రుణాల కోసం రైతుల పడిగాపులు
వరంగల్ : ఖరీఫ్ సీజన్ రైతులకు కన్నీటిని మిగిల్చింది. పెట్టుబడికి డబ్బులు లేక.. బ్యాంకుల రుణాలు అందక.. వర్షాభావం.. కరెంటు కోతలతో రైతులు సతమతం అయ్యూరు. చాలా వరకు సాగు విస్తీర్ణం తగ్గింది. రైతులు ప్రైవేటు వారి వద్ద రుణాలు తెచ్చి సాగు చేశారు. దిగుబడి రాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యూరుు. ఇంతలోనే రబీ సీజన్ ముంచుకొచ్చింది. విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేయడానికి రైతులు సిద్ధం అవుతున్నారు. డబ్బులు లేకపోవడంతో కులు ఇచ్చే రుణాల కోసం వేరుు కళ్లతో ఎదురుచూస్తున్నారు.
రబీలో సాగు కోసం అప్పులు తేవడం రైతులకు తలకు మించిన భారమవుతోంది. ప్రస్తుతం బ్యాంకర్ల మీదనే ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 1,92,632 హెక్టార్లు ఉండగా.. జిల్లా గత రబీతో పోల్చుకుని ఈ రబీలో 1,86,025 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇప్పటి వరకు కేవలం 24 శాతం మాత్రమే పంటలు సాగయ్యూరుు. ప్రధానంగా వర్షాభావ పరిస్థితులే కారణం. బావులు, బోర్ల వద్ద రైతులు సాగు చేస్తున్నారు.
ఈ ఏడాదైనా అందేనా?
ఈ ఏడాది 2014-15 రుణ ప్రణాళికలో రూ.2,100 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఖరీఫ్‌లో రూ.1,400 కోట్లు రుణాలు ఇవ్వాలని భావించారు. కొత్త ప్రభుత్వం రావడం.. రుణమాఫీ చేస్తామని ప్రకటిం చడంతో ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. రుణాలు అందించేందుకు బ్యాంకర్లు కూడా వెనుకంజ వేశారు. రూ.లక్షలోపు రుణాన్ని మాఫీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన హామీ అమలుకు ఒక సీజన్ ముగిసింది. ఇప్పుడు రబీ పెట్టుబడి కోసం రైతులు అవస్థల పాలవుతున్నారు.
ఈ రబీలో అధికారులు రూ.700 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ పరుగులు తీస్తున్నారు. ఖరీఫ్‌లోనైనా రుణాలు అందలేదు. ఈ రబీలోనైనా రుణాలు ఇస్తారా లేదా అని రైతులు ఆశలో ఎదురుచూస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణ మంజూరుపై ప్రత్యేక శ్రద్ధ వహించి బ్యాం కర్లపై ఒత్తిడి తెస్తోంది. జిల్లా ఉన్నతాధికారులను కూడా బ్యాంకర్లతో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు రుణాలపై ఆశలు పెరుగుతున్నారుు.
రూ.472 కోట్లు విడుదల
ప్రభుత్వం గత నెలాఖరులో రుణమాఫీకి సంబంధించి జిల్లాకు రూ.472 కోట్లు విడుదలయ్యాయి. జిల్లాలో రూ.లక్షలోపు రుణమాఫీ కింద రూ.1,925 కోట్ల మేరకు ఉన్నట్లు లీడ్‌బ్యాంక్ అధికారులు తెలిపారు. 4 లక్షల మందికి లబ్ధి చేరుకున్నట్లు తెలిపారు. ఖరీఫ్‌లో అప్పోసప్పో తెచ్చి సాగు చేసినప్పటికీ రబీలోనైనా ఆదుకోవాలని కోరుతున్నారు. రబీ సీజన్‌లో 1.80లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంట లు సాగు చేస్తారనే అంచనాతో వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది.
రబీ రుణ లక్ష్యం రూ.700 కోట్లు : లీడ్ బ్యాంక్ మేనేజర్ సాయిప్రసాద్
రబీలో రుణాల లక్ష్యం రూ.700కోట్లుగా ఉన్నట్లు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సాయిప్రసాద్ తెలిపారు. రైతులకు పంట రుణాలందించి ఆదుకునేందుకు కృషి చేస్తున్నాం. రుణమాఫీ వల్ల ఖరీఫ్‌లో ఇబ్బందులు ఎదురైన మాట వాస్తమే.
‘అప్పు’ కావాలె!
Published Thu, Nov 13 2014 3:02 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement