సంక్షేమానికి దూరం గిరిజనం | The distance from the sun to the welfare of the people | Sakshi
Sakshi News home page

సంక్షేమానికి దూరం గిరిజనం

Published Fri, Apr 15 2016 2:06 AM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM

గిరిజనుల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు జిల్లాలో మచ్చుకైనా అమలు కావడం లేదు.

మొక్కుబడిగా బ్యాంకు రుణాలు
కనిపించని అంబేద్కర్ ఓవర్‌సీస్ విద్యానిధి పథకం,
ఎన్టీఆర్ విద్యోన్నతి
పేరుకే గిరిపుత్ర కల్యాణపథకం
ఇస్తామన్న బ్యాంకు రుణాలు రూ.948.47 కోట్లు,   ఇచ్చింది రూ. 67.9 కోట్లు
{పభుత్వ హామీలు గాలికి అభివృద్ధికి ఆమడ దూరంలో     గిరిజన ప్రాంతాలు

 

చిత్తూరు: గిరిజనుల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు జిల్లాలో మచ్చుకైనా అమలు కావడం లేదు. జిల్లావ్యాప్తంగా 1283 ఎస్టీ హేబిటేషన్లు(కాలనీలు) ఉండగా వీటి పరిధిలో  1,73,320 మంది గిరిజనులు ఉన్నట్లు గణాంకా లు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య రెట్టింపు ఉంటుందని అంచనా. వీరిలో యానాదులు 1,20,176 (69శాతం), ఎరుకలు 16,335 (9.42శాతం), సుగాలీలు 33,791 (19.50శాతం), నక్కలోల్లు 3,018 (1.74 శాతం) ఉన్నట్లు  ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

 
ఎస్టీల కోసం ప్రవేశపెట్టిన పథకాలు

ఎస్టీల జీవనప్రమాణాలు పెంచడానికి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నట్లు చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టిన రోజు నుంచీ చెబుతూనే ఉంది. అందులో భాగంగా పేద ఎస్టీలకు బ్యాంకు రుణాలిస్తున్నట్లు తెలి పింది. గిరిజనుల అభివృద్ధి కోసం  2014-15లో 1150 మందికి రూ. 476.7 కోట్లు, 2015-16లో  597 మందికి రూ.464.17 కోట్లు ఇస్తున్నట్లు ప్రణాళికలో వెల్లడించారు. అయితే 2014-2015కు గాను కేవలం 139 మందికి రూ.66.48 కోట్లు, 2015-16కు గాను కేవలం 142 మందికి రూ. 1.42 కోట్లు మాత్రమే మంజూరు చేసిం ది. రెండేళ్ల పాలనలో 1747 మందికి రూ.948.87 కోట్లు రుణాలిస్తామని చెప్పి కేవలం 281 మందికి రూ.67.9 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. 

 
ఫీజులు, మెస్ చార్జీల బకాయిలు...

గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా పేద విద్యార్థులకు ఫీజులు, మెస్ బిల్లులు క్రమం తప్పకుండా ప్రభుత్వమే చెల్లిం చాలనేది నిబంధన. కానీ 2015-16 కు గాను 4,562 మంది విద్యార్థులకు రూ.8 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.4 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగిలిన 2,300 మంది విద్యార్థులకు మరో రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక 2014-15 ఏడాదికి సంబంధించి 4,598 మందికి రూ.7,83,80,603 చెల్లించాల్సి ఉండగా, 3,876 మందికి రూ.7,04,00,716 మాత్రమే ఇచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో మిగిలిన బిల్లు  రూ.79లక్షలు పెండింగ్‌లో ఉండిపోయిందని అధికారులు చెబుతున్నారు. ట్యూషన్ ఫీజులు , మెస్ బిల్లులు కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో గిరిజన విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

 

విదేశీ చదువుల మాట హుళక్కే...

అంబేడ్కర్ ఓవర్‌సీస్ విద్యానిధి పథ కం ద్వారా ఎస్టీ విద్యార్థులకు విదేశీ వి ద్యనందించి వారి పురోభివృద్ధికి పాటుపడుతామని చెబుతున్న ప్రభుత్వం ఇంతవరకూ ఏ ఒక్క విద్యార్థిని పంపిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో చదువుతు న్న వారికే మొండి బకాయిలు చెల్లించలేని ప్రభుత్వం విదేశీ విద్యని ఎప్పుడు అందిస్తుందని గిరిజనుల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లాలంటే డిగ్రీ, పీజీలలో 60 శాతం మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇక ఇంజనీరింగ్ విద్య కోసం అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, జర్మనీ, స్వీడన్, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, రష్యా దేశాలకు పంపుతామని తెలిపింది. మెడిసిన్ కోసం ఫిలిప్పైన్, చైనా దేశాలకు పంపుతామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిలో వంద మంది విద్యార్థులను ఉన్నత విద్య కోసం విదే శాలకు పంపుతామని చెప్పింది. ఈ లెక్కన జిల్లా నుంచి 10 నుంచి 13 మందిని పంపుతామని చెప్పినా, పంపినట్లు ఎక్కడా ప్రభుత్వ రికార్డుల్లో లేదు.

 
గిరిపుత్ర కల్యాణపథకం

పేదరికంతో ఆడపిల్ల పెళ్లి కూడా చేయలేని గిరిజనుల కోసం వివాహ సమయంలో గిరిపుత్ర కల్యాణ పథకం కింద రూ.50వేలను అందిస్తామని ప్రభుత ్వం హామీ ఇచ్చింది. జిల్లాలో వేలాది వివాహాలు జరుగుతున్నా చంద్రబాబు సర్కారు రెండేళ్ల పాలనలో 57 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 19 మందికి రూ.9.50లక్షలు ఇచ్చినట్లు గిరిజన సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆ శాఖ మంత్రి  కనీసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయకపోవడంపై విమర్శలున్నాయి. మొత్తం ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి గిరిజన సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలిందన్న విమర్శలున్నాయి. ఎస్సీ, ఎస్టీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తూతూమంత్రంగా జిల్లాలో పర్యటించి వెళ్లడమే కానీ ఫలితం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.      

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement