరుగుదల వంటివి ఈ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో పరిశ్రమకు వ్యవసాయ హోదా కల్పించాలని కొన్నేళ్లుగా పౌల్ట్రీ రంగ ప్రముఖులు, రైతులు, సమాఖ్య ప్రతినిధులు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్రం ఏర్పడ్డాక పౌల్ట్రీ సమాఖ్య ప్రతినిధులంతా మరోమారు సీఎం కేసీఆర్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. సానుకూలంగా స్పందించిన కేసీఆర్ పౌల్ట్రీని గట్టెక్కించేందుకు ఈ పరిశ్రమకు వ్యవసాయ హోదా కల్పించాలని నిర్ణయించారు. అంతేకాకుండా తన తొలి బడ్జెట్లోనే నిధులు సైతం కేటాయించారు. పౌల్ట్రీరంగం ఎదుర్కొన్న సమస్యలు కోళ్ల దాణాలో వినియోగించే మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, సోయాబీన్, చేపల మిశ్రమం వంటి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. దాణాను ప్రభుత్వరంగ సంస్థల నుంచి కాకుండా మధ్యవర్తుల నుంచి కొనుగోలు చేయాల్సి రావడంతో వారు కొన్నిసార్లు కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచేశారు. దీంతో కోళ్ల ఫారాల రైతులపై అదనపు భారం పడింది. సాధారణంగా కోళ్ల ఫారాలకు విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే మన రాష్ట్రంలో విద్యుత్ శాఖ కోళ్ల ఫారాలను మూడో విభాగం కింద చేర్చి యూనిట్‌కు రూ. 6.08 ఛార్జీలు వసూలు చేస్తోంది. మన పొరుగున ఉన్న మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం పౌల్ట్రీ రంగానికి యూనిట్‌కు రూ. 2 చొప్పునే చెల్లించే వెసులుబాటు కల్పించడంతో పాటు కోళ్ల ఫారాల నిర్మాణానికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తోంది. ఈ విధంగా మనదగ్గర లేకపోవడంతో నిర్వహణ వ్యయం పౌల్ట్రీ నిర్వాహకులకు భారంగా మారుతోంది. వ్యవసాయ హోదాతో కలిగే లాభాలు ప్రభుత్వం ప్రస్తుతం కోళ్ల పరిశ్రమకు వ్యవసాయ హోదా ఇవ్వడంతో చాలా వరకు కష్టాలు తొలిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో సులభంగా రుణాలు పొందే వెసులుబాటు కలుగుతుంది. విద్యుత్ ఛార్జీలు కూడా సగానికి సగం తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం యూనిట్ కరెంటుకు రూ. 6.08 చెల్లిస్తున్న పౌల్ట్రీ రైతులు, ఇక నుంచి రూ.3 చెల్లిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. పభుత్వ రంగ సంస్థల నుంచే దాణాలో వినియోగించే వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే అవకాశంతో పాటు సబ్సిడీలు పొందే వీలుంటుంది. నిర్వహణ భారం తగ్గడం వల్ల ఫారాలను కాలుష్యరహితంగా తీర్చిదిద్దవచ్చు. దీంతో కోళ్ల ఫారాల సమీపంలో నివసించే వారికి అనారోగ్య సమస్యలు, దుర్వాసన వంటి అసౌకర్యాలూ తొలగిపోతాయి. వ్యవసాయ హోదా వల్ల ఔత్సాహికులు ఫారాల ఏర్పాటుకు ముందుకు వచ్చి పౌల్ట్రీ వృద్ధికి దోహదపడడంతో పాటు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కూడా మెరుగవుతుంది. జిల్లా ఇదీ పరిస్థితి జిల్లాలో కోళ్ల పరిశ్రమకు మంచి ఆదరణ ఉండడంతో పాటు రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచింది. సిద్దిపేట, రామాయంపేట, గజ్వేల్, నర్సాపూర్ నియోజకవర్గాలలో ఎక్కువ సంఖ్యలో కోళ్ల ఫారాలు వెలిశాయి. కేవలం బ్రూడర్ కోళ్ల ఫారాలు సిద్దిపేటలో మాత్రమే ఉన్నాయి. మిగితా కొన్ని చోట్ల లేయర్స్ ఫారాలు ఉండగా, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో బాయిలర్స్ ఫారాలను రైతులు నిర్వహిస్తున్నారు. ఇతర జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాలకూ జిల్లా నుంచి కోళ్లు, గుడ్లు ఎగుమతి చేస్తున్నారు. తెలంగాణ ఇతర జిల్లాలకు సిద్దిపేట నుంచి పిల్లలను తరలిస్తున్నారు. కోళ్ల పరిశ్రమకు వ్యవసాయ హోదా కల్పించడం పట్ల అందులో పని చేసే కూలీలు కూడా తమకు వేతనాలు పెరిగే అవకాశం ఉంది. -
‘అప్పు’ కావాలె!
రుణాల కోసం రైతుల పడిగాపులు వరంగల్ : ఖరీఫ్ సీజన్ రైతులకు కన్నీటిని మిగిల్చింది. పెట్టుబడికి డబ్బులు లేక.. బ్యాంకుల రుణాలు అందక.. వర్షాభావం.. కరెంటు కోతలతో రైతులు సతమతం అయ్యూరు. చాలా వరకు సాగు విస్తీర్ణం తగ్గింది. రైతులు ప్రైవేటు వారి వద్ద రుణాలు తెచ్చి సాగు చేశారు. దిగుబడి రాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యూరుు. ఇంతలోనే రబీ సీజన్ ముంచుకొచ్చింది. విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేయడానికి రైతులు సిద్ధం అవుతున్నారు. డబ్బులు లేకపోవడంతో కులు ఇచ్చే రుణాల కోసం వేరుు కళ్లతో ఎదురుచూస్తున్నారు. రబీలో సాగు కోసం అప్పులు తేవడం రైతులకు తలకు మించిన భారమవుతోంది. ప్రస్తుతం బ్యాంకర్ల మీదనే ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 1,92,632 హెక్టార్లు ఉండగా.. జిల్లా గత రబీతో పోల్చుకుని ఈ రబీలో 1,86,025 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇప్పటి వరకు కేవలం 24 శాతం మాత్రమే పంటలు సాగయ్యూరుు. ప్రధానంగా వర్షాభావ పరిస్థితులే కారణం. బావులు, బోర్ల వద్ద రైతులు సాగు చేస్తున్నారు. ఈ ఏడాదైనా అందేనా? ఈ ఏడాది 2014-15 రుణ ప్రణాళికలో రూ.2,100 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఖరీఫ్‌లో రూ.1,400 కోట్లు రుణాలు ఇవ్వాలని భావించారు. కొత్త ప్రభుత్వం రావడం.. రుణమాఫీ చేస్తామని ప్రకటిం చడంతో ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. రుణాలు అందించేందుకు బ్యాంకర్లు కూడా వెనుకంజ వేశారు. రూ.లక్షలోపు రుణాన్ని మాఫీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన హామీ అమలుకు ఒక సీజన్ ముగిసింది. ఇప్పుడు రబీ పెట్టుబడి కోసం రైతులు అవస్థల పాలవుతున్నారు. ఈ రబీలో అధికారులు రూ.700 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ పరుగులు తీస్తున్నారు. ఖరీఫ్‌లోనైనా రుణాలు అందలేదు. ఈ రబీలోనైనా రుణాలు ఇస్తారా లేదా అని రైతులు ఆశలో ఎదురుచూస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణ మంజూరుపై ప్రత్యేక శ్రద్ధ వహించి బ్యాం కర్లపై ఒత్తిడి తెస్తోంది. జిల్లా ఉన్నతాధికారులను కూడా బ్యాంకర్లతో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు రుణాలపై ఆశలు పెరుగుతున్నారుు. రూ.472 కోట్లు విడుదల ప్రభుత్వం గత నెలాఖరులో రుణమాఫీకి సంబంధించి జిల్లాకు రూ.472 కోట్లు విడుదలయ్యాయి. జిల్లాలో రూ.లక్షలోపు రుణమాఫీ కింద రూ.1,925 కోట్ల మేరకు ఉన్నట్లు లీడ్‌బ్యాంక్ అధికారులు తెలిపారు. 4 లక్షల మందికి లబ్ధి చేరుకున్నట్లు తెలిపారు. ఖరీఫ్‌లో అప్పోసప్పో తెచ్చి సాగు చేసినప్పటికీ రబీలోనైనా ఆదుకోవాలని కోరుతున్నారు. రబీ సీజన్లో 1.80లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంట లు సాగు చేస్తారనే అంచనాతో వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. రబీ రుణ లక్ష్యం రూ.700 కోట్లు : లీడ్ బ్యాంక్ మేనేజర్ సాయిప్రసాద్ రబీలో రుణాల లక్ష్యం రూ.700కోట్లుగా ఉన్నట్లు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సాయిప్రసాద్ తెలిపారు. రైతులకు పంట రుణాలందించి ఆదుకునేందుకు కృషి చేస్తున్నాం. రుణమాఫీ వల్ల ఖరీఫ్‌లో ఇబ్బందులు ఎదురైన మాట వాస్తమే. -
రుణమాఫీకి వివరాల సేకరణ
రాయనపాడు(విజయవాడ రూరల్): బ్యాంకుల్లో బకాయిలు చెల్లించని రైతుల వివరాలు వీఆర్ఓలు సేకరిస్తున్నారు. రాయనపాడులో వీఆర్ఓ ప్రసాద్ గ్రామ రైతు శివాజీ నుంచి ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల సమాచారాన్ని తెలుసుకున్నారు. విజయవాడరూరల్ మండల వీఆర్ఓలు గ్రామాల్లో వ్యవసాయ రుణాల బకాయిలున్న వారి వివరాలు మంగళవారం సాయంత్రంలోపు ప్రభుత్వానికి పంపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మండలంలోని ప్రతి వీఆర్ఓ వ్యవసాయ రుణాలు తీసుకున్న వారి వివరాలు కంప్యూటర్లో నమోదు చేస్తున్నారు. కొత్తూరులో 171 మంది, తాడేపల్లిలో 490, వేమవరంలో 18, షాబాదులో 92, పైడూరుపాడులో 239, రాయనపాడులో 254, గొల్లపూడిలో 1922, జక్కంపూడిలో 55, అంబాపురంలో 82, పి.నైనవరం లో 164, పాతపాడులో 340, కేవీ కండ్రికలో 325, నున్నలో 2894, రామవరప్పాడులో 1304, ప్రసాదంపాడులో 814, ఎనికేపాడు లో 911, నిడమానూరులో 2183, దొనేత్కూరులో 15, గూడవల్లిలో 462 వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. -
టీడీపీ కమిటీల ద్వారా దోపిడీ
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పొదలకూరు : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ కమిటీలను నియమించి కార్యకర్తలను దోచుకు తినమని ప్రోత్సహిస్తోందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. పొదలకూరు ఆర్అండ్బీ అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల స్థాయిలో పింఛన్లు, బ్యాంకురుణాలు, ఇతర ప్రభుత్వ పరమైన పథకాలు కావాలంటే టీడీపీ కార్యకర్తలతో నియమించిన కమిటీల వద్దకే వెళ్లాలన్నారు. మండలస్థాయి అధికారులు సైతం కమిటీ సభ్యుల కనుసన్నల్లో ఉండాలంటూ మౌలిక ఆదేశాలు అందాయన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు నామమాత్రంగా మిగిలిపోయారన్నారు. ఇంత దౌర్భాగ్యమైన పాలనను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. పింఛను కావాలంటే వృద్ధుల వద్ద కొందరు కమిటీ సభ్యులు రూ.5 వేలు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చేసిన ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమం జిల్లాలో విజయవంతమైందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదుమండలాల్లో కార్యకర్తలు, నాయకులు ధర్నా కార్యక్రమంలో పాల్గొని రైతుల పక్షాన నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పింఛన్ రూ.1000 పెంచడం మంచిపరిణామమైనప్పటికీ అర్హులను పక్కన పెట్టడం దారుణమన్నారు. పింఛను రాని వృద్ధులు కొందరు ఆవేదనతో మృతిచెందుతున్నారని తెలిపారు. టీడీపీ పాలనలో భవిష్యత్‌లో ధనవంతుడు, దరిద్రుడు రెండే వర్గాలు ఉంటాయన్నారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు ఉండరన్నారు. పక్కాఇళ్లు, మరుగుదొడ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం సైతం ఉచితంగా ఇసుకను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ పేదల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, తోడేరు, విరువూరు ఎంపీటీసీ సభ్యులు ఏనుగు శశిధర్‌రెడ్డి, కొల్లి రాజగోపాల్‌రెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. -
స్వయం ఉపాధి సున్నా...
ఖమ్మం హవేలి : జిల్లాలో నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు 2013 - 14 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ పైసా సబ్సిడీ రాలేదు. కార్పొరేషన్ల లక్ష్యం ‘0’ వద్దే నిలిచిపోయింది. 2014 - 15 ఆర్థిక సంవత్సరం సైతం ముగిసిపోయే దశకు చేరుకుంది. గత ఏడాది దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూలకు వెళ్లిన వారికే ఇప్పటి వరకు సబ్సిడీలు విడుదల కాకపోవడంతో బ్యాంకర్లు ఈ ఆర్థిక సంవత్సరం రుణాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 2014 - 15 ఏడాదికి స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన ఊసే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో ఇంటర్వ్యూలకు హాజరైన వారు తమకు ప్రభుత్వ సబ్సిడీ, బ్యాంకు రుణాలు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అయినా 2014-15కు సంబంధించి స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి ఊసే లేకుండా పోయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇంటర్వ్యూలకు ఎంపికైనవారు తమకు ప్రభుత్వ సబ్సిడీ, బ్యాంకు రుణాలు రావేమోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పథకం అమలులో భాగంగా లక్ష్యం ఇప్పటివరకు నిర్ణయించకపోగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పథకాన్ని ప్రస్తుత కొత్త ప్రభుత్వం రద్దు చేస్తుందేమోనని వాపోతున్నారు. ఇక పోలవరం ముంపు కింద సీమాంధ్రలో కలిసిన మండలాల నిరుద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.4కోట్ల వరకు నిరుద్యోగులకు సబ్సిడీ నిలిచిపోయింది. యూనిట్ల గ్రౌండింగ్ అయ్యే అవకాశం లేకుండా పోయింది. సంవత్సరమంతా నిర్లక్ష్యం.. చివర్లో నిరుద్యోగులపై ఒత్తిడి బీసీ కార్పొరేషన్‌కు సంబంధించి 2013-14 ఆర్ధిక సంవత్సరానికి జిల్లాలోని 46మండలాల్లో 2,457 యూనిట్లకు రుణాలిచ్చేలా లక్ష్యం నిర్దేశించింది. ఇందులో రూ.20వేల యూనిట్లు 544, రూ.25వేల యూనిట్లు 927, రూ.30వేల యూనిట్లు 895, రూ.50వేల యూనిట్లు 57, రూ.1లక్ష విలువైన యూనిట్లు 34 ఇవ్వాల్సి ఉంది. అయితే మొత్తం 2,457 యూనిట్లకు గాను వీటిలో 801 యూనిట్లు మాత్రమే మంజూరు అయ్యాయి. అదేవిధంగా జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, సత్తుపల్లి, ఇల్లెందు మున్సిపాలిటీల పరిధిలో 530 యూనిట్ల లక్ష్యం నిర్ధేశించబడింది. ఇందులో రూ.20వేల యూనిట్లు 149, రూ.25వేల యూనిట్లు 184, రూ.30వేల యూనిట్లు 184, రూ.50వేల యూనిట్లు 5, రూ.1లక్ష విలువైన యూనిట్లు 8 వ్వాల్సి ఉంది. కాగా వీటిలో 150 యూనిట్లు మాత్రమే మంజూరు అయ్యాయి. సంవత్సరం మొత్తం వృథా చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 2013 అక్టోబరులో నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోగా 2014 ఫిబ్రవరి వరకు అధికారులు వారిని పిలువలేదు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీల్లో దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు నెలల తరబడి ఆలస్యం జరిగింది. అప్పటివరకు నిర్లక్ష్యం చేసి తీరా సార్వత్రిక ఎన్నికల కోడ్‌కు 10రోజుల ముందు పిలిచి హడావుడి చేయడంతో నిరుద్యోగులు అనేక అవస్థలు పడ్డారు. చివరకు బ్యాంకర్లు కాన్సెంట్లు ఇవ్వడంలో విముఖత చూపడంతో లక్ష్యానికి సుదూరంలో నిలవాల్సిన దుస్థితి ఏర్పడింది. మొత్తం లక్ష్యంలో మూడోవంతు మందికి కూడా రుణాలు మంజూరు కాకపోవడం ఇందుకు నిదర్శనం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పరిశ్రమలు, సేవలు, వ్యాపారాలకు సంబంధించి జిల్లాలోని అన్ని మండలాల్లో మొత్తం 1323 మంది నిరుద్యోగులకు 763 యూనిట్లు ఇచ్చేలా లక్ష్యం నిర్ధేశించగా 660 మందికి 652 యూనిట్లు మంజూరు అయ్యాయి. అదేవిధంగా మున్సిపాలిటీల పరిధిలో 2302 మందికి 1292 యూనిట్లు ఇచ్చేలా లక్ష్యం ఉండగా 771 మందికి 763 యూనిట్లు మంజూరు అయ్యాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రుణాలు మంజూరైన నిరుద్యోగులకు సంబంధించి వారి బ్యాంకు ఖాతాల వివరాల ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఎన్నికల అనంతరం లబ్థిదారుల ఖాతాల వివరాలను ఆన్లైన్ చేసి పంపించారు. ఎన్నికలు పూర్తి అయి కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 5నెలలు అయినప్పటికీ 2013-14కు సంబంధించి సబ్సిడీ విడుదల కాలేదు. దీంతో ఒక్క యూనిట్ కూడా గ్రౌండ్ అయ్యే పరిస్థితి లేదు. సబ్సిడీ కోసం నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇక 2014-15 సంవత్సరానికి పథకానికి సంబంధించి లక్ష్య సాధన ఊసే లేకుండా పోయింది. కొత్త రాష్ట్రం వచ్చిన తరువాత వచ్చిన కొత్త ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టే ఆలోచన చేసినప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో ఎంపికైన తమకు సబ్సిడీ మంజూరు చేసి స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పేలా చేయూతనివ్వాలని కోరుతున్నారు. -
తప్పు వారిది.. శిక్ష మాకా..!
* బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదంటున్న డ్వాక్రా మహిళలు * సంఘాల నుంచి తప్పుకుంటామని హెచ్చరికలు * తామేమీ చేయలేమంటున్న బ్యాంకర్లు జమ్మలమడుగు: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో పూర్తి స్థాయిలో చెల్లించాం.. ప్రతి నెలా పొదుపు కూడా కట్టేసుకుంటున్నాం.. తిరిగి తమకు రుణాలు ఇవ్వాలని అడిగితే బ్యాంకర్లు పట్టించుకోవడం లేదు.. రుణాలను కట్టని వారిని చూపిస్తూ వారితో కట్టిస్తేరుణాలు ఇస్తామంటున్నారని.. ఇదేమి న్యాయమని డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారు. సోమవారం స్థానిక మెప్మా కార్యాలయంలో మహిళ సంఘాల సర్వ సభ్య సమావేశాన్ని మున్సిపల్ చైర్పర్సన్ తాతిరెడ్డి తులసి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రుణాలు ఇవ్వక బ్యాంకుల చుట్టూ తమను తిప్పించుకుంటున్నారన్నారు. శ్రీనిధి నుంచి కూడా డబ్బులు తీసుకోనీయడం లేదన్నారు. రుణాలు ఏడాది దాటుతున్నా తమను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఇలాగైతే సంఘాలనుంచి తాము తప్పుకుంటామని హెచ్చరించారు. మెప్మా జిల్లా స్పెషలిస్ట్ రమణ మాట్లాడుతూ సక్రమంగా రుణాలు చెల్లించిన వారికి బ్యాంకర్లు సహకరించాలన్నారు. సక్రమంగా చెల్లించని వారిని సక్రమంగా చెల్లించేవారిని ఒకేవిధంగా చూడటం సరైంది కాదన్నారు. మానవతాదృక్పధంతో ఆదుకోవాలి... సక్రమంగా రుణాలు చెల్లించిన వారికి మానవతాదృక్పధంతో తిరిగి రుణాలు ఇవ్వలని చైర్పర్సన్ తాతిరెడ్డితులసి కోరారు. సమావేశంలో శ్రీనిధి ఏరియా కోఆర్డినేటర్ శశిధర్‌రెడ్డి, మెప్మా పీఆర్పీ భవాని పాల్గొన్నారు. -
గంగ ఉన్నా.. రుణాల బెంగ
ప్రారంభమైన రబీ.. ఇంతవరకు అందని బ్యాంక్ రుణాలు తూర్పు మండలాల్లో పంటల సాగు ప్రశ్నార్థకమే శ్రీకాళహస్తి: జిల్లాలోని తూర్పుమండలాల్లో కరువు ఛాయలు కనిపించడంలేదు. ఓ పక్క తెలుగుగంగ.. మరో పక్క స్వర్ణముఖి.. ఎంతోకొంత భూగర్భజలాలు ఉండడంతో రైతులు రబీ సాగుకు రెడీ అయిపోయారు. దుక్కులు దున్ని.. నార్లు పోసేందుకు సిద్ధమయ్యారు. గంగ ఉంటే బెంగ ఎందుకు? తెలుగంగ నీరు శ్రీకాళహస్తితోపాటు సత్యవేడు ని యోజకవర్గాలకు సాగునీటినందిస్తోంది. మూడు రో జుల క్రితం గంగ నీరు విడుదల కావడంతో శ్రీకాళహ స్తి, తొట్టంబేడు, కేవీబీపురం, వరదయ్యపాళెం, సత్యవేడు మండలాల్లోని 150 గ్రామాల ప్రజలు రబీ సా గుకు సమాయత్తమయ్యారు. 6.25 లక్షల ఎకరాల్లో సాగుచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు దుక్కులు దున్ని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి నార్లుపోసేందుకు ఉరకలు వేస్తున్నారు. పెట్టుబడే ప్రధాన సమస్య శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో మొత్తం 11 మండలాలున్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని రైతు లు సింగిల్‌విండోలు, బ్యాంకుల్లో ఇప్పటికే చాలా అప్పులు చేశారు. గత ఖరీఫ్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పంట దిగుబడి తగ్గిపోయింది. చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి. ఇదీగాక వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని టీడీపీ నాయకులు గత ఎ న్నికల్లో హామీ ఇవ్వడంతో రైతులు రుణాలు కట్టడం మానేశారు. దీంతో ఆయా బ్యాంకులు, సింగిల్ విండోలకు రుణాల చెల్లింపులు దాదాపుగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొత్త రుణాలు ఇచ్చేందుకు ముందుకురావడంలేదు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చేతిలో చిల్లిగవ్వలేక.. ప్రయివేటు వ్యక్తుల వద్ద అప్పులు చేయలేక కుమిలిపోతున్నారు. ఎరువులు కొనలేం ఐదు ఎకరాల్లో నాట్లు వేసేందుకు దుక్కిసిద్ధం చేశాను. పెట్టుబడులకు రూ.1.25 లక్షల వరకు అవసరం. ముందస్తుగా పంట పెడితే ఆశించిన దిగుబడి వస్తుందనే చిన్న ఆశ ఉంది. అయితే చేతిలో చిల్లిగవ్వలేదు. బ్యాంకులు రుణాలిస్తేనే సేద్యం చేయగలను.. లేదంటే రబీలో బీడుగా వదిలేయాల్సిందే. -బాలాజీరెడ్డి, కొత్తకండ్రిగ గ్రామం పెట్టుబడి లేదు ఆరెకరాల్లో వరి పంట సాగుచేయాలి. చేతిలో చిల్లిగవ్వలేదు. దుక్కి దున్నలేదు. చేతిలో డబ్బులుంటే ఈపాటికే దుక్కిదున్ని నారుపోసుండేవాడ్ని. ఎరువులు, విత్తనాలకే ఇబ్బందులెదురవుతున్నాయి. గతంలో చేసిన అప్పులు తీరక కొంత భూమి అమ్మాను. ఈసారీ..అంతేనేమో.. -గురవయ్య, గురప్పనాయుడుకండ్రిగ రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నా పంటసాగుకు సమయం ఆసన్నమైంది. పెట్టుబడికి డబ్బుల్లేదు. రుణమాఫీ చేస్తారని ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు మాఫీ చేయలేదు. ప్రయివేటు వ్యక్తుల వద్ద అప్పు తెద్దామంటే వడ్డీ ఎక్కువడుగుతున్నారు. పంట రాకపోతే పొలం అమ్మాల్సిందే. -సుబ్బరామయ్య, ఇలగనూరు గ్రామం -
కౌలు రైతు కన్నీటి సాగు
కౌలు రైతులకు ఏటా కన్నీటి సేద్యం తప్పడం లేదు. జిల్లాలో 70 శాతం పంట భూములు సాగు చేసేది వీరే. అయినా ప్రభుత్వం, బ్యాంకుల నుంచి అందాల్సిన రాయితీలు, రుణాలు వారి దరిచేరవు. ఇందుకు కారణం వేరే వారి భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేయడమే. సాగుకు అందరి కంటే ఎక్కువ ఖర్చు పెట్టేది కూడా వీరే. పెట్టుబడితో పాటు కౌలు కింద ముందే డబ్బు చెల్లించాలి. ఇంత కష్టపడిన వారిని రైతులుగా గుర్తించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. కౌలు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం సంకల్పించినా దిగువ స్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో కౌలు రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. చీరాల : కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంలో రెవెన్యూ యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఫలితంగా వేలాది మంది రైతులు కౌలుదారులుగా గుర్తింపు పొందలేకపోతున్నారు. ఈ ఏడాది కేవలం 8 వేల మందికి మాత్రమే గుర్తింపు కార్డులు జారీ చేశారు. వారిలో మూడోవంతు మందికి ఎటువంటి రుణం మంజూరు కాలేదు. జిల్లాలో 2 లక్షలపైగా కౌలు రైతులున్నారు. జిల్లాలో సాగవుతున్న 5.7 లక్షల హెక్టార్లలో 70 శాతం భూమిని కౌలురైతులే సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 35 వేల మంది కౌలు రైతులు గుర్తింపుకార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 8 వేల మందికే మంజూరు చేశారు. గుర్తింపు కార్డులు లేకపోవడంతో వారు ఏ రాయితీని, బ్యాంకు రుణాలను పొందలేకపోతున్నారు. దీనికి తోడు రైతులకు అవగాహన లేకపోవడం కూడా గుర్తింపుకార్డు పొందలేకపోవడానికి కారణమవుతోంది. ప్రభుత్వం, అధికార యంత్రాంగం కౌలు రైతులను కన్నీటి కష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నాలు నామమాత్రంగా కూడా చేయడంలేదు. రైతు సంఘాల నాయకులు గట్టిగా అడిగితే కొంతమందికి ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. అధికారులు జిల్లాలో కౌలు రైతు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల పొలాల్లోకి వెళ్లి వారు ఎంత భూమిని కౌలుకు తీసుకున్నారో ఆ ప్రకారం కార్డుల్ని జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా ఆ ప్రక్రియ సాగడం లేదు. స్థానిక నేతలు చెప్పిన వారికి, సర్వే నంబర్లు చెప్పినవారికి కార్డులు అందుతున్నాయి. అలాంటి వాటిలో కౌలు చేసిన భూమికి, కార్డులో ఉన్న విస్తీర్ణానికి పొంతన ఉండడంలేదు. ఎరువులు, విత్తనాలు, రుణాలు, వ్యవసాయ పనిముట్లు, పంటల బీమా, నష్టపరిహారం ఇలా కౌలుదారుడికి ప్రభుత్వం నుంచి పొందే ఏ లబ్ధికైనా గుర్తింపుకార్డులు అవసరం. ఏటా కౌలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య అంతా కలిపి 35 వేలకు మించి ఉండదు. దీనికి కారణం రైతులకు కార్డులు అందచేయడంలో అధికారులు రైతుల్ని ముప్పుతిప్పలు పెట్టడమే. పైగా కార్డులిచ్చినా వాస్తవంగా రైతులు సాగు చేస్తున్న భూమికి, గ్రామస్థాయి అధికారులు నమోదు చేస్తున్న విస్తీర్ణానికి సంబంధం ఉండడం లేదు. ఐదు ఎకరాలు కౌలు చేస్తున్న వారికి పదిసెంట్లు కౌలు చేస్తున్నట్లుగా కౌలు కార్డులిచ్చిన సంఘటనలున్నాయి. సర్కారు తీరుతో మరింత అవస్థలు... ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ అది అమలుకు నోచుకోలేదు. ఫలితంగా కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఏటా ఖరీఫ్‌లో కౌలు రైతులు తమకు ఇచ్చిన గుర్తింపు కార్డు ద్వారా బ్యాంకు నుంచి రుణసౌకర్యం పొందేవారు. అయితే ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించి దానిని పూర్తిచేయకపోవడంతో బ్యాంకర్లు కౌలు రైతులకు రుణాలు ఇవ్వలేదు. అటు రుణమాఫీ కాక, ఇటు పెట్టుబడికి రుణాలు అందక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. కౌలు రైతులు వ్యవసాయ పెట్టుబడులతో పాటు అదనంగా ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కౌలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే బ్యాంకు రుణాలు అందకపోవడంతో కౌలుదారులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి వందకు రెండు నుంచి మూడు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి వ్యవసాయం చేస్తున్నారు. చివరకు వడ్డీ తడిసి మోపెడవుతోంది. -
నమ్మి మోసపోయారు: జానారెడ్డి
‘‘కేసీఆర్ వల్లే రుణమాఫీ అవుతుందని నమ్మి ఓటేసిన రైతులంతా మోసపోయినట్లే. రుణ మాఫీ అవుతుందని రెండేళ్లుగా బ్యాంకు రుణాలు చెల్లించకపోవడంతో ఒక్కో రైతుపై రూ. 25 వేల వడ్డీ భారం పడింది. ప్రభుత్వం ఇచ్చిన రూ. 25 వేలు వడ్డీకే సరిపోతాయి. అసలు అప్పు యథాతథంగా రైతు పేరుమీదనే ఉంది. కేసీఆర్ నిర్వాకం వల్ల ఇటు రైతులకు, అటు ప్రభుత్వ ఖజానాకు నష్టం ఏర్పడింది. మూడేళ్ల దాకా కరెంటు రాకపోతే రైతులు ఉన్న ఆస్తులు అమ్ముకుని ఆత్మహత్యలు చేసుకోవాలా?’’ -
పరి'శ్రమ'..?
అనుబంధ పరిశ్రమలపై సింగరేణి శీతకన్ను - ఔత్సాహికులకు ప్రోత్సాహం కరువు - ఎనిమిది నెలలుగా వర్క్ ఆర్డర్లు లేక ఇక్కట్లు - బ్యాంక్ రుణాలు చెల్లించడానికి అభ్యర్థుల అగచాట్లు - ముఖం చాటేస్తున్న ఉన్నతాధికారులు ఇలా వీరిద్దరే కాదు.. దాదాపు పదిమూడు మంది వరకు పరిశ్రమలు పెట్టుకుని నేడు నిరుత్సా హంలో కొట్టుమిట్టాడుతున్నారు. గని కార్మికుల పిల్లల్ని పారిశ్రామికరంగంవైపు తీసుకురావాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. బయటి నుంచి తీసుకొస్తున్న సింగరేణికి అవసరమయ్యే చిన్నచిన్న పరికరాల్ని స్థానికంగానే తయారు చేయించాలనుకుని బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని ఔత్సాహికులను అను బంధ పరిశ్రమల స్థాపన కోసం 2013లో ఆహ్వానిం చింది. 13 మందిని ఎంపిక చేసింది. ఒక్కొక్కరు బ్యాంకుల్లో రూ.10లక్షల నుంచి రూ.45లక్షల వరకు అప్పు తీసుకుని రూఫ్ బోల్టింగ్, వైండింగ్ వైర్, హౌజింగ్ వైర్, ఫిష్ ప్లేట్లు, జీఐ వైరింగ్ తదితర పరి కరాలు తయారీ పరిశ్రమలు పెట్టుకున్నారు. సింగరేణి కొన్ని నెలలపాటు వీరికే ఆర్డర్లు ఇచ్చింది. ఆ తర్వాత ఏమైందో గానీ, దాదాపు ఎనిమిది నెలలుగా ఆర్డర్లను నిలిపివేసిందని పరిశ్ర మల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్థను నమ్ముకుని లక్ష లు అప్పు చేసి ఫ్యాక్టరీలు పెట్టుకున్నామని, ఇప్పుడు వాటిని కట్టలేక నగలు, ఆస్తిపాస్తులు అమ్ముకునే స్థితి కి చేరుకున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా సంస్థ స్పందించి అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సా హం అందించాలని వేడుకుంటున్నారు. ప్రోత్సహిస్తేనే బతుకుదెరువు సింగరేణి యాజమాన్యం సంపూర్ణ సహకారం అందిస్తేనే తమకు బతుకుదెరువు లభిస్తుందని అనుబంధ పరిశ్రమల యజమానులు ఆర్.శ్రీని వాస్, సతీష్‌కుమార్, సాగర్, శంకరయ్య, నర్సిం హా, రాజేష్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక సింగరేణి స్టోర్స్‌లో విలేక రులతో వారు గోడు వెల్లబోసుకున్నారు. సంస్థను నమ్మి లక్షల రూపా యలు అప్పుతెచ్చి పరిశ్రమలు పెట్టామని, 8నెల లుగా వర్క్ ఆర్డర్లు లేకపోవడం తో ఆర్థిక సమ స్యలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు. -
ఆనందమానందమాయే..
నల్లగొండ : రైతులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇన్నాళ్లూ రుణమాఫీపై వారిలో నెలకొన్న ఆందోళన రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీతో పటాపంచలైంది. ఎన్నికల హామీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తూ మంగళవారం జీఓ జారీ చేసింది. వరుస కరువుతో బ్యాంకు రుణాలు ఎలా తీర్చాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో రైతు రుణ మాఫీ వల్ల జిల్లాలో 4.2 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలు పొందిన రైతులకు సంబంధించి రూ.1895 కోట్ల మేరకు బ్యాంకు రుణాలు మాఫీ కానున్నాయి. 2013-14 సంవత్సరం వివరాల ప్రకారం జిల్లాలో మొత్తం 6.60,776 మంది రైతులు ఉండగా వారిలో 3,82,887 మంది వ్యవసాయ రుణాలు తీసుకోగా 80,127 మంది బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందారు. అదేవిధంగా లక్ష రూపాయలకు పైగా వ్యవసాయ రుణాలు పొందిన రైతులు 18,000 మంది ఉన్నారు. కాగా వారు తీసుకున్న రుణాలలో కూడా లక్ష రూపాయల వరకు మాఫీ వర్తింపజేస్తే 460 కోట్ల రూపాయలు మాఫీ కానున్నాయి. నల్లగొండ అగ్రికల్చర్ :జిల్లా రైతాంగానికి శుభవార్త. మూడేళ్లుగా పంటనష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణ ఫలించింది. ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ రూ.75.58కోట్ల మంజూరుకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 90రోజుల్లోగా సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లాలోని 76వేల 466 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. మూడేళ్లుగా నిరీక్షణ.. జిల్లాలో ఏప్రిల్ 2011 నుంచి మే 2014 వరకు వడగండ్ల వాన, కరువుతో పాటు అతివృష్టి కారణంగా పత్తి, వరి, కంది పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలను తయారుచేసి అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. దీనికి గాను రూ.74.46 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఏప్రిల్ 2011లో వచ్చిన వడగండ్ల వర్షం కారణంగా జిల్లాలో మొత్తం 13మండలాలో 2941 మంది రైతులు రూ.83.11లక్షలు నష్టపోయారు. అదే విధంగా మే 2011లో కురిసిన వడగండ్ల కారణంగా ఒక్క మండలంలో 154 మంది రైతులకు రూ.4.53లక్షల నష్టం జరిగింది. అదే సంవత్సరం జూలైలో కురిసిన భారీ వర్షాలకు మూడు మండలాల్లో 1259 మంది రైతులు రూ.23.13 లక్షల విలువైన పంటలను నష్టపోయారు. ఆగస్టులో కురిసిన వర్షాలకు రెండు మండలాలకు చెందిన 500 మంది రైతులు రూ.7.96 లక్షలు నష్టపోయారు. అదే విధంగా మార్చి, ఏప్రిల్ 2012లో వచ్చిన వడగండ్ల వలన 13మండలాలలో 4526 మంది రైతులకు చెందిన రూ.108 లక్షల విలువైన పంట నేలరాలింది. 2013 ఏప్రిల్‌లో వచ్చిన వడగండ్ల కారణంగా 14 మండలాలకు చెందిన 2754 మంది రైతులకు రూ.116 లక్షల మేరకు నష్టం వచ్చింది. అదే ఏడాది అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు 55 మండలాల్లో 1,35,603 మంది రైతులు రూ.54కోట్ల7లక్షల వరకు నష్టపోయారు. దీంతో పాటు ఖరీఫ్‌లో నెలకొన్న కరువు పరిస్థితుల కారణంగా నారాయణపురం మండలంలో 9555 మంది రైతులకు రూ.8కోట్ల 76 లక్షల నష్టం వాటిల్లింది. 2014 ఏప్రిల్‌లో కురిసిన వడగండ్లతో 14 మండలాలకు చెందిన 18250 మంది రైతులకు రూ.7కోట్ల 96లక్షల విలువైన పంటలకు నష్టం వాటిల్లింది. మే నెలలో వచ్చిన వడగండ్ల కారణంగా 8 మండలాల్లో 924 మంది రైతులు రూ.25.21 లక్షల మేరకు నష్టపోయినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు వేసి ప్రభుత్వానికి అందజేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేయకుండా కాలయాపన చేసింది. కాగా నిధులు విడుదల కాగానే ఇన్పుట్ సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమచేయడానికి జిల్లా వ్యవసాయశాఖ సన్నద్ధమవుతోంది. -
బూటకపు హామీలతో మోసపోయాం
కురబలకోట: చంద్రబాబు బూటకపు హా మీలతో మోసపోయామని మండలంలోని వివిధ గ్రామాల వీవోల లీడర్లు నిరసన గళం విన్పించారు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేయాలని, అంతవరకు ఎత్తిన చేతు లు దించేది లేదన్నారు. శనివారం వారు మొలకవారిపల్లెలో వీవో(గ్రామ సమైఖ్య) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా డ్వాక్రా లీడర్లు కాదర్బీ, భూలక్ష్మి, మహబూబ్‌బీ, రెడ్డెమ్మ తదితరులు మాట్లాడు తూ చంద్రబాబు రుణమాఫీ ఒట్టి బూటకమన్నారు. ఆయన మాటలకు చేతలకు పొంతన లేకుండా పోతోందన్నారు. ఎన్నికలకు ముందు అన్ని రుణాలు మాఫీ సాధ్యమేనన్నారు. ఇప్పుడు గ్రూపుకు లక్ష మాత్ర మే మాఫీ చేస్తానని మాట మార్చడం తగదన్నారు. రైతుల, డ్వాక్రా రుణమాఫీకి గతి లేకున్నా సింగ పూర్ తరహా రాజధాని కట్టిస్తాననడం ప్రజల్ని మభ్య పెట్టడమేనన్నారు. మంత్రులు కూడా తానా.. అంటే తం దానా అంటున్నారని ధ్వజమెత్తారు. కాగా మండలంలో 882 డ్వాక్రా గ్రూపులు ఉన్నా యి. వీటిలో 540 గ్రూపులు బ్యాంకు రుణా లు తీసుకున్నాయి. ఈ రుణాలు రూ. 21 కోట్లు దాకా ఉన్నాయి. చంద్రబాబు చెప్పిన రూ.లక్ష మేరకైతే రూ.5 కోట్లు మాత్రమే మాఫీ అవుతాయి. చంద్రబాబు నట్టేట ముంచారని మహిళలు వాపోయారు. -
ఆరిన ‘దీపం’
పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు సర్కారు మరో షాకిచ్చింది. ఇప్పటికే డ్వాక్రా రుణాల మాఫీ హామీని అటకెక్కించి, స్త్రీ నిధి రుణాలపై వడ్డీ పెంచి వారిపై పెనుభారాన్ని మోపిన బాబు..తాజాగా మంజూరైన దీపం గ్యాస్ కనెక్షన్లు రద్దు చేయడం పేదవారి వంటింట్లో అలజడి రేపుతోంది. సాక్షి, ఒంగోలు: మేలు చేస్తుందనే ఆశతో ఓటేసి అధికారంలోకి తెచ్చిన టీడీపీ.. మిహిళలకు షాకుల మీద షాకులిస్తోంది. బ్యాంకు రుణాలు చెల్లించొద్దంటూ నమ్మబలికి రుణాల మాఫీ చేయని టీడీపీ సర్కారుపై డ్వాక్రా మహిళలు ఇప్పటికే దుమ్మెత్తిపోస్తున్నారు. బిడ్డల చదువులకు అక్కరకొస్తాయని దాచుకున్న పొదుపు సొమ్మునూ.. బ్యాంకర్లు రికవరీ పేరుతో జమ చేసుకోవడంతో బాధితుల కడుపు రగిలిపోతోంది. పుండు మీద కారం చల్లినట్లు ‘దీపం’ గ్యాస్ కనెక్షన్ల రద్దు వ్యవహారంతో వారిలో ఆగ్రహం పెళ్లుబుకుతోంది. అటు రైతులను, ఇటు మహిళలనూ పనిగట్టుకుని చంద్రబాబు సర్కారు ఇబ్బందులకు గురిచేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లాలో 7,874 దీపం గ్యాస్ కనెక్షన్లు రద్దయ్యాయి. జిల్లాకు ప్రభుత్వం 2012-13 ఆర్థిక సంవత్సరంలో రెండు విడతలుగా మొత్తం 28,494 గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేసింది. అయితే, వాటిని అధికారులు సకాలంలో అర్హులకు అందజేయలేకపోయారు. మండల పరిషత్ అధికారులు గ్రామసభలు నిర్వహించి అర్హతలను బట్టి లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉండగా, అప్పట్లో వారు నిర్లక్ష్యం ప్రదర్శించారు. మంజూరైన కనెక్షన్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికీ పూర్తి చేయలేదు. వాస్తవానికి, వాటి ల్లో ఇప్పటికి 7,135 కనెక్షన్లు గ్రౌండింగ్ చేయాల్సి ఉంది. మిగిలిన వాటినైనా లబ్ధిదారులకు అందించారా..? అంటే అదీ జరగలేదు. సగం కనెక్షన్లు మాత్రమే గ్రౌండింగ్ పూర్తయి లబ్ధిదారుల చేతికి సిలిండర్లు అందాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఆ గ్యాస్ కనెక్షన్లన్నీ రద్దయ్యాయి. మరలా అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తులు పెట్టుకోవడం... అధికారులు విచారణ చేసి అర్హతలను ధ్రువీకరించడం.. ఆ తర్వాత కొత్తప్రభుత్వం దీపం కనెక్షన్లు మంజూరు చేస్తుందో.. లేదో చూడాల్సి ఉంది. ఇక, 2013-14 ఆర్థిక సంవత్సరంలో 10,300 కనెక్షన్లను ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేయగా, వాటిల్లో ఇంకా 735 గ్రౌండింగ్ చేయాల్సి ఉన్నట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. గుర్తింపునకు తాపత్రయం: ‘దీపం’ పథకం 1999 నుంచి రాష్ట్రంలో అమలవుతోంది. అప్పటి నుంచి ఏటా వేలాది కనెక్షన్లు ఈ పథకం కింద జిల్లాకు మంజూరవుతున్నాయి. అయితే, రాజకీయ నాయకుల జోక్యం.. అధికారుల నిర్లక్ష్యం కలిసి ఎంపికకు తూట్లు పొడుస్తున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో లబ్ధిదారులను ఎంపిక చేయకుండా నిర్లక్ష్యం వహించడం ఒక కారణమైతే.. అధికారులు పంపిన జాబి తాల్లో అనర్హుల పేర్లు చోటుచేసుకోవడం అర్హులకు శాపమవుతోంది. అయితే, పాత జాబితాలను రద్దు చేసి.త. మరలా కొత్తగా అర్హులను గుర్తించి ప్రతిపాదనలు పంపితే మంజూరు చేస్తామనడంపై డ్వాక్రా మహిళలు విస్తుపోతున్నారు. కేవలం, అధికార టీడీపీ గుర్తింపు కోసం ప్రయత్నిస్తోందని.. గ్రామీణ మహిళల ఇబ్బందులు ఆలకించినట్లైతే మంజూరైన కనెక్షన్లను రద్దు చేయదంటున్నారు. -
మాఫీ ఉచ్చులో అన్నదాత !
- బీమా, రీషెడ్యూల్కు చెడుతున్న రైతులు? - రుణమాఫీ జరగక... కొత్త రుణాలకు దూరం - రీషెడ్యూల్‌తో 11 శాతం మందికే ఉపశమనం - రుణాలు తీసుకోని కారణంగా పంటల బీమా చేసుకోలేని పరిస్థితి సాక్షి ప్రతినిధి, విజయనగరం: రుణాలను చెల్లించొద్దు...అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామంటూ చంద్రబాబునాయుడు పదేపదే వల్లించారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకుంటామని, ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని నమ్మబలి కారు. పెద్ద ఎత్తున ప్రచారం చేసి రైతులను ప్రలోభపెట్టారు. నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక పిల్లి మొగ్గలేస్తున్నారు. మాఫీ చేయాలన్నదానిపై కమిటీ వేశామని, ఆ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తొలుత చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో రాష్ట్ర ఆర్థిక పరి స్థితి బాగోలేదని, ఆర్బీఐ వ్యతిరేకిస్తోందని, రుణా ల రీషెడ్యూల్కు లైన్ క్లియర్ చేస్తున్నామని మరో మోసానికి తెరలేపారు. కేవలం 11 శాతం మందికే రీషెడ్యూల్ ? రుణాల రీషెడ్యూల్ అనేది రైతులకు మేలు చేసేదన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. దీనిలో ఆంక్షలు పెడుతున్నారు. గత ఏడాది కరువు, వరదలతో నష్టపోయిన రైతులకు మాత్రమే వర్తిస్తుందన్నట్టు సూచన ప్రాయంగా సంకేతాలిస్తున్నారు. అదే జరిగితే రుణాల రీషెడ్యూల్ కూడా కొందరికే వర్తిస్తోంది. జిల్లాలో 2.67లక్షల మంది రైతులు రూ.1462కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. వీరిలో గత ఏడాది వరదలు, కరువు వల్ల 30,445 మంది రైతులు నష్టపోయారు. చంద్రబాబు చేస్తున్న ప్రకటనల మేరకు ఆ 30,445 మందికి మాత్రమే రుణాల రీషెడ్యూల్ పరిమితం కానుంది. ఈ లెక్కన బ్యాంకు రుణాలు తీసుకున్న 11శాతం మందికి మాత్రమే ఆ కాసింత ప్రయోజనం చేకూరనుంది. ఇక మిగతా రైతుల పరిస్థితి అగమ్యగోచరమే... బీమాకూ దూరం మాఫీ, రీషెడ్యూల్‌కే కాకుండా పంటల బీమా పథకానికీ రైతు లు దూరం కావల్సిన పరిస్థితి ఏర్పడింది. బీమా చేసుకున్నట్టయితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తగు పరిహా రం అందుతుంది. కానీ జిల్లాలోని రైతులు ఆ అవకాశాన్ని కో ల్పోతున్నారు. రుణమాఫీ చేస్తారన్న ఉద్దేశంతో రైతులు బకాయిలు చెల్లించడం మానేశారు. రికవరీ లేదన్న కారణంగా బ్యాంకులు తిరిగి రుణాలు ఇవ్వడం ఆపేశాయి. కొత్తగా రుణాలు తీసుకుంటేనే రైతుల పేరున బీమా ప్రీమియాన్ని బ్యాంకులు చెల్లిస్తాయి. రుణాలే ఇవ్వని పరిస్థితిలో బీమా ప్రీమియం చెల్లించే అవకాశం లేదు. దీంతో రైతులంతా ఇప్పుడు బీమాకు దూరమవుతున్న పరిస్థితి ఏర్పడింది. రుణాలపై ఆధారపడకుండా నేరు గా ప్రీమియం చెల్లించేవారికి మాత్రమే బీమా వర్తిస్తోంది. ఈ నెలాఖరు వరకే ఆ గడువు ఉంది. కానీ ఈ విషయైమై రైతుల్లో అవగాహన కల్పించకపోవడంతో బీమా విషయమే గుర్తుకు రావడం లేదు. ఈ ఏడాది వరి, చెరకు, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి పంటలకు బీమా పథకం, అరటి, జీడి, మామిడి పంటలకు వాతావరణం బీమా అమలవుతోంది. ఇప్పుడు ఆ పంటలు వేసుకుని బీమా ప్రీమియం కట్టని వారి పరిస్థితి దైవాధీనం కానుంది. -
రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వాలి
ఖమ్మం: బ్యాంకు రుణాలు అందజేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం సీక్వెల్ రిసార్ట్స్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీపై జాప్యం చేయడం సరికాదన్నారు. ఖరీఫ్ ప్రారంభమైనా బ్యాంకుల్లో పాత రుణాలు మాఫీ కాక, కొత్త రుణాలు తీసుకోకుండా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి పాత రుణాలను రద్దు చేయాలని, కొత్త రుణాలు అందజేయాలని కోరారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్యాధికారులు అప్రమత్తమై ఏజెన్సీ ప్రాంతంలో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వరదలతో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులను ముందుగానే పసిగట్టి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేసి రైతాంగానికి సాగునీరు అందించాలని కోరారు. రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్, మొండికుంట ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలన్నారు. నాగార్జునసాగర్ కెనాల్‌ను దుమ్ముగూడెం ప్రా జెక్టుకు అనుసంధానం చేసి నీటిఎద్దడిని నివారించాలని కోరారు. ఖరీఫ్ ప్రారంభమై నెలరోజులవులు కావొస్తున్నా రైతులకు అధికారులు శుద్ధమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులను అందించలేదని విమర్శించారు. ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయకపోవడం వల్ల దళారుల చేతుల్లో రైతులు మోసపోతున్నారని, దీంతో పంటల దిగుబడి తగ్గి అప్పుల పాలలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పార్లమెంటులో గళమిప్పుతా... జిల్లా అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కోరతామని ఎంపీ అన్నారు. జిల్లాలో గిరిజన, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని కోరతామన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందని, ఇందుకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని అన్నారు. బంగారు తెలంగాణ ఏర్పాటులో వైఎస్సార్సీపీ భాగస్వామ్యం అవుతుందన్నారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అలుపెరుగక పోరాడుతానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తరతరాలుగా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలతో ముడిపడి ఉన్న గిరిజనులను ఆంధ్రలో కలిపితే సహించేది లేదన్నారు. ముంపు ప్రాతాలను కలుపుతున్నామనే సాకుతో ఇక్కడి ఖనిజ సంసద, ఇతర వనరులను దోచుకెళ్లేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలోని ఒక్క గ్రామాన్ని కూడా వదులుకునేది లేదని, అందుకోసం వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని తెలిపారు. జిల్లాలో భద్రాచలం- కొవ్వూరు రైల్వేలైను, ఇతర అండర్ బ్రిడ్జిలు, రైల్వే వంతెనలకు ప్రతిసారీ బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నామని చెబుతున్నారే తప్ప పనులు వేగవంతం చేయడం లేదని అన్నారు. ఇందుకోసం ఈ బడ్జెట్లో అధిక నిధులు కేటాయించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానంద్గౌడ్ను కలిసి జిల్లా పరిస్థితులు వివరించానని చెప్పారు. వైరా ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్ మాట్లాడుతూ ఖరీఫ్ సాగుకు సిద్ధమైన రైతులు రుణాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. రుణాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. వరికి మద్దతు ధర రూ.50 మాత్రమే పెంచడంపై ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైల్వే బడ్జెట్లో జిల్లాలోని రైల్వే లైన్లకు అధిక నిధులు కేటాయించాలని, ప్రాజెక్టుల నిర్మాణం సత్వరమే చేపట్టాలని కోరారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం మూడు జిల్లాల సమన్వయకర్త సాధు రమేష్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఆకుల మూర్తి, ఎం.డి.ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. -
అయ్య బాబోయ్!
- రైతు మెడపై కత్తిలా బ్యాంకు రుణాలు - ఖరీఫ్ పెట్టుబడులపై దిక్కుతోచని వైనం - ఓటేసి మోసపోయామంటూ మహిళల శాపనార్థాలు - పెంచిన పింఛన్లేవంటూ లబ్ధిదారుల గగ్గోలు - బెల్టుషాపులపై గ్రామీణ మహిళల ఆందోళన - ముఖ్యమంత్రి ఉత్తుత్తి సంతకాలపై సర్వత్రా విమర్శలు - రోడ్డున పడిన ఆదర్శరైతు, ఉపాధి ఉద్యోగుల కుటుంబాలు - ఉద్యమాలు తప్పవంటున్న ప్రజాసంఘాలు సాక్షి, ఒంగోలు: కొత్త ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు ఒక్కొక్కటిగా ఆవిరవుతున్నాయి. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టగానే తొలి,మలి సంతకాలతో మేలు చేస్తానన్న నేత ప్రజలకు హామీలపై స్పష్టతనివ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పట్లో రైతుల రుణాలు మాఫీ అవుతాయా? రీషెడ్యూల్ చేసి చేతులు దులుపుకుంటారా..? అంటూ జిల్లాలో ఎక్కడ విన్నా ఇదే చర్చ నడుస్తోంది. ‘బ్యాంకులకు రుణాలు చెల్లించొద్దు. మేం అధికారంలోకి రాగానే రుణాలన్నీ మాఫీచేస్తాం..’ అనేమాటను తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి వార్డుస్థాయి కార్యకర్త వరకు ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆదర్శ రైతులు, రైతుసంఘాల ప్రతినిధులతో సమావేశాలు పెట్టిమరీ .. రుణమాఫీ హామీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆపార్టీ లక్ష్యం నెరవేరింది. పార్టీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. వచ్చీరాగానే.. ఆదర్శరైతువ్యవస్థ రద్దుతో జిల్లాలో 1859 రైతుకుటుంబాల్ని రోడ్డున పడేశారు. రుణాలు చెల్లించమంటూ బ్యాంకర్లు రైతుమెడపై కత్తిపెట్టినట్లు నోటీసులిచ్చారు. ఇప్పుడే మొదలైన ఖరీఫ్ సీజన్ సాగుకు చేతిలో రైతుకు చిల్లిగవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇవన్నీ చాలవన్నట్టు చంద్రబాబు పాలనలో కరువు ఖాయమంటూ వినిపిస్తున్న సెంటిమెంట్ మాటలతో రైతుల గుండెలదిరిపోతున్నాయి. కష్టాలసాగు చేయాలా.. వద్దా..? అనే తరుణంలో డొక్కల కరువు కమ్ముకొస్తుందేమోననే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. రుణమాఫీ అయ్యేనా..? జిల్లాలో పంట రుణాల కింద కిందటేడాది పంపిణీ చేసిన వాటితో కలుపుకుని మొత్తం రూ.5,600 కోట్ల బకాయిలు మాఫీకావాల్సి ఉంది. ఈమొత్తం బకాయి రికవరీ అయితేనే.. ఖరీఫ్ సాగుకు కొత్తగా రుణాలందిస్తామని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. ఈమేరకు రుణాలు రద్దవుతాయో..రీషెడ్యూల్ ప్రతిపాదన చేస్తారో..? అనే ఆందోళన రైతుల్లో వినిపిస్తోంది. - ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించే అధికారి కరువయ్యాడు. - ఒకవైపు ఎరువుల ధరలు పెరిగిపోగా, విత్తనాల కొరత తీవ్రంగా ఉంది. సాగునీటి విడుదలపై స్పష్టత కొరవడింది. పంటకాలువలు, చెరువులు ఎండిపోయాయి. - అదేవిధంగా జిల్లాలో డ్వాక్రాసంఘాల మహిళలు మొత్తం 47 వేల మంది ఉండగా, సుమారు రూ.770 కోట్ల రుణాలు రద్దుకావాల్సి ఉంది. ఈ అంశంపైనా ప్రభుత్వం స్పష్టతనివ్వకపోవడంతో.. బ్యాంకర్లు మహిళా సంఘాలపై కూడా నోటీసుల యుద్ధం ప్రకటించారు. బాబు సంతకం చేసి చాలారోజులైనా రుణాలు రద్దుకాకపోవడంపై మహిళలు టీడీపీ ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతూ ఎదురుచూస్తున్నారు. సుజలం దొరకకున్నా.. అంతటా ‘మద్యం’కంపే: ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరిట మినరల్ వాటర్‌ను అతితక్కువ ధరకు అందిస్తామని చేసిన సంతకం కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. జిల్లాలో ఫ్లోరైడ్పీడతో ఇప్పటికే 271 గ్రామాలు ఉండగా, ముందుగా ఆయాగ్రామాలపై దృష్టి సారించి మినరల్ వాటర్‌ను ప్రజలకు నామమాత్రపు రుసుంతో అందివ్వాల్సిన అధికారులు దాని ఊసే పట్టించుకోవడం లేదు. ఇదిలాఉంటే, జిల్లావ్యాప్తంగా 3,800కు పైగానే బెల్టుదుకాణాలు యథేచ్ఛగా నిర్వహిస్తూనే ఉన్నారు. అక్టోబర్ వరకు పింఛన్‌పాట్లు తప్పవా..? వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్ రూ.200 నుంచి రూ.వెయ్యికి పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేయగా.. దానికి సంబంధించిన మార్గదర్శకాలు, పంపిణీపై జిల్లాప్రభుత్వ అధికారుల వద్దనే స్పష్టత కొరవడింది. జిల్లాలో 3.27 లక్షల మంది లబ్ధిదారులు పెరిగిన పింఛన్‌సొమ్ము తీసుకోవాలనే ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అయితే, అక్టోబర్ వరకు పెరిగిన పింఛన్‌సొమ్ము అందనట్టేనని స్థానిక అధికారులు చెబుతుండటంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. జాబ్ సరే.. రోడ్డునపడిన కుటుంబాల గతేంటి..? ‘జాబ్ కావాలంటే..బాబు అధికారంలోకి రావాల్సిందే’నంటూ ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం నేతలు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. అయితే, జాబు సంగతి సరే... బాబు తీసుకున్న నిర్ణయంతో ఉపాధి కోల్పోయి రోడ్డునపడిన కుటుంబాల్ని ఆదుకునేదెవరనే ప్రశ్న అంతటా వినిపిస్తోంది. - ఎన్నికల్లో పలురకాల అంశాలపై ఆదర్శ రైతులను మభ్యపెట్టి వాడుకున్న తెలుగుదేశం పార్టీ.. అధికారంలోకి రాగానే, వారి సేవలు చాలించాలంటూ సంతకాలు చేయడంపై విమర్శలొస్తున్నాయి. - జిల్లాలో మొత్తం 1859 మంది ఆదర్శ రైతులుండగా, వీరు ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధిలా పనిచేస్తుండేవారు. నెలకు రూ.వెయ్యి గౌరవ వేతనంతో నిర్దేశించిన గ్రామాల్లో విస్తృతంగా సేవలందించేవారు. ఎప్పటికప్పుడు వ్యవసాయశాఖ సూచనల్ని రైతులకు చేరవేసి.. సాగుకు చేయూతనివ్వడంలో ముందుండే ‘ఆదర్శం’ బాబు పాలన ఆరంభంలోనే అభాసుపాలవుతోందనే అభిప్రాయం రైతుసంఘాల నేతల్లో కలుగుతోంది. - ఆయా సమస్యల పరిష్కారానికి ఉద్యమబాటే ఏకైక పరిష్కారమని ప్రజా, రైతుసంఘాలు హెచ్చరిస్తున్నాయి. -
రద్దా.. కాదా?
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: డ్వాక్రా రుణాల రద్దుపై ఇంత వరకు స్పష్టమైన ప్రకటన వెలువడక పోవడంతో పొదుపు సంఘాల సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. రుణాల చెల్లింపునకు సంబంధించి బ్యాంకర్ల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో డ్వాక్రా మహిళలకు దిక్కుతోచడం లేదు. డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు రుణాల రద్దుపై చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయలేదు. రుణాల రద్దు అవుతాయనే కొండంత ఆశతో మూడు నెలలుగా డ్వాక్రా మహిళలు రుణ బకాయిలు చెల్లించడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బ్యాంక్ రుణాలు నిలిచిపోయాయి. జిల్లాలో మొత్తం 34,657 పొదుపు సంఘాలున్నాయి. వీటికి సంబంధించి 10,237 సంఘాల వారు రూ.64,86,84,000 కోట్లు రుణాలు పొందారు. ఒక్కో గ్రూపు సభ్యులు రూ.75 వేలు నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు పొందారు. ప్రతి గ్రూపు నెలకు రూ. 10వేలకు పైగా రికవరీ చేయాల్సి ఉంది. గత మూడు నెలలుగా రికవరీ కాలేదు. పెద్ద మొత్తంలో బ్యాంక్‌లకు జమకాకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కనీసం 10 శాతం కూడా రికవరీ జరగలేదని బ్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య బ్యాంకులు ఎక్కువ శాతం రైతు, డ్వాక్రా రుణాలు మంజూరు చేశాయి. డ్వాక్రా మహిళలకు గరిష్టంగా రూ. 5లక్షల వరకు రుణాలు ఇవ్వడంతో ప్రతి మహిళ పెద్ద మొత్తంలో రుణాలు పొందింది. దీనికి తోడు రైతు రుణాలు రద్దు అవుతాయని తెలిసి వారు కూడా రుణాలు చెల్లించలేదు. నిలిచిన టర్నోవర్ బ్యాంక్‌ల్లో పెద్ద ఎత్తున టర్నోవర్ నిలిచిపోయింది. రుణాలు రద్దుపై ఎలాంటి సమాచారం వస్తుందోనని బ్యాంకర్లు ఎదురు చూస్తున్నారు. రుణాలు రద్దు విషయంలో నిబంధనలు లేకుండా ఉంటే సంతోషిస్తామని, గడువు మీరిన రుణాలకే రద్దు వర్తిస్తే మిగిలిన వారు చెల్లించే పరిస్థితి లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. బ కాయిల వసూలపై ఒత్తిళ్లు డ్వాక్రా సంఘాల సభ్యులు తమ పొదుపు డబ్బులు మాత్రమే చెల్లించి తీసుకున్న బకాయిలను జమ చేయడం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో రిజర్వు బ్యాంక్ నుంచి తమపై ఒత్తిళ్లు పెరిగాయని బ్యాంకర్లు వాపోతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రుణమాఫీ అమలు చేయడంలో సాధ్యాసాధ్యాలపై కూడా బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. గాడితప్పే ప్రమాదంలో గ్రూపులు బ్యాంక్ లింకేజీ రుణాలు పేరుతో ఒక్కో గ్రూపు లక్షల్లో రుణాలు పొందింది. రుణాలు పొందిన మహిళలు ఎక్కువగా కూలినాలి చేసుకుని జీవనం సాగించేవారు. అలాగే చిరు వ్యాపారులు కూడా రుణాలు పొందిన వారిలో అధికంగా ఉన్నారు. వీరంతా క్రమం తప్పకుండా రుణాలు చెల్లిస్తున్నారు. రుణమాఫీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో అటు అధికారులు ఇటు డ్వాక్రా మహిళలు సతమతమవుతున్నారు. రుణమాఫీ వర్తించందంటే ఒకేసారి రుణాలు చెల్లింపు కష్టమవుతుందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రుణాలు చెల్లింపులు గాడి తప్పితే గ్రూపులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఐకేపీ సిబ్బంది చెబుతున్నారు. ఒక్కసారి చెల్లాచెదురైన గ్రూపులను తిరిగి ఏర్పాటు చేయాలన్నా, క్రమం తప్పకుండా ఇవ్వాలన్నా కష్టంతో కూడుకున్న పనని అధికారులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు వచ్చే నెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కారణంగా జూన్‌లో కూడా చెల్లింపులు జరగే అవకాశం లేదని ఐకేపీ సిబ్బంది చెబుతున్నారు. -
ఇక సోలార్ ‘పంట’
కేబినెట్ ఆమోదం.. పొలాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు రైతులే ఉత్పత్తిదారులుగా నూతన పాలసీ అనుగుణంగా చట్టంలోనూ మార్పులు ఏడాదికి 450 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యం సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి, వినియోగాన్ని పెంచడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ‘నూతన సోలార్ పాలసీ’ను రూపొందించింది. ఈ విధానంలో పెట్టుబడిదారులతో కలిసి పొలాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను రైతులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా చట్టం (కర్ణాటక ల్యాండ్ రిఫామ్స్ యాక్ట్ సెక్షన్-95)లో కూడా మార్పులు తేవడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి అంగీకారం తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం ఇంధన శాఖ మంత్రి డీ.కే శివకుమార్‌తో కలిసి న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర మీడియాకు వివరించారు. కొత్త పాలసీ ప్రకారం పొలాల్లో రైతు సొంతంగా, లేదా పెట్టుబడిదారుల భాగస్వామ్యంతో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఒక రైతు కనిష్టంగా ఒక మెగావాట్ నుంచి గరిష్టంగా మూడు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వీలుంటుందన్నారు. ఈ విద్యుత్‌కు లెక్కగట్టి సంబంధిత విద్యుత్ సరఫరా కంపెనీలు (ఎస్కాంలు) కొనుగోలు చేస్తాయని చెప్పారు. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి ఐదు ఎకరాల పొలం, గరిష్టంగా రూ.8 కోట్లు అవసరమవుతాయని, ఔత్సాహికులకు బ్యాంక్ ద్వారా రుణాలు లభ్యమయ్యేలా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు. మరోవైపు పెద్ద మొత్తంలో సౌర విద్యుత్ ఉత్పత్తికి వీలుగా రాష్ట్రంలో సోలార్ పార్కులు ఏర్పాటు చేయనున్నామని, ఒక్కో పార్కు ఏర్పాటుకు వంద ఎకరాలు అవసరమవుతుందని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వ భూమితో పాటు రైతుల భూములను కూడా లీజు విధానంలో తీసుకుంటామన్నారు. నూతన సోలార్ పాలసీకి పరిశ్రమ హోదా దక్కనుందని తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘రూఫ్ టాప్ సోలార్’ విధానాన్ని కొంత సరళీకరించామన్నారు. నూతన విధానం ఈ ఏడాది నుంచి 2021 వరకూ అమల్లో ఉంటుందన్నారు. నూతన పాలసీ విధానంలో ఏడాదికి 450 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం లక్ష్యమన్నారు. మంత్రి మండలిలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు... సాంఘిక సంక్షేమశాఖలో కొత్తగా జూనియర్ వార్డన్ల పోస్టుల ఏర్పాటు బెంగళూరు మెడికల్ కళాశాలలో ‘లివర్ టాన్స్‌ప్లాంటేషన్’ ఏర్పాటు, ఏడు పోస్టులు, రూ.5.47 కోట్ల నిధులు అధికారుల బదిలీలకు నూతన విధివిధానాలు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో యూజర్ చార్జీల పెంపు రాష్ట్రంలోని 3,628 గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులకు రూ. 16.32 కోట్లతో ల్యాప్‌ట్యాప్‌లు