తీవ్ర వర్షభావ పరిస్థితులకు తోడు ఎండలు మండుతుండడంతో పంటలు ఎండిపోతున్నాయి. పత్తి, మొక్కజొన్న మొక్కలు వాడిపోతున్నాయి. రైతులు బిందెసేద్యంతో పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. జఫర్‌గఢ్ మండలంలోని తిమ్మంపేటలో రైతులు పత్తి మొక్కలకు బిందెలతో నీటిని పోస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడవచ్చు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు నెలకొనడంతో రైతులు దిగులు చెందుతున్నారు.
- జఫర్‌గఢ్
నాకున్న మూడెకరాలల్ల పత్తి ఏసిన. ఇప్పటి వరకు నలభైవేల ఖర్చరుుంది. వానలు లేక నీటి తడులు కడుతున్న. అరుునా పంట ఎదుగుతలేదు. బోర్ల నీళ్లు తగ్గినయ్. ఇంకొన్నిరోజులు గిట్లనే ఉంటే పంట పండేది కష్టమే.
- మామిడి నర్సింహరాములు, రైతు, జఫర్‌గఢ్
హన్మకొండ : వరుస కష్టాలతో రైతులు ఆగమాగమవుతున్నారు. గత ఖరీఫ్, రబీ కష్టనష్టాలు.. ఈ ఖరీఫ్‌లోనూ వెంటాడుతుండడంతో విలవిల్లాడుతున్నారు. నెల పదిహేను రోజులుగా వర్షాలు కురువక పోవడంతో మొక్కలు వాడిపోతున్నారుు. పంటలు కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఖరీఫ్‌లో సకాలంలో వర్షాలు కురువడంతో జూన్‌లోనే జిల్లాలో అధిక విస్తీర్ణంలో పంటలు సాగయ్యూరుు. ఇప్పటివరకు 2,92,403 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఖరీఫ్ సాగు సాధారణ విస్తీర్ణం 5,05,290 హెక్టార్లు కాగా... గతేడాది ఈ సమయం వరకు 1,53,086 హెక్టార్లే సాగయ్యూరుు. సీజన్ ఆరంభంలో మురి పించిన వర్షాలు 45 రోజులుగా మొహం చాటేశాయి. మధ్యలో నాలుగైదు మండలాల్లో కొద్దిపాటి వర్షం కురిసినా... పంటలకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. దీంతో మొలకెత్తిన మొక్కలు ఎండిపోతున్నాయి. దీంతో వర్షాల కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. బిందెలతో మొక్కలకు నీళ్లు పోస్తూ కాపాడుకునేందుకు యత్నిస్తున్నారు. వ్యవసాయ బావులు ఉన్న వారు ఇప్పటికే తడులు పెడుతున్నారు. బావుల్లో కొద్దిపాటి నీరే ఉండడంతో వారిలో కూడా దిగులు మొదలైంది.
గతేడాది కంటే అధిక విస్తీర్ణంలో...
జిల్లాలో ఖరీఫ్ వరి సాధారణ విస్తీర్ణం 1,44,670 హెక్టార్లు కాగా.. ఇప్పటివరకు 6,908 హెక్టార్లలో సాగు చేశారు. గతేడాది ఈ సమయూనికి 1,700 హెక్టార్లలో మాత్రమే సాగైంది. మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 49,453 హెక్టార్లు కాగా.. 29,197 హెక్టార్లలో సాగైంది. గతేడాది ఇప్పటి వరకు16,520 హెక్టార్లలో సాగు చేశారు. 21,219 హెక్టార్ల పెసర సాగవుతుందని అంచనా కాగా, ఇప్పటివరకు 18,877 హెక్టార్లలో సాగైంది. గతేడాది ఈ సమయూనికి 2,200 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. కంది సాదారణ విస్తీర్ణం 11,045 హెక్టార్లు కాగా, ఇప్పటివరకు 3,619 హెక్టార్లు.. గతేడాది ఈ సమయూనికి 196 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. 218 హెక్టార్లలో మినుము సాగు కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 219 హెక్టార్లు.. గతేడాది ఈ సమయూనికి 50 హెక్టార్లలో మాత్రమే సాగైంది. వేరుశనగ సాధారణ విస్తీర్ణం 3,382 హెక్టార్లు కాగా.. ఇప్పటివరకు 1,581 హెక్టార్లు.. గతేడాది ఈ సమయూనికి 675 హెక్టార్లలో సాగు చేశారు. నువ్వులు సాధారణ విస్తీర్ణం 3,192 హెక్టార్లు. ఇప్పటివరకు 1517 హెక్టార్లలో సాగు చేశారు. గతేడాది ఈ సమయం వరకు పంట వేయలేదు. సోయాబీన్ సాధారణ విస్తీర్ణం 119 హెక్టార్లు కాగా.. ఇప్పటివరకు 142 హెక్టార్లు.. గతేడాది ఈ సమయం వరకు 110 హెక్టార్లలో సాగైంది. పత్తి సాధారణ విస్తీర్ణం 2,47,608 హెక్టార్లు. ఇప్పటివరకు 2,24,932 హెక్టార్లలో సాగు చేశారు. గతేడాది ఈ సమయంలో 1,31,620 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. మిర్చి సాధారణ విస్తీర్ణం 13,620 హెక్టార్లు కాగా.. ఇప్పటివరకు 150 హెక్టార్లు సాగు చేశారు. గతేడాది ఈ సమయం వరకు సాగు చేపట్టలేదు. పసుపు సాధారణ విస్తీర్ణం 9,605 హెక్టార్లు. ఇప్పటివరకు 5,259 హెక్టార్లలో రైతులు సాగు చేయగా.. గతేడాది ఈ సమయం వరకు ఈ పంట వేయలేదు.
బిందె సేద్యం.. పశువుల పాలు
విత్తిన విత్తులు మొలకెత్తి ఏపుగా పెరిగే సమయానికి వర్షాలు కురువడం లేదు. దీంతోపాటు ఎండలు మండు వేసవిని తలపిస్తున్నారుు. పంట చేలకు సాగు నీరు లేక మొలకెత్తిన మొక్కలు వాడిపోతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో రైతులు రెట్టింపు ఖర్చులతో కూలీలను పెట్టి బిందెల్లో నీళ్లు ఎత్తుకొచ్చి మొక్కలు మొదట్లో పోస్తున్నారు. పంటలపై వర్షాలపై ఆశలు వదులుకొన్న మరి కొందరు రైతులు పంట చేలల్లో పశువులను మేపుతున్నారు. బావి వసతి ఉన్న వారు కాలువల ద్వారా నీటి తడులు అందిస్తున్నారు. కొందరు రైతులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల పై ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి ఒక్కొక్క బొట్టు పోస్తూ మొక్కలను కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వర్షాలు పడినీరు సమృద్ధిగా ఉంటే వరి నాటు వేసుకోవచ్చనే ఆశతో రైతులు నారు పోశారు. వర్షాలు వెనక్కు తగ్గడం భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో వరి నారును రక్షించుకునేందుకు బిందెలతో నీరు పోస్తుతున్నారు. వరి నార్లు ముదిరిపోయే ప్రమాదం ఉండడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
ఎండుతున్న పంటలు
Published Mon, Aug 3 2015 2:49 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement