స్వయం ఉపాధి కింద ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఎంపీడీఓ వామనరావు సూచించారు.
కొల్చారం: స్వయం ఉపాధి కింద ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఎంపీడీఓ వామనరావు సూచించారు. రూ.1.50 లక్షలలోపు ఆదాయం కలిగిన నిరుద్యోగులకు బ్యాంకులు రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసిన ఫారాలను ఎంపీడీఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.