ఐఏఆర్‌ఐలో వ్యవసాయ డ్రోన్ల పనితీరును ప్రధానికి వివరిస్తున్న నమో డ్రోన్ దీదీలు
సశక్తి– నారీశక్తి కార్యక్రమంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ/గురుగ్రామ్: ఎన్‌డీఏ ప్రభుత్వం మూడో దఫా కొలువుతీరడం ఖాయమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. హ్యాట్రిక్ పాలనలో మహిళల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం పాటుపడుతుందని ప్రకటించారు. నారీశక్తి అభివృద్ధిలో నూతన అధ్యయనం లిఖిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ‘సశక్తి–నారీశక్తి’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.
‘గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళల కష్టాలు, కన్నీళ్లను ఏమాత్రం లెక్కలోకి తీసుకోలేదు. మా ప్రభుత్వాలు మహిళలను ప్రతిదశలోనూ చేయి అందించిమరీ వారి అభ్యున్నతికి పాటుపడ్డాయి. మరుగుదొడ్ల లేమి, శానిటరీ ప్యాడ్‌ల వాడకం, వంటచెరకు వాడకంతో వంటగదుల్లో పొగచూరిన మహిళల బతుకులపై మాట్లాడిన ఏకైక ప్రధాని మంత్రిని నేనే. మహిళలందరికీ బ్యాంక్ ఖాతాలు ఉండాలని ఎర్రకోట వేదికగా పిలుపునిచ్చా’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
1,000 మంది ‘నమో డ్రోన్ దీదీ’లకు డ్రోన్లు
సశక్తి–నారీశక్తి కార్యక్రమంలో భాగంగా స్వయంసహాయక బృందాలకు దాదాపు రూ.8,000 కోట్ల బ్యాంక్ రుణాలను మోదీ అందజేశారు. ఈ సందర్భంగా వారిలో కొందరితో మోదీ స్వయంగా మాట్లాడారు. స్వావలంభనతో అభివృద్ధిలోకి వచి్చన వారిని మెచ్చుకున్నారు. దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన–నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కార్యక్రమం మద్దతుతో లక్షాధికారులుగా మారిన ‘లఖ్‌పతి దీదీ’లను ఈ సందర్భంగా మోదీ సత్కరించారు. వ్యవసాయం, సాగు సంబంద పనుల్లో డ్రోన్లను వినియోగంచడంలో ఇప్పటికే తర్ఫీదు పొందిన 1,000 మంది ‘నమో డ్రోన్ దీదీ’లకు మోదీ డ్రోన్లను పంపిణీచేశారు. మూలధన సంబంధ నిధి కింద స్వయం సహాయక బృందాలకు మరో రూ.2,000 కోట్లను మోదీ పంపిణీచేశారు.
ప్రతికూల మనస్తత్వానికి ప్రతిబింబం..
కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు సానుకూల మనస్తత్వం ఏ కోశానా లేదని మోదీ విమర్శించారు. దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థలను మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు వీలుగా 112 జాతీయ రహదారులకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment