కొత్త రుణాలు మంజూరు చేయకుండా బ్యాంకులు జాప్యం ప్రదర్శించడంపై రైతన్నలు నిరసన వ్యక్తం చేశారు.
బెజ్జూరు (ఆదిలాబాద్) : కొత్త రుణాలు మంజూరు చేయకుండా బ్యాంకులు జాప్యం ప్రదర్శించడంపై రైతన్నలు నిరసన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలానికి చెందిన పలువురు రైతులు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నాకు దిగారు.
రుణాలు అందకపోవడంతో అనేక ఇక్కట్లు పడుతున్నామని నిరసనకారులు తెలిపారు. తర్వాత తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. దీంతో స్పందించిన తహసీల్దార్ బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడగా వారు రుణాలు మంజూరు చేసేందుకు సముఖత తెలిపారు.