బ్యాంకుల్లో బకాయిలు చెల్లించని రైతుల వివరాలు వీఆర్‌ఓలు సేకరిస్తున్నారు.
రాయనపాడు(విజయవాడ రూరల్): బ్యాంకుల్లో బకాయిలు చెల్లించని రైతుల వివరాలు వీఆర్‌ఓలు సేకరిస్తున్నారు. రాయనపాడులో వీఆర్‌ఓ ప్రసాద్ గ్రామ రైతు శివాజీ నుంచి ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల సమాచారాన్ని తెలుసుకున్నారు. విజయవాడరూరల్ మండల వీఆర్‌ఓలు గ్రామాల్లో వ్యవసాయ రుణాల బకాయిలున్న వారి వివరాలు మంగళవారం సాయంత్రంలోపు ప్రభుత్వానికి పంపాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
మండలంలోని ప్రతి వీఆర్‌ఓ వ్యవసాయ రుణాలు తీసుకున్న వారి వివరాలు కంప్యూటర్‌లో నమోదు చేస్తున్నారు. కొత్తూరులో 171 మంది, తాడేపల్లిలో 490, వేమవరంలో 18, షాబాదులో 92, పైడూరుపాడులో 239, రాయనపాడులో 254, గొల్లపూడిలో 1922, జక్కంపూడిలో 55, అంబాపురంలో 82, పి.నైనవరం లో 164, పాతపాడులో 340, కేవీ కండ్రికలో 325, నున్నలో 2894, రామవరప్పాడులో 1304, ప్రసాదంపాడులో 814, ఎనికేపాడు లో 911, నిడమానూరులో 2183, దొనేత్కూరులో 15, గూడవల్లిలో 462 వ్యవసాయ రుణాలు తీసుకున్నారు.