
న్యూఢిల్లీ: శత్రువుల ఆస్తుల (ఎనిమీ ప్రాపర్టీస్) అమ్మకంతో కేంద్రం రూ.3,407 కోట్లు ఆర్జించింది. ఇందులో అధిక భాగం షేర్లు, బంగారం వంటి చరాస్తులేనని అధికారులు తెలిపారు. దేశ విభజన సమయంలో, 1962, 1965 నాటి యుద్ధాల తర్వాత భారత్ నుంచి పాకిస్తాన్, చైనాకు వెళ్లి, అక్కడి పౌరసత్వం పొందినవారి ఆస్తులను శత్రువుల ఆస్తులంటారు. పాక్ జాతీయులకు చెందిన 12,485, చైనా పౌరులకు చెందిన 126 ఆస్తులను తాజాగా విక్రయించారు.