ఊడుతున్న ఉద్యోగాలు | State workers Stragules in Arab countries | Sakshi
Sakshi News home page

ఊడుతున్న ఉద్యోగాలు

Published Wed, Sep 28 2016 1:32 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

ఊడుతున్న ఉద్యోగాలు

ఊడుతున్న ఉద్యోగాలు

ప్రపంచంలో ఆయిల్ ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఆర్థికమాంద్యం మన కార్మికుల మెడకు చుట్టుకుంటోంది.

* యూఏఈలో రాష్ట్ర కార్మికుల పాట్లు..
* ఆదుకోవాలంటూ వినతులు

రాయికల్: ప్రపంచంలో ఆయిల్ ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఆర్థికమాంద్యం మన కార్మికుల మెడకు చుట్టుకుంటోంది. ఆయా కంపెనీల్లో ఉద్యోగాల కల్పనలో అరబ్ దేశాలకు చెందిన వారికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని యూఏఈ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భారత్‌లోని కార్మికులను టార్గెట్ చేసుకొని ఉద్యోగాల నుంచి నిర్ధాక్షిణ్యంగా తొలగింపు చేపట్టారు. యూఏఈలోని దుబాయ్, అబుదాబీ, షార్జా, అజ్మన్, రస్ ఆల్‌ఖైమా, పుజ్‌రాహీ, ఉమా ఆల్ ఉక్వెన్ వంటి దేశాల్లో తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన సుమారు పది లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు.

ఆర్థిక సంక్షోభంతో కంపెనీలకు అక్కడి బ్యాంకులు రుణాలు మంజూరు చేయకపోవడంతో పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. వీటిపై ఆధారపడ్డ కార్మికులను హఠాత్తుగా పనిలో నుంచి తొలగిస్తూ ఆయా కంపెనీలు ఉత్తర్వులు జారీ చే శాయి. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు వివిధ కంపెనీల్లో కొంత హోదాలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ జీతాలకు అనుగుణంగా అక్కడి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. ఒక్కసారిగా కంపెనీల నుంచి ఉద్యోగాలు తీసివేయడంతో బ్యాంకుల్లో తీసుకున్న రుణం కట్టలేక ఆందోళనకు గురవుతున్నారు.

రుణాలు చెల్లించకుంటే బ్యాంకులు పాస్‌పోర్ట్‌లను బ్లాక్ చేసే అవకాశం ఉండటంతో ఇటు స్వగ్రామానికి రాలేక, అక్కడ ఉపాధి లేక తంటాలు పడుతున్నారు.  కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించి భారతీయ, తెలంగాణ కార్మికులకు ఉద్యోగాలు కల్పించేలా చొరవ చూపించాలని దుబాయ్‌లో పనిచేస్తున్న కార్మికులు సాక్షితో తమ ఆవేదనను చెప్పుకొన్నారు.
 
రాష్ట్రానికి చెందిన వారే 5 లక్షలు: యూఏఈలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐదు లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, తదితర జిల్లాలకు చెందినవారే. యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుదాబీ వంటి ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఉపాధి పొందుతున్నారు. ఒక్కసారిగా పనిలో నుంచి వీరిని తొలగించడంతో వీరి కుటుంబాలు వీధిన పడే పరిస్థితి నెలకొంది. హఠాత్తుగా కార్మికులను కంపెనీల నుంచి తొలగించడంతో మూడు నెలల వేతనాన్ని కంపెనీ ఇవ్వాల్సి ఉంటుంది. కాని కంపెనీలు 3 నెలల వేత నం కూడా ఇవ్వకపోవడంతో  ఇబ్బందులు పడుతున్నారు.
 
దుష్ర్పచారం చేస్తే జరిమానా..
యూఏఈలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, ఇక్కడి దేశాలకు ఎవరూ రావద్దని కార్మికులు ఎవరైనా మాట్లాడినా, ఫోన్‌లో సంభాషించినా వారికి అక్కడి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. దీంతో అక్కడి విషయాలు ఫోన్‌లో చెప్పడానికి సైతం కార్మికులు వెనుకడుగు వేస్తున్నారు. ఎవరైనా దుష్ర్పచారం చేస్తే జైలుశిక్ష లేదా భారీ మొత్తంలో జరిమానా విధిస్తున్నారని కార్మికులు తెలిపారు.
 
రాత్రికి రాత్రే ఉద్యోగం తొలగించారు
అజ్మల్‌లోని దుబాయ్ ఆయిల్ క ంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఎలాంటి నోటీసు లేకుండా రాత్రికి రాత్రే ఉద్యోగం నుంచి తొలగించారు. ఇక్కడ ఉద్యోగాలు లేకపోవడంతో గత్యంతరం లేక స్వగ్రామానికి తిరిగి వస్తున్నా.
- రవి, రాజేశ్వర్‌రావుపేట, ఇబ్రహీంపట్నం, కరీంనగర్ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement