
కార్పొరేట్లకు బ్యాంకు రుణాలపై పరిమితులు..
పెద్ద కంపెనీలకు బ్యాంకులిచ్చే రుణాలపై పరిమితులు విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలపై నోటిఫికేషన్ విడుదల చేసింది.
చెన్నై: పెద్ద కంపెనీలకు బ్యాంకులిచ్చే రుణాలపై పరిమితులు విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలపై నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి ప్రకారం బ్యాంకులు తమ మూలధన వనరుల్లో 20 శాతానికి మించి ఏ ఒక్క కంపెనీకి రుణమివ్వకూడదు. అసాధారణ సందర్భాల్లో మరో 5 శాతం మేర ఇవ్వొచ్చు. పరిమితుల ఉల్లంఘన జరిగిన పక్షంలో తక్షణం ఆర్‌బీఐకి తెలియజేసి, 30 రోజుల వ్యవధిలోగా బ్యాంకులు సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. స్థూలంగా ఒక కార్పొరేట్ గ్రూప్‌నకు ఇచ్చే మొత్తం రుణాలు.. బ్యాంకుల నిర్దిష్ట మూలధనంలో 25 శాతాన్ని మించకూడదని ఆర్‌బీఐ పేర్కొంది. ఇవి 2019 మార్చ్ 31 నుంచి అమల్లోకి వస్తారుు.