
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒక వాహనదారుడిని, అతని మిత్రుడిని నడిరోడ్డుపైనే చితకబాదిన వీడియో ఆలస్యంగా వెలుగుచూసింది. తమ స్కూటర్‌ను ఢీకొట్టాడని కోపంతో సదరు బండి యజమాని, అతని బంధువులు వారిని రోడ్డుపైనే అడ్డగించి కర్రలతో చితకబాదుతూ బీభత్సం సృష్టించారు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఇక వీడియో ఆధారంగా చూసుకుంటే చేతిలో హెల్మెట్ పట్టుకొని ఉన్న వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఒక వ్యక్తి కర్రతో దాడి చేయగా.. మరో వ్యక్తి అతనిపై ముష్టి యుద్దానికి దిగాడు. ఎవరు చెప్పినా వినిపించుకోకుండా అతనిపై పంచుల వర్షం కురిపించాడు.
వాహనదారుడి స్నేహితుడిని కూడా చితకబాదారు. అక్కడే ఉన్న మహిళ వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆమెను పక్కకు తోసి మరి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ తర్వాత వారిద్దరిని పక్కన పడేసి వెళ్లిపోయారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ దాడిలో వాహనదారుడి తలకు గాయమవడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఆలస్యంగా వెలుగు చూడడంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికుల సమాచారం మేరకు గాయపడిన వ్యక్తి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
చదవండి: గదిలో మూత్రం పోశాడని తిట్టింది.. పగ పెంచుకుని
ప్రాణ భయంతో నూతన జంట పరుగు.. వెంటాడి వేటాడి దారుణం
दिल्ली के पालम इलाके की साद कॉलोनी में मामूली बात पर रोडरेज में लड़के की पिटाई,बाइक सवार पर रॉड से हमला pic.twitter.com/wHtX3A3pAm
— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) June 27, 2021