
ప్రతీకాత్మక చిత్రం
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): తామే దొంగను పట్టుకుని అరెస్టు చేసుకోండని సమాచారమిచ్చినా దేవనహళ్లి తాలూకా విశ్వనాథపుర, విజయపుర పోలీసులు స్పందించలేదని ప్రజలు ఆరోపించారు. దేవనహళ్లి తాలూకా ఎంబ్రళ్లి గ్రామంలో అర్ధరాత్రి పొలాల్లో జొరబడ్డ ఒక దొంగ కరెంటు వైర్లను చోరీ చేస్తుండగా రైతులు పట్టుకుని దేహశుద్ధి చేశారు.
పోలీసులకు ఫోన్ చేసి దొంగను పట్టుకుపోవాలని కోరగా విజయపుర, విశ్వనాథపుర పోలీస్‌స్టేషన్‌ల పోలీసులు ఆ గ్రామం తమ పరిధిలోకి నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. తామే దొంగను బైక్‌పై తీసికెళ్లి పోలీసులకు అప్పగించామని తెలిపారు.