నమ్మి మోసపోయారు: జానారెడ్డి
‘‘కేసీఆర్ వల్లే రుణమాఫీ అవుతుందని నమ్మి ఓటేసిన రైతులంతా మోసపోయినట్లే. రుణ మాఫీ అవుతుందని రెండేళ్లుగా బ్యాంకు రుణాలు చెల్లించకపోవడంతో ఒక్కో రైతుపై రూ. 25 వేల వడ్డీ భారం పడింది. ప్రభుత్వం ఇచ్చిన రూ. 25 వేలు వడ్డీకే సరిపోతాయి. అసలు అప్పు యథాతథంగా రైతు పేరుమీదనే ఉంది. కేసీఆర్ నిర్వాకం వల్ల ఇటు రైతులకు, అటు ప్రభుత్వ ఖజానాకు నష్టం ఏర్పడింది. మూడేళ్ల దాకా కరెంటు రాకపోతే రైతులు ఉన్న ఆస్తులు అమ్ముకుని ఆత్మహత్యలు చేసుకోవాలా?’’