PM Modi Travels In Metro To Attend Delhi University Event - Sakshi
Sakshi News home page

దేన్నీ వదలకుండా మాట్లాడారు.. మెట్రో రైలులో అనుభవంపై ప్రధాని మోదీ

Published Fri, Jun 30 2023 1:49 PM | Last Updated on Fri, Jun 30 2023 2:48 PM

PM Modi Shares Metro Journey With Students Before DU Event - Sakshi

మోదీ సాబ్‌.. అంటూ మొదలుపెట్టి దేన్ని వదలకుండా మాట్లాడారంటూ.. 

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సాధారణ ప్రయాణికుడిలా ఢిల్లీ మెట్రో రైలులో సందడి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకల కోసం ఇవాళ  లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ నుంచి విశ్వ విద్యాలయా మెట్రో స్టేషన్‌ మధ్య రైలులో ప్రయాణించారు. 

ప్రధాని మోదీ మెట్రోరైలులో సందడి చేసిన ఫొటోలు, వీడియోలు ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. యువ ప్రయాణికులతో ప్రయాణం సంతోషంగా ఉందంటూ ట్వీట్‌ చేశారాయన. 

ఇక ఢిల్లీ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. మెట్రో ప్రయాణ అనుభవాన్ని సైతం వివరించారు. విద్యార్థులు మెట్రో ప్రయాణంలో ఎన్నో మాట్లాడారు. ఓటీటీ నుంచి సైన్స్‌ అంశాల దాకా దేన్ని వదలకుండా చర్చించారు అని తెలిపారాయన. 

► ఢిల్లీ యూనివర్సిటీ కార్యక్రమంలో భాగంగా.. పలు విభాగాలకు శంకుస్థాపనలు.. పలు సెక్షన్‌లను ప్రారంభించారాయన.  

► సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ చట్టం ప్రకారం.. ఢిల్లీ యూనివర్సిటీకి 1922లో స్థాపన జరిగింది. 

► 2022, మే 1వ తేదీన ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాలు మొదలయ్యాయి. ఇవాళ్టి ప్రధాని మోదీ హాజరు కార్యక్రమంతో ఆ వేడుకలు ముగిశాయి.    

► ప్రధాని రాక నేపథ్యంలో విద్యార్థులు నల్ల దుస్తులు(నిరసన తెలిపే అవకాశం ఉన్నందునా) వేసుకురావొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే 10 నుంచి 12 గంటల నడుమ ప్రధాని మోదీ ప్రసంగాన్ని విద్యార్థులు వీక్షించే ఏర్పాట్లు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement