గచ్చిబౌలి: వెయ్యిమంది నిరుద్యోగులకు క్యాబ్‌లు ఇప్పిస్తామని, ప్రతి ఒక్కరు వృత్తిని ప్రేమించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ క్యాబ్ డ్రైవర్లకు సూచించారు. గురువారం గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో ఉబెర్ అవార్డులను ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ.. చదువుకున్న వెయ్యిమంది నిరుద్యోగులకు డ్రైవర్ కమ్ ఓనర్ స్కీం కింద క్యాబ్‌లు ఇప్పిస్తామని చెప్పారు. వాహనం కొనుగోలుకు రూ.5 లక్షలు బ్యాంక్ రుణం ఇస్తే 60 శాతం సబ్సిడీ, ఐదు లక్షలకు పైగా లోన్ ఇస్తే 50 శాతం సబ్సిడీ అందిస్తామని వెల్లడించారు. రూ.2 లక్షల లోన్ ఇస్తే 70 శాతం సబ్సిడీ అందజేస్తామని తెలిపారు.
క్యాబ్ డ్రైవర్ వృత్తి నామోషీగా భావించవద్దని సూచించారు. అనేక మంది చదువుకున్నవారు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు లేనప్పుడు ప్రైవేట్ ఉగ్యోగాలలో సెటిల్ అవుతున్నారని పేర్కొన్నారు. ఉబెర్ క్యాబ్ సహకారంతో నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వృత్తిని సామాజిక సేవగా భావించాలని అన్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో ఉబెర్ క్యాబ్ ప్రయాణికులకు చేరువగా ఉందన్నారు. ఖాళీ సమయాల్లో క్యాబ్ డ్రైవర్లు ఉబెర్‌లో పనిచేసుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వెయ్యి మంది నిరుద్యోగులకు క్యాబ్‌లు: ఈటల
Published Thu, Oct 13 2016 7:46 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
Advertisement
Advertisement