
తిరువనంతపురం: వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. రాహుల్ గాంధీ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కాగా.. వయనాడ్‌ను దక్కించుకునేందుకు కాంగ్రెస్.. ప్రియాంక గాంధీని బరిలో నిలిపింది. ఈ నేపథ్యంలో ప్రియాంకకు పోటీగా యంగ్ డైనమిక్ లీడర్, కేరళ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ నవ్య హరిదాస్‌ను ఖరారు చేసింది. దీంతో, వీరి మధ్య పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది.
ఇక, బీజేపీ నవ్య హరిదాస్(39) పేరును ఖరారు చేయడంతో ఆమె ఎవరు? ఆమె రాజకీయ ప్రస్థానం ఏంటి? అనే చర్చ నడుస్తోంది. నవ్య ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చారు. బీటెక్ చదవి ఉద్యోగం చేసిన నవ్య.. రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో బీజేపీలో తన ముద్ర వేసి తక్కువ కాలంలోనే అందరి దృష్టిలో పడ్డారు. తాజాగా వయనాడ్ బరిలోకి టికెట్ పొంది బంపరాఫర్ దక్కించుకున్నారు.
నవ్య హరిదాస్ రాజకీయ నేపథ్యం..
👉నవ్య 2007లో కాలికట్ యూనివర్సిటీలోని కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు.
👉బీటెక్ తర్వాత మెకానికల్ ఇంజనీర్‌గా కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. పాలిటిక్స్‌పై ఆసక్తి ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చారు.
👉నవ్య హరిదాస్ కోజికోడ్ కార్పొరేషన్‌లో రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు.
👉బీజేపీలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
👉2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవ్వ ఎన్డీఏ అభ్యర్థిగా కొజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి.
👉అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం నవ్య హరిదాస్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు.
👉నవ్యకు రూ.1,29,56,264 విలువైన ఆస్తులు ఉన్నాయని, మొత్తం రూ.1,64,978 అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.
ఇదిలా ఉండగా.. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలి రెండు స్థానాల నుండి పోటీ చేసిన విషయం తెలిసిందే. పోటీ చేసిన రెండు చోట్ల ఘన విజయం సాధించిన రాహుల్.. వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ పార్లమెంట్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15వ తేదీన వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 13వ తేదీన వయనాడ్ ఉప ఎన్నిక జరగనుంది.
Navya Haridas to take on PriyankaGandhi from the Wayanad Lok Sabha seat on a BJP ticket👍👍 pic.twitter.com/joo5dXrEhT
— tsr. (@srikanth690935) October 19, 2024