
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 1,07,474 కోవిడ్–19 పాజిటివ్ కేసులు వచ్చాయి. అలాగే మరో 865 మంది వైరస్ కాటుతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,21,88,138కు, మరణాల సంఖ్య 5,01,979కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం... కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 12,25,011కు పడిపోయింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 2.90 శాతం ఉన్నాయి. కరోనా రికవరీ రేటు 95.91 శాతమని ఆరోగ్య శాఖ ప్రకటించింది.