ఆర్మీ స్వదేశీ వారధి | Indian Army receives bridges developed by DRDO and L&T | Sakshi
Sakshi News home page

ఆర్మీ స్వదేశీ వారధి

Published Thu, Dec 31 2020 5:47 AM | Last Updated on Thu, Dec 31 2020 5:47 AM

Indian Army receives bridges developed by DRDO and L&T - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆత్మనిర్భర భారత్‌ ప్రస్థానంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఇంకో ముందడుగు వేసింది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు వీలుగా పది మీటర్ల పొడవైన తాత్కాలిక వారధిని అభివృద్ధి చేసింది. వాగులు, వంకల వంటి అడ్డంకులను వేగంగా దాటేందుకు ఆర్మీ ఈ వారధులను ఉపయోగిస్తుంది. లార్సెన్‌ అండ్‌ టూబ్రోకు చెందిన తాలేగావ్‌ కార్యాలయంలో సిద్ధమైన ఈ తాత్కాలిక వారధిని మంగళవారం ఆర్మీకి అందజేశారు. డీఆర్‌డీవో, ప్రైవేట్‌ కంపెనీలు సంయుక్తంగా పనిచేయడం ద్వారా ఈ వారధిని త్వరగా అభివృద్ధిచేయగలిగినట్లు డీఆర్‌డీవో తెలిపింది. ఇన్నాళ్లూ ఇలాంటి వారధులను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. తొలిసారి పూర్తి స్వదేశీ టెక్నాలజీ, డిజైన్‌లతో దీన్ని రూపొందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement