సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ కోసం ప్రభుత్వం విత్తనాలను సిద్ధం చేసింది. ఆర్బీకేల ద్వారా రైతులకు అందించేందుకు ప్రణాళిక రూపొందించింది. రబీ కోతలు జోరందుకోవడంతో ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీకి సిద్ధం చేయగా.. మే 1 నుంచి వేరుశనగ, జూన్ 1 నుంచి వరి, ఇతర విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. 2023–24 ఆరి్థక సంవత్సరంలో 9.15 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేసిన అధికారులు ఖరీఫ్ సీజన్ కోసం 6.18 లక్షల క్వింటాళ్లను ఆర్బీకేల ద్వారా రైతులకు అందించనున్నారు.
రబీ సీజన్ కోసం 2.97 లక్షల క్వింటాళ్లను సిద్ధం చేయనున్నారు. జాతీయ ఆహార భద్రతా మిషన్ అమలవుతున్న జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.1,000, మిషన్ పరిధిలో లేని జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.500 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. పచ్చిరొట్ట విత్తనాలతో పాటు చిరుధాన్యాల విత్తనాలపై 50 శాతం, వేరుశనగ, నువ్వుల విత్తనాలపై 40 శాతం, అపరాలపై 30 శాతం, శనగ విత్తనాలపై 25 శాతం చొప్పున సబ్సిడీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏజెన్సీ మండలాల్లో గిరిజన రైతులకు అన్నిరకాల విత్తనాలను 90 శాతం సబ్సిడీపై, కంటింజెన్సీ కింద 80 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నారు.
ఆర్బీకేల ద్వారా అందిస్తాం
ఖరీఫ్ సీజన్‌కు సరిపడా విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం. రైతుల ద్వారా సేకరించిన విత్తనాలతో పాటు ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ, ప్రైవేట్ కంపెనీల నుంచి సేకరించి అగ్రి ల్యాబ్‌లలో నాణ్యత ధ్రువీకరించిన తర్వాత ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment