
సాక్షి,ఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు స్కామ్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు బుధవారం(డిసెంబర్11) కీలక తీర్పిచ్చింది. యూపీఏ హయాంలో జరిగిన బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలున్నాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేసింది.
ఈ కేసులో విచారణ అనంతరం నవభారత్ పవర్ ఎండీ హరిశ్చంద్రప్రసాద్, నవభారత్ పవర్ చైర్మన్ త్రివిక్రమప్రసాద్, హరిశ్చంద్ర గుప్తా,సమారియా సహా మొత్తం ఐదుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.ఈ మేరకు 341 పేజీల తీర్పును ప్రత్యేక కోర్టు వెలువరించడం గమనార్హం.